క్వార్టర్స్ కు చేరిన బోపన్న జోడి | Bopanna and Mergea enter Paris Masters quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్ కు చేరిన బోపన్న జోడి

Published Thu, Nov 5 2015 5:49 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

క్వార్టర్స్ కు చేరిన బోపన్న జోడి

క్వార్టర్స్ కు చేరిన బోపన్న జోడి

పారిస్: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా(రొమేనియా) జోడీ పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో రెండో రౌండ్ అడ్డంకిని అధిగమించింది. గురువారం జరిగిన రెండో రౌండ్ లో బోపన్న-మెర్జియా లు 6-7(3), 6-4, 10-5 తేడాతో కొలంబియాకు చెందిన జులాన్ సెబాస్టియన్ కాబల్-రోబర్ట్ ఫరాలపై  గెలిచి క్వార్టర్ ఫైనల్ కు చేరారు.

 

గంటా 33 నిమిషాల పాటు జరిగిన పోరులో బోపన్న జోడి పోరాడి గెలిచింది.  టై బ్రేక్ కు  దారి తీసిన తొలి సెట్ లో కొలంబియన్ జోడి పై చేయి సాధించినా.. ఆ తరువాత రెండు సెట్ లను బోపన్న జోడీ కైవసం చేసుకుంది.బోపన్న జోడికి తొలి రౌండ్ లో బై లభించడంతో నేరుగా రెండో రౌండ్ లో పాల్గొంది.  ఇదే టోర్నీలో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్‌తో జతకట్టిన లియాండర్ పేస్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement