
మైనర్‌కు ముద్దు పెడుతున్న సింగర్ పాపోన్
ముంబై : సింగర్ కమ్ కంపోజర్ పాపోన్ చిక్కుల్లో పడ్డాడు. ఓ మ్యూజిక్ రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న అతను.. ఓ బాలికను ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాపోన్‌గా పేరుపొందిన అన్గరాగ్ మహంతా ఓ ఛానెల్ లో ప్రసారమవుతున్న వాయిస్ ఇండియా కిడ్స్ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకి షాన్, హిమేష్ రేష్మియాలు కూడా జడ్జిలు. మంగళవారం ఈ షోకి హోలీ ప్రత్యేక ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. ఈ సందర్భంగా హోలీ ఆడుతూ పాపోన్ ఓ బాలిక ముఖానికి రంగు పూసి పెదాలపై ముద్దాడాడు. ఆ వ్యవహారమంతా ఫేస్ బుక్ లైవ్‌లో టెలీకాస్ట్ అయ్యింది.
ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు న్యాయవాది రునా భుయాన్.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో ఫిర్యాదు చేశాడు. పోక్సో(POCSO) యాక్ట్ కింద పాపోన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని భుయాన్ కోరుతున్నాడు. ఇలాంటి ఘటనలు చూశాక రియాల్టీ షోలలో పాల్గొనే పిల్లల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.
కాగా, విమర్శలపై పాపోన్ ఇంతవరకు స్పందించలేదు. అస్సామీ సింగర్ అయిన పాపోన్ బర్ఫీ, సుల్తాన్, దమ్ లగా కే హైసా.. తదితర చిత్రాలతో పాపులర్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment