TTD Darshanam Updates: Today Tirupati Crowd Status Live, 20 Hours For Sarvadarshan - Sakshi
Sakshi News home page

TTD Updates:సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నేడు సెప్టెంబర్‌ ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల విడుదల

Published Mon, Jun 19 2023 7:39 AM | Last Updated on Mon, Jun 19 2023 9:50 AM

TTD Darshan: Today Tirupati Crowd Status Live - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి చెంతకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 

ఇదిలా ఉంటే.. నిన్న(ఆదివారం) శ్రీవారిని  86,181 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.59 కోట్లుగా తేలింది. ఇక తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30,654గా ఉంది. 

ఇక.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల సెప్టెంబరు నెల కోటాను ఇవాళ(జూన్‌ 19న) విడుదల చేయనుంది టీటీడీ.  సుప్రభాతం, అర్చన, తోమాల, అషాదటళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీ డిప్‌ కోసం ఉదయం 10గంటల నుంచి జూన్‌ 21వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు నగదు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవాలి. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవాకు సంబంధించిన టికెట్లు జూన్‌ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. 

సెప్టెంబరు మాసం కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్‌ సేవల కోటా, సంబంధించిన దర్శన టికెట్ల  జూన్‌ 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబరు నెల అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈనెల 23న 10 గంటలకు విడుదల చేస్తారు. ఆగస్టు 27 నుంచి 29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను..  జూన్‌ 22వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

మరోవైపు నేడు టీటీడీ పాలక మండలి భేటీ అయ్యి.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది.


ఇదీ చదవండి: జూన్‌లో తిరుమల వెంకన్న దగ్గరకు ఎందుకు వెళ్లాలంటే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement