KISS
-
అలా చేయాలని వాళ్లే బలవంతం చేశారు: ఇజ్రాయెల్ బందీ
టెల్అవీవ్:గాజా కాల్పుల విరమణలో భాగంగా ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను హమాస్ శనివారం(ఫిబ్రవరి22) విడిచిపెట్టారు. ఏడాదిన్నర తర్వాత వీరు హమాస్ చెర నుంచి బయటపడ్డారు.అయితే విడుదల సందర్భంగా ఒమర్ షెమ్‌టోవ్ అనే బందీ హమాస్ ఉగ్రవాదులను ముద్దు పెట్టకుని అందరినీ ఆశ్చర్య పరిచాడు.అయితే గాజా నుంచి రెడ్‌క్రాస్ వాహనంలో ఎక్కి ఇజ్రాయెల్ చేరుకున్న తర్వాత షెమ్‌టోవ్ అసలు విషయం చెప్పాడు.హమాస్ ఉగ్రవాదులే తమను అలా ముద్దు పెట్టుకోవాల్సిందిగా బలవంతం చేశారని చెప్పాడు.‘నన్ను అలా చేయాల్సిందిగా వాళ్లు ఒత్తిడి చేశారు.మీరు కావాలంటే వీడియోలో చూడొచ్చు.. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఏం చేయాలో చెప్తున్నాడు’అని వివరించాడు.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోని నెగెవ్ జిల్లాపై హమాస్ ఉగ్రవాదులు దాడి జరిపి 1200 మందిని చంపడమే కాకుండా 250 మందిని తమ వెంట గాజాకు బందీలుగా తీసుకెళ్లారు. వీరిలో షెమ్‌టోవ్ ఒకరు. నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో ఉండగా షెమ్‌టోవ్ హమాస్ ఉగ్రవాదులకు చిక్కాడు. -
రెండు రోజుల క్రితమే వివాదంలో సింగర్.. అంతలోనే మరో వీడియో వైరల్!
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ చేసిన పని ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసింది. ఓ మహిళా అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన ఏకంగా ముద్దులు ఇవ్వడంతో పలువురు మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఈ వయసులో ఇలాంటి పనులేంటని సింగర్‌ను నిలదీశారు. అభిమానంతో ఫోటోలు దిగితే అందరిముందే అలా ప్రవర్తించడం ఏంటని ఉదిత్ నారాయణ్‌ను ప్రశ్నించారు.అయితే ఈ సంఘటన జరగకుముందే మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో మహిళకు ముద్దు పెడుతూ కనిపిచంారు. ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇది కొత్త వీడియోనా.. గతంలో జరిగిందా అనే విషయంపై క్లారిటీ లేదు. కాగా.. గతంలో ఉదిత్ నారాయణ్.. సింగర్స్ అల్కా యాగ్నిక్, శ్రేయో ఘోషల్ అనుమతి లేకుండా వారికి ముద్దు పెట్టాడు. ఏదేమైనా అనుమతి లేకుండా మహిళ అభిమానులతో అలా ప్రవర్తించడంపై ఆయనపై విమర్శలొస్తున్నాయి.(ఇది చదవండి: 'మహిళా అభిమానులకు ముద్దులు'.. వివాదంపై స్పందించిన సింగర్)కాగా.. ఉదిత్ నారాయణ్ బాలీవుడ్ సింగర్. ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు ఆలపించాడు. నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది.Another video of Udit Narayan pic.twitter.com/dYGWgPfUHl— Savage SiyaRam (@SavageSiyaram) February 5, 2025 -
'మహిళా అభిమానులకు ముద్దులు'.. వివాదంపై స్పందించిన సింగర్
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ (Udit Narayan)పై తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు వచ్చిన మహిళ అభిమానులకు ముద్దులు పెట్టి వార్తల్లో నిలిచారు. అంతేకాకుండా ఓ మహిళ అభిమానికి ఏకంగా లిప్ లాక్ కిస్ ఇవ్వడంతో ఆయనపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఆయన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 69 ఏళ్ల వయసులో ఇలాంటి పనులేంటని నిలదీస్తున్నారు. గతంలోనూ ఆయన చాలాసార్లు అలానే ప్రవర్తించారు. గతంలోనూ ఉదిత్.. సింగర్స్ అల్కా యాగ్నిక్, శ్రేయో ఘోషల్ అనుమతి లేకుండా వారికి ముద్దు పెట్టాడు.తాజాగా తనపై వస్తున్న విమర్శలపై ఉదిత్ నారాయణ్ స్పందించారు. అభిమానులతో అలా ప్రవర్తించినందుకు తనకేలాంటి బాధలేదని అంటున్నాడు. సోషల్‌మీడియాలో వచ్చిన వీడియోల్లో మీరు చూసింది మా మధ్య ఉన్న ప్రేమకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. దీనిపై చింతించాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదంటున్నాడు. వారు నన్ను అభిమానించడం వల్లే నా ప్రేమను తెలియపరిచానని వెల్లడించారు. నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేనప్పుడు బాధపడాల్సిన అవసరం కూడా లేదన్నారు.(ఇది చదవండి: అభిమానితో సింగర్ ముద్దులాట.. ఈ వయసులో ఇదేం పని?)ఉదిత్ నారాయణ్ మాట్లాడుతూ..'నా కుటుంబానికి చెడ్డపేరు తీసుకువచ్చే పని ఎప్పుడూ చేయలేదు. సోషల్‌మీడియాలో వీడియోల్లో కేవలం అభిమానులపై నేను చూపిస్తున్న ప్రేమ. వాళ్లు నన్ను ఏలా ప్రేమిస్తున్నారో..అలాగే వారిని కూడా ప్రేమిస్తున్నా. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఎక్కడుంది? నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. నేను వారి వల్లే మరింత ఫేమస్ అయ్యా' అని అన్నారు.కాగా.. ఉదిత్ కొన్నిరోజుల క్రితమే లైవ్ కన్సర్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళా అభిమానులు ఆయనతో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఉదిత్ నారయణ్ వారికి ముద్దులు పెట్టాడు. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు.ఉదిత్ నారయణ్ తెలుగులో పలు చిత్రాలకు పాటలు పాడారు. బాలీవుడ్ సింగర్ అయినప్పటికీ ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు ఆలపించాడు. నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది -
లిప్ లాక్ ఆ హీరోయిన్ నేర్పిందన్న హీరో
ఒకప్పుడు అత్యంత అరుదుగా మాత్రమే కనిపించే పెదాలతో పెదాలను కలిపే లిప్‌లాక్ సన్నివేశాలు ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. వయసులకు అతీతంగా నటీనటులు ముద్దాడేసుకుంటున్నారు. బాలీవుడ్ చిత్రాల్లో నటనకు సై అనడం అంటే లిప్‌లాక్‌కు కూడా సై అన్నట్టే అన్నంతగా పరిస్థితి మారిపోయింది. ఈ నేపధ్యంలో ఓ కిస్సింగ్ సీన్లో నటించలేక తాను ఇబ్బంది పడ్డానని హీరో ప్రతీక్ గాంధీ(Pratik Gandhi ) చెప్పడం విశేషం.బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా దో ఔర్ దో ప్యార్‌లో ప్రతీక్ గాంధీ బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ విద్యాబాలన్(Vidya Balan) తో కలిసి లిప్‌లాక్ సన్నివేశం ఉంది. ప్రతీక్ గాంధీ కన్నా నటనతో పాటు వయసులోనూ పెద్దదైన విద్యాబాలన్... లిప్లాక్స్లోనూ సీనియరే. ఇప్పటికే చాలా సినిమాల్లో తెరపై సహనటులకు ముద్దులు గుప్పించి పండించిన విషయం తెలిసిందే.స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీలో తన అద్భుతమైన నటనకు పేరుగాంచిన ప్రతీక్ గాంధీ ఇటీవల లెహ్రెన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సినిమాలోని తన లిప్‌లాక్ సన్నివేశం గురించి ఓపెనయ్యాడు. విద్య తన మొట్టమొదటి ఆన్–స్క్రీన్ ముద్దును తెరపై పండించేందుకు ఎలా కారణమైందో అతను వెల్లడించాడు. శక్తివంతమైన నటనతో పాప్యులారిటీ సంపాదించుకున్న ప్రతీక్ తాను ఇంతకు ముందు ఎప్పుడూ ముద్దు సన్నివేశంలో నటించలేదని అందువల్లే తొలిముద్దు సమయంలో ఇబ్బంది పడ్డానని అంగీకరించాడు, తనకు ఎంతో అసౌకర్యాన్ని కలిగించిన ఆ పరిస్థితిని సులభంగా విశ్వాసంతో హ్యాండిల్ చేసేందుకు విద్యాబాలన్ తనకి బాగా హెల్ప్ చేసిందని చెప్పాడు.‘వృత్తిరీత్యా నటుడిగా ఉన్నప్పటికీ, ఆన్ స్క్రీన్ సాన్నిహిత్యం గురించి తనకు వ్యక్తిగతంగా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు ఒక విషయం చూపించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కేవలం కళ్లతో కూడా చూపించవచ్చు’’ అంటూ స్పష్టం చేశాడు. ఏదేమైనా ఈ సీన్ చాలా బాగా వచ్చిందని అన్నాడు. అయితే ఈ సినిమాలోని ఆ సన్నివేశం ఏమి కోరుకుంటున్నదో ఆమె (విద్య)కు తెలుసు. అలాగే దానిని ఎలా కోరుకుంటున్నదో కూడా ఆమెకు స్పష్టత ఉంది అందుకే ఆమె చేసిన విధానం అంత ఖచ్చితంగా ఉంది. సీనియర్ నటిగా దానిని పండించగలిగారు అంటూ చెప్పారు ప్రతీక్, ‘ఆ సన్నివేశం చిత్రీకరించే సమయంలో ఆమె చాలా ఉల్లాసంగా ఉంది; అది నా పరిస్థితిని పూర్తిగా తేలికగా మార్చేసింది హమ్నే హస్టే–హస్టే వో సీన్ కర్ దియా (మేం నవ్వుతూనే ఆ సీన్ చేసాము)‘ అంటూ చెప్పాడు. ఆమె సపోర్టివ్ నేచర్‌ను ప్రతీక్ ఎంతగానో కొనియాడాడు, ఆమెను వండర్ ఫుల్ కో స్టార్ అని పేర్కొన్నాడు.లిప్‌లాక్స్‌తో పాటు ఆసక్తికరమైన కథాంశం ఉన్నప్పటికీ, దో ఔర్ దో ప్యార్ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది అయినప్పటికీ, విద్య ప్రతీక్ ఇద్దరూ తమ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చాలా మంది వారి ఆన్–స్క్రీన్ కెమిస్ట్రీని వారి పాత్రలకు వారు ప్రాణం పోసిన తీరును ప్రశంసించారు. దో ఔర్ దో ప్యార్ ఫెయిల్యూర్ అయినా, విద్యాబాలన్ భూల్ భులయ్యా 3తో తిరిగి పుంజుకుంది, ఇది భారీ విజయాన్ని సాధించింది. -
కండలవీరుడికి ముద్దు పెట్టిన హీరోయిన్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రియాలిటీ షో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ సీజన్ అభిమానులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తోంది. తాజా ఎపిసోడ్లో బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ మెరిసింది. ఇటీవల విడుదలైన తన మూవీ విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాను ప్రమోట్ చేసేందుకు వచ్చింది.ఈ ఎపిసోడ్లో పాల్గొన్న మల్లికా షెరావత్.. సల్మాన్ ఖాన్‌పై ప్రేమవర్షం కురిపించింది. ఇండియా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అంటూ కొనియాడింది. నా కళ్లలో కళ్లు పెట్టి చూడు అంటూ సల్మాన్‌తో సరదాగా మాట్లాడింది. మీరు నా హృదయంలో ఉన్నారంటూ వేదికపైనే సల్మాన్‌కు ముద్దుపెట్టి మరి తన ప్రేమను వ్యక్తం చేసింది. దీంతో సల్మాన్ ఖాన్ సిగ్గుపడుతూ కనిపించారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. సల్మాన్ హోస్ట్‌గా ఉన్న ఈ రియాలిటీ షోలో మల్లికా షెరావత్ మొదటిసారి కనిపించింది. ఈ ఎపిసోడ్‌కు మల్లికతో పాటు చిత్రంలో నటించిన రాజ్‌కుమార్ రావు, ట్రిప్తి డిమ్రీ కూడా హాజరయ్యారు. 1990లో ఓ చిన్న పట్టణంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి రాజ్ శాండిల్య దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
ప్రచారంలో యువతికి ముద్దు.. వివాదంలో బీజేపీ ఎంపీ
కోల్‌కతా: దేశమంతటా ఎన్నికల వేడి రాజుకుంది. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటంతో నువ్వానేనా అన్నట్లుగా అధికార ప్రతిపక్షాలు ప్రచార జోరు పెంచాయి. ఓటర్లను ఆకర్షించుకునేందుకు విభిన్న రీతిలో ప్రచారం చేస్తూ హోరెత్తిస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్లో ఓ బీజేపీ అభ్యర్ధి నిర్వహించిన ప్రచారం వివాదంలో చిక్కుకుంది.బెంగాల్ నార్త్ మల్దా నియోజవర్గం బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము.. మరోసారి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇటీవల ఆయన తన నియోజకవర్గ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఖగేన్.. ఓయువతి చెంపపై ముద్దు పెట్టాడు. చంచల్ శ్రిహిపూర్ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ప్రచారంలో భాగంగా ఖగేన్ ముర్ము యువతికి ముద్దు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఘటన రాజకీయ దుమారాన్ని రేపింది.దీనిపై అధికార తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ బీజేపీపై విరుచుకుపడింది. కాషాయ పార్టీలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవేలేదని విమర్శలు గుప్పించింది. ‘బీజేపీ ఎంపీ బెంగాల్‌లోని ఉత్తర మాల్దా అభ్యర్ధి ఖగేన్ ముర్మూ తన ప్రచారంలో ఓ మహిళకు ముద్దు పెట్టారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీల నుంచి.. బెంగాలీ మహిళలపై అశ్లీల పాటలు రాసేటటువంటి నేతలు.. బీజేపీ శిబిజరంలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవే లేదు. నారీమణులకు ‘మోదీ పరివార్’ ఇస్తున్న గౌరవం ఇది. ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి’ అంటూ ఎక్స్ వేదికగా మండిపడింది. అయితే ఖగేన్ ముర్మూ తన చర్యలను సమర్ధించుకున్నారు. ఆమెను తన కుమార్తెలా భావించి, ముద్దు పెట్టినట్లు తెలిపారు. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారని విమర్శించారు. చదవండి: పతంజలి కేసు.. ‘క్షమాపణలు అంగీకరించం.. చర్యలు తప్పవు’ -
చనువుగా ఉన్న సమయంలో భర్త నాలుక కొరికిన భార్య..!
కర్నూలు: గొడవ పడి భర్త నాలుకను భార్య కొరికిన ఘటన తుగ్గలి మండలం ఎల్లమ్మగుట్టతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఎల్లమ్మగుట్ట తండాకు చెందిన పుష్పావతికి పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన చందూనాయక్తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరు తండాలోనే నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చందూనాయక్ నాలుకకు తీవ్ర గాయమైంది. చనువుగా ఉన్న సమయంలో భార్యనే భర్త నాలుక కొరికి గాయపరిచిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని జొన్నగిరి ఎస్ఐ రామాంజినేయులు తెలిపారు. -
Kiss Street In Mexico: ఇక్కడ భాగస్వామికి ఒక్కసారైనా కిస్ పెట్టాల్సిందే!
ప్రపంచంలో వింత ఆచారాలకు కొదవేలేదు. ఈ ప్రపంచంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేవరకూ ఏదో ఒక ఆచారానికి కట్టుబడి ఉంటాడని అనడంలో అతిశయోక్తి లేదు. ఇదేవిధంగా కొన్ని విచిత్రమైన ఆచారాలు కొనసాగే ప్రాంతాలను కూడా అప్పుడప్పుడు చూసి ఉంటాం. లేదా విని ఉంటాం. అటువంటిదే.. ‘కిస్’తో ముడిపడి ఉన్న ఆచారాన్ని పాటించే ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ఒక్కసారైనా కపుల్స్ ఆ ప్రాంతానికి వెళ్లి ముద్దుల వర్షం కురిపించుకోవాలనుకుంటారు. అయితే ఈ ప్రాంతం ఎక్కడుంది? ముద్దులతో కూడిన నమ్మకాల వెనుక ఆధారమేమిటి? ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వింత ప్రాంతం ఎలా ఉంటుందంటే.. ఈ ప్రాంతం ఒక బిల్డింగ్ లేదా ఏదో ధార్మిక స్థలమో కాదు. అది ఒక గల్లీ. దానిని కిస్ స్ట్రీట్ అని అంటారు. అది ఎంత ఇరుకైనదంటే ఒక జంట మాత్రమే దానిలోకి వెళ్లే వీలుంటుంది. ఒక్కొక్క జంటమాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉన్నందున ఇక్కడ వేల జంటల క్యూ కనిపిస్తుంది. వీరంతా ఒక జంట తరువాత మరొక జంట ఈ గల్లీలోకి వెళుతుంటారు. అక్కడ కిస్ చేసుకుని తిరగివస్తారు. ఈ గల్లీ ఎక్కడుందంటే.. ఈ గల్లీ మెక్సికోలోని గువానాజువాటోలో ఉంది. దీనిని ‘ఎలో ఆఫ్ ది కిస్’ అని అంటారు. ఇంటర్నెట్లో ఈ గల్లీకి సంబంధించిన వివరాలు, ఫొటోలు విరివిగా కనిపిస్తాయి. మన దేశంలో కనిపించే అత్యంత ఇరుకైన గల్లీ మాదిరిగా ఇది ఉంటుంది. ఇక్కడి కిస్ వెనుక నమ్మకమిదే.. ఈ గల్లీకి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకానొకప్పుడు ఒక జంట పరస్పరం ఎంతో ప్రేమ కలిగివుండేది. ఈ జంటలోని యువతి ధనవంతురాలు. యువకుడు పేద ఇంటికి చెందినవాడు. వారు రహస్యంగా ఇక్కడికి వచ్చి, కిస్ చేసుకునేవారు. అయితే ఆ యువతి ఇంటిలోని వారు వీరి ప్రేమను వ్యతిరేకించారు. అయినా ఆ యువతి ఈ స్ట్రీట్‌కు వచ్చి అతనిని కలుసుకునేది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేశారు. ఫలితంగా వారి ప్రేమ అక్కడితో ముగిసిపోయింది. అయితే వారి ప్రేమ గాథను కలకాలం జీవింపజేసేందుకు వేల జంటలు ఇక్కడికి వచ్చి ముద్దులు పెట్టుకుంటాయి. ఈ గల్లీలో కిస్ చేసుకుంటే జంటల మధ్య ప్రేమ పెరుగుతుందని స్థానికంగా ప్రచారంలో ఉంది. ఇది కూడా చదవండి: ఏది ఇంపు?.. ఏది కంపు?.. సీక్రెట్ వెనుక సింపుల్ లాజిక్! -
రొమాన్స్‌కు వయసుతో పనేంటి?.. ట్రోల్స్‌పై హీరో స్ట్రాంగ్ కౌంటర్
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ జంటగా నటించిన చిత్రం టిక్కు వెడ్స్ షేరు. ఈ చిత్రానికి సాయి కబీర్ దర్శకత్వం వహించగా.. కంగనా రనౌత్ నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ట్రైలర్లో హీరోయిన్ను నవాజుద్దీన్ కిస్ చేయడంపై విమర్శలొచ్చాయి. 50 ఏళ్ల నటుడితో 21 ఏళ్ల అమ్మాయికి రొమాంటిక్ సీన్స్ ఏంటని కొందరు ట్రోల్స్ చేశారు. తాజాగా ఆ సీన్‌పై వస్తున్న విమర్శలకు నవాజుద్దీన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇటీవల మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవాజుద్దీన్ విమర్శలపై స్పందించారు. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి! ) నవాజుద్దీన్ మాట్లాడుతూ..'హీరో, హీరోయిన్లకి ఏజ్ గ్యాప్ అనేది పెద్ద సమస్య కాదు. రొమాన్స్‌కు వయసుతో సంబంధం లేదు. ముఖ్యంగా ఇప్పుడున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇప్పటికీ రొమాంటిక్ రోల్స్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ హీరోలు పనికిరాని వారు కాబట్టే. వారికేదో రొమాన్సే తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లవ్, బ్రేకప్ అన్నీ వాట్సాప్‌లోనే జరుగుతున్నాయి. దీని వెనుక ఓ కారణం ఉంది. జీవితంలో రొమాన్స్ ఎవరైతే చేస్తారో.. వాళ్లు మాత్రమే ఇలాంటి సీన్స్ చేయగలరు.' అని కాస్తా గట్టిగానే కౌంటరిచ్చారు. కాగా.. టికు వెడ్స్ షేరు మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23న విడుదల కానుంది. నవాజుద్దీన్ ప్రస్తుతం వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సైంధవ్‌లో విలన్‌గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వికాస్ మాలిక్‌గా కనిపించనున్నారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. స్టార్ డైరెక్టర్ సంచలన నిర్ణయం.!) -
నిన్న తిరుమల, నేడు గురుద్వార్.. మీరు మారరా?
బాలీవుడ్లో సన్నీడియోల్, అమీషా పటేల్ నటిస్తున్న 'గదర్-2' వివాదానికి దారి తీసింది. ఈ సినిమాలో సిక్కుల పవిత్ర స్థలం అయిన గురుద్వారాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఆ సీన్లలో ముద్దు సన్నివేశాలతో పాటు కౌగిలింతలకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ సంఘటన వల్ల గురుద్వారా నిర్వాహకులతో పాటు సిక్కు మతస్థులు చిత్ర యూనిట్‌పై ఫైర్ అవుతున్నారు. దేవుడిని నమస్కరించే సీన్ షూట్ చేస్తామని చెప్పి అనుమతులు తీసుకున్నారని గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్ తెలిపారు. (ఇదీ చదవండి: కుటుంబ పోషణ భారమై డ్రైవర్‌గా మారిన హీరో? నిజమేంటంటే?) కొన్నిరోజుల క్రితం తిరుపతిలో కృతిసనన్ చెంపపై ఓం రౌత్ ముద్దు పెట్టడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరిచిపోక ముందే ఇదే తరహాలో మరోకటి జరగడంతో ఛీ.. ఛీ దేవాలయాల్లో ఇవేం పనులు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. కనీసం వారు క్షమాపణలు చెబితే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు. ఇక పోతే, తెలుగులో అమీషా పటేల్ పవన్ సరసన 'బద్రి'తో మెప్పించింది. ఆ తరువాత మహేష్‌తో నాని, ఎన్టీఆర్‌తో నరసింహుడులో నటించిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) -
పబ్లిక్‌లో ఇలాంటి పనులా?.. నటిపై నెటిజన్స్ ట్రోల్స్
బాలీవుడ్ నటి హీనా ఖాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా తళుక్కున మెరిసింది. శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో పాల్గొన్న ముద్దుగుమ్మ ముంబయి విమానాశ్రయంలో హల్చల్ చేసింది. సమావేశాల అనంతరం ముంబయి చేరుకున్న భామకు బాయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికాడు. అదే సమయంలో ఈ జంట లిప్లాకక్తో ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. అయితే ఇలా బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం ఏంటని నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. (ఇది చదవండి: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్) అంత త్వరగా ముద్దుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరు రాస్తూ పబ్లిక్ ముందు ఇలా చేసినందుకు సిగ్గుపడండి అంటూ రాసుకొచ్చారు. వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారా అంటూ మరో నెటిజన్ మండిపడ్డారు. పబ్లిక్ ఇలాంటి పనులు చేయడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. కాగా.. హీనా ఖాన్, రాకీ జైస్వాల్ చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. వీరిద్దరి రిలేషన్‌పై బిగ్ బాస్ హౌస్‌లో కూడా ఆమె మాట్లాడింది. గతంలో ఈ జంట బ్రేకప్ చేసుకుందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను హీనా ఖాన్ ఖండించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!) హీనా ఖాన్ బాలీవుడ్ బుల్లితెర నటిగా ఫేమ్ తెచ్చుకుంది. యే రిష్తా క్యా కెహ్లతా హైలో అక్షరా, కసౌతి జిందగీ కే 2లో కొమొలికా పాత్రలో ఆమెకు గుర్తింపు దక్కింది. ఖత్రోన్ కీ కిలాడీ, బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోస్‌లో రన్నరప్‌గా నిలిచింది. #HinaKhan spotted at Mumbai Airport Rocky came to pick her 🧿💕❤️ @eyehinakhan @JJROCKXX #HiRo #HinaKhan #rRockyJaiswal #NachBaliye #NachBaliye10 #CoupleGoals #Couple #Love #Mumbai #Airport #MumbaiAirport #AirportFashion #Bollywood #BollywoodActress pic.twitter.com/hgECADd84t — hina_khanfc (@Mohamme37896951) May 24, 2023 -
బాలుడి పెదాలపై ముద్దు.. క్షమాపణలు చెప్పిన దలైలామా
ఉత్తర భారతదేశంలో జరిగిన ఒక కార్యక్రమంలో బౌద్ద మత గురువు దలైలామా ఒక బాలుడి పెదవులపై ముద్దుపెట్టుకుని, నాలుకను ముద్దు పెట్టమని కోరడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన అనుసరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ అంశంపై దలైలామా ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ బాలుడు, అతని కుటుంబసభ్యులకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. సోమవారం దలైలామా బృందం విడుదల చేసిన ప్రకటనలో.. దలైలామా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు. బాలుడు, అతని కుటుంబ సభ్యులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులకు క్షమాపణలు చెప్పారు. దలైలామాను కలిసే వ్యక్తులు, ముఖ్యంగా చిన్నారులతో ఆయన సరదాగా ఉంటారు. కొన్ని సార్లు వారిని ఆటపట్టిస్తుంటారు. అయితే బాలుడి ఘటనకు ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. కాగా ఓ కార్యక్రమంలో తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై దలైలామా ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరారు. దీంతో ఈ ఘటన వివాదానికి తెరలేపింది. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారేంటని నెటిజన్లు ఫైర్ అయ్యారు. -
పెదాలపై ముద్దుపెట్టిన దలైలామా.. వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్..
న్యూఢిల్లీ: టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామాకు సంబంధించిన ఓ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై ఆయన ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరాడు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. ఓ మత గురువు అయిన మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు అసహ్యంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. అయితే దలైలామా బాలుడికి ముద్దుపెట్టే సమయంలో అక్కడున్నవారంతా కేరింతలతో చప్పట్లు కొట్టారు. వీరంతా ఇలా చేయడంపై పులువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మీరంతా ప్రోత్సహించడమేంటని ఫైర్ అయ్యారు. So the Dalai Lama is kissing an Indian boy at a Buddhist event and he even tries to touch his tongue. He actually says "suck my tongue" Now why would he do that? 🤔 pic.twitter.com/TjDizaDHZp — Richard (@ricwe123) April 8, 2023 మరికొందరు నెటిజన్లు మాత్రం దలైలామా ముద్దుపెడుతున్నప్పుడు ఆ బాలుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని అన్నారు. చిన్నారిని పెదాలపై కిస్ చేయడమేంటి? ఇదేం సంప్రదాయం? నాలుకను ముద్దుపెట్టమని అడగడమేంటి అని ప్రశ్నించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం వీరి విమర్శలకు సమాధానం చెప్పాడు. పెదాలు, నాలుకపై ముద్దుపెట్టడం టిబెట్ సంప్రదాయంలో ఓ భాగమని చెప్పుకొచ్చాడు. టిబెట్‌లో ఒకరి నాలుకను బయటకు తీయడం ఒక ఆచార పద్ధతి అని పేర్కొన్నాడు. ఈ సంప్రదాయం 9వ శతాబ్దానికి చెందిందని, లాంగ్ ధర్మా అనే అపఖ్యాతి పాలైన రాజు పాలన నుంచి ఇది కొనసాగుతోందన్నాడు. చదవండి: హెల్మెట్ లేకుండా స్కూటీపై మహిళా పోలీసులు.. ‘ఏంటి సర్.. ఇదే తప్పు మేం చేస్తే!’ -
కుమారస్వామికి ముద్దు
యశవంతపుర: మాజీ సీఎం కుమారస్వామిని ఒక మహిళ ముద్దాడింది. పంచరత్న యాత్రలో భాగంగా హెచ్డీ కుమారస్వామి శనివారం యశవంతపురలోని మారుతీనగరలో పర్యటించారు. ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒక మహిళా కార్యకర్త జీపు వెనుక నుంచి పైకెక్కి కుమారస్వామి బుగ్గపై ముద్దు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. -
మోదీని ముద్దుపెట్టుకున్న రైతు.. వీడియో వైరల్
-
హీరోను ముద్దుపెట్టుకోబోయిన లేడీ ఫ్యాన్.. షాక్ అయిన నటుడు
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు వాళ్లతో ఒక్క ఫోటో అయినా దిగాలనుకుంటారు చాలామంది. ఇక అందులో తమ ఫెవరెట్ హీరో, హీరోయిన్లు కనిపిస్తే వాళ్ల ఆనందానికి అవధులుండవు. అయితే కొందరు తమ అభిమానాన్ని చూపించే క్రమంలో కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌కు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అసలే అతడికి లేడీ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తాజాగా ఆయన నైట్ మేనేజర్ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. స్క్రీనింగ్ అనంతరం ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుండగా పలువురు ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్ ఆదిత్య రాయ్ దగ్గరకు వచ్చి సెల్ఫీ అడిగింది. ఫోటో దిగుతుండగానే హీరోను హగ్ చేసుకునేందుకు, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ చర్యతో షాక్ అయిన ఆదిత్య రాయ్ నవ్వుతూనే ఆమె చర్యను ప్రతిఘటించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సెలబ్రిటీలు అయినంత మాత్రాన వాళ్లను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by @varindertchawla -
బైడెన్ భార్య.. కమలా హ్యారిస్ భర్త.. పబ్లిక్‌గా ఇలా..
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం ఒక వీడియో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ భార్య, ప్రథమ పౌరురాలైన జిల్ బైడెన్.. ఆ దేశ ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్ భర్త డౌ ఎమ్హోఫ్ పబ్లిక్‌గా చుంబించుకోవడంపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. అది మామూలు పలకరింపు అయితే ఫర్వాలేదు. ఏకంగా పెదాలపై చుంబనం కావడంతోనే ఇక్కడ యవ్వారం మరో మలుపు తిరిగింది. మంగళవారం కాపిటోల్ హిల్‌లో ప్రెసిడెంట్ బైడెన్ స్టేట్ ఆఫ్ ది యూనియర్ ప్రసంగం సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. కమలా హ్యారిస్‌ను మరోసారి ఉపాధ్యక్ష రేసులో నిలపకూడదని బైడెన్ భావిస్తున్నట్లు, ఈ మేరకు వైట్‌హౌజ్ వర్గాలు.. బైడెన్ అంతరంగికుల నుంచి ఆయన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు లాస్ ఏంజెల్స్ టైమ్స్ తాజాగా ఓ విశ్లేషణాత్మక కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్థానాలను భారీగా కోల్పోయింది డెమొక్రటిక్ పార్టీ. రిపబ్లికన్లు చాలావరకు స్థానాలు దక్కించుకోవడంతో.. బైడెన్ ప్రసంగంలో స్నేహపూర్వక వ్యాఖ్యలే ఎక్కువగా వినిపించాయి. Did Jill Biden just kiss Kamala's husband on the LIPS?! pic.twitter.com/KvrUxSI8Lu — Benny Johnson (@bennyjohnson) February 8, 2023 -
300 మంది ముందు ముద్దు పెట్టాడని పెళ్లి రద్దు చేసుకున్న వధువు
లక్నో: పెళ్లైన ఆనందంలో వరుడు చేసిన కొంటెపని అతని కొంప ముంచింది. పెళ్లిమండపంలోనే అందరి ముందు వధువుకు ముద్దు పెట్టడం అతని కలలను కల్లోలం చేసింది. వరుడి తీరుతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెళ్లికూతురు మండపం నుంచి లేచి వెళ్లిపోయింది. ఇలాంటి వాడు తనకు వద్దే వద్దని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పెళ్లికొడుకు తల పట్టుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్ సంభల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఏం జరిగిందంటే..? యూపీ బాదాయు జిల్లా బిస్లీ గ్రామానికి చెందిన అబ్బాయి, సంభల్ జిల్లా పవాసకు చెందిన అమ్మాయి గతవారం పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి దండలు మార్చుకున్న తర్వాత వధువుకు వరుడు ముద్దు పెట్టాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే స్టేజీ పైనుంచి లేచి గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. 300 మంది ముందు అందరూ చూస్తుండగానే తనకు ముద్దు పెట్టిన వరుడి తీరు అసలు బాగాలేదని, ఇతను తన భర్తగా వద్దని వధువు పోలీసులకు చెప్పింది. ఇలాంటి వాడితో జీవితాంతం కలిసి బతకలేదని స్పష్టం చేసింది. వరుడి కుటుంబసభ్యులు కూడా వధువు వెనకాలే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రెండు కుటుంబాలు ఈ విషయంపై గొడవపడ్డాయి. పోలీసులు చెప్పినా వినలేదు. తనకు అతడు వద్దే వద్దని వధువు తేల్చిచెప్పింది. బెట్ కట్టిందని చెప్పిన వరుడు అయితే తాను కావాలని ముద్దు పెట్టలేదని, వధువే తనతో బెట్ కట్టిందని వరుడు పోలీసులకు చెప్పాడు. అందరి ముందు ముద్దు పెడితే రూ.1500 ఇస్తానని ఆమె చెప్పిందని, ఒకవేళ తాను ఓడిపోతే రూ.3000 ఇవ్వాలని చెప్పిందని వివరించాడు. వధువు మాత్రం అసలు తాను బెట్ కట్టలేదని చెప్పింది. అసలు ఇలాంటి ప్రస్తావనే తమ మధ్య రాలేదని స్పష్టం చేసింది. వరుడితో వెళ్లేందుకు వధువు నిరాకరించడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇద్దరికీ పెళ్లి జరిగింది కాబట్టి తామేమీ చేయలేమని, చట్ట ప్రకారం కోర్టులోనే విడాకులు తీసుకోవాలని సూచించారు. చదవండి: 'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా' -
ఫుడ్ డెలివరీకి వెళ్లి ఇదేం పాడుపని.. యువతిని బలవంతంగా..!
ముంబై: ప్రస్తుత రోజుల్లో కోరుకున్న వంటకాలను నిమిషాల వ్యవధిలోనే ఇంటికి చేరవేస్తున్నాయి పలు సంస్థలు. కరోనా వ్యాప్తి తర్వాత చాలా మంది యాప్‌ల ద్వారా ఇంటికే ఫుడ్ తెప్పించుకుంటున్నారు. అయితే.. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్స్ దుశ్యర్యలకు పాల్పడుతూ కటకటాల పాలైన పలు సంఘటనలు చూసే ఉంటారు. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని పుణె నగరంలో వెలుగు చూసింది. యేవెల్వాడీ ప్రాంతంలో ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లిన ఓ 42 ఏళ్ల డెలివరీ మ్యాన్.. 19 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ యువతికి బలవంతంగా ముద్దు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆహారం డెలివరీ చేసేందుకు 42 ఏళ్ల వ్యక్తి వెళ్లాడు. యువతి ఆ ఆర్డర్ తీసుకోగానే దాహం వేస్తుందని, మంచి నీళ్లు ఇవ్వాలని కోరాడు. మంచి నీళ్లు తెచ్చి ఇచ్చిన క్రమంలో కుటుంబ సభ్యుల గురించి అడగటం మొదలు పెట్టాడు. తను ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ ఫ్లాట్‌లో నివసిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం వారు సొంత ఊళ్లకు వెళ్లారని వెల్లడించింది. దీంతో ఒంటరిగా ఉందని గ్రహించిన నిందితుడు.. మరో గ్లాస్ మంచి నీళ్లు ఇవ్వాలని కోరాడు. గ్లాస్ తీసుకుని వెనక్కి తిరిగిన క్రమంలో వెనక నుంచి గట్టిగా పట్టుకుని రెండు సార్లు బలవంతంగా చెంపపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు ముందుగా బాధితురాలు బయపడింది. ఈ సంఘటన సెప్టెంబర్ 17న రాత్రి 9.30 గంటలకు జరిగింది. బాధితురాలి ఇంటి నుంచి వెళ్లిన డెలివరీ బాయ్.. ఆమెకు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపటం ప్రారంభించాడు. ఎలాంటి సాయం కావాలన్న అడగాలని చెప్పేవాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జొమాటో డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేయగా.. తర్వాత బెయిల్‌పై విడుదలైనట్లు సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సర్దార్ పాటిల్ తెలిపారు. ఇదీ చదవండి: వీడియో: ఘోరం.. మరుగుదొడ్డిలో కబడ్డీ ప్లేయర్స్‌కు భోజనం -
తీవ్ర దుఃఖంలో ఉన్న కింగ్ చార్లెస్‌కు ముద్దు పెట్టిన మహిళ
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3. అయితే రాణికి నివాళులు అర్పించేందుకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లిన జెన్నీ అస్సిమినోయిస్ అనే మహిళ బాధతో ఉన్న కింగ్ చార్లెస్‌కు ముద్దుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీంతో జెన్నీ దీనిపై వివరణ ఇచ్చారు. కింగ్ చార్లెస్‌కు ముద్దుపెట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని జెన్నీ చెప్పారు. ఆయనను చాలా దగ్గరనుంచి నుంచి చూసి నమ్మలేకపోయానని పేర్కొన్నారు. ముద్దు పెడతానని కింగ్ చార్లెస్‌ను అడిగానని, అందుకు ఆయన అనుమతి ఇచ్చాకే కిస్ చేసినట్లు వెల్లడించారు. కింగ్ చార్లెస్‌ను చూడటమే గాక, ముద్దు పెట్టే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఛాన్స్ ఎప్పటికీ రాదని.. కింగ్ చార్లెస్‌కు ముద్దు పెట్టే అవకాశం జీవితంలో ఎప్పటికీ రాదని తన మనసుకు అనిపించిందని జెన్నీ చెప్పారు. రాజకుటుంబీకులు అంటే తనకు ఎంతో ఇష్టమని, వాళ్లను ఎల్లవేళలా గమనిస్తూనే ఉన్నట్లు జెన్నీ పేర్కొన్నారు. అంతేకాదు వాళ్ల చిన్నప్పటి నుంచి ఫోటోలు కొని పెట్టుకున్నట్లు వివరించారు. తన దివంగత భర్త గ్రీస్ దేశానికి చెందినవాడని, కింగ్ చార్లెస్ తండ్రి ప్రిన్స్ ఫిలిప్‌ది కూడా గ్రీసే అని సిప్రస్‌కు చెందిన జెన్నీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అందుకే కింగ్ చార్లెస్‌తో పాటు రాజవంశస్థులు తనకు దగ్గరివాళ్లలా కన్పిస్తారని పేర్కొన్నారు. జెన్నీ ముద్దుపెట్టిన అనంతరం చిరునవ్వుతో అలాగే ముందుకుసాగారు కింగ్ చార్లెస్. తన తల్లికి నివాళులు అర్పించేందుకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వచ్చిన వేలాది మందికి కరచాలనం ఇచ్చారు. ఈ క్రమంలోనే మరో మహిళ కూడా కింగ్ చార్లెస్ చేతిపై ముద్దుపెట్టింది. చదవండి: బకింగ్హమ్ ప్యాలెస్‌పై జంట ఇంద్రధనుస్సులు -
Viral Video: అభిమానికి బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్
రాజకీయ నాయకులు, సినీ తారలు, స్పోర్ట్స్ స్టార్స్‌కు ఫాలోవర్స్ ఉండటం సహజమే.. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా అభిమానులు వారిని ఫాలో అవుతూనే ఉంటారు. సెల్ఫీలు, వీడియోలు ఉంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తుంటారు. దీంతో సెలబ్రిటీలు బయట తిరిగే సమయంలో ఫోటోగ్రాఫర్ల కంట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీకొంత మంది మాత్రం ఎంతమంది అభిమానులు ఎదురైనా వారందరికీ ఒప్పిగ్గా ఆటోగ్రాఫ్, సెల్ఫీలు ఇస్తారు. తాజాగా ఓ అమెరికన్ ర్యాపర్ అభిమానుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. నార్త్ కరోలినాకు చెందిన రాపర్ డాబాబీ ఓ కార్యక్రమం నుంచి బయటకు రాగా.. అతన్ని అభిమానులు చుట్టుముట్టారు. ఇందులో మహిళా అభిమానులు కూడ ఉన్నారు. అయితే వారు సెల్ఫీలు తీసుకుంటుండా బాబీ అభిమానుల గుంపు వద్దకు వెళ్లి వారిని కౌగిలించుకున్నాడు. అంతేగాక ఓ మహిళా అభిమాని వద్దకు వెళ్లి ఆమె ముఖాన్ని తన చేతులతో దగ్గరకు తీసుకేందుకు ప్రయత్నించాడు. చదవండి: ఏం ఐడియా సామీ! పెళ్లిలో వధూవరులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు #DaBaby getting curved by fans 😂 pic.twitter.com/EiiP7NMfsX — No Jumper (@nojumper) April 7, 2022 అయితే సదరు అభిమాని అతనికి దూరంగా జరుగుతున్నప్పటికీ ర్యాపర్ ఆమెను ముద్దు పెట్టుకోడానికి బలవంతం చేయడంతో వెంటనే ముఖాన్ని వెనక్కి తిప్పుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ర్యాపర్ ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోకు 10 మిలియన్లకు పైగా వ్యూవ్స్వచ్చాయి. చదవండి: ఊహించని అదృష్టం.. పొరపాటున లాటరీ టికెట్ కొంటే.. కోటీశ్వరురాలిని చేసింది -
మ్యాచ్ గెలిచిన సంతోషం ముద్దుతో ఉక్కిరిబిక్కిరి; ట్విస్ట్ ఏంటంటే
మ్యాచ్ గెలిచిన సంతోషంలో సెలబ్రేట్ చేసుకోవడం సహజం. ఆ సెలబ్రేషన్ చేసుకునే విధానంలో ఒక్కో ఆటగాడికి ఒక్కో శైలి ఉంటుంది. అయితే ఎవరు ఊహించని విధంగా తమ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ఇద్దరు ఫుట్‌బాల్ ఆటగాళ్లు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్ వేదికగా ఎఫ్ఏ ట్రోపీ పేరిట టోర్నీ జరుగుతుంది. టోర్నీలో భాగంగా బుధవారం వ్రెక్స్హమ్ ఏఎఫ్సీ, స్టాక్పోర్ట్ కంట్రీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఏ జట్టు గోల్ చేయలేకపోయింది. దీంతో అదనపు సమయంలో వ్రెక్స్హమ్కు చెందిన ముల్లిన్ గోల్ కొట్టి 1-0-తో ఆధిక్యంలోకి తెచ్చాడు. ఆ తర్వాత మరో నాలుగు నిమిషాలకే మరో గోల్ కొట్టి 2-0తో జట్టును గెలిపించాడు. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన ముల్లిన్‌ను అంతా అభినందిస్తుంటే.. తన సహచర ఆటగాడు పామర్ మాత్రం వేలాది మంది అభిమానుల సమక్షంలో అతని మెడను పట్టుకొని ఎవరు ఊహించని విధంగా లిప్ టూ లిప్ కిస్ ఇచ్చాడు. ఈ సన్నివేశాన్ని చూసి తోటి ఆటగాళ్లు సహా అభిమానులు షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ''అతనేమైనా అమ్మాయా.. ముద్దు పెట్టుకోవడానికి.. ఎంత మ్యాచ్ గెలిస్తే మరి ఇంత ఘాటు ముద్దా'' అంటూ కామెంట్ చేశారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన వ్రెక్స్హమ్పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిశాయి. వరుసగా 21 మ్యాచ్‌ల పాటు ఓటమి ఎరుగని స్టాక్పోర్ట్ కంట్రీకి వ్రెక్స్హమ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. చదవండి: కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. 20 రోజుల్లో 20 మంది..! View this post on Instagram A post shared by Wrexham AFC (@wrexham_afc) -
నిక్ జోనాస్‌కు ప్రియాంక రొమాంటిక్ విష్.. ఇంకొన్ని పంచుకోవాలని
Priyanka Chopra Gives New Year Kiss To Nick Jonas: ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతోంది. గత సంవత్సరం మధురు స్మృతులు, చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారంతా. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, శుభాకాంక్షలు తెలపడం వంటివి ఒక్కొక్కరూ ఒక్కోలా చేస్తారు. ముఖ్యంగా సినీ తారలైతే భిన్న రకాలుగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు విష్ చేస్తున్నారు. వీళ్లందరికన్నా భిన్నంగా రొమాంటిక్‌గా విష్ చేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రియాంక విష్ చేస్తూ నిక్ జోనాస్‌ను రొమాంటిక్‌గా ముద్దు పెట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు నిక్ జోనాస్. ప్రియాంక తనను ముద్దు పెట్టుకునే ఫొటోను తన ఇన్‌స్టా అకౌంట్లో నిక్ జోనాస్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌కు 'మై ఫరెవర్ న్యూ ఇయర్ కిస్ (ఎప్పటికీ నా కొత్త సంవత్సరపు ముద్దు)' అని లవ్ సింబల్‌తో క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నిక్, ప్రియాంక అభిమానులు తెగ ఇష్టపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లోని ఇలాంటి మరికొన్ని రొమాంటిక్ క్షణాలను తమతో పంచుకోవాలని కోరుతున్నారు. 2021లో ఈ జంట చాలా బిజీగా గడిపింది. ప్రియాంక, నిక్ జోనాస్ విడిపోతున్నారనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటన్నింటికి ప్రియాంక చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) ఇదీ చదవండి: మళ్లీ ఆ పాత్ర చేయాలని ఉందన్న పాపులర్ హీరోయిన్.. అదేంటంటే ? -
పెళ్లిలో ముద్దాడిన వరుడు, వధువు.. చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి
ఒకప్పటి కాలంలో పెళ్లి అయ్యే వరకు వధువు, వరుడికి అస్సలు పరిచయం ఉండేది కాదు. పెళ్లి మండపంలోనే ఒకరినొకరు చూసుకునే పద్దతులు ఉండేవి. కానీ కాలం మారింది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లతోపాటు లవ్ మ్యారేజ్లు, పెళ్లికి ముందే డేటింగ్లు, లివింగ్ ఇన్ రిలేషన్లు పుట్టుకొచ్చాయి. ఎన్ని మారినా పెళ్లి జరిపించే పద్దతులు మాత్రం మారలేదు. ఎవరి సాంప్రదాయలు, పద్దతులకు అనుగుణంగా పెళ్లిలు జరిపిస్తున్నారు. తాజాగా హిందూ ఆచారం ప్రకారం జరుగుతున్న ఓ పెళ్లిలో వరుడు వధువుని ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. వీడియోలో పెళ్లితంతును ముగించిన తురువాత వధువుని ముద్దు పెట్టుకోవాలని మండపం వద్ద ఉన్న అతిథులు వరుడిని కోరారు. దీంతో పెళ్లి వేదిక వద్ద కుటుంబ సభ్యలు, బంధువులు ఉన్నప్పటికీ సిగ్గుపడకుండా వరుడు, పెళ్లి కూతురు ముఖాన్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టాడు. వధువు కూడా వరుడు వద్దకు జరిగి అతని భుజంపై చేతులు వేసి కిస్ చేసింది. చదవండి: Viral Video: మోడల్స్‌ను జంతువులుగా చూపించారు.. తీవ్ర విమర్శలు రావడంతో.. తమ చుట్టూ మనుషులు, కెమెరాలు ఉన్న విషయం మర్చిపోయి ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇప్పుడు అన్నీ పెళ్లిళ్లో ఇలాంటివి కామన్ అయపోయాయని మద్దతిస్తుంటే.. మరికొందరు ఏంటి ఈ దారుణం.. పెళ్లి అయ్యే వరకు కూడా ఆగాలేరా.. పద్దతులను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు..అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.. చదవండి: ఓరి నీ యేషాలో.. యాపిల్ పకోడీ అట! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_viralclips) -
కర్ణాటక సీఎం చేతిపై మహిళ ముద్దుల వర్షం..వీడియో వైరల్
బెంగళూరు: సాధారణంగా అభిమానులు.. తన మనస్సుకు నచ్చిన నాయకులు కనిపించగానే తన ప్రేమను ఒక్కొరకంగా వ్యక్తపరుస్తారు. కొందరు తమ నాయకుడికి పూలమాల వేస్తే.. మరికొందరు శాలువాలతో సత్కరించడం, ప్రేమతో ఆలింగనం చేసుకోవడం మనకు తెలిసిందే. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై గుట్టహళ్లిలో జనసేవక్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఆ ప్రాంతమంతా, పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలతో నిండి ఉంది. బొమ్మైచుట్టు వందల మంది కార్యకర్తలు, ప్రజలు గుమిగూడి ఉన్నారు. ఈ క్రమంలో ఒక మహిళ.. బసవరాజ బొమ్మై చేతిని పట్టుకుని అభిమానంతో ముద్దులు పెట్టడం మొదలు పెట్టింది. ఈ సంఘటనతో సీఎం బొమ్మై ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతేకాకుండా సదరు మహిళ.. సీఎం చేతిని తన ముఖంపై ఉంచి ఆయన దీవెనలు తీసుకుంది. ఆమె చర్యలపై పక్కనే ఉన్న మంత్రి అశత్థనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
17ఏళ్ల తర్వాత.. ‘మాస్క్ ముద్దు’తో మళ్లీ కలిసిన ‘బెన్నీఫర్’
పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ మళ్లీ ఒకటై అభిమానులను సంతోషంలో ముంచెత్తారు. ఒకటైన తర్వాత వారిద్దరూ మాస్క్‌తోనే ముద్దు పెట్టుకున్నా పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెన్నిఫర్‌గా గుర్తింపు పొందిన ఈ జంట 2002లో నిశ్చితార్థం చేసుకుంది. నిజానికి 2003లో వివాహం చేసుకున్నారు. అయితే అది డిలే అయ్యింది. అనంతరం 2004లో విభేదాలతో విడిపోయారు. బ్రేకప్ తర్వాత జెన్నీ,మార్క్ ఆంటోనిని వివాహం చేసుకోగా.. ఆమె ప్రియుడు బెన్, జెన్నిఫర్ గార్నెర్ని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ వారి లైఫ్ పార్టనర్స్ నుంచి విడాకులు తీసుకున్నారు. కాగా వీరిద్దరూ మళ్లీ ఒకటైన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ జెన్నీ తన 52 పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసి తన సంతోషాన్ని తెలిపింది. అయితే మళ్లీ కలిసిన వారిద్దరూ మొదటి సారి గత వారం వెనిస్ లిడోలో జరిగిన 78 వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్‌కార్పెట్‌పై జంటగా నడిచారు. తాజగా సోమవారం (సెప్టెంబర్ 14న) మెట్ గాలా 2021లో రెడ్ కార్పెట్‌పై మరోసారి కనిపించిన ఈ జంట మాస్క్‌తోనే ముద్దు పెట్టుకొని అభిమానులకు కనులవిందు కలిగించారు. బెన్నీఫర్ ముద్దు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 17ఏళ్ల కలిసిన ఈ కపుల్‌ని చూసిన అభిమానులు ‘వావ్ అమేజింగ్’‘ఎప్పటికీ బెస్ట్ జోడి’ అంటూ కామెంట్ పెడుతున్నారు. "And then we kiss your our love comes alive on my lips"#MetGala2021 #Bennifer #BritneySpears pic.twitter.com/SfV2qngBj7 — I'm Still... (@BraveOnthe6) September 14, 2021 Living for #bennifer pic.twitter.com/s3HLurWllq — Momo (@MomoCominThru) September 14, 2021 -
లాంగెస్ట్ కిస్.. గురక వీరుడు ఇంట్రస్టింగ్ వరల్డ్ రికార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: సాధారణంగా ఎవరికైనా అరుదైన స్పెషల్ టాలెంట్ ఉంటే వావ్...విశేషమే అంటూ అబ్బురపడతాం. అలాగే సంబంధిత వ్యక్తులు కూడా చరిత్రలో ఎవ్వరూ ఎన్నడూ సాధించని ఘనతను సాధించిన వ్యక్తిగా తమ పేర్లు నిలవాలని ఆశపడతారు. రికార్డులకెక్కాలని ఉబలాట పడతారు. వాటిల్లో ముఖ్యమైంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. అలా అరుదైన, కొన్ని విచిత్రమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను ఒకసారి చూద్దాం. నిలువెల్లా టాటూలే టాటూలు ఈ రోజుల్లో సర్వసాధారణం. దాదాపు ప్రతి వ్యక్తి వారి శరీరంలో ఏదో ఒక భాగంలో పచ్చబొట్టు వేసుకుంటూ ఉండటం చేస్తూనే ఉన్నాం. వీటిల్లో వివిధ డిజైన్లు, పరిమాణాలురంగులు.. బొమ్మలు, అబ్బో వీటి కథ పెద్దదే. పై ఫోటోలని వ్యక్తి న్యూజిలాండ్‌కు చెందిన శ్రీమంతుడు గ్రెగొరీ పాల్ మెక్లారెన్ లేదా లక్కీ డైమండ్ రిచ్. ఇతనికి టాటూలంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే. శరీరం మొత్తం టాటూలే. ఇందుకు 1000 గంటలకు పైగా గడిపాడట. అందుకే ప్రపంచంలో అత్యధికంగా టాటూలు వేయించుకున్న వ్యక్తిగా రికార్డు కొట్టేశాడు. ప్రపంచంలో అతిపెద్ద ఉల్లిపాయ నెవార్క్ పీటర్ గ్లేజ్బ్రూక్ ప్రపంచంలోనే అత్యంత భారీ ఉల్లిని పండించడంలో పాపులర్. 18 పౌండ్ల బరువున్న (8కిలోలకు పైమాటే) ఉల్లిపాయను పండించి భారీ రికార్డును కొట్టేశాడు. ఒకే కోన్ మీద ఇన్ని ఐస్ క్రీమ్ స్కూప్స్? ఐస్‌క్రీం అంటే పిల్లాపెద్దా అందరికీ మోజే. అందులోనూ మండు వేసవిలో చల్లచల్లగా కోన్ ఐస్‌క్రీం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే ఈ ఐస్క్రీ కోన్ తయారీలో ఓ వ్యక్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇటలీకి చెందిన దిమిత్రి పాన్సిరా కోన్‌పై ఏకంగా125 స్కూప్స్ అమర్చి ఔరా అనిపించాడు. అంతేకాదు 2018లో తన పేరుతో ఉన్న వరల్డ్ రికార్డునే తనే బ్రేక్ చేశాడు. తాబేలు ఎంత వేగంగా పరిగెత్తగలదు? అతి తక్కువ వేగం గురించి ఆలోచిస్తే గుర్తుకు వచ్చేది తాబేలు. నెమ్మదిగా మారువేరు తాబేలు వేగంలోరికార్డు సాధించడం అంటే అరుదే కదా. కేవలం 19.59 సెకన్లలో 18 అడుగుల దూసుకెళ్లిందో తాబేలు. దీని పేరు బెర్టీని. అంతేకాదు 70ల నుంచి మరే తాబేలు బ్రేక్ చేయలేని రికార్డును బద్దలు కొట్టింది. విచిత్రమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఒకటి. యూకేలోని అడ్వెంచర్ వ్యాలీ అనే ఫ్యామిలీ అడ్వెంచర్ పార్క్‌లో దీని నివాసం. మీరిలా చర్మాన్ని సాగదీయలగలరా పుట్టుకతో వచ్చిన వైకల్యాన్ని లేదా లోపాన్ని రికార్డు మలచడం మరో విశేషం. గ్యారీ టర్నర్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. ఇదే అనతికి ప్రపంచంలోని సాగతీత చర్మంఉన్న వ్యక్తిగా రికార్డును తెచ్చిపెట్టింది. 1999 నుండి ఎవరూ అతని రికార్డును అధిగమించలేదు. ఎవరైనా సాధారణంగా కడుపు చర్మాన్ని 6.25 అంగుళాల వరకు సాగదీయడం మన ఊహించలేం. కానీ గ్యారీ ఆ పనిని సులువుగా చేస్తాడు. శరీరంమీద చర్మాన్ని ఎవరూ చేయలేనంతంగా సాగదీయగలడు ఎలాంటి నొప్పి లేకుండా. ఇతను 2005 నుండి ఒక సర్కస్‌లో సభ్యుడిగా ఉన్నారు. పాస్తా తినే రికార్డు ఇప్పటి తరం యూత్ పాస్తాను ఇష్టపడతారు. కానీ ఈ ఫోటోలోని మహిళకు పాస్తా అంటే మరీ పిచ్చన్నమాట. పాస్తా తినే పోటీలోనే ఈస్టర్ మిచెల్ లెస్కో డబ్బు సంపాదించే మార్గంగా ఎంచుకున్నారు. 100 గ్రాముల పాస్తా కేవలం 26.69 సెకన్లలో పాస్తా మొత్తం గిన్నెను వేగంగా లాగిం చేసిన రికార్డు కొట్టేసింది. పాస్తాలో సాస్ కలుపుకుని మరీ చకా చకా భోంచేసింది. లాంగెస్ట్ కిస్ ప్రేమికులు ముద్దు ముచ్చట్లలోమునిగి తేలడం మామూలే. థాయ్‌లాండ్‌కు చెందిన లక్షన , ఎక్కాచాయ్ తిరనరత్ జంట లాంగెస్ట్ కిస్ పెట్టుకుని రికార్డు లకెక్కారు. 2020లో జరిగిన పోటీల్లో ఏకంగా 58 గంటల 35 నిమిషాల 58 సెకన్ల పాటు కొనసాగిన లిప్ లాక్‌లో ఉండిపోయారు. ఈ సుదీర్ఘ ముద్దుతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాదు డీహైడ్రేషన్‌తో బాధపడకుండా ఇంతసేపు ముద్దు పెట్టుకోవచ్చని మాకు కూడా తెలియదంటూ సెలవిచ్చారు. చేతికి చిక్కారో మటాషే! బలమైన చేతులున్న మహిళ యూకే చెందిన లిసా డెన్నిస్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరిగా నిలిచారు. ఎలాగంటే... కేవలం ఒకే ఒక్క నిమిషంలో 923 రూఫ్ బ్రిక్స్ని పిండి చేయడం ఆమె గొప్పతనం. సాధారణంగా మార్షల్ అర్ట్స్లో ప్రావీణ్య ఉన్నవారే ఇలాంటి ఫీట్లు చేయడం మనం చూశాం. గురక వీరుడు గురకలో కూడా ప్రపంచ రికార్డు సొంతంచేసుకున్న ఘనత కోరే వాకర్ట్ సొంతం. 1993 లో స్వీడన్‌లోని ఒరెబ్రో జనరల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని గురక 93 డీబేఏ గరిష్ట స్థాయి నమోదు చేయడం ప్రపంచ రికార్డు. గురక నివారణకు ఇపుడు చాలా మార్గాలున్నప్పటికీ, గురక వీరుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. కష్టాలు పక్కన ఉన్నవాళ్లకే తప్ప వాళ్లు మాత్రం హాయిగా నిద్రపోతారు. గురక పెట్టే వాళ్ల పక్కన నిద్రపోవడం అంటే అదొక సవాలే. కాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుక్‌ను 1995లో మొదటిసారిగా ప్రచురించారు. అప్పటినుండి, ఇది ప్రపంచంలోని అత్యంత విశేషమైన విషయాలను నమోదు చేస్తోంది. ఈ ప్రపంచ రికార్డ్స్‌లో మన పేరు నిలవాలంటే..దానికి సంబంధించి చాలా కృషి, పట్టుదల కావాలి. తగిన సమయాన్ని కేటాయించడంతోపాటు అంకితభావం , కఠోర అభ్యాసం కావాలి. -
పెళ్లిలో వరుడి చిలిపి పని.. ఒక్కసారిగా అందరు షాక్..!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే, వివాహ వేడుకలలో ఏదో ఒక ట్విస్ట్ జరిగి ఆ పెళ్లి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పెళ్లి మండపంలో వరుడుకు ఎదరుగా వధువు కూర్చుని ఉంది. చుట్టూ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు నిల్చొని ఉన్నారు. ఇంతలో.. అకస్మాత్తుగా వరుడు వధువును ముద్దు పెట్టుకుంటాడు. అయితే ఈ సంఘటన చూసిన వారంతా నవ్వుకుంటారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది..అక్కడ వివాహ సాంప్రదాయల్లో భాగంగా వధువు నోటిలో పాన్ ఉంచుతారు. వరుడు దాన్ని చేతితో తాకకుండా పాన్‌ను వధువు నోటిలో నుంచి తీయాలి. కాబట్టి వరుడు వధువు నోటి నుంచి పాన్ లాగడానికి ప్రయత్నించినప్పుడు, అతను ఆమెను ముద్దు పెట్టుకుంటాడు.ఈ సన్నివేశాన్ని అక్కడ ఉన్న వారు చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో హల్చల్ చేస్తుంది. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
‘ఐరన్‌మ్యాన్’కి ఏమైంది?, కారులో ముద్దులతో ‘స్పైడర్‌మ్యాన్’ అలా..
ఐరన్‌మ్యాన్.. మార్వెల్ కామిక్స్‌లో పిల్లలకు ఓ ఫేవరెట్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్‌కు తనదైన శైలి నటనతో వెండితెరపై ప్రాణం పోసి.. అశేష అభిమానాన్నిసంపాదించుకున్నాడు నటుడు రాబర్డ్ డానీ జూనియర్. అయితే తాజాగా ఆయన చర్యలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. రాబర్డ్ డానీ.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కొందరిని అన్‌ఫాలో అయ్యాడు. అయితే ప్రత్యేకించి మార్వెల్ నటులను అన్ ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. ‘కెప్టెన్ అమెరికా’ క్రిస్ ఎవాన్స్, స్పైడర్ మ్యాన్ ‘టామ్ హాలాండ్’ లాంటి మంచి స్నేహం ఉన్న నటులను సైతం అన్‌ఫాలో కావడం విశేషం. దీంతో అభిమానుల్లో ఏం జరిగిందో అనే ఆత్రుత పెరిగింది. కొంపదీసి మార్వెల్‌కు డానీ గుడ్‌బై చెప్పాడా? ఇక ఐరన్ మ్యాన్‌గా కనిపించడా? అనే వాళ్లలో వాళ్లు చర్చించుకున్నారు కూడా. అయితే డానీ తన ఇన్‌స్టా వాళ్లతో పాటు మరికొందరిని కూడా అన్‌ఫాలో అయ్యాడు. మొత్తంగా అతని 43 మంది ఫాలోవర్స్‌లో.. ఏ ఒక్క యాక్టర్ లేకుండా చూసుకున్నాడు అంతే. ఇక ట్విటర్లో మాత్రం అందరినీ ఫాలో అవుతున్నాడు 56 ఏళ్ల రాబర్ట్ జాన్ డానీ జూనియర్. ముద్దులతో స్పైడర్‌మ్యాన్ టామ్దయా.. ఇది కొత్తగా ఆ హాలీవుడ్ జంటకు అభిమానులు పెట్టుకున్న పేరు. స్పైడర్‌మ్యాన్ ఫేమ్ టామ్ హోలాండ్(25).. తన కో స్టార్ జెన్దయాతో రిలేషన్లో ఉన్నాడని కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ రిలేషన్‌ను కన్ఫర్మ్ చేస్తూ ఇద్దరు కారులో ముద్దుపెట్టుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. కాగా, ఈ బ్రిటిష్ నటుడు.. 24 ఏళ్ల అమెరికన్ నటి జెన్దయాతో ప్రేమలో ఉన్నాడు. స్పైడర్‌మ్యాన్ హోంకమింగ్(2017) నుంచి పీటర్ పార్కర్-ఎంజే క్యారెక్టర్ జోడిగా వీళ్లిద్దరూ అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. I can’t breathe #TOMDAYA #TOMHOLLAND #ZENDAYA pic.twitter.com/bYLEf2YpBM — 🦖 (@8ncvrr) July 2, 2021 -
బ్రిటన్ : ముద్దు పెట్టాడు ... మంత్రి పదవి పోయింది
-
పీఏతో మంత్రి రాసలీలలు.. ఫొటోలు లీక్
కరోనా టైం.. అందులో కఠిన ఆంక్షలు అమలులో ఉన్నవేళ. సోయి మరిచి తన అనుచరురాలితో ఆఫీసులోనే రాసలీలలు సాగించాడు ఓ మంత్రి. ఆ మంత్రి రొమాంటిక్ యాంగిల్ఫొటోలు మీడియా ద్వారా జనాల్లోకి లీక్ అయ్యాయి. ఇంకేం ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. రాజకీయ విమర్శలు చుట్టు ముట్టాయి. చివరికి యూకే ఆరోగ్యశాఖా మంత్రి మ్యాట్ హాంకాక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. లండన్: ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి మ్యాట్ హాంకాక్ యవ్వారం.. వారం నుంచి యూకే రాజకీయాలను కుదేలు చేస్తోంది. వివాహితుడైన హాంకాక్.. ఓ మహిళను ఏరికోరి తన అసిస్టెంట్‌గా నియమించుకున్నాడు. ఆమెతో తన కార్యాలయంలోనే రాసలీలు కొనసాగించాడు. ఆమెను ముద్దులు పెట్టుకున్నట్లుగా ఓ ఫొటోతో ‘పీఏతో హాంకాక్ రాసలీలలు’ పేరుతో ది సన్ టాబ్లాయిడ్ ప్రముఖంగా ప్రచురించింది. పైగా కరోనా నిబంధనలు అమలులో ఉన్న టైంలో ఆ పని చేశాడంటూ కథనం ప్రచురించింది. ఇంకేం విమర్శలు మొదలయ్యాయి. ఈ బంధం ఏనాటిదో.. కాగా, ఆ ఫొటోలు మే 6 నుంచి 11 మధ్య కాలంలో, అది కూడా మ్యాట్ కార్యాలయంలోనే తీసినవని సమాచారం. అయితే ఆ ఫొటోల్ని ఎలా సంపాదించింది మాత్రం సన్ వెల్లడించలేదు. అప్పటికీ ఇంకా లాక్డౌన్ కఠిన నిబంధనల్ని, ఆంక్షల్ని ఎత్తివేయలేదని మాత్రం పేర్కొంది. ఇంట్లో వ్యక్తులతో తప్ప బయటివారిని కౌగిలించుకోవడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించని రోజుల్లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. అంతేకాకుండా ఆ ఫొటోలో ఉన్న మహిళను హాంకాక్.. 2000 సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కలిశాడని, పోయిన నెలలోనే ఆమెను ఇన్‌కంటాక్స్ విభాగంలో తన సహాయకురాలిగా నియమించుకున్నాడని తేలింది. ఎట్టకేలకు రాజీనామా కరోనా టైంలో మాస్క్‌లు లేకుండా తిరగొద్దని హాంకాక్ విస్తృతంగా ప్రచారం చేశాడు. పైగా భావోద్వేగంగా ఉపన్యాసాలు దంచాడు. అలాంటి వ్యక్తే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై విమర్శలు వెలువెత్తాయి. ఈ మేరకు శనివారం ప్రధాని బోరిస్ జాన్సన్‌కు, మాట్ హాంకాక్‌కు ఓ క్షమాపణ లేఖ రాశాడు. నేనే మార్గదర్శకాల్ని ఉల్లంఘించా.. అందుకే రాజీనామా చేస్తున్నా అని తెలిపాడు. ఇక విమర్శల నేపథ్యంలో హాన్కాక్ రాజీనామాను ఆమోదించిన బోరిస్.. అప్పటిదాకా ఆయన అందించిన సేవలను కొనియాడాడు. చదవండి: పార్లమెంట్లో పొంగుతున్న బీర్లు -
వరుడికి బంపరాఫర్.. స్టేజిమీదే ముద్దు పెట్టిన మరదలు
మన దేశంలో పెళ్లి వేడుక అంటే ఆ హాడావుడే వేరు. సంతోషం, సరదాలు, ఆటపట్టించడం, కన్నీళ్లు ఇలా రకరకాల ఎమోషన్స్‌తో జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా నిలిచి పోతుంది. దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో వివాహ వేడుక సందర్భంగా వరుడిని ఆటపట్టించడం ఆనవాయితీగా వస్తుంది. కాబోయే బావని మరదళ్లు, బావమరుదుల ఆటపట్టిస్తారు. కానీ ఇప్పుడు మనం చేప్పుకోబోయేది అంతకు మించిన సరదా. ఇక్కడ పెళ్లి కుమార్తె సోదరి ఏకంగా మంటంపంలో అందరి ముందు వరుడికి ముద్దు పెట్టేసింది. అనుకోని చర్యకు సదరు పెళ్లికుమారుడు బిత్తరపోయి.. బిక్కమొహం వేశాడు. ప్రస్తుతం ఇదుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఈ పెళ్లి వేడుక ఎక్కడ జరిగింది.. ఏంటి అనే వివరాలు తెలియదు. నిరంజన్ ఎం 87 అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోలో స్టేజీమీద పెళ్లి కుమారుడు, కుమార్తె, మిగతా బంధువులు ఉంటారు. ఫోటోలు దిగే కార్యక్రమం జరుగుతుంటుంది. దానిలో భాగంగా పెళ్లి కుమార్తె చెల్లెలు కొత్త దంపతులతో ఫోటో దిగడం కోస వారి పక్కన కూర్చుంటుంది. ఫోటో తీస్తుండగా సడెన్‌గా పెళ్లి కుమార్తె సోదరి బావకు ముద్దు పెడుతుంది. అనుకోని ఈ సంఘటనకు వరుడు షాకవుతాడు. ఆమెను విడిపించుకునేందకు ప్రయత్నించినప్పటికి కుదరదు. పాపం మరదలి దెబ్బకు జడుసుకుంటాడు. ఆ అమ్మాయి చర్యకు అక్కడ ఉన్న వారందరు పడి పడి నవ్వుతారు. చదవండి: జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి... -
సెల్ఫీ అన్నాడు.. ఏకంగా ముద్దే పెట్టేశాడు
సినీ తారలకు అభిమానులు ఉండడం సహజం. ఈ మధ్య సోషల్ మీడియా, బిగ్‌బాస్ వంటి షోల ద్వారా కూడా కొందరు సెలబ్రిటీలుగా మారుతూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. వీరు బయట కనిపిస్తే చాలు వాళ్లతో సెల్ఫీ తీసుకోవాలని, మాట్లాడాలని, కనీసం దగ్గర నుంచైనా చూడాలని తెగ తాపత్రయపడతారు. కొన్ని సందర్భాల్లో ఆ అభిమానమే ముదిరి ఆకతాయి చేష్టలుగా మారి తారలను ఇబ్బందుల్లో పడేలా చేస్తుంది. ఇటువంటి చేదు సంఘటనే బిగ్‌బాస్ ఫేమ్ అర్షి ఖాన్‌కు విమానాశ్రయంలో ఎదురైంది. అర్షి ఖాన్ ముంబై విమానాశ్రయంలో కనపడే సరికి అక్కడ ఓ అభిమాని ఆమెను ఒక ఫోటో కావాలని కోరాడు. అందుకు ఆమె అంగీకరించింది కూడా. ఫొటోకు పోజిస్తుండగా సడన్‌గా అతడు ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. ఇది ఒక్కసారిగా అర్షిని షాక్‌కు గురిచేసింది. దీంతో ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇదిలా వుంటే ఈ సంఘటన జరిగిన ఒక రోజు తర్వాత అర్షి ఖాన్ తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అర్షి ఖాన్ హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్‌లోని అత్యంత వివాదాస్పద పోటీదారులలో ఒకరు. ఆమె గతంలో బిగ్‌బాస్ 11వ సీజన్లో వికాస్ గుప్తా, శిల్పా షిండే, హీనా ఖాన్ వంటి సెలబ్రిటీలతో హౌస్‌లో తళుక్కున మెరిసింది. ( చదవండి: ‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
విమానంలో బిత్తిరి చర్య.. బట్టలిప్పి మరీ రచ్చ
న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణికులు చేసే తింగరి పనులకు సంబంధించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఎయిర్ ఏషియా విమానంలో చోటు చేసుకుంది. ఇటాలియన్ స్మూచ్ ఇవ్వనందుకు ఓ ప్రయాణికుడు విమానంలో బట్టలిప్పి మరీ రచ్చ చేశాడు. విమాన మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తోన్న ఎయిర్ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ క్రూ వద్దకు వెళ్లి లైఫ్ జాకెట్ ఇవ్వాలంటూ గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత మరి కాసేపటికి క్రూ దగ్గరకి వెళ్లి తనకు ఇటాలియన్ స్మూచ్ కావాలి అని అడిగాడు. వారు లేదని చెప్పడంతో ఆగ్రహించిన సదరు ప్రయాణికుడు తన ల్యాప్‌టాప్ విసిరి కొట్టాడు. తరువాత ఒంటి మీద బట్టలు విప్పుకుని.. ఎయిర్‌హోస్టెస్‌ని పిలిచి.. తనకు దుస్తులు వేయాల్సిందిగా కోరాడు. లేదంటే ముద్దిమ్మని అడిగాడు. సదరు ప్యాసింజర్ బిత్తిరి చర్యలకు మిగతా ప్రయాణికలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక విమానం ల్యాండ్ అవుతుండగా మరోసారి బట్టలిప్పి రచ్చ చేశాడు. సిబ్బంది ఎలాగో కష్టపడి అతడికి దుస్తులు తొడిగి సీట్లో కూర్చొబెట్టాడు. ఆ తర్వాత విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అతడిని అప్పగించారు. విమానంలో తప్పుగా ప్రవర్తించినందుకు గాను అతడి మీద కేసు నమోదు చేశారు. అతడి వింత ప్రవర్తన చూసిన మిగతా ప్రయాణికులు అతడు డ్రగ్స్ తీసుకుని ఉంటాడు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. చదవండి: బాబోయ్.. అసలు ఇంతకాలం నువ్వు ఎలా బతికావ్! -
చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్!
బిగ్ బాస్ 4 ఫేం మోనాల్ గజ్జర్ ఒకప్పుడు ఎవరికి తెలియదు. హీరోయిన్గా ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒక్కసారిగా బిగ్‌బాస్ షోతో వచ్చేసింది. ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్గా బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన ఈ గుజరాతి భామ ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతోంది. దీనికి అభిజిత్, అఖిల్ సార్థక్‌తో ఒకేసారి లవ్ ట్రాక్ నడపడమే. అలా 98 రోజుల పాటు హౌజ్‌లో కొనసాగిన మోనాల్‌పై విమర్శలు వచ్చినప్పటికి బయటకు వచ్చాకా ఆమెకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అంతేగాక దర్శక నిర్మాతల నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆమెకు పలు సినిమాల్లో నటించే అవకాశం కొట్టెసింది. దీంతో పాటు స్టార్ మాలో వస్తున్న డ్యాన్స్ ప్లస్ రియాలిటీ షోకు మెంటర్‌గా చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా స్టేజ్‌పై కాలు కదుపుతోంది ఈ భామ. ఈ క్రమంలో నిన్న స్టార్ మా విడుదల చేసిన ప్రోమో ప్రస్తుతం నెట్టంట వైరల్ అవుతోంది. ఈ షోలో కన్నా మాస్టర్ టీమ్ రెండు వారాల క్రితం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి మోనాల్ మెప్పు పొందిన సంగతి తెలిసిందే. ఈ టీం పర్ఫామెన్స్‌కు ఫిదా అయిన మోనాల్ కన్నా మాస్టర్‌ను తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టింది. అలా తీసుకెళ్తోన్న సమయంలో ఓ రొమాంటిక్ సాంగ్ వేశారు షో నిర్వహకులు. ఆ తర్వాత కన్నా మాట్లాడుతూ మేడమ్ కోసం ఏదైనా చేస్తానని చెప్పడంతో తనకు ఇష్టమైన పట్టు వస్త్రాలు కూడా వేసుకువస్తావా అని ఓంకార్ అడగ్గా.. మేడమ్ చేప్తే తప్పకుండా వేసుకోస్తానంటూ సమాధానం ఇచ్చాడు. అన్నట్టుగానే ఈ వారం జరిగే ఎపిసోడ్‌కు కన్నా మాస్టర్ పట్టు వస్రాలతో దర్శనమిచ్చాడు. తన పర్ఫామెన్స్ తర్వాత మోనాల్‌ను స్టేజ్‌పైకి తీసుకువేళ్లి తనతో స్టేప్పులేశాడు. అనంతరం ఆమెకు గులాబి పువ్వు ఇచ్చి మోకాళ్లపై కుర్చోని మోనాల్ చేయిపై ముద్దు పెట్టాడు. అది చూసి కంటెస్టెంట్స్, షో మెంటర్స్‌తో పాటు యాంకర్ ఓంకార్ సైతం ఒక్కసారిగా షాకయ్యారు. చదవండి: మోనాల్‌తో వీడియో కాల్, అఖిల్ కామెంట్ వైరల్ మహేశ్‌తో స్పెషల్ సాంగ్: మోనాల్ క్లారిటీ! -
జాన్వీ కపూర్‌ని ముద్దడిగిన ఫ్యాన్.. తన రిప్లై చూస్తే..
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ‘దఢక్’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో జాన్వీ నటనతోపాటు మంచి అభినయం కనబరిచి ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు జాన్వీ. సినిమాల సంగతి పక్కకు పెడితే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు జాన్వీ. వ్యక్తిగత విషయాలతో పాటు తన సినిమా అప్డేట్స్కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు జాన్వీ. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు జాన్వీ కపూర్. ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ పేరుతో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యి.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఓ అభిమాని హద్దుమీరి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా మనం ముద్దు పెట్టుకుందామా అని జాన్వీని అడిగాడు. అయితే అతడి తింగరి ప్రశ్నకు జాన్వీ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ముద్దడిగిన అభిమానికి సమాధానం చెప్తూ మాస్క్ ధరించిన ఫోటో పెట్టి నో అంటూ రిప్లై ఇచ్చారు జాన్వీ. ముద్దు కాదు ముందు మాస్క్ పెట్టుకో లేకపోతే పోతావ్ అన్నట్లుగా ఉంది ఈ ఫోటో. ఇదేకాక మరి కొంతమంది అడిగిన ఇలాంటి చిలిపి ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పారు జాన్వీ. అలాగే తన అభిమాన కోస్టార్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు, జాన్వీ తన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాలో సహనటుడు పంకజ్ త్రిపాఠిని కౌగిలించుకునే ఫోటోను షేర్ చేశారు. అలానే మరో యూజర్ ట్రావేలింగ్లో మీరు మర్చిపోలేని జ్ఞాపకం ఏంటని ప్రశ్నించగా.. కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులిద్దరూ సౌత్ ఫ్రాన్స్‌కు వెళ్లిన రోడ్ ట్రిప్‌కు సంబంధించిన పోటోని షేర్ చేశారు జాన్వీ కపూర్. ప్రస్తుతం జాన్వీ నటిస్తున్న ‘గుడ్ లక్ జెర్రీ’ షూటింగ్‌ను ఇటీవల ముగిసింది. ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించారు. సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించారు. ఇందులో దీపక్ డోబ్రియాల్, మీతా వశిష్త్, నీరజ్ సూద్ కీలకపాత్రలో నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: చాలా బాధగా ఉంది : జాన్వీ కపూర్ అభిమాని కోసం హీరోయిన్ ఆవేదన! -
వెర్రిబాగుల పిట్ట.. చావుతో ముద్దులాట
ఈ పిట్ట మరీ వెర్రిబాగులు టైపులాగుంది.. ముద్దెట్టుకోవాలంటే.. ఇంకో పిట్టను పెట్టుకోవాలి గానీ.. ఇలా మృత్యువుతో ముద్దులాటేమిటి.. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇదో సన్‌బర్డ్. ఇవి పువ్వుల నుంచి మకరందాన్ని తాగుతుంటాయి.. పచ్చగా కనిపిస్తే.. పువ్వు అనుకుందేమో ఏమోగానీ.. ఇలా పాముకు దగ్గరగా వెళ్లింది. అయితే, ఈ పిట్ట సర్పానికి అతి సమీపానికి వెళ్లినా.. ముద్దాడలేదట. తాను తీసిన ఫొటో యాంగిల్ వల్ల ఆ ఎఫెక్ట్ వచ్చిందని ఇండోనేసియాకు చెందిన బుడీ గునావాన్ చెప్పారు. ఈ చిత్రాన్ని క్లిక్‌మనిపించింది ఈయనే. -
మైనర్ బాలికకు ముద్దు.. ఐదేళ్ల జైలు
ముంబై : మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న కేసులో ఓ వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, ముంబైకి చెందిన అబు అబ్దుల్ రెహ్మాన్ అనే 30 ఏళ్ల వ్యక్తి 2018 జూన్ 29న అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్నాడు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. (అమ్మాయితో ఇంత రాత్రి పూట ఎక్కడికి?..) బుధవారం ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును ముంబై స్థానిక కోర్టు వెలువరించింది. మైనర్ బాలిక తనను ముద్దు పెట్టుకుంది అతనే అంటూ కోర్టులో అబ్దుల్‌ను గుర్తు పట్టింది. దీంతో అతడ్ని దోషిగా తేల్చిన కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాలిక కుటుంబానికి ఐదు వేల రూపాయల పరిహారం అందించాలని తీర్పునిచ్చింది. -
ఆ దేశాల్లోనే ‘ఫ్రెంచ్ ముద్దులు’ ఎక్కువ
న్యూఢిల్లీ : ‘ముద్దంటే చేదా నీకు, ఆ ఉద్దేశం లేదా నీకు!’ అంటూ ఆ దేశాల్లో ఎవరు, ఎవరిని అడకక్కర్లేదు. అడక్కుండానే అక్కడ ప్రేమికులు, భార్యా భర్తలు కలసుకున్నదే తడవుగా ‘ఫ్రెంచి కిస్’లు పెట్టుకుంటారు. దాన్నే మన సినిమా పరిభాషలో ‘లిప్ లాక్’ ముద్దులంటాం. ధనవంతుడికి పేద వాడికి మధ్య అత్యంత ఎక్కువ వ్యత్యాసాలున్న ఆరు ఖండాల్లోని 13 ఎంపిక చేసిన దేశాల్లో ‘ముద్దు’ ముచ్చటపై స్కాట్లాండ్లోని ఆల్బర్టీ యూనివర్శిటీ పరిశోధన బృందం అధ్యయనం జరిపింది. (చదవండి: పెంపుడు కుక్క పిల్లకూ కోవిడ్ వైరస్) మిగతా దేశాలకన్నా ఆర్థిక వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్న ఈ దేశాల్లోనే ప్రేయసీ ప్రేమికులు, భార్యా భర్తలు నాలుకకు నాలిక, పెదాలకు పెదాలు కలిపి గాఢ చుంభనంలో మునిగిపోతున్నారట. ప్రేమ, ఆప్యాయతల వ్యక్తీకరణకు, శృంగార ఆస్వాదనకు ఇంతకుమించిన మార్గం లేదని వారు వాదిస్తున్నారు. ముద్దే అసలైన శృంగారమని, ముద్దులేని సెక్స్ కూడా శృంగారం కాదని వారు వాదిస్తున్నారట. మగవారితో పోలిస్తే ఈ ముద్దులను ఎక్కువగా మహిళలే ఆస్వాదిస్తున్నారట. ముద్దూ ముచ్చట విషయంలో ఆర్థిక వ్యత్యాసాలు ఎక్కువున్న దేశాల్లోనే ఎందుకు ఆదరణ ఎక్కువగా ఉందో, అందుకు సంబంధించి ఆర్థిక, సామాజిక కారణాలపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ క్రిస్టఫర్ వాట్కిన్స్ మీడియాకు తెలిపారు. మరిన్ని అధ్యయన వివరాలతో ప్రజల ముందుకు వస్తామని, అప్పుడే తాము అధ్యయనం జరిపిన 13 దేశాల పేర్లను బహిర్గతం చేస్తామని ఆయన చెప్పారు. యువతీ యువకులు పది సెకన్ల పాటు ఫ్రెంచి ముద్దు పెట్టుకుంటే ఒకరి నుంచి ఒకరికి ఎనిమిది కోట్ల బ్యాక్టీరియా ఒకరి నోట్లో నుంచి ఒకరి నోట్లోకు పోతుందని డచ్ జీవ శాస్త్రవేత్తలు ఇప్పటికే తెలియజేశారు. ప్రతి మనిషిలో సహజంగా కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుందనే విషయం తెల్సిందే. మరో రకంగా చెప్పాలంటే ఓ మనిషి బరువులో 30 శాతం బరువును ఈ బ్యాక్టీరియానే ఆక్రమిస్తుంది. చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా ఉండడం వల్లనే మనుషులు మనుగడ సాగిస్తున్నారన్న విషయం కూడా తెల్సిందే. దంపతులు పది సెకడ్ల పాటు ముద్దు పెట్టుకుంటే ఒకరి నుంచి ఒకరిలోకి 8 కోట్ల బ్యాక్టీరియా వెళ్లినప్పుడు అది మంచిదా, కాదా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. దంపతుల్లో ఒకరు అనారోగ్య వంతులైతే రెండోవారికి బ్యాక్టీరియా మార్పిడి వల్ల నష్టం జరుగుతుందని కొంత మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడగా, ఆరోగ్యవంతుల నుంచి అనారోగ్యవంతులకు బ్యాక్టీరియా చేరడం వల్ల అవతలి వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వాదిస్తోన్న శాస్త్రవేత్తలు లేకపోలేదు. ఏదేమైనా ముద్దుల్లో బ్యాక్టీరియా ప్రభావంపై ప్రపంచంలో ఇప్పటి వరకు ఎలాంటి పరిశోధన జరగలేదని, అవసరమైతే ఇప్పుడు జరపొచ్చని ‘నెదర్లాండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ అప్లైడ్ సైంటిఫిక్ రిసర్చ్’ పరిశోధకులు డాక్టర్ రెమ్కో కోర్ట్ తెలియజేస్తున్నారు. (చదవండి: కామ పిశాచి.. సవతి కూతురిని దాచేసి) -
వైరల్: జడ్జికి కంటెస్టెంట్ ముద్దు
ముంబయి : సోనీ చానెల్ నిర్వహిస్తోన్న రియాల్టీ షోలో కంటెస్టెంట్ మహిళా జడ్జికి ముద్దుపెట్టి అక్కడున్నవారందరినీ షాక్‌కు గురి చేశాడు. ఊహించని ఘటనతో సదరు మహిళా జడ్జి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. కాగా ఇదంతా సోనీ నిర్వహిస్తోన్న 'ఇండియన్ ఐడల్ 11' లో చోటుచేసుకుంది. అయితే దీనిని సోనీ టీవీ ప్రోమో రూపంలో రిలీజ్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే .. ఇండియన్ ఐడల్ 11 కార్యక్రమానికి ప్రముఖ గాయకులు అను మాలిక్, విశాల్ దడ్లానిలతో పాటు నేహా కక్కర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కంటెస్టెంట్ గుజరాతీ వేషదారణలో పలు బహుమతులతో స్టేజీ మీదకు వచ్చినట్లు ప్రోమోలో తెలుస్తుంది. పాట పాడిన అనంతరం తనను గుర్తుపట్టారా అంటూ నేహాకక్కర్‌ను అడిగాడు. దీంతో స్టేజీ మీదకు వెళ్లిన నేహా అతను ఇచ్చిన బహుమతులను తీసుకొని కృతజ్ఞతగా అతన్ని హగ్ చేసుకుంది. ఈ నేపథ్యంలో అతను అందరూ చూస్తుండగానే నేహా బుగ్గమీద ముద్దుపెట్టాడు. దీంతో షో వాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆదిత్య నారాయణ అతన్ని అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశాడు. ఈ ఉహించని పరిణామంతో షాక్‌కు గురైన నేహాకక్కర్ కార్యక్రమం మద్యలోనే వెళ్లిపోయినట్లు ప్రోమోలో చూపించారు. కాగా, ఈ ఎపిసోడ్ ఆదివారం సోనీలో టెలికాస్ట్ అవనుంది. -
కాన్ఫిడెన్స్ పెంచడానికే ఆమెను కిస్ చేశాను!
ఈయన్ని చూడండి. ఎక్కడా చూసినట్లు అనిపించదు. పేరు వినండి. పాల్ గ్యాస్కోయినే. ఎక్కడా విన్నట్లూ అనిపించదు. మరి ఈయన సంగతి ఎందుకు? ఎందుకంటే మన దగ్గరా అప్పుడప్పుడు ఇలాంటి వాళ్లు కనిపిస్తుంటారు. ‘తాడి చెట్టు ఎందుకు ఎక్కావ్ అంటే.. దూడ గడ్డి కోసం’ అన్నట్లు.. ఏదో చెబుతుంటారు. ఈయనా అలాగే చెప్పాడు. ‘ఆమెను ముద్దెందుకు పెట్టుకున్నావ్’ అని కోర్టువారు అడిగితే.. ‘ఆమెలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచడానికి ’ అన్నాడు! పాల్ గ్యాస్కోయినే వయసు 52. ఒకప్పటి ఫుట్‌బాలర్. పేరున్నాయనే. గత ఏడాది ఆగస్టులో రద్దీగా ఉన్న రైలు బోగీలో ప్రయాణిస్తూ చప్పున ఒక యువతికి ముద్దే పెట్టేశాడు. పెట్టింది అక్కడా ఇక్కడా కాదు. పెదవుల మీద! ఛీ కొట్టేసి, రైలు దిగి వెళ్లిపోయాక ఆమె ఆయనపై కేసు పెట్టింది. ఆ కేసు నడుస్తూ, నడుస్తూ ఇన్నాళ్లకు పాల్‌కు తన వాదనను వినిపించుకునే అవకాశం వచ్చింది.‘‘ఆ టైమ్‌లో నేను తాగి ఉన్న మాట వాస్తవమే కానీ, తాగి ఉన్న కారణంగా నేను ఆమెను ముద్దుపెట్టుకోలేదు. అక్కడ ఉన్న వాళ్లలో కొందరు ఆమె వైపు చూస్తూ.. ఆమె లావుగా ఉందనీ, అసహ్యంగా ఉందనీ కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్‌కి ఆమె నొచ్చుకోవడం, మనసు కష్టపెట్టుకోవడం నేను కళ్లారా చూశాను. వెంటనే ఆమె దగ్గరకి వెళ్లి.. ‘‘విను. నువ్వు లావుగా లేవు. అంతేకాదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు’’ అని.. ఆమెను నమ్మించడం కోసం ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నాను. ఆమెలో కాన్ఫిడెన్స్ పెంచడానికే నేను ఆమెను కిస్ చేశాను తప్ప నాలో ఏ చెడు ఆలోచనా లేదు మిలార్డ్..’’ అని చెప్పాడు పాల్. అందుకు కోర్టువారేం తీర్పు చెప్పారో గురువారం కానీ తెలీదు. -
లైవ్‌లో రిపోర్టర్‌కి ముద్దుపెట్టాడు తర్వాత..
వాషింగ్టన్ : లైవ్ రిపోర్ట్ చేస్తున్న ఓ పాత్రికేయురాలికి ముద్దుపెట్టి వేధింపులకు గురి చేశాడో వ్యక్తి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. బౌర్బన్ అండ్ బియాండ్ మ్యూజిక్ పెస్టివల్ సందర్భంగా వెవ్3 న్యూస్ ఛానెల్‌కు చెందిన పాత్రికేయురాలు సారా రివెస్ట్ కెంటుకీలో లైవ్ రిపోర్ట్ అందిస్తున్నారు. సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే అంశంపై రోడ్డుపై నిలబడి లైవ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి సారా చూట్టూ అనుమానస్పదంగా తిరిగాడు. అయినప్పటికీ సారా అతన్ని పట్టించుకోకుండా డెస్క్‌లో ఉన్న యాంకర్‌కు వార్తను వివరిస్తున్నారు. ఇంతలో ఆ ఆగంతకుడు ఒక్కసారిగా సారా దగ్గరకు వచ్చి బుగ్గపై ముద్దుపెట్టి పరారయ్యాడు. దీంతో సారా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయినప్పటికీ వార్తను వివరించడం ఆపేయలేదు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆగంతకునిపై లైంగిక వేధింపుల కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లైవ్‌లో ముద్దుపెట్టిన వ్యక్తిని ఎరిక్ గుడ్మ్యాన్గా గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, తను చేసిన తప్పు పట్ల ఎరిక్ గుడ్‌మ్యాన్ క్షమాపణలు కోరారు. ఈమేరకు సారాకు ఓ లేఖ రాశాడు. తాను ముద్దు పెట్టడం తప్పని, తనను క్షమించాలని కోరారు. ఈ లేఖను సారా.. వెవ్3 న్యూస్ ఛానెల్లో చదివి వినిపించారు. అతనిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటానని, కానీ చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
-
పాపం రాహుల్ ఇలా బుక్కవుతున్నాడేంటి!?
తిరువనంతపురం: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఓ వింత అనుభవం ఎదురయ్యింది. ఓ అభిమాని రాహుల్ గాంధీకి ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. రాహుల్ వయనాడ్ నియోజకవర్గ పర్యటనలో ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. బుధవారం రాహుల్ గాంధీ వయనాడ్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఓ అభిమాని రాహుల్ వాహనం దగ్గరకు వచ్చి తొలుత షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత రాహుల్ చేయి పట్టుకుని లాగి అతని బుగ్గపై ముద్దు పెట్టి అంతేవేగంగా వెళ్లి పోయాడు. ఈ అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు రాహుల్. కానీ వెంటనే తేరుకుని ఆ తర్వాత వచ్చిన వారిని పలకరించాడు. #WATCH A man kisses Congress MP Rahul Gandhi during his visit to Wayanad in Kerala. pic.twitter.com/9WQxWQrjV8 — ANI (@ANI) August 28, 2019 ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇలాంటే పరిస్థితి ఎదురయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గుజరాత్లో పర్యటించినప్పుడు ఓ మహిళ అతడిని ముద్దు పెట్టుకుంది. రాహుల్ మెడలో పూలమాల వేయడానికి స్టేజీ మీదకు వచ్చిన సదరు మహిళ ఒక్కసారిగా అతని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్లి పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా లవర్స్ డే రోజున ఈ వీడియోను విపరీతంగా షేర్ చేశారు నెటిజనులు. -
ఎస్సైకి ముద్దుపెట్టిన యువకుడు..
-
పబ్లిక్‌లో ఎస్సైకి ముద్దుపెట్టిన యువకుడు..
హైదరాబాద్ : పోలీసులు వస్తున్నారంటే మాములుగా జనాలు భయపడిపోతారు. కానీ ఓ యువకుడు మాత్రం ఏకంగా విధుల్లో ఉన్న ఎస్సైకి ముద్దుపెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోనాల వేడుకల్లో భాగంగా పలువురు యువకులు రోడ్డుపై చిందులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న ఎస్సై మహేందర్ అటుగా వెళ్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆ గ్యాంగ్‌లోని ఓ యువకుడు ఎస్ఐ దగ్గరకు వెళ్లి ఆయనకు ముద్దుపెట్టాడు. దీంతో ఉలిక్కిపడ్డ ఎస్ఐ ఆ యువకుడిని పక్కకు నెట్టాడు. ఆ తర్వాత అతనిపై కోపం ప్రదర్శించకుండా.. సంయమనం పాటించాడు. కోపాన్ని దిగమింగుకుంటూ ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోయారు. యువకుడు మద్యం మత్తులో ఉండి ఈ విధంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడు మద్యం మత్తులో తనతో అమర్యాదగా ప్రవర్తించాడని అర్థం చేసుకుని.. అతన్ని ఏమి అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎస్సైని పలువురు ప్రశంసిస్తున్నారు. -
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు వేదికపై రోత చేష్టలు
-
‘ఈ స్త్రీలు నన్ను ‘గే’ కాకుండా కాపాడారు’
మనీలా : ఫిలిప్పీన్స్ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె (73) ఓ దేశాధ్యక్షుడిగా కంటే కూడా అసభ్యకర వ్యాఖ్యలు, రోత చేష్టలు చేసే మనిషిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మహిళలంటే ఈ దేశాధినేతకు చాలా చిన్న చూపు. వారిని కేవలం లైంగిక ఆనందం అందించే ఓ వస్తువుగా మాత్రమే చూస్తారు. ఆయన మాటలు, చేష్టల పట్ల ఎంతమంది దుమ్మెత్తిపోసినా.. దున్నపోతు మీద వర్షం కురిసినట్లే గానీ.. ఇతను మాత్రం మారడు. తాజాగా ఈ ప్రబుద్ధుడు ఓ చండాలమైన పని చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. స్వదేశంలోనే కాక అతిథిగా వెళ్లిన దేశంలో కూడా తన నీచ బుద్ధిని బయటపెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల పర్యటన ముగింపులో భాగంగా జపాన్‌లో నివసిస్తున్న ఫిలిప్పీన్స్ వాసులతో టోక్యోలో సమావేశమయ్యారు రోడ్రిగో. ఈ క్రమంలో కార్యక్రమం ముగిసిన తర్వాత తాను ముద్దుపెట్టుకొనేందుకు వీలుగా ఐదుగురు మహిళా వలంటీర్లను వేదికకు దగ్గరగా కూర్చోవాలని కోరాడు రోడ్రిగో. వీరిలో మొదటి మహిళ రోడ్రిగోను ముద్దు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. తన పెదవులపై, మెడపై ముద్దు పెట్టుకోవద్దని ఆమె కోరింది. దాంతో రోడ్రిగో ఆ మహిళ చెంపలపై ముద్దుపెట్టుకొని పంపించారు. అనంతరం రెండో మహిళది అదే పరిస్థితి. అయినా రోడ్రిగో తీరు మారలేదు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు వేదికపై రోత చేష్టలు మూడో మహిళను ముద్దుపెట్టుకొని ఫోటోకి పోజు ఇచ్చారు. మిగిలిన ఇద్దరు కూడా అలానే చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ తతంగం ముగిసిన తర్వాత రోడ్రిగో ‘సాధారణంగా నేను పెదవులపైనే ముద్దు పెట్టుకొంటాను. ఈ రోజు నేను గే(నపుంసకుడు) కాకుండా ఈ మహిళలు సాయం చేశారు’ అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. తన విమర్శకుడు సెనెటర్ ఆంటోనియోను ‘హోమో’గా వర్ణించారు. 74 ఏళ్ల ఈ ముసలి అధ్యక్షుడు తన భార్య కళ్ల ముందే ఇలా ఇతర మహిళల్ని ముద్దు పెట్టుకోవడం గమనార్హం. అయితే విదేశాల్లో నివసిస్తున్న తన దేశీయులను ముద్దు పెట్టుకోవడం రోడ్రిగోకు ఇదే మొదటి సారికాదు. 2018 జూన్‌లో కూడా సియోల్‌లో పని చేస్తున్న వివాహితను రోడ్రిగో ముద్ద పెట్టుకున్నారు. ఆమెకు వివాహం అయిందని తెలిసినా వదిలిపెట్టలేదు. (చదవండి : పెదాలపై ముద్దు.. తీవ్ర విమర్శలు) -
ముద్దు పెట్టిన విద్యార్థి అరెస్టు
తిరువొత్తియూరు: కలిసి తీసుకున్న సెల్ఫీ ఫొటోను డెలీట్ చేయాలంటే తనకు ముద్దు పెట్టాలని బెదిరించి విద్యార్థినికి ముద్దు పెట్టిన విద్యార్థిన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ దృశ్యాన్ని ఫొటో తీసిన అతని స్నేహితున్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. చెన్నై మడిపాక్కం పాలయాగార్డెన్స్కు చెందిన యువతి (18) ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. పాఠశాల దశ నుంచే యువతికి పరిచయం ఉన్న శ్రీనాథ్ ఆమెను ప్రేమిస్తున్నాడు. కాని అతని ప్రేమను విద్యార్థిని తిరస్కరించింది. ఈ క్రమంలో మహాబలిపురం వెళ్లిన సమయంలో విద్యార్థినితో కలిసి శ్రీనాథ్ సెల్ఫీ తీశాడు. ఆ ఫొటోను ఆమెకు చూపించాడు. తనకు ముద్దు పెట్టాలని లేదంటే ఈ ఫొటోను మీ కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరించాడు. ఫేస్బుక్లో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఆమె ముద్దు పెట్టింది. అయితే ముద్దు పెడుతున్న దృశ్యాన్ని మరో విద్యార్థి ఫొటో తీసినట్లు తెలిసింది. దీనిపై విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం శ్రీనాథ్‌తో పాటు అతని స్నేహితుడిని అరెస్టు చేశారు. -
ముద్దు ఎంత పని చేసింది...
చెన్నై : ప్రియురాలు సవాల్ విసిరింది. అలాంటి ఇలాంటి ఛాలెంజ్ కాదు. తాను చెప్పినట్లు వస్తే ముద్దు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది... ప్రేయసి ముద్దు కోసం ప్రియుడు సై అన్నాడు. అమ్మడు చెప్పినట్లే సిద్ధమై అతగాడు ఆశగా ముద్దు కోసం వచ్చాడు. తీరా అయ్యగారి వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్లు... ఆ యువకుడు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపెట్టాడు. ఈ సందర్భంగా చెన్నైలోని రాయపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని పట్టాభిరామ్ తండురై గ్రామం పల్లవీధికి చెందిన శక్తివేల్ (22) అన్నాసాలైలోని ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్ ట్రస్ట్ తరఫున ఉద్యోగ శిక్షణలో ఉండగా అక్కడే ఉన్న ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆమెను ప్రేమికుల రోజున ముద్దు ఇవ్వమని అడగగా అందుకు అంగీకరించలేదు. ముద్దు కావాలంటే బురఖా ధరించి రాయపేట నుంచి మెరీనా బీచ్ వరకు రావాలని పందెం కాసింది. అలా చేస్తే ముద్దు ఇస్తానని చెప్పడంతో శక్తివేల్ బురఖా వేసుకుని ప్రియురాలి ఇంటికి వచ్చిన అతడు.. ఆ తర్వాత ఆమెతో మెరీనా బీచ్‌కు వెళ్లాడు. అయితే శక్తివేలు నడకతో పాటు, కాళ్లకు మగవాళ్ల ధరించే స్లిప్పర్స్, వీటితో పాటు అయ్యగారు వ్యవహారం తేడాగా ఉండటంతో... అనుమానం వచ్చిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. పోలీసులు శక్తివేల్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
రాహుల్‌గాంధీకి ముద్దిచ్చిన మహిళ
అహ్మదాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడానికి రాహుల్‌గాంధీ గురువారం గుజరాత్‌లోని వల్సాద్ వెళ్లారు. అక్కడ కొందరు మహిళలా కాంగ్రెస్‌నేతలు రాహుల్‌గాంధీకి పూలమాల వేయడానికి స్టేజ్‌పైకి వచ్చారు. అందులో ఓ మహిళ రాహుల్‌గాంధీని చూసిన ఆనందంలో ఆయన దగ్గరకు వెళ్లి ముద్దుపెట్టారు. కాగా రాహుల్ గాంధీ ఈ విషయాన్ని సింపుల్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. #WATCH A woman kisses Congress President Rahul Gandhi during a rally in Valsad, #Gujarat pic.twitter.com/RqIviTAvZ9 — ANI (@ANI) February 14, 2019 -
అభిమాని ముద్దు.. ఈ సారి రోహిత్ వంతు
ముంబై: అభిమానులు తమ అభిమాన క్రికెటర్ కనిపిస్తే ఆటోగ్రాఫ్.. వీలుంటే సెల్ఫీలు తీసుకోవడం కామన్. కానీ తమ అభిమాన క్రికెటర్‌ను కలిసిన ఆనందంలో ముద్దులు పెడుతూ ట్రెండ్ మార్చుతున్నారు. అయితే మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో సెక్యూరిటీ కళ్లు కప్పి మైదానంలోకి దూసుకరావడం ఇబ్బంది కలిగించే అంశం. ఇక మ్యాచ్ మధ్యలో తరుచుగా అభిమానులు మైదానంలోకి వస్తుండటంపై సెక్యూరిటీ వైఫల్యాలపై అందరూ వేలేత్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా-వెస్టిండీస్‌ల మధ్య జరిగిన రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి కెప్టెన్ విరాట్ కోహ్లితో సెల్ఫీ దిగి, ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. అంపైర్లు, సెక్యూరిటీ అప్రమత్తవడంతో అభిమానిని బయటకి పంపించారు. అభిమానుల నుంచి ఊహించని ఇలాంటి ఘటనే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఎదురైంది. (ముద్దు మీరిన అభిమానం) ఆదివారం విజయ్‌హజారే ట్రోఫి తొలి క్వార్టర్ ఫైనల్లో భాగంగా ముంబై-బిహార్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. బిహార్ నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై బ్యాటింగ్‌కు దిగింది. అయితే రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నసమయంలో ఓ అభిమాని అకస్మాత్తుగా మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. రోహిత్‌కు ముద్దు పెట్టే ప్రయత్నం చేసి, పాదాలను తాకబోయాడు. అనంతరం అభిమాని ఎగిరిగంతేసుకుంటూ మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం రోహిత్‌కు అభిమాని ముద్దుపెడుతున్న వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. రోహిత్‌ను అభిమాని ముద్దుపెట్టుకుంటే రితికా అసూయ పడుతున్నారు కావచ్చని అభిమానులు ఫన్నీగా స్పందించారు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. (మూడు సెక్షన్ల కింద కేసు నమోదు...) -
అభిమాని ముద్దు.. ఈ సారి రోహిత్ వంతు
-
ముద్దివ్వబోతే భర్త నాలుక కొరికి..
సాక్షి, న్యూఢిల్లీ : ముద్దిచ్చేందుకు ముందుకొచ్చిన భర్తను ఇదే అదనుగా భావించిన భార్య అతడి నాలుకను కొరికేసింది. గొడవకు దిగిన భార్యను శాంతింపచేసేందుకు భర్త చేసిన ప్రయత్నం అతడి నాలుకకు ఎసరు తెచ్చింది. ఢిల్లీలోని రన్హోలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్టిస్ట్‌గా పనిచేసే కరణ్‌కు రెండేళ్ల కిందట వివాహమైనా భార్యతో సఖ్యత లేదు. ఇద్దరూ తరచూ గొడవ పడుతుంటారని పోలీసులు తెలిపారు. భర్త అందంగా లేడని ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కరణ్ భార్య వాపోతుంటుందని స్ధానికులు చెబుతున్నారు. వీరి మధ్య శనివారం రాత్రి సైతం ఘర్షణ జరిగింది. కోపంతో ఉన్న భార్యను శాంతింపచేసేందుకు కరణ్ ముద్దు ఇవ్వగా అతడి నాలుకను సగం వరకూ ఆమె కొరికేసింది. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపుతోకి తీసుకున్నారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా బాధితుడు మాట్లాడే అవకాశం లేదని సప్ధర్‌జంగ్ ఆస్పత్రిలో ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు తెలిపారు. -
వైరల్ : మరోసారి మహిళ జర్నలిస్ట్‌పై..
యెకాటెరిన్బర్గ్(రష్యా) : రష్యాలో జరుగుతున్న సాకర్ ప్రపంచకప్ కవరేజ్‌కు వెళ్లిన మహిళ రిపోర్టర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ నెల 15న ఓ జర్మన్ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న జూలియట్ గోంజాలెజ్ థెరాన్ లైవ్ రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రెజిల్ స్పోర్ట్ జర్నలిస్ట్ జూలియా గుమారాస్, యోకాటెరిన్బర్గ్ నుంచి రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఓ ఆకతాయి ఆమెకు ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. రిపోర్టింగ్ సమయంలో అప్రమత్తతో ఉన్న జూలియా అతని నుంచి తప్పించుకున్నారు. అంతేకాకుండా ఇంకెప్పుడు ఇలా చేయకు అంటూ జూలియా అతనిపై మండిపడ్డారు. ‘ఇది మంచి పద్దతి కాదు.. ఓ మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం సరైనది కాదు.. దీనిని రిపీట్ చేయకు’ అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జూలియా ట్విటర్లో స్పందించారు. ‘ఆ ఘటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. అదృష్టవశాత్తు నేను తప్పించుకున్నాను. ఇక్కడ ఇలా జరగడం రెండోసారి.. రష్యా, ఈజిప్ట్ మధ్య జరిగిన ప్రపంచకప్ తొలి మ్యాచ్ సమయంలో కూడా మాస్కోలో ఇదే రకమైన అనుభవం ఎదురైంది. రష్యాలో కొన్ని పరిస్థితలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయ’ని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. కాగా జూలియా చర్యను తోటి జర్నలిస్టులు.. నెటిజన్లు ప్రశంసిసస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
స్టేడియం బయట రిపోర్టర్‌కు అనూహ్య పరిణామం
-
మహిళా విలేకరికి ‘లైవ్’లో ముద్దు!
మాస్కో: ప్రపంచకప్ సాకర్ మ్యాచ్‌ల కవరేజీలో ఉన్న మహిళా రిపోర్టర్‌ను ప్రత్యక్ష ప్రసారం సమయంలోనే ఒక ఆకతాయి ముద్దుపెట్టి వెళ్లిపోయాడు. ఈ నెల 15న మర్డోవియా అరెనా స్టేడియం వద్ద ఈ ఘటన జరిగింది. ‘డెట్స్చే వెల్లె’ న్యూస్ చానెల్లో కొలంబియాకు చెందిన జులియెత్ గాంజలెజ్ థెరాన్ అనే అమ్మాయి పనిచేస్తుంది. లైవ్ కవరేజీలో నిమగ్నమైన ఆమెను ఒక ఆకతాయి ఛాతీ భాగంలో తగులుతూ చెంపపై ముద్దుపెట్టి వెళ్లిపోయాడు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తనపై జరిగిన లైంగిక వేధింపులపై వాపోయింది. ‘ప్రత్యక్ష ప్రసారం కోసం నేను రెండు గంటల పాటు కసరత్తు చేశాను. లైవ్‌లో ఎలాంటి అంతరాయం కలగకూడదని ఇలా ప్రవర్తించినప్పటికీ నా పని (న్యూస్ ప్రజంటేషన్) పూర్తి చేశాకే ఆకతాయి కోసం వెతికాను. కానీ ఆ వ్యక్తిని నేను కనుక్కోలేకపోయాను’ అని గాంజలెజ్ థెరాన్ అందులో పేర్కొంది. -
మహిళా రిపోర్టర్‌తో.. బిత్తిరి చర్య
మాస్కో : ఫిఫా ప్రపంచ కప్‌లో మహిళా న్యూస్ రిపోర్టర్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. కొలంబియాకు చెందిన జూలియట్ గోంజాలెజ్ థెరాన్ ఓ జర్మన్ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారు. రష్యాలో జరుగుతున్న ప్రపంచకప్ కవరేజ్ కోసం వెళ్లిన థెరాన్ సరన్స్ ప్రాంతంలో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఓ అపరిచిత వ్యక్తి వచ్చి ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించి, ముద్దు పెట్టాడు. లైవ్ కవరేజ్ కావడంతో థెరాన్ రియాక్ట్ కాలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఆ మహిళా రిపోర్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. న్యూస్ టీం, తాను లైవ్ కవరేజ్ కోసం రెండు గంటల నుంచి ఆ ప్రాంతంలో కష్టపడుతున్నామని, లైవ్ రిపోర్టింగ్ మొదలు పెట్టాక రియాక్ట్ అయ్యే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఆ వ్యక్తి వేచి చూసి, ఈ సిగ్గుమాలిన పని చేశాడని థెరాన్ పేర్కొన్నారు. లైవ్ రిపోర్టింగ్ అనంతరం ఆ వ్యక్తి కోసం వెతికినా దొరకలేదని తెలిపారు. ‘నేను ఇలాంటి ఘటన ఎదుర్కొంటానని కలలో కూడా ఊహించలేదు. మేము ఫుట్‌బాల్ గురించి ఎంతో కొంత సాకర్ అభిమానులకు తెలియజేయాలని అనుకున్నాం. కానీ అభిమానం ప్రేమగా స్వీకరించేలా ఉండాలి కాని వేదింపుగా ఉండకూడదు’అంటూ థెరాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ యువకుడి చర్యపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. -
న్యూస్ రిపోర్టర్‌కు ఊహించని సంఘటన!
-
పెదాలపై ముద్దు.. తీవ్ర విమర్శలు
మనీలా/సియోల్: ఫిలిప్పీన్స్‌లో నిరంకుశ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మహిళను 3 వేల మంది సమక్షంలో బహిరంగంగా పెదాలపై ఆయన ముద్దాడటమే ఇందుకు కారణం. స్ర్తీద్వేషిగా వార్తల్లో నిలిచే రొడ్రిగో చేసిన పనితో జనాలంతా దిగ్భ్రాంతికి గురికాగా, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఆయన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటించారు. ఈ ఆదివారం అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడున్న ప్రజల్లో ఓ ఫిలిపైనో మహిళను వేదిక మీదకు పిలిచారు. ఆమెకు ఓ పుస్తకాన్ని బహుకరించి అనంతరం తన పెదాలను ముద్దు పెట్టుకోవాల్సిందిగా ఆమెను కోరారు. ‘మీరు ఒంటరినా? లేక వివాహం అయ్యిందా? పుస్తకం బదులు నా పెదాలను ముద్దాడండి అని రొడ్రిగో అడగ్గా.. దానికి ఆమె అయ్యిందనే బదులిచ్చారు. ‘అయినప్పటికీ ముద్దు పెట్టాల్సిందేనంటూ’ ఆమెను ఆయన ప్రాధేయపడ్డాడు. మొహమాట పడుతూనే ఆమె రొడ్రిగో పెదాలను ఛుంబించటంతో అక్కడున్న జనమంతా నిశ్చేష్టులయ్యారు. అయితే ఆ వెంటనే ఆయన ‘ఇది సరదా కోసం చేసిందే. సీరియస్‌గా తీసుకోకండని’ అంటూ అక్కడున్న వారిని కోరారు. విమర్శలు-జోకులు... 73 ఏళ్ల డ్యుటెర్టె గతంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే కార్యక్రమానికి హాజరైన ప్రజలను వినోదపరిచేందుకు తాను అలా చేశానని ఆయన స్పష్టం చేసినప్పటికీ, ఫిలిప్పీన్స్‌లోని మహిళా సంఘాలు, రాజకీయ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. సరదా కోసం ఓ మహిళను ఇబ్బంది పెట్టడం ఏంటని వారు మండిపడుతున్నారు. మరికొందరు ‘అది తప్పు అని, అంతలా అయితే చెంపపై పెట్టాల్సింది’ అని అంటున్నారు. విమర్శలు తారాస్థాయికి చేరటంతో మనీలాకు చెందిన కొన్ని మీడియా సంస్థలు ఆ మహిళను ఇంటర్వ్యూ చేశాయి. ఇది చాలా చిన్న వ్యవహారమని, తనకు, తన భర్తకు లేని అభ్యంతరం ఇతరులకు ఎందుకు వస్తుందో తెలీటం లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. మరికొందరు రొడ్రిగోకు మద్ధతుగా ట్వీట్లు చేస్తుండగా, ఇంకొందరు మాత్రం మహిళ స్థానంలో చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌ను అంటించి(మార్ఫింగ్) సరదా కామెంట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. -
కుక్కకు ముద్దులే ముద్దులు..!!
వాషింగ్టన్ : వ్యవసాయ క్షేత్రంలో తమతో పాటు కలిసి నివసించే కుక్కపై ఆవులు తెగ ప్రేమను పెంచేసుకున్నాయి. కెనైన్ జాతికి చెందిన కుక్కను, బొవైన్ జాతికి చెందిన ఆవులు గుంపుగా ముద్దులతో ముంచెత్తాయి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. రచయిత క్రిస్ ఇవాన్గెలిస్టా ఈ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయిన ఫొటో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి మీరూ ఆ ఫొటోను చూసేయండి. -
'ముద్దు' వివాదం : జడ్జిగా తప్పుకుంటున్నా
ముంబై : మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న వివాదంలో కూరుకుపోయిన బాలీవుడ్ సింగర్ కమ్ కంపోజర్ పాపోన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదం సద్దుమణిగే వరకు వాయిస్ ఇండియా ప్రొగ్రామ్ న్యాయ నిర్ణేతగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మ్యూజిక్ రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతగా ఉన్న పాపోన్, హోలీ ప్రత్యేక ఎపిసోడ్ చిత్రీకరణ సందర్భంగా ఓ మైనర్ బాలికకు రంగు పూసి పెదాలపై ముద్దు పెట్టారు. ఆ వ్యవహారమంతా ఫేస్ బుక్ లైవ్‌లో టెలీకాస్ట్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తనపై తప్పుడిగా వస్తున్న ఆరోపణలు పూర్తిగా సద్దుమణిగే వరకు న్యాయ నిర్ణేతగా తాను వ్యవహరించనని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, చివరికి నిజమే గెలుస్తుందన్నారు. ఈ షోకి షాన్, హిమేష్ రేష్మియాలు కూడా జడ్జిలుగా ఉన్నారు. ఈ వివాదంపై మైనర్ బాలిక, ఆమె తండ్రి స్పందించారు. పాపోన్ తప్పుడు ఉద్దేశ్యంతో ఏమీ చేయలేదని, పాపోన్ తన కూతురికి తండ్రి లాంటి వారని మైనర్ బాలిక తండ్రి చెప్పాడు. ఇదే విషయాన్ని ఆ బాలిక కూడా చెప్పింది. సొంత కూతురిలాగానే తనని ముద్దుపెట్టుకున్నాడని తెలిపింది. తన అమ్మ, నాన్న కూడా ఎంతో ప్రేమతో ముద్దు చేశారని పేర్కొంది. దీనిలో ఎలాంటి తప్పు లేదని చెప్పింది. అయితే పాపోన్‌పై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో అస్సాం బాలల హక్కుల సంఘం ఈయనపై కేసు నమోదుచేసింది. -
పాపోన్ ముద్దు వివాదం : స్పందించిన మైనర్
ముంబై : ఓ మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న సింగర్ కమ్ కంపోజర్ పాపోన్ ఒక్కసారిగా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ విషయంపై బాలిక తండ్రి, సింగర్ పాపోన్నే వెనకేసుకొచ్చారు. అతడిని తప్పుగా అర్థం చేసుకోవద్దని, నా కూతురికి ఆయన తండ్రి స్థానంలో ఉండేవారని చెప్పారు. ఈ వివాదాస్పద ఘటనపై మౌనం వహించిన మైనర్ బాలిక, ఎట్టకేలకు స్పందించింది. మైనర్ బాలిక, ఇతర పోటీదారులు, వారి తల్లిదండ్రులు ఈ ఘటనపై స్పందించారు. పాపోన్ తప్పుడు ఉద్దేశ్యంతో ఏం చేయలేదని, తన సొంత బిడ్డను ముద్దు పెట్టుకున్నట్టు తనని ముద్దు పెట్టుకున్నాడని మైనర్ బాలిక చెప్పింది. తన అమ్మ, నాన్న కూడా ఎంతో ప్రేమతో ముద్దు చేశారని పేర్కొంది. దీనిలో ఎలాంటి తప్పు లేదని చెప్పింది. పాపోన్ తన కూతురికి తండ్రి లాంటి వారని, ఆ వీడియోలో ఎలాంటి తప్పు లేదని బాలిక తండ్రి కూడా పాపోన్‌పై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తన కూతురి డ్రీమ్స్‌ను పాపోన్ ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవారని పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు న్యాయవాది రునా భుయాన్.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో ఫిర్యాదు చేశాడు. పోక్సో యాక్ట్ కింద పాపోన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని భుయాన్ కోరారు. ఇలాంటి ఘటనలు చూశాక రియాల్టీ షోలలో పాల్గొనే పిల్లల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సింగర్ పాపోన్కు, ఆ టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌కు నోటీసు జారీచేసింది. ముంబై పోలీసులు ఈ విషయంపై విచారణ సాగిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పాపోన్ సమస్యను పరిగణనలోకి తీసుకుంది. -
వివాదాస్పద 'ముద్దు'పై స్పందించిన సింగర్
సాక్షి, ముంబై: 'బాలికకు అసభ్య ముద్దు' అంటూ గత కొన్నిరోజులుగా కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సింగర్ కమ్ కంపోజర్ పాపన్ అంటున్నాడు. లేనిపోని రాద్ధాంతం చేయడం వల్ల బాలిక కుటుంబంతో పాటు తన ఫ్యామిలీ చిక్కుల్లో పడుతుందని, తాను ఎలాంటి తప్పుచేయలేదని భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ వివాదానికి సంబంధించి ఓ లేఖ విడుదల చేశాడు పాపన్. పాపన్గా పేరుపొందిన అన్గరాగ్ మహంతా ఓ ఛానెల్ లో ప్రసారమవుతున్న వాయిస్ ఇండియా కిడ్స్ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. మెంటర్‌గా ఉన్న పాపన్.. హోలీ ఎపిసోడ్ అనంతరం ఓ బాలిక(11) ముఖానికి రంగురుద్ది పెదాలపై ముద్దాడాడు. దీంతో సింగర్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. బాలీవుడ్ సింగర్ లేఖలో ఏమన్నాడంటే.. 'నాకు పెళ్లయి 14 ఏళ్లయింది. సంతానంగా ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఏదైనా విషయాన్ని వెంటనే వ్యక్తం చేయడం నాకు అలవాటు. అందులో భాగంగానే ఓ 11 ఏళ్ల చిన్నారికి ముద్దు పెట్టాను. దురుద్దేశంతో చేసిన చర్య ఎంత మాత్రం కాదు. అలా అనుకుంటే నా ఫేస్బుక్ లైవ్ వీడియోగా ఎందుకు అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తానో మీరే ఆలోచించండి. ఏ తప్పుచేయలేదని భావిస్తున్నాను. ముద్దు పెట్టుకున్నందుకు క్షమాపణ అడుగుతున్నాను. ఒకవేళ నేను చేసిన దాంట్లో తప్పుందనుకుంటే ఇదివరకే నా ఫేస్బుక్లో ఆ వీడియోను డిలీట్ చేసేవాణ్ని. మీరు చేసే విమర్శలు, వ్యాఖ్యలు రెండు కుటుంబాల్లో చిచ్చు పెడుతాయి. ఓ అమాయక చిన్నారి జీవితాన్ని నాశనం చేయాలని చూడొద్దంటూ' పలు విషయాలను పాపన్ రాసుకొచ్చాడు. మరోవైపు మైనర్ బాలిక తండ్రి సైతం సింగర్ పాపన్ను వెనకేసుకొచ్చారు. 'పాపన్ కావాలని ఆ పని చేయలేదు. అతడిని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరమే లేదని' బాలిక తండ్రి ఇదివరకే స్పందించారు. తన గురించి తెలిసిన వాళ్లు పాపోన్ తప్పుచేశాడని భావించడం లేదని,ఈ వివాదంలో తన కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పాపన్ తెలిపాడు. కాగా, సుప్రీం కోర్టు న్యాయవాది రునా భుయాన్.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో సింగర్ పాపన్పై ఫిర్యాదు చేశారు. పోక్సో(POCSO) యాక్ట్ కింద పాపోన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని భుయాన్ కోరుతున్నారు. వివాదం ముదురుతున్న కొద్దీ దీనిపై సింగర్ పాపన్ లేఖ ద్వారా వివరణ ఇచ్చుకున్నాడు. -
మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్
ముంబై : సింగర్ కమ్ కంపోజర్ పాపోన్ చిక్కుల్లో పడ్డాడు. ఓ మ్యూజిక్ రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న అతను.. ఓ బాలికను ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాపోన్‌గా పేరుపొందిన అన్గరాగ్ మహంతా ఓ ఛానెల్ లో ప్రసారమవుతున్న వాయిస్ ఇండియా కిడ్స్ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకి షాన్, హిమేష్ రేష్మియాలు కూడా జడ్జిలు. మంగళవారం ఈ షోకి హోలీ ప్రత్యేక ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. ఈ సందర్భంగా హోలీ ఆడుతూ పాపోన్ ఓ బాలిక ముఖానికి రంగు పూసి పెదాలపై ముద్దాడాడు. ఆ వ్యవహారమంతా ఫేస్ బుక్ లైవ్‌లో టెలీకాస్ట్ అయ్యింది. ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు న్యాయవాది రునా భుయాన్.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో ఫిర్యాదు చేశాడు. పోక్సో(POCSO) యాక్ట్ కింద పాపోన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని భుయాన్ కోరుతున్నాడు. ఇలాంటి ఘటనలు చూశాక రియాల్టీ షోలలో పాల్గొనే పిల్లల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. కాగా, విమర్శలపై పాపోన్ ఇంతవరకు స్పందించలేదు. అస్సామీ సింగర్ అయిన పాపోన్ బర్ఫీ, సుల్తాన్, దమ్ లగా కే హైసా.. తదితర చిత్రాలతో పాపులర్ అయ్యాడు. -
రైల్వే స్టేషన్లో బలవంతంగా..
-
రైల్వే స్టేషన్లో బలవంతంగా ముద్దుపెట్టాడు
సాక్షి, ముంబై : మహిళలు అప్రమత్తంగా ఉంటున్నా మృగాలు రెచ్చిపోతున్నాయి. ముంబై పోలీసులు గస్తీ కాస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. తాజాగా మరో యువతి వేధింపులకు గురైంది. నవీ ముంబైలోని టర్బే రైల్వే స్టేషన్ లో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న ఓ యువతి వెనకాలే వెళ్లిన ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతంగా ముద్దు పెట్టేశాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో నమోదు అయ్యింది. ఆ వ్యక్తి తనను స్టేషన్ బయటి నుంచే వెంబడించాడని యువతి చెబుతోంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు కాసేపటికే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని పేరు నరేష్ కే జోషి(43)గా తేలింది. కాగా, ఘటన జరిగిన సమయంలో అక్కడే కొందరు ఉన్నప్పటికీ తమకేం పట్టనట్లు ఉండటం గమనార్హం. -
మరిచిపోయిన ముద్దు
ఒక పదిహేను నిమిషాల తర్వాత, ఇంటిముందు కారు ఆగిన చప్పుడు. పాప తలుపు దగ్గరికి వెళ్లింది. తండ్రి దిగాడు. కూతురి ముఖంలో ఆశ్చర్యం. ‘మీటింగ్‌కు ఆలస్యమవుతోంది’ అంటూ హడావుడిగా చొక్కా టక్ చేసుకుని, బ్రీఫ్‌కేస్ పట్టుకుని బయటికి వెళ్తున్నాడు తండ్రి. డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేస్తున్న పాప, తండ్రి అలికిడి విని పరుగెత్తుకొచ్చింది. అప్పటికే ఆయన కారు ఎక్కేశాడు. పాప తన ఎంగిలి చేయి వైపు చూసుకుంటూ మళ్లీ పళ్లెం వైపు నడిచింది. అంతకుముందు బాగుందనిపించిన తిండి ఇప్పుడు సహించలేదు. చేయి కడుక్కుని తండ్రికి ఫోన్ చేసింది. ‘నువ్వు వెళ్లేటప్పుడు నాకు ముద్దు పెట్టడం మరిచిపోయావు’ అన్నది. ఆ స్వరంలో కొంత నింద ఉంది. తండ్రి అది గుర్తించాడు. ‘అయ్యో నాన్నా... సారీరా... అప్పటికే లేటయిందిరా... ఇంపార్టెంట్ మీటింగ్’ వివరణలాగా పదాలను పేర్చాడు. ‘సరేలే నాన్నా’ అని పెద్దరికం తెచ్చుకుని బదులిచ్చింది పాప. ఒక పదిహేను నిమిషాల తర్వాత, ఇంటిముందు కారు ఆగిన చప్పుడు. పాప తలుపు దగ్గరికి వెళ్లింది. తండ్రి దిగాడు. కూతురి ముఖంలో ఆశ్చర్యం. దగ్గరికి వచ్చి, తను ఆ రోజుకు బాకీ పడిన ముద్దు పెట్టి, మళ్లీ కారెక్కి వెళ్లిపోయాడాయన. ఆయనకు ఆరోజు మీటింగ్ ఎంతో ప్రాధాన్యమున్నదే కావొచ్చు; కానీ రెండ్రోజులాగితే దాని గురించే ఆయన మరిచిపోవచ్చు. కానీ అదే పాప, తన తండ్రి మరిచిపోయిన ముద్దు పెట్టడానికి వెనక్కి వచ్చాడని జీవితాంతం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. జ్ఞాపకం పరంగా ఏది మరింత ప్రాధాన్యత కలిగినదో గుర్తుంచుకుని, ఆ పని మనం చేసుకుంటూ వెళ్తే చాలు. -
గొంగళి పురుగు ముద్దు
నటి రేఖ (62) జీవితంలోని ఎన్నో విషాదాలలో ఒకటి... పదిహేనేళ్ల వయసులో తనకు ఏమాత్రం ఇష్టం లేకుండా ముద్దు పెట్టించుకోవడం! ‘నో’ అని చెప్పలేక వెక్కి వెక్కి ఏడ్వడం. జీవితాంతం ఆ దుఃఖాన్ని మోస్తూనే ఉండడం! ‘లాస్ట్ టాంగో ఇన్ పారిస్’ అనే ఇటాలియన్ మూవీ 1972లో వచ్చింది. డైరెక్టర్ బెర్నార్డో బెర్తొలూచీ. ‘అంజానా సఫర్’ 1969 నాటి బాలీవుడ్ చిత్రం. దాని డైరెక్టర్ రాజా నవేథి. ఒకదానికొకటి సంబంధం లేని ఈ రెండు చిత్రాలు అకస్మాత్తుగా ఇప్పుడు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవిగా కనిపిస్తూ వార్తల్లోకి వచ్చాయి! లాస్ట్ టాంగో చిత్రంలో 19 ఏళ్ల ఫ్రెంచి నటి మారియా షినీడేర్ను రేప్ సీన్ షూటింగ్ సాకుతో ఆ చిత్ర దర్శకుడు, నటుడు కూడబలుక్కుని ‘అబ్యూజ్’ చేశారు. అంజానా సఫర్లో ఆ చిత్ర దర్శకుడు, హీరో ఒకరికొకరు కన్నుగీటుకుని 15 ఏళ్ల రేఖను ముద్దు సీన్ షూటింగ్ సాకుతో ‘అబ్యూజ్’ చేశారు. లాస్ట్ టాంగో కన్నా మూడేళ్ల ముందే అంజానా సఫర్ విడుదలైనప్పటికీ, 2013లో లాస్ట్ టాంగో డైరెక్టర్ ఆనాటి అబ్యూజ్ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టి, అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో హాలీవుడ్ నివ్వెరపోయింది. సినిమా ఫీల్డులో మహిళలు ఇంత అమాయకంగా లైంగిక దోపిడీకి గురవుతారా అనే ఒక అశ్చర్యంతో కూడిన చర్చ మొదలైంది. అదింకా కొనసాగుతుండగానే, ‘మనవాళ్లేం తక్కువా?’ అని నిఖితా దేశ్‌పాండే అనే అమ్మాయి.. ‘అంజానా సఫర్’ చిత్రం షూటింగులో డైరెక్టర్ రాజా నవేథి.. రేఖను హీరో బిస్వజీత్కు ఉద్దేశపూర్వకంగా ఎలా ‘అప్పగించిందీ’ తన ట్వీట్లో వివరంగా రాసింది. అందుకు రుజువుగా ఇటీవలే విడుదలైన రేఖ బయోగ్రఫీ (రేఖ: ది అన్‌టోల్డ్ స్టోరీ – రచన యాసర్ ఉస్మాన్) లోని ఒక పేజీని అటాచ్ చేసింది. ‘‘నవేథి యాక్షన్ అని చెప్పగానే బిస్వజీత్ పదిహేనేళ్ల రేఖను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె పెదవులపై తన పెదవులను గట్టిగా అదిమి పట్టాడు. ‘యాక్షన్’ అని చెప్పిన నవేథి ఐదు నిమిషాల తర్వాత కానీ ‘కట్’ చెప్పలేదు. ఆ ఐదు నిమిషాలలో చిన్న చిన్న బ్రేక్‌లతో ఆ ముద్దు సీన్ అలా కంటిన్యూ అయినంత సేపూ రేఖ కళ్లు మూసుకుని, బాధను ఓర్చుకుంటూ, మనసును చిక్కబట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ తర్వాత రేఖ చాలాసేపు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది’’ అని యాసర్ ఉస్మాన్ ఆ పేజీలో రాశారు. నిఖిత ట్వీట్ తర్వాత సినిమా ఫీల్డుతో పాటు ఇప్పుడు మిగతా రంగాలలోని మగవాళ్లూ భుజాలు తడుముకుంటున్నారు. ఊరికే తడుముకుంటే కాదు బాస్.. ఆత్మ విమర్శ చేసుకోవాలి. రేఖ ఆత్మకథలోని ఓ పేజీ -
ప్రముఖ కంపెనీ సీఈవో ఇలా చేశాడేంటి..!
ఓ ప్రముఖ కంపెనీ మాజీ సీఈవో చేసిన పని ఇప్పుటు హాట్ టాపిక్ గా మారింది. ఫియట్ కంపెనీ మాజీ సీఈవో లాపో ఎల్కన్ తన పక్కనే నిల్చున్న హీరోయిన్ ఉమా థర్మన్ ను దగ్గరకు లాక్కుని గాఢంగా ముద్దుపెట్టుకున్నారు. చారిటీ కార్యక్రమంలో ఇలాంటి దిగజారుడు పనులు వ్యాపార దిగ్గజం చేయడంపై అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ఎయిడ్స్ రీసెర్చ్ వారు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఉమా థర్మన్ సంయుక్తంగా ఈవెంట్ నిర్వహించారు. ఎయిడ్స్ బాధితులకు సహాయార్థం విరాళాలు సేకరించేందుకు ఏర్పాటుచేసిన ఈవెంట్ లో ఫ్యాషన్ షో టిక్కెట్లు కూడా విజేతలకు అందజేశారు. విక్టోరియా ఫ్యాషన్ షోకు సంబంధించి ఆయన 1.32 కోట్ల రూపాయలు (1.96 లక్షల అమెరికా డాలర్లు) గెలుపొందారు. దీంతో తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఓ వింత మార్గాన్ని ఎంచుకున్నారు. ఈవెంట్ నిర్వహిస్తోన్న నటి థర్మన్ ను దగ్గరికి ఆమెతో లాక్కుని బలవంతంగా లిప్ లాప్ చేశారు. ఊహించని ఘటనతో ఆమె షాక్ కు గురైనా వెంటనే కోలుకుంది. ముద్దుపై స్పందించలేదు కానీ, తీవ్ర అసహనానికి గురైనట్లు మాత్రం తెలుస్తోంది. స్మోక్ చేస్తున్న ఎల్కన్ అవకాశవాది అని అందుకే అవకాశాన్ని వాడుకున్నాడని లెస్సీ స్లోనే అనే ఆర్గనైజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్మన్ కూడా ముద్దు విషయంపై హ్యాపీగా లేదని చెప్పింది. ఆమె అనుమతి లేనిదే ఇలాంటి దిగజారుడు చర్యకు ఇటలీ వ్యాపారవేత్త సాహసించాడంటూ మండిపడింది. -
హవ్వా.. అమ్మాయి గాఢంగా చుంబిస్తూ..
లండన్: ఒక షాకింగ్ ఫొటో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్ చల్ చేస్తోంది. ఓ అమ్మాయి అదరాలను ప్రముఖ హాలీవుడ్ టీవీ స్టార్ మార్ని సింప్సన్ గాఢంగా చుంబిస్తున్నట్లున్న ఆ ఫొటో ఆమె అభిమాని ఖాతాలో దర్శనమిస్తూ చర్చనీయాంశంగా మారింది. సింప్సన్ ఓ బైసెక్సువల్ పర్సన్ అనే విషయం ఇటీవల వార్తలు గుప్పుమనడంతోపాటు అదే విషయం స్పష్టమైంది. అయితే.. కొందరుమాత్రం ఆమె అలాంటిది కాదని అనుకుంటున్నారు. కానీ, ఈ ఫొటో చూసిన ఎవరైనా నిజంగానే ఆమె బై సెక్సువల్ అని అనుకోవాల్సిందే. అర్ధనగ్నంగా డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి చైర్లో కూర్చొని ఉండగా ఆమెను అమాంతం అదిమిపెట్టి మార్ని సింప్సన్ ముద్దుపెడుతూ కనిపించింది. ఈ దృశ్యానికి సంబంధించిన ఫొటో ఒకటి శనివారం ఇన్ స్టాగ్రమ్ ద్వారా వెలుగులోకి వచ్చి హల్ చల్ చేస్తోంది. -
సింహానికి ముద్దు పెడితే..
సింహాలను చూసి క్రూర జంతువులని భయపడటం సహజం. అవి జూలో బంధించి ఉన్నా కూడా వాటి దగ్గరికి పోవడానికి పిల్లలు, పెద్దలు ఎవరైనా తటపటాయించాల్సిందే. కానీ జూలో ఉన్న సింహాన్ని చూసి ఒక చిన్నారి చాలా ముచ్చటపడింది. అంతకన్నా మురిపెంగా గాల్లోకి ముద్దులు విసిరింది. దీంతో సింహం వైపునుంచి వచ్చిన రియాక్షన్ చూసి ఆశ్చర్య పోవడం అక్కడున్న వారి వంతైంది. అచ్చం అలవాటైన పెంపుడు జంతువులాగా ప్రేమను చూపించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆ ఆ వీడియో ఎక్కడదనేది మాత్రం తెలియరాలేదు. -
మొదటి లిప్‌లాక్ సీన్ ఏదో తెలుసా?
ముంబై: సిల్వర్ స్క్రీన్ పై మొదటి లిప్‌లాక్ సీన్ ఎపుడు చిత్రీకరించారో తెలుసా? మూకీ సినిమాల టైంలోనే ఈ సీన్లను హీరో హీరోయిన్లు పండించారంటే నమ్ముతారా? ఈ వివరాలతో కూడిన రెండు వీడియోలు ఇపుడు మళ్లీ యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. తరతరాలుగా సినిమాలలో ముద్దు సీన్లకున్నంత ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నానాటికీ ఈ సీన్ల గాఢత,నిడివి పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అయితే 60, 70లలో వచ్చిన సినిమాలలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను సింబాలిక్‌గా చూపించడం మనకు తెలుసు. రెండు పువ్వులను కలపడం ద్వారా ముద్దు సీన్ ను పండించడం ఆప్పటి సినిమాల్లో చూసిందే. అయితే 1929లో అంటే మూకీ సినిమాల కాలంలోనే చుంబన దృశ్యాలు ఉన్నాయంటే నమ్మగలమా.. కానీ ఇది నిజం. 'ఎ థ్రో ఆఫ్ డైస్' అనే సినిమాలో ఓ లిప్ లాక్ సీన్ ను చిత్రించారు. సీతాదేవి, చారు రాయ్ మధ్య ఈ అరుదైన సన్నివేశాన్ని షూట్ చేశారట. ఆ తరువాత ఈ కోవలో చెప్పుకోదగ్గది కర్మ సినిమాలోనిది. దేవికా రాణి, హిమాంశు మధ్య ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని చిత్రించారు. 1933లో వచ్చిన ఈ సినిమాలో భారతీయ సినిమాల్లో సుదీర్ఘ ముద్దు సీన్లలో ఒకటిగా నిలిచిందట. నాలుగు నిమిషాల పాటు సాగిన ఈ దృశ్యం అప్పట్లో పెద్ద సంచలనం. అయితే ఈ సినిమాలో దేవికా రాణి, హిమాంశు రాయ్ భార్యభర్తలు కావడం విశేషం. -
కిస్ చేస్తూ ప్రియుడి నాలుకను కొరికేసింది!
హార్ట్ఫోర్డ్: గాఢమైన చుంబనంలో విచక్షణను కోల్పోయిన ఓ మహిళ ప్రియుడి నాలుకను కొరికేసింది. హఠాత్పరిణామంతో బిత్తరపోయిన ప్రియుడు తెగిపోయిన నాలుక ముక్కను చేతబట్టుకొని హుటాహుటిన ఆసుపత్రికి పరిగెత్తిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అమెరికాలోని కనెక్టికట్‌లో హార్ట్ఫోర్డ్ సిటీలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. షకియా లాంగ్(37) అనే మహిళ తన ప్రియుడు డ్వేన్ విలియమ్స్(41)తో కలిసి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఇంట్లో మత్తు పదార్థాలను మోతాదుకు మించి తీసుకున్న అనంతరం విలియమ్స్‌ను కిస్ చేస్తూ.. షకియా లాంగ్ అతని నాలుకను కొరికేసింది. ఒక్కసారిగా నాలుక తెగిపోవడంతో బయటకు పరిగెత్తిన విలియమ్స్ అటుగా వెళ్తున్న పోలీసు సహాయంతో ఆసుపత్రికి చేరినట్లు స్థానిక పత్రిక వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు షకియాపై కేసునమోదు చేశారు. తెగిపడిన నాలుకకు వైద్యులు అతికష్టం మీద అతికించారు. ఘటన జరిగిన సమయంలో చాలా రక్తం పోయిందని విలియమ్స్ పోలీసులకు తెలిపాడు. మార్చ్ 31న ఈ కేసుకు సంబంధించి షకియా కోర్టుకు హాజరుకానుంది. అయితే ఆసమయంలో విలియమ్స్ గాయపడిన సంగతే తనకు తెలియదని షకియా చెబుతుండటం విశేషం. -
ఆ ముద్దు హల్చల్ చేస్తోంది!
లండన్: 'టైటానిక్' హీరో లియోనార్డ్ డికాప్రియో అవార్డు ఫంక్షన్లలో ఏం చేసినా అది వైరల్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల వేడుకలో ఆయనను పాప్ సింగర్ లేడీ గాగా విరుసుగా తోసుకొనిపోవడం.. అది చూసి లియోనార్డ్ బిత్తరపోవడం తెలిసిందే. ఆ వీడియో అప్పట్లో ఆన్లైన్లో బాగానే హల్చల్ చేసింది. ఈసారి బాఫ్టా అవార్డుల వేడుక ఈ వైరల్‌కు వేదిక అయింది. ప్రేమికుల రోజు సందర్భంగా తొలిసారి ఈ వేడుకలో 'కిస్ క్యామ్'ను ప్రవేశపెట్టారు. అయితే, ఊహించినట్టు ప్రేమికులుగా భావిస్తున్న మైఖేల్ ఫాస్బెండర్, అలిషియా వికాండర్ మాత్రం ఈ 'కిస్ క్యామ్' ఫోకస్ అయిన సందర్భంగా ముద్దు పెట్టుకోలేదు. ఇది అందరినీ ఒకింత నిరాశపరిచింది. అయితే ఈ లోటును డికాప్రియో చాలా తెలివిగా పూడ్చాడు. 81 ఏళ్ల డామ్ మ్యాగీని, 41 ఏళ్ల లియోనార్డోని ఒకేఫ్రేములో ఈ కెమెరా ఫిక్స్ చేయగానే.. ఊహించనిరీతిలో లియోనార్డో ముందుకొచ్చి మ్యాగీని ఆత్మీయంగా ముద్దాడారు. 'హ్యారీపోటర్' సినిమాలో కీలక పాత్రలో నటించిన మ్యాగీ కూడా ఈ కిస్‌ను ఆత్మీయంగా స్వీకరించారు. ఇది ఊహించినట్టే ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. 'కిస్ క్యామ్'ను ఫాస్బెండర్, వికండర్ జోడీ మాత్రమే నిరాశపరిచింది. బ్రయాన్ క్రాంస్టన్-జూలియన్ మూర్, రెబెల్ విల్సన్-ఎడ్డీ ఇజార్డ్ జంటలు ఈ క్యామ్‌లో చుంబనాలతో ఆహూతులను అలరించాయి. బాఫ్టా అవార్డుల వేడుకలో లియోనార్డో డికాప్రియో హీరోగా నటించిన 'రెవెనంట్' మరోసారి దుమ్మురేపింది. ఈ సినిమాను ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులు వరించాయి. Maggie Smith and Leonardo DiCaprio on the BAFTA Kiss Cam pic.twitter.com/A6TuSIdksx — Leo DiCaprio News (@NewsDiCaprio) February 14, 2016 -
మగవారి ముద్దు ఫోటోతో రచ్చ రచ్చ
ఇస్లామాబాద్: పురుషులిద్దరు ముద్దు పెట్టుకుంటున్న ఫోటో.. ముద్రించకుండా ఖాళీగా వదిలేసిన స్థానిక యాజమాన్యం..దీంతో ప్రపంచ వ్యాప్తంగా భావప్రకటన స్వేచ్ఛ పై మరోసారి చర్చ. ముందు పేజిలో ఖాళీ స్థలంతో ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ ఆర్టికల్‌ను శుక్రవారం ప్రచురించడంతో వివాదానికి తెర లేపింది. ఇంటర్ నేషనల్ న్యూయార్క్ టైమ్స్‌కు అనుబంధంగా పాకిస్తాన్‌లోని స్థానిక పత్రిక ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ నడుస్తోంది. చైనాలో ట్రాన్స్ జెండర్ హక్కుల కోసం న్యూయార్క్ టైమ్స్ ఓ ఆర్టికల్‌ను ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్కు పంపింది. ఆ ఆర్టిక్టల్తో పాటూ చైనాలోని ఓ యువకుడు మరో పురుషుడికి చెంపపై ముద్దు పెట్టుకొంటున్న ఫోటోను ప్రచురించాలి. కానీ, ఆ ఆర్టికల్ మాత్రమే ప్రచురించి ఆ ఫోటో స్థానాన్ని ఖాళీగా వదిలేశారు. అది కూడా ముందు పేజీలో. దీంతో న్యూయార్క్ టైమ్స్ పాఠకులు ఉదయం లేచి చూడగానే పేపర్ ముందు పేజీలో బ్లాంక్‌గా కనిపించింది. 'పాకిస్థాన్‌లోని మా ముద్రణ భాగస్వామి ఆ ఫోటోను తొలగించారు. ఫోటోను తీసివేయడం వెనక ఎడిటోరియల్ స్టాఫ్‌కు ఎలాంటి ప్రమేయం లేదు' అని ఇంటర్నేషనల్ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఆ ఫోటో ప్రచురిస్తే స్థానికంగా ఇబ్బందులు తలెత్తేవని ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ ఎడిటర్ కమల్ సిద్దికీ తెలిపారు. పురుషులు ముద్దు పెట్టుకునే ఫోటోలను పాకిస్తాన్లో మీరు ఎక్కడా చూడరు. పురుషులే కాదు ఎవరైనా ముద్దు పెట్టుకునే ఫోటోలు ఎక్కడా కనిపించవని ఆయన పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో న్యూయార్క్ టైమ్స్ పంపిన మరో ఆర్టికల్‌ను కూడా ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ సెన్సార్ చేసింది. బంగ్లాదేశ్‌లోని కొన్ని అతివాద సంస్థలకు సంబంధించిన ఆ ఆర్టికల్‌లో దైవ దూషణ వ్యాఖ్యలు ఉండటం వల్ల దాన్ని సెన్సార్ చేసినట్టు న్యూయార్క్ ట్రైమ్స్ పబ్లిక్ ఎడిటర్ మార్గరేట్ సల్లీవన్ తెలిపారు. డిజిటల్ యుగంలో కూడా పత్రికలు బ్లాంక్ పేజీలు ప్రచరించడం భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డు అని మార్గరేట్ అభిప్రాయపడ్డారు. అయితే ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ ఎడిటర్ సిద్దికీ తన పని తీరు పై ఈ మెయిల్ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు...ఇస్లామిక్ తీవ్రవాదులు పాకిస్థాన్‌లోని జర్నలిస్ట్‌లను తరచుగా టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. పాశ్చాత్య సంస్కృతిని దేశంలో ప్రవేశపెడుతున్నారన్న ఆరోపణలతో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, 2014లో తమ సంస్థలోని ముగ్గురు జర్నలిస్ట్‌లను తీవ్రవాదులు హత్య చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. సెన్సార్ చేయడాన్ని మీకన్నా ఎక్కువగా నేనే ఖండిస్తున్నాను. కానీ, ఇక్కడి స్థానిక పరిస్థితుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇస్లాం భావజాలానికి వ్యతిరేకంగా ఆర్టికల్స్, కార్టూన్స్, ఫోటోలను ప్రచురించినందుకు 2001 నుంచి ఇప్పటి వరకు 71 మంది జర్నలిస్ట్‌లు హత్యకు గురయ్యారు. ఇస్లాంను ఆధారంగా చేసుకొని రాజ్యాంగాన్ని రూపొందించుకున్న పాకిస్థాన్, సౌదీ అరేబియా, ఇరాన్‌లాంటి దేశాల్లో స్వలింగ సంపర్కంపై అంతగా అవగాహన లేదు. 2011లో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ట్రాన్స్ జెండర్ జనభాను అధికారికంగా గుర్తించింది. వారికి ప్రస్తుతం ఓటు హక్కును కూడా కల్పించారు. -
రెడ్ కార్పెట్‌పై లేడి గాగా ఘాటు ముద్దు!
ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా పాప్ సింగర్ లేడీ గాగా, ఆమె ఫియాన్సీ టైలర్ కిన్నీ సందడి చేశారు. ఇటీవల 'వీ' మ్యాగజైన్ కోసం పూర్తి నగ్నంగా పోజిచ్చి.. సంచలనం సృష్టించిన ఈ జంట గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్‌పై కలిసి నడిచింది. ఈ సందర్భంగా ఇరువురు పెదవులు కలుపుతూ ఓ ముద్దు పెట్టుకొని తమ మధ్య అనుబంధాన్ని చాటుకున్నారు. తన సహజ ధోరణికి కాస్త భిన్నంగా నలుపు రంగు దుస్తుల్లో చూడచక్కగా ముస్తాబై లేడీ గాగా ఈ కార్యక్రమానికి హాజరైంది. అన్నట్టు గోల్డెన్ గ్లోబ్ ప్రదానోత్సవంలో లేడీ గాగాను కూడా ఓ పురస్కారం వరించింది. అమెరికన్ హర్రర్ స్టోరీ 'హోటల్'లో నటించినందుకు టీవీ మూవీ కేటగిరీలో ఉత్తమ నటి అవార్డు ఆమెకు దక్కింది. KISS ME DAMN IT @TaylorKinney111 @ladygaga #GoldenGlobes pic.twitter.com/oZSuOEPro5 — Scoopla (@Scoopla) January 11, 2016 -
ఒంటెకు ముద్దిచ్చిన కోడలు.. ఒంటికాలిపై లేచిన అత్త
మనామా: సౌదీ అరేబియాలోని ఒక కుటుంబంలో ఓ ఒంటె చిచ్చుపెట్టింది. పచ్చగా ఉన్న ఓ భార్యభర్తల కాపురంలో భగ్గుమనేమంటలు రేగేలా చేసింది. తన కోడలు ఓ ఒంటెను ముద్దు పెట్టుకుందని ఆమెకు వెంటనే విడాకులు ఇవ్వాలని ఓ అత్తగారు తన కుమారుడిపై పెద్దపెద్దమాటలతో చిందులేసింది. ప్రారంభంలో ఆ విషయంలో వివాదంగా మారినా చివరకు సుఖాంతమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే సౌదీ అరెబియాకు చెందిన ఇద్దరు భార్యభర్తల్లో భార్య ఈ మధ్య ఓ ఒంటెకు ప్రేమగా ముద్దుపెట్టింది. అది చూసిన అత్తగారు ఒంటికాలుపై లేస్తూ మతాన్ని అవమానించావని, సామాజిక కట్టుబాట్లు దాటావని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా వెంటనే ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా తన కొడుకుపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీనిపై ఒంటెను ముద్దు పెట్టుకున్న ఆ కోడలు స్పందిస్తూ తాను ఒంటెను ముద్దుపెట్టుకోవడం వెనుక వేరే ఉద్దేశం లేదంది. కేవలం అమాయమైన జంతుప్రేమమాత్రమే ఉందని, తన అత్తగారు అసలు దాడి చేయడానికి అసలు కారణం అది కాదని, తనకు ఇప్పటి వరకు పిల్లలు లేరనే ఆగ్రహంతోనే ఆమె అలా అన్నారని చెప్పింది. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆమె పుట్టింటికి కూడా వెళ్లిపోయింది. అయితే, తన భార్యను అర్ధం చేసుకున్న భర్త ఆమె తప్పే లేదని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. తల్లి ఒక గదిలో ఉంటుండగా వారిద్దరు వేరే గదిలో ఉంటున్నారు. అయితే, తన భర్తతో ప్రశాంతంగా ఉండాలనే తానెప్పుడూ కోరుకుంటానని ఆ కోడలు చెప్పుకొచ్చింది. -
ముద్దు పెట్టుకున్న కేసులో పదేళ్ల జైలు..
అమీర్‌పేట: పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని ముద్దు పెట్టుకున్న కేసులో నిందితుడికి కోర్టు 10 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించిందని ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ పి.సతీష్ తెలిపారు. వెంగళరావునగర్‌లోని నలంద పాఠశాలలో క్లర్క్‌గా పనిచేసే హరగోపాల్ డిసెంబర్ 2014న పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిని పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై 376, పోక్స్యాక్ట్ కింద కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరళించారు. నాంపల్లి సిటీసివిల్ కోర్టులో విద్యార్థి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ వచ్చారు. 1వ తరగతి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి నిందితుడు హరగోపాల్ కేసును విచారించి అతడికి పదేళ్ల జైలుశిక్ష, రూ. 5వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు. -
'నా భార్యను ముద్దు పెట్టుకోనీయడం లేదు'
లండన్: ‘నా ఇష్టమున్నంత సేపు నా భార్యను ముద్దు పెట్టుకోనీయడం లేదు. కేవలం రెండు క్షణాల పాటే ముద్దు పెట్టుకోవాలట. అది కూడా రెండంటే రెండు సార్లేనట. ఆమెతో మనసువిప్పి మాట్లాడనీయడం లేదు. ఆమె పక్క సర్దనీయడం లేదు. ఆమెకు ఎలాంటి సేవలు చేయనీయడం లేదు. పండగకో, పబ్బానికో ఆమెను నా ఇంటికి పంపకపోయినా ఫర్వాలేదు. కనీసం ఆమె పుట్టిన రోజునాడైనా నా ఇంటికి పంపించడం లేదు. కేర్ హోంలో వున్న నా భార్యను చూడడానికి వెళ్లినప్పుడల్లా కేర్ హోం సిబ్బంది నా పక్కనే ఉంటున్నారు. నేనేమీ మాట్లాడుతున్నానో రాసుకుంటున్నారు. నాకెలాంటి ప్రైవసీ కల్పించడం లేదు. అక్కడున్నంత సేపు నాకు జైల్లో ఉంటున్నట్టు ఉంది. ఇక నేనెందుకు బతకాలో నాకర్థం కావడం లేదు’ అని భార్యంటే పంచ ప్రాణాలుగా భావించే ఓ భర్త ఆవేదన ఇది. లండన్‌లోని డెర్బీ సిటీలో నివసిస్తున్న థామస్ మిడిల్టన్ ఆక్రందన ఇది. మానవ హక్కుల పేరిట తనకు కలిగిస్తున్న బాధను న్యాయపోరాటం ద్వారానే ఎదుర్కోవాలని సిద్ధపడ్డ ఓ 87 ఏళ్ల తాతయ్య కన్నీటి గాధ ఇది. ఈ తాతయ్య భార్య జాన్‌కు ప్రస్తుతం 84 ఏళ్లు. పెళ్లయిన నాటి నుంచి ఈ దంపతులు ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా బతకలేదు. 2010లో ఆమెకు డిమెన్షియా, పార్కిన్సన్ అనే మెదడు సంబంధిత వ్యాధులు వచ్చాయి. ఆమెకు ఎవరిని గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది. వారికి ముగ్గురు పిల్లలు. వారు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిపోయారు. అప్పటి నుంచి రోగగ్రస్థురాలైన భార్యను తానే చూసుకుంటూ వచ్చాడు తాతయ్య. పెన్షనరైన తాతయ్య ఈ వయస్సులో భార్యను సరిగ్గా చూడలేడని భావించిన డెర్బీ సిటీ కౌన్సిల్ సిబ్బంది వచ్చి ఆమెను 2010, సెప్టెంబర్ 4వ తేదీన కేర్ హోంకు తరలించారు. అప్పటి నుంచి తాతయ్య ప్రతి రోజు పొద్దున్నే కేర్ హోంకు వెళ్లడం, రాత్రి వరకు ఆమెతో గడిపి తిరిగి రావడం పరిపాటిగా మారిపోయింది. తాతయ్య గంటల తరబడి భార్యను ముద్దు పెట్టుకుంటున్నాడని, ఆమె ఇబ్బంది ఫీలవుతున్నదని కేర్ హోం యాజమాన్యం సిటీ కౌన్సిల్ కోర్టుకు ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన కోర్టు 2012లో తాతయ్యపై ఆంక్షలు విధించింది. కేర్ హోంకు వెళ్లినప్పుడు భార్యను చూసి రావాలే తప్ప ఆమెను ముద్దు పెట్టుకోకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. డిమెన్షియా, పార్కిన్సన్ వ్యాధులతో బాధ పడుతున్నందున ఆమె తన నిర్ణయం తాను తీసుకోలేని పరిస్థితిలో ఉన్నందున, ఆమె పట్ల ఏ విధంగా ప్రవర్తించినా అది ఆమె మానవ హక్కులను కాలరాయడమే అవుతుందని ఆ ఉత్తర్వుల్లో కోర్టు హెచ్చరించింది. దీంతో హతాషుడైన తాతయ్య ‘క్రౌండ్ ఫండ్’ వెబ్సైట్ విరాళాల ద్వారా కోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారు. కోర్టు కేసు కొట్లాటకు కావాల్సిన కరెన్సీ లేకపోవడం వల్ల కేసు విచారణ మధ్యలోనే తాతయ్య రాజీకీ రావాల్సి వచ్చింది. రాజీలో భాగంగా సిటీ కౌన్సిల్ కోర్టు 2014, ఆగస్టు నెలలో తాతయ్యకు ఓ ఎనిమిది అంశాల ప్రవర్తనా నియమావళిని నిర్దేశించింది. రోజుకు రెండు గంటలకు మించి భార్య పక్కన ఉండరాదని, కేర్ హోం సిబ్బంది పక్షంలోనే భార్యను కలుసుకోవాలని, వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు రెండు సార్లు, రెండు క్షణాలపాటు మాత్రమే ఆమెను ముద్దు పెట్టుకోవాలని ఆ నియమావళిలో పేర్కొంది. అప్పటి నుంచి తాతయ్య మానసిక ఆందోళన పెరుగుతూ వచ్చింది. భార్యను కేర్ హోంలో ఉంచాల్సిన అవసరమే లేదని, ఇంటికి పంపిస్తే తానే చూసుకుంటానని మొరపెట్టుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. దీనికన్నా తాను చచ్చిపోవడమే మేలని బాధ పడుతున్న తాతయ్య కథ తెలిసి ఓ ఎన్జీవో సంస్థ రంగ ప్రవేశం చేసింది. తాతయ్య తరఫున కౌన్సిల్ కోర్టు ఉత్తర్వులపైనా అప్పీల్ చేసింది. కేసుపై తీర్పు వెలువడితే మానవ హక్కుల ఉల్లంఘనకు సరైన భాష్యం వస్తుందని తాను భావిస్తున్నానని తాతయ్య కాస్త సంతృప్తి వ్యక్తం చేశారు. తాతయ్య తన జీవితంలో భార్యను విడిచి ఒక్క క్షణం బతికిన సందర్భాలు తనకు తెలిసి లేవని, వారానికి ఐదు రోజులు భార్యను తీసుకొని డ్యాన్సింగ్ ఫ్లోర్‌కు వెళ్లేవాడని, ఇక ఒంటరి జీవితాన్ని గడపలేక పోతున్నాడని, తాతయ్యకు అనుకూలంగా తీర్పు వస్తుందని తాను భావిస్తున్నానని తాతయ్య అన్న డేవిడ్ (90) ఆశాభావం వ్యక్తం చేశారు.