ఈరోజు మకర సంక్రాంతి. దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ పండుగ సందర్భంగా హరిద్వార్ చేరుకున్న భక్తులు గంగానదిలో పుణ్య స్నానాలు చేస్తున్నారు.
#WATCH | Uttarakhand: Devotees took a holy dip in the river Ganga in Haridwar, on the occasion of Makar Sankranti. pic.twitter.com/EpVlAdUKjS
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024
వారణాసిలోని గంగా ఘాట్‌కు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.‘హర్ హర్ గంగా’ అని నినాదాలు చేస్తూ పుణ్య స్నానాలు చేస్తున్నారు.
మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్‌లో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు ఖిచ్డీ సమర్పించారు.
#WATCH | Uttar Pradesh: Devotees take a holy dip in the Ganga River in Varanasi on the occasion of Makar Sankranti. pic.twitter.com/IOQ6ernWSc
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024
ఈ రోజున గంగా నదిలో స్నానమాచరించిన తర్వాత దానం చేయడం వల్ల సాధకునికి ఇహలోకం, పరలోకం రెండింటిలోనూ మంచి జరుగుతుందని చెబుతారు.
#WATCH | West Bengal: Devotees take a holy dip and perform aarti in Gangasagar on the occasion of Makar Sankranti. pic.twitter.com/ywIq41tNz9
— ANI (@ANI) January 15, 2024
ఈ రోజు గంగా స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసి, వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యఫలితాలు లభిస్తాయని పండితులు అంటుంటారు. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
#WATCH | Uttar Pradesh: A large number of people gathered at the Gorakhnath Temple to offer 'Khichdi' on the occasion of Makar Sankranti pic.twitter.com/39nhmYFZ0L
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024
ఇది కూడా చదవండి: గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి?
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath says, "Today is the auspicious occasion of Makar Sankranti. I extend my wishes of Makar Sankranti to all the devotees...It is celebrated across the country in different forms and names..." https://t.co/lAADGZSLZr pic.twitter.com/NAm4xa9BLd
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2024
Comments
Please login to add a commentAdd a comment