
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తన వినియోగదారులకు హోలీ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘హోలీ గెట్‌వే సేల్’ పేరుతో ఆకర్షణీయ ఆఫర్లను అందించింది. ఇది ప్రయాణికులు తక్కువ ధరలతే తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా మార్చి 10 నుంచి మార్చి 12, 2025 వరకు బుకింగ్స్ కోసం పరిమిత ఆఫర్‌ను అందిస్తుంది. ఈ సమయాల్లో విమాన టికెట్లు బుక్ చేసిన ప్యాసింజర్లు మార్చి 17 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
విమాన ఛార్జీలు ఇలా..
ఈ హోలీ గెట్‌వే సేల్‌లో భాగంగా ఇండిగో దేశీయ రూట్లలో రూ.1,199, అంతర్జాతీయ రూట్లలో రూ.4,199 నుంచి వన్ వే విమాన ఛార్జీలు అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న వేసవిలో విహారయాత్రలు, సెలవులకు వెళ్లే వారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. విమాన ఛార్జీల్లో తగ్గుదలతోపాటు యాడ్-ఆన్ సర్వీసుల్లో డిస్కౌంట్లను కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రీపెయిడ్ అదనపు బ్యాగేజీపై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. స్టాండర్డ్ సీట్ సెలక్షన్‌లో 35 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం ముందుగా బుక్ చేసుకున్న వారికి భోజనం ఖర్చులో 10 శాతం తగ్గింపు ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఐపీఎల్‌లో పొగాకు, మద్యం ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం?
అదనంగా ఐదు శాతం తగ్గింపు..
ఇండిగో అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ విమానాలను బుక్ చేసుకునే ప్రయాణికులు అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే ఇండిగో హోలీ గెట్ వే సేల్ పరిధిలోని ఏయే గమ్యస్థానాలు వస్తాయో స్పష్టత ఇవ్వలేదు. సంస్థ విమానాల నెట్‌వర్క్ దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలను కవర్ చేస్తుంది. ప్రధానంగా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రసిద్ధ దేశీయ నగరాలతో పాటు దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు అధికంగా సర్వీసులు నడుపుతోంది. వీటికి ఉన్న పాపులారిటీ, కనెక్టివిటీ దృష్ట్యా ఈ సేల్‌లో ఈ గమ్యస్థానాలు భాగం అయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment