
తిరుమల తిరుపతిలోని శ్రీవారి దర్శనానికి రోజూ లక్షలాది మంది భక్తులు వచ్చి వెళ్తుంటారు. వారిలో కొంతమంది కాలి నడకన శ్రీవారిని దర్శించుకుంటే..మరికొంతమంది వీఐపీ దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఎక్కువగా వీఐపీ దర్శనం ద్వారనే ఏడుకొండల వారిని దర్శించుకుంటారు. సినీ తారలు కాలినడకన శ్రీవారిని దర్శించుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతంది.
తాజాగా హీరోయిన్ నందిని రాయ్ ఏకంగా మోకాళ్లపై నడుచుంటూ శ్రీవారి కొండ ఎక్కి మొక్కులు చెల్లించింది. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కష్టపడి మెట్లు ఎక్కినప్పటికీ చాలా అద్భుతమైన అనుభూతి పొందానని రాసుకొచ్చింది.
నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్-2 ద్వారా నందినికి గుర్తింపు వచ్చింది. ‘సిల్లీ ఫెలోస్’, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత శివరంజని, పంచతంత్ర కథలు లాంటి చిన్న సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment