rafel nadal
-
చరిత్ర తిరగరాసిన జకోవిచ్
రోమ్ మాస్టర్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ద్వారా సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఒకే మాస్టర్స్ 1000 ఈవెంట్లో 17 సార్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2007 నుంచి ఈ టర్నీలో పాల్గొంటున్న జకో.. ఆడిన ప్రతిసారి కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరి రికార్డుల్లోకెక్కాడు. ఈ టోర్నీ ప్రారంభ రౌండ్లలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జకో.. తాజా ప్రదర్శనతో దిగ్గజ ఆటగాడు రఫెల్ నదాల్ రికార్డును (16 సార్లు క్వార్టర్స్ చేరిన రికార్డు) బద్దలు కొట్టాడు. రోమ్ మాస్టర్స్‌లో ప్రస్తుతం జకోవిచ్ గెలుపోటముల రికార్డు 67-10గా ఉంది. 2007 నుంచి జకో ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు ముందు ఓడింది లేదు. ఇదిలా ఉంటే, 22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన జకోవిచ్ ఇటీవల తన సహచర ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్‌లను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. తాను ఫెదరర్, నదాల్లతో ఎప్పుడు స్నేహం చేయలేదని జకో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రత్యర్థుల మధ్య స్నేహం ఎప్పటికీ కుదరదని చెప్పిన జకో.. తాను ఫెదరర్, నదాల్‌లను ఎప్పుడూ గౌరవిస్తానని అన్నాడు. తాను ఫెదరర్, నదాల్‌లను చూస్తూ పెరిగానని, ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే వారి వల్లేనని చెప్పుకొచ్చాడు. కాగా, పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన రికార్డును జకోవిచ్.. రఫెల్ నదాల్ (22)తో పాటు షేర్ చేసుకున్నాడు. ఈ ఇద్దరు మోడ్రన్ టెన్నిస్ దిగ్గజాల తర్వాత రోజర్ ఫెదరర్ (20) ఉన్నాడు. చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో ప్రణయ్ -
చరిత్ర సృష్టించిన జొకోవిచ్.. నాదల్ రికార్డు సమం
పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ హస్తగతం చేసుకున్నాడు సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్. మెల్బోర్న్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్‌పై 6–3, 7–6 (7/4), 7–6 (7/4)తో విజయం సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్‌గా అవతరించాడు. అంతేకాదు కెరీర్లో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో రాఫెల్ నాదల్ పేరిట ఉన్న రికార్డు సమం చేశాడు. ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచిన జొకోవిచ్ రికార్డులు జకోవిచ్ నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ 22. ఇందులో ఆస్ట్రేలియన్ ఓపెన్ (10), వింబుల్డన్ (7), యూఎస్ ఓపెన్ (3), ఫ్రెంచ్ ఓపెన్ (2) ఉన్నాయి. ప్రస్తుతం అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో రాఫెల్ నాదల్ (22) సరసన జొకోవిచ్ నిలిచాడు. నాదల్‌ను వెనక్కినెట్టి జొకోవిచ్ కెరీర్లో నెగ్గిన టైటిల్స్ 93. అత్యధిక టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో నాదల్‌ను (92) ఐదో స్థానానికి నెట్టి జొకోవిచ్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. టాప్–3లో జిమ్మీ కానర్స్ (అమెరికా; 109), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103), ఇవాన్ లెండిల్ (అమెరికా; 94) ఉన్నారు. పదికి పది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ 10 సార్లు (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023) ఫైనల్ చేరుకోగా... పదిసార్లూ గెలిచాడు. చదవండి: Novak Djokovic: తిరుగులేని జొకోవిచ్.. సిట్సిపాస్కిది రెండోసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే! -
రాఫెల్ నాదల్కు షాక్
స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్కు మరోసారి పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ కలిసి రాలేదు. కెరీర్లో 36 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ పారిస్ ఓపెన్‌లో మాత్రం ఒక్కసారి కూడా విజేతగా నిలువలేకపోయాడు. ఈసారి అతను రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ ఆడిన నాదల్ 6–3, 6–7 (4/7), 1–6తో ప్రపంచ 31వ ర్యాంకర్ టామీ పాల్ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. నాదల్కు 39,070 యూరోల (రూ. 31 లక్షల 59 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రస్తుత నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్) పారిస్ ఓపెన్‌లో విజేతగా నిలిస్తే ఈ ఏడాదిని అతను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగిస్తాడు. ఈ టోర్నీలో అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–1, 6–3తో దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలుపొందాడు. చదవండి: FIFA World Cup: నది మధ్యలో మెస్సీ 30 అడుగుల కటౌట్.. వీడియో వైరల్ -
చరిత్ర సృష్టించిన కార్లోస్ అల్కరాజ్.. యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసం
యూఎస్ ఓపెన్‌లో స్పానిష్ యువ సంచలనం 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. న్యూయార్క్ వేదికగా ఆదివారం ఆర్ధ రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నార్వేజియన్ కాస్పర్ రూడ్‌ను ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. 2 గంటల 20 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 6-4, 2-6, 7-6(7-1), 6-3 తేడాతో అల్కరాజ్ విజయం సాధించాడు. దీంతో వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా రఫెల్ నాదల్ తర్వాత 19 ఏళ్లకే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా అల్కరాజ్ నిలిచాడు. 2005లో రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుని ఈ ఘనత సాధించాడు. అదే విధంగా అతి తక్కువ వయస్సులోనే వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి ఆటగాడిగా కూడా అల్కరాజ్ నిలిచాడు. చదవండి: US Open 2022: మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వియాటెక్ -
నాదల్ ఖాతాలో 91వ సింగిల్స్ టైటిల్
ఈ ఏడాది వరుసగా 15వ విజయం నమోదు చేసిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ మెక్సికో ఓపెన్‌లో నాలుగోసారి టైటిల్ దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నాదల్ 6–4, 6–4తో కామెరాన్ నోరీ (బ్రిటన్)పై గెలిచాడు. చాంపియన్ నాదల్కు 3,14,455 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 36 లక్షలు)తోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. నాదల్ కెరీర్లో ఇది 91వ సింగిల్స్ టైటిల్‌కాగా... ఈ ఏడాది మూడోది. మెల్బోర్న్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ నాదల్ విజేతగా నిలిచాడు. చదవండి: Women’s World Cup 2022: ఫామ్‌లో లేదన్నారు... సెంచరీతో చెలరేగింది -
టీమిండియా స్టార్ క్రికెటర్లకు అరుదైన గౌరవం
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం అయిన ట్విట్టర్ టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లుగా గుర్తించింది. ట్విటర్లో వీరి పేర్ల హ్యాష్ట్యాగ్స్కు GOAT (Great Of All Time) ఏమోజీ జోడించి గౌరవించింది. వీరితో పాటు టీమిండియా మాజీ సారధి ఎంస్ ధోని, టెన్నిస్ దిగ్గజం రఫెల్ నదాల్‌లను కూడా దిగ్గజ క్రీడాకారులుగా గుర్తించింది. ఇకపై ట్విటర్లో కోహ్లి, రోహిత్, ధోని, నదాల్ పేర్ల హ్యాష్‌ట్యాగ్స్ GOAT ఏమోజీతో దర్శనమిస్తాయి. కాగా, ఈ టీమిండియా ప్రస్తుత, మాజీ కెప్టెన్లు క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణించి దిగ్గజ క్రికెటర్లుగా ఇదివరకే గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు క్రికెటర్లు ఆటతీరుతో పాటు కెప్టెన్సీ నైపుణ్యంతోనూ విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. మరోవైపు, స్పెయిన్ బుల్ రఫెల్ నదాల్ ప్రస్తుత తరం టెన్నిస్‌లో తిరుగులేని ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 టైటిల్ గెలిచి, టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ (21) టైటిల్ విన్నర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్సీ వదులుకోవడానికి అసలు కారణమిదే: కోహ్లి -
అప్పుడు జొకోవిచ్‌తో.. ఇప్పుడు మెద్వెదెవ్‌తో
స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అదరగొట్టాడు. మెద్వెదెవ్పై సంచలన విజయంతో కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్లో మారథాన్ మ్యాచ్ ఆడడం ఇది రెండోసారి. ఇంతకముందు 2012లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మారథాన్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో నాదల్ ఓటమి పాలయ్యాడు. కానీ తాజాగా జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మాత్రం నాదల్ విజృంభించాడు. వయసు మీద పడుతున్నప్పటికి తనలో సత్తువ తగ్గలేదని మరోసారి తన పదునైన ఆటతో రుచి చూపించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్‌తో జరిగిన మారథాన్ ఫైనల్లో 2-6, 6-7(5-7), 6-4, 6-4, 7-5తో నాదల్ విజయం సాధించాడు. దాదాపు 5 గంటల 30 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు నువ్వా-నేనా అన్నట్లుగానే సాగింది. తొలి సెట్‌ను 2-6తో కోల్పోవడం.. రెండో సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. కాగా టై బ్రేక్‌ను మెద్వెదెవ్ గెలుచుకోవడంతో పాటు సెట్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో నాదల్ ఓటమి ఖరారైనట్లేనని అంతా భావించారు. కానీ నాదల్ తన అసలు ఆటను మూడో సెట్ నుంచే చూపించాడు. తన పవర్ గేమ్‌ను రుచి చూపిస్తూ నాదల్ 6-4తో మూడో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక నాలుగో సెట్లోనూ ఇద్దరి మధ్య హోరాహోరి నడిచినప్పటికి నాదల్ మరోసారి విజృంభించి 6-4తో సెట్‌ను కైవసం చేసుకోవడంతో 2-2తో సమానంగా నిలవడంతో ఐదో సెట్ కీలకంగా మారింది. అయితే ఐదో సెట్ ఉత్కంఠంగా సాగినప్పటికి చివర్లో నాదల్ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి 7-5తో సెట్‌ను కైవసం చేసుకొని 21వ గ్రాండ్‌స్లామ్‌తో చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న సహచర ఆటగాళ్లు ఫెదరర్, జకోవిచ్‌లను అధిగమించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఈ టోర్నీ బరిలోకి దిగిన నాదల్.. ఒక్కో మెట్టును అధిగమిస్తూ 2010 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం జొకోవిచ్‌తో.. 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ నాదల్, జొకోవిచ్‌ల మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. దాదాపు 5 గంటల 53 నిమిషాల పాటు సాగిన ఆ మ్యాచ్‌లో జొకోవిచ్ చివరికి పై చేయి సాధించాడు. ఆ మ్యాచ్‌లో నాదల్‌ను జొకోవిచ్ 5-7, 6-4, 6-2,6-7(5-7),7-5తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. వాస్తవానికి అప్పటి మ్యాచ్‌లో నాదల్ తొలిసెట్‌ను గెలుచుకొని ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే రెండో సెట్లో ఫుంజుకున్న జొకోవిచ్ 6-4తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత మూడోసెట్‌ను కూడా 6-2తో గెలిచి సత్తా చాటాడు. ఇంక ఒక్కసెట్ గెలిస్తే నాదల్ ఓటమి పాలవడం అనుకున్న తరుణంలో మ్యాచ్ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో నాదల్ అద్బుత పోరాటంతో సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక కీలకమైన ఐదో సెట్లో జొకోవిచ్ పూర్తి ఆధిపత్యం చూపించి 7-5తో నాదల్‌ను ఓడించాడు. One for the books🏆@RafaelNadal defeats Daniil Medvedev 2-6 6-7 6-4 6-4 7-5 in a 5 hours and 24 minutes incredible match💪 🎥: @AustralianOpen | #AusOpen | #AO2022 pic.twitter.com/gyTFieZWEr — ATP Tour (@atptour) January 30, 2022 -
ఫైనల్‌కు దూసుకెళ్లిన నాదల్.. కన్నీటిపర్యంతం
స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా శుక్రవారం తొలి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఇటలీకి చెందిన ఏడో సీడ్ మెట్టో బెర్రెట్టినిపై నాదల్ 6-3, 6-2, 3-6, 6-3తో గెలిచి ఫైనల్‌కు చేరాడు. ఇక మెద్వదేవ్, సిట్సిపాస్ మధ్య విజేతతో నాదల్ ఫైనల్లో తలపడనున్నాడు. ఇప్పటివరకు నాదల్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో జొకోవిచ్, రోజర్ ఫెదరర్‌లతో సమానంగా ఉన్నాడు. చదవండి: ఆస్ట్రేలియా ఓపెన్‌లో బార్టీ సంచలనం... ఫైనల్లో తలపడబోయేది ఆమెతోనే.. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గితే.. 21 టైటిళ్లతో నాదల్ చరిత్ర సృష్టించనున్నాడు. ఇక నాదల్ ఒక మేజర్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడడం ఇది 29వ సారి. తన కెరీర్లో 2009లో మాత్రమే ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన నాదల్.. తర్వాత మరో ఆరుసార్లు ఫైనల్‌కు చేరినప్పటికి నిరాశే ఎదురైంది. ఒకవేళ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం చేసుకుంటే అన్ని మేజర్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు రెండుసార్లు గెలిచిన రెండో ఆటగాడిగా నిలవనున్నాడు. ఇంతకముందు జొకోవిచ్ మాత్రమే ఈ రికార్డును అందుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం నాదల్ కోర్టులోనే కాస్త ఎమోషనల్ అయ్యాడు. ''మ్యాచ్‌లో నాకు మంచి ఆరంభం దక్కింది. తొలి రెండు సెట్లు సొంతం చేసుకున్న నాకు మూడో సెట్లో బెర్రెట్టి గట్టిపోటీ ఇచ్చి సెట్‌ను గెలుచుకున్నాడు. నిజానికి బెర్రెట్టి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఒక దశలో నాకు మంచి పోటీనిస్తూ మ్యాచ్‌ను నా నుంచి తీసుకునే అవకాశం వచ్చింది. ఎలాగైనా ఫైనల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో పోరాడాను.. అనుకున్నది సాధించాను. నిజాయితీగా చెప్పాలంటే ఈసారి ఫైనల్‌కు చేరడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.'' అంటూ తెలిపాడు. What it means to be back in an #AusOpen final 💙@RafaelNadal • #AO2022 pic.twitter.com/OF29zQkF9i — #AusOpen (@AustralianOpen) January 28, 2022 -
సెమీస్‌కు దూసుకెళ్లిన నాదల్, యాష్లే బార్టీ
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్‌బుల్ రాఫెల్ నాద్ల్ అదరగొడుతున్నాడు. కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నాదల్ మరో రెండు అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నాదల్.. కెనడాకు చెందిన డెనిస్ షాపోవలోవ్ను 6-3,6-4,4-6, 3-6,6-3తో ఓడించాడు. దాదాపు 4 గంటల 8 నిమిషాల పాటు జరిగిన ఈ మారథాన్ గేమ్‌లో తొలి రెండు సెట్లను నాదల్ గెల్చుకోగా.. ఫుంజుకున్న డెనిస్ షాపోవలోవ్ తర్వాతి రెండు సెట్స్‌లో నాదల్‌ను మట్టికరిపించాడు. అయితే కీలకమైన ఆఖరి సెట్లో జూలు విదిల్చిన నాదల్ 6-3 తేడాతో సెట్‌ను కైవసం చేసుకొని సెమీస్‌లో అడుగుపెట్టాడు. చదవండి: Australian Open 2022: 'నీ మాటలతో నన్ను ఏడిపించేశావు.. థాంక్యూ' మరోవైపు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచనెంబర్ వన్ యాష్లే బార్టీ హోంగ్రౌండ్లో దుమ్మురేపింది. 21వ సీడ్ జెస్సికా పెగులాను వరుస సెట్లలో ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. వన్‌సైడ్‌గా జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 6-2తో గెలుచుకున్న బార్టీ.. రెండో సెట్లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా 6-0తో రెండోసెట్‌ను కైవసం చేసుకొని దర్జాగా సెమీస్‌కు చేరింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బార్బోరా క్రెజికోవాకు క్వార్టర్ఫైనల్లో గట్టిషాక్ తగిలింది. అమెరికాకు చెందిన కీస్ మాడిసన్ చేతిలో 6-3,6-1తో క్రెజికోవా ఘోర పరాజయం పాలయింది. కేవలం గంటా 25 నిమిషాలు మాత్రమే సాగిన మ్యాచ్‌లో కీస్ మాడిసన్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. 2015 తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్‌లో రెండోసారి సెమీస్‌లో అడుగుపెట్టిన మాడిసన్ మెయిడెన్ టైటిల్‌పై కన్నేసింది. ఇక సెమీస్‌లో కీస్ మాడిసన్.. ప్రపంచనెంబర్ వన్ యాష్లే బార్టీతో తలపడనుంది. చదవండి: Australian Open 2022: క్వార్టర్స్‌లో నిష్క్రమించిన రాజీవ్ రామ్-సానియా మీర్జా జోడీ ¡DALE RAFA!🇪🇸@RafaelNadal is through to the #AusOpen semifinals with a 6-3 6-4 4-6 3-6 6-3 victory over Denis Shapovalov🔥 🎥: @AustralianOpen | #AusOpen | #AO2022 pic.twitter.com/9xsybToVTQ — ATP Tour (@atptour) January 25, 2022 Unstoppable 💯@Madison_Keys is into the #AusOpen quarterfinals for the first time since 2018, taking down Paula Badosa 6-3 6-1. #AO2022 pic.twitter.com/dIGsi7zf5q — #AusOpen (@AustralianOpen) January 23, 2022 -
Australian Open 2022: ఎదురులేని నాదల్.. మూడో రౌండ్‌కు జ్వెరెవ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ దూసుకెళ్తున్నాడు. 21వ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంగా బరిలోకి దిగిన నాదల్ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. బుధవారం జర్మనీకి చెందిన యానిక్ హాన్ఫ్మన్ను 6-2, 6-3, 6-4తో వరుస సెట్లో ఖంగుతినిపించిన నాదల్ ప్రిక్వార్టర్స్‌లోకి ఎంటరయ్యాడు. స్విస్ సూపర్‌స్టార్ రోజర్ ఫెదరర్‌తో సంయుక్తంగా 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన నాదల్కు ఇది మంచి అవకాశం. ఫెదరర్, జొకోవిచ్ లాంటి దిగ్గజాలు ఈ గ్రాండ్‌స్లామ్‌కు దూరంగా ఉన్నారు. ఇక మూడోరౌండ్లో నాదల్.. రష్యన్ టెన్నిస్ ప్లేయర్ కచనోవ్‌తో అమితుమీ తేల్చుకోనున్నాడు. మరో మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ ఆస్ట్రేలియాకు చెందిన జాన్ మిల్‌మాన్‌ను 6-4,6-4,6-0తో ఓడించి మూడోరౌండ్లోకి అడుగుపెట్టాడు. -
జకోవిచ్‌పై మండిపడ్డ నదాల్.. టెన్నిస్ దిగ్గజాల మధ్య కోవిడ్ టీకా చిచ్చు
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో పాల్గొనేందుకు మెల్బోర్న్కు వచ్చిన ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. కోవిడ్ టీకాలు తీసుకోని కారణంగా జకోను అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు.. అతని వీసా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సహచర ఆటగాడు, స్పానిష్ బుల్ రఫేల్ నదాల్ జకో తీరును తప్పుపట్టాడు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో రూల్స్ అందరూ తప్పక పాటించాల్సిందేనని, టీకాలు తీసుకోకుండా జకో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. జకో విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరును తప్పుపట్టలేమని అన్నాడు. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేవారు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలనే నిబంధన నుంచి జకోవిచ్ ప్రత్యేక మినహాయింపు తీసుకున్నాడు. ఇందుకు నిర్వాహకులు సైతం అంగీకరించారు. అయితే వాక్సిన్ తీసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించకపోవడంతో జకోను విమానాశ్రయంలోనే నిలిపివేశారు. ఈ వ్యవహారంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస్ సైతం స్పందించాడు. జకో.. వ్యాక్సిన్ తీసుకోకపోవడానికి సరైన కారణం చూపితే టోర్నీలో పాల్గొంటాడని స్పష్టం చేశాడు. చదవండి: హార్ధిక్ నుంచి ఆశించింది శార్ధూల్ నెరవేరుస్తున్నాడు..! -
French Open 2021: నాదల్ ఓటమి.. ఫైనల్లో జకోవిచ్
పారిస్: ప్రపంచం నెంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ టోర్నీలో అడుగుపెట్టాడు. 13 సార్లు ఛాంపియన్ అయిన రఫెల్ నాదల్‌ను జకోవిచ్ చిత్తుగా ఓడించాడు. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి రొలాండ్‌గారోస్‌లో జరిగిన మ్యాచ్‌లో జకోవిచ్ 3-6, 6-3, 7-6(7/4), 6-2 సెట్స్‌తో నాదల్‌ను ఓడించడం విశేషం. నాదల్‌కి గత పదహారేళ్లలో(2005 నుంచి) క్లే కోర్టు గ్రాండ్ స్లామ్లో ఆడిన 108 మ్యాచ్‌లలో ఇది మూడో ఓటమి కాగా, 14 సెమీ ఫైనల్స్‌లో మొదటి ఓటమి. అంతేకాదు ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌ను రెండుసార్లు ఓడించిన ఏకైక వ్యక్తి జకోవిచ్ కావడం విశేషం. ఇక రోలాండ్ గారోస్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదటి సెట్‌నే కోల్పోవడం రఫెల్ నాదల్‌కి ఇదే ఫస్ట్ టైం. జకోవిచ్ గనుక ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిస్తే.. 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దక్కించుకోవడంతో పాటు నాలుగు గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ రెండేసి సార్లు గెల్చుకున్న ప్లేయర్‌గా రికార్డు సొంతం చేసుకుంటాడు. కాగా, ఓటమిపై నాదల్ స్పందిస్తూ. ‘బెస్ట్ ప్లేయర్ గెలిచాడు’ అని జకోవిచ్‌పై పొగడ్తలు గుప్పించగా. 34 ఏళ్ల సెర్బియన్ ప్లేయర్ జకోవిచ్ తన విక్టరీలలో ఇది గొప్పదని చెప్పుకొచ్చాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 4️⃣ hours and 1️⃣1️⃣ minutes You've earned that smile @DjokerNole!#RolandGarros pic.twitter.com/75wWsWNUwY — Roland-Garros (@rolandgarros) June 11, 2021 ఇక జకోవిచ్ ఆదివారం జరగబోయే ఫైనల్మ్యాచ్లో స్టెఫనోస్ సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మొట్టమొదటి గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్ కావడం విశేషం. గతంలో మూడుసార్లు గ్రాండ్ స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన ఈ యువ కెరటం.. శుక్రవారం జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడి మూడున్నర గంటల హోరాహోరీ పోరు తర్వాత విజయం సాధించాడు. చదవండి: ట్రాప్ చేసి వీడియో తీయమన్నారు -
French Open: ఔరా నాదల్
పారిస్: ‘మట్టి కోర్టు మహారాజుకు ఓటమి తప్పదా..!’ డియాగో ష్వార్ట్‌జ్‌మన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రెండో సెట్లో రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఆటతీరు చూసిన ప్రతి ఒక్కరి మదిలో మెదిలిన ఆలోచన ఇది. టోర్నీలో తన వరుస 36 సెట్ల విజయాలకు బ్రేక్ వేసిన ష్వార్జ్జ్మన్ దూకుడును తన సమయోచిత ఆటతో అడ్డుకున్న నాదల్ ఔరా అనిపించాడు. సుదీర్ఘ ర్యాలీల్లో పాయింట్లను కోల్పోతున్న వేళ... తన ఆటతీరును మార్చుకున్న నాదల్ వరుస పాయింట్లతో చెలరేగి ఫ్రెంచ్ ఓపెన్‌లో 14వసారి సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో నాదల్ 6–3, 4–6, 6–4, 6–0తో ష్వార్ట్జ్మన్పై అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. 2 గంటలా 45 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో నాదల్, ష్వార్ట్‌జ్‌మన్ ప్రతి పాయింట్ కోసం కూడా తీవ్రంగా శ్రమించారు. తొలి సెట్లో ఇద్దరు కూడా హోరాహోరీగా ఆడారు. అయితే ఎనిమిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్... ఆ తర్వాతి గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో ష్వార్ట్‌జ్‌మన్ అద్భుతంగా ఆడాడు. తొలి మూడు గేమ్‌లను సొంతం చేసుకుని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం నాదల్ పుంజుకుని వరుసగా మూడు గేమ్‌ల్లో గెలవడంతో స్కోరు 3–3తో సమమైంది. 5–4తో ష్వార్ట్‌జ్‌మన్ ఆధిక్యంలో ఉండగా సర్వీస్‌కు వచ్చిన నాదల్... ఒక దశలో 30–0తో ముందంజ వేశాడు. అయితే ఒక డబుల్ ఫాల్ట్, మూడు అనవసర తప్పిదాలు చేసి గేమ్‌తో పాటు సెట్‌ను కోల్పోయాడు. మూడో సెట్లో కూడా ఇరువురు ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. రెండో సెట్లో తన సర్వీస్‌తో ఇబ్బంది పడ్డ నాదల్... మూడో సెట్లో దానిని సరి చేసుకున్నాడు. అంతే కాకుండా సుదీర్ఘ ర్యాలీలకు పోకుండా... మూడు, నాలుగు షాట్లలోనే పాయింట్లను సాధించేలా తన గేమ్‌ను చేంజ్ చేసుకున్నాడు. 9వ గేమ్‌లో ష్వార్ట్‌జ్‌మన్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ ఆ తర్వాతి గేమ్‌ను గెలిచి సెట్‌ను 6–4తో సొంతం చేసుకున్నాడు. ఇక ఏకపక్షంగా సాగిన నాలుగో సెట్లో నాదల్ కసితీరా విరుచుకు పడ్డాడు. ప్రత్యర్థి పుంజుకునేందుకు ఎటుంటి అవకాశం ఇవ్వకుండా ఆరు గేమ్‌లు కూడా గెలుచుకున్నాడు. మ్యాచ్‌లో నాదల్ ఆరు ఏస్‌లు సంధించి మూడు డబుల్ ఫాల్ట్‌లు చేయగా... ష్వార్ట్‌జ్‌మన్ మూడు ఏస్‌లు కొట్టి మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. స్వియాటెక్‌కు చుక్కెదురు... మహిళల సింగిల్స్‌లో బుధవారం సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో గ్రీస్ క్రీడాకారిణి మరియా సాకరి చేతిలో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) అనూహ్యంగా ఓటమిపాలైంది. క్వార్టర్‌ఫైనల్ పోరులో సాకరి 6–4, 6–4తో ఎనిమిదో సీడ్ స్వియాటెక్‌పై అలవోక విజయం సాధించింది. మరో క్వార్టర్స్‌లో చెక్ రిపబ్లిక్ భామ బార్బొరా క్రిచికోవా 7–6 (8/6), 6–3తో అమెరికా టీనేజర్ కోకో గాఫ్‌పై నెగ్గింది. దాంతో గతంలో ఎన్నడూ గ్రాండ్‌స్లామ్‌లో టోర్నీలో ఒక్కసారి కూడా సెమీస్ చేరని నలుగురు ఇప్పుడు తొలిసారి సెమీ ఫైనల్లో అడుగు పెట్టినట్లయింది. ఇప్పటికే పావ్లుచెంకోవా (రష్యా), జిదాన్సెక్ (స్లొవేనియా)లు సెమీస్‌కు అర్హత సాధించారు. సెమీస్‌లో సిట్సిపాస్... వరుసగా రెండో ఏడాది గ్రీస్ ఆటగాడు స్టెఫానోస్ సిట్సిపాస్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ 6–3, 7–6 (7/3), 7–5తో రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)ను ఓడించి సెమీస్ చేరుకున్నాడు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కెనిన్‌కు షాక్
మెల్బోర్న్: ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మహిళల డిఫెండింగ్ చాంపియన్ కెనిన్‌కు ఊహించని షాక్ ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లోనే నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ఇంటి దారి పట్టింది. ఈస్టోనియాకు చెందిన 35 ఏళ్ల వెటరన్ ప్లేయర్ కియా కానెపి 2020 చాంపియన్‌పై సంచలన విజయం సాధించింది. మిగతా మ్యాచ్‌ల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) ముందంజ వేశారు. భారత క్రీడాకారులకు డబుల్స్‌లో చుక్కెదురైంది. మహిళల్లో మరో సంచలనం మహిళల సింగిల్స్‌లో నాలుగో రోజు కూడా సంచలన ఫలితం వచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నిరుటి విజేత కెనిన్ ఆట రెండో రౌండ్లోనే ముగిసింది. అన్‌సీడెడ్ ప్లేయర్ కియా కానెపి వరుస సెట్లలో 6–3, 6–2తో నాలుగో సీడ్ కెనిన్‌పై అలవోక విజయం సాధించింది. 2007 నుంచి క్రమం తప్పకుండా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్నా... క్వార్టర్స్ చేరని 35 ఏళ్ల కానెపి ఈ సీజన్లో మాత్రం అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కేవలం గంటా 4 నిమిషాల్లోనే 22 ఏళ్ల అమెరికా యువ క్రీడాకారిణిని కంగుతినిపించింది. మిగతా మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–1, 7–6 (9/7)తో తమ దేశానికే చెందిన వైల్డ్‌కార్డ్ ప్లేయర్ డారియా గావ్రిలొవాపై శ్రమించి నెగ్గింది. తొలిసెట్‌ను ఏకపక్షంగా ముగించిన ప్రపంచ నంబర్‌వన్‌కు రెండో సెట్లో అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. అనామక ప్లేయర్ డారియా అద్భుతంగా పుంజుకోవడంతో ప్రతి పాయింట్ కోసం బార్టీకి చెమటోడ్చక తప్పలేదు. హోరాహోరీగా జరిగిన రెండో సెట్ చివరకు టైబ్రేక్‌కు దారితీసింది. అక్కడ కూడా స్వదేశీ ప్రత్యర్థి ఏమాత్రం తగ్గకపోవడంతో టాప్‌సీడ్ సర్వశక్తులు ఒడ్డి గెలిచింది. ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–2తో డానియెల్లా కొలిన్స్ (అమెరికా)పై, ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–3తో కొకొ గాఫ్ (అమెరికా)పై అలవోక విజయం సాధించారు. 11వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) 7–5, 2–6, 6–4తో స్వెత్లానా కుజ్నెత్సొవా (రష్యా)పై చెమటోడ్చి గెలిచింది. నాదల్ జోరు కెరీర్లో 21వ టైటిల్‌పై కన్నేసిన నాదల్ తన జోరు కొనసాగించాడు. పురుషుల సింగిల్స్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో స్పానిష్ దిగ్గజం, రెండో సీడ్ నాదల్ 6–1, 6–4, 6–2తో క్వాలిఫయర్ మైకేల్ మోహ్ (అమెరికా)పై సునాయాస విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో ఓ వైల్డ్‌కార్డ్ ప్లేయర్‌పై రెండో రౌండ్ గెలిచేందుకు ఐదో సీడ్ సిట్సిపాస్ నాలుగున్నర గంటల పాటు పోరాడాడు. చివరకు గ్రీస్ ప్లేయర్ 6–7 (5/7), 6–4, 6–1, 6–7 (5/7), 6–4తో కొక్కినకిస్ (ఆస్ట్రేలియా)పై గెలిచి ఊపిరిపీల్చుకున్నాడు. నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–2, 7–5, 6–1తో కార్బలెస్ బయెనా (స్పెయిన్)పై, ఏడో సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–4, 7–6 (10/8)తో మాంటెరియా (బ్రెజిల్)పై విజయం సాధించగా, తొమ్మిదో సీడ్ మట్టె బెరెటినీ (ఇటలీ) 6–3, 6–2, 4–6, 6–3తో క్వాలిఫయర్ టామస్ మచాక్ (చెక్ రిపబ్లిక్)పై కష్టంమీద గెలిచాడు. 16వ సీడ్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) 4–6, 6–2, 2–6, 6–3, 7–6 (14/12) తన దేశానికే చెందిన కరుసోపై సుదీర్ఘ పోరాటం చేసి నెగ్గాడు. సుమారు నాలుగు గంటల పాటు హోరాహోరీగా ఈ మ్యాచ్ జరిగింది. 28వ సీడ్ క్రాజినొవిక్ (సెర్బియా) 6–2, 5–7, 6–1, 6–4తో పాబ్లో అండ్యుజర్ (స్పెయిన్)పై గెలుపొందాడు. దివిజ్, అంకిత జోడీలు ఔట్ భారత జోడీలకు సీజన్ ఆరంభ ఓపెన్‌లో నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో దివిజ్, మహిళల డబుల్స్‌లో అంకితా రైనా తొలిరౌండ్లోనే నిష్క్రమించారు. స్లోవేకియాకు చెందిన ఇగొర్ జెలెనేతో జతకట్టిన దివిజ్ శరణ్ 1–6, 4–6తో యనిక్ హన్ఫన్– కెవిన్ క్రావిజ్ జోడీ చేతిలో ఓడిపోయారు. ఇదివరకే సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న ద్వయం కూడా కంగుతినడంతో డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల ఈవెంట్లో అంకిత–మిహెల బుజర్నెకు (రుమేనియా) జంట 3–6, 0–6తో ఒలివియా గడెకి–బెలిండా వూల్‌కాక్ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడింది. -
యాష్లే బార్టీ, నాదల్ శుభారంభం
మెల్బోర్న్: దాదాపు సంవత్సరం తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మ్యాచ్ ఆడిన మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) తన ప్రత్యర్థిని హడలెత్తించింది. ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా ఫటాఫట్‌గా కేవలం 44 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో శుభారంభం చేసింది. 82వ ర్యాంకర్ డాంకా కొవోనిచ్ (మాంటెనిగ్రో)తో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో యాష్లే బార్టీ 6–0, 6–0తో విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో బార్టీ ఐదు ఏస్‌లు సంధించింది. నెట్ వద్దకు వచ్చిన ఆరుసార్లూ పాయింట్లు గెలిచింది. తొలి సెట్లో మూడుసార్లు, రెండో సెట్లో మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లో బ్రేక్ పాయింట్లు సాధించింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), 11వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్), రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సోఫియా కెనిన్ 7–5, 6–4తో మాడిసన్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా)పై, స్వితోలినా 6–3, 7–6 (7/5)తో బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై, కరోలినా ప్లిస్కోవా 6–0, 6–2తో జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై, బెన్సిచ్ 6–3, 4–6, 6–1తో లారెన్ డేవిస్ (అమెరికా)పై నెగ్గారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012, 2013 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) మాత్రం తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. 12వ సీడ్ అజరెంకా 5–7, 4–6తో జెస్సికా పెగులా (అమెరికా) చేతిలో ఓటమి చవిచూసింది. నాదల్ బోణీ పురుషుల సింగిల్స్‌లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ తొలి రౌండ్‌ను అలవోకగా దాటాడు. లాస్లో జెరె (సెర్బియా)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–4, 6–1తో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. గంటా 56 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నాదల్ ఐదు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 6–2, 6–2, 6–4తో పోస్పిసిల్ (కెనడా)పై, ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–1, 6–2, 6–1తో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–3, 6–3, 6–4తో హాన్ఫ్‌మన్ (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్ బెరెటిని (ఇటలీ) 7–6 (11/9), 7–5, 6–3తో అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందారు. 12వ సీడ్ అగుట్ (స్పెయిన్) 7–6 (7/1), 0–6, 4–6, 6–7 (5/7)తో రాడూ అల్బోట్ (మాల్డొవా) చేతిలో... 13వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6–3, 4–6, 7–6 (7/4), 6–7 (6/8), 3–6తో ‘వైల్డ్ కార్డు’ ప్లేయర్ అలెక్సి పాపిరిన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమి పాలయ్యారు. సుమీత్ నాగల్ ఓటమి పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి బరిలో ఉన్న ఏకైక క్రీడాకారుడు సుమీత్ నాగల్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. 72వ ర్యాంకర్ బెరాన్కిస్ (లిథువేనియా)తో జరిగిన మ్యాచ్‌లో 144వ ర్యాంకర్ సుమీత్ 2–6, 5–7, 3–6తో ఓడిపోయాడు. రెండు గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమీత్ ఆరుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయాడు. రెండు ఏస్‌లు కొట్టిన 23 ఏళ్ల సుమీత్ 42 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి రౌండ్లో ఓడిన సుమీత్కు 1,00,000 ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 56 లక్షల 30 వేలు) లభించింది. -
ఈ ఏడాది టెన్నిస్ లేనట్టే : నాదల్
మాడ్రిడ్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా నియంత్రణలోకి రాకపోవడంతో... ఈ ఏడాది టెన్నిస్ టోర్నమెంట్లు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అభిప్రాయపడ్డాడు. ‘వచ్చే ఏడాది జనవరికల్లా టెన్నిస్ టోర్నీలు మళ్లీ మొదలైతే నేను చాలా సంబరపడతా. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకుంటే అది కూడా సాకారం అయ్యేలా కనిపించడంలేదు’ అని తన కెరీర్లో 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన నాదల్ అన్నాడు. కరోనా కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రద్దు కాగా... మేలో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ సెపె్టంబర్‌కు వాయిదా పడింది. -
ఔను... ఒక్కటి చేద్దాం: కింగ్
పారిస్: మహిళల, పురుషుల టెన్నిస్ పాలక మండళ్లను ఒకే గొడుగు కిందకు తెచ్చే డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ ఇటీవల ట్విట్టర్లో రెండు టెన్నిస్ పాలక వర్గాలను విలీనం చేయాలని సూచించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) విలీనానికి అతని సమకాలీన దిగ్గజం రాఫెల్ నాదల్ మద్దతు తెలపగా.... ఇప్పుడు ఈ జాబితాలో డబ్ల్యూటీఏ వ్యవస్థాపకులు బిల్లీ జీన్ కింగ్ చేరారు. విలీనానికి ఇదే సరైన సమయమని ఆమె అన్నారు. ఆమె 1973లో డబ్ల్యూటీఏను స్థాపించారు. అప్పట్లోనే తాను రెండు వర్గాలను ఏకం చేయాలని సూచించినా ఎవరూ పట్టించుకోలేదని... ఇప్పుడైనా సాకారం కావాలని ట్వీట్ చేశారు. -
ఒక్కడే మిగిలాడు
టాప్ సీడ్ సెర్బియన్ జొకోవిచ్ ప్రిక్వార్టర్స్‌లో నిష్క్రమించాడు. మూడో సీడ్ టెన్నిస్ స్టార్ ఫెడరర్ క్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టాడు. ఇక అందరికళ్లు రెండో సీడ్ నాదల్ మ్యాచ్‌పైనే పడ్డాయి. కానీ టాప్–3లో అతనొక్కడే నిలిచాడు. క్వార్టర్స్ అంచెదాటి సెమీఫైనల్ చేరాడు. ఇప్పటికే మూడు సార్లు (2010, 2013, 2017) చాంపియన్‌గా నిలిచిన ఈ స్పెయిన్ స్టార్ నాలుగో టైటిల్ వేటలో రెండడుగుల దూరంలో నిలిచాడు. న్యూయార్క్: టాప్–3లో ఒకే ఒక్కడి అడుగు సెమీస్‌లో పడింది. స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ రాఫెల్ నాదల్ ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ మాజీ చాంపియన్ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. గురువారం జరిగిన పోరులో అతను 6–4, 7–5, 6–2తో అర్జెంటీనాకు చెందిన 20వ సీడ్ డీగో ష్వార్జ్‌మన్‌పై విజయం సాధించాడు. 2 గంటల 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్కు రెండో సెట్ మినహా ఎక్కడ పోటీ ఎదురవలేదు. ఆఖరి సెట్నైతే ఏకపక్షంగా ముగించేశాడు. 5 ఏస్‌లు సంధించిన నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను 8 సార్లు బ్రేక్ చేశాడు. 39 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ 35 విన్నర్స్ కొట్టాడు. 4 ఏస్‌లు సంధించిన ష్వార్జ్‌మన్... 37 అనవసర తప్పిదాలు చేశాడు. అవతలివైపు నాదల్ జోరుతో కేవలం 26 విన్నర్సే కొట్టగలిగాడు. గతేడాది కూడా ఈ టోర్నీలో సెమీస్ చేరిన నాదల్ ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో 33 సార్లు సెమీఫైనల్ చేరాడు. ప్రస్తుతం అతని కంటే ముందు వరుసలో ఫెడరర్ (45), నొవాక్ జొకోవిచ్ (36) మాత్రమే ఉన్నారు. ఇక ఈ టోర్నీలో టైటిల్ నాదల్ చేతికే అందే అవకాశాలున్నాయి. సెమీస్ బరిలో నిలిచిన ఇతర ఆటగాళ్లెవరూ స్పానియార్డ్ జోరు ముందు నిలబడలేరు. దీంతో ఏదో సంచలనం జరిగితే తప్ప... ఈ టోర్నీలో నాదల్ చాంపియన్‌షిప్‌ను ఎవరూ అడ్డుకోలేరని చెప్పొచ్చు. 42 ఏళ్ల తర్వాత ఓ ఇటాలియన్ మరో క్వార్టర్ ఫైనల్ పోరులో ఇటలీకి చెందిన 24వ సీడ్ మాటెయో బెరెటిని చెమటోడ్చి నెగ్గి సెమీస్ చేరాడు. మ్యాచ్ సాగే కొద్దీ పోటీ పెరిగిన ఈ పోరులో అతను 3–6, 6–3, 6–2, 3–6, 7–6 (7/5)తో ఫ్రాన్స్ ఆటగాడు, 13వ సీడ్ గేల్ మోన్ఫిల్స్పై విజయం సాధించాడు. సుమారు నాలుగు గంటల (3 గం. 57 ని.) పాటు ఐదు సెట్ల దాకా ఈ మ్యాచ్ సాగింది. ఈ విజయంతో 42 ఏళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన తొలి ఇటాలియన్గా బెరెటిని ఘనతకెక్కాడు. 1977లో కొరాడో బరజుటి సెమీస్ చేరిన తర్వాత మరో ఇటలీ ఆటగాడెవరూ యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌దాకా వెళ్లలేకపోయాడు. సెమీఫైనల్లో నాదల్‌తో బెరెటిని తలపడతాడు. కెనడా టీనేజ్ అమ్మాయి బియాంక అండ్రిస్కూ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 15వ సీడ్‌గా బరిలోకి దిగిన అండ్రిస్కూ 3–6, 6–2, 6–3తో బెల్జియంకు చెందిన ఎలైస్ మెర్టెన్స్‌ను ఓడించింది. తాజా ఫలితంతో దశాబ్దం తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన టీనేజ్ క్రీడాకారిణిగా (19 ఏళ్లు) ఆమె ఘనతకెక్కింది. 2009లో వోజ్నియాకి (డెన్మార్క్) ఈ ఘనత సాధించింది. -
మెరుగైన శిక్షణ అందించడమే నాదల్ లక్ష్యం
సాక్షి, అనంతపురం : మెరుగైన శిక్షణ అందించడమే లక్ష్యంగా నాదల్ ఫౌండేషన్ ముందుకు సాగుతోందని స్పెయిన్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు జొనాథన్ మార్ట్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రతినిధి హ్యూగో కమిన్ తెలిపారు. భవిష్యత్తు తరాలకు మంచి అలవాట్లను పెంపొందించడంలో క్రీడలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. అనంతపురం క్రీడా మైదానంలో ప్రపంచ స్థాయి టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ 2010 అక్టోబర్ 17న టెన్నిస్ ఫౌండేషన్ అకాడమీని స్థాపించారు. నాటి నుంచి నేటి వరకూ వెయ్యి మంది క్రీడాకారులను టెన్నిస్‌లో తీర్చిదిద్దారు. టెన్నిస్ క్రీడను నేర్చుకునే విద్యార్థులకు ఆటతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం, స్పోకెన్ ఇంగ్లిష్, సామాజిక స్పృహ కలిగిన అంశాలపై తర్ఫీదునిస్తున్నారు. అంతేకాక కోచింగ్‌కు హాజరయ్యే క్రీడాకారులకు ఉచితంగా న్యూట్రీషన్‌ను వారే అందిస్తున్నారు. గతంలో అనంత క్రీడా మైదానానికే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది ఒక కేంద్రంలో క్రీడా శిబిరాన్ని నిర్వహించగా, ఈ ఏడాది రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాల, అనంతపురం నంబర్ 1 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజేంద్ర మునిసిపల్ హైస్కూల్లో శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిని పర్యవేక్షిస్తున్న జొనాథన్ మార్ట్, హ్యూగో కమిన్తో ‘సాక్షి చిట్‌చాట్’.. సాక్షి: జిల్లా క్రీడాకారులను ఎలా సిద్ధం చేస్తున్నారు? జవాబు: కేవలం క్రీడ ద్వారానే కాకుండా సమాజంలో వారి బాధ్యత ఏమిటో తెలిసుకునేలా జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైన వాటిని ధైర్యంగా ఎదుర్కొనే విధంగా శిక్షణ ఇస్తున్నాం. సాక్షి: నాదల్ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటో చెప్పగలరా? జవాబు: సమాజానికి శక్తివంతమైన యువతను సిద్దం చేసి అందించడమే నాదల్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం. ఈ ఫౌండేషన్‌ను రఫా నాదల్ 2010 అక్టోబర్ 17న అనంతపురంలో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇందులో పాల్గొనే క్రీడాకారులకు శిక్షణ, నైపుణ్యాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించి వారిని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతున్నాం. సాక్షి: టెన్నిస్ శిక్షణ ఉచితమా? జవాబు : ఇది పూర్తీ ఉచితం. దీనిని రఫెల్ నాదల్ ఫౌండేషన్ ద్వారా నడిపిస్తున్నాం. ఇందులో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికీ క్రీడ పరంగా అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నాం. కోచింగ్ క్యాంపులకు హాజరయ్యే క్రీడాకారులకు వాహన సదుపాయాన్ని కూడా కల్పించాం. సాక్షి: జిల్లా వ్యాప్తంగా టెన్నిస్‌ను విస్తరించనున్నారా? జవాబు : గత 10 ఏళ్ల ప్రయాణంలో 8 ఏళ్లు అనంత నగరానికి పరిమితమయ్యాం. గత ఏడాది రెండు పాఠశాలల్లో ప్రత్యేక శిభిరాలు నిర్వహించి టెన్నిస్ క్రీడ పట్ల ఆసక్తి ఉన్న వారిని గుర్తించాం. ఈ ఏడాది మరో మూడు ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి క్రీడాకారులకు టెన్నిస్, సామాజిక అంశాలు, మానవీయ విలువలపై చైతన్య పరిచాం. సాక్షి: ఇక్కడి కోచ్‌లతో కో ఆర్డినేషన్ ఎలా ఉంది? జవాబు : మేము నిర్వహించే శిబిరాలు ప్రధానమైనవి కావు. ఇక్కడి నాదల్ అకాడమీలో ఉన్న కోచ్‌లను సమన్వయం చేసుకుని ముందుకు పోతున్నాం. మా లక్ష్యాలను ముందుగా వారికి వివరిస్తాం. ఆ తర్వాత వారే దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు. ఆలోచన మాది, ఆచరణలో మాత్రం వారు సూచించిన విధానాలను అవలంభిస్తుంటాం. ఒకరి ద్వారా అనేకం అనే సిద్ధాంతంతో ముందుకు పోతున్నాం. సాక్షి: సామాజిక మార్పు ఎలా సాధ్యమవుతుంది? జవాబు : సమాజంలో విద్యార్థులు చాలా కీలకం. వారే ఈ సమాజాన్ని, దేశాన్ని మార్చే ఏకైక శక్తి. సామాజిక విస్ఫోటాలకు కారణమైన వారిలో మానసికంగా ఎదురవుతున్న రుగ్మతలే ప్రధానమని చెప్పవచ్చు. దీనిని అధిగమించేందుకు క్రీడలు ప్రధానం. ఈ క్రీడ నేర్పితే వారు ఆ క్రీడలో మాత్రమే రాణిస్తారు. అయితే వారికి ఇంగ్లిష్, కంప్యూటర్, మానవీయ విలువల గురించి తెలపడం ద్వారా శక్తివంతమైన పౌరులుగా ఎదుగుతారు. దీని ద్వారా సామాజిక మార్పు సిద్ధమవుతుంది. సాక్షి: ఉత్తమ క్రీడాకారుడిగా రాణించేందుకు ఏమి చేయాలి? జవాబు : క్రీడాకారుడిలో ఉన్న ఆసక్తి అతనిని ఉన్నత శ్రేణికి చేరుస్తుంది. సాధన అనేది ప్రధానం. కోచ్ ఇచ్చే సూచనలను ఫాలో అయితే ఆ క్రీడాకారుడు ఆటలో రాణించగలడు. ఫిట్నెస్ తప్పనిసరి. మానసిక స్థితిని ఎప్పటికప్పుడు ఆధీనంలో ఉంచుకోవాలి. ఈ లక్షణాలు అలవర్చుకుంటే ఉత్తమ క్రీడాకారిడిగా రాణించవచ్చు. -
నాదల్‌ను ఆపతరమా!
పారిస్: ఈ ఏడాది గొప్పగా ఫామ్‌లో లేకపోయినప్పటికీ ఫ్రెంచ్ ఓపెన్ అనేసరికి రాఫెల్ నాదల్కు ఎక్కడలేని శక్తి వస్తుంది. తనకెంతో కలిసొచ్చిన మట్టి కోర్టులపై నాదల్‌ను నిలువరించాలంటే అతని ప్రత్యర్థులు విశేషంగా ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే రికార్డుస్థాయిలో 11సార్లు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను నెగ్గిన నాదల్ 12వసారి ఈ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉన్నాడు. ఆదివారం మొదలయ్యే సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న నాదల్కు వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) నుంచే గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. ఇటీవలే రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సాధించి ఫామ్‌లోకి వచ్చిన నాదల్కు ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్వితీయమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో మొత్తం 86 మ్యాచ్‌ల్లో గెలిచిన నాదల్ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే (2015లో క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో, 2009లో ప్రిక్వార్టర్ ఫైనల్లో సోడెర్లింగ్ చేతిలో) ఓడిపోయాడు. 2016లో మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)తో జరగాల్సిన మూడో రౌండ్ మ్యాచ్‌లో గాయం కారణంగా బరిలోకి దిగకుండానే ‘వాకోవర్’ ఇచ్చాడు. మరోవైపు టాప్ సీడ్ జొకోవిచ్ ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే రెండుసార్లు వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను నిలబెట్టుకున్న రెండో ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ‘డ్రా’ ప్రకారం జొకోవిచ్‌కు నాదల్ ఫైనల్లోనే ఎదురయ్యే అవకాశముంది. ఇక మూడేళ్ల తర్వాత మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న ఫెడరర్ ఆదివారం జరిగే తొలి రౌండ్లో లొరెంజో సొనెగో (ఇటలీ)తో తలపడతాడు. నాదల్, జొకోవిచ్ కాకుండా నాలుగో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఐదో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఆరో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్) కూడా టైటిల్ రేసులో ఉన్నారు. భారత్ తరఫున ప్రజ్నేశ్ గుణేశ్వరన్ మాత్రమే మెయిన్ ‘డ్రా’లో ఉన్నాడు. ఆదివారం జరిగే తొలి రౌండ్లో హుగో డెలియన్ (బొలీవియా)తో ప్రజ్నేశ్ ఆడతాడు. పలువురు ఫేవరెట్స్... మహిళల సింగిల్స్ విభాగంలో ఈసారీ పలువురు ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా)తోపాటు వరల్డ్ నంబర్‌వన్ నయోమి ఒసాకా (జపాన్), మాజీ విజేత గార్బిన్ ముగురుజా (స్పెయిన్) టైటిల్ గెలిచే అవకాశాలున్నాయి. మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) ఫిట్నెస్ సమస్యను అధిగమిస్తే ఆమె ఖాతాలో మరో టైటిల్ చేరవచ్చు. గతేడాది యూఎస్ ఓపెన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఒసాకా వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టింది. అయితే ఆమెకు రెండో రౌండ్లో మాజీ విజేత ఒస్టాపెంకో రూపంలో సవాల్ ఎదురయ్యే చాన్స్ ఉంది. -
సరికొత్త చరిత్ర సృష్టించిన జొకోవిచ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏకంగా ఏడో సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో జొకోవిచ్ 6-3, 6-2, 6-3 తేడాతో మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్‌ను మట్టికరిపించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సెర్బియా స్టార్ దూకుడు ముందు నాదల్ తేలిపోయాడు. వరుసగా మూడు సెట్లను సునాయసంగా కైవసం చేసుకోవడంతో నాదల్కు ఓటమితప్పలేదు. దీంతో రాయ్ ఎమర్సన్, ఫెడరర్ (ఆరు సార్లు విజేతలుగా నిలిచారు)ల పేరిట ఉన్న రికార్డును చెరిపివేశాడు. గతంలో ఆరుసార్లు ఫైనల్ చేరిన జొకోవిచ్ (2016, 2015, 2013, 2012, 2011, 2008) ఆరుసార్లూ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. జొకోవిచ్ చాంపియన్ ఆట ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ అసలైన చాంపియన్ ఆట ఆడాడు. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన నాదల్కు ఫైనల్ పోరులో చుక్కలు చూపించాడు. మ్యాచ్ ఆసాంతం ఎలాంటి అనవసర తప్పిదాలు చేయని సెర్బియా స్టార్.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. ఇక ఈ విజయంతో జొకోవిచ్ పదిహేనో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సంప్రాస్(14) రికార్డును నొవాక్ అధిగమించాడు. 15 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో జొకోవిచ్ మూడో స్థానంలో ఉన్నాడు. 17 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో నాదల్ రెండో స్థానంలో ఉండగా 20 టైటిళ్లతో మొదటి స్థానంలో ఫెడరర్ కొనసాగుతున్నాడు. .@DjokerNole reunited with Norman once again.#AusOpen #AusOpenFinal pic.twitter.com/J6HBOr367d — #AusOpen (@AustralianOpen) January 27, 2019 -
నాదల్ పెద్ద తప్పే చేశాడా?
పారిస్/రొనాల్డ్ గారోస్: టెన్నిస్ రారాజు రఫెల్ నాదల్ 11వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను 6-4, 6-3, 6-2 సెట్ల తేడాతో చిత్తుగా ఓడించాడు. అయితే ఫైనల్ సమరంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడనే విమర్శలు నాదల్‌పై ఇప్పుడు మొదలయ్యాయి. అసలేం చేశాడు... ఫిలిప్పె ఛాట్రైర్ కోర్టులో జరిగిన ఫైనల్ పోరు సందర్భంగా మూడో సెట్ సమయంలో నాదల్ తన ఫిజిషియన్‌ను కోర్టులోకి రప్పించి మణికట్టుకు చికిత్స చేయించుకున్నాడు. అయితే అలా చికిత్స చేయించుకోవటం టోర్నీ రూల్స్ ప్రకారం విరుద్ధం. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. (కల నెరవేర్చాడు..! ఆసక్తికర కథనం) దిగ్గజాల మండిపాటు... నాదల్ చేసింది ఘోర తప్పిదమని టెన్నిస్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. ‘అలాంటప్పుడు మెడికల్ టైమ్ అవుట్లో తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నించొచ్చు. కానీ, ఇలా సెట్ మధ్యలో ఉండగా ఫిజిషియన్‌ను రప్పించుకుని చికిత్స చేయించుకోవటం మాత్రం ముమ్మాటికీ నేరమే’ అని మాజీ ఆటగాడు గ్రెగ్ రుసెదిస్కి చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో నాదల్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని మరో దిగ్గజం అన్నాబెల్ క్రోఫ్ట్ ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులను డిమాండ్ చేస్తున్నారు. రూల్స్ నాదల్కు వర్తించవా?.. ఈ టోర్నీలో రాబిన్ హాసే(నెదర్లాండ్స్), డెవిడ్ గొఫ్ఫిన్ (బెల్జియం) మ్యాచ్ సందర్భంగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే చైర్ అంఫైర్లు మాత్రం చికిత్సకు నిరాకరించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రుసెదిస్కి టోర్నీ నిర్వాహకులపై మండిపడ్డాడు. ‘నాదల్స్కు రూల్స్ వర్తించవా? అతనికి మినహాయింపు ఎందుకిచ్చారు? అతనికి శిక్ష పడాల్సిందే... అంటూ రుసెదిస్కి కోరుతున్నారు. నాదల్ రియాక్షన్... వివాదంపై నాదల్ స్పందించాడు. చేతి కండరాలు పట్టేయటంతోనే ఫిజీషియన్‌ను పిలిపించుకున్నట్లు తెలిపాడు. సెమీస్ నుంచే తనకు నొప్పి వేధించిందని, ఈ వివాదాన్ని అనవసరంగా పెద్దది చేయొకండంటూ ఆయన మాజీలకు విజ్ఞప్తి చేస్తున్నాడు. -
నాదల్‌కే మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్
-
నాదల్ శ్రమించి...
మొదటి మూడు రౌండ్లలో సునాయాస విజయాలు సాధించిన ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్కు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలిసారి అసలు పరీక్ష ఎదురైంది. అర్జెంటీనా యువతార డీగో ష్వార్ట్‌జ్‌మన్‌తో దాదాపు నాలుగు గంటలపాటు సాగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ స్పెయిన్ స్టార్ తన అనుభవాన్నంతా రంగరించి గట్టెక్కాడు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ మారిన్ సిలిచ్‌తో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కరోలిన్ వొజ్నియాకి, నాలుగో సీడ్ స్వితోలినా అలవోక విజయాలతో క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టారు. మెల్బోర్న్: గతేడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి జోరు మీదున్న స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ కొత్త సీజన్లోనూ దూసుకెళ్తున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో ఈ టాప్ సీడ్ ప్లేయర్ క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. 24వ సీడ్ డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెం టీనా)తో 3 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నాదల్ 6–2, 6–7 (4/7), 6–3, 6–3తో గెలుపొంది పదోసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన నాదల్ తాజా విజయంతో తన నంబర్‌వన్ ర్యాంక్‌ను పదిలం చేసుకున్నాడు. ‘మ్యాచ్ గొప్పగా సాగింది. ఒకదశలో అలసిపోయినా తుదివరకు పోరాడగలిగి విజయం దక్కించుకున్నాను’ అని నాదల్ వ్యాఖ్యానిం చాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ఒక్క సెట్ కూడా కోల్పోని నాదల్ ఈ పోటీలో ఒక సెట్ చేజార్చుకున్నాడు. అంతేకాకుండా తన సర్వీస్ మూడుసార్లు కోల్పోయాడు. మరోవైపు ష్వార్ట్‌జ్‌మన్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు శక్తివంతమైన గ్రౌండ్షాట్లతో నాదల్‌ను ఇబ్బంది పెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో నాదల్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో సిలిచ్ 6–7 (2/7), 6–3, 7–6 (7/0), 7–6 (7/3)తో పదో సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)ను ఓడించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 7–6 (7/3), 7–6 (7/4), 4–6, 7–6 (7/4)తో 17వ సీడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై గెలుపొంది మూడోసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరగా... బ్రిటన్ ఆశాకిరణం కైల్ ఎడ్మండ్ 6–7 (4/7), 7–5, 6–2, 6–3తో ఆండ్రియా సెప్పి (ఇటలీ)ని ఓడించి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. స్వితోలినా తొలిసారి... మహిళల సింగిల్స్‌లో ఆదివారం ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోలేదు. రెండో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) ఐదేళ్ల తర్వాత, నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) తొలిసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖాయం చేసుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో వొజ్నియాకి 6–3, 6–0తో 19వ సీడ్ మగ్ధలినా రిబరికోవా (స్లొవేకియా)పై... స్వితోలినా 6–3, 6–0తో డెనిసా అలెర్టోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) 4–6, 6–4, 8–6తో 32వ సీడ్ కొంటావీట్ (ఎస్తోనియా)పై, ఎలీస్ మెర్టెన్స్ (బెల్జియం) 7–6 (7/5), 7–5తో పెట్రా మార్టిక్ (క్రొయేషియా)పై విజయం సాధించారు. పేస్ జంట నిష్క్రమణ పురుషుల డబుల్స్‌లో లియాండర్ పేస్–పురవ్ రాజా (భారత్) జంట పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో పేస్–పురవ్ ద్వయం 1–6, 2–6తో సెబాస్టియన్ కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–తిమియా బాబోస్ (హంగేరి) జోడీ 6–2, 6–4తో విటింగ్టన్–ఎలెన్ పెరెజ్ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచింది. నన్ను అనుసరించాలని కోరుకోవట్లేదు! ► తన పిల్లల గురించి ఫెడరర్ మెల్బోర్న్: టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో అతను ఒకడు... 19 గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత... సహజంగానే అతని పిల్లలు తండ్రి అడుగు జాడల్లో నడుస్తారని, భవిష్యత్తులో టెన్నిస్ స్టార్లుగా ఎదుగుతారని చాలా మంది భావిస్తారు. అయితే రోజర్ ఫెడరర్ మాత్రం అలా జరగాలని కోరుకోవట్లేదు. ఏదైనా ఆటలో ప్రవేశం ఉంటే మంచిదే కానీ తనలాగా ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాళ్లుగా మారతారో లేదో చెప్పలేనన్నాడు. ‘వారు నన్ను అనుసరించాలని ఆశించడం లేదు. ఎందుకంటే నా పిల్లలు కూడా మరో 25 ఏళ్ల పాటు ప్రొఫెషనల్‌గా మారి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూనే ఉండాలని నేను కోరుకోకపోవడమే దానికి కారణం. అయితే ఆటలు కానీ వ్యాపారంలాంటి మరో రంగంలోకి కానీ వారు వెళతానంటే మద్దతుగా నిలుస్తాను. చిన్నప్పుడే ఆటలు ఆడే మంచి అలవాటు వారికి రావాలి. అది ఏ ఆటైనా సరే. అయినా సరదాగానైనా ఫెడరర్ పిల్లలు టెన్నిస్ ఆడకుంటే ఆశ్చర్యం కానీ ఆడితే ఏముంది’ అని ఈ దిగ్గజ ఆటగాడు వ్యాఖ్యానించాడు. ఫెడరర్, మిర్కా దంపతులకు కవలల జతలు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. -
ఫెడరర్ జిగేల్..
మెల్బోర్న్:సుదీర్ఘ విరామం తరువాత స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ జిగేల్మన్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రోజర్ ఫెడరర్ కైవసం చేసుకుని తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఆదివారం జరిగిన తుదిపోరులో ఫెడరర్ 6-4, 3-6, 6-1,3-6, 6-3 తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ను ఓడించి టైటిల్ ను సొంతం చేసకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ లో తన పూర్వపు ఫామ్‌ను అందుకున్న ఫెడరర్.. దాదాపు ఐదేళ్ల తరువాత గ్రాండ్ స్లామ్‌ను సాధించడం విశేషం. దాదాపు మూడు గంటల 45నిమిషాల పాటు ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఫెడరర్ తన జోరును కొనసాగించి టైటిల్ ను ఎగురేసుకుపోయాడు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన టైటిల్ రేసులో ఫెడరర్ 150 పాయింట్ల సాధించగా, నాదల్ 139లకే పరిమితమయ్యాడు. ఇక ఏస్‌ల విషయంలో ఫెడరర్ 20 ఏస్‌లను సంధిస్తే, నాదల్ 4 ఏస్‌లను మాత్రమే సాధించాడు. తొలి సెట్ నుంచి ఫెడరర్ ఆధిపత్యం కొనసాగింది. మొదటి సెట్‌ను గెలుచుకున్న ఫెడరర్.. రెండో సెట్‌ను నాదల్ కు కోల్పోయాడు. ఇక మూడో సెట్లో ఫెడరర్ అత్యంత నిలకడగా ఆడాడు. ఆ సెట్లో నాదల్‌ను పాయింట్‌కు మాత్రమే ఇచ్చిన ఫెడరర్ ఆధిక్యం సాధించాడు. ఆ తరువాత నాల్గో సెట్లో నాదల్ చెలరేగిపోయాడు. ఫెడరర్‌ను ముప్పు తిప్పలు పెడుతూ కచ్చితమైన ప్లేస్‌మెంట్స్‌తో ఆ సెట్‌ను సాధించి స్కోరును సమం చేశాడు. దాంతో నిర్ణయాత్మక ఐదో సెట్ అనివార్యమైంది. ఐదో సెట్ ఆదిలో ఫెడరర్ వెనుకబడినప్పటికీ, చివరవరకూ పోరాడి విజయం సాధించాడు. ఇది ఫెడరర్ కెరీర్లో 18 గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా,ఐదో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ టైటిల్. చివరిసారి 2012లో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఫెడరర్.. ఆ తరువాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలవడం ఇదే తొలిసారి. ఫెడరర్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్(2004,06,07,10,17) ఫ్రెంచ్ ఓపెన్(2009) వింబుల్డన్ ఓపెన్(2003,04,05,06,07,09,12) యూఎస్ ఓపెన్(2004,05,06,07,08)