
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ రెండో కుమార్తె హయవాహిని ఇటీవలే వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో రామానాయుడులో జరిగిన పెళ్లికి బంధువులు, సన్నిహితులు, ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ పాతూరిని ఆమె పెళ్లాడారు.
తాజాగా కొత్త జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లి తర్వాత తొలిసారిగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త జంటకు వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదంతో పాటు నూతన దంపతులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment