2.ఓ కోసం కీరవాణి | MM Keeravani Has Crooned The Telugu version of 2.O Song | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 3 2018 11:31 AM | Last Updated on Sat, Nov 3 2018 11:34 AM

MM Keeravani Has Crooned The Telugu version of 2.O Song - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 2.ఓ సినిమా కోసం భారతీయ సినీ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారనటంలో ఏమాత్రం అతిషయోక్తి లేదు. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌ విజువల్‌వండర్‌గా రూపొందుతున్న ఈసినిమాలో ఓ పాటను టాలీవుడ్ సీనియర్‌ సంగీత దర్శకుడు ఆలపించారు.

ఇప్పటికే 2.ఓ లోని రెండు పాటలు రిలీజ్‌ అయ్యాయి. తాజాగా మూడో పాటను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. బుల్లి గువ్వ అంటూ సాగే ఈ తెలుగు పాటను కీరవాణి ఆలపించారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్ స్వయంగా వెల్లడించారు. ఈ పాట కూడా ట్రైలర్‌తో పాటు శనివారం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement