రన్నరప్‌ పేస్‌ జంట | Leander Paes loses in doubles final in France | Sakshi

రన్నరప్‌ పేస్‌ జంట

Oct 29 2018 5:33 AM | Updated on Oct 29 2018 5:33 AM

Leander Paes loses in doubles final in France - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌కు నిరాశ ఎదురైంది. ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన ఓపెన్‌ బ్రెస్ట్‌ క్రెడిట్‌ అగ్రికోల్‌ టోర్నీలో పేస్‌–వరేలా (మెక్సికో) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో పేస్‌–వరేలా జోడీ 6–3, 4–6, 2–10తో శాండర్‌–వీజెన్‌ (బెల్జియం) జంట చేతిలో ఓడింది. రన్నరప్‌గా నిలిచిన పేస్‌ జోడీకి 3,820 యూరోలు (రూ. 3 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

యూపీ యోధ గెలుపు
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌లో రైడర్లు శ్రీకాంత్, ప్రశాంత్‌ కుమార్‌ చెలరేగడంతో యూపీ యోధ జట్టు మూడో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో యూపీ యో«ధ 38–36తో దబంగ్‌ ఢిల్లీపై గెలిచింది. విజేత జట్టు తరఫున శ్రీకాంత్‌ 12, ప్రశాంత్‌ 11 రైడ్‌ పాయింట్లు సాధించారు. ట్యాక్లింగ్‌లో నితీశ్‌ కుమార్‌ (4 పాయింట్లు) రాణించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 43–32తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. నేడు విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యచ్‌ల్లో పుణేరీ పల్టన్స్‌తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్, పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement