Video: విమానం ఆలస్యంపై ప్రకటన.. కెప్టెన్‌పై ప్రయాణికుని దాడి | Passenger Punches IndiGo Captain Amid Making Announcement Of Delay | Sakshi
Sakshi News home page

Video: విమానం ఆలస్యంపై ప్రకటన.. కెప్టెన్‌పై ప్రయాణికుని దాడి

Published Mon, Jan 15 2024 9:14 AM | Last Updated on Mon, Jan 15 2024 11:28 AM

Passenger Punches IndiGo Captain Making Announcement Of Delay - Sakshi

ఢిల్లీ: ప్రయాణాల ఆలస్యం వివాదంపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఈ క్రమంలోనే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. విమానం ఆలస్యం గురించి ప్రకటిస్తున్న నేపథ్యంలో ఓ ప్రయాణికుడు కెప్టెన్‌పై దాడికి యత్నంచాడు. కెప్టెన్‌ చెంప చెల్లుమనిపించాడు. ఇంతలో ఇతర ప్రయాణికులు అడ్డుతగలడంతో వెనక్కి తగ్గాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

వీడియోలో చూపిన విధంగా ఢిల్లీ విమానాశ్రయంలో 6E-2175 విమానాన్ని నిలిపి ఉంచారు. గోవా వెళ్లాల్సిన ఆ విమానం ఎప్పుడు గాల్లోకి ఎగురుతుందా? అన్నట్లు ప్రయాణికులంతా ఎదురుచూస్తున్నారు. ఇంతలో కెప్టెన్ లోనికి వచ్చాడు. పొగమంచు కారణంగా దాదాపు 13 గంటలు విమానం ఆలస్యం అవుతుందని ప్రకటిస్తున్నాడు. ఇంతలో పసుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి ముందుకు దూసుకొచ్చాడు. కెప్టెన్ చెంప చెల్లుమనిపించాడు. ఈ వీడియోను నటి రాధికా ఆప్టే ఎక్స్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. నిందితున్ని సాహిల్ కటారియాగా గుర్తించారు. అతనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ కేసు నమోదు చేసింది. 

ఢిల్లీ సహా ఉత్తరాదిలో ఇటీవల తీవ్ర పొగమంచు వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైళ్లు సహా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పొగమంచు కారణంగా ఢిల్లీలో శనివారం 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. అటు 79 విమాన ప్రయాణాల్ని రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి: Makar Sankranti: గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement