
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇవాళ ఏపీలో పర్యటించారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆలయంలో జరిగిన సుప్రభాత సేవలో పెద్ద కుమార్తె ఐశ్వర్యతో కలిసి వచ్చారు. అనంతరం తలైవా అమీన్ పీర్ దర్గాలో కూడా ప్రార్థనలు చేశారు. ఆయనతో పాటు ఆస్కార్ అవార్డు పొందిన సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ కూడా దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
రజనీకాంత్ ప్రత్యేక తలపాగాతో తెల్లటి కుర్తా ధరించి కనిపించారు. రజనీకాంత్ ఈ ఏడాది డిసెంబర్ 12న తన 72వ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ అతిథి పాత్రలో లాల్ సలామ్ అనే ప్రాజెక్ట్‌లో కూతురితో కలిసి నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి విషు విశాల్, విక్రాంత్‌లు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ తన కూతురుతో కలిసి నటించడం ఇదే తొలిసారి. మరోవైపు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్‌తో రజనీకాంత్ ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, వసంత్ రవి, యోగి బాబు, రమ్య కృష్ణన్, వినాయకన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment