disappoint
-
నష్టాల్లోకి ఇండిగో
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు వెల్లడించింది. ఏడు త్రైమాసికాల తదుపరి జులై–సెపె్టంబర్(క్యూ2)లో లాభాలను వీడింది. రూ. 986 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అధిక ఇంధన వ్యయాలు, ఇంజిన్ సమస్యలతో కొన్ని విమానాలు నిలిచిపోవడం లాభాలను దెబ్బతీశాయి. విదేశీ మారక ప్రభావాన్ని మినహాయిస్తే రూ. 746 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఇండిగో బ్రాండుతో సరీ్వసులందిస్తున్న కంపెనీ గతేడాది(2023–24) ఇదే కాలంలో నికరంగా రూ. 189 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ. 17,800 కోట్లను తాకింది. ఇంధన వ్యయాలు 13 శాతం పెరిగి రూ. 6,605 కోట్లకు చేరాయి. కొత్త బిజినెస్ క్లాస్: ఢిల్లీ–ముంబై మార్గంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన బిజినెస్ క్లాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. తదుపరి దశలో 40కుపైగా విమానాలను 12 మెట్రో రూట్లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. మరిన్ని విదేశీ రూట్లకు సరీ్వసులను విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఇండిగో ప్రస్తుతం 410 విమానాలను కలిగి ఉంది. వెరసి మొత్తం వ్యయాలు 22 శాతం పెరిగి రూ. 18,666 కోట్లను తాకాయి. 6%అధికంగా 2.78 కోట్ల ప్యాసింజర్లు ప్రయాణించగా.. టికెట్ల ఆదాయం 10 శాతం ఎగసి రూ. 14,359 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్ఈలో 3.5 శాతం క్షీణించి రూ. 4,365 వద్ద ముగిసింది. -
తిండి పెట్టిన వాళ్లకే మొండి చెయ్యి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చే చర్యలు బొత్తిగా లేకపోవడం దేశ ప్రజల్ని నిశ్చేష్టుల్ని చేసింది. కరోనా కష్టకాలంలో దేశ ప్రజలను ఆదుకొన్నది వ్యవసాయ రంగమే. ఈ వాస్తవాన్ని కేంద్రం ఎందుకు విస్మరించిందో అర్థం కాదు. కరోనా దెబ్బకు మిగతా రంగాలు చతికిల పడ్డాయి. రెండేళ్లు దాటినా నేటికీ పలు రంగాలు కోలుకోలేదు. కానీ, వ్యవసాయరంగం మాత్రం యావత్ దేశాన్ని ఆదుకొంది. ప్రజలకు కష్టకాలంలో పట్టెడన్నం పెట్టింది. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించింది. తల్లిలా అందర్నీ ఆదుకొన్న వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో మరింత ఊతం ఇచ్చే చర్యలు ఉంటాయని వేసుకున్న అంచనాలు పూర్తిగా తారు మారయ్యాయి. బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 2021–22లో కేటాయించిన 3.92% నిధులను ఈసారి (2022–23) 3.84%కు కుదించడం శోచనీయం. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చడం, స్టార్టప్‌లపై దృష్టి పెంచడం ఆహ్వానించదగిన చర్యలే. కానీ, కీలకమైన మార్పులు చేయకుండా అరకొర చర్యలతో సరిపెడితే ఉపయోగం ఏముంటుంది? ఆశించిన ఫలితాలెలా వస్తాయి? వరి, గోధుమల సేకరణకు కనీస మద్దతు ధరలు అందించ డంతో పాటు అన్ని పంటలకు కూడా రైతు సంఘాలు కోరినట్లుగా చట్టబద్దమైన మద్దతు ధరలు అందించడానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచి ఉండాల్సింది. ఇప్పటివరకు మొత్తం ఆహార ధాన్యాలలో కేంద్రం సేక రించింది 35 శాతమే. ఒక అంచనా ప్రకారం 2022 మార్చి నాటికి దేశంలోని రైతాంగం వద్ద 65 శాతం ఆహారధాన్యాలను కేంద్రం కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ, కేంద్రం వైఖరి చూస్తోంటే... వరి, గోధుమ మినహా మిగతా పంటలను ప్రైవేటు వ్యాపారులకే అప్పజెప్పేటట్లు కనిపిస్తోంది. ఇక, దేశంలో తృణ ధాన్యాల వాడకం పెరిగిన నేపథ్యంలో 2023వ సంవత్సరాన్ని ‘తృణ ధాన్యాల సంవత్సరం’గా ప్రకటించడాన్ని ఆహ్వానించాల్సిందే. రైతాంగానికి లాభసాటి ధరలు లభించే అవకాశం ఉంది. అయితే, ఈ పంటలపై మరిన్ని పరిశోధనలు చేపట్టడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నిధులు కేటా యించాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నప్పటికీ... ఈ బడ్జె ట్లో కూడా వాటికి నిధులు కేటాయించలేదు. 2022–23ను కేవలం తృణధాన్యాల సంవత్సరంగా నామకరణం చేయడం వల్ల రైతులకు ఒరిగే లాభమేమిటి? ఇక, రసాయనాల వాడకాన్ని నిరుత్సాహపర్చడానికి ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగును ప్రోత్సహిస్తామని బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ అందుకు నిర్దిష్టమైన ప్రతిపాదనలు బడ్జెట్లో కనపడటంలేదు. స్వయంగా ప్రధానమంత్రి ప్రతి పాదించిన పథకాలకు బడ్జెట్లో ప్రోత్సాహకాలు లేకపోవడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వివిధ పథకాలను విలీనం ద్వారా కుదించడం మరో అనాలోచిత చర్య. ఉదాహరణకు ‘పరం పరాగత్ కృషి యోజన’ను ‘రాష్ట్రీయ కృషి యోజన’లో విలీనం చేశారు. మొత్తం 27 పథకాలను 7 పథకాలుగా మార్చారు. సహకార రంగానికి ప్రోత్సాహం ఇస్తామని చెప్పి... దేశంలో విశిష్ట చరిత్ర, ప్రాముఖ్యం ఉన్న పాల ఉత్పత్తి సహకార సంఘాలకు ఇస్తున్న కొన్ని రాయితీలను ఎత్తేయడానికి ఏకంగా పథకాలనే రద్దు చేయడం శోచనీయం. మూడునాలుగేళ్ల క్రితం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పథకంగా అభివర్ణించిన ఫసల్ బీమా పథకం అసలు ఉన్నదో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పథకంలో మార్పులు తెచ్చి రైతులకు ప్రయోజనం కలిగేలా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఈ బడ్జెట్లో నిరాశ కలిగించిన మరో ప్రధానమైన అంశం రైతులకు స్వల్పకాలిక రుణాలపై ఇచ్చే రాయితీ గురించిన ప్రస్తావన లేకపోవడం! ‘మార్పు చేసిన వడ్డీ రాయితీ పథకం’ అంటూ ఓ కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఈ పథకం విధివిధానాలేమిటో భవిష్యత్తులో చూడాల్సి ఉంది. రైతులు, రైతాంగ సంస్థలు జాతీయ స్థాయిలో ఏడాదిపాటు ఉద్యమించి కేంద్రం మెడలు వంచి మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొనేలా చేసినందుకు గాను వారిపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకొన్నట్లుగా ఉందిగానీ, సానుకూల ప్రోత్సాహకాలు కనిపించటంలేదు. రైతులు ఏం పాపం చేశారు? కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి తిండి గింజలు పండించి దేశ ప్రజల ఆకలి తీర్చడమేనా? వ్యవసాయ సంక్షోభాన్ని నివారించి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఈ కేంద్ర బడ్జెట్ లేదు. అయితే... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి కొన్ని రాష్ట్రాలు రైతులను ఆదుకోవడానికి చేపట్టిన ప్రోత్సాహ కాలే వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాయి అనే విషయం కాదన లేని వాస్తవం. కేంద్ర సహకారం తోడై ఉంటే పరిస్థితి మరింత మెరుగై ఉండేది. వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఏపీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి అన్యాయం చేసింది. కరోనాకు ఎదురునిలిచి రైతన్న దేశానికి తిండిపెట్టాడు. అటువంటి మెతుకు దాతకు బడ్జెట్ నిరాశను మిగిల్చింది. వ్యవసాయం, అను బంధ రంగాలకు నిధులను కుదించడం శోచనీయం. స్వయంగా ప్రధాని ప్రతిపాదించిన పథకాలకు బడ్జెట్లో ప్రోత్సహకాలు లేకపోవడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వివిధ పథకాలను విలీనం ద్వారా కుదించడం మరో విమర్శనార్హమైన అంశం. డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -
హెచ్‌పీసీఎల్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 36 శాతం క్షీణించి రూ. 1,795 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,184 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్ మాత్రం 68 శాతం జంప్‌చేసి రూ. 77,586 కోట్లను తాకింది. కాగా.. సామర్థ్య విస్తరణ, ఆధునీకరణ నేపథ్యంలో ముంబై రిఫైనరీ 45 రోజులపాటు పనిచేయలేదని కంపెనీ చైర్మన్, ఎండీ ముకేష్ కుమార్ సురానా పేర్కొన్నారు. దీంతో చమురు శుద్ధి కార్యక్రమాలు 3.97 మిలియన్ టన్నుల నుంచి తగ్గి 2.51 ఎంటీకి పరిమితమైనట్లు వెల్లడించారు. ముంబై రిఫైనరీని 25 శాతమే వినియోగించుకోగా.. వైజాగ్ యూనిట్ 98 శాతం సామర్థ్యంతోనే పనిచేసినట్లు తెలియజేశారు. మార్జిన్లు భేష్... క్యూ1లో హెచ్‌పీసీఎల్ స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) బ్యారల్‌కు 3.31 డాలర్లకు ఎగశాయి. గత క్యూ1లో ఇవి కేవలం 0.04 డాలర్లుగా నమోదయ్యాయి. కాగా.. అమ్మకాల పరిమాణం 7.62 మిలియన్ టన్నుల నుంచి 16 శాతం ఎగసి 8.83 ఎంటీకి చేరింది. ఈ కాలంలో పెట్రోల్ విక్రయాలు 37 శాతం, డీజిల్ 22 శాతం, ఏటీఎఫ్ 119 శాతం చొప్పున వృద్ధి చూపాయి. విస్తరణ తదుపరి ముంబై రిఫైనరీ సామర్థ్యం 7.5 ఎంటీ నుంచి 9.5 ఎంటీకి పెరిగినట్లు సురానా తెలియజేశారు. ప్రధాన పట్టణాలలోని పెట్రోల్ పంప్‌ల వద్ద ఈవీ చార్జింగ్కు వీలుగా టాటా పవర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రస్తావించారు. క్యూ1లో కంపెనీ 142 రిటైల్ ఔట్లెట్లను కొత్తగా ప్రారంభించింది. అదనంగా 50 సీఎన్జీ ఔట్లెట్ల ఏర్పాటుతో వీటి సంఖ్య 724కు చేరింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో 0.65 శాతం నష్టంతో రూ. 273 వద్ద ముగిసింది. -
ట్రంప్ సర్కార్‌పై ఫేస్బుక్ సీఈఓ ఆరోపణలు
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ డొనాల్డ్ ట్రంప్ సర్కార్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనావైరస్ సంక్షోభంపై ట్రంప్ ప్రభుత్వ వైఖరిపై నిరాశను వ్యక్తం చేశారు. కోవిడ్-19 నియంత్రణలో అనేక ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా తీరు ఘోరంగా ఉందన్నారు. ప్రాథమిక నిబంధనల అమలుతో పాటు, సమగ్ర నివారణ చర్యలు తీసుకొని ఉంటే జూలైలో రెండవ దశ కరోనాను నివారించే అవకాశం ఉండేదన్నారు. అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీతో ఇంటర్వ్యూలో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ కరోనా నిర్ధారిత పరీక్షలు ఇప్పటికీ తగినన్ని అందుబాటులో లేకపోవడం నిజంగా నిరాశ కలిగిం చిందన్నారు. ప్రజారోగ్య చర్యలపై శాస్త్రవేత్తల సలహాలను పాటించడం లేదనీ, నిపుణుల హెచ్చరికలను కూడా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. దీంతో దేశంలోని టాప్ సైంటిస్టుల, సీడీసీ విశ్వసనీయత దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో కరోనా కేసుల నమోదు తక్కువ స్థాయిలోఉంటే, అమెరికాలో మాత్రం రోజువారీ రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాంతక వ్యాధి కట్టడిలో అనేక ఇతర దేశాలు తీవ్రంగా కృషి చేసినప్పటికీ, అమెరికా ఈ విషయంలో వెనుకబడిందని వ్యాఖ్యానించారు. భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం లాంటి ఇతర భద్రతా చర్యలు తీసుకోకుండానే చాలా రాష్ట్రాలు నిబంధనల ఎత్తివేతకు, ఆర్థిక కార్యలాపాల పునరుద్ధరణకు తొందరపడ్డాయని డాక్టర్ ఫౌసీ అభిప్రాయపడ్డారు. దీంతో ఆయా రాష్ట్రాలలో వైరస్ రెండవ దశ విజృంభణకు దారితీసిందన్నారు. కాగా కరోనా వైరస్‌పై తన వినియోగదారులకు విశ్వసనీయ సమాచారాన్ని అందించేందుకు పలువురు శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులతో మార్క్ జుకర్ బర్గ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. -
రాష్ట్రం ఆశలు... అడియాసలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పూర్తిస్థాయి బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చే నిధులనుబట్టి పూర్తిస్థాయి బడ్జెట్ పెడదామనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, విజ్ఞప్తులు బుట్టదాఖలయ్యాయి. కనీసం నీతి ఆయోగ్ సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకోకుండానే రాష్ట్రానికి చెందిన ఉపయుక్త ప్రాజెక్టులకు కూడా కేంద్రం నిధులు కేటాయించలేదు. మొత్తం బడ్జెట్లో పన్నుల వాటా కింద రాష్ట్రానికి రూ. 19 వేల కోట్లకుపైగా చూపిన కేంద్రం... ఈసారి కూడా రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. మొత్తంమీద కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఈ బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కాళేశ్వరంపై కరుణ లేదు... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని లేదంటే రూ. 20 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరింది. స్వయంగా సీఎం కేసీఆర్ కూడా ప్రధానిని కలసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన ఆర్థికశాఖ అధికారులు కూడా మరోసారి ఈ ప్రతిపాదనను అధికారికంగా కేంద్రం ముందుంచారు. కానీ 2019–20 బడ్జెట్లో కేంద్రం ఒక్క రూపాయిని కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటాయించలేదు. కాపీ కొట్టారు కానీ కాసులివ్వలేదు... మిషన్ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా జలశక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం.. మన పథకానికి మాత్రం డబ్బులివ్వలేదు. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు అందించే ఈ ప్రాజెక్టుకు రూ. 19,500 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అడుగుతోంది. నీతి ఆయోగ్ కూడా ఈ పథకం అద్భుతమని ప్రశసించి నిధులివ్వాలని కేంద్రానికి సిఫారసు కూడా చేసింది. అయినా నీతి ఆయోగ్ సిఫారసులను, ప్రశంసలను కేంద్రం పట్టించుకోలేదు. మిషన్ కాకతీయ పథకానికి కూడా రూ. 5 వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఈ పథకం గురించి కూడా కేంద్రం పట్టించుకోలేదు. అయినా దేశవ్యాప్తంగా జలశక్తి పథకానికి రూ. 10 వేల కోట్లు ఎలా సరిపోతాయనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఒక్క తెలంగాణలోనే మిషన్ భగీరథకు రూ.40 వేల కోట్లు అవసరం కానుండగా దేశవ్యాప్తంగా రూ.10 వేల కోట్లు ఎలా సరిపోతాయని ఉన్నతస్థాయి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే లైన్లు లాంటి అంశాలను కూడా కేంద్రం పక్కన పడేయడం గమనార్హం. కొత్త పథకాలకు కటకటే...! రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ఏ ఒక్క పథకానికి కూడా కేంద్రం నిధులు కేటాయించకపోవడం రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపనుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు, నెలవారీ సాధారణ ఖర్చులకు రాష్ట్ర ఖజానా నుంచి తీసినా కేంద్ర సాయంతో కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ఈ లెక్కలు తప్పడంతో ఇప్పుడు కొత్త సంక్షేమ పథకాల అమలుకు కటకట ఎదురుకానుంది. ఉద్యోగులకు పీఆర్సీ అమలు, నిరుద్యోగ భృతి లాంటి వాటి అమలుకు ఆర్థిక వెసులుబాటు కష్టమేనని, కొత్త పథకాల అమలులో జాప్యం జరుగుతుందని అధికార వర్గాలంటున్నాయి. -
రన్నరప్ పేస్ జంట
న్యూఢిల్లీ: ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు నిరాశ ఎదురైంది. ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన ఓపెన్ బ్రెస్ట్ క్రెడిట్ అగ్రికోల్ టోర్నీలో పేస్–వరేలా (మెక్సికో) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో పేస్–వరేలా జోడీ 6–3, 4–6, 2–10తో శాండర్–వీజెన్ (బెల్జియం) జంట చేతిలో ఓడింది. రన్నరప్‌గా నిలిచిన పేస్ జోడీకి 3,820 యూరోలు (రూ. 3 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. యూపీ యోధ గెలుపు పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌లో రైడర్లు శ్రీకాంత్, ప్రశాంత్ కుమార్ చెలరేగడంతో యూపీ యోధ జట్టు మూడో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో యూపీ యో«ధ 38–36తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. విజేత జట్టు తరఫున శ్రీకాంత్ 12, ప్రశాంత్ 11 రైడ్ పాయింట్లు సాధించారు. ట్యాక్లింగ్‌లో నితీశ్ కుమార్ (4 పాయింట్లు) రాణించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 43–32తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. నేడు విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యచ్‌ల్లో పుణేరీ పల్టన్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
పన్ను వసూలు పడిపోయింది..
సాక్షి, హైదరాబాద్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు విషయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. జీఎస్టీ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని, రాష్ట్రానికి కనీసం పదివేల కోట్ల రూపాయల పన్నులు సేకరించుకునే ఆస్కారం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలిండియా అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఎక్సై జ్ గెజిటెడ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల 10వ జనరల్ బాడీ సమావేశాన్ని శనివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జీఎస్టీ కారణం గా ఆదాయం రూ.95 వేల కోట్ల నుంచి రూ.85 వేల కోట్ల కు పడిపోయిందన్నారు. జీఎ స్టీ కంటే ముందు రాష్ట్రం లో పన్ను వసూలు వృద్ధి 21.9 శాతముంటే ఇప్పుడు 14 శాతానికి పడిపోయిందన్నారు. నోట్ల రద్దు కారణంగా జీతాలు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించే సంస్కరణలు శాశ్వత ప్రయోజనాల దృష్ట్యా ఉండాలని అభిప్రాయపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోతే ఆ మాత్రం పన్నులు కూడా తగ్గేవి కావని కేంద్రంలోని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘సిగరెట్‌కి, బీడీకి 28% శ్లాబు లో ఒకే పన్ను విధించారు. బీడీలకు సిగరెట్లకు ఒకటే ట్యాక్స్ వద్దని కోరినా కేంద్రం వినలేదు. గ్రానైట్ విషయంలోనూ మనకు అన్యాయమే జరిగింది.’అని ఈటెల వ్యాఖ్యానించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 200 వస్తువులపై పన్ను తగ్గించారని, సామాన్య ప్రజల జీవితం ఛిద్రం చేసేలా నిర్ణయాలు ఉండకూడదని అన్నారు. జీఎస్టీ పరిహారం కింద మనకు కూడా రూ.450 కోట్ల వరకు రావాల్సి ఉండగా, రూ.250 కోట్లే ఇచ్చారన్నారు. సెంట్రల్ ఎక్సైజ్‌లో పదోన్నతుల విషయంపై కేంద్ర ఆర్థికమంత్రితో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ వంటి రంగాల్లో సమాన అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. -
మళ్లీ నిరాశ పరిచిన మంధన
డెర్బీ: భారత ఓపెనర్ స్మృతి మంధన మరోసారి తీవ్రంగా నిరాశపరిచింది. మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీస్ లో టాస్ గెలుచుకొని బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేనకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. గత నాలుగు మ్యాచుల్లో వరుసగా విఫలమైన ఓపెనర్ స్మృతి మంధన మరోసారి భారత అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. టోర్ని ఆరంభ మ్యాచుల్లో అదరగొట్టిన ఈ బ్యూటిఫుల్ లేడీ క్రికెటర్ భారత్ అభిమానుల మనసును దోచుకుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్ తో 90 పరుగుల, వెస్టిండీస్ తో సెంచరీతో చెలరేగిన మంధన తరువాతి నాలుగు మ్యాచ్ ల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఆసీస్ తో జరుగుతున్న సెమీస్ లోనైనా రాణిస్తుందనుకున్న అభిమానుల ఆశలను అడియాశలు చేసింది. ఆసీస్ బౌలర్ విలాని తొలి ఓవర్లో ఫోర్ తో పరుగుల ఖాత తెరిచిన మందన(6) చివరి బంతికి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగింది. -
రిషబ్‌పంత్‌కు మళ్లీ నిరాశే..
♦ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ కింగ్ స్టన్: విండీస్ పర్యటన ఎంపికతో అంతర్జాతీయ వన్డేల్లో ఆరంగ్రేటం చేయాలనుకున్న పంత్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. భారత్ ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో పంత్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక చివరి వన్డేలోనైన అవకాశం కల్పిస్తారని భావించినా నిరాశే ఎదురైంది. నేడు (గురువారం) జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతొంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. విండీస్ కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక గత మ్యాచ్‌కు దూరమైన అశ్విన్, యువరాజ్‌లను కూడా ఫైనల్ మ్యాచ్‌కు తీసుకోలేదు. తుది జట్లు భారత్: రహానే, ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), దినేష్ కార్తీక్, ధోని, జాదవ్, పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ వెస్టిండీస్: లూయిస్, హోప్, కేఏ హోప్, చేస్, మహమ్మద్, హోల్డర్ (కెప్టెన్), పోవెల్, నర్స్, బిషూ, జోసఫ్, విలియమ్స్ -
మోదీ ప్రసంగంపై సుప్రీం చీఫ్ జస్టిస్ అసంతృప్తి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత చరిత్రలోనే సుదీర్ఘ ప్రసంగం మోదీ చేసినప్పటికీ సుప్రీంకోర్టు, ఇతర కోర్టుల న్యాయమూర్తుల పెండింగ్ నియామకాలకు సంబంధించిన ప్రస్తావనే తీసుకురాలేదని, ఇది తనను తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగురవేసిన మోదీ అనంతరం దాదాపు 94 నిమిషాలపాటు మాట్లాడారు. దేశంలోనే అతి సుదీర్ఘంగా స్పీచ్ ఇచ్చిన ప్రధానిగా ఆయన నిలిచారు. ఈ ప్రసంగంలో దేశంలోని పలు అంశాలు స్పృషించిన మోదీ.. న్యాయస్థానాలపై మాత్రం మాట్లాడలేదు. దీంతో ఈ ప్రసంగంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బ్రిటిష్ పరిపాలన సమయంలో న్యాయం జరిగేందుకు ఎంత సమయం పట్టిందో ప్రస్తుతం కూడా అంతే సమయం పడుతోందని, కేసులను పూర్తి చేసేందుకు కోర్టులకు పదేళ్లు పడుతుందని, ఇది న్యాయ వ్యవస్థ పనికి ఆటంకంగా మారిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ కవితను కూడా వినిపించారు. అందరికీ పూలు, పండ్లు, ఇతర లబ్ధీలు ప్రకటించడంతోపాటు, స్నేహా విలువ చెప్పిన మీరు మాక్కూడా ఏదో ఒక మేలు చేయండి' అంటూ కవిత రూపంలో మరోసారి మోదీకి ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. -
అంతా మీరే,మరి మా మాటేంటి?
-
తీవ్ర నిరాశకు గురైన సానియా మీర్జా
ఆగ్రా : ఆసియా కీడ్రల్లో పతకాలు సాధించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్ర నిరాశకు గురైంది. ప్రపంచపు ఏడు వింతలలో ఒకటి అయిన తాజ్ మహల్ అందాలను ఆమె వీక్షించలేకపోయింది. తాజ్ మహల్ సందర్శనార్థం ఆమె మంగళవారం సాయంత్రం ఆగ్రా వచ్చినా ఫలితం లేకపోయింది. సానియా అక్కడకు చేరుకునే సరికే సందర్శన సమయం మించిపోవటంతో గేట్లు మూసివేసినట్లు టూరిస్ట్ గైడ్ వేద్ గౌతమ్ తెలిపాడు. కాగా తాజ్ మహల్ దర్శించుకోలేక పోయిన సానియా ....దూరం నుంచే ఓ ఫోటో తీసుకుని సంతృప్తి పడింది. మరోవైపు మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే కూడా నిన్న సాయంత్రం తాజ్ మహల్‌ను సందర్శించాడు. వీరిద్దరూ ఆగ్రాలోని జైపీ ప్యాలెస్ హోటల్లో జరగబోయే ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేశారు. -
అంతా ఉత్తుత్తే!
కేంద్ర బడ్జెట్లో దుర్భిక్ష ‘అనంత’కు రిక్తహస్తం ‘ప్రాజెక్టు అనంత’ భవిత చిదంబర రహస్యమే ఈసారైనా ఆర్మీ ఫైరింగ్ రేంజ్‌కు నిధులు ఇస్తారా! బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో చోటేదీ? సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఆడిన మాట తప్పడంలో తనది అందెవేసిన చేయి అని కేంద్రంలోని యూపీఏ సర్కారు మరోసారి నిరూపించుకుంది. దుర్భిక్ష ‘అనంత’లో సేద్యాన్ని గాడిన పెట్టేందుకు ‘ప్రాజెక్టు అనంత’కు నిధులు కేటాయిస్తామని భరోసా ఇచ్చిన కేంద్రం ఇప్పుడు కాడి దించింది. బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో జిల్లాకు చోటు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు చేతులెత్తేసింది. ఏడేళ్ల నుంచి ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుపై ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లిబుచ్చుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోన్న 11 గ్రామాల రైతులకు ఈసారి కూడా భరోసా ఇవ్వలేకపోయింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సోమవారం లోక్‌సభలో ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రగతిపై చూపిన ప్రభావం ఇదీ..! తెలుగు జాతిలో విభజన చిచ్చు పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం.. దుర్భిక్ష ‘అనంత’ను మరోసారి వంచించారు. జిల్లాలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న సేద్యాన్ని లాభాల బాట పట్టించేందుకు ఉద్దేశించిన ‘ప్రాజెక్టు అనంత’ ఒట్టి ఎన్నికల నినాదమేనని చిదంబరం చెప్పకనే చెప్పారు. ‘ప్రాజెక్టు అనంత’ అమలుకు రూ.7,676 కోట్లు అవసరం. అందులో రూ.4,387 కోట్లు వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మనీటిపారుదల, పశుసంవర్ధక, పట్టు, మత్స్యశాఖలకు శాఖాపరంగా ఐదేళ్లలో మంజూరవుతాయని అధికారులు లెక్క కట్టారు. తక్కిన రూ.3,282 కోట్లను కేంద్రం కేటాయించేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అహ్లూవాలియాను రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి నేతృత్వంలోని జిల్లా ప్రతినిధి బృందం ఆర్నెల్ల క్రితం కలిసింది. ‘ప్రాజెక్టు అనంత’కు అవసరమైన నిధులను కేటాయిస్తామని ఇద్దరూ భరోసా ఇచ్చారు. కానీ.. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. కరువుకు విరుగుడేదీ..? చౌక ధరలకే భూమి లభించడం.. అపారమైన ఖనిజ వనరులు.. మానవ వనరులు.. ఉపరితల రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండటం.. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండటం వల్ల పరిశ్రమల స్థాపనకు జిల్లా అత్యంత అనుకూలమని కేంద్రం తేల్చింది. బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో జిల్లాకు చోటు కల్పిస్తామని.. తద్వారా కరువుకు పరిష్కారం చూపిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియా పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో కుద్రేముఖ్- ఏపీఎండీసీ సంయుక్త భాగస్వామ్యంతో ఇనుప పిల్లెట్ల పరిశ్రమ చేపట్టాలన్న ప్రతిపాదన సందర్భంలో కూడా మాంటెక్‌సింగ్ గతంలో ఇచ్చిన హామీనే మరో మారు పునరుద్ఘాటించారు. కానీ.. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో జిల్లాకు చోటు కల్పించలేదు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బీడీఎల్(భారత్ దైనిక్స్ లిమిటెడ్), హెచ్ఏఎల్(హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్), ఈసీఐఎల్(ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), బీఈఎల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్)లు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి. కానీ.. వాటి ప్రస్తావన కూడా బడ్జెట్లో కన్పించలేదు. ఇది జిల్లా పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతంగా మారింది. ఉపాధి అవకాశాలకు కేంద్రం మోకాలడ్డినట్లయింది. న్యాయం జరిగేనా..?: కంబదూరు-కనగానపల్లి మండలాల సరిహద్దులో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుచేయాలని 2008లో కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది. కంబదూరు, కనగానపల్లి మండలాల్లోని కర్తనపర్తి, నూతిమడుగు, చెన్నేపల్లి, రాళ్ల అనంతపురం, రామోజీనాయక్ తండా, తిప్పేపల్లి, ఐపాసుపల్లి, గూళ్యం, మద్దెలచెర్వు, మద్దెలచెర్వు తండాల్లో 17,850 ఎకరాల భూమి అవసరమని తేల్చింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ.. ఇప్పటిదాకా భూసేకరణ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూముల క్రయవిక్రయాలపై నిషేధం విధించడం వల్ల ఆ గ్రామాల్లో రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. చివరకు పంట రుణాలు కూడా ఇవ్వడం లేదు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుచేస్తారా.. నోటిఫికేషన్ రద్దు చేస్తారా అంటూ ఆ గ్రామాల రైతులు ఆందోళనలు చేసినా కేంద్రానికి పట్టలేదు. నాలుగు నెలల క్రితం ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర రక్షణ శాఖ.. కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌ను ఆదేశించింది. ఆయన పంపిన ప్రతిపాదనలపై రక్షణశాఖ ఆమోదముద్ర వేసిందీ లేనిదీ బడ్జెట్లో స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. నిధుల్లోనూ కోత.. ఉపాధి హామీ పథకానికి గాను 2014-15 బడ్జెట్లో రూ.644 కోట్లు విడుదల చేయాలని జిల్లా అధికార యంత్రాంగం కేంద్రానికి నివేదిక పంపింది. కానీ.. ఆ మేరకు నిధులు విడుదలయ్యే అవకాశం లేదు. కనీసం రూ.350 కోట్ల మేర కూడా దక్కే అవకాశాల్లేవని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజీవ్ విద్యామిషన్ కింద జిల్లాకు రూ.442 కోట్ల మేర 2014-15 బడ్జెట్టో కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ.. ఇందులో రూ.250 కోట్లకు మించి నిధులు విడుదలయ్యే అవకాశం లేదని అధికారులు లెక్కలు వేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుకూ.. ఆధార్‌తో ముడిపెట్టవద్దని సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కేంద్రం చెవికెక్కించుకోలేదు. గ్యాస్ రాయితీతోపాటు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు, ఉపాధి హామీ వేతనాలు, విత్తన రాయితీ వంటి 26 సంక్షేమ పథకాలకు ఆధార్ ద్వారా నగదు బదిలీని వర్తింపజేస్తామని స్పష్టీకరించింది. ఇందుకు మన జిల్లానే ప్రయోగశాలగా ఎంచుకోవడం గమనార్హం. -
ఏ మున్నది గర్వకారణం?
నిరాశే మిగిల్చిన 2013.. ఏది కొనబోయినా కొరివే... ధరల దరువే కాడి పారేసిన పాలకులు.. కుదేలైన సామాన్యుడు ఇంట్లో ఏ స్విచ్ ముట్టుకున్నా ఎడాపెడా తగిలే కరెంటు చార్జీల షాకు. వంటింట్లో పొయ్యి ముట్టిద్దామంటే కళ్లముందు మెదలాడే గ్యాస్ బండ భారం. కాయగూరలు మొదలుకుని పచారీ సామాన్ల దాకా అన్నింటి ధరలూ చుక్కల్లోనే. ఇంటిల్లిపాదితో సరదాగా బయటికెళ్దామన్న ఆలోచన కూడా చేయలేని పరిస్థితి. పక్కనుంచి పదేపదే పెట్రో ధరల మోత. చివరికి ఎర్ర బస్సెక్కాలన్నా జేబు బరువును ఒకటికి రెండుసార్లు తడిమి చూసుకోవాల్సిన పరిస్థితి. బుడిబుడి నడకల బుజ్జారుుల్ని బళ్లో వేయూలన్నా అప్పులు చేయక తప్పని దుస్థితి. సగటు జీవికి 2013 ఎంత భారంగా గడిచిందో చెప్పేందుకు మాటల కోసం వెదుక్కోవాల్సిందే. బియ్యం వంటి నిత్యావసరాలతో పాటు చివరికి ఉల్లిగడ్డ కూడా కంటతడి పెట్టించింది. పండ్ల ధరలూ కొండెక్కాయి. ఆసుపత్రుల్లో కన్సల్టెన్సీ రుసుము 25 శాతం, స్కూలు ఫీజులు 20 శాతం, ఇంటి అద్దెలు 15 శాతం చొప్పున పెరిగాయి. ఇలా ఏడాది పొడవునా సామాన్యుని నడ్డి విరుగుతున్నా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండిపోయాయి. రైతులైతే వరుస తుపాన్లతో పూర్తిగా కుదేలయ్యారు. సామాన్యుడికి నానా రకాలుగా చుక్కలు చూపి, కాలగర్భంలోకి కనుమరుగవుతున్న 2013పై సింహావలోకనం... స్మార్ట్ చాయిస్ మిగతా విషయూలన్నీ ఎలా ఉన్నా స్మార్ట్ ఫోన్లు మాత్రం మెల్లిగా మధ్యతరగతి జీవులకు చేరువవుతున్నాయి. కనీసం రూ.12 వేలు పెడితే తప్ప అందని స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు రూ.6 వేలకే అందుబాటులోకి వచ్చాయి. విస్తృతమైన మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మొబైల్లో ఇంటర్నెట్ వాడకం కూడా బాగా పెరిగింది. ఒకరకంగా స్మార్ట్ ఫోన్ రోజువారీ జీవితంలో భాగమైపోయింది. బ్యాంకింగ్ మొదలుకుని రైలు, సినిమా టికెట్ల బుకింగ్ దాకా చాలా పనులు మొబైల్లో చేతుల మీదే పూర్తయిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇది గణనీయమైన మార్పు. షేర్ మార్కెట్ పర్లేదు 2009లో నేలచూపులు చూసిన సెన్సెక్స్ 2013లో పడుతూ లేస్తూ, లేస్తూ పడుతూ సాగింది. ఒక దశలో ఆల్‌టైమ్ రికార్డుతో 21 వేల మార్కును దాటింది. గత డిసెంబర్‌తో పోలిస్తే ఈ డిసెంబర్‌కు దాదాపు 2 వేల పాయింట్లు పెరిగింది. ‘క్రమానుగత పెట్టుబడి (సిప్) నాలుగేళ్లుగా నెలకు రూ.3 వేల చొప్పున పన్ను పథకాల్లో ఇప్పటిదాకా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే ఈ ఏడాదే కాస్త లాభం కన్పించింది. పెట్టుబడి 1.81 లక్షలైంది’ అని విక్రమ్ అనే మీడియా ఉద్యోగి తెలిపారు. దీర్ఘకాలం వేచి ఉన్న వారికి మార్కెట్ కాస్త కలిసొచ్చిందనే చెప్పొచ్చు. దిగొచ్చిన పుత్తడి గతేడాది దాకా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు ఈ ఏడాది బాగానే తగ్గారుు. కేంద్రం దిగుమతి సుంకాన్ని విధించడంతో మన దేశంలో రేట్లు అంతగా దిగిరాలేదు. పెట్టుబడిగా బంగారం కొన్నవారికి మాత్రం ఈ ఏడాది కలిసి రాలేదు. ‘2012 నవంబర్ నెలాఖరులో గ్రాము రూ.3,125 చొప్పున రూ.75 వేలతో 24 గ్రాములు కొన్నా. ఇప్పుడది రూ.68,220కి తగ్గింది’ అంటూ ఖైరతాబాద్‌కు చెందిన నవీన్ యాదవ్ వాపోయారు. హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర 2012 డిసెంబర్ 28న రూ.30,570 ఉండగా ఈ డిసెంబర్ 28న రూ.29,340 ఉంది. 10 పెట్రో వాతలు.. 12 డీజిల్మోతలు చమురు కంపెనీలు పెట్రోలు ధరలను 2013లో పదిసార్లు పెంచేశాయి! డీజిల్‌పై అరుుతే ఏకంగా 14 సార్లు పెంచారుు. ఇది రికార్డేనని చెప్పాలి. పెట్రో ధరల నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో నుంచి కంపెనీల చేతుల్లోకి వెళ్లడంతో అవి ఆడింది ఆటగా సాగుతోంది. అంతర్జాతీయ చమురు ధరలను బూచిగా చూపుతూ అప్పుడప్పుడు మూరెడు తగ్గించినట్టే తగ్గిస్తూ, పదేపదే బారెడేసి చొప్పున ధరలు పెంచుతూ సగటు జీవిని ఎడాపెడా బాదేస్తున్నారుు. 2013 జనవరిలో హైదరాబాద్‌లో రూ.73.73 ఉన్న లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.78.1కి చేరింది. డీజిల్ కూడా రూ.51.35 నుంచి రూ.58.6కు పెరిగింది. ఫీజుల మోత చదువు‘కొనడం’ ఈ ఏడాది మరీ ఖరీదైన వ్యవహారంగా మారిపోరుుంది. హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా గతేడాదితో పోలిస్తే అన్ని ఫీజులూ కనీసం 20 శాతం పెరిగాయి. ‘అబిడ్స్‌లోని ఓ మామూలు ప్రైవేటు స్కూల్లో మా అమ్మాయి 6వ తరగతి చదువుతోంది. గతేడాది నెలకు రూ.2,500 ఉన్న ఫీజు ఇప్పుడు రూ.3,000 అరుుంది. ఫీజులను ఏటా 20 శాతం పెంచుతున్నారు. నా జీతం మాత్రం 10 శాతం కూడా పెరగడం లేదు’ అంటూ రఘురాం అనే మధ్యతరగతి ఉద్యోగి వాపోయారు. సగటు జీవులందరిదీ అటూ ఇటుగా ఇదే పరిస్థితి. ‘బండ’ పడింది మన ప్రభుత్వాలు 2013లో సామాన్యుడికి చివరికి వంటింట్లోనూ సంక్షోభం రేపారుు. సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యకు కేంద్రం పరిమితి విధించడమే గాక రూ.25 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేయడంతో గ్యాస్ బండ తలకు మించిన భారమైంది. 2013 మొదట్లో రూ.412 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.1,112కు పెరిగింది. ఇందులో ఏడాదికి తొమ్మిది సిలిండర్లకు మాత్రం నగదు బదిలీ రూపంలో ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుండగా మిగతా వాటిని మార్కెట్ ధరకు కొనాల్సిన పరిస్థితి ఎదురైంది. సబ్సిడీ సిలిండర్ల ధర కూడా రూ.600కు చేరుకోవటంతో ఒక్కో సిలిండర్‌పై రూ.188 చొప్పున భారం పడినట్టయింది. కొండెక్కిన సన్న బియ్యం సన్న బియ్యం ఈ ఏడాది చుక్కలు చూపింది. ఒకరకంగా విలాస వస్తువుగా కూడా మారిందన్నా అతిశయోక్తి లేదేమో!. 2012లో కిలో రూ.35 ఉన్నది కాస్తా 2013లో రూ.50 మార్కును దాటేసింది. నలుగురు సభ్యుల కుటుంబం నెలకు రూ.3 వేలకు పైగా బియ్యానికే ఖర్చు చేయాల్సి వచ్చింది. గతేడాది కంటే ఇది దాదాపు వెరుు్య రూపాయలు ఎక్కువ. దాంతో చాలామంది రూ.40-45కు ఓ మోస్తరు బియ్యంతో సరిపెట్టుకున్నారు. దిగుబడి పుష్కలంగా ఉండి కూడా బియ్యం ధరలు ఇలా ఆకాశాన్నంటడం ప్రభుత్వం వైఫల్యాన్ని పట్టించింది. నల్లబజారును నియంత్రించడంలో పాలకులు దారుణంగా విఫలమయ్యూరు. ఇక పప్పుల ధరలు కూడా ఈసారి 25 శాతం మేర పెరిగాయి. కిలో కందిపప్పు రూ.65 నుంచి రూ.85 దాటింది. నూనెలు కూడా కిలోపై రూ.25 దాకా పెరిగాయి. ఎర్రబస్సు కన్నెర్ర... వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో ఏనాడూ బస్సు చార్జీలను పెంచకుండా, ప్రజలపై భారం మోపకుండా జాగ్రత్త పడగా, అనంతరంవచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం జనానికి ఏటా చిల్లు పెడుతూ వచ్చారుు. 2013లో బస్సు భారం మరింత పెరిగింది. అప్పటిదాకా ఏటా రూ.600 కోట్ల మేరకు బస్సు చార్జీలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈసారి ఏకంగా 9.5 శాతం మేర చార్జీలు పెంచి ప్రయూణికులతో పెడబొబ్బలు పెట్టించింది. ఇది గతేడాది భారం కంటే రెట్టింపు. కనీసం పేదలకు ఆధారమైన పల్లె వెలుగు బస్సులను కూడా ఈ ఏడాది వదిలిపెట్టలేదు. దాంతో బస్సెక్కాలంటేనే జనం భయపడే పరిస్థితి దాపురించింది. నిరుద్యోగులకు నిరాశే 2012 డిసెంబర్ నుంచి ఈ ఏడాది కాలంలో భర్తీ అరుున ప్రభుత్వోద్యోగాలు అతి స్వల్పం. 64 అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు, 12 ఫిజికల్ డెరైక్టర్, 21 లైబ్రేరియన్, 362 అసిస్టెంట్ ఇంజనీర్లు, 107 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, 6 అసిస్టెంట్ రీసెర్చి ఆఫీసర్, 18 రీసెర్చి అసిస్టెంట్, 11 అబ్జర్వర్, 12 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటిలోనూ కొన్నింటి భర్తీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ప్రైవేట్ రంగంలోనూ భారీ సంఖ్యలో కొలువులు కట్టబెట్టిన రంగం ఏదీ లేదు. ఐటీ రంగంలో రాష్ట్రానికి కొత్తగా ఒక్క సంస్థా రాలేదు. రాష్ట్ర విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా దక్కిన ఐటీ కొలువులూ తక్కువే. ఆశా నిరాశల రియల్ ఎస్టేట్ కొందరికి చేదు రుచి చూపిన రియల్ ఎస్టేట్ రంగం మరికొందరికి కొత్త ఆశలు రేకెత్తింపజేసింది. స్థిరాస్తులు కొనుక్కున్న వారు వాటి విలువ తగ్గుతోందంటూ వాపోతుండగా, ఇన్నాళ్లూ అందనంత ఎత్తులో ఉన్న స్థలాల విలువ ఎంతో కొంత దిగి వస్తోందని మరికొందరు సంబరపడుతున్నారు. ‘గత డిసెంబర్లో హైదరాబాద్ శివారులోని మల్లంపేట్‌లో గజం రూ.6,500 చొప్పున ప్లాట్ కొన్నాను. ఇప్పుడది రూ.4 వేలకు పడిపోయింది’ అని పోపూరి శ్రీనివాస్ అనే ఉద్యోగి వాపోయూరు. 2008 దాకా ఓ వెలుగు వె లిగిన రియల్టీ రంగాన్ని 2009 కల్లా స్తబ్దత ఆవరించింది. 2009 డిసెంబర్లో తెలంగాణ ప్రకటనతో రియల్టీ కుదుపునకు లోనైంది. గత ఆగస్టు నుంచి ప్రధాన ప్రాంతాల్లో మినహా ధరలు దాదాపు 10 శాతం తగ్గాయి. కృష్ణా, గుంటూరు, ఒంగోలు, విశాఖ వంటి సీమాంధ్ర ప్రాంతాల్లో మాత్రం స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని చోట్ల రేట్లు 100 శాతం దాకా పెరిగాయి. రాజధాని ఏర్పాటుకు, కొత్తగా మౌలిక వసతుల స్థాపనకు అవకాశముందని భావిస్తున్న ప్రతి ప్రాంతంలోనూ రేట్లు పెరిగిపోయాయి. కరెంటు షాక్.. సగటు జీవులే గాక చివరికి రైతులకు కూడా వెన్ను విరిగే స్థారుులో కరెంటు బిల్లులను పెంచి రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతాపం చాటింది. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ఏకంగా రూ.5 వేల కోట్లకు పైగా భారం మోపుతూ 2013 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త కరెంటు చార్జీలు జనం నడ్డి విరిచాయి. చార్జీలు ఏకంగా 60 శాతం పెరిగాయి. ఇది చాలదన్నట్టు సర్దుబాటు చార్జీల పేరిట 2010-11, 2012-13 తాలూకు భారాన్ని కూడా జనం మీదే మోపుతూ వాళ్ల జేబులకు చిల్లి పెట్టింది సర్కారు. వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌పై కూడా ఆంక్షలు విధించి రైతన్ననూ దెబ్బ కొట్టింది. రెండున్నర ఎకరాలకు మించిన మాగాణి ఉన్న రైతుల నుంచి చార్జీలు వసూలు చేయాల్సిందేనంటూ పథకానికే తూట్లు పొడిచింది. అలా రెండున్నర లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేసింది. ఇక నిరంతర కరెంటు కోతలు సరేసరి. కనీసం రెండు మూడు గంటలు కూడా కరెంటివ్వకపోవడంతో పొలాలెండి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారంలో ఏకంగా మూడు రోజుల పాటు పవర్ హాలిడే ప్రకటించడంతో పరిశ్రమలు ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి. వందలాది పరిశ్రమలు మూతపడ్డాయని స్వయానా రిజర్వు బ్యాంకే తన నివేదికలో స్పష్టం చేసింది. 40 శాతం పరిశ్రమల్లో ఉత్పత్తి ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఎలా చూసినా ఈ సంవత్సరం కరెంటు రూపంలో ప్రజలకు చేదు జ్ఞాపకాలే మిగిలాయి. వరుస తుపాన్లు ఈ సంవత్సరం వానలు బాగా ఉంటాయని పంచాంగం విని మురిసిన రైతన్న, ఆ వానలే కొంప ముంచుతాయని ఊహించలేకపోయాడు. ఎన్నడూ లేనట్టుగా ఏకంగా మూడు తుపాన్లు వారిని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఖరీఫ్ పంట కళకళలాడుతున్న తరుణంలో తొలుత ఫైలీన్ తుపాను వచ్చి పడింది. దాని దెబ్బకు శ్రీకాకుళం జిల్లాలో పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.ఆ వెంటనే హెలెన్ పంజా విసిరింది. ఏకంగా 16 జిల్లాల్లోను అతలాకుతలం చేసింది. కోస్తాతో పాటు తెలంగాణ జిల్లాల్లో కూడా పంటలు సర్వనాశనమయ్యాయి. ఆ దెబ్బ నుంచి తేరుకోకముందే లెహర్ విరుచుకుపడింది. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇలా మూడు తుపాన్లు, అతి భారీ వర్షాలు దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన పంటలను దెబ్బ తీశాయి. అసలే కరువు కాలంలో కరెంటు కోత బారిన పడి తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ ఖరీఫ్ అతివృష్టితో సర్వం కోల్పోయి మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయూరు. కంటనీరు పెట్టించిన ఉల్లి {పభుత్వాలను కూడా కూల్చిన చరిత్ర ఉన్న ఉల్లి చాలాకాలం తర్వాత 2013లో మళ్లీ ఆ స్థారుులో చెలరేగింది. ఒక దశలో కిలో రూ.60 కూడా దాటేయడంతో జనం హాహాకారాలు చేశారు. ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో దాదాపు నెల పాటు ఉల్లి పేరు చెబితేనే కంట నీరొచ్చే పరిస్థితి కొనసాగింది. కూరగాయలు కూడా తామూ తక్కువ తినలేదన్నట్టుగా భగ్గుమన్నాయి. గతేడాదితో పోలిస్తే ధరలు ఏకంగా 40 శాతం మేరకు పెరిగాయి. బీన్స్ అయితే ఒక దశలో కిలో ఏకంగా రూ.100 మార్కు దాటేసింది. చిక్కుడు, క్యారెట్‌తో పాటు టమోటా కూడా కిలో రూ.50కి చేరుకోవడంతో సాధారణ జనం చాలాకాలం వాటి జోలికి వెళ్లడమే మానుకున్నారు. గతేడాది రూ.600-800 ఉన్న నలుగురు సభ్యుల సాధారణ కుటుంబ నెలసరి కూరగాయల బడ్జెట్ ధరాఘాతానికి ఈసారి రూ.1,100 నుంచి 1,500 దాకా పెరిగింది.