సాక్షి, తిరుమల: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రావణమాసం కావడంతో తిరుమలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు.. నేడు వరలక్ష్మి వ్రతం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.
వివరాల ప్రకారం.. తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) 64,695 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,473 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం తిరుమల హుండీ ఆదాయం రూ.4.60కోట్లుగా ఉంది.
ఇదిలా ఉండగా.. నేడు వరలక్ష్మి వ్రతం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈనెల 25వ తేదీన తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం జరుగనుంది. ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వ్రతం జరుగుతుంది. అయితే, ఈ వ్రతానికి భక్తులు నేరుగా, వర్చువల్‌గా పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఇక, సాయంత్రం ఆరు గంటలకు స్వర్ణరథంపై మాడవీధుల్లో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
ఇది కూడా చదవండి: ఈ రాశి వారికి సకాలంలో పనులు పూర్తి, శుభవార్త వింటారు
Comments
Please login to add a commentAdd a comment