special darshanam
-
ఆ పది రోజులు టోకెన్ లేకుంటే దర్శనం లేదు
తిరుమల: తిరుమలలో వచ్చేనెలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సమయంలో టోకెన్ లేని భక్తులను దర్శనానికి అనుమ తించమని టీటీడీ పీఆర్వో విభాగం శని వారం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి ఆలయంలో వచ్చేనెల వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్య మిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. జనవరి 10 నుంచి 19 వరకు దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్ర మే అనుమతిస్తారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణశాఖ, ఎన్ ఆర్ఐ మొదలైన వారికి పదిరోజుల పాటు వీఐపీ బ్రేక్, విశేష దర్శనాలు రద్దు. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లు వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి అనుమతించబడరు. 11 నుంచి 19 తేదీ వరకు అనుమతిస్తారు. 28న డయర్ యువర్ ఈవోటీటీడీ ‘డయల్ యువర్ ఈవో’ డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్ర మా న్ని వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసా రం చేస్తుంది. భక్తులు తమ సందేహా లను, సూచనలను టీటీడీ ఈఓ శ్యామల రావుకు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు 0877– 2263261 నంబర్లో సంప్రదించాలని టీటీడీ తెలిపింది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం 24 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న(సెప్టెంబర్ 3, 2023)న శ్రీవారిని 81,459 మంది భక్తులు దర్శించుకున్నారు. 32, 899 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్లుగా తేలింది. -
తిరుమల: పెరిగిన భక్తుల రద్దీ.. నేడు వరలక్ష్మి వ్రతం టికెట్ల విడుదల
సాక్షి, తిరుమల: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రావణమాసం కావడంతో తిరుమలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు.. నేడు వరలక్ష్మి వ్రతం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. వివరాల ప్రకారం.. తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) 64,695 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,473 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం తిరుమల హుండీ ఆదాయం రూ.4.60కోట్లుగా ఉంది. ఇదిలా ఉండగా.. నేడు వరలక్ష్మి వ్రతం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈనెల 25వ తేదీన తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం జరుగనుంది. ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వ్రతం జరుగుతుంది. అయితే, ఈ వ్రతానికి భక్తులు నేరుగా, వర్చువల్‌గా పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఇక, సాయంత్రం ఆరు గంటలకు స్వర్ణరథంపై మాడవీధుల్లో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఇది కూడా చదవండి: ఈ రాశి వారికి సకాలంలో పనులు పూర్తి, శుభవార్త వింటారు -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులకు గమనిక. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. వివరాల ప్రకారం.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయంలో పడుతోంది. అలాగే, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న(మంగళవారం) శ్రీవారిని 78,726 మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో శ్రీవారి హుండీకి రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చింది. 26,436 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక, ఈనెల 21న గరుడపంచమి సందర్భంగా గరుడ వాహసనసేవ కార్యక్రమం నిర్వహించనుంది టీటీడీ. రాత్రి ఏడు గంటలకు గరుడ వాహనంపై మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. కాగా, తిరుమల వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ప్రయాణికుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం రూ.300 టికెట్ల కోటాను 1000కి పెంచారు. 300 కిలోమీటర్ల దూరానికి పైబడిన నగరాల నుంచి వచ్చే బస్సులకు 80 శాతం టికెట్లు కేటాయించగా, 300 కిలోమీటర్ల లోపు నగరాల నుంచి వచ్చే బస్సులకు 20 శాతం కేటాయించారు. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శాసన సభ్యులు ,టీటీడీ చైర్మన్ శ్రీభూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం రాత్రి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేసి పనుల వేగం పెంచాలని ఆదేశించారు. మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ శ్రీమతి హరిత శ్రీ కరుణాకర్ రెడ్డి వెంట ఉన్నారు pic.twitter.com/qxhml3olNk — MCT Mayor Dr Sireesha (@mayortpt) August 15, 2023 ప్రయాణంతోపాటు స్వామివారి దర్శనం టికెట్‌ను నెలరోజులు ముందుగానే బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు ప్రయాణ టికెట్లతోపాటు దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చని వివరించారు. తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నవారు అదనపు కోటా టికెట్లను www.apsrtconline.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు. ఇది కూడా చదవండి: సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం -
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఐదు గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. నిన్న(సోమవారం జూన్ 26) శ్రీవారిని 73,156 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే.. శ్రీవారి హుండీ ఆదాయం 4.29 కోట్లుగా లెక్క తేలింది. ఇదీ చదవండి: ఏపీ: ఇక్కడ సీటొస్తే విదేశాల్లో చదవొచ్చు! -
తిరుమల: ఉచిత దర్శనానికి 15 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి చెంతకు భక్తుల క్యూ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనానికి(ఉచిత) 15 గంటలు సమయం పడుతోంది. అలాగే.. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. ఇదిలా ఉంటే మంగళవారం శ్రీవారిని 71,935 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.11 కోట్లుగా తేలింది. ఇదీ చదవండి: సాధారణ భక్తుల కోసం.. టీటీడీ ప్రయోగం సక్సెస్ -
శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(ఉచిత) 15 గంటల సమయం పడుతోంది. అలాగే.. దర్శనం కోసం 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న(సోమవారం, జూన్ 19) శ్రీవారిని 69,879 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,510 మందిగా నమోదు అయ్యింది. ఇక తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లుగా తేలింది. అదనపు లడ్డూ కౌంటర్లు.. టీటీడీ కీలక నిర్ణయం -
TTD: సర్వదర్శనానికి 20 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి చెంతకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(ఆదివారం) శ్రీవారిని 86,181 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.59 కోట్లుగా తేలింది. ఇక తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30,654గా ఉంది. ఇక.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల సెప్టెంబరు నెల కోటాను ఇవాళ(జూన్ 19న) విడుదల చేయనుంది టీటీడీ. సుప్రభాతం, అర్చన, తోమాల, అషాదటళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ డిప్ కోసం ఉదయం 10గంటల నుంచి జూన్ 21వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు నగదు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవాలి. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవాకు సంబంధించిన టికెట్లు జూన్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. సెప్టెంబరు మాసం కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటా, సంబంధించిన దర్శన టికెట్ల జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబరు నెల అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈనెల 23న 10 గంటలకు విడుదల చేస్తారు. ఆగస్టు 27 నుంచి 29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను.. జూన్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. మరోవైపు నేడు టీటీడీ పాలక మండలి భేటీ అయ్యి.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: జూన్‌లో తిరుమల వెంకన్న దగ్గరకు ఎందుకు వెళ్లాలంటే.. -
యాదాద్రిలో రూ.150 టికెట్‌కు ప్రత్యేక క్యూలైన్లు
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో అధికంగా రూ.150 ప్రత్యేక టికెట్ దర్శనం ద్వారా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేక దర్శనం టికెట్‌పై వెళ్లే భక్తులు అష్టభుజి ప్రాకార మండపం వద్దకు రాగానే టికెట్లు తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇదే సమయంలో ధర్మ దర్శనానికి వెళ్లే భక్తులు, ప్రత్యేక దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు సోమవారం క్యూలైన్లు, అష్టభుజి ప్రాకార మండపం వద్ద పరిశీలించారు. ప్రత్యేక దర్శనం భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. (క్లిక్: నరసింహుడికి బంగారు సింహాసనం) -
ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించలేదు
తిరుమల: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసినట్టు టీటీడీ పీఆర్వో విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. అయితే, కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్టు అవాస్తవ సమాచారం జరుగుతోంది. అనేకమంది ఇది నిజమని నమ్మి తిరుపతికి వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. భక్తులు ఈ విషయం గుర్తించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. రేపటి నుంచి అయోధ్య కాండ లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాప్తిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో ఈనెల 21 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు అయోధ్య కాండ పారాయణ దీక్ష జరగనుంది. తిరుమల వసంత మండపంలో శ్లోక పారాయణం, ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద వి/ê్ఞన పీఠంలో జప, తర్పణ, హోమాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం బుధవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు అంకురార్పణ జరగనుంది. పారదర్శకంగా లడ్డూ కౌంటర్ల నిర్వహణ తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న లడ్డూ కౌంటర్ల నిర్వహణ పారదర్శకంగా జరుగుతోంది. రద్దీకి తగ్గట్టుగా కౌంటర్లు ఏర్పాటు చేయడంతో భక్తులు సంతృప్తిగా లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. లడ్డూ కాంప్లెక్స్‌లో మొత్తం 62 కౌంటర్లు ఉన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం 31 లడ్డూ కౌంటర్లను నడుపుతున్నారు. వీటిలో 26 కౌంటర్లకు 6 బ్యాంకులు స్పాన్సర్షిప్ అందించాయి. నేడు పౌర్ణమి గరుడ సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 20న బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనమిస్తారు. -
TTD: 25 నుంచి ఆన్లైన్లో శ్రీవారి సర్వ దర్శన టికెట్లు
సాక్షి, చిత్తూరు: ఈనెల 25వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వ దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకువస్తేనే అనుమతి ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు 8 వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. సర్వదర్శనం టోకెన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయనున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం వస్తుండడంతో కరోనా వ్యాప్తి అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి. కోవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. అక్టోబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తామని ఛైర్మన్ తెలిపారు. చదవండి: ‘పరిషత్’ పీఠాలలో మహిళలకు అగ్రాసనం ఈ నెల 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ ద్వారా సర్వ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నాము. https://t.co/eUEh5QGKZN ద్వారా ఆన్లైన్లో టికెట్లు పొందవచ్చును. అక్టోబర్ నెల కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ 300 టికెట్లను సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తాము. — Y V Subba Reddy (@yvsubbareddymp) September 22, 2021 -
టికెట్ల ఇక్కట్లకు చెక్!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం టికెట్ల ఆన్లైన్ బుకింగ్ విషయంలో ఎదురవుతోన్న ఇబ్బందులను అధిగమించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపట్టింది. ఇందుకుగాను క్లౌడ్ మేనేజ్మెంట్ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించింది. మరో నెల రోజుల్లో ఈ టెక్నాలజీని వినియోగించి దర్శన టికెట్ల బుకింగ్ సమయంలో ఎదురవుతోన్న ఇబ్బందులను సరిచేయనుంది. ► శ్రీవారి దర్శనం కోసం టీటీడీ ప్రతి నెలా విడుదల చేస్తోన్న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవడంలో సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకేసారి 3 లక్షల మందికిపైగా భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌ను హిట్ చేస్తుండటంతో తరచూ సాంకేతిక సమస్యలు (సర్వర్ ట్రాఫిక్ లాంటివి) ఉత్పన్నమవుతున్నాయి. హై ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే తప్ప గ్రామీణ ప్రాంతాలు, సామాన్య భక్తులకు దర్శనం టికెట్లు లభించడం లేదు. ఈ విషయమై ప్రతి నెలా టీటీడీ ఉన్నతాధికారులకు భక్తుల నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. కోవిడ్ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఉచిత దర్శనం టికెట్లు రద్దు చేయడంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం రోజుకు 8 వేల టికెట్ల చొప్పున రాబోయే నెల కోసం ప్రతి నెల 20 నుంచి 25వ తేదీలోగా 2 లక్షల 40 వేల టికెట్లు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేస్తుంది. విడుదలైన 2 నుంచి 3 గంటల్లోపే నెల కోటాకు సంబంధించిన టికెట్లు మొత్తం బుక్ అయిపోతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలు, ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్న వారికి టికెట్లు దొరకడం లేదనే ఫిర్యాదులు రావడంతో టీటీడీ దీనిపై దృష్టి సారించింది. సామాన్య భక్తులకు కూడా రూ.300 దర్శనం టికెట్లు అందేలా చేయాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థతో మాట్లాడి ఇటీవల సర్వర్ సామర్థ్యం పెంచేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ భక్తుల డిమాండ్‌ను టీటీడీ అందుకో లేకపోతోంది. నెల రోజుల్లో అందుబాటులోకి ‘క్లౌడ్’ ఇకపై ఇంటర్నెట్ స్పీడ్‌తో సంబంధం లేకుండా క్లౌడ్ మేనేజ్మెంట్ టెక్నాలజీని వాడుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఈ టెక్నాలజీతో టీటీడీ వెబ్‌సైట్‌ను ఒకేసారి లక్షల మంది హిట్ చేసినా..ఆటో స్కేలింగ్ పద్ధతి ద్వారా సీపీయూ వర్చువల్ స్కేల్ అప్, స్కేల్ డౌన్‌తో ఆన్లైన్ ఇబ్బందులకు ఏ మాత్రం అవకాశం ఉండదని టీటీడీ భావిస్తోంది. ఒకవేళ ఆన్లైన్ సమస్య వచ్చినా మైక్రో సెకన్లలోనే తిరిగి పనిచేసేలా సాంకేతికత సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక పనులు కూడా టీటీడీ ప్రారంభించింది. మరో నెల రోజుల్లో క్లౌడ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ వినియోగించి ఆన్లైన్లో రూ.300 దర్శనం టికెట్లు జారీ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే సామాన్య భక్తులకు రూ.300 దర్శనం టికెట్లు సులువుగా లభిస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమల: రేపు ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
సాక్షి, తిరుమల: రానున్న ఆగస్టు నెలలో భక్తుల కోసం శ్రీ వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రేపు ఉ.9 గంటలకు టీటీడీ వెబ్సైట్లో ఈ దర్శనం టికెట్లను అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రోజుకు 5వేల చొప్పున టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. -
టీటీడీ బంపర్ ఆఫర్!
సాక్షి, చిత్తూరు(తిరుమల): వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీరికి టీటీడి ప్రత్యేకదర్శనం కల్పిస్తోంది. 4వేల టోకెన్లను ప్రత్యేకంగా వీరి కోసం కేటాయించినట్లు టీటీడి తెలిపింది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడి శ్రీవారి భక్తులను కోరింది. ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడి తెలిపింది. ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు ఇస్తున్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 5 సంవత్సరాల లోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను సుపథం మార్గం ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నారు. సాధారణరోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా దర్శనభాగ్యం కల్పిస్తారు. -
6, 20 తేదీల్లో వృద్ధులకు ప్రత్యేక దర్శనం
తిరుపతి (అలిపిరి) : వయోవృద్ధులు (65 ఏళ్లు పైబడినవారికి), దివ్యాంగులకు ఈనెల 6, 20వ తేదీల్లో తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టోకెన్లను టీటీడీ అదనంగా జారీ చేయనుంది. ఆయా తేదీల్లో ఉదయం 10.00 గంటలకు మధ్యాహ్నం 2.00 గంటలకు రెండు వేల టోకెన్లు, 3.00 గంటలకు వెయ్యి టోకెన్లు జారీ చేయనున్నారు. అలాగే ఈనెల 7, 21వ తేదీల్లో ఐదేళ్లలోపు చంటి పిల్లల తల్లిదండ్రులకు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం మార్గం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ పీఆర్వో రవి కోరారు. -
చంద్రగహణం.. నేడు ప్రత్యేక దర్శనాలు రద్దు
సాక్షి, తిరుమల: చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో బుధవారం అన్నప్రసాదాల వితరణను టీటీడీ నిలిపివేసింది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. గ్రహణం కారణంగా ఉదయం 11 నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 5.18 గంటలకు గ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతున్నందున రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది. అలాగే శేషాచలగిరుల్లో నెలవైన పుణ్యతీర్థాల్లో ఒకటైన రామకృష్ణ తీర్థానికి భక్తులు భారీగా తరలిరానున్నందున టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాగా, శ్రీవారిని ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో నటి లావణ్యత్రిపాఠి, క్రికెట్ సెలక్షన్ కమిటీ సభ్యుడు చాముండేశ్వరీ నాధ్లు దర్శించుకున్నారు. -
దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం
సాక్షి, తిరుమల : వయో వృద్ధులు, దివ్యాంగులు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులకు సులభంగా శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టీటీడీ ప్రతినెలా రెండు సాధారణ రోజుల్లో ప్రత్యేక దర్శనాల ను కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 9, 29 తేదీల్లో వయోవృద్ధులు (65 సంవత్సరాలు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. 5 సంవత్సరా లలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఈనెల 10, 30 తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. -
8, 29లలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం
సాక్షి, తిరుమల: వయో వృద్ధులు, దివ్యాంగులు, అయిదేళ్ల లోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులు ఎక్కువమందికి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టీటీడీ ప్రతినెలా రెండు సామాన్య రోజులను కేటాయిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 9, 29 తేదీల్లో 65 సంవత్సరాలు పైబడినవారు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. ఇప్పటికే వృద్ధులు, దివ్యాంగులకు రోజూ ఉదయం 10, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. భక్తుల కోరిక మేరకు మరింతమందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండు రోజులపాటు టీటీడీ అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తోంది. అయిదేళ్ల లోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఈనెల 10,30 తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో సంవత్సరం లోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. -
వైకుంఠ ఏకాదశి రోజు ఉ: 5.30 నుంచి శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈనెల 29న ఉదయం 5.30 నుంచి శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార ప్రవేశం కల్పిస్తామని టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఏకాదశి ఏర్పాట్లను మంగళవారం ఆయన మీడియాకు వెల్లడించారు. 29న వైకుంఠ ఏకాదశి, 30న ద్వాదశి, నూతన ఆంగ్ల సంవత్సరాది కారణంగా ఈ నెల 28 నుంచి జనవరి 1 వరకు 5 రోజులపాటు అన్ని రకాల ఆర్జితసేవలు, కాలిబాట దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశామన్నారు. వాటితోపాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, విరాళాలిచ్చిన దాతలకు ప్రత్యేక దర్శనాలు ఉండవన్నారు. ఏకాదశి రోజు ఉదయం 12.01 గంటలకు వైకుంఠ ద్వారం తెరిచి, నిత్య, ధను ర్మాస పూజలు నిర్వహిస్తామన్నారు. రాజ్యాంగపరమైన హోదాలో ఉన్నవారికి, ఇతర ప్రముఖులకు దర్శనం, వసతి ఏర్పాట్ల విషయమై ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని జేఈవో వెల్లడించారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, సినీ దర్శకుడు రాఘవేంద్రరరావు, సంగీత దర్శకుడు ఇళయరాజా, సినీనటుడు సోనూసూద్, నిర్మాత అశ్వినీదత్, టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి, ఏపీ క్రికెట్ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వర్, కేంద్ర అధికార భాషా(హిందీ) అకాడమి చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ సురేష్ ఎన్ పటేల్, గాయకులు శ్రావణభార్గవి, హేమచంద్ర దంపతులు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.