బాలీవుడ్లో సన్నీడియోల్, అమీషా పటేల్ నటిస్తున్న 'గదర్-2' వివాదానికి దారి తీసింది. ఈ సినిమాలో సిక్కుల పవిత్ర స్థలం అయిన గురుద్వారాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఆ సీన్లలో ముద్దు సన్నివేశాలతో పాటు కౌగిలింతలకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ సంఘటన వల్ల గురుద్వారా నిర్వాహకులతో పాటు సిక్కు మతస్థులు చిత్ర యూనిట్‌పై ఫైర్ అవుతున్నారు. దేవుడిని నమస్కరించే సీన్ షూట్ చేస్తామని చెప్పి అనుమతులు తీసుకున్నారని గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్ తెలిపారు.
(ఇదీ చదవండి: కుటుంబ పోషణ భారమై డ్రైవర్‌గా మారిన హీరో? నిజమేంటంటే?)
కొన్నిరోజుల క్రితం తిరుపతిలో కృతిసనన్ చెంపపై ఓం రౌత్ ముద్దు పెట్టడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరిచిపోక ముందే ఇదే తరహాలో మరోకటి జరగడంతో ఛీ.. ఛీ దేవాలయాల్లో ఇవేం పనులు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. కనీసం వారు క్షమాపణలు చెబితే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు. ఇక పోతే, తెలుగులో అమీషా పటేల్ పవన్ సరసన 'బద్రి'తో మెప్పించింది. ఆ తరువాత మహేష్‌తో నాని, ఎన్టీఆర్‌తో నరసింహుడులో నటించిన విషయం తెలిసిందే.
(ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment