holy
-
తీర్థాన్ని ఎలా తీసుకోవాలి? ఇతర నియమాలు
గుడికి వెళ్తే ప్రసాదం తీసుకున్నా లేకున్నా తీర్థం తప్పకుండా తీసుకుంటాం. పూజారిగారు మరేదో వ్యాపకంలో ఉన్నా అడిగి మరీ తీసుకుంటాం. తీర్థం అంత అమూల్యమైంది, శ్రేష్ఠమైంది.తీర్థం తీసుకునేటప్పుడు కుడిచేతిని గోకర్ణంలా (ఆవు చెవి ఆకృతి) పెట్టాలి. అంటే చేతిని డిప్పలా ముడిచి, చూపుడు వేలును బొటనవేలుకు ఆనించాలి. అంతే తప్ప ఒక చేయి, లేదా రెండు చేతులను దోసిళ్ళలా పట్టకూడదు.ఉద్ధరణితో మూడుసార్లు తీర్థం పోసిన తర్వాత కళ్ళకు అద్దుకుని తాగాలి. తీర్థం తాగేటప్పుడు నిలబడకూడదు. కూర్చుని మాత్రమే సేవించాలి. తీర్థం తీసుకునేటప్పుడు జుర్రిన శబ్దం రాకూడదు.మనసులో దేవుని స్మరించుకుంటూ నిశ్శబ్దంగా సేవించాలి.కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలుఅన్నం తింటున్నప్పుడు అన్నాన్ని, ఆ అన్నం పెట్టువారిని తిట్టటం, దుర్భాషలాడటం చేయరాదు. ఏడుస్తూ తినడం, గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదుఒడిలో కంచం, పళ్ళెం పెట్టుకుని అన్నం తినరాదు. భోజనసమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనటం, గేలిచేయటం నష్టదాయకం. భోజనానంతరం ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవారికి వచ్చే పుణ్యం, అన్నదాతకు కూడా రాదు. -
దేశవ్యాపంగా సంక్రాంతి సందడి
ఈరోజు మకర సంక్రాంతి. దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ పండుగ సందర్భంగా హరిద్వార్ చేరుకున్న భక్తులు గంగానదిలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. #WATCH | Uttarakhand: Devotees took a holy dip in the river Ganga in Haridwar, on the occasion of Makar Sankranti. pic.twitter.com/EpVlAdUKjS — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 వారణాసిలోని గంగా ఘాట్‌కు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.‘హర్ హర్ గంగా’ అని నినాదాలు చేస్తూ పుణ్య స్నానాలు చేస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్‌లో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు ఖిచ్డీ సమర్పించారు. #WATCH | Uttar Pradesh: Devotees take a holy dip in the Ganga River in Varanasi on the occasion of Makar Sankranti. pic.twitter.com/IOQ6ernWSc — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 ఈ రోజున గంగా నదిలో స్నానమాచరించిన తర్వాత దానం చేయడం వల్ల సాధకునికి ఇహలోకం, పరలోకం రెండింటిలోనూ మంచి జరుగుతుందని చెబుతారు. #WATCH | West Bengal: Devotees take a holy dip and perform aarti in Gangasagar on the occasion of Makar Sankranti. pic.twitter.com/ywIq41tNz9 — ANI (@ANI) January 15, 2024 ఈ రోజు గంగా స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసి, వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యఫలితాలు లభిస్తాయని పండితులు అంటుంటారు. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. #WATCH | Uttar Pradesh: A large number of people gathered at the Gorakhnath Temple to offer 'Khichdi' on the occasion of Makar Sankranti pic.twitter.com/39nhmYFZ0L — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 ఇది కూడా చదవండి: గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి? #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath says, "Today is the auspicious occasion of Makar Sankranti. I extend my wishes of Makar Sankranti to all the devotees...It is celebrated across the country in different forms and names..." https://t.co/lAADGZSLZr pic.twitter.com/NAm4xa9BLd — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2024 -
ఐస్ క్రీం లవర్స్‌కి చల్లటివార్త: థండాయ్ ఐస్ క్రీం
హైదరాబాద్: ఐస్ క్రీమ్స్ తయారీలో ఉన్న ఎన్ఐసీ హానెస్ట్లీ క్రాఫ్టెడ్ ఐసీ క్రీమ్స్ హోలీ పండుగను దృష్టిలో పెట్టుకుని థండాయ్ ఫ్లేవర్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే కంపెనీ పాన్, గులాబ్ జామూన్, గాజర్ హల్వా, మోదక్, షీర్ ఖుర్మా, తిల్ గుడ్ వంటి 50కిపైగా ఫ్లేవర్లను విక్రయిస్తోంది. 2015లో ప్రారంభమైన ఎన్ఐసీ హానెస్ట్లీ క్రాఫ్టెడ్ ఐసీ క్రీమ్స్‌ను వాకో ఫుడ్ కంపెనీ ప్రమోట్ చేస్తోంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐస్‌క్రీం బ్రాండ్ ఎన్ఐసీ హానెస్ట్లీ క్రాఫ్టెడ్ ఐసీ క్రీమ్స్ ఇటీవల వాఫిల్ కోన్స్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వాఫిల్ కోన్లు 5 ప్యాక్‌లలో లభిస్తాయి. -
ముందే వచ్చిన హోలీ : లాభాల కళ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఆసక్తితో వరుస రెండు రోజుల నష్టాలకు చెక్ చెప్పిన కీలక సూచీలు వారాంతంలో పాజిటివ్‌గా ముగిసాయి. దీంతో మార్కెట్లో హోలీ కళ ముందే వచ్చినట్టయింది. ఆరంభంలోనే లాభాలతో కళకళ లాడిన సెన్సెక్స్ ఒక దశలో 700 పాయింట్లకు పైగా ఎగిసింది. అయితే ఇంట్రాడేలో భారీగా ఊగిసలాడినా, సుప్రీం కీలక తీర్పు తరువాత మిడ్ సెషన్ నుంచి స్థిరంగా కొనసాగాయి. సెన్సెక్స్ చివరికి 49వేల ఎగువన, నిఫ్టీ 14500పైన స్థిరపడటం విశేషం. సెన్సెక్స్ 568 పాయింట్ల లాభంతో 49008 పాయింట్ల వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు ఎగిసి 14507 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. దాదాపు అన్నిరంగాల షేర్లులాభపడ్డాయి. ప్రధానంగాబ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లు ఆకర్షణీయంగా నిలిచాయి. దీనికి తోడు సైరస్ మిస్త్రీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టాటా గ్రూపు కొనుగోళ్లకు ఇన్వెస్టర్లుమొగ్గు చూపారు. టాటా స్టీల్, టాటామోటర్స్,ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ పైవ్ గెయినర్లుగాను, యూపిఎల్,పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటర్స్, ఐటీసీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. కాగా శని, ఆదివారాలకు తోడు హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం (మార్చి 29) కూడా మార్కెట్లకు సెలవు. -
నేడు మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: హోలీ పండుగ సందర్భంగా నేడు (శుక్రవారం) మార్కెట్లకు సెలవు. ఈక్వీటీమార్కెట్లు, బులియన్, కమోడిటీ మార్కెట్లు శుక్రవారం పనిచేయవు. సోమవారం మళ్లీ యథావిధంగా మొదలవుతాయి. మరోవైపు.. లాంగ్ వీకెండ్ కావడంతో( శుక్ర,శని, ఆది మూడురోజులు) ఇన్వెస్టర్ల అప్రమత్తత నేపథ్యంలో గురువారం 137 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 34046.94 వద్ద, 34.50 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ.. 10458.35 ముగిసింది. పాఠకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు. -
వివాదాస్పద 'ముద్దు'పై స్పందించిన సింగర్
సాక్షి, ముంబై: 'బాలికకు అసభ్య ముద్దు' అంటూ గత కొన్నిరోజులుగా కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సింగర్ కమ్ కంపోజర్ పాపన్ అంటున్నాడు. లేనిపోని రాద్ధాంతం చేయడం వల్ల బాలిక కుటుంబంతో పాటు తన ఫ్యామిలీ చిక్కుల్లో పడుతుందని, తాను ఎలాంటి తప్పుచేయలేదని భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ వివాదానికి సంబంధించి ఓ లేఖ విడుదల చేశాడు పాపన్. పాపన్గా పేరుపొందిన అన్గరాగ్ మహంతా ఓ ఛానెల్ లో ప్రసారమవుతున్న వాయిస్ ఇండియా కిడ్స్ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. మెంటర్‌గా ఉన్న పాపన్.. హోలీ ఎపిసోడ్ అనంతరం ఓ బాలిక(11) ముఖానికి రంగురుద్ది పెదాలపై ముద్దాడాడు. దీంతో సింగర్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. బాలీవుడ్ సింగర్ లేఖలో ఏమన్నాడంటే.. 'నాకు పెళ్లయి 14 ఏళ్లయింది. సంతానంగా ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఏదైనా విషయాన్ని వెంటనే వ్యక్తం చేయడం నాకు అలవాటు. అందులో భాగంగానే ఓ 11 ఏళ్ల చిన్నారికి ముద్దు పెట్టాను. దురుద్దేశంతో చేసిన చర్య ఎంత మాత్రం కాదు. అలా అనుకుంటే నా ఫేస్బుక్ లైవ్ వీడియోగా ఎందుకు అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తానో మీరే ఆలోచించండి. ఏ తప్పుచేయలేదని భావిస్తున్నాను. ముద్దు పెట్టుకున్నందుకు క్షమాపణ అడుగుతున్నాను. ఒకవేళ నేను చేసిన దాంట్లో తప్పుందనుకుంటే ఇదివరకే నా ఫేస్బుక్లో ఆ వీడియోను డిలీట్ చేసేవాణ్ని. మీరు చేసే విమర్శలు, వ్యాఖ్యలు రెండు కుటుంబాల్లో చిచ్చు పెడుతాయి. ఓ అమాయక చిన్నారి జీవితాన్ని నాశనం చేయాలని చూడొద్దంటూ' పలు విషయాలను పాపన్ రాసుకొచ్చాడు. మరోవైపు మైనర్ బాలిక తండ్రి సైతం సింగర్ పాపన్ను వెనకేసుకొచ్చారు. 'పాపన్ కావాలని ఆ పని చేయలేదు. అతడిని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరమే లేదని' బాలిక తండ్రి ఇదివరకే స్పందించారు. తన గురించి తెలిసిన వాళ్లు పాపోన్ తప్పుచేశాడని భావించడం లేదని,ఈ వివాదంలో తన కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పాపన్ తెలిపాడు. కాగా, సుప్రీం కోర్టు న్యాయవాది రునా భుయాన్.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో సింగర్ పాపన్పై ఫిర్యాదు చేశారు. పోక్సో(POCSO) యాక్ట్ కింద పాపోన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని భుయాన్ కోరుతున్నారు. వివాదం ముదురుతున్న కొద్దీ దీనిపై సింగర్ పాపన్ లేఖ ద్వారా వివరణ ఇచ్చుకున్నాడు. -
మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్
ముంబై : సింగర్ కమ్ కంపోజర్ పాపోన్ చిక్కుల్లో పడ్డాడు. ఓ మ్యూజిక్ రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న అతను.. ఓ బాలికను ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాపోన్‌గా పేరుపొందిన అన్గరాగ్ మహంతా ఓ ఛానెల్ లో ప్రసారమవుతున్న వాయిస్ ఇండియా కిడ్స్ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకి షాన్, హిమేష్ రేష్మియాలు కూడా జడ్జిలు. మంగళవారం ఈ షోకి హోలీ ప్రత్యేక ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. ఈ సందర్భంగా హోలీ ఆడుతూ పాపోన్ ఓ బాలిక ముఖానికి రంగు పూసి పెదాలపై ముద్దాడాడు. ఆ వ్యవహారమంతా ఫేస్ బుక్ లైవ్‌లో టెలీకాస్ట్ అయ్యింది. ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు న్యాయవాది రునా భుయాన్.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో ఫిర్యాదు చేశాడు. పోక్సో(POCSO) యాక్ట్ కింద పాపోన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని భుయాన్ కోరుతున్నాడు. ఇలాంటి ఘటనలు చూశాక రియాల్టీ షోలలో పాల్గొనే పిల్లల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. కాగా, విమర్శలపై పాపోన్ ఇంతవరకు స్పందించలేదు. అస్సామీ సింగర్ అయిన పాపోన్ బర్ఫీ, సుల్తాన్, దమ్ లగా కే హైసా.. తదితర చిత్రాలతో పాపులర్ అయ్యాడు. -
హజ్‌యాత్ర పుణ్యకార్యం
– అల్హాజ్ ముఫ్తి అబ్దుర్‌రహిమాన్ – రాయలసీమ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్‌యాత్రికులకు శిక్షణ తరగతులు కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్‌యాత్ర పుణ్యకార్యమని దారుల్ ఉలూమ్ ఐనుల్ హుదా ప్రిన్సిపల్ అల్హాజ్ ముఫ్తి అబ్దుర్ రహిమాన్ సాహబ్ పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరూ మక్కాకు వెళ్లిరావాలని సూచించారు. రాయలసీమ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం హజ్ యాత్రికులకు స్థానిక మెరీడియన్ ఫంక్షన్ హాల్లో ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజ్ యాత్రలో చేసే దువా తప్పకుండా ఫలిస్తుందని, అక్కడ లోక కల్యాణం కోసం ప్రార్థించాలని సూచించారు. కార్యక్రమానికి రబ్బాని గోదాము అధినేత అల్హాజ్ తాటిపాడు మహబూబ్‌బాషా, మెరీడియన్ ఫంక్షన్ హాల్ అధినేత బషీర్‌అహ్మద్, మౌలానా సులేమాన్ నద్వి, చాంద్‌బాషా (గద్వాల), ముస్తాఖ్అహ్మద్ (ఆదోని) తదితరులు అతిథులుగా హాజరై మాట్లాడారు. -
రాజ్‌భవన్‌లో ఉత్సాహంగా హోలీ సంబరాలు
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో ఆదివారం ఉదయం హోలీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ దంపతులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని సంబరాలు ప్రారంభించారు. గవర్నర్ ఉత్సాహంగా మీడియా ప్రతినిధులతోపాటు అందరికీ రంగులు జల్లుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో హోలీ జరుపుకోవాలని గవర్నర్ దంపతులు కోరారు. ప్రజలందరూ సహజసిద్ధమైన రంగులతోనే హోలీ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. -
మహిళలమన్న సంగతి మర్చిపోవాలి
స్ఫూర్తి సిన్హా ‘‘మహిళగా... మహిళా శాస్త్రవేత్తగా రెండు పాత్రలు పోషించేందుకు రెండింతలు కష్టపడ్డాను అనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు చిన్న వయసులో ఉండగానే భర్తను కోల్పోయాను. ఒక్కోసారి ఆఫీసు పనులు ముగించుకుని ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇంటికొస్తే... తినేందుకు కూడా ఏమీ ఉండేది కాదు. కొన్నిసార్లు నా బిడ్డ పవిత్ర సైకిలేసుకుని డీఆర్డీవో క్యాంటీన్ నుంచి బ్రెడ్ లాంటివి పట్టుకొచ్చేది. తగిన అవకాశమిస్తే ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తారు. మహిళలు ఆఫీస్ మీటింగ్స్‌లో, క్లాస్‌రూమ్‌లోనైనా, ఇతర ప్రాంతాల్లోనూ తాము మహిళలమని, ఒంటరిగా ఉన్నామన్న సంగతిని మరచిపోవాలి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. అయితే దీంట్లో సమాజం పాత్ర కూడా చాలా ఉంది. మహిళలు తమతమ రంగాల్లో వృద్ధి చెందేందుకు సురక్షితమైన వాతావరణం ఉండాలి. దురదృష్టవశాత్తూ దేశంలో ఇప్పటికీ అలాంటి పరిస్థితులు లేవు. మహిళలు ఎలాంటి దుస్తులేసుకోవాలి? ఎలాంటి చోట్లకు వెళ్లాలి? ఎవరిని కలవాలి? అని సినిమాల ద్వారా సమాజానికి సందేశాలు పంపాల్సిన పరిస్థితి ఇంకా ఎందుకుంది? నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు మా నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని కచ్చితంగా చెప్పగలను. మీకు పెద్దకట్నాలిచ్చి పెళ్లి చేయగలనో లేదో తెలియదుగానీ... శక్తివంచన లేకుండా మీరు చదివినంత చదివిస్తాను అనేవారు ఆయన. ఇలాంటి ప్రోత్సాహం అందరికీ లభించాలని కోరుకుంటున్నాను’’ – శశికళా సిన్హా, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇంటర్‌సెప్టర్ మిస్సైల్స్ ప్రోగ్రామ్, డీఆర్డీవో -
ముంగిట్లోకే పవిత్ర గంగాజలం!
న్యూఢిల్లీః కాశీ వెళ్ళి గంగలో స్నానం చేయడం అంటే జీవితం ధన్యం అయినట్లేనని ఎంతోమంది హిందువులు నమ్ముతారు. ఆ పుణ్య తీర్థ స్నానం జీవితంలో ఒక్కసారైనా చేయాలని ఆశిస్తారు. ఆ నదీ జలాలతో స్నానమాచరించాలనే కోరిక ఉన్నా, అవకాశం లేని వారికోసం ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. గంగా జలాన్ని పోస్టు ద్వారా ఏకంగా మీ ముంగిట్లోకి తెచ్చే ప్రత్యేక సౌకర్యాన్ని ఈ కామర్స్ సహాయంతో అందించనుంది. పవిత్ర గంగాజలం పోస్టుద్వారా నేరుగా ఇంటికే వచ్చే అవకాశం దగ్గర్లోనే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ శాఖను వినియోగించుకొని ఈ కామర్స్ సైట్లతో అనుసంధానమై ఈ ప్రత్యేక సదుపాయాన్నిభక్తులకు ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనుంది. పోస్టల్ నెట్ వర్క్ ద్వారా గంగాజలం పొందే అవకాశాన్ని కల్పించమంటూ తమకు ఎన్నో విన్నపాలు అందాయని, అందుకే హరిద్వార్, రిషికేశ్ ల వద్దనుంచి శుద్ధి చేసిన గంగాజలాన్ని ఇంటింటికి చేర్చే సదుపాయం కల్పించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం ద్వారా గంగాజలాన్ని ఇంటికి పంపిచే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక ప్రతిపాదనతో పోస్టల్ శాఖకు ఎనభై శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో సాధించిన విజయాలను వెల్లడించిన సందర్భంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తరాలతోపాటు చీరలు, ఆభరణాలు వంటి ఎన్నో వస్తువులతో కూడి పార్శిళ్ళను అందిస్తున్న పోస్ట్ మ్యాన్ లు గంగాజలం ఎందుకు అందించకూడదు అన్నారు. స్పీడ్ పోస్ట్ రెవెన్యూ డిపార్ట్ మెంట్ 2013-14 సంవత్సరాల్లో 1,372 కోట్ల ఆదాయాన్ని చవి చూసిందని, అలాగే 2015-16 అది 1600 కోట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. అదే సంవత్సరాల్లో ఈ కామర్స్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ కలెక్షన్లు 100 కోట్లనుంచి 1300 కోట్లకు పెరిగాయని తెలిపారు. -
ట్విన్స్... కానీ పుట్టినరోజులు వేరు..!
ఆమె ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మరో రెండు నెలల్లో మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఆమెరికా సియాటిల్ ప్రాంతానికి చెందిన హోలీ గార్వియాట్ కు... కేవలం 450 గ్రాముల బరువుతో పుట్టిన ఓ శిశువు... ఇప్పుడు సైన్స్ అద్భుతాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. గర్భవతి అయిన హోలీకి డాక్టర్లు జనవరిలో ప్రసవం అవుతుందని ముందుగా అనుకున్నారు. కానీ పోస్ట్ పార్టమ్, పార్టమ్ సమస్యతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యాన్ని, కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించేందుకు ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. రక్త స్రావ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆమె గర్భంలోని ఓ శివుకు కేవలం 23 వారాలకే జన్మనిచ్చేట్టు ఏర్పాట్లు చేశారు. కడుపులోని కవలల్లో ఒకరిని శస్త్రచికిత్స తో జాగ్రత్తగా బయటకు తీశారు. మరో శిశువును గర్భంలోనే ఉంచారు. అమ్మ కడుపులో మరో రెండు నెలలు గడిపేందుకు ఆ నవజాత శిశువు లోగాన్ కు అవకాశం ఇచ్చారు. అంటే వారిద్దరూ కవలలే అయినా పుట్టిన రోజులు మారిపోయాయి. అయితే ప్రస్తుతం కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యంగానే ఉన్నాడని, మరోబిడ్డను ఆరోగ్యపరంగా కడుపులో ఉంచే అవకాశం లేదు కనుక ముందే బయటకు తీయాల్సి వచ్చిందని హోలీ చెప్తోంది. డాక్టర్లు ఆ ప్రిమెట్యూర్ బేబీని ఆస్పత్రిలోనే ఉంచి తగిన వైద్యాన్ని అందిస్తున్నారు. కవలలిద్దరూ తల్లి గర్భంలోని ప్లాసెంటాను షేర్ చేసుకుని ఉండే సమయంలో ఇద్దరినీ విడదీసి ఇన్ యుటరీ సర్జరీ చేయడం ఎంతో కష్టసాధ్యమైన పని అని డాక్టర్ మార్టిన్ వాకర్ అంటున్నారు. దీన్ని ట్విన్ ట్విన్ ట్రాన్స్ ఫ్యూజన్ సిండ్రోమ్ అంటారని చెప్తున్నారు. తల్లి గర్భంలో రక్తస్రావం వల్ల ఇద్దరిలో ఒక శిశువు బలహీనంగానూ, రక్తహీనతతో బాధపడుతున్నాడని, మరో బిడ్డ... అవసరానికి మించి రక్తాన్ని పొందుతూ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితిలో ఉండటంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని వివరించారు. అయితే ఇద్దరి రక్త నాళాలను విడదీసి సమస్యను పరిష్కరించగలిగామని చెప్తున్నారు. ఆపరేషన్ చేసిన వారం తర్వాత గార్వియాట్ కు పరీక్షలు నిర్వహించామని, కడుపులోని మరో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రసవం అయ్యే అవకాశం ఉందని డాక్లర్ వాకర్ చెప్తున్నారు. ఈ ప్రక్రియ జరిగి వారం రోజులు సమయం దాటిందని, ఈ వారంలో కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంలో ఎంతో మార్పు వచ్చిందని, ఆరోగ్యంగా పెరుగుతున్నాడని వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ పన్నెండేళ్లకు..
-
'మా సీఎం గంగలా స్వచ్ఛమైన వ్యక్తి'
భోపాల్: వ్యాపం కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సొంత పార్టీ నేతలు అండగా నిలిచారు. మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షడు నంద్ కుమార్ ఆదివారం భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం శివరాజ్‌ను గంగా నదితో పోల్చారు. 'మా ముఖ్యమంత్రి గంగా నది అంతటి పవిత్రమైనవారు. కావాలనే విపక్షాలు ఆయనపై బుదర జల్లుతున్నాయి. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆయన కడిగిన ముత్యంలా బయటికొస్తారు' అని నంద్ కుమార్ వ్యాఖ్యానించారు. -
రంగుల కేళీకి రెడీనా!
కలర్‌ఫుల్ కేళీ... హోలీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు నగరంలోని రిసార్ట్స్, క్లబ్‌లు, స్టార్ హోటళ్లు ముస్తాబవుతున్నాయి. బంధువులు, స్నేహితులతో మస్తుగా ఎంజాయ్ చేసి ఫెస్ట్‌ను మెమరబుల్‌గా మార్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈజిప్ట్ స్టైల్: హోలీని ఇళ్లలో, వీధుల్లో స్నేహితులతో కలిసి చేసుకునే అలవాటు ఉన్న మనకు కొంగొత్త తరహాలో రంగుల ఆటను చూపించనుంది బెంగళూరు హైవే కొత్తూరు సమీపంలోని పెప్పర్స్ పోర్టు రిసార్ట్. బాలీవుడ్ మ్యూజిక్కు యువత స్విమ్మింగ్ పూల్‌లోనే స్టెప్పులేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఫుల్ జోష్ కోసం డీజేల మ్యూజిక్‌తో కలర్‌ఫుల్ రెయిన్ డ్యాన్స్‌ను పరిచయం చేస్తోంది. ఈజిప్టులోనే హోలీ చేసుకున్నామా అనే ఫీలింగ్ కలిగించేలా... ఆ దేశంలో ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు నిర్వాహకులు. ఆర్గానిక్ రంగుల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో రంగుల ఆటని అస్వాదించడంతో పాటు స్పెషల్ ఫుడ్‌ని కూడా ఆఫర్ చేస్తోంది. పుడ్ భళా: రంగుల ఆటల్లో మునిగితేలే నగరవాసులకు హోలీ రోజున పసందైన వంటకాలను వండి వార్చనున్నాయి హోటళ్లు. సంప్రదాయంతో పాటు, స్పైసీ రుచులను ఆస్వాదించాలనుకొనేవారు బేగంపేట్‌లోని హోటల్ తాజ్ వివంతాలో ఏర్పాటు చేసే ‘ఎక్స్టెన్సివ్ బఫెట్’కు వెళ్లవచ్చు. అలాగే హైటెక్స్‌లోని నోవాటెల్, ట్రైడెంట్, లెమన్ ట్రీ, బెస్ట్ వెస్టర్న్ అశోకా హోటల్స్‌లో కూడా స్పెషల్స్ టేస్ట్ చేసేయవచ్చు. హోలీ పార్టీ: పార్టీ మూడ్‌ను లోడ్స్ ఆఫ్ ఫన్‌తో ఎంజాయ్ చేయాలనుకునేవారికి సోమాజిగూడ పార్క్ హోటల్లోని ఆక్వా సరికొత్త థీమ్ పార్టీ ‘పిటార్స్ హోలీ హైదరాబాద్ 2015’ అరేంజ్ చేస్తోంది. ఆర్గానిక్ కలర్స్‌తో రంగులతో ఆడేసుకొని... డీజే మ్యూజిక్కు డ్యాన్స్ ఫ్లోర్‌ను అదరగొట్టేసి... ఆపై రెయిన్ డ్యాన్సులతో తడిసి ముద్దయ్యి... ఓ టేస్టీ ఫుడ్‌తో సెలబ్రేట్ చేసుకొనే చాన్స్ ఇది. సో... గెట్ రెడీ ఫర్ కలర్‌ఫుల్ ఈవెంట్! - వీఎస్