పేస్పై సానియా తీవ్ర వ్యాఖ్యలు | Sania Mirza labels Leander Paes a TOXIC PERSON | Sakshi
Sakshi News home page

పేస్పై సానియా తీవ్ర వ్యాఖ్యలు

Published Mon, Sep 19 2016 9:59 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

పేస్పై సానియా తీవ్ర వ్యాఖ్యలు

పేస్పై సానియా తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారత టెన్నిస్లో వివాదం ముదురుతోంది. గత రెండు ఒలింపిక్స్కు డబుల్స్ జోడీల ఎంపికపై భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ చేసిన విమర్శలపై హైదరాబాదీ సానియా మీర్జా తీవ్రంగా స్పందించింది. పేస్ పేరును ప్రస్తావించకుండా ఓ విషపురుగు అంటూ విమర్శించింది. సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడమని పరోక్షంగా పేస్‌ను ఉద్దేశించి సానియా ట్వీట్ చేసింది.

గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్‌లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని  పేస్ వ్యాఖ్యానించాడు. రియో, గత లండన్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మేటి డబుల్స్ జంటను పంపలేదని, దీనివల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు. ఈ ఒలింపిక్స్‌లో మంచి మిక్స్‌డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నామని అన్నాడు. సానియ, రోహన్ బోపన్నను ఎంపిక చేయడాన్ని తప్పుపట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement