న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు వెల్లడించింది. ఏడు త్రైమాసికాల తదుపరి జులై–సెపె్టంబర్(క్యూ2)లో లాభాలను వీడింది. రూ. 986 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అధిక ఇంధన వ్యయాలు, ఇంజిన్ సమస్యలతో కొన్ని విమానాలు నిలిచిపోవడం లాభాలను దెబ్బతీశాయి.
విదేశీ మారక ప్రభావాన్ని మినహాయిస్తే రూ. 746 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఇండిగో బ్రాండుతో సరీ్వసులందిస్తున్న కంపెనీ గతేడాది(2023–24) ఇదే కాలంలో నికరంగా రూ. 189 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ. 17,800 కోట్లను తాకింది. ఇంధన వ్యయాలు 13 శాతం పెరిగి రూ. 6,605 కోట్లకు చేరాయి.
కొత్త బిజినెస్ క్లాస్: ఢిల్లీ–ముంబై మార్గంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన బిజినెస్ క్లాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. తదుపరి దశలో 40కుపైగా విమానాలను 12 మెట్రో రూట్లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. మరిన్ని విదేశీ రూట్లకు సరీ్వసులను విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఇండిగో ప్రస్తుతం 410 విమానాలను కలిగి ఉంది. వెరసి మొత్తం వ్యయాలు 22 శాతం పెరిగి రూ. 18,666 కోట్లను తాకాయి. 6%అధికంగా 2.78 కోట్ల ప్యాసింజర్లు ప్రయాణించగా.. టికెట్ల ఆదాయం 10 శాతం ఎగసి రూ. 14,359 కోట్లకు చేరింది.
ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్‌ఈలో 3.5 శాతం క్షీణించి రూ. 4,365 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment