రజనీ లైవ్ పర్ఫామెన్స్ పై రెహమాన్ క్లారిటీ | Rahman clarifies rumours about Superstar Rajini singing | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 20 2017 10:28 AM | Last Updated on Wed, Dec 20 2017 10:28 AM

Rahman clarifies rumours about Superstar Rajini singing - Sakshi

కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీ ప్రేక్షకులకు ఒక అరుదైన, మధురమైన వేడుక కనువిందు చేయనుందన్న వార్త పెద్ద ఎత్తున ప్రచారమవుతోంది. స్టైల్‌ కింగ్‌ రజనీకాంత్‌ పంచ్‌ డైలాగ్‌లు విని ఎంజాయ్‌ చేస్తున్న ఆయన అభిమానులు తాజాగా ఆయన గానం చేసే అరుదైన దృశ్యాన్ని లైవ్‌లో చూడబోతున్నారు. అదీ ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సంగీత మాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీత సారథ్యంలో. ఇది సినిమా కోసం రజనీకాంత్‌ పాడే పాట కాదు. వేలాది మంది ప్రేక్షకుల మధ్య ఆయన తన గొంతును సవరించనున్నారనే ప్రచారం తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

అయితే ఈ వార్తలపై స్వర సంచలనం ఏఆర్ రెహమాన్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరగబోయే వేడుకలో రజనీ పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఆయన ఆస్టేజీ మీద పాట పాడుతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. సంగీత దర్శకుడు 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న రెహమాన్ తన సిల్వర్ జూబ్లీ వేడుకలను పలు నగరాల్లో సంగీత విభావిరుల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23న ఢిల్లీ లో భారీ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement