
సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌తో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఇక ఆలయం వెలుపలు రజనీకాంత్‌ను చూడటానికి భక్తులు ఉత్సాహం చూపారు. తిరుమల శ్రీవారిని దర్శనం అనంతరం నేరుగా రజనీకాంత్ కడపకు వెళ్లారు. అక్కడ కొలువైన అమీన్‌పీర్ దర్గాను ఆయన దర్శించుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్‌తో పాటు రజనీ దర్గాను సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment