Australia Open 2022: Ashleigh Barty Beats Danielle Collins To Win After 44 Years - Sakshi
Sakshi News home page

Ashleigh Barty: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డు బద్దలు

Published Sat, Jan 29 2022 4:27 PM | Last Updated on Sat, Jan 29 2022 8:05 PM

Ashleigh Barty Beat Danielle Collins Won Australian Open 2022 Break 44 Years - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2022 మహిళల సింగిల్స్‌ విజేతగా ప్రపంచనెంబర్‌ వన్‌ యాష్లే బార్టీ నిలిచింది. అమెరికాకు చెందిన డానియెల్‌ కొలిన్స్‌తో జరిగిన ఫైనల్లో.. బార్టీ 6-3,7-6(7-2)తో వరుస సెట్లలో ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సొంతం చేసుకుంది. టోర్నీలో ఫెవరెట్‌గా బరిలోకి దిగిన బార్టీ సొంతగడ్డపై చెలరేగి ఆడింది. ముఖ్యంగా డానియెల్‌ కొలిన్స్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకుంది.

చదవండి: Australian Open: చరిత్రకు చేరువగా...

తొలి సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్న బార్టీ.. రెండో సెట్‌లో కొలిన్స్‌ నుంచి గట్టిపోటీ ఎదురైంది. రెండో సెట్‌ 6-6తో టై బ్రేక్‌కు దారి తీసింది. అయితే సెట్‌ చివరి గేమ్‌లో ఫుంజుకున్న బార్టీ మొత్తంగా 7-6(7-2)తో రెండోసెట్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన బార్టీ మెయిడెన్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.మ్యాచ్‌లో బార్టీ 10 ఏస్‌లు సందించి.. మూడు డబుల్‌ ఫాల్ట్‌లు నమోదు చేయగా.. కొలిన్స్‌ ఒక ఏస్‌ సందించి.. రెండు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది.

ఇక 25 ఏళ్ల యాష్లే బార్టీ 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, 2021లో వింబుల్డన్‌ను గెలుచుకుంది. తాజాగా సాధించిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ బార్టీ కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌ కావడం విశేషం. ఇక యూఎస్‌ ఓపెన్‌ ఒక్కటి గెలిస్తే యాష్లే బార్టీ కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ పూర్తి చేసుకోనుంది. ఈ విజయంతో బార్టీ 44 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధించిన రెండో ఆస్ట్రేలియన్‌ మహిళా ప్లేయర్‌గా బార్టీ చరిత్ర సృష్టించింది. ఇంతకముందు 1978లో క్రిస్‌ ఓనిల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన తొలి ఆస్ట్రేలియన్‌ వుమెన్‌గా నిలిచింది. 

చదవండి: Daniil Medvedev: అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement