Indigo Air lines
-
కార్పొరేట్లకు రెడ్ కార్పెట్
ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన మార్కెట్లలో భారత్‌ది మూడో స్థానం. పదేళ్ల వ్యవధిలో (2024 ఏప్రిల్ నాటికి) సీటింగ్ సామర్థ్యం 79 లక్షల నుంచి 1.55 కోట్లకు పెరిగింది. విమానయానం మరింతగా వృద్ధి చెందుతున్న అంచనాల మధ్య వేల కొద్దీ విమానాలకు ఆర్డర్లిచ్చిన ఎయిరిండియా, ఇండిగో లాంటి దిగ్గజాలు.. గణనీయంగా పెరుగుతున్న కార్పొరేట్ ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా కార్పొరేట్ ట్రావెల్ మార్కెట్ (హోటళ్లు, విమానయాన సంస్థలు, రైళ్లు, క్యాబ్‌లు కలిపి) దాదాపు 10.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో ఎయిర్‌లైన్స్ మార్కెట్ వాటా 53 శాతంగా (5.6 బిలియన్ డాలర్లు) ఉంది. కార్పొరేట్ల ప్రయాణాలు మరింతగా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో విమానయాన సంస్థలు కూడా ఈ విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లతో కార్పొరేట్, సంపన్న ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దేశ విదేశ ఎయిర్‌లైన్స్ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎస్ఎంఈ) ఎయిరిండియా దృష్టి సారించింది. సాధారణంగా మార్కెటింగ్‌పరంగా వాటిని చేరుకోవడం కొంత కష్టతరం కావడంతో, అవే నేరుగా బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ విడిగా పోర్టల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా బుక్ చేసుకుంటే ఆకర్షణీయమైన చార్జీలను కూడా ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు విస్తారా ను విలీనం చేసుకున్న తర్వాత సేల్స్ టీమ్ పటిష్టం కావడం, నెట్వర్క్ విస్తరించడం వంటి అంశాలు కార్పొరేట్ బిజినెస్ పెంచుకునేందుకు ఎయిరిండియాకు ఉపయోగపడుతున్నాయి. గత కొన్నాళ్లుగా కంపెనీ సుమారు 1,700 పైచిలుకు కార్పొరేట్ క్లయింట్లను దక్కించుకుంది. మరోవైపు బడ్జెట్ విమానయా న సంస్థగా పేరొందిన ఇండిగో కూడా కార్పొరేట్ క్లయింట్లను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కీలక రూట్లలో బిజినెస్ క్లాస్‌ను ప్రవేశపెడుతోంది. గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన ఈ కొత్త సర్వీసులకు మంచి స్పందన రావడంతో ఢిల్లీ–చెన్నై రూట్లో కూడా ఈ కేటగిరీని ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 2025 ఆఖరు నాటికి 45 విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లు ఉంటాయని కంపెనీ సీఈవో పీటర్స్ ఎల్బర్స్ పేర్కొన్నారు. 2025 జూన్ నాటికే ఇలాంటి 94 విమానాలను సమకూర్చుకోవాలని ఎయిరిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక సదుపాయాలు.. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందించేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయి. ఇండిగోలో సీట్ల వరుసల మధ్య స్థలం 38 అంగుళాలుగా ఉంటే, ఎయిరిండియాకు 40 అంగుళాల స్థాయిలో ఉంటోంది. ఇండిగో సీట్లు అయిదు అంగుళాల మేర రిక్లైన్ అయితే, ఎయిరిండియావి 7 అంగుళాల వరకు రిక్లైన్ అవుతాయి. ఇక రెండు ఎయిర్‌లైన్స్ చెకిన్, బోర్డింగ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ విషయాల్లో బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాయి.అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కూడా.. ఆర్థిక పరిస్థితులపై సానుకూల దృక్పథంతో ప్రయాణాలు మరింతగా పుంజుకుంటాయన్న అంచనాల నేపథ్యంలో బిజినెస్ క్లాస్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కూడా పోటీపడుతున్నాయి. మలేసియా ఎయిర్‌లైన్స్ కొన్నాళ్ల క్రితమే తమ కార్పొరేట్ ట్రావెల్ ప్రోడక్ట్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. అప్‌గ్రెడేషన్, అదనపు బ్యాగేజ్ అలవెన్స్ మొదలైన వాటికి రివార్డు పాయింట్లను అందించడంతో పాటు వాటిని రిడీమ్ కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అలాగే ఎస్ఎంఈలకు ప్రత్యేక చార్జీలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన తోడ్పాటు అందిస్తోంది. తమ దేశంలో సమావేశాలు, కాన్ఫరెన్సులు, ఈవెంట్లను నిర్వహించుకునేందుకు క్లయింట్లను ప్రోత్సహించేలా ట్రావెల్ ఏజెంట్లకు ఎయిర్ మారిషస్ ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ స్కీము కింద గ్రూప్ సైజు, ప్రయాణించిన ప్యాసింజర్లను బట్టి ఒక్కొక్కరి మీద రూ. 500–1,000 వరకు కమీషన్లు ఇస్తోంది. అజర్బైజాన్, జార్జియా, కజక్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర ప్రాంతాలకు డైరెక్ట్ కనెక్టివిటీ పెరగడంతో, ఆయా దేశాలకు ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందని థామస్ కుక్ ఇండియా వర్గాలు తెలిపాయి. థామస్ కుక్ ఇండియాకి సంబంధించి బిజినెస్ ట్రావెల్ సెగ్మెంట్ వార్షికంగా సుమారు 13 శాతం పెరిగింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
Vizag: రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు
భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం ఆగడం లేదు. వరుసగా వస్తున్న ఈ బాంబు బెదిరింపు ఘటనలు అటు విమానయాన అధికారుల్లో, ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 15 రోజుల్లో దాదాపు 200కుపైగా విమానాలకు బెదిరింపులు అందాయి. వీటిపై విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆగడం లేదు.సాక్షి, విశాఖపట్నం: తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న విమానంతోపాటు చెన్నై నుంచి విశాఖపట్నం వస్తున్న విమానానికి మంగళవారం బెదిరింపులు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో వెంటనే భద్రత సిబ్బంది రెండు విమానాల్లోనూ బాంబు స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు.కాగా సోమవారం కూడా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మీదుగా ముంబయికి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ విమానాశ్రయానికి ఆగంతకుడు ఫోన్ చేసి ముంబయి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందని బెదిరించడంతో.. అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు విశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఆకాశంలో ఉన్న విమానాన్ని పైలెట్లు వెంటనే వెనక్కి మళ్లించి విశాఖలో ల్యాండ్ చేశారు. 120 మంది ప్రయాణికులను కిందకు దించేయడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. బాంబు స్క్వాడ్, సీఐఎస్ఎఫ్, ఎయిర్‌పోర్టు అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, బాంబు లేదని గుర్తించారు. అనంతరం నాలుగు గంటలు ఆలస్యంగా విమానం ముంబయికి బయలుదేరింది. -
నష్టాల్లోకి ఇండిగో
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు వెల్లడించింది. ఏడు త్రైమాసికాల తదుపరి జులై–సెపె్టంబర్(క్యూ2)లో లాభాలను వీడింది. రూ. 986 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అధిక ఇంధన వ్యయాలు, ఇంజిన్ సమస్యలతో కొన్ని విమానాలు నిలిచిపోవడం లాభాలను దెబ్బతీశాయి. విదేశీ మారక ప్రభావాన్ని మినహాయిస్తే రూ. 746 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఇండిగో బ్రాండుతో సరీ్వసులందిస్తున్న కంపెనీ గతేడాది(2023–24) ఇదే కాలంలో నికరంగా రూ. 189 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ. 17,800 కోట్లను తాకింది. ఇంధన వ్యయాలు 13 శాతం పెరిగి రూ. 6,605 కోట్లకు చేరాయి. కొత్త బిజినెస్ క్లాస్: ఢిల్లీ–ముంబై మార్గంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన బిజినెస్ క్లాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. తదుపరి దశలో 40కుపైగా విమానాలను 12 మెట్రో రూట్లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. మరిన్ని విదేశీ రూట్లకు సరీ్వసులను విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఇండిగో ప్రస్తుతం 410 విమానాలను కలిగి ఉంది. వెరసి మొత్తం వ్యయాలు 22 శాతం పెరిగి రూ. 18,666 కోట్లను తాకాయి. 6%అధికంగా 2.78 కోట్ల ప్యాసింజర్లు ప్రయాణించగా.. టికెట్ల ఆదాయం 10 శాతం ఎగసి రూ. 14,359 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్ఈలో 3.5 శాతం క్షీణించి రూ. 4,365 వద్ద ముగిసింది. -
మరో 25 విమానాలకు బాంబు బెదిరింపు
ముంబై/న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం దేశీయ విమానయాన సంస్థలకు చెందిన 25 సర్వీసులకు బాంబు పెట్టామనే హెచ్చరికలు అందాయి. దీంతో, ఈ వారంలో ఇప్పటి వరకు విమానాలకు అందిన బాంబు బెదిరింపుల సంఖ్య 90 దాటింది. అయితే ఇవన్నీ వట్టివేనని తేలిందని అధికారులు వివరించారు. ఆదివారం హెచ్చరికలు అందిన వాటిలో ఇండిగో, విస్తార, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా విమానాలున్నాయి. తమ జెడ్డా–ముంబై, కోజికోడ్–దమ్మమ్, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, పుణె–జోధ్‌పూర్ సర్వీసులకు ఆన్లైన్లో బెదిరింపులొచ్చాయని ఇండిగో తెలిపింది. ఢిల్లీ–ఫ్రాంక్ఫర్ట్, సింగపూర్–ముంబై, బాలి–ఢిల్లీ, సింగపూర్–ఢిల్లీ, సింగపూర్–పుణె విమానాలకు బెదిరింపులందాయని విస్తార వెల్లడించింది. అహ్మదాబాద్–ముంబై, ఢిల్లీ–గోవా, ముంబై–బగ్డోగ్రా, ఢిల్లీ–హైదరాబాద్, కొచ్చి–ముంబై, లక్నో–ముంబై విమాన సర్వీసులకు బాంబు పెట్టామనే హెచ్చరికలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆన్లైన్లో వచ్చాయని ఆకాశ ఎయిర్ వివరించింది. అదేవిధంగా, ఎయిరిండియాకు చెందిన ఏడు విమానాలకు కూడా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. వీటిపై ఆ సంస్థ స్పందించలేదు. -
విమానంలో మహిళకు వేధింపులు..వ్యక్తి అరెస్ట్
చెన్నై:ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానంలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. ఈ విషయాన్ని చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో నిద్రపోతున్నపుడు తన వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి కావాలని తన శరీరాన్ని తాకాడని ఓ మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన రాజేష్‌శర్మ అనే వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టం కింద శర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నిందితునిది రాజస్థాన్ అయినప్పటికీ చాలా కాలం నుంచి చెన్నైలోనే నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: జాక్‌పాట్ కొట్టిన మెకానిక్..లాటరీలో రూ.25 కోట్లు -
ఆకాశ వీధిలో బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌దే హవా
దేశీయంగా చౌక విమానయాన సంస్థల (బడ్జెట్ ఎయిర్‌లైన్స్–ఎల్సీసీ) హవా కొనసాగుతోంది. అంతర్జాతీయ ట్రావెల్ డేటా సంస్థ ఓఏజీ తాజా గణాంకాల ప్రకారం ఎల్‌సీసీల మార్కెట్ వాటా అత్యధికంగా ఉన్న టాప్ 10 దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం సీట్ల సామర్థ్యంలో ఇండిగో సారథ్యంలోని ఎల్సీసీలకు ఏకంగా 71 శాతం వాటా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే భారత్‌కు సమీప పోటీదారు ఇండోనేసియాలో ఇది 64 శాతమే. ఈ విషయంలో అంతర్జాతీయ సగటు 34 శాతంగానే ఉంది. ప్రపంచంలోనే టాప్‌లో ఉన్న నాలుగు విమానయాన సంస్థలు ఎల్సీసీలే కావడం గమనార్హం. సౌత్‌వెస్ట్, రయాన్ఎయిర్, ఇండిగో, ఈజీజెట్ ఈ లిస్టులో ఉన్నాయి. 2019 నుంచి అంతర్జాతీయంగా ఎల్‌సీసీల వాటా 13 శాతం మేర పెరిగింది. సంపన్న దేశాలు, చైనాలో ఎఫ్‌ఎస్‌సీలు .. ఇతర దేశాలను చూసినప్పుడు, అతి పెద్ద ఎయిర్‌లైన్స్ మార్కెట్లలో ఒకటైన చైనాలో ఫుల్ సరీ్వస్ ఎయిర్‌లైన్స్‌దే (ఎఫ్ఎస్సీ) హవా ఉంటోంది. అక్కడ ఎల్‌సీసీల మార్కెట్ వాటా కేవలం 12 శాతమే. ఇక బ్రిటన్ మార్కెట్లో పరిస్థితి కాస్త అటూ ఇటుగా ఉంది. ఎఫ్ఎస్సీలతో పోలిస్తే ఎల్సీసీలకు కాస్త మొగ్గు ఎక్కువగా ఉంది. రయాన్ఎయిర్, ఈజీజెట్, విజ్ ఎయిర్ వంటి ఎల్‌సీసీలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఎఫ్ఎస్సీలతో పోలిస్తే ఎల్‌సీసీల మార్కెట్ వాటా ఎక్కువగా ఉన్న దేశాలను పరిశీలిస్తే లాటిన్ అమెరికాలో బ్రెజిల్, యూరప్‌లో ఇటలీ, స్పెయిన్ మొదలైనవి ఉన్నాయి. అమెరికా, జర్మనీ, జపాన్ వంటి సంపన్న దేశాల్లో ఎఫ్ఎస్సీలదే ఆధిపత్యం ఉంటోంది. ఫుల్ సరీ్వస్ క్యారియర్లు ఇంకా కరోనా పూర్వ స్థాయికి కోలుకోవాల్సి ఉంది. ఇండిగో భారీగా విస్తరించడం భారత్‌లో ఎల్‌సీసీల మార్కెట్ వాటా వృద్ధికి దోహదపడింది. ఈ ఏడాది జూలై గణాంకాల ప్రకారం దేశీ ప్యాసింజర్ మార్కెట్లో ఇండిగో సంస్థకు 62 శాతం వాటా ఉంది. ఎల్సీసీ విభాగంలో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇతర ఆదాయంపరంగా సవాళ్లు.. మార్కెట్ వాటాను విస్తరించుకుంటున్నప్పటికీ దేశీయంగా ఎల్‌సీసీలు అనుబంధ ఆదాయాలను మాత్రం పెంచుకోలేకపోతున్నాయి. సీట్లను బట్టి ఫీజులు, ఆహారం, స్పెషల్ చెకిన్లు, సీట్ అప్గ్రేడ్లు, ఎక్స్ట్రా లగేజీ చార్జీలపరమైన ఆదాయం అంతంతే ఉంటోంది. దీన్ని పెంచుకునే అవకాశాలు పరిమితంగానే కనిపిస్తున్నాయి. 2022లో ఇండిగో మొత్తం ఆదాయంలో ఇతరత్రా అనుబంధ ఆదాయం వాటా 7.1 శాతమే. ఈ విషయంలో మొత్తం 64 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో 54వ స్థానంలో ఉంది. అదే అంతర్జాతీయంగా టాప్ 10 ఎల్‌సీసీలను చూస్తే .. రయాన్ఎయిర్ గ్రూప్ ఆదాయాల్లో అనుబంధ ఆదాయం వాటా 35.7 శాతంగా ఉంది. అదే ఈజీజెట్ను చూస్తే ఇది 33.9 శాతంగా, సౌత్‌వెస్ట్ విషయంలో 24.9 శాతంగా ఉంది. ఈ విషయంలో ఇండిగో ఎక్కడో వెనకాల ఉండటం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జపాన్ ఎయిర్‌లైన్స్‌తో ఇండిగో కోడ్‌షేర్ ఒప్పందం
ముంబై: జపాన్ ఎయిర్‌లైన్స్‌తో (జేఏఎల్) కోడ్‌షేర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ విమానయాన సంస్థ ఇండిగో వెల్లడించింది. ఇండిగో నెట్‌వర్క్‌లోని 14 ప్రాంతాలకు జేఏఎల్ సేవలు విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది. జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం అది టోక్యో నుంచి ఢిల్లీ, బెంగళూరుకు ఫ్లయిట్ సరీ్వసులు అందిస్తోంది. ఈ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పెద్ద నగరాలైన హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, అమృత్సర్, కొచ్చి, కోయంబత్తూర్, తిరువనంతపురం, తిరుచిరాపల్లి, పుణె, లక్నో, వారణాసి తదితర ప్రాంతాలకు సరీ్వసులు విస్తరించేందుకు వీలవుతుంది. తదుపరి జేఏఎల్ నెట్వర్క్ రూట్లలో తమ సేవలు విస్తరించేందుకు ఇండిగో కోడ్õÙర్ కుదుర్చుకోనుంది. -
Video: విమానం ఆలస్యంపై ప్రకటన.. కెప్టెన్‌పై ప్రయాణికుని దాడి
ఢిల్లీ: ప్రయాణాల ఆలస్యం వివాదంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఈ క్రమంలోనే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. విమానం ఆలస్యం గురించి ప్రకటిస్తున్న నేపథ్యంలో ఓ ప్రయాణికుడు కెప్టెన్‌పై దాడికి యత్నంచాడు. కెప్టెన్ చెంప చెల్లుమనిపించాడు. ఇంతలో ఇతర ప్రయాణికులు అడ్డుతగలడంతో వెనక్కి తగ్గాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. A passenger punched an Indigo capt in the aircraft as he was making delay announcement. The guy ran up from the last row and punched the new Capt who replaced the previous crew who crossed FDTL. Unbelievable ! @DGCAIndia @MoCA_GoI pic.twitter.com/SkdlpWbaDd — Capt_Ck (@Capt_Ck) January 14, 2024 వీడియోలో చూపిన విధంగా ఢిల్లీ విమానాశ్రయంలో 6E-2175 విమానాన్ని నిలిపి ఉంచారు. గోవా వెళ్లాల్సిన ఆ విమానం ఎప్పుడు గాల్లోకి ఎగురుతుందా? అన్నట్లు ప్రయాణికులంతా ఎదురుచూస్తున్నారు. ఇంతలో కెప్టెన్ లోనికి వచ్చాడు. పొగమంచు కారణంగా దాదాపు 13 గంటలు విమానం ఆలస్యం అవుతుందని ప్రకటిస్తున్నాడు. ఇంతలో పసుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి ముందుకు దూసుకొచ్చాడు. కెప్టెన్ చెంప చెల్లుమనిపించాడు. ఈ వీడియోను నటి రాధికా ఆప్టే ఎక్స్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. నిందితున్ని సాహిల్ కటారియాగా గుర్తించారు. అతనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ సహా ఉత్తరాదిలో ఇటీవల తీవ్ర పొగమంచు వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైళ్లు సహా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పొగమంచు కారణంగా ఢిల్లీలో శనివారం 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. అటు 79 విమాన ప్రయాణాల్ని రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చదవండి: Makar Sankranti: గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి? -
హైదరాబాద్ ఎయిర్పోర్ట్.. టైమ్ అంటే టైమే..!
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల టైమింగ్ బావుందని నివేదిక వెల్లడైంది. నిర్వహణ, పనితీరు, సమయపాలన (ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్-ఓటీపీ)లో అంతర్జాతీయంగా హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2023లో ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్ను సమీక్షించిన విమానయాన అనలిటిక్స్ సంస్థ సిరియమ్ రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. టాప్-10 విమానాశ్రయాల్లో మన దేశంలోని కోల్‌కతా విమానాశ్రయం కూడా స్థానం దక్కించుకుంది. టాప్ 1లో అమెరికాకు చెందిన మిన్నేపొలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది ఓటీపీ అధికంగా 84.44% ఉంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 84.42% ఓటీపీతో రెండో స్థానం సాధించింది. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 84.08% ఓటీపీతో మూడో స్థానంలో నిలిచింది. పెద్ద విమానాశ్రయాల్లోనూ ఈ రెండు స్థానం సాధించాయి. మధ్య స్థాయి విమానాశ్రయాల విభాగంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం 83.91 శాతం ఓటీపీతో అంతర్జాతీయంగా తొమ్మితో స్థానం దక్కించుకుంది. ఇదీ చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే.. సంస్థల వారీగా.. అంతర్జాతీయంగా దేశంలోని పెద్ద విమానయాన సంస్థ ఇండిగో 82.12% ఓటీపీతో ఎనిమిదో ర్యాంకు సాధించింది. ఆసియా పసిఫిక్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన సఫైర్ 92.36% ఓటీపీతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్ విభాగంలో జపాన్‌కు చెందిన ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ 82.75% ఓటీపీతో అగ్ర స్థానం దక్కించుకుంది. జపాన్ ఎయిర్‌లైన్స్ (82.58% ఓటీపీ), థాయ్ ఎయిరేషియా (82.52% ఓటీపీ) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. విమానం నిర్దేషించిన సమయానికి 15 నిమిషాలు ముందే వస్తే ఆన్‌టైమ్ షెడ్యూల్ అని సిరియమ్ నివేదిక తెలిపింది. -
ఇండిగో నిర్వాకం: ఇక సీటు కుషన్‌కీ డబ్బులు అడుగుతారేమో?
ఇండిగో విమానంలో ఒక ప్యాసింజర్‌కి వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ప్రయాణీకులు తక్కువగా ఉన్నారని ప్రయాణికులను దించేసి వెళ్లి పోయిన ఘటన మరువకముందే విమానంలో సీటు కుషన్ మిస్ అయిన ఘటన నెటిజనుల ఆగ్రహానికి కారణమైంది. ఇండిగో ఫ్లైట్ 6E6798లో నాగపూర్‌కు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. అనుకున్న సమయనికి విమానం ఎక్కి, విండో సీట్ నెం 10A ఎంజాయ్ చేయాలన్న ఉత్సాహంతో దగ్గరికి వెళ్లి చూసి ఒక్కసారి షాక్ అయ్యారు. సీటులోని కుషన్ మిస్ అయింది. కేవలం స్టీల్ ఫ్రేమ్ మాత్రమే కనిపించింది. ఇండిగో విమానంలో పూణె నుంచి నాగ్ పూర్ వెళ్తున్న సాగరిక పట్నాయక్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. దీంతో వెంటనే క్యాబిన్ సిబ్బందిని సంప్రదించారు. సీటు కింద ఉంటుంది చూడండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అలా కూడా లేకపోవడంతో మళ్లీ సిబ్బందిని అడిగే అప్పుడు తీసుకొచ్చి కుషన్ అమర్చారు. అప్పటివరకు ఆమె నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది. సాగరిక భర్త సుబ్రత్ పట్నాయక్ దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. లాభాలను పెంచుకునే మార్గం ఇదేనా.. చాలా దారుణం అంటూ ట్వీట్ చేశారు. బోర్డింగ్‌కు ముందు గ్రౌండ్ స్టాఫ్ , సిబ్బంది నిర్లక్ష్యాన్ని సుబ్రత్ ప్రశ్నించారు. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ట్రయల్ కావచ్చు. త్వరలోనే ఇండిగో సీట్ కుషన్ల కోసం 250-500 వసూలు చేస్తుందేమో అంటూ ఒకరు సెటైర్లు వేశారు. మరోవైపు దీనిపై ఇండిగో స్పందించింది. అసౌకర్యానికి చింతిస్తున్నాం. సీటు కుషన్ దాని వెల్క్రో నుండి కొట్టుకుపోతుంది.దాన్ని సిబ్బంది రీప్లేస్ చేస్తుంది. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలను అందిస్తామంటూ ఇండిగో ఎయిర్ లైల్స్ వివరణ ఇచ్చింది. #Indigo !! #Flight 6E 6798 !! Seat no 10A ! Pune to Nagpur!!! Today’s status … Best way to increase profit 😢😢…Pathetic … pic.twitter.com/tcXHOT6Dr5 — Subrat Patnaik (@Subu_0212) November 25, 2023 -
8 మందే ప్రయాణికులు.. విమానం దిగమని కోరిన సంస్థ
విమానం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులను దించేసిన సంఘటన బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లోని ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నుంచి చెన్నైకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు ఎక్కారు. అయితే వారిని మరో విమానంలో ఎక్కిస్తామని హామీ ఇచ్చారు. దాంతో సదరు ప్రయాణికులు దిగిపోయారు. కేవలం ఎనిమిది మందితో ప్రయాణించేందుకు ఇండిగో నిరాకరించినట్లు తర్వాత ప్రయాణికులు గ్రహించినట్లు తెలిసింది. ఇండిగో విమానం 6E 478 ఆదివారం సాయంత్రం అమృత్సర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి బయలుదేరింది. అయితే ఎనిమిది ప్రయాణికులు మినహా ఇతర ప్రయాణికులు బెంగళూరులోనే దిగిపోయారు. విమానంలో కేవలం ఎనిమిది మందే ఉండడంతో వారిని వేరే విమానంలో చెన్నై పంపిస్తామని కోరాగా వారు దిగిపోయారు. అయితే కేవలం 8 మందితో ప్రయాణించేందుకు ఇండిగో నిరాకరించిందని తెలిసింది. దాంతో ఆదివారం రాత్రి బెంగళూరులోనే ఉండి సోమవారం వెళ్లాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. తమ ప్రయాణానికి అడ్డంకి ఏర్పడినప్పటికీ విమానయాన సంస్థ వారి బసకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు. ‘నవంబర్ 19, 2023 రోజున ఫ్లైట్ 6E 478 అమృత్సర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నై బయలుదేరింది. అమృత్సర్ నుంచి వచ్చే మరో ఎయిర్‌క్రాఫ్ట్ ఆలస్యం అయింది. దాంతో ఈ ఎనిమిది మంది చెన్నైకి వెళ్లే విమానం ఎక్కలేకపోయారు. ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ ప్రయాణికులకు సహాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. రాత్రిపూట వసతితో పాటు తదుపరి విమానంలో ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. కానీ కొందరు ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లాంజ్‌లో ఉండాలనుకున్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’అని ఇండిగో ప్రకటన విడుదల చేసింది. -
చరిత్ర సృష్టించిన ఇండిగో ఎయిర్‌లైన్స్
విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అందుకు తగినట్లు ఎయిర్ లైన్స్ సంస్థలు తమ ఫ్లైట్స్, రూట్ల సంఖ్యను పెంచుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో రోజూ రెండు వేల విమానాలు నడిపి భారత విమానయాన రంగంలో చరిత్ర సృష్టించింది. రోజుకు రెండు వేలకు పైగా విమానాలు నడిపి ఇండిగో సంస్థ కొత్త మైలురాయిని చేరింది. దాంతో దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ఎయిర్‌లైన్‌గా నిలిచింది. అక్టోబర్ 2023కి సంబంధించిన ఓఏజీ డేటా ప్రకారం.. ఫ్రీక్వెన్సీ, సీట్ కెపాసిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో చోటు దక్కించుకుంది. 'ఇండిగో ఇప్పుడు ప్రణాళికబద్ధంగా రోజు రెండు వేలకు పైగా విమానాలను నడుపుతోంది. ఇందులో కార్గో ఆపరేషన్స్, సీఏపీఎఫ్, ఆర్మీ చార్టర్లు ఉన్నాయి. సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన 17 ఏళ్లలోనే ఈ ఘనత సాధించింది. ఆపరేషనల్ సామర్థ్యం, విశ్వసనీయత, కస్టమర్ ఓరియంటేషన్లో కొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేసింది' అని ఎయిర్‌లైన్ సీఈఓ పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. ఇది కేవలం సంఖ్యాపరమైన ఘనతేకాదని, కనెక్టివిటీతో పాటు ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచే అవకాశం కల్పించేదిగా భావిస్తున్నట్లు పీటర్ చెప్పారు. -
విమానంలో వెర్రి వేషాలు, నిద్ర నటించిన మహిళ ఏం చేసిందంటే?
విమానయాన సంస్థ ఇండిగోలో తోటి ప్యాసెంజర్ పట్ల అభ్యంతరకంగా ప్రవర్తించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. విమానంలో మహిళా ప్రయాణికురాలి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ముంబై-గౌహతి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలికి ఈ చేదు అనుభవం ఎదురైంది. గత మూడు నెలల్లో ఇది అయిదో కేసు కావడం గమనార్హం. ఈ ప్రయాణంలో క్యాబిన్ లైట్లు ఆర్పింది మొదలు పక్క సీట్లో ఉన్న ప్రయాణికుడు ఉన్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. చేయి పెట్టుకోవడానికి ఉండే రెస్ట్ హ్యాండిల్ ను పైకి తోసేసి మరీ ఆమెన అభ్యంతరకరంగా తాకాడు. దీంతో సీట్ల మధ్యలోని హ్యాండిల్‌ను మరోసారి కిందకు దించేసింది. అయినా వాడి తీరు మారలేదు. అయితే మరికొంత టైం అతగాడిని పరీక్షిద్దామనుకున్న మహిళ ఆర్మ్‌రెస్ట్‌ని తిరిగి కిందకి దించి, నిద్రపోతున్నట్టుగా నటించి, వీడి సంగతేదో చూద్దామనుకుంటూ ఒక కన్నేసి ఉంచింది. (రిలయన్స్ ఇషా అంబానీ మరో భారీ డీల్: కేకేఆర్ పెట్టుబడులు) వంకర బుధ్దిని పోనిచ్చుకోని ఆ ప్రయాణికుడు ఆమె నిద్రించిందని భావించి, మళ్లీ తన చేతికి పని చెప్పాడు. ఇక్కడే ఆ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. కావాలనే చేస్తున్నాడని నిర్ధారించుకన్నా ఆ మహిళ, చిర్రెత్తుకొచ్చి ఒక్కసారిగా లైట్లు ఆన్ చేసి అరవడం ప్రారంభించింది. క్యాబిన్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో దిమ్మదిరిగి బొమ్మ కనపడిన అతగాడు చేసిన పనికి కాళ్లావేళ్లా పడి క్షమాపణ చెప్పడం ప్రారంభించాడని మహిళ తెలిపింది. (ఇన్ఫ్లేషన్ మండుతోంటే..ఈ డ్యాన్స్‌లేంటి? కమలా హ్యారిస్‌పై మండిపాటు ) కానీ బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని, దర్యాప్తులో సాయం అందిస్తామని ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. -
వరుసగా మృతిచెందుతున్న పైలట్లు.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: మియామి నుండి చిలీ ప్రయాణిస్తున్న విమానంలో పైలెట్ బాత్రూమ్లో కుప్పకూలి మృతి చెందిన సంఘటన మరువక ముందే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ పైలట్లు రెండు వేర్వేరు సంఘటనల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ శాఖ డైరెక్టరేట్ జనరల్ ధృవీకరించారు. మృతి చెందినవారిలో ఒకరు ఇండిగో ఎయిర్ లైన్స్ కెప్టెన్ కాగా మరో పైలట్ ఖతార్ ఎయిర్ లైన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండిగో కెప్టెన్ ఈరోజు నాగ్‌పూర్ నుండి పూణే విమాన సర్వీసు నడిపించాల్సి ఉండగా నాగ్‌పూర్ బోర్డింగ్ గేటు వద్దే స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించాయి ఆసుపత్రి వర్గాలు. ఈయన రెండు సెక్టార్లు ఆపరేట్ చేశారని ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు ట్రివేండ్రం నుండి పూణే మీదుగా నాగ్‌పూర్ చేరుకున్నారని అనంతరం 27 గంటల విరామం తర్వాత ఈరోజు నాలుగు సెక్టార్లు ఆపరేట్ చేయాల్సి ఉందని సివిల్ ఏవియేషన్ శాఖ వెల్లడించింది. కానీ అంతలోనే ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు నాగ్‌పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేటు వద్ద కుప్పకూలి మృతి చెందారు. ఖతార్ ఎయిర్ లైన్స్ పైలట్ మాత్రం నిన్న అదనపు సిబ్బందిగా ఢిల్లీ దోహా ఫ్లైట్‌లో పాసింజర్ క్యాబిన్ లో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. అంతకు ముందు ఈయన స్పైస్ జెట్, అలయన్స్ ఎయిర్, సహారా ఎయిర్ లైన్స్ కు పనిచేశారు. ఇలా వరుస రోజుల్లో పైలట్లు గుండెపోటుతో మృతి చెందడంతో సివిల్ ఏవియేషన్ వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు.. -
ఇంటర్‌గ్లోబ్ విలువ రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ఇండిగో బ్రాండ్ విమానయాన సేవల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలిసారి రూ. లక్ష కోట్లను తాకింది. వెరసి దేశీయంగా ఈ మైలురాయిని చేరిన తొలి ఎయిర్‌లైన్స్ కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లడంతో కంపెనీ తాజా ఫీట్‌ను సాధించింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 5 శాతమే బలపడటం గమనార్హం! బుధవారం స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఇండిగో షేరు 3.6 శాతం జంప్‌చేసింది. బీఎస్ఈలో రూ. 2,620కు చేరగా.. ఎన్ఎస్ఈలో రూ. 2,621 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 2,634 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. వెరసి కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,01,007 కోట్లను అధిగమించింది. సోమవారం ఎయిర్‌బస్ నుంచి 500 విమానాల కొనుగోలుకి ఆర్డర్ జారీ చేసింది. తద్వారా ఎయిర్‌బస్ చరిత్రలోనే భారీ కాంట్రాక్టుకు తెరతీసింది. దీర్ఘకాలిక వృద్ధిలో భాగంగా భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంతో ఇండిగో కౌంటర్ జోరందుకుంది. ఇందుకు సరికొత్త గరిష్టాలకు చేరిన స్టాక్ మార్కెట్లు సైతం దోహదపడినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశీయంగా అతిపెద్ద విమానయాన కంపెనీగా నిలుస్తున్న ఇండిగో అంతర్జాతీయంగా విస్తరించేందుకూ ప్రణాళికలు అమలు చేస్తోంది. దేశీయంగా కంపెనీ మార్కెట్ వాటా 61 శాతానికిపైగా నమోదుకావడం విశేషం! -
ఏవియేషన్ చరిత్రలో అదిపెద్ద డీల్.. 500 విమానాలకు ఇండిగో ఆర్డర్
ఏవియేషన్ చరిత్రలో అతి పెద్ద డీల్ జరిగింది. దేశీయ ఏయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగో ఫ్రాన్స్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి 500 విమానాల్ని కొనుగోలు చేసేలా ఒప్పందం కుదర్చుకుంది. ఇప్పటికే టాటాలకు చెందిన ఎయిరిండియా ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి 470 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టింది. ఆ ఒప్పందం కంటే ఇండిగో - ఎయిర్ బస్‌ల మధ్య జరిగిన డీల్ దేశీయ విమాన చరిత్రలో ఇదే పెద్దదని పరిశ్రమ వర్గాల విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 19న ప్యారిస్ ఎయిర్ షోలో ఇండిగో - ఎయిర్‌బస్‌ల మధ్య కొనుగోలు చర్చలు జరిగాయి. ఈచర్చల్లో సందర్భంగా ఇండిగో బోర్డ్ఆఫ్ చైర్మన్ వి.సుమత్రాన్, ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, ఎయిర్‌బస్ సీఈవో గుయిలౌమ్ ఫౌరీ, అంతర్జాతీయ చీఫ్ కమర్షియల్ అధికారి క్రిస్టియన్ షెరర్లు పాల్గొన్నారు. అనంతరం, దేశ ఏవియేషన్ హిస్టరీలోనే భారీ కొనుగోలు ఒప్పందం జరిగింది. 500 ఏ320 ఎయిర్ క్రాఫ్ట్‌ల కొనుగోలుకు ఆర్డర్ పెట్టినట్లు ఇండిగో తెలిపింది. తాజా ఇండిగో చేసిన ఆర్డర్‌తో ఎయిర్‌బస్ డెలివరీ చేయాల్సిన విమానాల సంఖ్య 1,330కి చేరింది. కాగా, ప్రస్తుతం ఇండిగో 300 విమానాలను నడుపుతోంది. ఇది వరకే 480 విమానాలకు ఆర్డర్ పెట్టింది. ఇవి డెలివరీ అవ్వాల్సి ఉంది. -
ఆ ఎయిర్ లైన్స్, ఎయిర్‌పోర్ట్‌లకి భారీ షాక్! ప్రయాణికుడి పట్ల అలా వ్యవహరించడంతో..
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కి, ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి వినియోగదారుల కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఓ ప్రయాణికుడి సంరక్షణ విషయంలో అలా వ్యవహరించినందుకు చురకలంటిస్తూ భారీగా నష్ట పరిహారం చెల్లించమని ఆదేశించింది కోర్టు. ఈ ఘటన బెంగుళూరు కెంపెగోద్వా అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అసలేం జరిగందంటే.. నవంబ్ 2021లో చంద్ర శెట్టి అనే ప్రయాణికుడు అతడి కుటుంబం మంగళూరులోని తమ స్వగ్రామానికి వెళ్లడం కోసం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానకి చేరుకున్నాడు. సరిగ్గా అప్పుడే అనూహ్యంగా శెట్టి నేలపై కుప్పకూలిపోయారు. అదే సమయంలో అతని పక్కనే ఉన్న భార్య సుమతి, కూతురు దీక్షిత విమానాశ్రయ సిబ్బందిని, ఎయిర్‌పోర్టు అధికారులను సాయం చేయమని కోరారు. అయితే వారంతా బాధితుడికి సహాయం చేయడంలో విఫలమయ్యారు. కనీసం అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు కనీసం వీల్‌చైర్ కూడా అందుబాటులో లేదు. దీంతో కుటుంబం సభ్యులు అతడిని రక్షించుకోవడం కోసం ఎంతో తర్జనాభర్జనా పడి సుమారు 45 నిమిషాలకు ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మార్గమధ్యలో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో బాధితుడు కుటుంబ సభ్యులు కెంపెగోద్వా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పోలీస్టేషన్ని ఆశ్రయించి కేసు నమోదు చేశారు. ఐతే కేసులో పెద్దగా పురోగతి లేకపోవడంతో సదరు కుటుంబం బెంగళూరు అర్బన్ జిల్లాలో ఉన్న వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించింది. అయితే విమానాశ్రయ అధికారులు వినియోగదారుల కోర్టు ఎదుట ఆరోపణలను తిరస్కరించగా, ఇండిగో మాత్రం పదేపదే నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించ లేదు. చివరికి బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సదరు బాధిత ప్రయాణికుడని టెర్మినల్‌లోని క్లినిక్‌కి తీసుకెళ్లామని, ఈ తర్వాత బగ్గీలో ఆస్టర్ ఆస్పత్రికి తరలించినట్లు డాక్యుమెంట్లను కోర్టుకి సమర్పించింది. దీంతో వినయోగాదారుల కోర్టు కుటుంబ సభ్యుల ఆరోపణలను సమర్థిస్తూ..విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్‌లైన్స్ సదరు ప్రయాణికుడి సంరక్షణ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించినట్లు గుర్తించామని స్పష్టం చేసింది. ప్రయాణికులకు కావాల్సిన చోట సురక్షితమైన వాతావరణాన్ని అందిచాల్సిన బాధ్యత ఎయర్పోర్టు, ఎయిర్లైన్స్లదేనని పేర్కొంది. అందువల్ల బాధితుడి కుటుంబానికి నష్టపరిహారంగా బెంగుళూరు ఎయిర్‌పోర్టు, ఇండిగో ఎయిర్‌లైన్స్ సంయుక్తంగా దాదాపు రూ.12 లక్షలు చెల్లించాలిని, అలాగే కోర్టు ఖర్చుల కింద రూ. 10 వేలు చెల్లించాలని వినియోగాదారుల కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం వచ్చిన 45 రోజుల్లోపు చెల్లించాలని పేర్కొంది. (చదవండి: త్వరలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం! 9 ఏళ్ల పాలనకు గుర్తుగా..) -
మంచు లక్ష్మికి చేదు అనుభవం.. 103 డిగ్రీల జ్వరంతో ఉన్నా పట్టించుకోలేదు..
ఈ మధ్య ఎయిర్ లైన్ సంస్థ వల్ల సినీ సెలబ్రెటీలు ఇబ్బంది పడ్డ సంఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత ఎయిర్ లైన్ ఇండిగో సంస్థ వల్ల నటీనటులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. స్టార్ హీరో రానా నుంచి యాంకర్ అనసూయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ వరకు ఇలా ఎందరో ఎయిర్‌పోర్ట్‌లో ఇబ్బంది పడ్డారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ నటి మంచు లక్ష్మి చేరింది. ఇటీవల తిరుపతి వెళ్లిన ఆమెకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. చదవండి: దీన స్థితిలో ప్రముఖ నిర్మాత, అండగా నిలిచిన స్టార్ హీరో తన పర్స్ పోయిందని, 103 డిగ్రీల జ్వరంలో బాధపడుత్ను తను దాదాపు 40 నిమిషాలు గేటు బయటే వేచి చూడాల్సి వచ్చిందంటూ ఇండిగో సిబ్బంది నిప్పులు చెరిగారు. ఈ మేరకు లక్ష్మి మంచు ట్వీట్ చేశారు. సోమవారం తిరుపతి నుండి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో మంచు లక్ష్మి బయలు దేరారు. అయితే ఆ సమయంలో ఆమె అసౌకర్యానికి గురయ్యారు. సాయం కోరితే ఆమె ప్రయాణించి సమయం కన్నా సదరు విమానయాన సిబ్బంది తీసుకున్న సమయం ఎక్కువ సేపంటూ సెటైర్ వేశారు. మొదట ఈ ట్వీట్‌కు ఇండిగో ఎయిర్‌లైన్ తప్పుడు ట్యాగ్ జోడించిన మంచు లక్ష్మి ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. చదవండి: బిడ్డ పుట్టిన మూడు నెలలకే వచ్చాను.. అందరు ప్రశ్నిస్తున్నారు: కాజల్ అగర్వాల్ ‘ఇండిగో సిబ్బంది ఎయిర్‌పోర్టులో నాకు సహాయం చేసిన సమయం కంటే త్వరగా నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చేశాను. విమానంలో నా పర్స్ పోయింది. సాయం అడిగితే ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. 103 డిగ్రీల జ్వరంతో దాదాపు 40 నిమిషాలు గేటు బయటే వేయిట్ చేశా. సాయం చేయడానికి ఏ ఒక్క సిబ్బంది రాలేదు. నేను హెల్స్ అడిగిన క్షణాల్లోనే వారు కనుమరుగయ్యారు. ఇందుకు నాకు ఉన్న హైఫివర్ కూడా వారిని కదించలేదు. ఇండిగో.. దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా?’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇక దీనికి స్పందించిన ఇండిగో యాజమాన్యం ‘మేడమ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మా మేనేజర్‌తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీరు మరిచిపోయిన బ్యాగ్‌ను తిరిగి పొందడంలో మా సిబ్బంది మీకు సహాయం చేశారని అనుకుంటున్నాం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అంటూ రాసుకొచ్చింది. I got to hyd from tpt quicker than @IndiGo6E staff helping me at the airport. They’ve just disappeared. Having 103 fever doesn’t help either. @IndiGo6E isn’t there a process???? pic.twitter.com/qJbsg2pbCQ — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 6, 2023 I got to hyd from tpt quicker than @IndiGo6E staff helping me at the airport. They’ve just disappeared. Having 103 fever doesn’t help either. @IndiGo6E isn’t there a process???? pic.twitter.com/qJbsg2pbCQ — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 6, 2023 -
దేశీయంగా విమాన ప్రయాణాలు రెట్టింపు
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో రెట్టింపు స్థాయిలో నమోదైంది. 64.08 లక్షల నుంచి 1.25 కోట్లకు చేరింది. పౌర విమానయాన డైరెక్టరేట్ డీజీసీఏ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఫ్లయిట్పరమైన, బ్యాగేజ్పరమైన, సిబ్బంది ప్రవర్తనపరమైన సమస్యలపై మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి. వరుసగా అయిదో నెల జనవరిలోనూ ఇండిగో దేశీ మార్కెట్ వాటా తగ్గింది. 54.6 శాతానికి చేరింది. గతేడాది ఆగస్టులో ఇది 59.72 శాతంగా ఉండేది. ఇండిగో గత నెల 68.47 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. మరిన్ని కీలకాంశాలు.. ► సమీక్షాకాలంలో ఎయిరిండియా 11.55 లక్షల మందిని, విస్తారా 11.05 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చాయి. వాటి మార్కెట్ వాటా వరుసగా 9.2 శాతం, 8.8 శాతంగా ఉంది. ► బడ్జెట్ విమానయాన సంస్థలు గో ఫస్ట్‌లో 10.53 లక్షల మంది, ఎయిర్ఏషియా ఇండియాలో 9.30 లక్షల మంది, స్పైస్‌జెట్ ఫ్లయిట్స్‌లో 9.14 లక్షల మంది ప్రయాణించారు. ► టాటా గ్రూప్‌లో భాగమైన విస్తారా, ఎయిరిండియా, ఎయిర్ఏషియా ఇండియా కలిపి 32.30 లక్షల మంది ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేర్చాయి. 26 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. ► మొత్తం ఏడు దేశీ ఎయిర్‌లైన్స్‌లోనూ సీక్వెన్షియల్‌గా చూస్తే జనవరిలో సీట్ల భర్తీ స్థాయి (పీఎల్ఎఫ్) తగ్గింది. ► సమయపాలనలో (ఓటీపీ) ఇండిగో అగ్రస్థానంలో కొనసాగింది. హైదరాబాద్ సహా నాలుగు కీలక మెట్రో ఎయిర్‌పోర్టుల్లో సగటున 84.6% ఫ్లయిట్లను నిర్దేశిత సమయంలో నడిపింది. -
ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు.. ఏం జరిగిందంటే..
ఇండిగో ఎయిర్ లైన్స్ తమ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. గురువారం (ఫిబ్రవరి 9) హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన 6ఈ 409 విమానం 37 మంది ప్రయాణికులకు సంబంధించిన లగేజీ బ్యాగులను హైదరాబాద్‌లోనే వదిలేసి వెళ్లిపోయింది. విశాఖపట్నం చేరుకున్న అనంతరం తమ బ్యాగుల కోసం వెతికిన ప్రయాణికులు.. వాటిని విమాన సిబ్బంది అక్కడే వదిలేసి వచ్చారని తెలుసుకుని ఎయిర్ లైన్స్ యాజమాన్యంపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ యాజమాన్యం స్పందిస్తూ ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారికి క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది. జరిగిన పొరబాటు మానవ తప్పిదమని, 37 మంది ప్రయాణికుల బ్యాగులను వారి విశాఖపట్నంలోని వారి చిరునామాలకు వీలైనంత త్వరగా, సురక్షితంగా చేరుస్తామని హామీ ఇచ్చింది. ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలియజేసింది. కాగా లగేజీని విమాన సిబ్బంది హైదరాబాద్‌లోనే వదిలేసి వచ్చారని తెలుసుకున్న ప్రయాణికులు తమ బ్యాగుల కోసం గంటతరబడి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లోనే ఎదురుచూశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిర్‌లైన్స్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత సేపటికి లగేజీని సురక్షితంగా ప్రయాణికుల ఇళ్లకు చేరుస్తామని విమాన సంస్థ హామీ ఇవ్వడంతో శాంతించారు. (ఇదీ చదవండి: మారిషస్‌కు విస్తారా సర్వీస్) -
రానా లగేజ్ మిస్సింగ్.. క్షమాపణలు చెప్పిన ఇండిగో ఎయిర్‌లైన్స్
ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై హీరో రానా దగ్గుబాటి చేసిన ట్వీట్‌పై ఆ కంపెనీ స్పందించింది. జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. మీ లగేజీని వీలైనంత త్వరగా మీకు చేరేలా చూసేందుకు మా సిబ్బంది పనిచేస్తున్నారు అంటూ రిప్లయ్ ఇచ్చింది. కాగా ఇండిగో ఏయిర్ లైన్స్ సేవలపై రానా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన రానాకు అక్కడ చెక్ ఇన్ అయ్యాక ఫైట్ ఆలస్యమంటూ, మరో విమానంలో వెళ్లాల్సిందిగా సూచించారు. అయితే బెంగళూరు చేరుకున్నాక లగేజ్ రాకపోవడంతో రానా అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా వారి దగ్గర్నుంచి సరైన సమాధానం రాలేదు. దీనిపై అసహం వ్యక్తం చేస్తూ.. ఇండియాలో ఇండిగో(IndiGo) అంత చెత్త విమాన ప్రయాణం చేయలేదు. విమానం టైమింగ్స్ గురించి ఎవరికీ తెలీదు. కనిపించకుండా పోయిన లగేజ్ గురించి తెలియదు. సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలీదు. ఇంత కన్నా చెత్తగా సర్వీస్ ఏదైనా ఉంటుందా అంటూ ఫైర్ అయ్యారు. Sir, we understand the discomfort when the bag doesn't arrive with you. While we apologise for the inconvenience caused in the meantime, please be assured, our team is actively working to get your luggage delivered to you at the earliest. (1/2) — IndiGo (@IndiGo6E) December 4, 2022 -
ఇండిగో ఎయిర్‌లైన్స్ పరిమిత ఆఫర్.. కేవలం రూ. 2218లకే విమాన ప్రయాణం!
దేశీయ విమానాల్లో ప్రయాణించే వారికి శుభవార్త చెప్పింది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఏయిర్ లైన్స్. ప్యాసింజర్లను ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్‌ని తీసుకొచ్చింది. కేవలం రూ. 2218 (వన్ వే ఛార్జీ) ప్రారంభ ధరతో విమానంలో ప్రయాణించడానికి గొప్ప ఆఫర్‌తో ప్రయాణికులకు అందించనుంది. ఇండిగో సంస్థ ప్రకటించిన ఈ వింటర్ సేల్ ఆఫర్ డిసెంబర్ 1న ప్రారంభం కాగా డిసెంబర్ 6 తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో టికెట్స్‌ను బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దేశంలో ఏ ప్రదేశానికైనా త్వరలో మీరు వెళ్లాలనుకుంటే ఈ 6 రోజుల్లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ విండో ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉండగా, డిసెంబర్ 6 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ప్రకారం జనవరి 10 నుంచి ఏప్రిల్ 13 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. ఇది పరిమిత సీట్లకు మాత్రమే. ఈ ఆఫర్లో విమానాశ్రయ ఛార్జీలు, ప్రభుత్వ పన్నులపై తగ్గింపు వర్తించదు. మరో విషయం ఏంటంటే ఇండిగో దేశీయ నెట్‌వర్క్‌లోని వివిధ రంగాలలో నాన్‌స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. గ్రూప్ బుకింగ్‌లపై ఈ ఆఫర్ వర్తించదు. ఈ ఆఫర్‌ను బదిలీ చేయడం, నగదుగా మార్చడం వంటివి సాధ్యం కాదు. ఇండిగో అందించే ఈ ఆఫర్ పూర్తిగా బెస్ట్ ఎఫర్ట్ ప్రాతిపదికన అందిస్తోంది. పరిస్థితుల బట్టి ముందస్తు నోటీసు లేకుండా, కారణం చెప్పకుండా ఈ ఆఫర్‌ను ఎప్పుడైనా రద్దు చేసే లేదా సవరించే హక్కును ఇండిగో సంస్థకు ఉంది. Winter sale alert! Domestic fares starting at ₹2,218. Hurry, book before 06-Dec-22 for travel between 10-January-23 and 13-April-23. Book now https://t.co/uwwNJostmC pic.twitter.com/TibbaAsWy0 — IndiGo (@IndiGo6E) December 2, 2022 చదవండి: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ! -
ఇండిగో విమాన సంస్థపై రానా ఆగ్రహం!
ఇండిగో ఏయిర్ లైన్స్ సేవలపై హీరో రానా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన లగేజ్ మిస్ అయిందని, సిబ్బంది దాన్ని వెతికి పట్టుకోలేకపోయారని ఫైర్ అయ్యాడు. ఇండిగో ఏయిర్ లైన్స్ వల్ల అత్యంత చెత్త అనుభవం ఎదురైందంటూ ట్విటర్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ‘ఇండిగో విమాన సేవలు సరిగా లేవు. మిస్సైన లగేజ్ ట్రాకింగ్ కూడా సరిగా లేదు. ప్రయాణికుల లగేజ్ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఉండదు. ఇక్కడి సిబ్బందికి కూడా సరైన సమాచారం ఉండదు’అని రానా ట్వీట్ చేశాడు. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు వెళ్లేందుకు రానా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాడు. అక్కడ చెక్ ఇన్ అయ్యాక ఫ్లైట్ ఆలస్యమంటూ సిబ్బంది సమాచారం ఇచ్చింది. మరో విమానంలో వెళ్లాల్సిందిగా సూచించారు. లగేజ్ కూడా అదే విమానంలో పంపిస్తామని చెప్పారు. బెంగళూరు చేరుకున్నాక కూడా లగేజ్ రాకపోవడంతో రానా అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. India’s worst airline experience ever @IndiGo6E !! Clueless with flight times…Missing luggage not tracked…staff has no clue 💥 can it be any shittier !! pic.twitter.com/odnjiSJ3xy — Rana Daggubati (@RanaDaggubati) December 4, 2022 -
'మెడల్స్ అక్కడే వదిలేసి రమ్మంటారా?'.. స్టార్ స్విమ్మర్‌కు అవమానం
భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. నటరాజ్‌తో పాటు అతని బృందానికి ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది భారీ జరిమానా విధించింది. లగేజీ ఎక్కువగా ఉండమే దీనికి కారణం అని తెలిసింది. అయితే లగేజీలో ఉన్నవాటిలో ఎక్కువమొత్తంలో మెడల్స్ ఉన్నాయి. వాటి బరువు వల్లే లగేజీ బరువు పెరిగిపోయిందని శ్రీహరి నటరాజ్ బృందం పేర్కొంది. 36వ జాతీయ క్రీడలు ముగించుకొని వస్తున్న సమయంలో గుజరాత్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే విషయమై శ్రీహరి నటరాజ్ మాట్లాడుతూ.. '' గుజరాత్లో జరిగిన 36వ జాతీయ క్రీడలు ముగించుకొని మా బృందంతో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాను. కానీ ఇండిగో సిబ్బంది మాతో దురుసుగా ప్రవర్తించడమే గాక అదనపు లగేజీ కారణంగా భారీ జరిమానా విధించారు. అయితే అదనపు లగేజీగా భావిస్తున్న వాటిలో మెడల్స్, అథ్లెట్స్‌కు సంబంధించిన వస్తువులే ఉన్నాయి. నిజాయితీగా చెప్పాలంటే వారి విధించిన జరిమానా మాకు పెద్ద విషయం కాకపోవచ్చు..కానీ నాతో పాటు మా బృందాన్ని ట్రీట్ చేసిన తీరు బాగాలేదు. సిబ్బంది తీరు చూస్తుంటే ఎక్కడ మెడల్స్ గెలిచామో అదే స్థలంలో విడిచిపెట్టాలన్నట్లుగా ఉంది.'' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక జాతీయ క్రీడల్లో తొలిసారి పాల్గొన్న శ్రీహరి నటరాజ్ అదరగొట్టాడు. జాతీయ క్రీడల్లో కర్నాటక తరపున పాల్గొన్న నటరాజ్ వివిధ విభాగాలు కలిపి ఆరు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో మంచి ప్రదర్శన కనబరిచిన శ్రీహరి నటరాజ్ తృటిలో పతకం కోల్పోయినప్పటిక A-స్టాండర్డ్‌లో చోటు సంపాదించాడు. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పతకం సాధించడంలో విఫలమైనప్పటికి 100 మీ, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. Dear @IndiGo6E I was returning from the National Games held in Gujarat, and the staff not only behaved badly, but also charged us a hefty amount for excess baggage which was the medals and goodies that we athletes had won. — Srihari Nataraj OLY (@srihari3529) October 10, 2022 Honestly, the amount wasn't an issue, it's the the way they treated me and my teammates. Should we leave the medals we win back at the venue?🤔 @IndiGo6E — Srihari Nataraj OLY (@srihari3529) October 10, 2022 National Games Round Up: Srihari Nataraj finishes campaign with a flourish, claiming sixth gold with 100m Freestyle win@YASMinistry@IndiaSports @PIB_Indiahttps://t.co/bVhWkybCuu pic.twitter.com/3EhIB1yWbT — PIB in Tripura (@PIBAgartala) October 9, 2022 చదవండి: పుట్టినరోజున హార్దిక్ పాండ్యా ఎమోషనల్.. బెలూన్ వరల్డ్‌కప్.. క్రీడాకారిణి ప్రాణం మీదకు -
విమానం కిందకు కారు.. తప్పిన పెను ప్రమాదం!
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ఎంతలా అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా వాహనకారులకు స్పీడ్‌గా వెళ్లకుండా ఉండేలా జరిమానాలు విధిస్తూ కట్టిడి చేస్తున్నప్పటికీ ప్రమాదం ఎటూ నుంచి ముంచుకొస్తోందో అర్థం కాని స్థితి. ప్రస్తుతం ఇక్కడ కూడా అలానే జరిగింది. అదీకూడా విమానాశ్రంయలో కట్టుదిట్టమైన భద్రతతో కూడిన ఆ చోట కన్నురెప్ప పాటులో ఒక పెద్ద పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళ్తే....ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం ఏ 320 నియో ఢాకాకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన కారు.. విమానం కిందకు వెళ్లిపోయింది. వాస్తవానికి విమానం ముందు చక్రానికి ఢీ కొట్టిందేమోనని అక్కడ ఉన్న అధికారులు టెన్షన్‌తో ఊపిరి బిగపెట్టుకుని చూస్తున్నారు. ఐతే అనూహ్యంగా తృటిలో పెద్ద పెనుప్రమాదం తప్పిపోయింది. ఆ విమానానికి ఉన్న ముందు చక్రానికి వెంట్రుకవాసి దూరంలో ఈ కారు ఆగిపోయింది. ఈ ఘటనకు గల కారణాలు గురించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేదా డీజీసీఏ సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు. సదరు కారు డ్రైవర్ మద్యం సేవించి ఇలా ర్యాష్‌గా కారు నడిపాడేమోనని బ్రీత్ ఎనలైజర్ పరీక్ష కూడా నిర్వహించారు. ఐతే నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఈ విమానం మంగళవారం ఉదయం పాట్నాకు వెళ్లేందకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం తలెత్తిందని పేర్కొన్నారు. ఐతే ఈ ఘటన పై ఇండిగో కానీ గో ఫస్ట్ గానీ స్పందించ లేదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. #WATCH | A Go Ground Maruti vehicle stopped under the nose area of the Indigo aircraft VT-ITJ that was parked at Terminal T-2 IGI airport, Delhi. It was an Indigo flight 6E-2022 (Delhi–Patna) pic.twitter.com/dxhFWwb5MK — ANI (@ANI) August 2, 2022 (చదవండి: పనసకాయ కోసం ఎన్ని తిప్పలు పడిందో ఈ ఏనుగు) -
వరుస ఘటనల కలకలం: ఇండిగో విమానం క్యాబిన్లో పొగలు
న్యూఢిల్లీ: అసలే వర్షాకాలం. దీనికి తోడు పలు సంస్థల విమానాల్లో వెలుగులోకి వస్తున్న సాంకేతిక లోపాలు విమాన ప్రయాణీకుల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే స్పైస్‌జెట్ విమానంలో వరుస ఘటనలు, విస్తారా విమానంలో ఇంజన్ ఫెయిల్ లాంటి అంశాలు ఆందోళన రేపాయి. ఇపుడిక ఈ జాబితాలో ఇండిగో చేరింది. ఇండోర్‌లో విమానాశ్రయంలో దిగిన తర్వాత ఇండిగో విమానంలో పొగలు వ్యాపించడం కలకలం రేపింది రాయ్‌పూర్-ఇండోర్ ఇండిగో విమానం మంగళవారం ల్యాండ్ అయిన తర్వాత క్యాబిన్లో పొగలు వచ్చినట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం తెలిపింది. అయితే ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ, ఈ ఘటనపై విచారణ చేపట్టామని డీజీసీఏ వెల్లడించింది. గత మూడు వారాల్లో అసాధారణ సంఘటనలు నమోదవుతున్నాయి. గో-అరౌండ్, మిస్డ్ అప్రోచ్‌లు, డైవర్షన్, మెడికల్ ఎమర్జెన్సీలు, ఎమర్జెనీ ల్యాండింగ్, క్యాబిన్లో పొగలు, వాతావరణం, టెక్నికల్, బర్డ్ హిట్లు ఉన్నాయి. కాగా గత 18 రోజుల్లో ఎనిమిది సాంకేతిక లోపాల ఘటనల నేపథ్యంలో డీజీసీఏ బుధవారం స్పైస్‌జెట్‌కి షో-కాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
బ్యాగ్ తారుమారు...ఇండిగోకు చుక్కలు చూపించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్..!
రోడ్డు, ట్రైన్ ప్రయాణాలు చేసినంత సులువుగా విమాన ప్రయాణాలు ఉండవు. విమానంలో వెళ్లాలంటే విమానశ్రయంలో సెక్యూరిటి, బోర్డింగ్ పాస్ చెకింగ్ ఇలా సవాలక్ష చెకింగ్స్ చూసుకున్న తరువాతనే ఎయిర్‌లైన్ బోర్డింగ్‌కు అనుమతినిస్తాయి. ఇక మన దగ్గర పరిమితికి మించి లగేజ్ ఉంటే మాత్రం అంతే సంగతులు..! దానికి అదనంగా కొత్త డబ్బు చెల్లించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన లగేజ్‌ను తీసుకోవడం కూడా అంతా ఈజీ కాదు..! కొన్ని సార్లు ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల లగేజ్‌ను వేరే గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. కాగా తాజాగా బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఇలాంటి సంఘటన ఎదురైంది. తన బ్యాగ్ మిస్సవ్వడంతో ఎయిర్‌లైన్స్‌కు చుక్కలు చూపించాడు. బ్యాగులు తారుమారు..! పాట్నా నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బ్యాగ్ తారుమారు కావడంతో కంపెనీ వెబ్‌సైట్‌ను హ్యక్ చేశాడు. ఎయిర్‌లైన్స్ కస్టమర్‌కేర్ నుంచి సరైన సహకారం రాక పోవడంతో తన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రతిభతో ఇండిగో ఎయిర్‌లైన్స్ వెబ్సైట్ హ్యక్ గురయ్యేలా చేశాడు. ఈ విషయాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ నందకుమార్ ట్విట్టర్లో వెల్లడించాడు. pic.twitter.com/GnnGKypGGJ — IndiGo (@IndiGo6E) March 29, 2022 మార్చి 27 న నందన్ ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించగా..ఆయన లగేజీను పొరపాటున సహా ప్రయాణికుడు తీసుకెళ్లాడు. తన బ్యాగు తారుమారైందని ఇంటికి వెళ్లాక గమనించాడు నందన్. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ కస్టమర్ కేర్ సిబ్బందిని సంప్రదించగా వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. తన బ్యాగ్ ను పట్లుకెళ్లిన వ్యక్తికి సంబంధించిన వివరాలను ఇవ్వడానికి ఎయిర్‌లైన్స్ ముందుకు రాలేదు. దీంతో @IndiGo6E వెబ్ సైట్లోకి దూరి రికార్డులను పరిశీలించి తనకు కావాల్సిన సమాచారాన్ని సేకరించాడు. సదరు ప్రయాణికుడి వివరాలతో తన బ్యాగును వెంటనే తెప్పించుకున్నాడు. స్పందించిన ఇండిగో..! నందన్ తన బ్యాగ్‌ను సంపాదించుకోవడమే కాకుండా ఇండిగో ఎయిర్ లైన్స్ వెబ్సైట్లో భద్రత లోపాలున్నట్లు ఎయిర్‌లైన్స్‌కు తెలియజేశాడు. కస్టమర్ కేర్ సేవలు చురుగ్గా ఉండేలా చూడాలని, యాక్టివ్ గా ఉండేలా చూడాలని తెలిపాడు. పలు లోపాల కారణంగా ప్రయాణికుల పూర్తి వివరాలు వెబ్సైట్ లీక్ చేస్తోందని వెల్లడించాడు. దీనిపై ఇండిగో స్పందిస్తూ, నందన్ కుమార్ కు జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. సెక్యూరిటీ లోపాలు లేకుండా జాగ్రత్త వహిస్తామని హామీ ఇచ్చింది. చదవండి: విప్లవాత్మక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించిన దుబాయ్ కంపెనీ..! రేంజ్లో కూడా అదుర్స్..! -
ఇండిగో విమానయాన సంస్థలో కీలక పరిణామం..! కారణం అదే..!
న్యూఢిల్లీ: ఇండిగో బ్రాండు విమానయాన కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ బోర్డుకు కంపెనీ సహవ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ రాజీనామా చేశారు. రానున్న ఐదేళ్లలో కంపెనీలోగల వాటాను నెమ్మదిగా తగ్గించుకోనున్నట్లు వెల్లడించారు. గంగ్వాల్తోపాటు, సంబంధిత సంస్థలకు ఇంటర్‌గ్లోబ్‌లో 37 శాతం వాటా ఉంది. రాహుల్ భాటియా, తత్సంబంధ సంస్థలకు 38 శాతం వాటా ఉంది. దశాబ్దన్నర కాలం నుంచీ కంపెనీలో దీర్ఘకాలిక వాటాదారుగా కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా గంగ్వాల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒకరోజు కంపెనీలో వాటాను విక్రయించాలన్న ఆలోచన రావడం సహజమని బోర్డు సభ్యులకు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. రానున్న ఐదేళ్లలో కంపెనీలో వాటాను తగ్గించుకోవడమే ప్రస్తుత ప్రణాళికని తెలియజేశారు. డిసెంబర్లో 2021 డిసెంబర్ 30న నిర్వహించిన అత్యవసర సమావేశం(ఈజీఎం)లో వాటాదారులు ప్రమోటర్ వాటా విక్రయానికి సంబంధించిన ప్రత్యేక రిజల్యూషన్‌కు ఆమోదముద్ర వేశారు. తద్వారా కంపెనీకున్న ఇద్దరు ప్రమోటర్లలో ఎవరైనా ఒకరు వాటాను విక్రయించదలిస్తే రెండో ప్రమోటర్కుగల నిరాకరించే తొలి హక్కును తొలగిస్తూ తీర్మానం చేశారు. దీంతో 2019 నుంచీ గంగ్వాల్, భాటియా మధ్య నలుగుతున్న వివాదానికి తెరపడేందుకు ఈ తీర్మానం దారి చూపింది. కాగా.. ప్రస్తుతం పరిశ్రమ ఏకీకృత దారిలో నడుస్తున్న సమయాన ఇండిగోకుగల దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై తనకు అత్యంత విశ్వాసమున్నట్లు తాజాగా రాసిన లేఖలో గంగ్వాల్ పేర్కొన్నారు. దేశీ విమానయాన పరిశ్రమ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతోపాటు పురోభివృద్ధి బాటలో సాగనున్నట్లు అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో కంపెనీ షేరు పెరుగుదల ద్వారా కొత్త ఇన్వెస్టర్లు లాభాలు ఆర్జించగలరని అంచనా వేశారు. వాటాను క్రమంగా తగ్గించుకోవడం ద్వారా తాను సైతం లబ్ది పొందే వీలున్నట్లు పేర్కొన్నారు. అయితే భవిష్యత్ సంఘటనలు ప్రస్తుత తన ప్రణాళికలపై ప్రభావం చూపవచ్చని తెలియజేశారు. ఇన్సైడర్ ప్రభావం.. తన వాటాను విక్రయించే బాటలో ఇన్సైడర్ సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవలసి ఉన్నట్లు గంగ్వాల్ పేర్కొన్నారు. అయితే సహవ్యవస్థాపకుడు, ప్రమోటర్, డైరెక్టర్‌గా తనకు షేరు ధరను ప్రభావితం చేయగల బయటకు వెల్లడికాని సమాచారం(యూపీఎస్) కంపెనీ అందించే వీలున్నట్లు తెలియజేశారు. ఈ సమస్యల పరిష్కారానికి వీలుగా బోర్డు నుంచి వెంటనే వైదొలగుతున్నట్లు వెల్లడించారు. దీంతో తనకు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించవద్దని కోరినట్లు తెలియజేశారు. బోర్డు నుంచి తప్పుకోవడంతో ఈ అవసరంలేదని స్పష్టం చేశారు. కాగా.. 2019 జులైలో కార్పొరేట్ పాలనా సంబంధ అంశాలపై జోక్యం చేసుకోవలసిందిగా కోరుతూ సెబీకి గంగ్వాల్ లేఖ రాయడంతో ఇద్దరు ప్రమోటర్ల మధ్య వైరం బయటపడింది. అయితే ఇవి ఆరోపణలంటూ భాటియా గ్రూప్ కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో అదే ఏడాది ప్రమోటర్లిద్దరూ వివాద పరిష్కారం కోసం లండన్ అంతర్జాతీయ అర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించారు. దీంతో సెప్టెంబర్ 23న ఆర్బిట్రేషన్ కోర్టు ఈజీఎం ద్వారా ప్రమోటర్ల వాటా విక్రయ నిబంధనల మార్పును సూచించింది. గంగ్వాల్ రాజీనామా వార్తల నేపథ్యంలో ఇండిగో షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం నష్టంతో రూ. 2,113 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 2,168– 2,091 మధ్య ఊగిసలాడింది. -
కర్నూలు ‘ఉయ్యాలవాడ’ ఎయిర్‌పోర్టులో ప్రారంభమైన విమానాల రాకపోకలు
-
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ప్రారంభమైన విమాన సర్వీసులు
సాక్షి, కర్నూలు: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి. బెంగళూరు నుంచి తొలి ఇండిగో విమానం 52 మంది ప్రయాణికులతో కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఈ విమానానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని ఘన స్వాగతం పలికారు. అదే విమానం 72మంది ప్రయాణికులతో బెంగళూరుకు తిరుగు ప్రయాణమైంది. దీంతో పాటు ఉదయం 10:30కి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ వెళ్లే మొదటి విమానాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఇక మూడు నగరాలకు ఇండిగో సంస్థ విమానాలు నడపనుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును గురువారం సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ ప్రకటించారు. చదవండి: గిరిజనుల అభ్యున్నతికి ఎన్నో చర్యలు -
అత్యవసర మళ్లింపు.. ఫలితం లేకపోయింది: ఇండిగో
న్యూఢిల్లీ: షార్జా నుంచి లక్నోకు వెళుతున్న ఇండిగో ఎయిర్‌లైన్ విమానాన్ని అత్యవసర పరిస్థితుల నిమిత్తం కరాచీకి మళ్లీంచారు. ఫైట్ 6E 1412 మంగళవారం షార్జా నుంచి లక్కోకు బయలుదేరింది. ఈ క్రమంలో ఓ ప్యాసింజర్ అస్వస్థతకు గురికావడంతో అత్యవసర వైద్య పరీక్షల నిమిత్తం ప్లైట్‌ను కరాచీకి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికి ఫలితం లేకపోయిందని, అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు ఎయిర్‌పోర్టు వైద్యులు ధృవీకరించారని ఇండిగో ఎయిర్‌లైన్ సంస్థ వెల్లడిచింది. అయితే ప్యాసింజర్ వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. -
రిపోర్టర్లపై ఊగిపోయిన సీఎం!
పట్నా: శాంతంగా పరిపాలన సాగించే బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మీడియా మిత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో మేనేజర్ హత్య నేపథ్యంలో ‘రాష్ట్రంలో హత్యలు పెరిగిపోతున్నాయి. శాంతి భద్రతలు అదుపు తప్పాయి. నిందితులపై పోలీసుల చర్యలు కానరావడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటన్నిటిపై మీ కామెంట్?’ అని రిపోర్టర్లు ప్రశ్నించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. మీరు ఎవరికి మద్దతు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. 2005కు ముందు ఆ కుటుంబ 15 ఏళ్ల పాలనలో బిహార్‌లో నేరాలు ఏ తీరుగా ఉన్నాయో మరిచారా? అని ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్భంగా... లాలూ-రబ్రీ దేవి పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అప్పటి అరాచకాలను ఏమాత్రం ప్రజల దృష్టికి తేకుండా.. మెరుగైన పాలన అందిస్తున్న తమను నిందితులుగా చూపెడుతున్నారని ఊగిపోయారు. నిందితుల గురించి సమాచారం ఏదైనా ఉంటే పోలీసులకు చెప్పాలని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీస్ చీఫ్‌ను ఆదేశించామని తెలిపారు. కాగా, ఇండిగో మేనేజర్ రూపేష్ కుమార్‌ను తన ఇంటి బయట వాహనం ఎక్కే క్రమంలో కొందరు దుండగులు మంగళవారం కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.(చదవండి: ఇండిగో మేనేజర్ కాల్చివేత.. సీఎంపై ఆగ్రహం) ఈ క్రమంలో... పట్టపగలే హత్యలు జరుగుతున్నా సీఎం మౌనం వహిస్తున్నారని అటు ప్రతిపక్ష ఆర్జేడీ, ఇటు సొంత పక్షం బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇక జర్నలిస్టులపై సీఎం వ్యాఖ్యలను ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ఖండించారు. పాలన చేతగాక మీడియా మిత్రులను విమర్శిస్తున్నారని విమర్శించారు. నేరాల్ని అదుపు చేయాల్సింది పోయి గతంలో జరగలేదా అనడం సిగ్గు చేటని అన్నారు. ఇక బీజేపీ రాజ్యసభ సభ్యుడు గోపాల్ నారాయణ్ సింగ్ కూడా రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయానని, శాంతి భద్రతలు అదుపుతప్పాయని పేర్కొన్నారు. दुर्भाग्यपूर्ण ब्रेकिंग न्यूज़:- मुख्यमंत्री नीतीश कुमार ने हाथ उठा अपराधियों के सामने किया सरेंडर। कहा, “कोई नहीं रोक सकता अपराध!” हड़प्पा काल में भी होते थे अपराध। ज़रा तुलना कर लीजिए। उल्टा पत्रकारों से पूछ रहे है क्या आपको पता है कौन है अपराधी और वो क्यों करते है अपराध? — Tejashwi Yadav (@yadavtejashwi) January 15, 2021 -
ఇండిగో మేనేజర్ కాల్చివేత.. సీఎంపై ఆగ్రహం
పాట్నా: ఇండిగో ఎయిర్పోర్ట్ మేనేజర్ రూపేశ్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆయన్ని తుపాకీతో కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇండిగో ఎయిర్పోర్ట్ మేనేజర్ రూపేశ్ కుమార్ పాట్నా పునాయ్‌చక్‌లోని కుసుమ్ విలాస్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 7 గంటలకు బయటకు రాగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు తుపాకితో అతడిపై కాల్పులకు తెగబడ్డారు. ఏకంగా ఆరు రౌండ్లు కాల్చారు. తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. ఈ ఘటన బిహార్‌లో కలకలం రేపింది. రాజకీయంగా వివాదాస్పదమైంది. ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ తీవ్రస్థాయిలో నితీశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హంతకుల చేతిలో రాష్ట్రం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్న నేరస్తులే రూపేశ్‌ను హతమార్చారని ఆరోపించారు. హంతకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు. జన్ అధికార్ పార్టీ అధినేత పప్పూ యాదవ్ కూడా ఈ ఘటనపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైరల్: విస్టారా, ఇండిగోలపై కామెడియన్ కామెంట్
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌పై విస్టారా, ఇండిగో, గోఎయిర్, స్పెస్‌జెట్ భారతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు సోషల్ మీడియాలో సరదాగా చర్చించిన సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ క్రమంలో స్టాండ్ అప్ ఇండియన్ కమెడియన్ కునాల్ కమ్రా విస్టారా ఎయిర్‌లైన్‌పై చేసిన ట్వీట్ ప్రస్తుతం ట్విటర్లో ట్రేండింగ్‌గా మారింది. ‘‘హే @airvistara నేను విన్నాను లాక్డౌన్ కారణంగా నిన్ను ఎత్తుకు ఎగరకుండా నిలిపివేశారంట కదా. ఎక్కడికి ఎగరకుండా పార్కింగ్‌లోనే జాగ్రత్తగా ఉండు. అలాగే ఇండిగో, స్పెస్‌జెట్, గోఎయిర్‌లు కూడా.. స్టేపార్కింగ్.. స్టేసేఫ్. ఇప్పటు మీకు అర్థం అవుతుంది నా బాధ’ అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. ఆయన సరదాగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెజన్లు తెగ ఆకట్టుకుంటోంది. (ప్రముఖ కమెడియన్‌పై ప్రయాణ నిషేధం) Now you know how I feel... https://t.co/oZcXqUIEeh — Kunal Kamra (@kunalkamra88) April 10, 2020 కాగా మార్చిలో విస్టారాతో పాటు ఇండిగో ఎయిర్ లైన్ అధికారుల లాక్డౌన్ అమలును అనుసరిస్తూ.. ఆయన ప్రయాణాన్ని నిషేధించినట్లు గతంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఏప్రిల్ 27వరకూ ఎయిర్ విస్టారాతో పాటు మరో నాలుగు విమానా ఎయిర్‌లైన్ సంస్థలు నా ప్రయాణాన్ని నిషేధించాయి. అంతేగాక అధికారుల ఆదేశాల మేరకు ఎవరూ కూడా ప్రయాణించడాకి వీలు లేదని చెప్పారు’’ అంటూ కునాల్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రకాల వ్యాపార రంగాలు మూతపడ్డాయి. అంతేగాక జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో విమానా సేవలు కూడా నిలిచిపోయాయి. (కరోనా: ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఫట్) -
ఇండిగోకు భారీ నష్టాలు; ఉద్యోగులకు ఊరట
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) కు కోవిడ్- 19 సెగ భారీగానే తాకింది. ఒకవైపు దేశీయంగా, అంతర్జాతీయంగా సర్వీసులు నిలిచిపోవడంతో ఆదాయంలో గణనీయంగా కోత పడగా.. దీనికి తోడు దేశీయ విమాన కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఇవాల్టి ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఇండిగో షేర్లలో అమ్మకాలకు దిగారు. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే దాదాపు 8 శాతం పతనమైంది. అమ్మకాల ఒత్తిడి నుంచి కోలుకున్పప్పటికీ ఇండిగో ఇంకా నష్టాల్లోనే కొనసాగుతుండటం గమనార్హం. ప్రస్తుతం ఇండిగో 4 శాతం పైగా నష్టంతో రూ.882 వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పై కూడా చూపుతుంది. (చదవండి: ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేశారా?) మరోవైపు మార్చి 31 వరకు సర్వీసులను నిలిపివేసినప్పటికీ, ఉద్యోగులకు మాత్రం ఇండిగో భారీ ఊరటనిచ్చింది. వారి జీతాల్లో ఎలాంటి కోత విధించబోమని సంస్థ ప్రకటించింది. సెలవుల్లో కూడా ఎలాంటి కోత విధించబోమని హామీ ఇచ్చింది. ముఖ్యంగా వచ్చే నెలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ మెరుగ్గానే ఉన్నాయని ఇండిగో సీఈవో రనుంజాయ్ దత్తా తన ఉద్యోగులకు అందించిన ఈమెయిల్లో వెల్లడించారు. ఏప్రిల్‌లో మళ్లీ సర్వీసులను పునరుద్ధరించే యోచనలో ఉన్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రాణాంతక వైరస్ వ్యాప్తి నివారణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామనీ, కరోనాపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇండిగో కోరింది. (చదవండి: కరోనా వైరస్: ఎందుకంత ప్రమాదకారి?) -
భారీ డిస్కౌంట్.. రూ.899లకే టికెట్!
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 899కే దేశీ రూట్లలో టికెట్ అందిస్తోంది. ‘ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్.. డిసెంబర్ 23 (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్ ఈ నెల 26న రాత్రి 11 గంటల 59 నిమిషాలకు ముగియనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే ప్రయాణాలపై ఆఫర్ వర్తిస్తుంది. విదేశీ ప్రయాణానికి ప్రారంభ టికెట్ ధర రూ. 2,999గా కంపెనీ ప్రకటించింది. ఇండిగో వెబ్సైట్, యాప్‌ల ద్వారా బుకింగ్ చేసుకుంటే సౌలభ్య రుసుము (కన్వీనియన్స్) లేదని వెల్లడించింది. -
వైజాగ్ - బెంగళూరు మధ్య ఇండిగో విమాన సర్వీసు
సాక్షి, విశాఖపట్టణం : ఆదివారం నుంచి విశాఖ - బెంగళూరుల మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసు ప్రారంభమవుతోంది. ఈ విమానం బెంగళూరులో ఉదయం 05.35 కి బయలుదేరి 07.05కి విశాఖకు చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్టణంలో ఉదయం 07.45కి బయలుదేరి 09.35 కి బెంగళూరు చేరుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. -
నా బ్యాగ్‌ను ఖరాబు చేశారు: హీరోయిన్ ఆగ్రహం
ముంబై: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో విమానంలో ప్రయాణించిన ఆమె.. విమాన ప్రయాణంలో తన ఖరీదైన లగేజ్ బ్యాగ్ డ్యామేజ్ చేశారని, బ్యాగ్ హ్యాండిల్, వీల్స్ విరిగిపోయాయంటూ ఓ వీడియోను షేర్ చేశారు. పటిష్టమైన బ్యాగ్‌ను ధ్వంసం చేసిపారేశారంటూ ఆమె మండిపడ్డారు. మంచి బ్యాగ్‌ను తీసుకొని మీ ఇండిగో విమానంలో ప్రయాణిస్తే.. ప్రయాణం ముగిసేసరికి బ్యాగ్ రెండు హ్యాండిల్స్ విరిగిపోయానని, వీల్స్ పూర్తిగా ఊడిపోయానని, మీ ధాటికి సామ్‌సొనైట్ బ్యాగ్ తట్టుకోలేకపోయిందంటూ ఇండిగో సిబ్బందికి సోనాక్షి వ్యంగ్యంగా కృతజ్ఞతలు తెలిపారు. బాలీవుడ్లో వరుస సినిమాలతో సోనాక్షి ప్రస్తుతం దూసుకుపోతున్నారు. అక్షయ్‌కుమార్‌తో కలిసి మిషన్ మంగళ్ సినిమాలో నటించిన ఈ అమ్మడు త్వరలో సల్మాన్ ఖాన్ సరసన ‘దబాంగ్-3’ లో అలరించనున్నారు. -
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఐఏటీఏలో సభ్యత్వం
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో.. అంతర్జాతీయ విమానయాన సంఘం (ఐఏటీఏ)లో సభ్యత్వం పొందినట్లు బుధవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలోనే సంస్థ సేవలు టర్కీ, వియత్నాం, మయన్మార్, చైనా వంటి దేశాలకు విస్తరించిన విషయం తెలిసిందే కాగా, సరిగ్గా ఇటువంటి సమయంలో సభ్యత్వం పొందడం వల్ల ప్రపంచంలో అత్యుత్తమ వాయు రవాణా వ్యవస్థగా ఇండిగోను తీర్చిదిద్దాలనే లక్ష్యానికి సహకారం లభించిందని సంస్థ సీఈఓ రోనోజోయ్ దత్తా అన్నారు. ఇండిగో ప్రస్తుతం రోజుకు 1,500 విమాన సర్వీసులను నిర్వహిస్తుండగా.. వీటిలో 60 దేశీయ, 23 అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. మొత్తం 247 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సంస్థ కలిగిఉంది. ఇక ఐఏటీఏ 290 ఎయిర్‌లైన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. మరోవైపు ఈ ఏడాది మార్చిలోనే స్పైస్‌జెట్ ఈ సంఘంలో సభ్యత్వం పొందిన తొలి భారత చౌక చార్జీల విమానయాన సంస్థగా నమోదైంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను భారం తగ్గకపోవచ్చు! న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్ను(ఐటీ) తగ్గింపు నిర్ణయం కేంద్రం తీసుకునే అవకాశం లేదని ఉన్నత స్థాయి వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కార్పొరేట్ రంగానికి ఊతం ఇవ్వడానికి ఆర్థికశాఖ ఇటీవలే కార్పొరేట్ పన్నును ఏకంగా 10 శాతం తగ్గించింది. పెట్టుబడుల పెరుగుదల, ఉపాధి కల్పన, ఉత్పత్తి ధర తగ్గడం తద్వారా వ్యవస్థలో డిమాండ్, వినియోగం పెరగడం దీని లక్ష్యం. వినియోగదారు కొనుగోలు సామర్థ్యం, డిమాండ్ పెరగడానికి వ్యక్తిగత ఆదాయపు పన్ను కూడా తగ్గించాలని ఇటీవల కొన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది. -
ఇండిగో నష్టం 1,062 కోట్లు
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.652 కోట్ల నికర నష్టాలు రాగా ఈ క్యూ2లో ఈ నష్టాలు రూ.1,062 కోట్లకు పెరిగాయని ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తెలిపింది. లీజు ఆస్తుల నిర్వహణకు సంబంధించి రూ.428 కోట్ల ఫారెక్స్ నష్టాలు, రూ.319 కోట్ల నిర్వహణ వ్యయాల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని కంపెనీ సీఈఓ రొనొజాయ్ దత్తా చెప్పారు. మొత్తం ఆదాయం రూ.6,514 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో రూ.8,540 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.987 కోట్లుగా ఉన్న స్థూల నష్టాలు ఈ క్యూ2లో రూ.1,032 కోట్లకు పెరిగాయని దత్తా చెప్పారు. ఈ క్యూ2లో ఒక్కో విమాన ప్రయాణికుడి నుంచి వచి్చన సగటు చార్జీ 9 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇక మొత్తం వ్యయాలు 28 శాతం పెరిగి రూ.9,572 కోట్లకు పెరిగాయని తెలిపారు. వృద్ధి ప్రణాళికలపైననే దృష్టి పెడుతున్నానమని, దేశీయంగా, అంతర్జాతీయంగా మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. -
ఆ విమానం రన్‌వేపైనే ఆరుగంటలు..
ముంబై : దేశ ఆర్థిక నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై ఏకంగా ఆరు గంటలకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. ఎయిర్‌లైన్స్ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం రాత్రి 9.55 గంటల వరకూ రన్‌వేపైనే నిలిచిపోయింది. విమానం టేకాఫ్‌లో తీవ్ర జాప్యంపై ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తూ ట్విటర్లో కామెంట్స్ చేశారు. విమానంలోనే తమను ఆరుగంటల పాటు కూర్చోబెట్టారని, విమానం టేకాఫ్ తీసుకోదు..తమను వెలుపలికి అనుమతించరు..అసలు ఏం జరుగుతోందని పూజా రాఠీ ట్వీట్ చేశారు. మరికొందరు ఇలాంటి ఎయిర్‌లైన్స్ లైసెన్సును ఎందుకు రద్దు చేయరంటూ పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. కాగా, ముంబైలో అసాధారణ రీతిలో భారీ వర్షాలు కురవడంతో గ్రౌండ్ సపోర్ట్ సిబ్బంది, విమాన సిబ్బంది, కెప్టెన్లు సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోలేదని దీంతో ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన విమానాల్లోనూ జాప్యం చోటుచేసుకుందని, సాధారణ పరిస్థితి నెలకొనేలా ప్రయత్నిస్తున్నామని ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది. -
ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో నిర్వహణ లోపభూయిష్టంగా ఉంటోందంటూ కంపెనీ సహ ప్రమోటరు రాకేశ్ గంగ్వాల్ చేసిన తీవ్ర ఆరోపణలపై ఇటు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, అటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించాయి. ఒకవేళ ఆరోపణలు వాస్తవమేనని రుజువైన పక్షంలో కంపెనీ ప్రస్తుతం చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నియంత్రణ సంస్థల నిబంధనలను ఉల్లంఘించేలా ఇండిగో విర్వహణ పాన్‌షాపు కన్నా అధ్వానంగా మారిందని, మరో ప్రమోటరు రాహుల్ భాటియా తాను లబ్ధి పొందేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపిస్తూ గంగ్వాల్ సెబీకి, కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇందులోని ప్రస్తావించిన ఆరోపణలకు పేరాల వారీగా వివరణనివ్వాలంటూ కంపెనీని కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో గంగ్వాల్ గ్రూప్‌నకు 37 శాతం, భాటియా గ్రూప్‌నకు 38 శాతం వాటాలు ఉన్నాయి. గంగ్వాల్ రిస్కులు లేకుండా జాగ్రత్తపడ్డారు: భాటియా గ్రూప్ గంగ్వాల్ ఆరోపణలపై భాటియా గ్రూప్ (ఐజీఈ) తాజాగా మరో ప్రకటన చేసింది. కంపెనీని ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత ఇద్దరిపైనా సమానంగా ఉన్నప్పటికీ గంగ్వాల్ మాత్రం తనకు రిస్కులు తక్కువగా ఉండేలా చూసుకున్నారని పేర్కొంది. భాటియా, ఆయన తండ్రి కపిల్ భాటియా దాదాపు రూ. 1,100 కోట్ల దాకా సొంత పూచీకత్తునిచ్చారని, గంగ్వాల్ మాత్రం ఈక్విటీ రిస్కులు రూ. 15 కోట్లు కూడా మించకుండా జాగ్రత్తపడ్డారని ఐజీఈ పేర్కొంది. తన బాధ్యతలు సరిగ్గా పాటించని వ్యక్తి ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందంటూ కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది. -
ఆ విభేదాల ప్రభావం వుండదు - ఇండిగో సీఈవో
సాక్షి, ముంబై : బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో కంపెనీ సీఈవో రనుంజాయ్ దత్తా స్పందించారు. బుధవారం ఆయన ఇండిగో ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. ఇవి కేవలం ప్రమోటర్ల మధ్య విభేదాలు మాత్రమేనని, దీనికి ఇండిగోకు ఎలాంటి సంబంధ లేదనీ, ఇండిగో కార్యకలాపాలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం ఉండదని వివరణ ఇచ్చారు. అలాగే ఎయిర్‌లైన్స్ మిషన్, డైరెక్షన్, గ్రోత్ స్ట్రాటజీలో ఎలాంటిమార్పు ఉండదని స్పష్టం చేశారు. సంస్థ కార్యకలాపాలు, వృద్ధి పైనే దృష్టి సారించడం ప్రస్తుతం ముఖ్యమన్నారు. ప్రమోటర్ల మధ్య విభేదాలుతో ఉద్యోగులకు, ఎయిర్‌లైన్స్‌కు ఏమీ నష్టం జరగదని సీఈవో ప్రకటించారు. శక్తిసామర్థ్యాల మేరకు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నానని, ఉద్యోగుల నుంచి కూడా ఇదే ఆశిస్తున్నానని చెప్పారు. ఈ సదర్భంగా టార్గెట్లను రీచ్ అయ్యేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న ఉద్యోగులందరికీ ఆయన ధన్యవాదాలు అన్నారు. మరోవైపు ఇండిగోలో సంక్షోభంముదిరిందన్న వార్తలతో ఇన్వెస్టర్లు ఇండిగో షర్లలో అమ్మకాలకు దిగారు. దీంతో ఇండిగో షేర్లు 11 శాతానికి పైగా పతనమమ్యాయి. అమ్మకాల సెగతో సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 6423 కోట్ల సంపద ఆవిరైపోయింది. ఒక దశలో 19 శాతానికి పైగా నష్టపోయి, గత మార్చి తర్వాత తొలిసారి ఇంత భారీ నష్టాలను మూటగట్టకుంది. ముగింపులో స్వల్పంగా కోలుకున్నప్పటికీ, 2016 జనవరి తర్వాత ఇండిగోకు ఇదే అతి పెద్ద పతనమని ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా ప్రమోటర్లు రాకేష్ గాంగ్వాల్, రాహుల్‌భాటియా మధ్య విభేదాల నేపథ్యంలో జోక్యం చేసుకోవాల్సిందిగా గాంగ్వాల్ మార్కెట్ రెగ్యులేటరీ సెబీనికోరిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇండిగో సంస్థను సెబీ కోరింది. -
పాన్ షాపుకన్నా అధ్వానం!!
న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రమోటర్ల మధ్య వివాదాలు మరింతగా ముదిరాయి. కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని కోరుతూ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన రాకేష్ గంగ్వాల్ తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి లేఖ రాశారు. ఇండిగోలో గవర్నెన్స్ లోపాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, దానితో పోలిస్తే కనీసం పాన్ షాపు నిర్వహణైనా మెరుగ్గా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థను నేడు అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన విలువలకు తిలోదకాలిచ్చి.. కంపెనీ పక్క దారి పడుతోందని గంగ్వాల్ ఆరోపించారు. మరో ప్రమోటరు రాహుల్ భాటియా, ఆయన సంస్థలు సందేహాస్పద లావాదేవీలు జరిపినట్లు పేర్కొన్నారు. చిరకాల మిత్రుడైన భాటియాకు కంపెనీపై అసాధారణ నియంత్రణాధికారాలు కట్టబెట్టేలా షేర్‌హోల్డర్ల ఒప్పందం ఉందని గంగ్వాల్ ఆరోపించారు. ‘సందేహాస్పద లావాదేవీలతో పాటు కనీసం ప్రాథమికమైన గవర్నెన్స్ నిబంధనలు, చట్టాలను కూడా పాటించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం సరిదిద్దే చర్యలు తీసుకోవాలి‘ అని లేఖలో పేర్కొన్నారు. దీని కాపీని అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు కూడా పంపారు. 19లోగా వివరణివ్వండి..: రాకేష్ గంగ్వాల్ చేసిన ఫిర్యాదులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కీలక వివరాలు ఇవ్వాలంటూ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ను ఆదేశించింది. దీనికి జూలై 19 గడువు విధించింది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇండిగో ఈ విషయాలు తెలిపింది. సెబీకి గంగ్వాల్ రాసిన లేఖ ప్రతి తమకు కూడా అందినట్లు వివరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు స్వల్పంగా నష్టపోయి రూ. 1,565.75 వద్ద క్లోజయ్యింది. వివాదం ఇదీ.. ఇండిగో సహవ్యవస్థాపకుడు అయిన గంగ్వాల్‌కు కంపెనీలో 37% వాటాలు ఉన్నాయి. మరో సహవ్యవస్థాపకుడు రాహుల్ భాటియా, ఆయన సంబంధ సంస్థల (ఐజీఈ గ్రూప్)కు 38% వాటాలున్నాయి. సంబంధ పార్టీల మధ్య సందేహాస్పద లావాదేవీలపై ఇద్దరు ప్రమోటర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో అత్యవసర షేర్‌హోల్డర్ల సమావేశం నిర్వహించాలంటూ గంగ్వాల్ గతంలో ప్రతిపాదించగా భాటియా దాన్ని తిరస్కరించారు. అసమంజసమైన ఆయన డిమాండ్లను కంపెనీ బోర్డు ఒప్పుకోనందున గంగ్వాల్ ఇలాంటివన్నీ చేస్తున్నారంటూ భాటియా ఆరోపించారు. దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగోకు దాదాపు 49%మార్కెట్ వాటా ఉంది. 200 పైచిలుకు విమానాలతో రోజూ 1,400 ఫ్లయిట్స్ నడుపుతోంది. భాటియాకు అసాధారణ అధికారాలు కట్టబెట్టేలా షేర్‌హోల్డరు ఒప్పందం ఉన్నప్పటికీ.. సుదీర్ఘ మిత్రత్వం దృష్టిలో ఉంచుకుని, కంపెనీపై నియంత్రణాపేక్ష పెట్టుకోకుండా అగ్రిమెంటు తాను అంగీకరించానని గంగ్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం భాటియాకు చెందిన ఐజీఈ గ్రూప్‌నకు ఆరుగురిలో ముగ్గురు డైరెక్టర్లను, చైర్మన్, సీఈవో, ప్రెసిడెంట్‌ను నియమించే అధికారాలు ఉంటాయి. ప్రస్తుత చైర్మన్ స్వతంత్రతను తాను ప్రశ్నించడం లేదని కానీ స్వతంత్ర చైర్మన్ పేరిట జరిపే నియామక ప్రక్రియే సెబీ నిబంధనలను తుంగలో తొక్కేలా ఉందని గంగ్వాల్ ఆరోపించారు. -
‘ఇండిగో’లో ఇంటిపోరు!!
న్యూఢిల్లీ: ఒకదాని వెంట ఒకటిగా దేశీ విమానయాన సంస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. రుణ సంక్షోభంతో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిల్చిపోగా.. తాజాగా చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయన్న వార్తలు తెరపైకి వచ్చాయి. పనితీరు, వ్యాపార విస్తరణ వ్యూహాలపై వ్యవస్థాపకులు రాకేష్ గంగ్వాల్, రాహుల్ భాటియా మధ్య భేదాభిప్రాయాలు పొడచూపినట్లు సమాచారం. అయితే, గత కొద్ది వారాల్లో తీవ్రత మరింత పెరిగినప్పటికీ, పరిస్థితి లీగల్ కేసుల స్థాయిలో మాత్రం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. విభేదాల పరిష్కారం కోసం ఇరు వర్గాలు న్యాయ సలహా సంస్థల సహాయం తీసుకుంటున్నట్లు వివరించాయి. లీగల్ సేవలందించే సంస్థలు ఖైతాన్ అండ్ కో, జే సాగర్ అండ్ అసోసియేట్స్ ఇందులో తోడ్పడుతున్నాయి. ఇద్దరూ కూడా ఈ సంస్థలకు పాత క్లయింట్లే కావడంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు రెండు సంస్థలూ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇండిగో కార్యకలాపాల విస్తరణ వ్యవహారం గందరగోళంగా మారే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జెట్ ఎయిర్వేస్ నిల్చిపోవడంతో చార్జీల ధరలకు రెక్కలు రాగా.. తాజాగా ఇండిగో వివాదం ముదిరితే దేశీ విమానయాన రంగంపై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దూకుడుగా గంగ్వాల్... ఆచితూచి భాటియా 2006లో భాటియా, గంగ్వాల్ కలిసి ఇండిగోను ఏర్పాటు చేశారు. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ పేరుతో దీని మాతృసంస్థ 2013లో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యింది. దేశీ ఏవియేషన్ మార్కెట్లో దీనికి 44 శాతం వాటా ఉంది. వ్యవస్థాపకుల్లో ఒకరైన గంగ్వాల్ విషయానికొస్తే.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, యూఎస్ ఎయిర్వేస్లో ఆయనకు సుదీర్ఘానుభవం ఉంది. దూకుడు వ్యూహాలతో ఇండిగోను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సంస్థగా నిలపడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. మేనేజ్‌మెంట్‌లోనూ మార్పులు, చేర్పులతో కంపెనీని ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విస్తరణ ప్రణాళికల విషయంలో వేగంగా దూసుకుపోవాలన్నది గంగ్వాల్ అభిప్రాయం కాగా.. ఆచి తూచి అడుగేయాలని భాటియా భావిస్తారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే రెండేళ్లుగా పలు సందర్భాల్లో ఇరువురి మధ్య విభేదాలు బైటపడ్డాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం కంపెనీలో భాటియాకు 38, గంగ్వాల్‌కు 37 శాతం వాటాలున్నాయి. షేరు పతనం.. ప్రమోటర్ల మధ్య విభేదాల వార్తల నేపథ్యంలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు గురువారం ఏకంగా 9 శాతం దాకా పతనమయ్యాయి. బీఎస్ఈలో 8.82 శాతం నష్టంతో రూ.1,466.60 వద్ద క్లోజయ్యాయి. ఒక దశలో 9.82 శాతం నష్టంతో రూ. 1,450.50కి కూడా షేరు తగ్గింది. అటు ఎన్ఎస్ఈలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు 8.40 శాతం తగ్గి రూ. 1,475 వద్ద ముగిసింది. షేరు ధర గణనీయంగా క్షీణించడంతో కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ ఏకంగా రూ.5,456 కోట్లు తగ్గి రూ. 56,377 కోట్లకు పరిమితమైంది. బీఎస్ఈలో 3.70 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 70 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ప్రమోటర్ల మధ్య విభేదాల వార్తలపై వివరణనివ్వాలంటూ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు బీఎస్ఈ సూచించింది. ప్రణాళికలు యథాతథం: సీఈవో ప్రమోటర్ల మధ్య విభేదాల వార్తల నేపథ్యంలో ఉద్యోగులకు భరోసానిచ్చే క్రమంలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సీఈవో రొణొజొయ్ దత్తా తమ సిబ్బందికి ఈమెయిల్ పంపారు. కంపెనీ వృద్ధి వ్యూహాలు యథాతథంగానే ఉన్నాయని, వీటి అమలుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి మేనేజ్మెంట్కు పూర్తి మద్దతుందని ఆయన పేర్కొన్నారు. ‘మన ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య విభేదాలు తలెత్తాయన్న ఆరోపణల వార్తల గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే, సంస్థ వృద్ధి వ్యూహాల్లో ఎటువంటి మార్పు లేదని మీకు భరోసా ఇవ్వదల్చుకున్నాను. ప్రణాళికలను అమలు చేయడానికి మేనేజ్మెంట్కు బోర్డు నుంచి పూర్తి మద్దతు కూడా ఉంది‘ అని ఈమెయిల్లో దత్తా పేర్కొన్నారు. వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగులతో పాటు సంస్థతో అనుబంధం ఉన్న వారందరికీ ప్రయోజనం చేకూర్చడంపైనే ఇకపైనా దృష్టి పెడతామని ఆయన తెలిపారు. -
ఇండిగోకు కొత్త సీఈవో, ఛైర్మన్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కొత్త సీఈవోను ఎంపిక చేసింది. రోనోజాయ్ దత్తాని సీఈవోగా నియమించామని కంపెనీ గురువారం ప్రకటించింది. అయిదేళ్ల పాటు ఆయన పదవిలో ఉంటారని వెల్లడించింది. అలాగే చైర్మన్‌గా మేలవీటిల్ దామోదరన్ నియామకాన్ని ఆమోదించింది. ఈ రెండు నియామకాలు జనవరి 24 నుంచి అమలులోకి వచ్చాయని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఎగ్జిక్యూటివ్‌గా, ఎయిర్ సహారా ప్రెసిడెంట్ పనిచేసిన దత్తా ఇటీవల ఇండిగో సంస్థలో ప్రిన్సిపల్ కన్సల్టెంట్‌గా జాయిన్ అయ్యారు. అయితే దత్తాకు సీఈవో పదవి కట్టబెట్టనున్నారనే అంచనాల నేపథ్యంలో గత నెలలో అప్పటి సీఈవో గ్రెగ్ టేలర్ రాజీనామా చేశారని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. -
విమానంలో వెకిలి చేష్టలు..
సాక్షి, ముంబై: ముంబై నుంచి బెంగళూర్ వెళ్లే ఇండిగో విమానంలో మహిళా సిబ్బందిని లైంగికంగా వేధించిన ప్రయాణీకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బెంగళూర్‌కు చెందిన రాజు గంగప్ప(28)గా గుర్తించారు. ముంబై విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం బెంగళూర్‌కు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో గంగప్ప విమాన మహిళా అటెండెంట్ (20)ను అసభ్యంగా తాకాడు. నిందితుడిని బాధితురాలు మందలించగా, ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించాడని అధికారులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ఆమె తన సీనియర్లకు వివరించగా, బ్యాగేజ్ సహా నిందితుడిని ఫ్లైట్ నుంచి దించివేసినట్టు అధికారులు తెలిపారు. నిందితుడిని సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించగా, అనంతరం ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఈ ఘటన జరగ్గా పోలీసులు అతడిని బుధవారం ముంబై కోర్టులో హాజరు పరిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
సాంకేతిక సమస్యతో నిలిచిన ఇండిగో సేవలు
సాక్షి, న్యూఢిల్లీ : సాంకేతిక సమస్యలతో అన్ని విమానాశ్రయాల్లో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిస్టమ్స్ డౌన్ అయ్యాయి. సాంకేతిక కారణాలతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు గమ్యస్ధానాలకు చేరవలసిన ప్రయాణీకులు ఎయిర్‌పోర్టులో చిక్కుకున్నారు. సిస్టమ్స్ డౌన్ అవడంతో వివిధ విమానాశ్రయాల్లో ప్రయాణీకులు నిలిచిపోయారని, సంయమనంతో తమకు సహకరించాలని ప్రైవేట్ ఎయిర్‌లైనర్ ట్వీట్ చేసింది. సమస్యను త్వరలోనే అధిగమిస్తామని, అప్పటివరకూ సంస్థకు సహకరించాలని ప్రయాణీకులను కోరింది. 90 నిమిషాల పాటు సిస్టమ్స్ పనిచేయక పోవడంతో ప్రయాణీకులకు ఎదురైన అసౌకర్యానికి మన్నించాల్సిందిగా ఇండిగో కోరింది. సాంకేతిక సమస్యను పరిష్కరించిన మీదట విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. -
15కేజీల బ్యాగేజీ దాటితే వాతే!
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులపై ప్రైవేటు విమాన సంస్థలు భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. ఇకపై ప్రయాణికుల బ్యాగేజీ 15 కేజీలు దాటితే.. అదనపు లగేజీకి వాతలు తప్పవు. ఇండిగో, గో ఎయిర్, స్పైస్ జెట్లు ఈ 15 కేజీల నిబంధనను తీసుకొచ్చాయి. పరిమితి తర్వాత ఒక్కో కేజీకి రూ.400 రూపాయలు వసూలు చేయనున్నారు. గో ఎయిర్‌లో శని వారం నుంచే ఈ వడ్డింపు అమల్లోకి రాగా.. ఇండిగో, స్పైస్ జెట్లలో వచ్చే శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఒకవేళ ముందుగానే బుక్ చేసుకున్నట్లయితే.. 5 కేజీలకు రూ.1,900, 10 కేజీలకు రూ. 3,800లు వసూలు చేస్తామని గో ఎయిర్ ఆఫర్ ఇచ్చింది. ఇండిగో, స్పైస్జెట్లలోనూ కాస్త అటు, ఇటుగా ఇదే వడ్డింపు ఉంటుంది. గత నెల్లో, జెట్ ఎయిర్వేస్ కూడా కొత్త బ్యాగేజీ నిబంధనలను (వచ్చే నెల నుంచి అమల్లోకి) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా మాత్రమే తమ ప్రయాణికులకు 25 కేజీల వరకు బ్యాగేజీ అనుమతినిస్తోంది. -
దెబ్బ మీద దెబ్బ: ఇండిగో భారీ పతనం
సాక్షి, ముంబై: దేశీయ విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు అటు అధ్యక్షుడు రాజీనామా, ఇటు ఫలితాల షాక్ భారీగా తగిలింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఈ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. దీంతో ఇండిగో షేరు 18 శాతానికి పైగా కుప్పకూలింది. 2016 జనవరి తరువాత ఇదే అదపెద్ద పతనమని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. ముఖ్యంగా ఇండిగో అధ్యక్షుడు ఆదిత్య ఘోష్ రాజీనామా తర్వాత షేర్లు 26 ఏప్రిల్ నుంచి తగ్గుముఖం పట్టాయి. 26శాతం క్షీణించి దాదాపు రూ. 13650 కోట్ల విలువైన మార్కెట్ విలువ కోల్పోయింది. క్యూ4 ఫలితాల దెబ్బ క్యూ4(జనవరి-మార్చి)లో ఇండిగో నికర లాభం 75 శాతం పతనమై 118 కోట్ల రూపాయలను నమోదు చేసింది. నిర్వహణ, ఇంధన వ్యయాలు పెరగడం దీనికి కారణంమని ఇండిగో మార్కెట్ ఫైలింగ్‌లో పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం ఎగసి రూ. 6057 కోట్లకు చేరింది. ఇంధన వ్యయాలు రూ. 1751 కోట్ల నుంచి 2338 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికంలో రెవెన్యూ 17.8 శాతం పెరిగి రూ .5,141.99 కోట్లనుంచి రూ .656.84 కోట్లను ఆర్జించింది. ఈ త్రైమాసికంలో ఇంధన వ్యయం రూ .2,338 కోట్లు పెరిగి రూ .1,751 కోట్లకు చేరుకుంది. -
‘విమానంలో దోమలున్నాయంటే.. కొట్టారు’
సాక్షి, న్యూఢిల్లీ : విమానంలో దోమలు ఉన్నాయని చెబితే తనపై ఇండిగో క్రూ సభ్యులు చేయి చేసుకున్నారని ఓ ప్రయాణీకుడు ఆరోపించారు. లక్నో నుంచి బెంగళూరుకు బయల్దేరిన విమానంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని తాను క్రూ సభ్యులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే, ప్రత్యామ్నాయం చూపడానికి బదులు క్రూ బృందం తనతో వాగ్వాదానికి దిగి, చేయి కూడా చేసుకుందని డా. సురభ్ రాయ్ ఆరోపించారు. తనను బెదిరించి, విమానంలో నుంచి దించేసి అవమానించారని అన్నారు. -
11 విమానాల సేవలకు సెలవు
న్యూఢిల్లీ: ఇంజిన్లలో లోపాల కారణంగా 11 ఎయిర్‌బస్ ఏ320 నియో (న్యూ ఇంజిన్ ఆప్షన్) విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సేవల నుంచి తప్పించింది. వీటిలో 8 విమానాలు ఇండిగో సంస్థకు చెందినవి కాగా మరో మూడు గో ఎయిర్వి. ఈ 11 విమానాల్లోనూ ప్రాట్ అండ్ వైట్నీ సంస్థ తయారుచేసిన పీడబ్ల్యూ 1100 రకం ఇంజిన్లను అమర్చారు. ఈ రకం ఇంజిన్లు తరచూ మొరాయిస్తున్నాయి. సోమవారం అహ్మదాబాద్ నుంచి లక్నో మీదుగా కోల్‌కతా వెళ్తున్న ఇండిగోకు చెందిన ఎయిర్‌బస్ ఏ320 నియో విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే అందులోని పీడబ్ల్యూ 1100 ఇంజిన్ పనిచేయడం మానేసింది. దీంతో 186 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానాన్ని వెంటనే అహ్మదాబాద్‌కు తీసుకొచ్చి ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
ప్రయాణీకులను ఇలా డీల్ చేస్తారా..
-
ప్రయాణీకులను ఇలా డీల్ చేస్తారా..
సాక్షి, న్యూఢిల్లీ : ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవల ఓ ప్రయాణీకుడిపై దౌర్జన్యం చేసిన ఘటనకు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఘాటుగా స్పందించింది. విమానయాన సంస్థల సిబ్బంది ప్రయాణీకులతో స్నేహపూర్వకంగా మెలగాలని, గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికింది. విమానయాన సిబ్బంది ప్రయాణీకులపై దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం, దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయని కమిటీ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్‌లైన్స్ సిబ్బంది దురుసు ప్రవర్తన ఘటనలు కొన్ని మీడియాలో వస్తున్నా పలు సంఘటనలు వెలుగు చూడటం లేదని పేర్కొంది. ఇటీవల ఇండిగో సిబ్బంది ప్రయాణీకుడిపై దౌర్జన్యానికి పాల్పడిన తీరును తీవ్రంగా ఖండించింది.దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నంత మాత్రాన విమానయాన సంస్థలు తమ తప్పిదాల నుంచి బయటపడలేవని 26 పేజీల నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంటున్న ఘటనలు వ్యక్తిగతమైనవి కావని..ఇవి సంస్ధాగతమైనవని పేర్కొంది. ఇండిగో వంటి సంస్థలు ప్రయాణీకులతో వ్యవహరించే పద్ధతిలో సానుకూల మార్పులు ప్రవేశపెట్టాల్సి ఉందని స్పష్టం చేసింది. తమ సిబ్బంది దురుసు ప్రవర్తనపై ఇండిగో కన్నేసి ఉంచాలని, వారి దుందుడుకు ప్రవర్తనను సరిచేయాలని సూచించింది. పలు విమానయాన సంస్థల సీఈఓలతో, సిబ్బంది, ప్రయాణీకులతో కమిటీ విస్తృతంగా చర్చలు జరిపిన మీదట ఈ నివేదికను రూపొందించింది. -
ఇండిగో న్యూ ఇయర్ సేల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నూతన సంవత్సరం సందర్భంగా విమాన టిక్కెట్లపై ఆఫర్ ప్రకటించింది. ముఖ్యంగా న్యూ ఇయర్, హాలిడే డిమాండ్‌ను క్యాష్ చేసుకునే లక్ష్యంతో, విని యోగదారులను ఆకట్టుకునేలా తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఎంపిక చేసిన మార్గాల్లో డిస్కౌంట్ ధరల్లో ఈ టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఇండిగో వెబ్సైట్ సమాచారం జనవరి నెలలో అత్యధికంగా బుకింగ్ కోసం ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. బుకింగ్ పోర్టల్‌లోని ధరల ప్రకారం ఢిల్లీ నుంచి లక్నోకి టిక్కెట్ ప్రారంభ ధర రూ.1030గా ఉంది. అలాగే బాగ్డోగ్రా నుంచి గౌవహటికి ప్రారంభ ధర రూ.1005గానూ, కోయంబత్తూర్ నుంచి చెన్నైకి రూ.1095గా ఉంది. దీంతోపాటుగా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా జరిపే ఆన్లైన్ చెల్లింపులపై ప్రతి ప్యాసింజర్ కన్వీనియన్స్ ఫీజుగా (నాన్ రిఫెండబుల్)రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంది. మరికొన్ని విమాన సర్వీసుల టిక్కెట్ ధరల విషయానికి వస్తే... చెన్నై నుంచి బెంగళూరుకు రూ.1,120, చెన్నై నుంచి కోయంబత్తూరుకు రూ.1,148, ఢిల్లీ నుంచి జయపురకు రూ.1,176గా ఇండిగో నిర్ణయించింది. -
‘వివాద’యాన సంస్థ!
చేసేది విమానయాన వ్యాపారమే కావొచ్చు...అందులో పోటీదారులందరినీ దాటు కుని శరవేగంతో దూసుకుపోతూ ఉండొచ్చు... ఫలితంగా లాభార్జన సైతం అదే స్థాయిలో పెరుగుతూ పోవచ్చు. ఆ వ్యాపారంలో మెలకువల్ని గ్రహించి, నైపు ణ్యాన్ని సాధించి ప్రారంభించిన స్వల్పకాలంలోనే విజేతగా నిలిచినందుకూ, ప్రయాణికుల అభిమానాన్ని కొల్లగొట్టినందుకూ అందరూ అభినందిస్తారు. కానీ కాళ్లు నేలపైనే ఉండాలన్న సంగతిని విజేత గ్రహించాలి. కళ్లు నెత్తికెక్కిన భావన కలగనీయకూడదు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలని మరవకూడదు. ఈమధ్య కాలంలో ఇండిగో విమానయాన సంస్థ తీరుతెన్నులు గమనిస్తే ఈ స్వల్ప విషయం దాని అవగాహనకు రావడం లేదన్న అనుమానం కలుగుతుంది. గత నెల 15న న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ సంస్థ సిబ్బంది రాజీవ్ కత్యాల్ అనే ప్రయాణికుడిపట్ల అమానుషంగా ప్రవర్తించి, కిందపడేసి పీక నులుముతున్న దృశ్యాలు రెండురోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో బయటికొచ్చాయి. దానిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు, బీజేపీ నేత షా నవాజ్ హుస్సేన్ మొదలుకొని ఎన్నికల సంఘం మాజీ చీఫ్ ఎస్‌వై ఖురేషీ వరకూ అందరూ ఆ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అశోక్‌గజపతి రాజు దానిపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ)ను ఆదేశించారు. తదుపరి చర్యలు ఏమి ఉంటాయన్న మాట అటుంచి అసలు ఈ ఉదంతంలో ఇండిగో స్పందించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక ఉద్యోగిపై చర్య తీసుకున్నామని తొలుత ఆ సంస్థ తెలి పింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దృశ్యాలు గమనిస్తే కత్యాల్‌పై దాడి చేసిన వారు ముగ్గురని స్పష్టంగా తెలుస్తుంది. మరి ఒక్కరిపైనే చర్య తీసుకున్నారేమని ఆరా తీస్తే ఆ ఒక్కరూ వీడియో తీసిన వ్యక్తే అని తేలింది. అతనా పని చేయకపోయి ఉంటే ఈ ఘటన బయటికొచ్చేదే కాదు. కేవలం ఆ కారణంతో మాత్రమే చర్య తీసు కున్నట్టు కనబడుతున్నా పొంతన లేని సంజాయిషీ ఇస్తూ జరిగిన తప్పిదానికి అదే శిక్ష అన్నట్టు సంస్థ మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఘటన సంగతి వెల్లడై అశోక్ గజపతిరాజు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పాక ఇండిగో ఎండీ ప్రయాణికుడికి క్షమాపణ చెప్పారు. సంస్థ నియమావళి ప్రకారం దీనిపై దర్యాప్తు జరిపి కఠిన చర్య తీసుకున్నట్టు కూడా వివరించారు. తీరా మరికొన్ని గంటల తర్వాత వారు చర్య తీసుకున్నది వీడియో చిత్రించిన మోంటు కల్రా అనే ఉద్యోగిపై అని తెలిసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. జరిగినదాన్ని లోకానికి వెల్లడించిన వ్యక్తిని శిక్షిస్తారా అని నిలదీస్తే... అసలు అలా గొడవపడమని ప్రేరేపించింది మోంటుయేనని వింత జవాబిచ్చారు. అది నిజమే అనుకున్నా ప్రయాణికుడిపై లంఘించిన మిగతా ముగ్గురి దోషమూ అసలు లేనేలేదని ఎలా నిర్ధారించుకున్నారో అనూహ్యం. ఈ విషయంలో పోలీసుల తీరు కూడా క్షమార్హమై నది కాదు. ఘటన జరిగిన వెంటనే ప్రయాణికుడు ఫిర్యాదు చేస్తే వారు చేసిందల్లా రాజీ కుదర్చడమే. పైగా ఫిర్యాదు చేస్తే వారి ఉద్యోగాలు పోతాయంటూ పోలీసులు నచ్చజెప్పారని ప్రయాణికుడంటున్నారు. జరిగిన ఉదంతంపై ఇండిగోను మాత్రమే కాదు...ఢిల్లీ పోలీసులనూ బోనెక్కించాలి. ఏ వ్యాపార సంస్థకైనా అది తన వినియోగదారులతో వ్యవహరించే తీరునిబట్టే పేరుప్రఖ్యాతులు వస్తాయి. దాని విశ్వసనీయత పెరుగుతుంది. 2006లో విమా నాలు నడపడం ప్రారంభించిన ఇండిగో సంస్థ 2012 కల్లా దేశంలో అత్యధిక సంఖ్యలో ప్రయాణికులను చేరవేస్తున్న సంస్థగా గుర్తింపు సాధించింది. ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో దాని నికర లాభం భారీగా పెరిగింది. నిరుడు ఇదే కాలానికి ఆ సంస్థ 139.85 కోట్ల నికరలాభం ఆర్జిస్తే ఈసారి అది రూ. 551.55 కోట్లకు చేరుకుంది. సమయపాలన సరిగా పాటిస్తున్న విమానయాన సంస్థగా కూడా దానికి గుర్తింపు వచ్చింది. ఎక్కువమంది తమ విమానాల్లో ప్రయా ణించడంవల్లే ఇదంతా సాధ్యమైందన్న సంగతిని సంస్థ గుర్తిస్తే మరింత బాధ్యతగా వ్యవహరించేది. కానీ జరుగుతున్నదంతా అందుకు భిన్నం. రియో ఒలింపిక్స్‌లో దేశానికి రజిత పతకం తెచ్చిన తెలుగు తేజం పీవీ సింధు ఈ నెల 4న తన విషయంలో ఇండిగో ఉద్యోగి దురుసుగా ప్రవర్తించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై విమానంలోని ఎయిర్‌హోస్టెస్‌ను కూడా వాకబు చేయొచ్చునని సూచించారు. ఆ విషయంలో ఇండిగో చేసిందేమిటో తెలియదు గానీ... కనీసం విచారం కూడా వ్యక్తం చేయకుండా ఆమె పెద్ద సైజు బ్యాగ్ తీసుకురావడం వల్లనే ఇబ్బంది తలెత్తిందని, తమ సిబ్బంది చాలా మర్యాదగా ప్రవర్తించారని సంజాయిషీ ఇచ్చుకుంది. ప్రముఖుల విషయంలోనే ఇంత నిర్ల క్ష్యంగా ఉన్నప్పుడు తమ పరిస్థితి ఏమిటన్న సందేహం సాధారణ ప్రయాణికుల్లో తలెత్తుతుందని దానికి అనిపించలేదు. విమానయానంలో నంబర్ వన్‌గా ఉంటున్న సంస్థ ఇంత యాంత్రికంగా, నిర్లక్ష్యంగా జవాబిస్తుందని ఎవరూ భావించరు. మొన్న ఏప్రిల్‌లో ఇండిగో విమానంలో వెళ్లిన ప్రయాణికుడొకరు ‘ఏకకాలంలో నన్ను కోల్‌కతాకు, నా లగేజీని హైదరాబాద్‌కు చేర్చినందుకు కృతజ్ఞతలు’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేస్తే దాని అంతరార్ధాన్ని గ్రహించకుండా అందుకు ప్రతిగా ఇండిగో సంస్థ ‘సంతోషం...’అంటూ ఇచ్చిన జవాబు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రయాణికుడితో సంస్థ సిబ్బంది కలబడుతున్న వీడియో వెల్లడయ్యాక కూడా చాలా మంది నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఎయిరిండియా అయితే ‘మేం చేయెత్తేది నమస్కరించడానికి మాత్రమే...’అంటూ మహారాజా లోగోను పెట్టింది. ఈమధ్యకాలంలో తరచుగా తమ సంస్థపైనే ఎందుకు విమర్శలొస్తున్నాయో ఇండిగో గ్రహించాలి. ఈ విషయంలో కేంద్రం తగిన చర్య తీసుకోవడంతోపాటు ఇలాంటి సందర్భాల్లో ఎవరి బాధ్యతలేమిటో, జవాబుదారీతనం ఎంతో మార్గ దర్శకాలు జారీ చేయాలి. ఈ మాదిరి ఉదంతాలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని గుర్తించాలి. -
ఇండిగో మరో నిర్వాకం: వీడియో వైరల్
-
ఇండిగో మరో నిర్వాకం: వీడియో వైరల్
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుపట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఘటన మరువక ముందే ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది బాగోతం మరోటి బయటపడింది. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండిగో సిబ్బంది ప్రయాణికుడిపై దౌర్జన్యానికి దిగడం కలకలం రేపింది. వీడియో సాక్షిగా ఈ నిర్వాకం బయటపడింది. ఇండిగో విమానాన్ని ఎక్కేందుకు వచ్చిన ప్రయాణీకుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. కొందరు ప్రయాణీకులను ఇండిగో బస్ ఎక్కించుకోకుండా వెళ్లినందుకు ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది. ప్రయాణీకులకు సర్ది చెప్పాల్సిన సిబ్బంది చెలరేగిపోయారు. ఈవైనాన్ని ప్రశ్నించిన పెద్దాయన పై పిడిగుద్దులు కురిపించారు. విచక్షణా రహితంగా లాగి పడేశారు. ఈ వ్యవహారంపై బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబందించిన వీడియో నెట్లో వైరల్‌గా మారింది. దీంతో దిగి వచ్చిన ఇండిగో యాజమాన్యం క్షమాపణ చెప్పింది. #WATCH: IndiGo staff manhandle a passenger at Delhi's Indira Gandhi International Airport (Note: Strong language) pic.twitter.com/v2ola0YzqC — ANI (@ANI) November 7, 2017 -
సింధుకు చేదు అనుభవం
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుకు శనివారం ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో వెళ్తుండగా సంస్థకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బందిలో ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘గ్రౌండ్ స్టాఫ్ అజితీశ్ నాతో చాలా దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించాడు. ప్రయాణికులతో అలా మాట్లాడవద్దని ఎయిర్‌హోస్టెస్ అతనికి సూచించగా, ఆమెతోనూ అనుచితంగా వ్యవహరించాడు. ఇలాంటి వాళ్లు ఇండిగోలో పనిచేస్తూ ఆ సంస్థకు చెడ్డపేరు తీసుకొస్తున్నారు’ అని ట్వీటర్ పోస్ట్‌లో సింధు వివరించారు. అయితే ఇండిగో సంస్థ తమ ఉద్యోగికి మద్దతుగా నిలుస్తూ ‘సింధు అనుమతించిన దాని కన్నా అధిక లగేజీతో విమానమెక్కారు. అది ఆమె సీటు పైన ఉన్న క్యాబిన్లో పట్టడం లేదు. దానిని విమానంలోని కార్గోకు తరలిస్తామంటే ఆమె ఒప్పుకోలేదు. ప్రయాణికులెవరైనా ఎక్కువ సామానును తీసుకొస్తే మేం ఈ విధానాన్నే పాటిస్తాం. కానీ సింధు తన లగేజీ తనతోనే ఉండాలని పట్టుబట్టారు. చివరకు ఆమెను ఎంతగానో అభ్యర్థించి లగేజీని కార్గోకు తరలించాం. ఈ వ్యవహారం సాగుతున్నంత సేపు ఆమె ఆరోపణలు చేస్తున్న మా ఉద్యోగి మౌనంగానే ఉన్నారు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అజితీశ్ ఓ ఉద్యోగిగా తన బాధ్యతలను మాత్రమే నిర్వర్తించారనీ, సింధు ఈ విషయాన్ని గుర్తిస్తారని తాము ఆశిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. -
హైదరాబాద్ విమానం నుంచి మోహన్‌లాల్ టీమ్ దింపివేత
కొచ్చి: మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు చెందిన కేరళ స్ట్రైక ర్స్ క్రికెట్ టీమ్ బృందంలోని 30 మంది సినీ, టీవీనటులు తమ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ వారిని విమానం నుంచి బలవంతంగా దించేసింది. కొచ్చిలో శుక్రవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఇండిగో తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భోజ్‌పురి దబాంగ్స్‌తో శనివారం తలపడేందుకు ఈ నటులు ‘6ఈ-314’ విమానం ఎక్కారు. కొందరు విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో వీరిని దింపేయాలని పైలట్ భద్రతా సిబ్బందిని కోరి విమానాన్ని పార్కింగ్‌కు తెచ్చారు. తోటి ప్రయాణికులు కూడా వారిని దింపేయాలని కోరడంతో వారిని దింపేశారు. మోహన్‌లాల్ బృందాన్ని వేరే విమానంలో హైదరాబాద్ పంపారు.