Varalakshimi Vratham
-
వరలక్ష్మీ వ్రతం ప్రాశస్త్యం? ఈజీగా చేసుకోవాలంటే..?
శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది. భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీసూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘'వర'అంటే శ్రేష్ఠమైన అని అర్థం కూడా ఉంది.సిద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతిశ్రీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదాకార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ వ్రతకథ చెబుతోంది. ఈ వ్రతం రోజు చదివే వరలక్ష్మీ కథలో.. సాక్షాత్తూ లక్ష్మీ దేవే కలలో సాక్షాత్కరించి, వ్రత విధానాన్ని వివరించడం.. గృహిణిగా చారుమతి ఆదర్శనీయతకు నిదర్శనం. నిస్వార్థత, తోటివారికి మేలు కలగాలనే మనస్తత్వం, ఎలాంటి భేదభావాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే సహృదయత కలిగిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఈ కథ తెలియజేస్తోంది. ఈ లక్షణాలను అందరూ అలవరచుకోవాలనే సందేశాన్ని ఇస్తోంది.పూజా విధానం..భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం కూడా ఉంది.శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి, మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఇంటి ఆచారాన్ని బట్టి కలిశం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవడం లేదా అమ్మవారి ఫొటో లేదా రూపును తెచ్చుకుని పూజించాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.తోరం తయారు చేయు విధానం..తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.ఆ రోజు వీలుకాకపోతే..శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.కేవలం వరాల కోసం కాదు..లక్ష్మీ పూజ అంటే కేవలం ధన, కనక, వస్తు రూపాలను అర్థించడానికి కాదు... భావ దారిద్య్రాన్ని తొలగించాలని ప్రార్థించడానికి. మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతం, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవడం.. ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలి.(చదవండి: అభిషేకప్రియుడైన శివుడికి చీపురు సమర్పించడం గురించి విన్నారా..?) -
పూజలో పాల్గొన్న మెగా వారసురాలు.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా కోడలు ఉపాసన కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ఈ ఏడాది జూన్‌లో మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేస్తున్నట్లు మెగాస్టార్ రివీల్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టడంతో పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం తన బిడ్డతో కలిసి మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. (ఇది చదవండి: గిఫ్ట్‌గా వంద కోట్ల లగ్జరీ విల్లా.. స్వర్గాన్ని తలపిస్తున్న షారుక్ సౌధం! ) తాజాగా తన ముద్దుల కూతరు క్లీంకారతో కలిసి తొలిసారిగా వరలక్ష్మీ పూజలో పాల్గొన్న ఫోటోను షేర్ చేసింది. ఇంతకు మించి మరేది అడగలేను.. క్లీంకారతో మొదటి వరలక్ష్మీ వ్రతం పూజ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలో క్లీంకార ఫేస్ కనపడకుండా కవర్ చేసింది ఉపాసన. ఈ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మా చిట్టి తల్లి కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరికొందరేమో క్లీంకార ఫేస్ చూడాలని ఆసక్తిగా ఉందంటూ పోస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. కాగా.. ఇటీవలే ఒంటరి మహిళల కోసం అపోలో ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఉచిత సేవలందిస్తున్నట్లు ఉపాసన ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పెళ్లిపై కాంచన నటి ఆసక్తికర కామెంట్స్.. గట్టిగానే కౌంటర్! ) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తాం? వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..
వరలక్ష్మీ ప్రసన్నత శ్రావణ మాసం వ్రతాల, నోముల మాసం. వాన ఇచ్చిన కొత్తందాలు, కొత్త మొలకలు, పచ్చదనాల పలకరింతలు మొదలయ్యే చల్లని నెల. 'ఆర్ద్రాం పుష్కరిణీం' అని శ్రీసూక్తం వర్ణించినట్లు 'ఆర్ద్రత' కలిగిన కరుణ రస స్వరూపిణీ జగదంబను గౌరిగా, లక్ష్మిగా ఆరాధించే మాసమిది. ఈ మాసం సర్వదేవతా ప్రీతికరం. శ్రావణ సోమవారాలు శివునకు అత్యంత ప్రీతికరాలు. అందుకే ఉత్తరాదిలో కాశీ, ఉజ్జయిని, సోమనాథ్ వంటి శివక్షేత్రాలు శివవ్రతాచరణ చేసే భక్తులతో కిటకిటలాడుతుంటాయి. మంగళవారం గౌరీ వ్రతాలు, శుక్రవారం లక్ష్మీవ్రతం, శ్రావణ పూర్ణిమ హయగ్రీవ జయంతి - ఇలా శ్రావణమాసమంతా ఒక మంగళకర వాతావరణాన్ని దర్శించింది మన సంప్రదాయం. శుక్రవారం భారతీయులకు పవిత్ర దినాల్లో ఒకటి. శక్తి ఆరాధనకు ప్రశస్తి. అందునా శ్రావణ మాసం - శుక్లపక్షం... చంద్రకళలు వృద్ధి చెందే శుక్ల పక్షపు శుక్రవారం... పైగా పూర్ణిమకు దగ్గరగానున్న శుక్రవారం మహాప్రాశస్త్యం. ఈ ఏడాది పూర్ణిమ ముందు శుక్రవారం లక్ష్మీ పూజ కొందరు చేస్తే, సరిగ్గా పూర్ణిమా శుక్రవారం కలసిన రోజున కొందరు వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారు. రెండూ మహిమాన్వితాలే. అసలు వలక్ష్మీవ్రతం అంటే ఏమిటి? ఎందుకు చేస్తాం?..ఆమెను ఎలా ప్రసన్నం చేసుకోవాలి?.. అమ్మవారు రసస్వరూపిణి. అందుకే రసమయుడైన చంద్రుని కళల వృద్ధిని అనుసరించి ఆమెను మనం ఆరాధించడం. 'చన్ద్రాం చన్ద్రసహోదరీం' అని లక్ష్మీనామాలు. చంద్రుని తోబుట్టువు - అని పురాణాల మాట. ఆహ్లాదం, ప్రసన్నత, ఆర్ద్రత (రసస్వభావం), నిండుదనం, ప్రీతి... మొదలైనవన్నీ చంద్ర భావనలు. ఈ భావనల దేవత లక్ష్మి. విశ్వవ్యాపక చైతన్యం వివిధ భావాలుగా వ్యక్తమవుతుంటుంది. ప్రసన్నత, గాంభీర్యం, ప్రచండత, సౌజన్యం, కారుణ్యం, కాఠిన్యం... ఈ భావాలన్నీ విశ్వచైతన్య విన్యాసాలే. ఆయా భావనల రూపంగా ఆ మహా చైతన్యాన్ని గ్రహించడమే వివిధ దేవతా రూపాల ఆవిష్కారం. ఒకే చైతన్యం నుంచి అన్ని భావనలు వ్యక్తమైనట్లుగానే, ఒకే పరమాత్మను అనేక దేవతాకృతుల్లో ఆరాధిస్తున్నారు. విశ్వవ్యాపకమైన శోభ, కళ, ఆర్ద్రత, సంపద, కాంతి, సౌమ్యత, వాత్సల్యం, ఉత్సాహం, ఆనందం వంటి దివ్య భావనలన్నీ సమాహారం చేస్తే ఆ స్వరూపమే లక్ష్మి. జగతిని పోషించే ఐశ్వర్యశక్తి, లక్షణ శక్తి లక్ష్మి. ఏ వస్తువు లక్షణం దానికి ఐశ్వర్యం. కంటికి బంగారు కళ్లజోడు లక్ష్మికాదు. కంటికి చక్కని చూపు, చక్కని ఆకృతి లక్ష్మి. ఇలా ప్రకృతిలో ప్రతి పదార్థానికి ఉండవలసిన లక్షణ సమృద్ధి, కళ లక్ష్మీ స్వరూపం. ఏ రంగంలోనైనా ఉన్నతే.. సిద్ధ లక్ష్మీః మోక్షలక్ష్మీః జయలక్ష్మీః సరస్వతీ! శ్రీర్లక్షీః వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ॥ ఏ కార్యమైనా సిద్ధే ప్రయోజనం. అది లేనపుడు కార్యానికి ప్రయత్నమే ఉండదు. అందుకే 'సిద్ధి' అనేది మొదటి లక్ష్మి. సిద్ధించిన తరువాత కార్య భారం నుంచి విముక్తులమవుతాం. ఇల్లు పూర్తవడం అనే సిద్ధి లభించాక, ఇల్లు కట్టడం అనే కార్య శ్రమ నుంచి విడుదల పొందినట్లుగా. ఆ ముక్తియే 'మోక్ష లక్ష్మి'. ప్రతికూల పరిస్థితులను దాటడమే జయలక్ష్మి. పనికి కావలసిన తెలివి తేటలు, సమయస్ఫూర్తి సరియైన నిర్ణయశక్తి విజ్ఞానం... వంటివన్నీ విద్యా లక్ష్మి, అదే 'సరస్వతి', ఫలితంగా పొందే సంపద, ఆనందం శ్రీ లక్ష్మి. దాని వలన కలిగే శ్రేష్ఠత్వం, (ఏ రంగంలోనైనా) ఉన్నతి వరలక్ష్మి. చివరి గమ్యం ఇదే. అందుకే వరలక్ష్మీ వ్రతమంటే మిగిలిన ఐదు లక్ష్ములను కూడా ఆరాధించి, ఆ అనుగ్రహాన్ని సంపాదించడమే. వరలక్ష్మీ కథ ముఖ్యోద్దేశం.. ఈ పూజలో ఆరాధించే స్వరూపం 'కలశం'. కలశంలో బియ్యమో, జలమో వేసి పచ్చని చిగుళ్ళు పెట్టి, దానిపై ఫలాన్ని ఉంచి ఆరాధించడం గొప్ప విశేషం. బ్రహ్మాండమనే కలశంలో సంపద, పచ్చదనం (మంగళం), సత్ఫలం నిండి ఆరాధన పొందుతున్నాయి. వ్రతంపై శ్రద్ధను పెంచడానికి పురాణం అందించిన కథలో - 'చారుమతి’ అనే సాధ్వి లక్ష్మీ దయను పొంది అమ్మను ఆరాధించింది. ఇది నిజానికి కథా పాత్ర కాదు. భవగదారాధనకు కావలసిన పాత్రత. దైవాన్ని ఆరాధించే వారి మతి 'చారుమతి’ కావాలి. ఉత్తమమైన గుణాలే 'చారు' (చక్కదనం). అవి కలిగిన బుద్ధి చారుమతి. ఆ బుద్ధిని లక్ష్మి కరుణిస్తుంది. ఈ సంకేతమే ఆ కథ అందించే సందేశం. పొందే సంపదలన్నీ దేవతా స్వరూపాలుగా, ప్రసాదాలుగా (ప్రసన్న భావాలుగా) దర్శింపజేసే సత్సంప్రదాయాలు మనవి. 'వరం' అంటే శ్రేష్ఠత. ప్రతిదీ శ్రేష్టమైనదే కావాలని అనుకుంటుంటాం. అలాంటి శ్రేష్టతలను ప్రసాదించే జగదంబ వరలక్ష్మి. ఆ తల్లి ప్రసన్నత కన్నా కావలిసిందేముంది!. (చదవండి: నేడు నాగ పంచమి?..గరుడు పంచమి? అనలా! ఎందుకిలా అంటే..) -
తిరుమల: పెరిగిన భక్తుల రద్దీ.. నేడు వరలక్ష్మి వ్రతం టికెట్ల విడుదల
సాక్షి, తిరుమల: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రావణమాసం కావడంతో తిరుమలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు.. నేడు వరలక్ష్మి వ్రతం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. వివరాల ప్రకారం.. తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) 64,695 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,473 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం తిరుమల హుండీ ఆదాయం రూ.4.60కోట్లుగా ఉంది. ఇదిలా ఉండగా.. నేడు వరలక్ష్మి వ్రతం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈనెల 25వ తేదీన తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం జరుగనుంది. ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వ్రతం జరుగుతుంది. అయితే, ఈ వ్రతానికి భక్తులు నేరుగా, వర్చువల్‌గా పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఇక, సాయంత్రం ఆరు గంటలకు స్వర్ణరథంపై మాడవీధుల్లో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఇది కూడా చదవండి: ఈ రాశి వారికి సకాలంలో పనులు పూర్తి, శుభవార్త వింటారు -
ప్రజలకు వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ ఈ శుభ శ్రావణ మాసంలో, ప్రజలంతా భక్తి శ్రద్ధలతో శ్రీవరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి, అమ్మవారి ఆశీస్సులు పొందాలి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అందరికీ సకల సౌభాగ్యాలూ లభించాలని కోరుతూ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. ఈ శుభ శ్రావణ మాసంలో, ప్రజలంతా భక్తి శ్రద్ధలతో శ్రీవరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి, అమ్మవారి ఆశీస్సులు పొందాలి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అందరికీ సకల సౌభాగ్యాలూ లభించాలని కోరుతూ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు.#varalakshmivratam — YS Jagan Mohan Reddy (@ysjagan) August 20, 2021 చదవండి : అవినీతికి తావివ్వద్దు : సీఎం జగన్ -
వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి
-
వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారి వనంగుడిలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వత్రాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ పి.భానురాజా ఆధ్వర్యంలో 200 మంది మహిళలు వ్రతాలు చేశారు. హిందు ధర్మ ప్రచార మండలి, పైడితల్లి అమ్మవారి దేవస్థానం సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఉదయం 8 గంటల నుంచి ఆలయ అర్చకులు రవిప్రసాద్, సీతారాం, వాసు, దూసి పంతులు, శంబరి శంకరంలు కుంకుమార్చనలు, సువర్ణ పుష్పార్చన కార్యక్రమాలను నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతాలకు సంబంధించిన సామాగ్రిని దాతలు వేణు, జ్ఞానప్రకాష్, శ్రీనివాస్, సత్యనారాయణ , తాయారు జ్యూయలర్స్, సంజీవరావు ఆలయ ఏసీకి అందజేశారు. పూజ అనంతరం కంకణధారణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆల య సిబ్బంది పి.వి.సత్యనారాయణ, అప్పలనాయుడు, రామారావు, రాజు, తదితరులు పాల్గొన్నారు. భక్తులతో ఆలయాలు కిటకిట పార్వతీపురం టౌన్ : పట్టణంలోని పలు దేవాలయాల్లో ఆఖరి శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా దుర్గాదేవి, పార్వతీదేవి, కన్యకాపరమేశ్వరి, సత్యనారాయణ స్వామి తదితర దేవాలయాల్లో వరలక్ష్మీ వ్రతాలు, పూజలు జరిగాయి. ఆయా దేవాలయాల్లో అర్చకులు బి.కృష్ణమూర్తి శర్మ , సుబ్రహ్మణ్య శర్మ తదితరుల అధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమార్చన, సహస్రనామార్చన తదితరవి చేశారు. దీనిలో భాగం గా స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘ నాయకుల ఆధ్వర్యంలో పార్వతీదేవి ఆల యంలో పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం పూజలు సందర్భం గా పట్టణ పరిసరాల నుంచి వేలాది మహిళలు పట్టణానికి వచ్చారు. దీంతో భక్తులతో ఆయా దేవాలయాలన్ని కిక్కిరిశాయి. సంతోషిమాత ఆలయంలో సహస్రదీపాలంకరణ విజయనగరం కల్చరల్: శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో స్థానిక మయూరి జంక్షన్లో ఉన్న సంతోషిమాత ఆలయంలో రాత్రి సహస్రదీపాలంకరణ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చారు. అమ్మవారి దర్శనార్థం మహిళలు బారులుతీరారు. ఆల య అర్చకులు రమేష్ తివారీ పూజాకార్యక్రమాలను జరిపారు. ఆలయాల్లో శ్రావణ మాస ప్రత్యేక పూజలు బెలగాం: పట్టణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక రైల్వేగేటు సమీపంలోని ఉన్న బంగారమ్మగుడి, ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో దుర్గగుడి, అగ్రహారం వీధి ఈశ్వరాలయం, తదితర ఆలయాలలో ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. కుంకుమ పూజలు, చీరలు చూపించి , మొక్కులను తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిర్వహకులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తోటపల్లిలో వ్రతాలు గరుగుబిలి: తోటపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వరలక్ష్మీ పూజలను అర్చకులు పి.గోపాలకృష్ణమాచార్యు లు, వి.వి.అప్పలాచార్యులు, శ్రీనివాసాచార్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు. ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో మహిళలు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ఈ మేరకు గరుగుబిల్లి, కొత్తూరు, గొట్టివలస, శివ్వాం తదితర గ్రామాల్లోని శివాలయాల్లో వ రలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. మహిళలు అమ్మవారికి అర్చనలు, కుంకుమ పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.