Paris Masters Series
-
రాఫెల్ నాదల్కు షాక్
స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్కు మరోసారి పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ కలిసి రాలేదు. కెరీర్లో 36 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ పారిస్ ఓపెన్‌లో మాత్రం ఒక్కసారి కూడా విజేతగా నిలువలేకపోయాడు. ఈసారి అతను రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ ఆడిన నాదల్ 6–3, 6–7 (4/7), 1–6తో ప్రపంచ 31వ ర్యాంకర్ టామీ పాల్ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. నాదల్కు 39,070 యూరోల (రూ. 31 లక్షల 59 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రస్తుత నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్) పారిస్ ఓపెన్‌లో విజేతగా నిలిస్తే ఈ ఏడాదిని అతను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగిస్తాడు. ఈ టోర్నీలో అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–1, 6–3తో దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలుపొందాడు. చదవండి: FIFA World Cup: నది మధ్యలో మెస్సీ 30 అడుగుల కటౌట్.. వీడియో వైరల్ -
నాదల్ @ 1000
పారిస్: స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ తన అసమాన కెరీర్లో మరో మైలురాయిని దాటాడు. పారిస్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్స్‌కు చేరడం ద్వారా... 1000వ విజయాన్ని నమోదు చేశాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ 4–6, 7–6 (7/5), 6–4తో ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)పై గెలుపొందాడు. తద్వారా ఓపెన్ శకం (1968 తర్వాత)లో వేయి విజయాలు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. నాదల్‌కంటే ముందు ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (1,274), రోజర్ ఫెడరర్ (1,242), ఇవాన్ లెండిల్ (1,068) ఉన్నారు. 2002 ఏప్రిల్ 29న 16 ఏళ్ల వయసులో రమోన్ డెల్గాడో (పరాగ్వే)పై గెలుపుతో.... తన విజయాల వేటను ఆరంభించిన నాదల్æ... 2011లో జరిగిన బార్సిలోనా ఓపెన్ సెమీఫైనల్లో ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా)పై నెగ్గడంతో కెరీర్లో 500వ విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో చాంపియన్‌గా నిలవడం ద్వారా 20వ గ్రాండ్‌స్లామ్‌ను సాధించిన నాదల్... పురుషుల విభాగంలో ఫెడరర్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ రికార్డు (20)ను సమం చేశాడు. క్వార్టర్స్‌లో బోపన్న జంట పారిస్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ రోహన్ బోపన్న– ఒలివర్ మరాచ్ (ఆస్ట్రియా) జంట క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. పురుషుల డబుల్స్ విభాగంలో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో బోపన్న–ఒలివర్ ద్వయం 3–6, 6–4, 10–8తో తొమ్మిదో సీడ్ ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్)–జీన్ జులియన్ రోజెర్ (నెదర్లాండ్స్) జంటపై గెలిచింది. ‘వేయి మ్యాచ్‌లు గెలిచానంటే నాకు వయసు మీద పడినట్లే లెక్క. నా కెరీర్లో నేను సాధించిన విజయాల పట్ల గర్వపడుతున్నా. అలాగే ఈ మైలురాయిని కూడా. గాయాల రూపంలో అనేక ఇబ్బందులు ఎదురైనా టెన్నిస్‌పై ఉన్న అంకిత భావం నన్ను ముందుకు సాగేలా చేసింది. అందుకే ఇంత కాలం బాగా ఆడగలిగాను. ఇప్పుడు అదే నాకు 1000వ విజయాన్ని అందించింది’ – నాదల్ -
క్వార్టర్స్ కు చేరిన బోపన్న జోడి
పారిస్: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా(రొమేనియా) జోడీ పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో రెండో రౌండ్ అడ్డంకిని అధిగమించింది. గురువారం జరిగిన రెండో రౌండ్ లో బోపన్న-మెర్జియా లు 6-7(3), 6-4, 10-5 తేడాతో కొలంబియాకు చెందిన జులాన్ సెబాస్టియన్ కాబల్-రోబర్ట్ ఫరాలపై గెలిచి క్వార్టర్ ఫైనల్ కు చేరారు. గంటా 33 నిమిషాల పాటు జరిగిన పోరులో బోపన్న జోడి పోరాడి గెలిచింది. టై బ్రేక్ కు దారి తీసిన తొలి సెట్ లో కొలంబియన్ జోడి పై చేయి సాధించినా.. ఆ తరువాత రెండు సెట్ లను బోపన్న జోడీ కైవసం చేసుకుంది.బోపన్న జోడికి తొలి రౌండ్ లో బై లభించడంతో నేరుగా రెండో రౌండ్ లో పాల్గొంది. ఇదే టోర్నీలో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్‌తో జతకట్టిన లియాండర్ పేస్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. -
పేస్-నాదల్ జంటకు షాక్
పారిస్ మాస్టర్స్ సిరీస్ పారిస్: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్‌తో జతకట్టిన పేస్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. పేస్-నాదల్ ద్వయం 3-6, 4-6తో డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్)-రాబర్ట్ లిండ్‌స్టెట్ (స్వీడన్) జోడీ చేతిలో ఓడిపోయింది. మరోవైపు రోహన్ బోపన్న (భారత్) -ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్లో 6-7 (3/7), 6-4, 10-5తో సెబాస్టియన్ కాబల్-రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీపై విజయం సాధించింది.