ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్‌బుల్ రాఫెల్ నాద్‌ల్ అదరగొడుతున్నాడు. కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నాదల్ మరో రెండు అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నాదల్.. కెనడాకు చెందిన డెనిస్ షాపోవలోవ్‌ను 6-3,6-4,4-6, 3-6,6-3తో ఓడించాడు. దాదాపు 4 గంటల 8 నిమిషాల పాటు జరిగిన ఈ మారథాన్ గేమ్‌లో తొలి రెండు సెట్లను నాదల్ గెల్చుకోగా.. ఫుంజుకున్న డెనిస్ షాపోవలోవ్ తర్వాతి రెండు సెట్స్‌లో నాదల్‌ను మట్టికరిపించాడు. అయితే కీలకమైన ఆఖరి సెట్‌లో జూలు విదిల్చిన నాదల్ 6-3 తేడాతో సెట్‌ను కైవసం చేసుకొని సెమీస్‌లో అడుగుపెట్టాడు.
చదవండి: Australian Open 2022: 'నీ మాటలతో నన్ను ఏడిపించేశావు.. థాంక్యూ'
మరోవైపు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచనెంబర్ వన్ యాష్లే బార్టీ హోంగ్రౌండ్‌లో దుమ్మురేపింది. 21వ సీడ్ జెస్సికా పెగులాను వరుస సెట్లలో ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. వన్‌సైడ్‌గా జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 6-2తో గెలుచుకున్న బార్టీ.. రెండో సెట్‌లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా 6-0తో రెండోసెట్‌ను కైవసం చేసుకొని దర్జాగా సెమీస్‌కు చేరింది.
ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బార్బోరా క్రెజికోవాకు క్వార్టర్‌ఫైనల్లో గట్టిషాక్ తగిలింది. అమెరికాకు చెందిన కీస్ మాడిసన్ చేతిలో 6-3,6-1తో క్రెజికోవా ఘోర పరాజయం పాలయింది. కేవలం గంటా 25 నిమిషాలు మాత్రమే సాగిన మ్యాచ్‌లో కీస్ మాడిసన్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. 2015 తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్‌లో రెండోసారి సెమీస్‌లో అడుగుపెట్టిన మాడిసన్ మెయిడెన్ టైటిల్‌పై కన్నేసింది. ఇక సెమీస్‌లో కీస్ మాడిసన్.. ప్రపంచనెంబర్ వన్ యాష్లే బార్టీతో తలపడనుంది.
చదవండి: Australian Open 2022: క్వార్టర్స్‌లో నిష్క్రమించిన రాజీవ్ రామ్-సానియా మీర్జా జోడీ
¡DALE RAFA!🇪🇸@RafaelNadal is through to the #AusOpen semifinals with a 6-3 6-4 4-6 3-6 6-3 victory over Denis Shapovalov🔥
— ATP Tour (@atptour) January 25, 2022
🎥: @AustralianOpen | #AusOpen | #AO2022 pic.twitter.com/9xsybToVTQ
Unstoppable 💯@Madison_Keys is into the #AusOpen quarterfinals for the first time since 2018, taking down Paula Badosa 6-3 6-1. #AO2022 pic.twitter.com/dIGsi7zf5q
— #AusOpen (@AustralianOpen) January 23, 2022
Comments
Please login to add a commentAdd a comment