లియాండర్ పేస్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కొత్త ఏడాదిలో తొలి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా తన కెరీర్‌లో 25వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అమెరికాలో జరిగిన న్యూపోర్ట్ బీచ్ ఓపెన్ టోర్నీలో తన భాగస్వామి జేమ్స్ సెరిటాని (అమెరికా)తో కలిసి పేస్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో పేస్–సెరిటాని ద్వయం 6–4, 7–5తో డెనిస్ కుడ్లా (అమెరికా)–ట్రీట్ హుయ్ (ఫిలిప్పీన్స్) జంటపై గెలుపొందింది. ప్రస్తుతం ప్రపంచ 61వ ర్యాంకులో ఉన్న పేస్ ఈ విజయంతో 125 పాయింట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరడం ద్వారా 90 పాయింట్లు పొందాడు. వీటితో నేడు విడుదల కానున్న ర్యాంకింగ్స్‌లో పేస్‌కు టాప్–50 లో చోటు దక్కే అవకాశం ఉంది. పేస్ ఇప్పటివరకు చాలెంజర్ టూర్‌లలో 11 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment