టెన్నిస్ ప్లేయర్ జీవన్ నెదున్‌చెజియాన్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ప్లేయర్ జీవన్ నెదున్‌చెజియాన్ తన కెరీర్‌లో ఐదో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. అమెరికాలో జరిగిన డాలస్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో క్రిస్టోఫర్ రుంగ్‌కాట్ (ఇండోనేసియా)తో కలిసి జీవన్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జీవన్–రుంగ్‌కాట్ జంట 6–4, 3–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో లియాండర్ పేస్ (భారత్)–జో సాలిస్‌బరీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. టైటిల్ నెగ్గిన జీవన్ జంటకు 4,650 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీ, 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment