
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఆసక్తితో వరుస రెండు రోజుల నష్టాలకు చెక్ చెప్పిన కీలక సూచీలు వారాంతంలో పాజిటివ్‌గా ముగిసాయి. దీంతో మార్కెట్లో హోలీ కళ ముందే వచ్చినట్టయింది. ఆరంభంలోనే లాభాలతో కళకళ లాడిన సెన్సెక్స్ ఒక దశలో 700 పాయింట్లకు పైగా ఎగిసింది. అయితే ఇంట్రాడేలో భారీగా ఊగిసలాడినా, సుప్రీం కీలక తీర్పు తరువాత మిడ్ సెషన్ నుంచి స్థిరంగా కొనసాగాయి. సెన్సెక్స్ చివరికి 49వేల ఎగువన, నిఫ్టీ 14500పైన స్థిరపడటం విశేషం.
సెన్సెక్స్ 568 పాయింట్ల లాభంతో 49008 పాయింట్ల వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు ఎగిసి 14507 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. దాదాపు అన్నిరంగాల షేర్లులాభపడ్డాయి. ప్రధానంగాబ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లు ఆకర్షణీయంగా నిలిచాయి. దీనికి తోడు సైరస్ మిస్త్రీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టాటా గ్రూపు కొనుగోళ్లకు ఇన్వెస్టర్లుమొగ్గు చూపారు.
టాటా స్టీల్, టాటామోటర్స్,ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ పైవ్ గెయినర్లుగాను, యూపిఎల్,పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటర్స్, ఐటీసీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. కాగా శని, ఆదివారాలకు తోడు హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం (మార్చి 29) కూడా మార్కెట్లకు సెలవు.
Comments
Please login to add a commentAdd a comment