Acrobat in China falls to her death during live performance with husband - Sakshi
Sakshi News home page

Viral Video: లైవ్‌లో భర్తతో గాల్లో ఫీట్లు అంతలోనే..

Published Wed, Apr 19 2023 5:07 PM | Last Updated on Wed, Apr 19 2023 5:49 PM

Acrobat In China Falls To Her Death During Live Performance - Sakshi

భార్యభర్తలిద్దరూ లైవ్‌లో జిమ్నాస్టిక్‌ చేస్తుండగా అనూహ్య ఘటన చోటు చేసకుంది. ఎన్నో ఏళ్లగా కలిసి ఇలాంటి ప్రదర్శనలిచ్చారు. అలాంటిది అనుకోకుండా ఘెర ప్రమాదం జరిగింది. అందరూ చూస్తుండగానే జరగడంతో ఒక్కసారిగా అక్కడ విషాద ఛాయలు కమమ్ముకున్నాయి. అసలేం జరిగిందంటే.. చైనీస్‌ అక్రోబాట్‌ జిమ్నాస్టిక్‌ ప్రదర్శనలో భాగంగా ఒక స్టంట్‌ చేస్తున్నారు. లైవ్‌లో ఎప్పుడూ రోటిన్‌గా తన భాగస్వామితో చేసే స్టంట్‌ చేస్తోంది.

ఈ మేరకు ఆమె సెంట్రల్ అన్హుయ్ ప్రావిన్స్‌లోని సుజౌ నగరంలో ఫ్లయింగ్-ట్రాపెజ్ ప్రదర్శనలో భాగంగా లైవ్‌లో విన్యాసం చేస్తుండగా ..అనుహ్యంగా 30 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. ఆమె భాగస్వామి కాళ్లతో ఆమెను క్యాచ్‌ చేయడంలో విఫలమవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో హుటాహుటినా ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అని సమాచారం.

ఆ భార్యభర్తలిద్దరూ ఇలాంటి ప్రదర్శనలు చాలా సార్లు ఇచ్చారని, పైగా ఎప్పుడూ కూడా బెల్ట్‌లు లేకుండానే చేశారని చెబుతున్నారు స్థానికులు. ఐతే ఈ ఘటన జరిగే ముందు ఇద్దరు గొడవపడ్డారని, ఆ మహిళను సేఫ్టి ప్రికాషన్స్‌ తీసుకోమని చెప్పినా.. నిరాకరించిందని సమాచారం. ఐతే ఆమె భర్త మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించాడు. తాము ఎ‍ప్పుడూ అన్యోన్యంగా ఉండేవాళ్లమని చెబుతున్నాడు. ఈ మేరకు అధికారలు కేసు నమోదు చేసుకుని ఆ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. 

వీడియో కోసం: ఇక్కడ క్లిక్‌  చేయండి

(చదవండి: ఆ విలువ లేని డిగ్రీలే భారత్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయ్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement