విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారి వనంగుడిలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వత్రాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ పి.భానురాజా ఆధ్వర్యంలో 200 మంది మహిళలు వ్రతాలు చేశారు. హిందు ధర్మ ప్రచార మండలి, పైడితల్లి అమ్మవారి దేవస్థానం సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఉదయం 8 గంటల నుంచి ఆలయ అర్చకులు రవిప్రసాద్, సీతారాం, వాసు, దూసి పంతులు, శంబరి శంకరంలు కుంకుమార్చనలు, సువర్ణ పుష్పార్చన కార్యక్రమాలను నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతాలకు సంబంధించిన సామాగ్రిని దాతలు వేణు, జ్ఞానప్రకాష్, శ్రీనివాస్, సత్యనారాయణ , తాయారు జ్యూయలర్స్, సంజీవరావు ఆలయ ఏసీకి అందజేశారు. పూజ అనంతరం కంకణధారణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆల య సిబ్బంది పి.వి.సత్యనారాయణ, అప్పలనాయుడు, రామారావు, రాజు, తదితరులు పాల్గొన్నారు.
భక్తులతో ఆలయాలు కిటకిట
పార్వతీపురం టౌన్ : పట్టణంలోని పలు దేవాలయాల్లో ఆఖరి శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా దుర్గాదేవి, పార్వతీదేవి, కన్యకాపరమేశ్వరి, సత్యనారాయణ స్వామి తదితర దేవాలయాల్లో వరలక్ష్మీ వ్రతాలు, పూజలు జరిగాయి. ఆయా దేవాలయాల్లో అర్చకులు బి.కృష్ణమూర్తి శర్మ , సుబ్రహ్మణ్య శర్మ తదితరుల అధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమార్చన, సహస్రనామార్చన తదితరవి చేశారు. దీనిలో భాగం గా స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘ నాయకుల ఆధ్వర్యంలో పార్వతీదేవి ఆల యంలో పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం పూజలు సందర్భం గా పట్టణ పరిసరాల నుంచి వేలాది మహిళలు పట్టణానికి వచ్చారు. దీంతో భక్తులతో ఆయా దేవాలయాలన్ని కిక్కిరిశాయి.
సంతోషిమాత ఆలయంలో సహస్రదీపాలంకరణ
విజయనగరం కల్చరల్: శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో స్థానిక మయూరి జంక్షన్‌లో ఉన్న సంతోషిమాత ఆలయంలో రాత్రి సహస్రదీపాలంకరణ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చారు. అమ్మవారి దర్శనార్థం మహిళలు బారులుతీరారు. ఆల య అర్చకులు రమేష్ తివారీ పూజాకార్యక్రమాలను జరిపారు.
ఆలయాల్లో శ్రావణ మాస ప్రత్యేక పూజలు
బెలగాం: పట్టణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక రైల్వేగేటు సమీపంలోని ఉన్న బంగారమ్మగుడి, ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో దుర్గగుడి, అగ్రహారం వీధి ఈశ్వరాలయం, తదితర ఆలయాలలో ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. కుంకుమ పూజలు, చీరలు చూపించి , మొక్కులను తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిర్వహకులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
తోటపల్లిలో వ్రతాలు
గరుగుబిలి: తోటపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వరలక్ష్మీ పూజలను అర్చకులు పి.గోపాలకృష్ణమాచార్యు లు, వి.వి.అప్పలాచార్యులు, శ్రీనివాసాచార్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు. ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో మహిళలు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ఈ మేరకు గరుగుబిల్లి, కొత్తూరు, గొట్టివలస, శివ్వాం తదితర గ్రామాల్లోని శివాలయాల్లో వ రలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. మహిళలు అమ్మవారికి అర్చనలు, కుంకుమ పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు
Published Sat, Aug 31 2013 4:51 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement
Advertisement