Indian tennis
-
రెండో సీడ్ జోడీకి షాక్.. సెమీస్‌లో జీవన్-ప్రశాంత్ ద్వయం
హాంగ్జౌ: భారత టెన్నిస్ జంట జీవన్ నెడుంజెళియన్ – ప్రశాంత్ ఏటీపీ టోర్నీ హాంగ్జౌ ఓపెన్ డబుల్స్‌లో సెమీస్‌లోకి అడుగు పెట్టింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో నెడుంజెళియన్ –ప్రశాంత్ 6–7 (4/7), 7–6 (8/6), 10–8తో రెండో సీడ్ జులియన్ కాశ్ –లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్) జోడీపై చెమటోడ్చి గెలిచారు. మ్యాచ్ ఆరంభం నుంచి పోటాపోటీగా జరిగిన ఈ పోరులో టైబ్రేక్‌కు దారితీసిన తొలిసెట్‌ను భారత ద్వయం కోల్పోయింది. తర్వాత రెండో సెట్లో తమకన్నా మెరుగైనా ర్యాంకు జంటతో దీటుగా పోరాటం చేసింది. వరుసగా ఈ సెట్ కూడా టైబ్రేక్ దాకా వెళ్లినా... భారత జోడీ ఈ సెట్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా గెలిచి పోటీలో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోనూ ఇరు జోడీలు ఏమాత్రం తగ్గలేదు. నువ్వానేనా అన్నట్లు ప్రతి పాయింట్ కోసం శ్రమించాయి. చివరకు భారత ద్వయం 10–8తో గెలిచి ఊపిరి పీల్చుకుంది. రెండు గంటల పాటు ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. సెమీస్‌లో మూడో సీడ్ ఎరియెల్ బెహర్ (ఉరుగ్వే)–రాబర్ట్ గెలొవే (అమెరికా) జంటతో భారత ద్వయం తలపడుతుంది. -
సెమీ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
న్యూఢిల్లీ: భారత డబుల్స్ ఆటగాడు యూకీ బాంబ్రీ ఏటీపీ టోర్నీ చెంగ్డూ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. యూకీ బాంబ్రీ – ఫ్రాన్స్ ప్లేయర్ అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడి చక్కని పోరాట పటిమతో తమకన్నా మెరుగైనా ర్యాంకింగ్ ప్లేయర్లను కంగుతినిపించింది. పురుషుల డబుల్స్‌లో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ–ఒలివెట్టి జంట 5–7, 6–3, 12–10తో ఈక్వెడార్‌కు చెందిన గాంజాలొ ఎస్కోబార్–డీగో హిదాల్గొ జోడీపై చెటడోడ్చి గెలిచింది. ఆరంభ సెట్లో వెనుకబడిన భారత్–ఫ్రాన్స్ ద్వయం రెండో సెట్లో అసాధారణ ఆటతీరుతో ఈక్వెడార్ జంటకు ఏమాత్రం అవకాశమివ్వకుండా సెట్‌ను కైవసం చేసుకొంది. కీలకమైన ఆఖరి సెట్ ఊహించని విధంగా సాగింది. ఇరు జోడీలు ధీటుగా ఆడటంతో ప్రతి పాయింట్ కోసం పెద్ద పోరాటం తప్పలేదు. చివరకు 12–10తో యూకీ బాంబ్రి జోడీ సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో భారత్–ఫ్రాన్స్ జోడీ... రెండో సీడ్ ఇవాండ్ డొడిగ్ (క్రొయేషియా)–రాఫెల్ మాటోస్ (బ్రెజిల్) జంటను ఎదర్కొంటుంది. -
టీపీఎల్‌లో సుమిత్ నగాల్
ముంబై: భారత నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నగాల్ ఈ సీజన్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) బరిలోకి దిగనున్నాడు. డిసెంబర్ 3 నుంచి 8 వరకు ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలోని టెన్నిస్ కోర్టుల్లో ఆరో సీజన్ పోటీలు జరుగుతాయి. హైదరాబాద్ స్ట్రయికర్స్, పుణే జాగ్వార్స్, బెంగాల్ విజార్డ్స్, పంజాబ్ పేట్రియా ట్స్, గుజరాత్ పాంథర్స్, ముంబై లియోన్ ఆర్మీ, బెంగళూరు పైపర్స్ ఈ లీగ్‌లో ఆడనున్నాయి. -
Monte Carlo Masters Series: సుమిత్ సంచలనం
మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది తన జోరు కొనసాగిస్తూ భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ మరో గొప్ప విజయం సాధించాడు. ప్రతిష్టాత్మక మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ తొలి రౌండ్లో ప్రపంచ 38వ ర్యాంకర్ మాటియో అర్నాల్డిని బోల్తా కొట్టించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుమిత్ 5–7, 6–2, 6–4తో అర్నాల్డిపై గెలిచి క్లే కోర్టు మాస్టర్స్ సిరీస్ టోరీ్నల్లో రెండో రౌండ్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తొలి సెట్‌ను కోల్పోయినా ఆందోళన చెందలేదు. రెండో సెట్లో అద్భుతంగా ఆడి అర్నాల్డి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నిర్ణాయక మూడో సెట్లోనూ సుమిత్ తన దూకుడు కొనసాగించి మూడో గేమ్‌లో, ఏడో గేమ్‌లో అర్నాల్డి సర్వీస్‌లను బ్రేక్ చేసి తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. రెండో రౌండ్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో సుమిత్ ఆడతాడు. రెండో రౌండ్లోకి ప్రవేశించడం ద్వారా సుమిత్ వచ్చే ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 80వ స్థానానికి చేరుకోనున్నాడు. ఈ ఏడాది సుమిత్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరగా... చెన్నై ఓపెన్ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచాడు. దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ, ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 టోర్నీ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఓడిపోయాడు. -
Girona Open: అనిరుధ్–విజయ్ జోడీకి నిరాశ
కోస్టా బ్రావా (స్పెయిన్): జిరోనా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ తన భాగస్వామి విజయ్ సుందర్ ప్రశాంత్‌తో కలిసి తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. మూడో సీడ్ సాండెర్ అరెండ్స్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీతో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో అనిరుద్–విజయ్ ద్వయం 4–6, 4–6తో ఓటమి పాలైంది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్ జంట మూడు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–ఆండ్రీ బెగెమాన్ (జర్మనీ) ద్వయం 4–6, 3–6తో ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్)–హెన్రీ పాటెన్ (బ్రిటన్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. తొలి రౌండ్లో ఓడిన అనిరుద్–విజయ్; బాలాజీ–బెగెమాన్ జోడీలకు 800 యూరోలు (రూ. 72 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
వరల్డ్ నంబర్ వన్ బోపన్న జోడీకి తొలి రౌండ్లోనే షాక్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ జోడీ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) తొలి రౌండ్లోనే నిష్కమించింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (1/7), 6–4, 8–10తో సాండర్ జిలీ–జొరాన్ వ్లిజెన్ (బెల్జియం) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట నాలుగు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి రౌండ్లో ఓడిన బోపన్న–ఎబ్డెన్ జంటకు 18,640 డాలర్ల (రూ. 15 లక్షల 42 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
రన్నరప్‌గా నిలిచిన అనిరుధ్-విజయ్ సుందర్ జోడీ
ఫ్రాన్స్‌లో జరిగిన క్వింపెర్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో అనిరుద్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీ 6–7 (4/7), 3–6తో గినార్డ్–రిండెర్నెచ్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో ఓడిపోయింది. గతవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అనిరుద్–విజయ్ జంట ‘వైల్డ్ కార్డు’తో మెయిన్ ‘డ్రా’లో పోటీపడి తొలి రౌండ్లో నిష్క్రమించింది. -
దిగ్గజాలకు సైతం ముచ్చెమటలు పట్టించిన భారత టెన్నిస్ యోధుడు
1989 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. వరల్డ్ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ మాట్స్ విలాండర్ మరోసారి ఫేవరెట్‌గా బరిలో నిలిచాడు. తొలి రౌండ్లో గెలిచి ముందంజ వేసిన విలాండర్ ముందుకు దూసుకుపోవడంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఎప్పటిలాగే రెండో రౌండ్ మ్యాచ్‌కి అతను సిద్ధమయ్యాడు. ఎదురుగా భారత్‌కి చెందిన రమేశ్ కృష్ణన్ ప్రత్యర్థిగా ఉన్నాడు. విలాండర్తో పోలిస్తే రమేశ్ స్థాయి చాలా చిన్నది. కాబట్టి మ్యాచ్ ఏకపక్షమే అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆ టెన్నిస్ కోర్ట్‌లో చెలరేగిపోయాడు రమేశ్. పవర్ఫుల్ ఆటతో కదం తొక్కిన అతను భారత టెన్నిస్ సింగిల్స్ చరిత్రలో అతి పెద్ద సంచలనాన్ని నమోదు చేశాడు. వరుస సెట్లలో విలాండర్ను చిత్తు చేసి ఔరా అనిపించాడు. అలా దశాబ్దన్నర పాటు సాగిన కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన రమేశ్ భారత టెన్నిస్‌పై తనదైన ముద్ర వేశాడు. తండ్రి బాటలో ఆటను ఎంచుకున్న అతను నాటితరంలో పురుషుల సింగిల్స్‌లో భారత్ తరపున ఏకైక ప్రతినిధిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన దాదాపు దశాబ్ద కాలం వరకు కూడా టెన్నిస్‌లో మన వైపు నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. 1960ల్లో రామనాథన్ కృష్ణన్ రాకతో పరిస్థితి కాస్త మారింది. వింబుల్డన్ బాలుర టైటిల్‌ని గెలిచిన ఆసియా తొలి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న రామనాథన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ నిలకడగా రాణించాడు. 1966లో భారత డేవిస్ కప్ జట్టు మొదటిసారి ఫైనల్ చేరడంలో కూడా ఆయనదే కీలక పాత్ర. ఆయన కొడుకైన రమేశ్ కృష్ణన్ కూడా తండ్రి బాటలోనే టెన్నిస్‌ని ఎంచుకున్నాడు. ఆటపై రమేశ్ ఆసక్తిని చూసిన రామనాథన్ ఎలాంటి ఇబ్బంది రాకుండా సౌకర్యాలు కల్పించి అన్ని రకాలుగా ప్రోత్సహించాడు. దాని ఫలితాలు వెంటనే కనిపించాయి. జూనియర్ స్థాయిలో సత్తా చాటిన రమేశ్ టెన్నిస్‌లో దూసుకుపోయాడు. జూనియర్ గ్రాండ్‌స్లామ్స్‌లో వరుస విజయాలతో తన రాకెట్ పదును చూపించాడు. 1979లో వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ టోర్నీలలో చాంపియన్ గా నిలవడంతో రమేశ్ ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. ఈ ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో కూడా ముందంజ వేసిన రమేశ్ వరల్డ్ నంబర్‌వన్ గా ఎదిగాడు. గ్రాండ్‌స్లామ్‌లోనూ సత్తా చాటి.. జూనియర్ స్థాయిలో మంచి ఫలితాలతో వెలుగులోకి వచ్చిన రమేశ్ సీనియర్ విభాగంలోనూ ఎన్నో ప్రతికూలతలను అధిగమించి చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించాడు. 80వ దశకంలో అంతర్జాతీయ టెన్నిస్ మరింత ఆధునికంగా మారుతూ వచ్చింది. పవర్ గేమ్‌తో పాటు కొత్త తరహా శిక్షణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ సమయంలో యూరోపియన్ సర్క్యూట్‌కి చెందిన ఆటగాళ్లతో పోలిస్తే భారత టెన్నిస్ ఎంతో వెనుకబడి ఉంది. ఇలాంటి స్థితిలోనూ రమేశ్ సింగిల్స్‌లో తన ప్రభావం చూపడం విశేషం. సాధారణ టోర్నీలతో పోలిస్తే గ్రాండ్‌స్లామ్‌లకు మరింత సాధన అవసరమని అతను భావించాడు. కోచ్ హ్యారీ హాప్‌మన్ శిక్షణలో అతని ఆట మరింత పదునెక్కింది. ఈ కోచింగ్‌తో పట్టుదలగా పోటీలకు సిద్ధమైన అతను తన సత్తా చూపించాడు. కెరీర్లో మూడుసార్లు అత్యుత్తమంగా గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 1981, 1987లలో యూఎస్ ఓపెన్ , 1986 వింబుల్డన్ లో చివరి ఎనిమిది మందిలో ఒకడిగా సఫలమయ్యాడు. 1986లో యూఎస్‌లో ఒక చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచిన సమయంలో అప్పుడే కెరీర్ ఆరంభంలో ఉన్న ఆండ్రీ అగస్సీని ఓడించాడు. రమేశ్ కెరీర్లో విలాండర్తో పాటు మరో ఇద్దరు దిగ్గజాలపై సాధించిన విజయాలు ఉన్నాయి. జపాన్, హాంకాంగ్ ఓపెన్లలో అతను జిమ్మీ కానర్స్, ప్యాట్ క్యాష్‌లను ఓడించి సంచలనం సృష్టించాడు. డేవిస్ కప్ విజయాల్లో.. భారత జట్టు తరఫున డేవిస్ కప్ విజయాల్లోనూ రమేశ్ పోషించిన పాత్ర ఎంతో ప్రత్యేకమైంది. 1987లో మన బృందం ఫైనల్‌కి చేరడానికి రమేశ్ ఆటనే ప్రధాన కారణం. తండ్రి రామనాథన్ భారత్‌కి డేవిస్ కప్ ఫైనల్ చేర్చిన 21 ఏళ్ల తర్వాత కొడుకు రమేశ్ నేతృత్వంలో భారత్ మరోసారి తుది పోరుకు అర్హత సాధించడం విశేషం. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో అతని అత్యుత్తమ ఆటే జట్టును ఫైనల్‌కి చేర్చింది. జాన్ ఫిట్జ్గెరాల్డ్పై నాలుగు సెట్ల పోరులో అతను సాధించిన అద్భుతమైన విజయమే జట్టును ముందంజలో నిలిపింది. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డ.. సిడ్నీలో 3–2 తేడాతో ఓడించి ఫైనల్‌కి చేరడం అప్పట్లో పెద్ద వార్తాంశంగా మారింది. ఫైనల్లో మన టీమ్ స్వీడన్ చేతిలో ఓడినా భారత టెన్నిస్ చరిత్రలో ఈ డేవిస్ కప్ విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో అప్పటి కొత్త కుర్రాడు లియాండర్ పేస్‌తో కలసి రమేశ్ డబుల్స్ బరిలోకి దిగగా, ఈ జోడి క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలిగింది. అత్యుత్తమ ర్యాంక్.. రమేశ్ కృష్ణన్ కెరీర్లో సింగిల్స్ విభాగంలో ఎనిమిది ఏటీపీ టైటిల్స్ ఉన్నాయి. దీంతో పాటు మరో 4 చాలెంజర్ టోర్నీలను కూడా అతను గెలుచుకున్నాడు. న్యూయార్క్ (యూఎస్), ఆక్లాండ్, వెల్లింగ్టన్ (న్యూజిలాండ్), టోక్యో (జపాన్ ), హాంకాంగ్, మెట్జ్ (ఫ్రాన్స్), స్టట్గార్ట్ (జర్మనీ), మనీలా (ఫిలిప్పీన్స్).. ఇలా వేర్వేరు దేశాల్లో అతను ట్రోఫీలు గెలవడాన్ని చూస్తే భిన్న వేదికలపై రమేశ్ ప్రదర్శన, రాణించిన తీరు అతని ఆట ప్రత్యేకత ఏమిటో చూపిస్తాయి. రమేశ్ తన కెరీర్లో అత్యుత్తమంగా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానానికి చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో నాడు అతను సాధించిన ఘనత చిన్నదేమీ కాదు. రమేశ్ కృష్ణన్ తర్వాత 2007లో మహిళల సింగిల్స్‌లో సానియా మీర్జా (27వ ర్యాంక్) మాత్రమే దానికి సమీపంగా రాగలిగింది. 1985లో రమేశ్ 23వ ర్యాంక్ సాధించగా, 38 ఏళ్లయినా పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి ఎవరూ దరిదాపుల్లోకి రాలేకపోయారంటే ఆ ఘనత విలువేమిటో అర్థమవుతుంది. కెరీర్లో ఒక దశలో ఆరేళ్ల వ్యవధిలో నాలుగేళ్లు టాప్–50లో కొనసాగిన అతను, వరుసగా పదేళ్ల పాటు టాప్–100లోనే ఉండటం విశేషం. భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న రమేశ్ కృష్ణన్ ఇప్పుడు తన స్వస్థలం చెన్నైలోనే టెన్నిస్ అకాడమీ నెలకొల్పి కోచ్‌గా ఆటగాళ్లను తయారు చేస్తున్నాడు. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న సుమీత్ నగాల్
ఏటీపీ చాలెంజర్ యూరోపియన్ క్లే సీజన్లో భారత ఆటగాడు సుమీత్ నగాల్ జోరు కొనసాగుతోంది. రోమ్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో నగాల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీస్‌లో ప్రపంచ 347వ ర్యాంకర్ నగాల్ 2–6, 7–5, 6–4 స్కోరుతో 198వ ర్యాంకర్ జోరిస్ డి లూర్ (బెల్జియం)పై విజయం సాధించాడు. 2 గంటల 31 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. ఫైనల్లో జెస్పర్ డి జోంగ్ (నెదర్లాండ్స్)తో నగాల్ తలపడతాడు. ఇక్కడ విజయం సాధిస్తే యూరోపియన్ క్లే పై ఏటీపీ చాలెంజర్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు. నగాల్ ఇప్పటి వరకు కెరీర్లో 3 ఏటీపీ చాలెంజర్ టోర్నీలు సాధించాడు. -
Rome Challenger: సెమీఫైనల్లో సుమిత్ నగాల్
రోమ్ గార్డెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ప్లేయర్ సుమిత్ నగాల్ వరుసగా మూడో విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. రోమ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సుమిత్ 7-5, 6-0తో మాక్స్ హూక్స్ (నెదర్లాండ్స్)పై గెలుపొందాడు. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. -
టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై.. భావోద్వేగ పోస్ట్
మెల్బోర్న్: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ ఓపెన్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో భావోద్వేగపు లేఖను ‘లైఫ్ అప్డేట్’ అనే క్యాప్షన్‌తో పంచుకుంది. మూడు పేజీల ఈ లేఖలో తన 30 ఏళ్ల రాకెట్ పయనాన్ని, చివరి గమ్యాన్ని వివరించింది. ‘నా గ్రాండ్‌స్లామ్ ప్రయాణం 2005లో ఆ్రస్టేలియన్ ఓపెన్‌తోనే మొదలైంది. ఇప్పుడు గ్రాండ్‌స్లామ్ ఆట కూడా అక్కడే ముగించేందుకు సరైన వేదిక అనుకుంటున్నా. 18 ఏళ్ల క్రితం ఎక్కడైతే ఆరంభించానో అక్కడే ఆపేయబోతున్నా. ఇక కెరీర్లో చివరి టోర్నీ మాత్రం దుబాయ్ ఓపెన్. ఫిబ్రవరిలో ఈ టోరీ్నతో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాను. ఇన్నేళ్ల పయనంలో ఎన్నో ఆటుపోట్లే కాదు మరెన్నో మధురస్మృతులూ ఉన్నాయి’ అని అందులో పేర్కొంది. నాసర్ స్కూల్‌కు చెందిన ఆరేళ్ల బాలిక ఎలా టెన్నిస్ నేర్చుకుంది... తన కలలకు ఎక్కడ బీజం పడింది... అన్నింటికీ మించి దేశానికి ప్రాతినిధ్యం ఎలాంటి స్ఫూర్తినిచ్చిందో ఆ లేఖలో చెప్పుకొచ్చింది. అర్ధ సెంచరీని దాటిన తన గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో గెలిచిన కొన్ని టైటిళ్లు దేవుడిచ్చిన వరమంది. ‘నా సుదీర్ఘ కెరీర్లో దేశానికి పతకాలు తేవడమే అతిపెద్ద గౌరవంగా భావిస్తాను. పతకం నా మెడలో పడినపుడు జాతీయ పతాకం రెపరెపలాడినపుడు కలిగే ఆనందం అన్నింటికి మించి ఉంటుంది. ఇప్పుడు దీన్ని తలచుకొని రిటైర్మెంట్ సందేశం రాస్తున్నప్పుడు చెరిగిపోని ఆ అనుభూతి నా కళ్లను చెమరుస్తోంది’ అని 36 ఏళ్ల సానియా పేర్కొంది. ఇదిలా ఉంటే, మహిళల డబుల్స్‌లో మాజీ నెంబర్ వన్ అయిన 36 ఏళ్ల సానియా మీర్జా.. డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను, అలాగే మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్‌ను గెలిచింది. 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్లో ఓడిన సానియా జంట తృటిలో పతకం చేజార్చుకుంది. Life update :) pic.twitter.com/bZhM89GXga — Sania Mirza (@MirzaSania) January 13, 2023 -
సుమిత్‌కు భలే చాన్సులే!
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్‌కు భలే అవకాశం దక్కింది. టోక్యో ఒలింపిక్స్‌లో అతనికి సింగిల్స్ విభాగంలో బెర్త్ దక్కింది. కరోనా భయాందోళనలు, ఆంక్షల నేపథ్యంలో చాలామంది ఆటగాళ్లు ప్రతిష్టాత్మక విశ్వక్రీడల నుంచి తప్పుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ‘విత్‌డ్రా’లు ఉండటంతో అనూహ్యంగా లోయర్ ర్యాంక్‌లో ఉన్న నగాల్‌కు ‘టోక్యో’ స్వాగతం చెప్పింది. కటాఫ్ తేదీ జూన్ 14 నాటికి సుమిత్ ర్యాంక్ 144. ఇతని కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న యూకీ బాంబ్రీ (127) గాయంతో తప్పుకున్నాడు. కటాఫ్ తేదీ వరకు 148వ ర్యాంక్‌లో ఉన్న ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కూడా ఆశల పల్లకిలో ఉన్నాడు. ‘అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నగాల్ బెర్త్‌ను ఖరారు చేసింది. ఆడేందుకు నగాల్ కూడా ‘సై’ అనడంతో అక్రిడేషన్, తదితర ఏర్పాట్ల కోసం వెంటనే మేం భారత ఒలింపిక్ సంఘానికి సమాచారమిచ్చాం’ అని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) కార్యదర్శి అనిల్ ధూపర్ తెలిపారు. సింగిల్స్‌లో సుమిత్ ఆడనుండటంతో పురుషుల డబుల్స్‌లో, మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడీలు బరిలో ఉండే అవకాశాలు పెరిగాయి. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్నతో సుమిత్ జత కట్టవచ్చు. ఒకవేళ బోపన్న ఎంట్రీ కూడా ఖరారైతే మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో బోపన్న, సుమిత్లలో ఒకరు కలసి ఆడే అవకాశముంది. సియోల్–1988 ఒలింపిక్స్‌లో తొలిసారి టెన్నిస్‌ను ప్రవేశపెట్టాక భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో బరిలోకి దిగనున్న ఏడో ప్లేయర్ సుమిత్ నగాల్. గతంలో విజయ్ అమృత్‌రాజ్, జీషాన్ అలీ (1988), రమేశ్కృష్ణన్ (1992), లియాండర్ పేస్ (1992, 1996, 2000), విష్ణువర్ధన్, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (2012) ఈ ఘనత సాధించారు. -
రెండో రౌండ్లో నాగల్
చెన్నై: సొంతగడ్డపై భారత టెన్నిస్ ఆటగాళ్లు శుభారంభం చేశారు. చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సుమీత్ నాగల్, విజయ్ సుందర్ ప్రశాంత్, అర్జున్ ఖడే తమ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. విజయ్ సుందర్ 6–2, 2–6, 6–2తో కార్లోస్ బొలుడా (స్పెయిన్)పై, అర్జున్ ఖడే 6–4, 6–1తో ఇవాన్ నెడెల్కో (రష్యా)పై విజయం సాధించగా... సుమీత్ నాగల్ 6–3, 6–2తో డేవిడ్ పెరెజ్ (స్పెయిన్)ను ఓడించాడు. రెండో రౌండ్లో సాకేత్ మైనేనితో ప్రశాంత్ తలపడతాడు. ఇతర భారత ఆటగాళ్లు అభినవ్ సంజీవ్, దక్షిణేశ్వర్ సురేశ్, సిద్ధార్థ్ రావత్ తొలి రౌండ్లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు -
ఇద్దరూ చేతులెత్తేశారు
కోల్‌కతా: భారత టెన్నిస్ బృందం వ్యూహం పని చేయలేదు. క్లే, హార్డ్ కోర్టులపై అద్భుతంగా ఆడే ఇటలీ ఆటగాళ్లకు అంతగా అలవాటు లేని పచ్చిక కోర్టులను మ్యాచ్‌ల కోసం ఎంచుకున్నా మనకు కలిసి రాలేదు. డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లకు ఓటమి తప్పలేదు. రామ్‌కుమార్ రామనాథన్ 71 నిమిషాల్లో ఆండ్రియా సెప్పి చేతిలో... ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 57 నిమిషాల్లో మాటియో బెరెటిని చేతిలో ఓడిపోయారు. ఫలితంగా తొలి రోజే ఇటలీ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. నేడు జరిగే డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్‌లలో ఒక దాంట్లోనైనా నెగ్గితే ఇటలీ ఈ ఏడాది నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నీకి బెర్త్ ఖాయం చేసుకుంటుంది. ఆతిథ్య భారత్ మాత్రం ఫైనల్స్‌కు చేరాలంటే మూడు మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ ఆండ్రియా సెప్పి 6–4, 6–2తో ప్రపంచ 129వ ర్యాంకర్ రామ్‌కుమార్‌ను ఓడించి ఇటలీకి 1–0 ఆధిక్యాన్ని అందించాడు. రామ్‌కుమార్ ఎనిమిది ఏస్‌లు సంధించినా, ఆరు డబుల్ ఫాల్ట్‌లు కూడా చేశాడు. నెట్ వద్దకు 24సార్లు దూసుకొచ్చిన రామ్‌కుమార్ ఆరుసార్లు మాత్రమే పాయింట్లు గెలిచాడు. 25 అనవసర తప్పిదాలు చేసిన అతను సెప్పి సర్వీస్‌ను బ్రేక్ చేసేందుకు రెండుసార్లు అవకాశాలు సృష్టించుకున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేదు. మరోవైపు సెప్పి మూడుసార్లు రామ్‌కుమార్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 102వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 4–6, 3–6తో ప్రపంచ 50వ ర్యాంకర్, డేవిస్ కప్‌లో తొలిసారి ఆడుతున్న మాటియో బెరెటిని చేతిలో ఓటమి చవిచూశాడు. ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో ఆడిన ప్రజ్నేశ్ డేవిస్ కప్‌లో మాత్రం తడబడ్డాడు. మ్యాచ్ మొత్తం లో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయిన ప్రజ్నేశ్ ప్రత్యర్థి సర్వీస్‌లో ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశాన్ని దక్కించుకోలేదు. అయితే.. ప్రజ్నేశ్ తన సర్వీస్‌ను మాత్రం మూడుసార్లు కోల్పోయాడు. ‘నేడు జరిగే మూడు మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం. ఈ మూడింట్లో గెలిస్తేనే ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధిస్తామన్న సంగతి తెలుసు. ఇటలీలాంటి మేటి జట్టుతో ఆడే సమయంలో అందివచ్చిన అవకాశా లను అనుకూలంగా మల్చుకోవాలి. అలా చేయకపోతే మూల్యం చెల్లించుకుంటాం. భారత ఆటగాళ్ల విషయంలో అదే జరిగింది’ అని భారత నాన్ ప్లే యింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి వ్యాఖ్యానించాడు. -
విజేత బోపన్న–దివిజ్ జంట
పుణే: ప్రొఫెషనల్ సర్క్యూట్లో జతకట్టిన తొలిసారే భారత టెన్నిస్ డబుల్స్ స్టార్స్ రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంట టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. శనివారం ముగిసిన టాటా ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ బోపన్న–దివిజ్ జోడీ విజేతగా నిలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–దివిజ్ ద్వయం 6–3, 6–4తో ల్యూక్ బాంబ్రిడ్జ్–జానీ ఒమారా (బ్రిటన్) జోడీపై గెలిచింది. భారత జంట మూడు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. బోపన్న కెరీర్లో ఇది 18వ డబుల్స్ టైటిల్‌కాగా... దివిజ్ శరణ్‌కు నాలుగోది. స్వదేశంలో మాత్రం దివిజ్‌కిదే తొలి టైటిల్ కావడం విశేషం. టైటిల్ నెగ్గిన బోపన్న–దివిజ్ జంటకు 29,860 డాలర్ల (రూ. 20 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో ఈ భారత జంట క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్‌లో మారథాన్ సూపర్ టైబ్రేక్‌లలో విజయం సాధించింది. పేస్–వరేలాలతో క్వార్టర్స్ మ్యాచ్‌లో మూడో సెట్‌ను 17–15తో... బోలెలీ–డోడిగ్‌లతో జరిగిన సెమీస్‌లో 15–13తో భారత జంట గెలిచింది. తాజా విజయం వచ్చే వారం మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు ముందు కావాల్సినంత ఆత్మ విశ్వాసం ఇచ్చిందని 38 ఏళ్ల బోపన్న వ్యాఖ్యానించాడు. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో బోపన్న–దివిజ్ జంట స్వర్ణ పతకం నెగ్గిన అనంతరం 2020 టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ప్రొఫెషనల్ సర్క్యూట్‌లోనూ జతకలిసి ఆడాలని నిర్ణయం తీసుకున్నారు. -
పేస్ జంటకు టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్ టూర్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. సాంటో డొమింగో ఓపెన్‌లో పేస్–వరేలా (మెక్సికో) జోడీ విజేతగా నిలిచింది. డొమినికన్ రిపబ్లిక్లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ పేస్–వరేలా జంట 4–6, 6–3, 10–5తో బెహర్ (ఉరుగ్వే)–రొబెర్టో (ఈక్వెడార్) ద్వయంపై గెలిచి టైటిల్ సాధించింది. ఈ టైటిల్‌తో 110 ర్యాంకింగ్ పాయింట్లతో పాటు రూ. 5.70 లక్షల ప్రైజ్‌మనీ పేస్ ఖాతాలో చేరింది. 45 ఏళ్ల పేస్ వరేలాతో కలిసి గతవారం మాంట్రీ చాలెంజర్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. -
తొలి రౌండ్లోనే బోపన్న జంట ఓటమి
న్యూఢిల్లీ: షాంఘై మాస్టర్స్ ఏటీపీ టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌లో బరిలోకి దిగిన బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం తొలి రౌండ్లో... దివిజ్ శరణ్ (భారత్)– సితాక్ (న్యూజిలాండ్) జోడీ రెండో రౌండ్లో ఓటమి చవిచూశాయి. బోపన్న–వాసెలిన్ జంట 6–7 (4/7), 4–6తో మెక్లాచ్లాన్ (జపాన్)–స్ట్రఫ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. కుబోట్ (పోలాండ్)–మెలో (బ్రెజిల్) జంట 6–3, 6–4తో దివిజ్–సితాక్ ద్వయంపై గెలిచింది. దివిజ్–సితాక్ జంటకు 27,450 డాలర్లు (రూ. 20 లక్షల 37 వేలు), బోపన్న–వాసెలిన్ జోడీకి 14,480 డాలర్లు (రూ. 10 లక్షల 74 వేలు ) ప్రైజ్‌మనీగా లభించాయి. -
సౌజన్యకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలోని యానింగ్ నగరంలో జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సౌజన్య (భారత్)–డాన్ ని వాంగ్ (చైనా) ద్వయం 7–6 (7/4), 7–5తో మూడో సీడ్ ఐసువాన్ చో–యి సెన్ చో (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది. 24 ఏళ్ల సౌజన్యకిది కెరీర్లో ఎనిమిదో ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్. 2015లో రిషిక సుంకరతో కలిసి నాసిక్ ఐటీఎఫ్ టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచిన తర్వాత సౌజన్య నెగ్గిన మరో టైటిల్ ఇదే కావడం గమనార్హం. -
సిటీ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు దివిజ్ శరణ్ జోడీ
భారత టెన్నిస్ అగ్రశ్రేణి డబుల్స్ ప్లేయర్ దివిజ్ శరణ్ సిటీ ఓపెన్ ఏటీపీ–500 టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. వాషింగ్టన్లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో శరణ్–అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జోడీ 7–5, 7–6 (8/6)తో ఇల్యా ఇవాష్క (బెలారస్)–డానిల్ మెద్వెదేవ్ (రష్యా) ద్వయంపై విజయం సాధించింది. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–జేమ్స్ సెరెటాని (అమెరికా)లతో శరణ్–సితాక్ తలపడతారు. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) 3–6, 3–6తో క్రుగెర్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. -
రన్నరప్ జీవన్ జంట
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ యువ ఆటగాడు జీవన్ నెదున్‌చెజియాన్ వరుసగా రెండో అంతర్జాతీయ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. అమెరికాలో జరిగిన సవన్నా ఏటీపీ చాలెంజర్ టోర్నీలో జీవన్–ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్) జంట ఫైనల్లో ఓడిపోయింది. లూక్ బామ్‌బ్రిడ్జ్ (బ్రిటన్)–అకీరా సాంటిలన్ (ఆస్ట్రేలియా) ద్వయంతో జరిగిన ఫైనల్లో జీవన్–ఎన్రిక్ జోడీ 2–6, 2–6తో పరాజయం పాలైంది. రన్నరప్‌గా నిలిచిన జీవన్–ఎన్రిక్లకు 2,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 81 వేలు)తోపాటు 48 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతవారం తలాసీ ఓపెన్ టోర్నీలోనూ జీవన్–ఎన్రిక్ జోడీ ఫైనల్లో ఓడిపోయింది. -
విభేదాలతో అనర్థమే!
న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌లో డబుల్స్ భాగస్వామ్యం ఈ మధ్య సమస్యగా మారింది. పేస్‌తో జోడీ కట్టేందుకు బోపన్న నిరాకరిస్తుండటంతో ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లలో ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయి. దీనిపై టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ మాట్లాడుతూ ఇది ఒక్క డబుల్స్‌కే పరిమితం కాదని... సింగిల్స్‌కూ వర్తిస్తుందన్నారు. సీజన్ మొత్తం జరిగే ఏటీపీ టూర్లలో ఆటగాళ్ల మధ్య కలివిడితనం, కలుపుగోలు లక్షణాలు ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ‘డబుల్స్ జోడీల సమస్య సరే. నా వరకైతే అది రెండో ప్రాధాన్యాంశం. ముందుగా మాట్లాడాల్సింది సింగిల్స్ గురించే! ఎందుకంటే డేవిస్ కప్‌లో నాలుగు సింగిల్స్ మ్యాచ్‌లుంటాయి. మన లక్ష్యం వరల్డ్ గ్రూప్ బెర్తు. అక్కడికి అర్హత సాధించాలంటే మనవాళ్లంతా సింగిల్స్‌లో టాప్–50 ఆటగాళ్లుగా ఎదగాలి. ఇలాంటి పరిస్థితి ఉందా. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) కానీ, ఆటగాళ్లు కానీ ఎవరికి వారుంటే ఏం లాభం. నిజానికి... ఎవరు కూడా సింగిల్స్ లేదంటే డబుల్స్ స్పెషలిస్టు ఆటగాడినవుతానని టెన్నిస్ నేర్చుకోరు. కానీ భారత్ డబుల్స్‌లోనే పటిష్టం. దీన్ని కాదనలేం. అయితే సింగిల్స్‌ను, డబుల్స్‌ను సమదృష్టితో చూస్తేనే మరిన్ని మంచి ఫలితాల్ని ఆశించవచ్చు. దీని కోసం అందరు కలిసిపోవాలి. తమ అనుభవాల్ని, నైపుణ్యాన్ని ఒకరికొకరు పంచుకోవాలి’ అని విజయ్ అమృత్‌రాజ్ అన్నారు. -
తండ్రీ కొడుకుల తడాఖా
సాక్షి, హైదరాబాద్: ఇండియా టెన్నిస్ లీగ్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన తండ్రీకొడుకులు సత్తా చాటారు. వీరిద్దరూ జంటగా బరిలోకి దిగి డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్‌లోని కల్లూర్ టెన్నిస్ అకాడమీలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో కేవీఎన్ మూర్తి–కె. పరేశ్ జంట టాప్ సీడ్ సూర్య పవన్–ఎర్రన్ సాయి జోడీపై గెలుపొంది విజేతగా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో 35+, 45+ వయో విభాగంలో సత్తా చాటుతోన్న కేవీఎన్ మూర్తి 30 ఏళ్ల వయస్సులో ఆటవిడుపుగా టెన్నిస్‌పై మక్కువ పెంచుకున్నాడు. తర్వాత ఈ క్రీడలో రాణిస్తూ 2017లో జరిగిన నేపాల్ ఐటీఎఫ్ సీనియర్ (45+) చాంపియన్ షిప్లో డబుల్స్ విజేతగా నిలవడంతో పాటు, సింగిల్స్ రన్నరప్ టైటిల్‌ను సాధించాడు. థాయ్‌లాండ్‌లో జరిగిన పట్టాయా టెన్నిస్ సీనియర్ సిరీస్‌లోనూ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఇవే కాకుండా పలు ఐటా సీనియర్ ర్యాంకింగ్ టోర్నీల్లో పతకాలను సాధించాడు. -
జీవన్ జంటకు డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ప్లేయర్ జీవన్ నెదున్‌చెజియాన్ తన కెరీర్లో ఐదో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. అమెరికాలో జరిగిన డాలస్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో క్రిస్టోఫర్ రుంగ్‌కాట్ (ఇండోనేసియా)తో కలిసి జీవన్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జీవన్–రుంగ్‌కాట్ జంట 6–4, 3–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో లియాండర్ పేస్ (భారత్)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. టైటిల్ నెగ్గిన జీవన్ జంటకు 4,650 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీ, 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
గిట్టనివారే ఓర్వలేకపోతున్నారు
లియాండర్ పేస్ వ్యాఖ్య న్యూఢిల్లీ: కొందరు గిట్టని సహచరులే తనను అదేపనిగా విమర్శిస్తున్నారని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తెలిపాడు. ‘నా కెరీర్ ఏంటో నాకు తెలుసు, నేను సాధించిన ఘనతలు అందరికీ తెలుసు. కానీ ఇవేవీ నేనంటే గిట్టని సహచరులకు తెలియవు. 18 గ్రాండ్‌స్లామ్ (డబుల్స్, మిక్స్డ్) టైటిళ్లు, ఏడుసార్లు ఒలింపిక్స్ ఆడిన ఘనత వారికి కనిపించవు. వాళ్లు పది జన్మలెత్తినా ఈ ఘనతల్ని సాధించలేరు. ఇలాంటివారు టెన్నిస్ కోర్టుల్లో చెమటోడ్చలేరు కానీ విమర్శించేందుకు మాత్రం తహతహలాడుతున్నారు’ అని పేస్ అన్నాడు. -
పేస్పై సానియా తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌లో వివాదం ముదురుతోంది. గత రెండు ఒలింపిక్స్‌కు డబుల్స్ జోడీల ఎంపికపై భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ చేసిన విమర్శలపై హైదరాబాదీ సానియా మీర్జా తీవ్రంగా స్పందించింది. పేస్ పేరును ప్రస్తావించకుండా ఓ విషపురుగు అంటూ విమర్శించింది. సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడమని పరోక్షంగా పేస్‌ను ఉద్దేశించి సానియా ట్వీట్ చేసింది. గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్‌లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని పేస్ వ్యాఖ్యానించాడు. రియో, గత లండన్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మేటి డబుల్స్ జంటను పంపలేదని, దీనివల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు. ఈ ఒలింపిక్స్‌లో మంచి మిక్స్డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నామని అన్నాడు. సానియ, రోహన్ బోపన్నను ఎంపిక చేయడాన్ని తప్పుపట్టాడు.