ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ (Udit Narayan)పై నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఓ మహిళా అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఈయన ఏకంగా లిప్‌కిస్ ఇవ్వడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో ఉదిత్.. సింగర్స్ అల్కా యాగ్నిక్, శ్రేయో ఘోషల్ అనుమతి లేకుండా వారికి ముద్దు పెట్టాడు.
లైవ్ షోలో..
తాజాగా వైరలవుతున్న వీడియోలో ఉదిత్.. స్టేజీపై లైవ్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. ఇంతలో ఓ మహిళా అభిమాని అతడితో సెల్ఫీ తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ఫోటో తీసుకోవడంతో పాటు సింగర్ చెంపను ముద్దాడింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఉదిత్.. ఏకంగా ఆమె పెదాల్ని ముద్దాడాడు. ఊహించని చర్యతో అభిమాని నోరెళ్లబెట్టింది.
ఈ వయసులో ఇదేం పని?
69 ఏళ్ల వయసులో ఇలాంటి పనులేంటని జనాలు మండిపడుతున్నారు. కూతురి వయసున్నవారితో ఇలాగేనా ప్రవర్తించేంది? నీ పేరు నువ్వే చెడగొట్టుకుంటున్నావ్.. ఛీ, ఇంత చీప్ అనుకోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొందరు మాత్రం మొదట ఆ అమ్మాయే తనంతట తానుగా సింగర్ దగ్గరకు వెళ్లిందని.. ఇందులో ఆమె తప్పు కూడా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అటు సింగర్‌కు, ఇటు షోలో అతడి దగ్గరకు వెళ్లిన అమ్మాయిలకు సిగ్గు లేదని తిట్టిపోస్తున్నారు.
ఉదిత్ నారాయణ్ బాలీవుడ్ సింగర్. ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు ఆలపించాడు. నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది.
Can't believe veteran Singer Udit Narayan behaving so lewd in a live concerts show 😔
But my question is
Who's more disgusting - Female Audiences or the Artist #UditNarayan? #shameless pic.twitter.com/W6epY8Nmr4— Filmi Woman (@FilmiWoman) February 1, 2025
Comments
Please login to add a commentAdd a comment