టాలీవుడ్ హీరో నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన భార్య షాలిని, కుమారుడితో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. ప్రస్తుతం హీరో నితిన్ రాబిన్‌హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. భీష్మ తర్వాత వెంకీ కుడుముల- నితిన్ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
రిలీజ్ వాయిదా..
గతేడాది క్రిస్టమస్ విడుదల కావాల్సిన 'రాబిన్ హుడ్' వాయిదా పడింది. పుష్ప-2 ఇంకా థియేటర్లలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి కూడా ఈ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో వచ్చేనెల ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Youth Star @actor_nithiin visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!🙏#Nithiin #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/tCR1B93mPH
— Telugu FilmNagar (@telugufilmnagar) January 25, 2025
Comments
Please login to add a commentAdd a comment