Thirumala
-
శ్రీవారి వాకిలి.. బంగారు లోగిలి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి అంతరాలయం స్వర్ణ శోభితమైంది. స్వామివారి భక్తులకు కనువిందు చేస్తోంది. స్వర్ణ కాంతులతో ధగధగలాడుతున్న వాకిలి నుంచి చిన వెంకన్నను దర్శించుకుంటున్న భక్తులు మంత్ర ముగ్ధులవుతున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీవారి దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తున్నారు. శని, ఆదివారాలు, భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్షేత్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దాతల సహకారంతో దేవస్థానం ఇప్పటికే స్వామివారి వాకిలిని దాదాపుగా స్వర్ణ మయం చేశారు.అందులో భాగంగా జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ 2021 లో రూ.98,31,693 వ్యయంతో, 264 గ్రాముల 647 మిల్లీ గ్రాముల బంగారం, 147 కేజీల 641 గ్రాముల 700 మిల్లీ గ్రాముల రాగి రేకులతో ఆలయ ప్రధాన ముఖద్వారానికి, తలుపులకు, అంతరాలయ ద్వారానికి బంగారు తాపడం (ఎలక్ట్రో గోల్డ్ ప్లేటింగ్) చేయించారు. వీటిని అదే సంవత్సరం జనవరి 10న అప్పటి రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు.కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, బొమ్ములూరుకు చెందిన దీపక్ నెక్స్‌జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు రూ.1,64,19,411తో స్వామి అంతరాలయానికి బంగారు తాపడాన్ని చేయించారు. దీన్ని ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఈ ఏడాది అక్టోబర్ 4న ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, దాతలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. త్వరలో స్తంభాలకు బంగారు పూత అంతరాలయం ముందు పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు ఎదురుగా ఉన్న స్తంభాలకు ఇదే తరహాలో గోల్డ్ కోటెడ్ చేయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. త్వరలో ఒక దాత సహాయంతో పనులు ప్రారంభించనున్నారని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే విమాన గోపుర స్వర్ణమయ పథకం ద్వారా భక్తుల నుంచి దేవస్థానం విరాళాలను సేకరిస్తోంది. విమాన గోపురాన్ని సైతం స్వర్ణమయం చేస్తే చినవెంకన్న ఆలయాన్ని చూడడానికి రెండు కనులు చాలవనే చెప్పొచ్చు. -
June 27: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 77,332 మంది స్వామివారిని దర్శించుకోగా, 30,540 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.38 కోట్లు సమర్పించారు.అలాగే, టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు, టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం. ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది . ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తోంది. -
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: బంగారు తిరుచ్చి ఉత్సవం (ఫొటోలు)
-
తిరుమలలో ప్రభాస్
-
టీటీడీ ఆదాయం అదుర్స్
-
టీటీడీ ఈవో ధర్మరెడ్డి సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్న భక్తులు
-
తిరుమలలో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవు
-
తిరుమలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం
-
తిరుమల శ్రీవారి సేవలో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్
-
BGT 2023: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav Tirumala Visit Ahead Ind Vs Aus 3rd Test: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబ సమేతంగా తిరుపతికి విచ్చేసిన సూర్య.. మంగళవారం స్వామి వారి దర్శనం చేసుకున్నాడు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నాడు. శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యను సత్కరించారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 నేపథ్యంలో టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్.. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు. తొలి టెస్టులో విఫలం అయితే, నాగ్‌పూర్ మ్యాచ్‌లో విఫలం(8 పరుగులు మాత్రమే) కావడంతో.. రెండో టెస్టులో సూర్యను పక్కనపెట్టారు. ఇదిలా ఉంటే.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజృంభణతో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టును కూడా రెండున్నర రోజుల్లోనే ముగించింది టీమిండియా. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. దీంతో చాలా మంది టీమిండియా ప్లేయర్లు స్వస్థలాలకు వెళ్లగా సూర్య కుటుంబంతో కలిసి ఇలా దైవ దర్శనం చేసుకోవడం విశేషం. టెస్టుల్లో అరంగేట్రం సందర్భంగా కుటుంబ సభ్యులతో సూర్య చదవండి: BGT 2023: రెండున్నర రోజుల్లోనే టెస్టు ముగిస్తే ఇంతే! అయినా.. గాయం సంగతి ఏమైంది? Ind Vs Aus: ఆసీస్‌తో మ్యాచ్ అంటే ఆ మజానే వేరు.. రోహిత్ సేన మాదిరి మీరు కూడా! Joe Root: 'రూట్' దారి తప్పింది.. 'నా రోల్ ఏంటో తెలుసుకోవాలి' -
టీటీడీపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం
-
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
విశిష్ట దర్శనానికి వేళాయే..
-
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా సర్వం సిద్ధం
-
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్
-
దేశంలోనే ఏపీ ప్రభుత్వం అగ్రగామిగా ఉంది : సజ్జల
-
దర్గాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పూజలు
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇవాళ ఏపీలో పర్యటించారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆలయంలో జరిగిన సుప్రభాత సేవలో పెద్ద కుమార్తె ఐశ్వర్యతో కలిసి వచ్చారు. అనంతరం తలైవా అమీన్ పీర్ దర్గాలో కూడా ప్రార్థనలు చేశారు. ఆయనతో పాటు ఆస్కార్ అవార్డు పొందిన సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ కూడా దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రజనీకాంత్ ప్రత్యేక తలపాగాతో తెల్లటి కుర్తా ధరించి కనిపించారు. రజనీకాంత్ ఈ ఏడాది డిసెంబర్ 12న తన 72వ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ అతిథి పాత్రలో లాల్ సలామ్ అనే ప్రాజెక్ట్‌లో కూతురితో కలిసి నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి విషు విశాల్, విక్రాంత్‌లు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ తన కూతురుతో కలిసి నటించడం ఇదే తొలిసారి. మరోవైపు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్‌తో రజనీకాంత్ ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, వసంత్ రవి, యోగి బాబు, రమ్య కృష్ణన్, వినాయకన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
వైకుంఠ ఏకాదశి సందర్బంగా టీటీడీ భారీ ఏర్పాట్లు
-
టీటీడీ కీలక నిర్ణయాలు.. బ్రేక్ దర్శన సమయంలో మార్పు
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
-
30 ఏళ్లపాటు సీఎం జగన్ పాలన కొనసాగాలని " తిరుమల TO శ్రీశైలం పాదయాత్ర "
-
వైరల్ వీడియో: తిరుమల కొండ ఎక్కుతున్న చిన్న కుక్క పిల్ల
-
తిరుమలలో అద్భుత దృశ్యాలు..
-
భక్తులకు దర్శనమిచ్చిన ఉగ్ర శ్రీనివాసుడు
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి నమిత