పారిస్ మాస్టర్స్ సిరీస్
పారిస్: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్‌తో జతకట్టిన పేస్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. పేస్-నాదల్ ద్వయం 3-6, 4-6తో డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్)-రాబర్ట్ లిండ్‌స్టెట్ (స్వీడన్) జోడీ చేతిలో ఓడిపోయింది. మరోవైపు రోహన్ బోపన్న (భారత్) -ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్‌లో 6-7 (3/7), 6-4, 10-5తో సెబాస్టియన్ కాబల్-రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీపై విజయం సాధించింది.
పేస్-నాదల్ జంటకు షాక్
Published Thu, Nov 5 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM
Advertisement
Advertisement