ATP challenger doubles
-
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో రిత్విక్ చౌదరీ, యూకీ బాంబ్రీ
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 24 ఏళ్ల రిత్విక్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 65వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సాంటియాగోలో జరిగిన చిలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలో కొలంబియాకు చెందిన నికోలస్ బరియెంతోస్తో కలిసి ఆడిన రిత్విక్ డబుల్స్ టైటిల్ గెలిచాడు.దాంతో అతని ర్యాంక్ మెరుగైంది. మరోవైపు భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ కూడా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)తో కలిసి దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో యూకీ డబుల్స్ టైటిల్ గెలిచాడు. ఫలితంగా తాజా ర్యాంకింగ్స్‌లో యూకీ ఐదు స్థానాలు పురోగతి సాధించి 39వ ర్యాంక్‌లో నిలిచాడు. భారత దిగ్గజం రోహన్ బోపన్న ఒక స్థానం మెరుగుపర్చుకొని 21వ ర్యాంక్‌లో ఉన్నాడు.మెక్సికోలో జరిగిన అకాపుల్కో ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలోసెమీఫైనల్ చేరుకున్న భారత ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ మరోసారి కెరీర్ బెస్ట్ 61వ స్థానానికి చేరుకున్నాడు. భారత ఇతర ప్లేయర్లు అర్జున్ ఖడే 87వ స్థానంలో, జీవన్ నెడుంజెళియన్ 93వ స్థానంలో ఉన్నారు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టోర్నిలో డబుల్స్ టైటిల్ సాధించిన హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఏకంగా 30 స్థానాలు మెరుగుపర్చుకొని 109వ ర్యాంక్‌లో నిలిచాడు. రామ్‌కుమార్ రామనాథన్ 19 స్థానాలు ఎగబాకి 167వ ర్యాంక్‌లో, సాకేత్ మైనేని 24 స్థానాలు పురోగతి సాధించి 220వ ర్యాంక్‌లో నిలిచారు. -
Maha Open 2025: జీవన్–విజయ్ జోడీకి టైటిల్
పుణే: మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో జీవన్–విజయ్ జంట 3–6, 6–3, 10–0తో రెండో సీడ్ బ్లేక్ బేల్డన్–మాథ్యూ క్రిస్టోఫర్ (ఆ్రస్టేలియా) ద్వయంపై విజయం సాధించింది. జీవన్–విజయ్ జోడీకి సంయుక్తంగా ఇదే తొలి టైటిల్ కాగా... విజయ్ సుందర్ పుణేలో మూడో సారి విజేతగా నిలిచాడు. తొలి సెట్లో పరాజయం పాలైన భారత జంట ఆ తర్వాత ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. 2 ఏస్‌లు సంధించిన జీవన్–విజయ్ జోడీ... 3 డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఈ విజయంతో రూ. 7 లక్షల నగదు బహుమతితో పాటు 100 ర్యాంకింగ్స్ పాయింట్లు భారత ప్లేయర్ల ఖాతాలో చేరాయి. దీంతో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో జీవన్ 94వ స్థానానికి, విజయ్ 104వ ర్యాంక్‌కు చేరనున్నారు. -
సాకేత్–యూకీ జోడీ ఖాతాలో నాలుగో టైటిల్
అమెరికాలో జరిగిన లెక్సింగ్టన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ 3–6, 6–4, 10–8తోబ్రువెర్ (నెదర్లాండ్స్)–మెకగ్ (బ్రిటన్)లపై నెగ్గారు. ఈ ఏడాది సాకేత్–యూకీకిది నాలుగో ఏటీపీ చాలెంజర్ టైటిల్. విజేతగా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 46 వేలు) లభించింది. -
సాకేత్ జంటకు టైటిల్.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్లో 11వ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. చెక్ రిపబ్లిక్‌లోని ప్రోస్తెజోవ్ పట్టణంలో శుక్రవారం జరిగిన చెక్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ 6–3, 7–5తో రెండో సీడ్ రోమన్ జెబవీ (చెక్ రిపబ్లిక్)–ఆంద్రెజ్ మార్టిన్ (స్లొవేకియా) జంటపై నెగ్గింది. సెమీఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–4, 6–4తో టాప్ సీడ్ ఎర్లెర్–మెడ్లెర్ (ఆస్ట్రియా) జంటను... క్వార్టర్ ఫైనల్లో 7–6 (7/4), 3–6, 13–11తో మూడో సీడ్ మొల్చ నోవ్ (ఉక్రెయిన్)–ఫ్రాంకో స్కుగోర్ (క్రొయే షియా) జోడీని ఓడించడం విశేషం. విజేతగా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 5,250 యూరో ల (రూ. 4 లక్షల 37 వేలు) ప్రైజ్‌మనీ తోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: French Open: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం -
ఫైనల్లో దివిజ్ శరణ్ జంట
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత డబుల్స్ స్టార్ ప్లేయర్ దివిజ్ శరణ్ తన భాగస్వామి మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్)తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో దివిజ్–మార్సెలో ద్వయం 6–3, 3–6, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా)–మ్యాట్ పావిక్ (క్రొయేషియా) జోడీపై విజయం సాధించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దివిజ్ జంట రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసినా కీలకదశలో పాయింట్లు గెలవడంలో సఫలమైంది. తొలి సెట్లో ఒకసారి ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేసిన దివిజ్ జంట... రెండో సెట్లో తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో మాత్రం దివిజ్ ద్వయం ఒక్కసారిగా విజృంభించి 9–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి ఆ తర్వాత విజయానికి అవసరమైన ఒక పాయింట్‌ను నెగ్గి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. దివిజ్ కెరీర్లో ఏటీపీ టోర్నీలో ఫైనల్ చేరడం ఇది ఆరోసారి. నాలుగు డబుల్స్ టైటిల్స్ నెగ్గిన అతను, మరోసారి రన్నరప్‌గా నిలిచాడు. -
రన్నరప్ పేస్ జంట
న్యూఢిల్లీ: ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు నిరాశ ఎదురైంది. ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన ఓపెన్ బ్రెస్ట్ క్రెడిట్ అగ్రికోల్ టోర్నీలో పేస్–వరేలా (మెక్సికో) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో పేస్–వరేలా జోడీ 6–3, 4–6, 2–10తో శాండర్–వీజెన్ (బెల్జియం) జంట చేతిలో ఓడింది. రన్నరప్‌గా నిలిచిన పేస్ జోడీకి 3,820 యూరోలు (రూ. 3 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. యూపీ యోధ గెలుపు పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌లో రైడర్లు శ్రీకాంత్, ప్రశాంత్ కుమార్ చెలరేగడంతో యూపీ యోధ జట్టు మూడో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో యూపీ యో«ధ 38–36తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. విజేత జట్టు తరఫున శ్రీకాంత్ 12, ప్రశాంత్ 11 రైడ్ పాయింట్లు సాధించారు. ట్యాక్లింగ్‌లో నితీశ్ కుమార్ (4 పాయింట్లు) రాణించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 43–32తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. నేడు విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యచ్‌ల్లో పుణేరీ పల్టన్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
జీవన్ జంటకు డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ప్లేయర్ జీవన్ నెదున్‌చెజియాన్ తన కెరీర్లో ఐదో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. అమెరికాలో జరిగిన డాలస్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో క్రిస్టోఫర్ రుంగ్‌కాట్ (ఇండోనేసియా)తో కలిసి జీవన్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జీవన్–రుంగ్‌కాట్ జంట 6–4, 3–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో లియాండర్ పేస్ (భారత్)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. టైటిల్ నెగ్గిన జీవన్ జంటకు 4,650 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీ, 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
పేస్ ఖాతాలో మరో టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కొత్త ఏడాదిలో తొలి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా తన కెరీర్లో 25వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అమెరికాలో జరిగిన న్యూపోర్ట్ బీచ్ ఓపెన్ టోర్నీలో తన భాగస్వామి జేమ్స్ సెరిటాని (అమెరికా)తో కలిసి పేస్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో పేస్–సెరిటాని ద్వయం 6–4, 7–5తో డెనిస్ కుడ్లా (అమెరికా)–ట్రీట్ హుయ్ (ఫిలిప్పీన్స్) జంటపై గెలుపొందింది. ప్రస్తుతం ప్రపంచ 61వ ర్యాంకులో ఉన్న పేస్ ఈ విజయంతో 125 పాయింట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరడం ద్వారా 90 పాయింట్లు పొందాడు. వీటితో నేడు విడుదల కానున్న ర్యాంకింగ్స్‌లో పేస్‌కు టాప్–50 లో చోటు దక్కే అవకాశం ఉంది. పేస్ ఇప్పటివరకు చాలెంజర్ టూర్లలో 11 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. -
సాకేత్ జోడికి రెండో డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని వరుసగా రెండో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. తన భాగస్వామి సనమ్ సింగ్‌తో కలిసి గతవారం కోల్‌కతాలో తొలి ఏటీపీ చాలెంజర్ టైటిల్ నెగ్గిన సాకేత్ అదే ఫలితాన్ని ఢిల్లీలోనూ పునరావృతం చేశాడు. శనివారం జరిగిన ఫైనల్లో సాకేత్-సనమ్ ద్వయం 7-6 (7/5), 6-4తో రెండో సీడ్ సంచాయ్ రాటివటానా-సొంచాట్ రాటివటానా (థాయ్‌లాండ్) జోడిని బోల్తా కొట్టించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు రాటివటానా బ్రదర్స్ ఏకంగా ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. విజేతగా నిలిచిన సాకేత్ జోడికి 6,200 డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్లో సోమ్‌దేవ్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో సోమ్‌దేవ్ 6-4, 6-2తో ఎవగెని డాన్స్కాయ్ (రష్యా)పై గెలిచాడు. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్) 4-6, 7-6 (7/3), 6-3తో ఇలిజా బొజాల్‌జాక్ (సెర్బియా)ను ఓడించి సోమ్‌దేవ్‌తో ఆదివారం జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. కెరీర్లో మూడుసార్లు ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన సోమ్‌దేవ్ రెండుసార్లు విజేతగా నిలిచి మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.