స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్‌కు మరోసారి పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ కలిసి రాలేదు. కెరీర్‌లో 36 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ పారిస్ ఓపెన్‌లో మాత్రం ఒక్కసారి కూడా విజేతగా నిలువలేకపోయాడు. ఈసారి అతను రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు.
తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ ఆడిన నాదల్ 6–3, 6–7 (4/7), 1–6తో ప్రపంచ 31వ ర్యాంకర్ టామీ పాల్ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. నాదల్‌కు 39,070 యూరోల (రూ. 31 లక్షల 59 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ప్రస్తుత నంబర్‌వన్ అల్‌కరాజ్ (స్పెయిన్) పారిస్ ఓపెన్‌లో విజేతగా నిలిస్తే ఈ ఏడాదిని అతను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగిస్తాడు. ఈ టోర్నీలో అల్‌కరాజ్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో అల్‌కరాజ్ 6–1, 6–3తో దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలుపొందాడు.
చదవండి: FIFA World Cup: నది మధ్యలో మెస్సీ 30 అడుగుల కటౌట్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment