ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ (Udit Narayan)పై తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు వచ్చిన మహిళ అభిమానులకు ముద్దులు పెట్టి వార్తల్లో నిలిచారు. అంతేకాకుండా ఓ మహిళ అభిమానికి ఏకంగా లిప్ లాక్ కిస్ ఇవ్వడంతో ఆయనపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఆయన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 69 ఏళ్ల వయసులో ఇలాంటి పనులేంటని నిలదీస్తున్నారు. గతంలోనూ ఆయన చాలాసార్లు అలానే ప్రవర్తించారు. గతంలోనూ ఉదిత్.. సింగర్స్ అల్కా యాగ్నిక్, శ్రేయో ఘోషల్ అనుమతి లేకుండా వారికి ముద్దు పెట్టాడు.
తాజాగా తనపై వస్తున్న విమర్శలపై ఉదిత్ నారాయణ్ స్పందించారు. అభిమానులతో అలా ప్రవర్తించినందుకు తనకేలాంటి బాధలేదని అంటున్నాడు. సోషల్‌మీడియాలో వచ్చిన వీడియోల్లో మీరు చూసింది మా మధ్య ఉన్న ప్రేమకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. దీనిపై చింతించాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదంటున్నాడు. వారు నన్ను అభిమానించడం వల్లే నా ప్రేమను తెలియపరిచానని వెల్లడించారు. నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేనప్పుడు బాధపడాల్సిన అవసరం కూడా లేదన్నారు.
(ఇది చదవండి: అభిమానితో సింగర్ ముద్దులాట.. ఈ వయసులో ఇదేం పని?)
ఉదిత్ నారాయణ్ మాట్లాడుతూ..'నా కుటుంబానికి చెడ్డపేరు తీసుకువచ్చే పని ఎప్పుడూ చేయలేదు. సోషల్‌మీడియాలో వీడియోల్లో కేవలం అభిమానులపై నేను చూపిస్తున్న ప్రేమ. వాళ్లు నన్ను ఏలా ప్రేమిస్తున్నారో..అలాగే వారిని కూడా ప్రేమిస్తున్నా. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఎక్కడుంది? నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. నేను వారి వల్లే మరింత ఫేమస్ అయ్యా' అని అన్నారు.
కాగా.. ఉదిత్ కొన్నిరోజుల క్రితమే లైవ్ కన్సర్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళా అభిమానులు ఆయనతో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఉదిత్ నారయణ్ వారికి ముద్దులు పెట్టాడు. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు.
ఉదిత్ నారయణ్ తెలుగులో పలు చిత్రాలకు పాటలు పాడారు. బాలీవుడ్ సింగర్ అయినప్పటికీ ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు ఆలపించాడు. నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది
Comments
Please login to add a commentAdd a comment