srivari darsanam
-
తిరుమల: నిండిపోయిన అన్ని కంపార్ట్మెంట్లు
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మొత్తం కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయి.. వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం(ఉచిత దర్శనం) కోసం 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న(గురువారం, జులై 20) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,628గా ఉంది. హుండీ ఆదాయం రూ. 4.26 కోట్లుగా లెక్క తేలింది. -
శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(ఉచిత) 15 గంటల సమయం పడుతోంది. అలాగే.. దర్శనం కోసం 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న(సోమవారం, జూన్ 19) శ్రీవారిని 69,879 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,510 మందిగా నమోదు అయ్యింది. ఇక తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లుగా తేలింది. అదనపు లడ్డూ కౌంటర్లు.. టీటీడీ కీలక నిర్ణయం -
TTD: సర్వదర్శనానికి 20 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి చెంతకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(ఆదివారం) శ్రీవారిని 86,181 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.59 కోట్లుగా తేలింది. ఇక తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30,654గా ఉంది. ఇక.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల సెప్టెంబరు నెల కోటాను ఇవాళ(జూన్ 19న) విడుదల చేయనుంది టీటీడీ. సుప్రభాతం, అర్చన, తోమాల, అషాదటళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ డిప్ కోసం ఉదయం 10గంటల నుంచి జూన్ 21వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు నగదు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవాలి. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవాకు సంబంధించిన టికెట్లు జూన్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. సెప్టెంబరు మాసం కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటా, సంబంధించిన దర్శన టికెట్ల జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబరు నెల అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈనెల 23న 10 గంటలకు విడుదల చేస్తారు. ఆగస్టు 27 నుంచి 29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను.. జూన్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. మరోవైపు నేడు టీటీడీ పాలక మండలి భేటీ అయ్యి.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: జూన్‌లో తిరుమల వెంకన్న దగ్గరకు ఎందుకు వెళ్లాలంటే.. -
శ్రీవాణి దర్శనం టికెట్ల కోటా రోజుకు 1000
తిరుమల: శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు 1,000కి పరిమితం చేసింది. ఇందులో ఆన్లైన్లో 750, ఆఫ్ లైన్లో 250 టికెట్లను జారీచేస్తారు. ఇప్పటికే టీటీడీ 500 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయగా, అదనంగా బుధవారం మరో 250 టికెట్లు విడుదల చేయనుంది. మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. ఇక నుంచి శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌ను అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్టు కౌంటర్లో మాత్రమే ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేస్తారు. శ్రీవాణి దాతలు బ్రేక్ దర్శనం టికెట్‌కి బోర్డింగ్ పాస్‌ను జతచేయాలి. టికెట్‌పై ఎయిర్‌లైన్ రిఫరెన్స్‌తో కూడిన పీఎన్ఆర్ నంబర్‌ను కూడా నమోదు చేయించాలి. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని సిబ్బంది బ్రేక్ దర్శన టికెట్‌తో పాటు బోర్డింగ్ పాస్‌ను తనిఖీ చేసి దర్శనానికి అనుమతిస్తారు. తిరుప్పావడ సేవ పునఃప్రారంభం తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ ఆర్జిత సేవ ఈ నెల 12 నుంచి పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం యాత్రికులు తిరుమలలోని సీఆర్వో కౌంటర్లో నమోదు చేసుకోవాలి. వీరికి బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఎల్రక్టానిక్ డిప్ ద్వారా 25 టికెట్లు జారీ చేస్తారు. నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం తిరుమలలో నిర్ణీత సమయంలో కేటాయించిన టైమ్స్ స్లాట్ టికెట్లకు త్వరితగతిన దర్శనమవుతోంది. సోమవారం అర్ధరాత్రి వరకు 56,003 మంది స్వామి వారిని దర్శించుకోగా, 20,365 మంది తలనీలాలు సమర్పించారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు 18 నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 60,157 మంది స్వామిని దర్శించుకోగా, 31,445 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి భక్తులు కానుకల రూపంలో హుండీలో రూ.4 కోట్లు సమర్పించారు. శ్రీవారి దర్శన టోకెన్లు లేని భక్తులకు 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. -
శ్రీవారి సర్వ దర్శనానికి 30 గంటలు
తిరుమల: తిరుమలలో 25 క్యూ కంపార్ట్మెంట్లు నిండాయి. సర్వ దర్శన టోకెన్లు లేని వారికి 30 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 74,412 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 27,626 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.27 కోట్లు వేశారు. -
తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం
తిరుపతి అలిపిరి: తిరుమల శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో నిరీక్షించే పరిస్థితి లేకుండా సర్వదర్శనానికి టైం స్లాట్ పద్ధతిని టీటీడీ అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌లో నిలిపివేసిన సర్వదర్శనం టైంస్లాట్ (ఉచిత దర్శనం) టోకెన్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. దర్శనానికి వెళ్లేవారికి తిరుపతిలోనే సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది. కోవిడ్ కారణంగా 2020లో శ్రీవారి దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత దర్శనాలను ప్రారంభించినా పరిస్థితులకు అనుగుణంగా కేవలం 40,000 మందికి మాత్రమే దర్శనాలు కల్పిస్తూ వచ్చిన టీటీడీ ఈ ఏడాది మార్చి నుంచి సడలింపులనిస్తూ సర్వదర్శనానికి అనుమతించింది. దీంతో వేలాదిగా ప్రతి రోజూ తిరుమలకు భక్తులు వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అతికష్టం మీద రోజుకు 85,000 మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు టైంస్లాట్ టోకెన్లు తీసుకురావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకోవడంతో మంగళవారం నుంచి ఈ ప్రక్రియ పునఃప్రారంభమైంది. తొలిరోజున 13,000 మందికి టోకెన్లను జారీ చేశారు. 3 కేంద్రాలు..30 కౌంటర్లు శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను అందించేందుకు తిరుపతిలో మూడు చోట్ల కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. తిరుపతి అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో 30 కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తుల మధ్య తోపులాట లేకుండా ప్రత్యేక క్యూలైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డుతో సంప్రదించిన భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇందుకుగాను ఆధార్ జిరాక్స్ కాపీలను భక్తులు తమవెంట తీసుకురావాలి. టోకెన్ల జారీ ఇలా.. శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు అధిక రద్దీ, ముఖ్య రోజుల్లో జారీ చేసిన టోకెన్ల వివరాలను టీటీడీ ప్రకటించింది. శని, ఆది, సోమ, బుధవారాల్లో 25,000 టోకెన్లు, మంగళ, గురు, శుక్రవారాల్లో 15,000 మందికి టోకెన్లు జారీ చేస్తున్నారు. ఏ రోజు టోకెన్ తీసుకున్న భక్తులకు అదే రోజున దర్శనం కల్పిస్తారు. ఇప్పటి దాకా సర్వదర్శనం 40 గంటల వరకు సమయం పట్టేది. ఈ పద్ధతితో అత్యంత తక్కువ సమయంలోనే దర్శనం చేసుకొంటున్నామని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ దొరకని భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనానికి వెళ్లడానికి టీటీడీ అనుమతిస్తోంది. -
మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కిన హీరోయిన్.. వీడియో వైరల్
తిరుమల తిరుపతిలోని శ్రీవారి దర్శనానికి రోజూ లక్షలాది మంది భక్తులు వచ్చి వెళ్తుంటారు. వారిలో కొంతమంది కాలి నడకన శ్రీవారిని దర్శించుకుంటే..మరికొంతమంది వీఐపీ దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఎక్కువగా వీఐపీ దర్శనం ద్వారనే ఏడుకొండల వారిని దర్శించుకుంటారు. సినీ తారలు కాలినడకన శ్రీవారిని దర్శించుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతంది. తాజాగా హీరోయిన్ నందిని రాయ్ ఏకంగా మోకాళ్లపై నడుచుంటూ శ్రీవారి కొండ ఎక్కి మొక్కులు చెల్లించింది. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కష్టపడి మెట్లు ఎక్కినప్పటికీ చాలా అద్భుతమైన అనుభూతి పొందానని రాసుకొచ్చింది. నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్-2 ద్వారా నందినికి గుర్తింపు వచ్చింది. ‘సిల్లీ ఫెలోస్’, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత శివరంజని, పంచతంత్ర కథలు లాంటి చిన్న సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
ఆన్లైన్లో సెప్టెంబర్ నెల ఎస్ఈడీ టికెట్ల కోటా
తిరుమల: శ్రీవారి దర్శనానికి సంబంధించి సెప్టెంబర్ నెలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్ఈడీ) టికెట్లను టీటీడీ గురువారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసింది. సెప్టెంబర్ నెలలో 20, 26, 27, 28, 29, 30 తేదీలు మినహా మిలిగిన రోజుల్లో భక్తులు ఎస్ఈడీ టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. గురువారం సాయంత్రానికి సెప్టెంబర్ మాసంలో శనివారాలు మినహా మిగిలిన రోజుల్లో ఎస్ఈడీ దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమలలో వసతి కోటాను శుక్రవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు జూలై 12, 15, 17 తేదీల్లో వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా ఆన్లైన్లో విడుదల చేయనుంది. కాగా, ఈ నెల 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమలలో గురువారమూ భక్తుల రద్దీ కొనసాగింది. బుధవారం అర్ధరాత్రి వరకు 76,418 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 38,629 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు వేశారు. దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయాయి. క్యూలైను లేపాక్షి సర్కిల్ వద్దకు చేరుకుంది. కాగా, శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. భక్తులు తమ సందేహాలను, సూచనలను 0877–2263261 నంబర్‌కు ఫోన్ చేసి టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డికి తెలుపవచ్చు. -
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేశారు. సర్వదర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇటువంటి అనూహ్యమైన రద్దీ సమయంలో వీఐపీలు తిరుమల యాత్ర విషయంలో పునరాలోచించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. క్యూలైన్ల తనిఖీ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి శనివారం సాయంత్రం భక్తులు వేచి ఉన్న క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసులు, విజిలెన్స్, టీటీడీలోని అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. ఈవో వెంట అన్ని విభాగాల అధికారులు ఉన్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతంలో శ్రీవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 33 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామి వారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు 12 గంటల్లోపు సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం క్యూలైన్, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ మెరుగైన సౌకర్యాలు అందిస్తోంది. భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు అందజేస్తున్నారు. క్యూలో ఎలాంటి తోపులాట జరుగకుండా విజిలెన్స్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని టీటీడీ అధికారులు సూచనలు చేస్తున్నారు. శనివారం 83,739 మంది శ్రీవారిని దర్శించుకోగా, స్వామి వారికి 46,187 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం హుండీ కానుకలు రూ.4.2 కోట్లు వచ్చింది. -
శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
తిరుమల: శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తి వస్తున్నారు. వేసవి సెలవులు, వారాంతాలు కావడంతో సప్తగిరులపై ఊహించని రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1, 2లోని 31 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా.. 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు నడక మార్గం గుండా అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటలు పడుతుండగా.. సర్వదర్శనం దాదాపుగా 24 గంటలు పడుతోంది. స్వామి వారిని శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,119 మంది దర్శించుకున్నారు. 37,256 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.3.91 కోట్లు సమర్పించారు. కాగా, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ శనివారం ఉదయం ఆన్లైన్లో విడుదల చేసింది. రెండు నెలలకు కలిపి దాదాపు 13,35,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయగా.. దాదాపు 2లక్షల 78వేల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. -
తిరుమలలో ట్రయల్ రన్
-
శ్రీవారి దర్శనానికి నకిలీ సిఫారసు లేఖ ; వ్యక్తి అరెస్ట్
సాక్షి, తిరుమల : శ్రీవారి దర్శనానికి నకిలీ సిఫారసు లేఖలను పంపిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన వెంకట రత్నారెడ్డి అనే వ్యక్తి, ముంబాయిలో ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ కమిషనర్ అంటూ తిరుమల జేఈవో కార్యాలయానికి సిఫారసు లేఖలు పంపించాడు. పరిశీలించిన కార్యాలయ సిబ్బంది నకిలీ లేఖగా గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారమందించడంతో పోలీసులు రత్నారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గతంలోనూ ఇదే తరహాలో దర్శనం చేసుకున్నట్టు రత్నారెడ్డి వెల్లడించాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సిఫారసు లేఖలను జేఈవో కార్యాలయ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. -
శ్రీవారి దర్శనం రద్దుపై టీటీడీ పునరాలోచన
-
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ బొసాలే
తిరుమల: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బొసాలే శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం జస్టిస్ మహద్వారం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు అర్చకులతో కలసి ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా జస్టిస్ ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి పాదాల వద్ద ఉంచిన శేష వస్త్రంతో జస్టిస్‌ను అర్చకులు సత్కరించారు. అనంతరం వకుళామాతను దర్శించుకుని కానుకలు సమర్పించారు. ఆలయ చరిత్ర, శ్రీవారి వైభవ ప్రాశస్త్యాన్ని జస్టిస్‌కు ఈవో వివరించారు. అనంతరం ఆయన తిరుచానూరు చేరుకుని పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు.