Live Performance
-
పబ్‌లో.. ఫస్ట్ టైమ్!
సాధారణంగా సిటీలో పబ్స్, క్లబ్స్‌లో కని/వినపడే డీజేలు, బ్యాండ్స్, సింగర్స్... ఎక్కువగా పాశ్చాత్య పోకడలకు ప్రతీకగా ఉంటారు. వెస్ట్రన్ మ్యూజిక్‌ని ఇష్టపడే యువతను మెప్పించడం వీరి వల్లే సాధ్యమని ఈవెంట్ మేనేజర్లు భావిస్తుండడం వల్ల ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఇటీవలే వీరి స్థానంలో హిందీ, తెలుగు సంగీతాన్ని అందించే బ్యాండ్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది.ఆ థోరణి మరింత బలపడి ఇప్పుడు ఏకంగా తెలుగు గాయనీ గాయకులకు కూడా పబ్స్ రెడ్ కార్పెట్ పరుస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో వియ్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితురాలైన ప్రముఖ గాయని గీతా మాధురి తన సొంతంగా సమకూర్చుకున్న బ్యాండ్‌తో కలిసి తొలిసారి నగరంలోని ప్రిజ్మ్ పబ్‌లో శుక్రవారం సాయంత్రం సోలో ప్రదర్శన ఇవ్వనున్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రపంచాన్నే మన పాట పాలిస్తోంది.. ఇక పబ్స్‌లో తెలుగు పాట వినిపించడంలో ఆశ్చర్యమేముంది? అంటున్నారు ప్రముఖ నేపథ్యగాయని గీతా మాధురి. ‘సాక్షి’తో పంచుకున్న ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...సోలోగా...ఇదే తొలిసారి.. నగరంలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది పెళ్లిళ్ల నుంచి పార్టీల వరకూ చాలా రకాల కార్యక్రమాల్లో నాకు అనుభవమే. అయితే మోడ్రన్ కల్చర్‌కు కేరాఫ్‌గా ఉండే యూత్ సమక్షంలో ఒక పబ్‌లో సోలోగా పాడడం ఇదే తొలిసారి. అదీ సొంతంగా ఒక బ్యాండ్‌ను సమకూర్చుకుని, వారితో కలిసి రిహార్సిల్స్ చేసి పబ్ షోలో పాడడం కొత్త అనుభవమే. అభిమానుల స్పందన తెలుస్తుంది... అలాగే కార్పొరేట్, కాలేజ్ షోస్ వంటివి కొందరికి మాత్రమే పరిమితమయ్యేవి, అలా కాకుండా ఈ తరహా పబ్లిక్ ఈవెంట్స్ వల్ల ప్రయోజనం ఏమిటంటే.. అభిమాన గాయనీ గాయకుల పాటలు వినాలనుకునే ఎవరైనా షోకి హాజరుకావ్వొచ్చు. అలా మాకు కూడా మా అభిమానుల స్పందనను దగ్గరగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. బ్యాండ్ స్టైల్ అంటే ఇదే... సాధారణంగా లైవ్ పెర్ఫార్మెన్స్లో పూర్తి స్థాయి వాద్య బృందంతో కలిసి పాడతాం. అయితే పబ్‌లో మాత్రం ఇద్దరు గిటారిస్ట్, డ్రమ్మర్, కీబోర్డ్ ప్లేయర్.. ఇలా ఓ ముగ్గురు నలుగురు మాత్రమే ఉంటారు. ఆర్కె్రస్టాతో పాడేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా పాడతాం.. అయితే ఇందులో 3, 4 పాటలు కలిపి బ్యాకింగ్ కొంచెం మార్చి.. ఇలా ఎక్స్‌పిరిమెంటల్ టైప్‌లో ఉంటుంది. ఓ రకంగా పాపులర్ సాంగ్‌ని కొత్త ఫ్లేవర్‌లో వినిపించడమే బ్యాండ్ స్టైల్ అనొచ్చు. మన పాట ప్రపంచవ్యాప్తం... మన తెలుగు పాటలు ప్రపంచం అంతా ఒక ఊపు ఊపుతున్నాయి. కాబట్టి సిటీలో కూడా పబ్ క్లబ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో తెలుగు, హిందీ పాటలు పాడడానికి సిద్ధమవుతున్నా..అయితే అక్కడకు వచ్చే క్రౌడ్‌ని బట్టి వారి టేస్ట్‌ని బట్టి అప్పటికప్పుడు పాడాల్సి ఉంటుంది.భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్స్‌లో పూర్తి స్థాయిలో ఒక పాటల జాబితా ఇచ్చి, దాని ప్రకారం పాడాలనే ఆలోచన ఉంది. ఇక పర్సనల్ లైఫ్‌కి వస్తే..అడపాదడపా సినిమా పాటలు, రెగ్యులర్‌గా కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్, ఇవి కాక... ఓటీటీ వేదికగా ఇండియన్ ఐడల్ కు వర్క్ చేస్తున్నాను.ఇవి చదవండి: ఫుల్కారీ ఎంబ్రాయిడరీలో విభిన్న డిజైన్లు.. -
నేడే చార్లెస్–3 పట్టాభిషేకం
లండన్: చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఎలిజబెత్–2 మృతితో ఆయన తనయుడు చార్లెస్–3 బ్రిటన్ రాజుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 74 ఏళ్ల చార్లెస్–3, 75 ఏళ్ల ఆయన భార్య కెమిల్లా శనివారం ఉదయమే గుర్రాలు పూన్చిన ప్రత్యేక బంగారు రథంలో బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు చేరుకుంటారు. అక్కడ లాంఛనప్రాయంగా జరిగే కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజుకు, రాణికి కిరీటధారణ చేస్తారు. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చార్లెస్–3, సెయింట్ మేరీస్ కిరీటాన్ని కెమిల్లా ధరిస్తారు. ఈసారి కోహినూర్ వజ్రాన్ని ఈ కిరీటంలో చేర్చడంలేదు. కిరీటధారణ తర్వాత చరిత్రాత్మక కుర్చీలో రాజు, రాణి ఆసీనులవుతారు. 1953లో జరిగిన క్వీన్ ఎలిజబెత్–2 పట్టాభిషేక మహోత్సవానికి 8,000 మందిని ఆహ్వానించారు. చార్లెస్–3 పట్టాభి షేకానికి కేవలం 2,200 మందికి ఆహ్వానం పంపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రైస్తవ పద్ధతిలో రాజు పట్టాభిషేకం జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కొంత ఆధునికతను జోడించారు. ఇతర మతాలకు సైతం చోటు కల్పించారు. వివిధ మతాల గురువులు, పెద్దలు రాజును ఆశీర్వదించనున్నారు. హిందూమతం తరపున నరేంద్ర బాబూభాయి పటేల్ రాజుకు ఉంగరం అందజేస్తారు. బ్రిటన్ తొలి హిందూ ప్రధానమంత్రి రిషి సునాక్ బైబిల్ సూక్తులు చదివి వినిపిస్తారు. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు శుక్రవారం లండన్‌కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్‌లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. -
లైవ్‌లో భర్తతో గాల్లో ఫీట్లు అంతలోనే..
భార్యభర్తలిద్దరూ లైవ్‌లో జిమ్నాస్టిక్ చేస్తుండగా అనూహ్య ఘటన చోటు చేసకుంది. ఎన్నో ఏళ్లగా కలిసి ఇలాంటి ప్రదర్శనలిచ్చారు. అలాంటిది అనుకోకుండా ఘెర ప్రమాదం జరిగింది. అందరూ చూస్తుండగానే జరగడంతో ఒక్కసారిగా అక్కడ విషాద ఛాయలు కమమ్ముకున్నాయి. అసలేం జరిగిందంటే.. చైనీస్ అక్రోబాట్ జిమ్నాస్టిక్ ప్రదర్శనలో భాగంగా ఒక స్టంట్ చేస్తున్నారు. లైవ్‌లో ఎప్పుడూ రోటిన్‌గా తన భాగస్వామితో చేసే స్టంట్ చేస్తోంది. ఈ మేరకు ఆమె సెంట్రల్ అన్హుయ్ ప్రావిన్స్‌లోని సుజౌ నగరంలో ఫ్లయింగ్-ట్రాపెజ్ ప్రదర్శనలో భాగంగా లైవ్‌లో విన్యాసం చేస్తుండగా ..అనుహ్యంగా 30 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. ఆమె భాగస్వామి కాళ్లతో ఆమెను క్యాచ్ చేయడంలో విఫలమవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో హుటాహుటినా ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అని సమాచారం. ఆ భార్యభర్తలిద్దరూ ఇలాంటి ప్రదర్శనలు చాలా సార్లు ఇచ్చారని, పైగా ఎప్పుడూ కూడా బెల్ట్‌లు లేకుండానే చేశారని చెబుతున్నారు స్థానికులు. ఐతే ఈ ఘటన జరిగే ముందు ఇద్దరు గొడవపడ్డారని, ఆ మహిళను సేఫ్టి ప్రికాషన్స్ తీసుకోమని చెప్పినా.. నిరాకరించిందని సమాచారం. ఐతే ఆమె భర్త మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించాడు. తాము ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవాళ్లమని చెబుతున్నాడు. ఈ మేరకు అధికారలు కేసు నమోదు చేసుకుని ఆ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. వీడియో కోసం: ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: ఆ విలువ లేని డిగ్రీలే భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయ్!) -
ప్రముఖ సింగర్ హఠాన్మరణం
-
విషాదం.. ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు విడిచాడు
సాక్షి, తిరువనంతపురం : ప్రముఖ కళాకారుడు కళామందలమ్ గీతానందన్ హఠాన్మరణం కేరళ కళారంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 58 ఏళ్ల గీతానందన్ ఒట్టాన్ థుల్లాల్(కేరళ శాస్త్రీయ నృత్యం) లో ప్రావీణ్యుడు. ప్రదర్శన ఇస్తున్న సమయంలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇరింజలక్కుడలోని ఓ ఆలయంలో ఆదివారం ఆయన ప్రదర్శన ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన నృత్యం చేస్తూనే.. వాయిద్యాకారుల ముందు మోకరిల్లాడు. ప్రదర్శనలో భాగంగానే అని అంతా భావిస్తున్న తరుణంలో చేతులు జోడిస్తూ కుప్పకూలిపోయారు. నిర్వాహకులు హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, చిన్నతనం నుంచే ‘ఒట్టాన్ థుల్లాల్’ ప్రదర్శనలతో ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించారు. సంగీత నాటక అకాడమీ అవార్డు(2000)తోపాటు పలు అవార్డులు సాధించారు. మళయాళంలో ఆయన 30కి పైగా చిత్రాల్లో నటించారు కూడా. ‘చివరి వరకు ఒట్టాన్ థుల్లాల్ తోనే నా ప్రయాణం’ అని తరచూ ఆయన పలు ఇంటర్వ్యూల్లో ప్రకటించారు. కళామందలమ్ డీమ్డ్ యూనివర్సిటీలో థుల్లాల్ విభాగానికి సేవలు అందించిన గీతానందన్ ఈ మధ్యే రిటైరయ్యారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తోపాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
రజనీ లైవ్ పర్ఫామెన్స్ పై రెహమాన్ క్లారిటీ
కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీ ప్రేక్షకులకు ఒక అరుదైన, మధురమైన వేడుక కనువిందు చేయనుందన్న వార్త పెద్ద ఎత్తున ప్రచారమవుతోంది. స్టైల్ కింగ్ రజనీకాంత్ పంచ్ డైలాగ్‌లు విని ఎంజాయ్ చేస్తున్న ఆయన అభిమానులు తాజాగా ఆయన గానం చేసే అరుదైన దృశ్యాన్ని లైవ్‌లో చూడబోతున్నారు. అదీ ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత సారథ్యంలో. ఇది సినిమా కోసం రజనీకాంత్ పాడే పాట కాదు. వేలాది మంది ప్రేక్షకుల మధ్య ఆయన తన గొంతును సవరించనున్నారనే ప్రచారం తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలపై స్వర సంచలనం ఏఆర్ రెహమాన్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరగబోయే వేడుకలో రజనీ పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఆయన ఆస్టేజీ మీద పాట పాడుతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. సంగీత దర్శకుడు 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న రెహమాన్ తన సిల్వర్ జూబ్లీ వేడుకలను పలు నగరాల్లో సంగీత విభావిరుల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23న ఢిల్లీ లో భారీ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. -
స్పాట్.. లైట్స్.. యాక్షన్..
రంగస్థలం మీద లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే.. రోజుల తరబడి రిహార్సల్స్ చేయాలి. అప్పుడుగానీ.. నాటకం రక్తికట్టదు. కానీ, గ్రిమ్ పంప్కిన్ థియేటర్ సంస్థ ‘ఇంప్రూవ్ థియేటర్’ కాన్సెప్ట్‌తో స్క్రిప్ట్ లేని నాటకాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నాటకానికి స్క్రిప్ట్ ఉండదు.. రిహార్సల్స్ అసలే ఉండవు. వేదిక మీదికి వచ్చిన పాత్రలు.. స్పాంటేనియస్‌గా స్పందిస్తుంటాయి. అంతేకాదు.. మధ్యమధ్యలో ప్రేక్షకుల సూచనలను బట్టి నటించాల్సి ఉంటుంది. ఈ వినూత్న నాటకం బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 1లోని లామకాన్‌లో మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రదర్శిస్తున్నారు. ఫోన్: 9966903264/ 9052692392