శ్రీవారి దర్శనానికి నకిలీ సిఫారసు లేఖ ; వ్యక్తి అరెస్ట్‌ | Fake Recommendation Letter to Srivari Darshan; The Person is Arrested | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి నకిలీ సిఫారసు లేఖ ; వ్యక్తి అరెస్ట్‌

Published Fri, Dec 13 2019 12:46 PM | Last Updated on Fri, Dec 13 2019 12:46 PM

Fake Recommendation Letter to Srivari Darshan; The Person is Arrested - Sakshi

సాక్షి, తిరుమల : శ్రీవారి దర్శనానికి నకిలీ సిఫారసు లేఖలను పంపిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన వెంకట రత్నారెడ్డి అనే వ్యక్తి, ముంబాయిలో ఇంటెలిజెన్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ అంటూ తిరుమల జేఈవో కార్యాలయానికి సిఫారసు లేఖలు పంపించాడు. పరిశీలించిన కార్యాలయ సిబ్బంది నకిలీ లేఖగా గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారమందించడంతో పోలీసులు రత్నారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గతంలోనూ ఇదే తరహాలో దర్శనం చేసుకున్నట్టు రత్నారెడ్డి వెల్లడించాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సిఫారసు లేఖలను జేఈవో కార్యాలయ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement