sravana masam
-
శ్రావణమాసం : రాగి, ఇత్తడి, పూజా పాత్రలు తళ తళలాడాలంటే, చిట్కాలివిగో!
శ్రావణమాసంలో కొత్త పెళ్లికూతుళ్లు మాత్రమే కాదు, ప్రతి ఇల్లు అందంగా ముస్తాబవుతుంది. ముత్తయిదువులందరూ ఇంటి అందాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందంగా అలంకరించిని ఇంట్లో స్వయంగా ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. ఇంటిని పూలతోరణాలు, మామిడాకులతో అందంగా తీర్చిదిద్దుదాం. ఇంట్లో పూజ గది నుండి వంటగది వరకు ప్రతిదీ శుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. అలాగే అలంకరణ నిమిత్తం ఇంటి ముందు, వసారాలో పెద్ద పెద్ద ఇత్తడి పాత్రలను, దీపపు కుందులను అమర్చుతారు. ఆరోగ్యంపై పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో ఇత్తడి, రాగి , కంచు పాత్రల వాడకం బాగా పెరిగింది.చింతపండు:ఇత్తడి, రాగి పాత్రల మురికి వదిలించాలంటే అందరికీ గుర్తొచ్చేది చింతపండు గుజ్జు. చింతపండుతో, ఆ తరువాత మట్టితో తోమడం పెద్దల నాటినుంచి వస్తున్నదే. చింతపండును నీళ్లలో నానబెట్టి ఆ గుజ్జుతో రుద్దితే ఇత్తడి సామానులకు పట్టిన మకిలి, చిలుము అంతా పోయి గిన్నెలు మెరుస్తాయి. నిమ్మకాయను కూడా ఉపయోగించవచ్చు. వీటిని ఆరనిచ్చి మెత్తని గుడ్డతో తుడిచి ఎండలో కాసేపు ఆరనివ్వాలి.వంట సోడా: రాగి, ఇత్తడి మెరిసేలా చేయడానికి దానిపై బేకింగ్ సోడా, సబ్బును అప్లయ్ చేయాలి. ఆ తరువాత శుభ్రంగా తోమాలి. గోధుమ పిండి: గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, టీస్పూన్ వైట్ వెనిగర్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయండి. తరువాత ఈ పేస్ట్‌ను ఇత్తడి లేదా రాగి పాత్రలపై అప్లై చేసి, కాసేపు అలాగే ఉంచండి. స్క్రబ్బింగ్, క్లీనింగ్ తర్వాత అది మెరుస్తుంది.వెనిగర్: ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి, పాలిష్ చేయడానికి వైట్ వెనిగర్ ఒక అద్భుతంగా పని చేస్తుంది. గ్లాసు నీటిలో రెండు చెంచాల వెనిగర్ ఉడికించింది. దీనికి లిక్విడ్ డిష్ వాషర్ కానీ, విమ్ పౌడర్ గానీ మిక్స్ చేసి తోమి కడిగితే, పూజా వస్తువులు మెరుస్తాయి.నిమ్మ ఉప్పు: ఇత్తడి పాత్రలు కొత్తవిలా మెరిసిపోయేలా చేయడానికి నిమ్మ ఉప్పు ఉపయోగించండి. నిమ్మరసం, ఉప్పు కలపడం ద్వారా ఒక ద్రావణాన్ని సిద్ధం చేసి, దానిని ఇత్తడి పాన్‌కు అప్లై చేసి పాన్‌ను రుద్దండి. ఇలా చేయడం వల్ల ఇత్తడిపై నలుపు పోయి, ఇత్తడి పాత్రలు మెరుస్తాయి.పీతాంబరీ: ఇత్తడి, రాగి పాత్రలను శుభ్రం చేయడానికి పీతాంబరిమరో బెస్ట్ ఆప్షన్. బాగా కడిగిన మెత్తటి గుడ్డతోతుడిచి ఆరనివ్వాలి. -
శ్రావణమాస ఉపవాసాలు : నీరసం రాకుండా, శక్తి కోసం ఇలా చేయండి!
ఆగస్టు మాసం వచ్చిందంటే పండుగ వాతావరణం వచ్చినట్టే. ఒకవైపు శ్రావణమాస సందడి.మరోవైపు ఆగస్టు 15 స్వాత్రంత్ర్య దినోత్సవ సంబరాలతో దేశభక్తి వెల్లివిరుస్తుంది. అంతేనా ఈ ఆగస్టు మాసంలో రాఖీపండుగ, కృష్ణాష్టమి కూడా కూడా. అలాగే శివుడ్ని కూడా ఆరాధిస్తారు. ముఖ్యంగా పవిత్ర శ్రావణమాసంలో మహిళలు శుక్రవార లక్ష్మీవ్రతం, మంగళవార వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఉపవాసం ఉంటారు. పుజాదికాలు, వంటలు చేయాలంటే శరీరానికి శక్తి కావాలి కదా. ఉపవాస దీక్షకు భంగం కాకుండా, శరీరం బలహీన పడకుండా ఉత్సాహంగా పనిచేసుకునేలా కొన్ని పానీయాల గురించి తెలుసుకుందాం.ఉపవాసంలో శక్తినిచ్చే పానీయాలుఉపవాసం ఉన్నప్పు హైడ్రేషన్ చాలా ముఖ్యం. ఆకలిగా అనిపించినప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతాము. దీన్ని నివారించడానికి ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అయితే సాధారణంగా కాఫీ, టీలతొ ఉపవాసాన్ని ఆచరిస్తారు చాలామంది. తక్షణ శక్తికోసం ఇవి కొంతవరకు ఉపయోగ పడతాయి. కానీ ఖాళీ కడుపుతో కాఫీ, టీలకు బదులుగా మజ్జిగ ,కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు పనిచేస్తాయి. గ్యాస్ సమస్యలు రాకుండా కడుపులో చల్లగా ఉండేలా చేస్తాయి.మజ్జిగ: ఉపవాసాల సమయంలో మజ్జిగను మించింది మరొకటి ఉండదు. పల్చటి మజ్జిగ శరీరానికి శక్తిని ఇస్తుంది. ఉపవాస దీక్షకు భంగం అనుకుంటే ఉప్పును మానివేసి,చక్కెర కలుపుకొని తాగవచ్చు.రుచికోసం వేయించిన జీలకర్ర పొడి,పుదీనా, నిమ్మరసం కలిపి తాగొచ్చు. కడుపునకు చల్లదనాన్నిచ్చి, ఉత్సాహంగా ఉంటుంది.నిమ్మరసం: బాగా నీరసం అనిపించినపుడు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి నిమ్మరసం చాలా మంచిది. ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, తెనె కలుపుకొని తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. కొబ్బరి నీళ్లు: సహజసిద్ధంగా లభించే కొబ్బరి నీరు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. పొటాషియం, సోడియం, మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి. శక్తినిచ్చి, నీరసం రాకుండా కాపాడుతుంది.పండ్ల రసాలు: ఉపవాసం సమయంలో సీజన్లో దొరికే అన్ని రకాల పండ్లను తినవచ్చు. మరింత శక్తి కావాలనుకుంటే బత్తాయి, యాపిల్, పైనాపిల్,మామిడి పండ్ల రసాలు, మిల్క్ షేక్ తాగవచ్చు. దానిమ్మ, జామ తదితర పండ్లతో సలాడ్‌లా చేసుకొని తినవచ్చు.బాదం పాలు బాదం పాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శ్రావణ మాసంలో వాతావరణంలో బాదం పాలు తాగడం వల్ల తక్షణ శక్తిలభిస్తుంది. వేడి పాలల్లో కొద్దిగా జీడి పప్పు పలుకులు, పంచదార లేదా తేనె,బాదం పొడిని కలుపుకుని తాగాలి. దీంతో పొట్ట నిండుగా ఉండి, మనసుకు ఉత్సాహంగా అనిపిస్తుంది. -
అసలు తగ్గింపు ఇక నుంచే.. శ్రావణం ముంగిట శుభవార్త!
శ్రావణ మాసం వస్తోంది. అసలే పెళ్లిళ్ల సీజన్. అదీకాక శుభకార్యాలు అధికంగా జరిగేది ఈ నెలలోనే. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. శ్రావణ మాసంలో బంగారం కొనుగోలు చేసేవారికి ఇది నిజంగా శుభవార్త. అది ఏంటంటే..ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం దిగుమతి సుంకాల తగ్గింపును అమలు చేయడంతో బంగారం ధరలు 9% తగ్గుతాయని అంచనా. తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తవడంతో గురువారం నుంచి తక్కువ ధరలో బంగారం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ప్రభావం కొన్ని రోజులుగా బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటి నుంచి బంగారం ధరలు రూ.4,000 మేర తగ్గాయి. అయితే అవసరమైన కస్టమ్స్ విధానాల కారణంగా ప్రకటన అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు ఈ ఫార్మాలిటీలన్నీ పూర్తయినందున సవరించిన దిగుమతి సుంకం ప్రకారం బయటి నుంచి బంగారం భారత్ చేరుకోవడం ప్రారంభమవుతుంది. ఆగస్టు 1 నుంచి రిటైల్ అమ్మకానికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.ఎంత మేర తగ్గుతాయి?కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తి కావడానికి వారం రోజుల సమయం పట్టిందని ఆల్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి తగ్గిన దిగుమతి సుంకం ప్రకారం బంగారం దేశంలోకి రావడం ప్రారంభమవుతుంది. ఇది రిటైల్ బంగారం ధరలపై ప్రభావం చూపనుంది. దిగుమతి సుంకంలో 9% తగ్గింపుతో తులం (10 గ్రాములు) బంగారంపై రూ. 5,000 నుంచి రూ. 6,000 తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.దిగుమతి సుంకం తగ్గింపు బంగారం బ్లాక్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతుందని యోగేష్ సింఘాల్ పేర్కొన్నారు. అధిక సుంకం కారణంగా ఆభరణాల వ్యాపారులు అక్రమ దిగుమతి పద్ధతులు అవలంభించేవారు. దీంతో ఆ భారాన్ని కస్టమర్ల మీద వేసేవారు. ఈ రూపంలో వినియోగదారుల నుంచి 15% వసూలు చేసేవారు. ఇప్పుడు సుంకం తగ్గడంతో అక్రమ పద్ధతులకు నగల వ్యాపారులు స్వస్తి పలికే అవకాశం ఉంటుంది. దీంతో ఆ అదనపు భారం కూడా కస్టమర్లపై తగ్గుతుందని భావిస్తున్నారు. -
పెన్సిల్వేనియాలో సామూహిక వరలక్ష్మి కుంకుమార్చన
-
అమెరికాలో ఘనంగా శ్రావణమాస మహోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు నగరాల్లో శ్రావణమాస మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. అమెరికాలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ తమ పండుగలను వేడుకలను వైభవంగా నిర్వహించుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కూడా తమ ప్రాంత వైభోగాన్ని, పండుగలను అందరితో కలిసి నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఏఏఏ డెలావేర్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం, కుంకుమపూజను ఘనంగా నిర్వహించారు. డెలావేర్‌లోని మిడిల్ టౌన్‌లోని జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పూజ కార్యక్రమాలతో పాటు పాటలు, డ్యాన్స్‌లు అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్యాలు, డ్యాన్స్‌లు, సంగీత విభావరులు, ఆట పాటలతో కార్యక్రమం ఉత్సహంగా సాగింది. ప్రముఖ సంగీత దర్శకులు కోటి సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ప్రముఖ సింగర్స్ హిట్టయిన పాటలను పాడి అందరిలో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసులు ఈ స్టాల్స్ వద్ద సందడి చేశారు. మహిళలకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ పిండివంటలతో తయారు చేసిన ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికీ పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పసందైన విందు భోజనం అందించారు. వరలక్ష్మీ వ్రతాన్ని అమెరికాలో ఉంటున్న భారతీయుల చేత ఘనంగా జరిపేందుకు వీలుగా శ్రావణ మహోత్సవాలు పేరిట కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల ఏఏఏ డెలావేర్ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: అమెరికా పర్యటనలో కేటీఆర్...క్రిటికల్ రివర్ కంపెనీతో భేటీ) -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్: రూ. 31.25 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని తెలుగు లోగిళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశంలోని పలు ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తూర్పగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని ముసలమ్మ తల్లి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆలయ నిర్వాహకులు సుమారు ₹13.25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో జగన్మాతను ప్రత్యేకంగా అలంకరించారు. రూపాయి, రెండు, ఐదు, పది,ఇరవై,ఏభై, వంద,రెండొందలు,అయిదొందలు సహా చెలామణిలో ఉన్న నోట్లతో అద్భుతంగా అమ్మవారిని అలంకరించారు. అలాగే బ్యాంకుల నుంచి కూడా కొత్త నాణేలు తీసుకొని అలంకరించడం మరో ప్రత్యేకత. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాము ప్రతి ఏడాది కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఇలా అలంకరిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. సుమారు 30 రోజుల పాటు ముప్పై మంది శ్రమించి ఈ అలంకరణ చేశారు. ఇక గతంలోనూ సంక్రాంతి,విజయదశమి, దీపావళి తదితర వేడుకల్లో అమ్మవారిని వినూత్న రీతిలో అలంకరిస్తూ ఈ ఆలయ కమిటీ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని ఇలా ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరించడం అందర్నీ ఆకట్టుకుంది. -
వరలక్ష్మీ వ్రతం ఎవరైనా చేయొచ్చా? పూజా విధానమేంటి?
Varalakshmi Vratham 2023: శ్రావణమాసం అంటేనే పండుగలు, శుభకార్యాలకు ప్రతీకగా పరిగణిస్తారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వరలక్ష్మి అంటే వరుడితో కూడిన లక్ష్మి అనే అర్థం ఉంది. ‘వర’అంటే శ్రేష్ఠమైంది అని అర్థం వస్తుంది. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీని భక్తి శ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రతం విశేషాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నిష్టలు, నియమాలు, మడులు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్వచ్ఛమైన మనసు, ఏకాగ్రత ఉండే భక్తితో ఈ వ్రతం చేస్తారో వారందరికీ శుభ యోగం కలిగి, అమ్మవారి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతారు. మహామాయారూపిణి, శ్రీ పీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంక, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్టయిశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని, అష్టలక్ష్మీ రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. ఈ వ్రతాన్ని శ్రావణపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఆచరిస్తారు. అది శ్రేష్టం కూడా. ఒకవేళ ఏదైనా కారణం వల్ల కుదరని పక్షంలో శ్రావణ పూర్ణిమ రోజున లేదా తర్వాతి శుక్రవారం చేసుకోవచ్చు. అదీ కుదరలేదంటే ఈ మాసంలో ఏ శుక్రవారమైనా సరే చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి? శ్రావణమాసంలో అత్యంత విశిష్టంగా భావించే వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అన్నది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఈ విధంగా వివరించారు. వరలక్ష్మీ వ్రత కథ : కైలాసగిరిలో పరమేశ్వరుడు తన అనుచర గణములతో, మునిశ్రేష్టులతో కూడియుండగా పార్వతీదేవి అక్కడికి వచ్చింది.స్వామీ! ప్రీలు సుఖసౌఖ్యాలను, పుత్రపొత్రాదులతో కళకళలాడుతూ ఉండాలంటే ఎటువంటి వ్రతాలను, నోములను ఆచరించాలో తెలియచేయవలసిందిగా కోరుతున్నాను అన్నది. పరమేశ్వరుడు సమాధానమిస్తూ 'స్త్రీలకు సమస్త సుఖాలను ప్రసాదించు వ్రతం వరలక్ష్మీవ్రతం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. వ్రతం పూర్తయ్యాక వ్రత కథను వినాలి. వ్రతాన్ని ఆచరించిన వారి మనోభీష్టాలు నెరవేరుతాయి. ఈ కథను తెలియచేస్తాను అని పరమేశ్వరుడు వ్రత కథను వినిపించాడు. పూర్వం కుండినం అనే ఒక పట్టణం ఉందేది. ఆ పట్టణాన చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె వేకువఝామునే లేచి స్నానమాచరించి పుష్పాలను తెచ్చి భర్త పాదాలకు నమస్కరించి పూజలు చేసేది. అత్తమామలకు తల్లిదండ్రుల వలె చూచుకుంటూ ఉందేది. గృహకార్యాలన్నీ స్వయంగా తానే చేసుకొనేది. చుట్టుప్రక్కల వారితో, బంధువులతో చనువుగా కలసిమెలసి ఉందేది. చారుమతి సద్దుణాలకు వరలక్ష్మీదేవి ప్రసన్నమైంది ఒకనాడు చారుమతి కలలో వరలక్ష్మీదేవి కనిపించి ఇలా అన్నది. చారుమతీ! నీ సత్ప్రవర్తనకు, సద్ద్గుణాలకు ప్రసన్నురాలిని అయ్యాను. నీకు ఒక వరం ఇవ్వాలన్న సంకల్పం కలిగింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. నీ సమస్త కోరికలు నెరవేరుతాయి. చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదవికి ప్రదక్షిణాలు చేసి స్తుతించింది. తెల్లవారిన తరువాత భర్త, అత్తమామలకు తన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది. చుట్టుప్రక్కల గల స్త్రీలు కూడా ఆ వృత్తాంతాన్ని విని సంతోషించారు. అందరూ కలసి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి సంకల్పించుకున్నారు. అందరూ శ్రావణ శుక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కొరకు వేచి చూడసాగారు. ఆరోజు చారుమతితో సహా ప్రీలందరూ వేకువ రూమననే లేచి స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించారు. చారుమతి వాకిట ముందర గోమయంతో అలికింది. అలికిన చోట బియ్యం పోసి మంటపాన్ని ఏర్పాటుచేసింది. ఆ మంటపంలోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసింది. భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించింది. ఆనాటి నుంచి ఆనవాయితీగా.. శ్లోః పద్మప్రియే పద్నిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాదపద్మం మయిధత్స్వ అనే శ్లోకాన్ని పఠిస్తూ షోడశోపచార పూజలు గావించింది. తొమ్మిది సూత్రములు గల తోరాన్ని దక్షిణి హస్తానికి కట్టుకున్నది. వరలక్ష్మీదేవికి వివిధ ఫలభక్ష్య పానీయ, పాయసాదులను సమర్పించింది. అనంతరం 'ప్రీలందరూ కలసి వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు. మొదటి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి ఘల్లు ఘల్లుమని శబ్దాలు వినిపించాయి. కిందికి కాళ్ళవైపు చూసుకుంటే గజ్జెలు, రెండవ ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారి హస్తాలు నవరత్నఖచిత కంకణాలతో ప్రకాశించసాగాయి. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే స్త్రీలందరూ సర్వాలంకార భూషణాలతో ప్రకాశించసాగారు. వారి గృహాలన్నీ సకల సంపదలతో సమృద్ధమయ్యాయి. వ్రతం పరిసమాప్తి కాగానే చారుమతి వ్రతం చేయించిన 'బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలాదులను ఇచ్చి సత్కరించింది. వరలక్ష్మీ ప్రసాదాన్ని బంధుమిత్రులకు పెట్టి తానూ భుజించింది. లోకోపకారం కొరకు చారుమతి అందరిచేత వరలక్ష్మీ వ్రతాన్ని చేయించిందని పౌరులందరూ ఆమెను ప్రశంసించారు. ఆనాటి నుంచి అందరూ ఈ వ్రతాన్ని చేయడం ఆనవాయితీగా వస్తుంది. -
శ్రావణంలో షాక్: వెండి, బంగారం ధరలు హై జంప్
Today Gold and Silver Prices: ఆల్టైంహైనుంచి దిగివచ్చిన వెండి బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. ముఖ్యంగా శ్రావణమాసంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో వరుస సెషన్లుగా పెరుగుతూ వస్తున్న ధరలు వినియోగ దారులను నిరాశ పరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా పసిడి, వెండి ధరలు పరుగందుకున్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు(ఆగస్టు 24,గురువారం) 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.220 పెరిగి రూ.59,450 ధరకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.54,500 పలుకుతోంది. ఇక వెండి అయితే ఏకంగా 1500 రూపాయలు ఎగిసి తిరిగి 80వేల రూపాయిల స్థాయికి చేరుకుంది. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా జోరందుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగార ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! గ్లోబల్‌గా ఎలా ఉన్నాయంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1922 డాలర్ల దగ్గర ఘుంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర 24 డాలర్లకు ఎగువన 24.26 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. -
మంగళ గౌరీ వ్రతం ఎవరైనా చేయొచ్చా? పూజ ఎలా చేయాలి?
శ్రావణ మాసమంటేనే ప్రత్యేకం. మహిళలు ఈ మాసం కోసం ఎదురుచూస్తారు. ఈసారి అధిక శ్రావణం రావడంతో ముహూర్తాలు లేక ఇన్నాళ్లు శుభ కార్యాలకు బ్రేక్ పడింది. ఈ నెల 17వ తేదీ నుంచి నిజ శ్రావణమాసం ఆరంభం కావడంతో వేలాదిగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి. ఈ నెలలో వరలక్ష్మీ వ్రతం ఆచరించేందుకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారు. శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని అంతే భక్తిశ్రద్ధలతో చేస్తుంటారు. శ్రావణమాసంలో మంగళవారాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. మరి ఈ వ్రతాన్ని ఎవరెవరు చేయొచ్చు, నియమాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. 25న వరలక్ష్మీ వ్రతం తెలుగు మాసాలన్నింటితో పోల్చితే ఈ మాసంలో పండగలు ఎక్కువగా వస్తాయి. జిల్లాలోని అమ్మవార్ల ఆలయాలు విశేష పూజలకు సిద్ధమవుతున్నాయి. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఈ నెల 25న ఈ వ్రతం చేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. 31న రాఖీ పౌర్ణమి. సోదరీ, సోదరుల అనుబంధానికి ఈ పండగ ప్రతీక. వరుణుడికి కొబ్బరి కాయలు సమర్పిస్తూ సముద్రంలోకి విసురుతారు. సెప్టెంబర్ 3న శ్రావణ బహుళ చవితి సందర్భంగా సంకష్ట హర చతుర్ధి వ్రతాలు ఆచరిస్తారు. ఈ రోజున గణపతి ఆలయాల్లో వినాయకుడికి విశేష పూజలు, వ్రతాలు చేస్తారు. సెప్టెంబర్ 6న శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 14న పోలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది. పెళ్లికాని అమ్మాయిలు వ్రతం చేయొచ్చా? శ్రావణమాసంలో మంగళవారాలకు కూడా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు. అయితే ఈ వ్రతం చేశాకా.. వాయినం ఇచ్చేటప్పుడు పసుపు, కుంకుమ ఇవ్వరంటా.. ఎందుకో ఇప్పుడు తెలుసకుందాం.నాలుగు మంగళవారాలు.. మహిళలు మంగళగౌరీ వ్రతాలు చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ ఐదవతనం కలకాలం నిలుస్తుందని భావిస్తారు. అందుకే శ్రావణమాసంలోని ప్రతి మంగళవారం.. కొత్తగా పెళ్లైయిన మహిళలు ఎక్కువగా మంగళగౌరీ వ్రతం చేస్తారు. భక్తి, శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తారు.వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లోనూ, ఆ తర్వాత ఏడాది నుంచి అత్తవారింట్లోనూ ఈ వ్రతాన్ని చేసుకుంటారు. మంగళగౌరీ వ్రతం చేయడం వల్ల భోగభాగ్యాలే కాకుండా, దీర్ఘ సుమంగళిగా ఉంటారని భావిస్తారు. ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు మాత్రమే కాదు, మంగళ గౌరి దేవిని పెళ్లికాని అమ్మాయిలు కూడా ఆచరించొచ్చు. ఇలా చేస్తే మంచి వరుడు దొరుకుతాడని, వివాహం త్వరగా జరగాలని కోరుతూ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మంగళవారం వ్రతాన్ని ఆచరించే ముందురోజు కూడా నియమ నిబంధనలు పాటించాలి. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించాలి.పూజకు గరిక, తంగెడు పూలు కచ్చితంగా ఉపయోగించాలి. వ్రతం రోజు ఉపవాసం ఉండాలి. వ్రతానికి కనీసం ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వాలి. ఒకే మంగళగౌరీ దేవి విగ్రహాన్ని.. ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. వ్రతం పూర్తైన తర్వాత వినాయక చవితి తర్వాత, వినాయక నిమజ్జనంతో పాటు అమ్మవారిని కూడా నిమజ్జనం చేయాలి. వ్యాపారుల్లో నూతనోత్సాహం శ్రావణ మాసం ఆగమనంతో వ్యాపారుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అన్ని వ్యాపారాలూ ఊపందుకుంటాయి. ఆషాఢ మాసం తరువాత అధిక శ్రావణ రావడంతో రెండు నెలలుగా వ్యాపారాలు నత్తనడకన సాగాయి. శుక్రవారం నుంచి వ్యాపారాలు జోరందుకుంటాయని వీరంతా ఆశలు పెట్టుకున్నారు. పూలు, పండ్లు, నిత్యావసరాల వినియోగం అధికంగా ఉంటుంది. వరలక్ష్మీ వ్రతం రోజునే కాక ప్రతి శ్రావణ శుక్రవారంతో పాటు మంగళవారాల్లో కూడా మహిళలు ప్రత్యేక పూజలు ఆచరించడంతో ఆయా వస్తువులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. వస్త్ర దుకాణాలు కళకళలాడతాయి. బంగారు వ్యాపారాలు సరేసరి. బంగారు రూపులు, ఇతర వెండి వస్తువులు కొనుగోలు చేయడానికి మహిళలు ఆసక్తి చూపుతారు. జిల్లాలోని కొన్ని బంగారు ఆభరణాల వ్యాపారులు పలు ఆఫర్లను ప్రకటించారు. శుభప్రదమైన మాసం శ్రావణ మాసం హిందువులకు శుభప్రదమైన మాసం. ఈ మాసంలో ఆలయాల్లోని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించడం పుణ్యప్రదం. తమ కుటుంబాలు పదికాలాల పాటు చల్లగా ఉండాలని మహిళలు వరలక్ష్మీ వ్రతాలు, మంగళగౌరీ వ్రతాలు ఆచరిస్తారు. దీని ద్వారా లక్ష్మీకటాక్షం, సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది. వరలక్ష్మీ వ్రతాలు సామూహికంగా ఆచరించుకోవడం మరింత పుణ్యప్రదం. – శ్రీమాన్ గురుగోవింద్ చిన్న వెంకన్నబాబు స్వామీజీ శివకేశవులకు ప్రీతికరం ఈ మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. మహావిష్ణువు, లక్ష్మీదేవీలకు ఈ మాసంలో వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. శివునికి ప్రత్యేక అభిషేకాలు చేయడం ద్వారా పాపాలు కడతేరతాయని శాస్త్ర వచనం. శ్రావణ శుక్లపక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైనవి. ఈ మాసంలో పూజలు భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల తగిన ప్రతిఫలం ఉంటుంది. – టి. శ్రీమన్నారాయణాచార్యులు, గోవింద క్షేత్ర ప్రధాన అర్చకుడు -
శ్రావణమాసంలో మాంసాహారం తినకూడదు అని ఎందుకు అంటారు?
శ్రావణమాసం అంటేనే శుభ ముహూర్తాల సమ్మేళనం. ఈ మాసంలో మహిళలందరూ భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. పూజలు, వ్రతాలు, నోములు వంటి కార్యక్రమాలతో నియమ, నిబంధనలతో పూజలు ఆచరిస్తారు. ఇక శ్రావణమాసం పూర్తయ్యేవరకు మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికి గల కారణాలు ఏంటి? మాసం పూర్తయ్యే వరకు నాన్‌వెజ్ ముట్టుకోకపోవడానికి సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు చూద్దాం. శ్రావణం కోసం కోసం తెలుగు లోగిళ్లలో చాలామంది వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.శ్రావణ మాసం అనగానే శుభకార్యాలకు ప్రత్యేకంగా భావిస్తారు. అయితే అధిక శ్రావణ మాసం అశుభకర మాసమని పండితులు నిర్ణయించటంతో ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించలేదు. నిజ శ్రావణ మాసం శుభ కార్యక్రమాలకు అనుకూలంగా నిర్ణయించగా వేలాదిగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి.నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనం, అక్షరాభాస్యం, అన్నప్రాశన, వ్యాపార, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనలు.. ఇలా పలు శుభకార్యాలు జరగనున్నాయి. ఎప్పటివరకు శ్రావణమాసం? సాధారణంగా శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంటుంది. సగటున జులై మధ్య నెలలో ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగుతుంది. కొన్నిసార్లు అధికమాసం వస్తుంటుంది. ఈసారి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఓ నెల అధిక శ్రావణ మాసం కాగా, మరో నెల నిజ శ్రావణ మాసం. తొలుత వచ్చిన అధిక శ్రావణ మాసం గత నెల 18న ప్రారంభమై ఈ నెల 16తో ముగిసింది. ఈనెల 17 నుంచి మొదలైన నిజ శ్రావణమాసం సెప్టెంబర్ 15వరకు ఉండనుంది. అయితే ఈ మాంసంలో శాకాహారానికే అధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని పలు శాస్త్రాలు చెబుతున్నాయి. మాంసం ముట్టరు.. కారణాలు అవేనా? ► శ్రావణమాసం వర్షాకాలంలోనే వస్తుంది. సాధారణంగానే వర్షాకాలంలో కొన్నిరకాల ఆహార పదార్థాలను తినకూడదంటారు. వాటిలో ముందు వరుసలో ఉండేది మాంసాహారం. ఎందుకంటే ఈ కాలంలో హెపటైటిస్, కలరా, డెంగీ వంటి అనేక రోగాలు చుట్టుముడతాయి. ► నీరు నిల్వ ఉండటం, శుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో వ్యాధులు వ్యాపిస్తాయి. ఇదే సమస్య జంతువులకు కూడా ఎదురవుతుంది. దీంతో వాటి ద్వారా ఇన్ఫెక్షన్లు మనుషులకు కూడా వస్తాయని అంటుంటారు. ► ఈ కాలంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది.మాంసం అరగక పేగుల్లో బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణ మార్పులతో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి తేలికపాటి ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు. ► ఇక మరో కారణం ఏంటంటే.. చేపలు, అలాగే ఇతర జలచరాలు వర్షాకాలంలో సంతానోత్పత్తి చేపడతాయి. ఈ ప్రక్రియలో ఉన్నప్పుడు జలచరాలు కొన్ని వ్యర్థాలను నీటిలో విడుదల చేస్తుంటాయి. మళ్లీ వాటినే చేపలు తింటుంటాయి. అలా ఈ మాసంలో నాన్‌వెజ్‌కు దూరంగా ఉండాలని అంటారు. పైగా, గర్భంతో ఉన్న జీవాలను చంపి తినడం మంచిది కాదన్న విశ్వాసం కూడా దీనికి మరో కారణం. -
Vijayawada : ఇంద్రకీలాద్రిపై శ్రావణమాస శోభ (ఫొటోలు
-
అధిక శ్రావణమాసం.. పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవే
శ్రావణం...శుభ ముహూర్తాల సమ్మేళనం. అందుకే అందరూ శ్రావణం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండగా..నోములు, వ్రతాలతో పాటు పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కల్యాణమండపాల వద్ద సందడి కనిపిస్తోంది. పెళ్లి... ప్రతి ఒక్కరి జీవితంలో అపురూపమైన వేడుక. అందుకే కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేస్తారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతి ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ఇటు నూతన వధూవరులతో పాటు అటు వారి కుటుంబ సభ్యులు, బంధువులూ భావిస్తారు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది పెళ్లి ముహూర్తం. వివాహం నిశ్చయమైనా ఆషాఢమాసం, అధిక శ్రావణంతో శుభ ముహూర్తాలు లేక నిరీక్షిస్తున్న వేలాది జంటలు ఈ శ్రావణంలో ఒక్కటి కాబోతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా పెళ్లికి సన్నాయి మేళాలు మోగనున్నాయి. ఈ నెల 17న శ్రావణం ప్రారంభం కానుండగా, మరుసటి రోజు నుంచే ముహూర్తాలూ ఉన్నాయి. 18 నుంచి వివాహ ముహూర్తాలు సాధారణంగా శ్రావణ మాసంలోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతాయి. బుధవారం(16న) అమావాస్య వచ్చింది. తర్వాత నిజ శ్రావణమాసం. ఈ నెల 18వ తేదీ నుంచి దాదాపు వరుసగా 10 రోజుల పాటు వివాహ ముహూర్తాలున్నాయి. ఇవి డిసెంబర్ వరకూ కొనసాగనున్నాయి. ముహూర్త బలం వల్ల ఒకేరోజు ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతుండటంతో కల్యాణమండపాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ శ్రావణంలో చాలా ముహూర్తాలు ఉన్నప్పటికీ కొన్నింటిని దివ్యమైనవిగా పేర్కొంటారు. ఆ ముహూర్తంలోనే పిల్లల పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకే ఆయా తేదీల్లో కల్యాణ మండపాలతో పాటు అన్నీంటికీ డిమాండే. పెళ్లితో కొత్తగా ఒక్కటి కానున్న జంటలు, వారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అన్ని హంగులూ ఉన్న కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల కోసం పరుగులు పెడుతున్నారు. శ్రావణమాసం మొదలు డిసెంబర్ వరకూ జిల్లాలో వెయ్యికిపైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. శ్రావణంలో పెళ్లిళ్లలతో పాటు పండుగలూ ప్రతి ఇంటా సంతోషాలు నింపుతాయి. ఈనెల 21న వచ్చే నాగుల చవితి, గరుడ పంచమి రాకతో ప్రధాన పండుగలు ఆరంభం కానున్నాయి. 22న మంగళగౌరీ వ్రతాలు 25న వరలక్ష్మీవ్రతం, 31న రాఖీ పౌర్ణిమ, ఈనెల చివరలో 31 నుంచి మూడు రోజుల పాటు రాఘవేంద్రస్వామి ఆరాధనా ఉత్సవాలు, సెప్టెంబర్ 6న శ్రీ కృష్ణాష్టమి పర్వదినాలు వరుసగా వస్తాయి. 14న పొలాల అమావాస్యతో నిజ శ్రావణంలో వచ్చే పండుగలు ముగిసి భాద్రపదంలో ప్రవేశిస్తాయి. అలాగే ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకూ నోములు, వ్రతాలు ఆచరించుకునేందుకు మహిళలు సిద్ధమయ్యారు. ఎందరికో ఉపాధి పెళ్లంటే రెండు జీవితాల కలయిక మాత్రమే కాదు. ఎందరికో ఉపాధి కూడా. పెళ్లి పత్రికల ముద్రణ, ప్లెక్సీల ఏర్పాటు, కల్యాణ మండపం, అద్దె గదులు తీసుకోవడం, ఫ్లవర్ డెకరేషన్, పెళ్లి భోజనాలు, ఫొటోలతో పాటు వీడియోలు తీయడం, పెళ్లి కూతురు అలంకరణ, ఫంక్షన్ హాలు శుభ్ర పరచడం, పురోహితులు, భజంత్రీలు, రవాణా ఇలా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. అలాగే బంగారు, నిత్యవసర సరుకులు, వస్త్ర వ్యాపారులకు కూడా పెళ్లిళ్ల సీజన్లో వ్యాపారం బాగా జరుగుతుంది. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ శుభ ముహూర్తాలు తక్కువే. జూలైలో ఆషాఢమాసం వచ్చింది. అందుచేత పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. గురువారం నుంచి శ్రావణమాసం వస్తోంది. కాబట్టి ఈ నెల 18, 20, 21, 23, 27, 31 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. సెప్టెంబర్ నెలలో కూడా 1, 3, 10వ తేదీల్లో శుభ ముహూర్తాలున్నాయి. డిసెంబర్ ఆఖరు వరకూ పెళ్లిళ్ల సీజనే. -
శివ కేశవులిరువురికి ప్రీతికరమైన మాసం శ్రావణం! ఎందుకంటే..
శ్రావణమాసం అంతా ఉదయం, సాయంత్రం భగవన్నామ స్మరణతో హిందూ గృహాలు మారు మోగుతాయి. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ‘శ్రవణా’ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది పవిత్రత కలిగినదీ శ్రావణ మాసం. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా పవిత్రత ఉందంటున్నారు విజ్ఞులు. అంతటి పవిత్ర మాసం అధిక శ్రావణం అనంతరం, నిజ శ్రావణం నేటి (17వ తేదీ గురువారం) నుంచి మొదలయ్యింది. ఈ మాసం శివ కేశవులకు ప్రీతికరం. ఈ మాసంతో అసలు వర్ష రుతువు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా భగవదా రాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ మాసం. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాల్లో శివుని ప్రీత్యర్థం ఉపవాస దీక్ష చేస్తే, అనేక శుభ ఫలితాలు కలుగుతాయంటారు. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలనీ వేదాలు చెబుతున్నాయి. త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు, ఆయన దేవేరి మహాలక్ష్మికి కూడా అత్యంత ప్రీతి కరమైనది శ్రావణమాసం అంటారు. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం. శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతం ‘మంగళగౌరీ’ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళ గౌరీ నోము అని పిలుస్తుంటారు. ఇదే మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ‘వరలక్ష్మి’ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరి స్తారు. ముత్తయిదువులకు వాయినాలిచ్చి ఆశ్వీరాదాలు తీసుకుంటారు. శుక్లపక్ష ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహా విష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందంటారు. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకొనే శుక్ల పక్ష పౌర్ణమి రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షా బంధనం జరుపుకొంటున్నాం. అంతే కాక కొందరు ఈ రోజున నూతన యజ్ఞోపవీతం ధరించి, వేదభ్యాసాన్ని ప్రారంభిస్తారు. కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటివి సైతం ఈ నెలలోనే రావడం విశేషం. కృష్ణాష్టమి, పోలాల అమావాస్య వంటివి కూడా ఈ నెలలోనే వస్తాయి. – నందిరాజు రాధాకృష్ణ (చదవండి: శ్రావణం.. పర్యావరణహితం) -
శుభకార్యాలకు వేళాయే.. నేటి నుంచే శ్రావణమాసం
నిజశ్రావణం గురువారం నుంచి ప్రారంభమవుతోంది. దీంతో పాటే శుభముహూర్తాలు మొదలుకానున్నాయి. నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనం, అక్షరాభాస్యం, అన్నప్రాశన, వ్యాపార, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనలు నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో అధిక మాసంగా శ్రావణం వచ్చింది. ఓ నెల అధిక శ్రావణ మాసం కాగా, మరో నెల నిజ శ్రావణ మాసం. తొలుత వచ్చిన అధిక శ్రావణ మాసం గత నెల 18న ప్రారంభమై ఈ నెల 16తో ముగిసింది. ఈ నెల 17వ తేదీ గురువారం నుంచి మొదలయ్యే నిజ శ్రావణ మాసం సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది. శుభకార్యాలకు వేళాయె.. శ్రావణ మాసం అనగానే శుభకార్యాలకు ప్రత్యేకంగా భావిస్తారు. అయితే అధిక శ్రావణ మాసం అశుభకర మాసమని పండితులు నిర్ణయించటంతో ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించలేదు. నిజ శ్రావణ మాసం శుభ కార్యక్రమాలకు అనుకూలంగా నిర్ణయించగా వేలాదిగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి. కాగా, శ్రావణ మాసంలో ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు ముహూర్తాలు ఉండగా, ఆ తర్వాత సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 14 వరకు కొనసాగే భాద్రపదంలో ఎలాంటి ముహూర్తాలు లేవు. దీంతో ఈ నెలలో వివాహాలు, ఇతర శుభకార్యాల నిర్వహణకు అంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుభకార్యాల కాలం నిజ శ్రావణ మాసం శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. భాద్రపదం, పుష్యమాసాల్లో మినహా మిగిలిన మాసాల్లో శుభ ముహూర్తాలు బాగానే ఉన్నాయి. నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు ఇప్పటికే చాలామంది ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. -
పెళ్లి సందడికి వేళాయె!
శుభముహుర్తాలకు వేళయ్యింది. శ్రావణమాసం.. వరుస ముహూర్తాలు వస్తుండడంతో పల్లెలు, పట్టణాల్లో మళ్లీ పెళ్లి సందడి ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి డిసెంబర్ వరకు సుమారు 50కి పైగాముహూర్తాలు వస్తుండడం విశేషం. ఫలితంగా అన్ని జిల్లాలు పెళ్లిళ్లతో.. పందిళ్లు సందడిగా మారనున్నాయి. వివాహ ముహూర్తాలు ఆగస్టులో 8, సెప్టెంబరులో 6, అక్టోబరులో 10, నవంబరులో 14, డిసెంబరులో 14 వరకు ఉండటంతో ముఖ్యంగా కడప జిల్లా మరింత సందడిగా మారింది. అక్కడ జిల్లా వ్యాప్తంగా కల్యాణ మండపాలు పెద్దవి 800 మీడియం 1200 చిన్నవి వాటిల్లోనే ఏకంగా 1000కి పైగా వివాహాలు జరగడమే గాక మొత్తం ఖర్చు రూ. 25కోట్లు వరకు ఉండొచ్చు. ఏప్రిల్‌లో శుభ కార్యాలకు ముహూర్తాలు లేకపోవడం, జూన్‌లో కొన్ని మాత్రమే ఉండడం, జులైలో ఆషాఢమాసం, అధిక శ్రావణం కారణంగా ముహూర్తాలు లేక ఇన్నాళ్లు శుభ కార్యాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆగస్టు 19 నుంచి ముహూర్తాలు ఉండడంతో తమ పిల్లలకు వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబరు వరకు వరుసగా ఎక్కువ ముహూర్తాలు ఉండడంతో దాదాపు వెయ్యికి పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని ఆయా వర్గాల ప్రతినిధులు తెలుపుతున్నారు. ఆగస్టు 16న అమావాస్య అనంతరం నిజ శ్రావణమాసం వస్తుండడంతో 19వ తేదీ నుంచి దాదాపు 10 రోజులపాటు వరుసగా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఇవి డిసెంబరు వరకు కొనసాగనున్నాయి. కడప జిల్లాలో ఈ సంవత్సరాంతం వరకు ఉన్న 50కి పైగా ముహూర్తాల్లో వెయ్యికి పైగా వివాహాలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 800కు పైగా పెద్ద కల్యాణ మండపాలు, 1200కు పైగా మీడియం మండపాలు, 1000కి పైగా చిన్న మండపాలు ఉన్నాయి. వీటికి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంది. వివాహ ముహూర్తాలు ప్రారంభమయ్యే నాటికి దాదాపు అన్ని కల్యాణ మండపాలు, ముహూర్తాలుగల అన్ని రోజుల్లోనూ ముందే రిజర్వు అయి ఉండడం విశేషం. డిసెంబరు వరకు ఉన్న ఈ సీజన్లో వివాహాల కోసం కనీసం రూ. 15–25 కోట్లవరకు ఖర్చవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సీజన్‌కు ముందు వివాహాలు చేయలేకపోయిన తల్లిదండ్రులకు ఇప్పుడు మంచి ముహూర్తాలు ఆహ్వానం పలుకుతున్నా... పెరిగిన ధరలు దడ పుట్టిస్తున్నాయి. విందు భోజనాలు రెండు, మూడు నెలల క్రితం నాటికి విందు భోజనాలు ప్లేటు రూ. 150–180 వరకు ఉండగా, ప్రస్తుతం ఆ ధర రూ. 200–250కి పైగా చేరింది. దీంతో ఘనంగా వివాహాలు నిర్వహించుకోవాలని భావించిన తల్లిదండ్రులకు ధరల దడ పట్టుకుంది. రెండు నెలల క్రితం నాటి ధరలతో పోలిస్తే ఇటీవల కూరగాయల ధరలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. అయినా జీవితంలో ఒక్కసారే నిర్వహించే అపురూపమైన ఘట్టం గనుక వివాహాలను ఘనంగానే నిర్వహించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. వస్త్రాల ధర కూడా 20–40 శాతం పెరిగింది. శ్రావణమాసంతో పండుగల సీజన్ ప్రారంభమైంది గనుక డిమాండ్ పెరిగి ఎక్కువ మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది. (చదవండి: ఢిల్లీకి.. మా ఊరి బొప్పాయి! ప్యాకింగ్ మరింత స్పెషల్!) -
ఈ ఏడాది ముహూర్తాలు ఇలా.. లగ్నానికి లేదిక విఘ్నం
ఆషాఢ, అధిక శ్రావణం కారణంగా 2 నెలల విరామం అనంతరం ఈ నెల 19 నుంచి శుభకార్యాల సందడి ప్రారంభం కానుంది. తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, ఏడడుగులు, మూడుముళ్లతో పెళ్లి సంబరాలు అంబరాన్నం టనున్నాయి. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శుభ కార్యాల నిర్వాహణకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 17న నిజ శ్రావణ మాసం ప్రారంభమవుతుండగా.. 19 నుంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతా శుభకార్యాలు చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే వివాహాలు నిశ్చయించుకున్న కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ అయ్యాయి. భీమవరం (ప్రకాశం చౌక్)/రాయవరం: ఈ ఏడాది మొదటి నెల నుంచి డిసెంబర్ వరకు పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు మంచి తరుణంగా నిలుస్తోంది. ఈ ఏడాది 12 నెలల కాలంలో కేవలం 2 నెలలు మినహా మిగిలిన 10 నెలల్లో 104 పెళ్లి ముహూర్తాలు ఉండగా ఇప్పటికే 51 ముహూర్తాలు పూర్తయ్యాయి. ఇక ఈ నెల 19 నుంచి డిసెంబర్ వరకు 53 ముహూర్తాలు ఉన్నాయి. గడిచిన మూడేళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు లేకపోవడం విశేషం. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 25 నుంచి ముహూర్తాలు ప్రారంభమవ్వగా...ఆషాఢం, అధిక శ్రావణం కారణంగా శుభకార్యాలకు విఘ్నం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచి శుభ ముహూర్తాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. అనేక శుభకార్యాలు, గృహ ప్రవేశాలు డిసెంబర్ వరకు కొనసాగనున్నాయి. ‘అందరికీ..అన్నింటికీ’ డిమాండ్... పెళ్లి, శుభ ముహూర్తాలు ప్రారంభమవుతుండటంతో అన్ని ప్రాంతాల్లోని కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. సాధారణ ఫంక్షన్ హాళ్ల దగ్గర నుంచి పెద్ద ఫంక్షన్ హాళ్ల వరకు గిరాకీ ఎక్కువగా ఏర్పడింది. ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించిన పలువురు రెండు మూడు నెలల ముందు నుంచే కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకుంటున్నారు. దీంతో ప్రైవేట్ కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులకు మంచి ఆదాయం అందుతోంది. ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతోన్న నేపథ్యంలో వాటికీ డిమాండ్ విపరీతంగా ఉంది. అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం లాంటి ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు జరిపించడానికి ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. వివాహాలు ప్రారంభం కానుండటంతో పలు వృత్తుల వారికి చేతినిండా పని దొరుకుతుంది. బాజాభజంత్రీలు, డెకరేటర్స్, ఫొటోగ్రాఫర్స్, టెంట్‌హౌస్ నిర్వాహకులు, వంట పనివారు, ట్రాన్స్పోర్టర్స్, ఎల్రక్టీషియన్స్, సౌండ్ ఇంజినీర్స్, ఈవెంట్ మేనేజర్స్, పురోహితులకు చేతినిండా పని దొరకనుంది. ఈ ఏడాది ముహూర్తాలు ఇలా.. ఆగస్ట్ : 19, 20, 22, 24, 26, 29, 30, 31 సెప్టెంబర్ : 1, 2, 3, 6, 7, 8 అక్టోబర్ : 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 31 నవంబర్ : 1, 2, 8, 9, 16, 17, 18, 19, 22, 23, 24, 25, 28, 29 డిసెంబర్ : 3, 5, 6, 7, 8, 14, 15, 16, 17, 19, 20, 21, 24, 31 ఈ ఏడాదే ఎక్కువ.. ఈ ఏడాది 12 నెలల కాలంలో కేవలం 2 నెలలు మినహా మిగిలిన 10 నెలల్లో ప్రతి నెలా ఎక్కువ పెళ్లి ముహూర్తాలున్నాయి. ముహూర్తాలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నాయి. నవంబర్, డిసెంబర్లలో అయితే ఒక్కో నెలలో ఏకంగా 14 ముహూర్తాలు చొప్పున ఉన్నాయి. – మద్దిరాల మల్లిఖార్జునశర్మ, శ్రీమావుళ్లమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకుడు -
శ్రావణం అలా వచ్చిందో లేదో,రూ. 60వేల ఎగువకు బంగారం
Today Gold and Silver rates: ఆషాఢం ముగిసి శ్రావణ మాసం అలా షురూ అయిందో లేదో బంగారం ధరలు ఊపందుకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ధరల్లో హెచ్చు తగ్గులను నమోదు చేస్తున్న బంగారం మంగళవారం ఆరంభంలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ. 60వేల ఎగువకు చేరింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల రూ. 120 పెరిగి రూ.55100 స్థాయికి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.60,100 పలుకుతోంది. అటు వెండి ధర మాత్రం (హైదరాబాద్‌లో) స్వల్పంగా తగ్గింది. ఆరంభంలో కిలోకు రూ.200 పెరిగిన వెండి ధర ప్రస్తుతం 100 క్షీణించి 81,400 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కీలో వెండి 300 పెరిగి ధర 78 వేలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.55,130 గాను, 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.60,130 స్థాయివద్ద ఉంది. డాలరు బలహీనం, గ్లోబల్ గోల్డ్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ ఔట్‌లుక్‌ను ప్రభావితం చేసే అమెరికా రిటైల్ అమ్మకాల డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నాయి. డాలర్ వీక్నెస్ అంతర్జాతీయం పసిడి ధరలను ప్రభావితంచేస్తున్నాయి. స్పాట్ బంగారం 0.4శాతం పెరిగి ఔన్సుకు 1,961.67 డాలర్లకు చేరుకుంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.5శాతం పెరిగి 1,965.40డాలర్లకు చేరింది. కొనుగోళ్లతో షేర్లు షైన్ అస్థిర బంగారం ధరలు ఉన్నప్పటికీ 2023లో బంగారు ఆభరణాల రిటైలర్ల స్టాక్‌లు మాత్రం లాభాలను ఆర్జిస్తున్నాయని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. బెంచ్‌మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్‌లో 13 శాతం లాభంతో పోలిస్తే కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్, పిసి జ్యువెలర్స్, తంగమయిల్ జువెలరీ , త్రిభోవందాస్ భీమ్జీ జవేరి (టిబిజెడ్) ఏప్రిల్ నుండి ఇప్పటివరకు 21-72 శాతం ర్యాలీ చేశాయి. బంగారం ఆల్-టైమ్ హై ,బలమైన వినియోగదారుల కొనుగోలు నుండి 6 శాతం పడిపోయిన నేపథ్యంలో ఈ ర్యాలీ ఊపందుకుంది. -
నేటి నుంచి అధిక శ్రావణమాసం? అంటే ఇది డూప్లికేటా?
ఈనెల జూలై 18వ తారీకు నుంచి అధిక శ్రావణమాసం ప్రారంభం అవుతోంది. 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం ఇది. ఈ మాసం నేటి(జూలై 18) నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు అధిక శ్రావణ మాసం ఉంటుంది. అయితే ఈ అధిక మాసం అనేది కేవలం వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం మాసాలకు మాత్రమే వస్తుంది. మిగతా మాసాలకు ఎప్పుడూ అధిక మాసం రాదు. ఐతే ముందుగా ఈ అధిక మాసం వచ్చి ఆ తర్వాత నిజమాసం వస్తుంది. అసలు అధికమాసం ఎందుకు వస్తుంది?. అంటే ఇది డూప్లికేట్ అని అర్థమా? ఎలాంటి జపతప వ్రతాలు ఆచారించాల్సిన పని లేదా? అధికమాసం ఎందుకు వస్తుదంటే.. తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు, రుతువులు, పంచాంగ గణన ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంపావు రోజులు వ్యత్యాసం ఉంటుంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇలా ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం అవదు. చాంద్రమానంలో సూర్య సంక్రాంతి లేని మాసాన్ని అధికమాసం అంటారు. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని పిలుస్తారు. ఇది పాటించం అంటే కుదరదు.. కొన్ని ఏళ్ల తర్వాత జోడు శ్రావణ మాసాలు రావడం జరిగింది. శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తామో అదేవిధంగా మొదటి శ్రావణంలో కూడా అవే నియమాలను తప్పక పాటించాలి. ఉదాహరణకు కవల పిల్లలు పుడితే వద్దంటామా..? లేదు కదా అలాగే జోడు శ్రావణ మాసాలు వచ్చినప్పుడు కూడా ఒకటి పాటిస్తాం మరొకటి పాటించము అంటే ధర్మశాస్త్రము అంగీకరించదు. కావున రెండూ శ్రావణ మాసాలే. మొదటి శ్రావణ మాసంలో కూడా వ్రతాలు, పూజలు అనగా శ్రావణ సోమవారాలను, శ్రావణ శుక్రవారాలను, శ్రావణ శనివారాల వంటివి, అలాగే మధ్య మాంసాలను స్వీకరించకుండా కేవలం సాత్విక ఆహారాలను మాత్రమే స్వీకరించడం తదితరాలన్ని చేయాల్సిందే. విష్ణువుకి ఎంతో ఇష్టమైనది.. శ్రీమహా విష్ణువుకి మహా ప్రీతికరమైన మాసం ఇది. అందుకే దీన్ని అధిక రాధా పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఈ మాసంలో చేసే దానాలు, వ్రతాలు అధిక ఫలితాలనిస్తాయి. ఈ మాసంలో ఏది దానం చేసిన శ్రీ అధిక రాధా పురుషోత్తమ ప్రీత్యర్థం ఇస్తున్న దానం పేరు చెప్పి కరిష్యే అనాలి. అలాగే ఈ రోజుల్లో శ్రీ అధిక రాధా పురుషోత్తమాయ నమః అని 108 సార్లు జపం చేయాలి. విష్ణువు శ్రీమహాలక్ష్మికి ఓ సందర్భంలో పురుషోత్తమ మాస విశిష్టతను వివరిస్తూ ‘ఎవరైతే ఈ మాసంలో పుణ్య నదీస్నానాలు, జపహోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయి. అధిక మాసంలో పుణ్యకర్మలు ఆచరించని వారి జీవితాల్లో కష్టనష్టాలు ఎదురవుతాయి. అధిక మాసం శుక్ల పక్షంలో కానీ, కృష్ణ పక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అలాగే పౌర్ణమి నాడైనా పుణ్యకార్యాలు చేయాలి. దానివల్ల వారికి అపారమైన ఫలితం లభిస్తుందని వివరించాడని పురాణ కథనం. (చదవండి: ఈ అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో సమానమైనది!) -
శ్రావణమాసం చివరి శుక్రవారం : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
నాన్ వెజ్ ప్రియులకు షాక్..పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?
మండపేట(కోనసీమ జిల్లా): శ్రావణ మాసంలోను చికెన్ ధర దిగి రావడం లేదు. రూ.300కు చేరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. పెరిగిన మేత ధరలతో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు కోళ్ల రైతులు విముఖత చూపుతున్నారు. స్థానికంగా లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణతో పాటు జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ? రోజూ 3.2 లక్షల కిలోల వినియోగం తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో రోజుకు సాధారణంగా 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. ఆయా జిల్లాల్లోని రాజానగరం, ఆలమూరు, కోరుకొండ, గోకవరం, అమలాపురం, రావులపాలెం, తుని, తొండంగి, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో 440 ఫామ్‌ల వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్లు పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో రెండు నుంచి రెండున్నర కేజీల వరకు పెరిగి బ్రాయిలర్ కోళ్లు వినియోగానికి వస్తాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి వేడుకలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తికమాసం పూజల నేపథ్యంలో శ్రావణమాసం నుంచి కార్తికమాసం ముగిసే వరకు చికెన్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి డిసెంబరు వరకు అన్‌సీజన్‌గా భావించి కొత్త బ్యాచ్‌లు వేయడాన్ని తగ్గించడం పరిపాటి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి కోళ్లకు ఆహారంగా అందించే మొక్కజొన్న, సోయా తదితర మేత ధరలు కొద్ది నెలలుగా దిగిరావడం లేదు. అన్ని మేతలు మిక్స్‌చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ.30 నుంచి రూ.50కి పెరిగిపోయినట్టు కోళ్ల రైతులు అంటున్నారు. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుంది. ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడికి రూ.110 వరకు ఖర్చవుతుందంటున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధికశాతం మంది కోళ్ల రైతులు కమీషన్‌పై కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి అప్పగించేందుకు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాగా కంపెనీలు ఇస్తున్న కమీషన్ సరిపోవడం లేదంటూ ఇటీవల సమ్మె చేయడం కొత్త బ్యాచ్‌లపై కొంత ప్రభావం పడిందంటున్నారు. స్థానికంగా కోళ్ల పెంపకం తగ్గడంతో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, తెలంగాణలోని ఖమ్మం, ఆశ్వారావుపేట, తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా కారణాలతో శ్రావణమాసమైనప్పటికి ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. బుధవారం స్కిన్లెస్ కిలో రూ.300కు చేరగా, లైవ్ కిలో రూ.160 వరకు పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు. మేత ధరలు తగ్గితేనే కొత్త బ్యాచ్‌లు అన్ సీజన్, మేత ధరలకు భయపడి చాలామంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపిస్తోంది. జిల్లాలో అవసరమైన కోళ్లు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతితో ధర పెరుగుతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం -
శ్రావణమాసం ఎఫెక్ట్.. భగ్గుమంటున్న కూరగాయల ధరలు
సాక్షి, ముంబై: శ్రావణ మాసం ప్రారంభం కావడంతో కూరగాయలు, పండ్లు, ఫలాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో కూరగాయల ధరలు 40 శాతం, ఫలాల ధరలు 20 శాతం మేర పెరిగిపోయాయి. శ్రావణ మాసంలో అధిక శాతం కుటుంబాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసలుంటాయి. మాంసాహారానికి, మద్యానికి దూరంగా ఉంటారు. దీంతో శ్రావణ మాసంలో కోడి, మేక మాంసాలకు డిమాండ్ పడిపోతుంది. సాధారణంగా ఉపవాసాలుండే ఈ కుటుంబాల్లో పురుషులు మద్యం కూడా ముట్టుకోరు. అదేవిధంగా ప్రతీ సోమ, శుక్రవారాల్లో ఉపవాసాలు, పూజల కారణంగా పండ్లు, ఫలాలకు డిమాండ్ పెరిగిపోతుంది. దీంతో కోడి గుడ్లు, మేక, కోడి మాంసం ధరలు పడిపోతాయి. కాని ఏటా శ్రావణ మాసంలో కూరగాయలు, పండ్లు, ఫలాల ధరలు అమాంతం చుక్కలను తాకుతాయి. శ్రావణ మాసం ప్రారంభానికి ముందు ఏపీఎంసీలోకి 2,586 టన్నుల కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు 3,815 టన్నులు వస్తున్నాయి. దీన్ని బట్టి శ్రావణ మాసంలో కూరగాయాలకు ఏ స్ధాయిలో డిమాండ్ ఉందో తెలుస్తోంది. ఏటా శ్రావణ మాసం ప్రారంభం కాగానే కూరగాయలకు ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుంది. దీంతో వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)లోకి కూరగాయల లోడుతో వచ్చే ట్రక్కులు, టెంపోల సంఖ్య పెరుగుతుంది. కాని ఈ ఏడాది జూలైలో భారీగా కురిసిన వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రోడ్లన్నీ కోతకు గురై పాడైపోయాయి. వంతెనలు కూలిపోవడంతో రవాణ స్తంభించిపోయింది. పండించిన పంటలు కూడా నీటిపాలయ్యాయి. కొన్నిచోట్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ట్రక్కుల్లో ఉన్న సరుకులు కుళ్లిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వీటికితోడు తరుచూ ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. మరోపక్క ఏపీఎంసీలోకి కూరగాయల లోడుతో వచ్చే ట్రక్కులు, టెంపోల సంఖ్య తగ్గిపోయింది. దీంతో డిమాండ్ ఎక్కువ, సరుకుల రవాణా తక్కువ అనే పరిస్ధితి నెలకొంది. ఫలితంగా కూరగాయల ధరలు హోల్‌సేల్ మార్కెట్లో 10–20 శాతం పెరగ్గా, రిటైల్ వ్యాపారులు 40 శాతం మేర పెంచారు. అలాగే పండ్లు, ఫలాల ధరలు హోల్‌సేల్ మార్కెట్లో 10–15 శాతం పెరగ్గా రిటైల్‌లో 20 శాతం మేర ధరలు పెంచాల్సి వచ్చిందని చిరు వ్యాపారులంటున్నారు. -
Sravana Masam: శ్రావణం శుభకరం.. ముఖ్యమైన తేదీలివే!
అనంతపురం కల్చరల్: ఈనెల 28న వచ్చే అమావాస్య రాకతో ఆషాఢమాసం ముగిసి శుక్రవారం నుంచి నోములు, వ్రతాలకు నెలవైన శ్రావణం మాసం రానుంది. శుభకార్యాలు మళ్లీ మొదలు కానుండడంతో మాసమంతటా ప్రతి ఇంటా శ్రావణ శోభతో అలరారే పండుగలు, సామూహిక వ్రతాలు సందడి చేయనున్నాయి. శ్రావణంలో భక్తిశ్రద్ధలతో ఆచరించే ప్రతి పండుగ వెనుక ఆధ్యాత్మిక కోణమే కాకుండా సామాజిక, వైజ్ఞానిక అంశాలెన్నో దాగున్నాయని పెద్దలు చెబుతారు. మానవ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన శ్రావణ మాసం ఈనెల 29 నుంచి వచ్చే నెల 27 వరకు ఉంటుంది. ఇప్పటికే శ్రావణమాస పూజల కోసం జిల్లా వ్యాప్తంగా ఆలయాలు ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాయి. ఈనెల తప్పితే మళ్లీ డిసెంబరు వరకు శుభముహూర్తాలు లేకపోవడంతో ఫంక్షన్ హాల్స్, కల్యాణమండపాలు బిజీగా మారనున్నాయి. మహిళలకు ప్రీతికరం శ్రావణ నోములు, వ్రతాలు భక్తితోనోచుకుంటే దీర్ఘ సుమంగళిగా ఉంటామన్న విశ్వాసముండడంతో మహిళలు ఈ మాసాన్ని అత్యంత ప్రీతికరంగా భావిస్తారు. పౌర్ణమి చంద్రుడు శ్రవణా నక్షత్రం మీద సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణం అని పేరొచ్చింది. అఖిలాంఢకోటి బ్రహ్మాండ నాయకుడైన వేంకటేశ్వరస్వామి ఇదే నక్షత్రంలో జన్మించినందున శ్రీవారి ఆలయాల్లో విశేష పూజలు జరుగుతాయి, ఆయన సతీమణి లక్ష్మీదేవి, సోదరి గౌరికి ఇదే మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలో పలు ఆలయాల్లో సామూహిక వ్రతాలు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రావణంలో వచ్చే మంగళవారాలతో పాటూ శుక్రవారాలు, శనివారాలు ఆలయాలు ప్రత్యేక పూజలు, భక్తులతో కిటకిటలాడుతాయి. (చదవండి: 'మామ్పవర్ 360’.. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మహిళలను తిరిగి..) శ్రావణంలో వచ్చే పండుగలివే.. శ్రావణ మాసమంతటా పండుగల సందడితోనే సాగుతుంది. వచ్చే నెల 1న రానున్న నాగుల చవితితో పర్వదినాలు ఆరంభమవుతాయి. మరుసటి రోజుననే గరుడ పంచమిని జరుపుకుంటారు. 5న వరమాలక్ష్మీ వ్రతం, 12న రక్షాబంధనం (రాఖీ పౌర్ణిమ), 18, 19 తేదీల్లో వచ్చే శ్రీకృష్ణజన్మాష్టమితో పాటూ బలరామ జయంతి, హయగ్రీవ జయంతి, రాధాష్టమి పండుగలు వరుసగా ఆనందాలను తెచ్చేవే. మాసం చివరిరోజున కూడా పొలాల అమావాస్యను జరుపుకోవడం ఆనవాయితీ. వ్రతాలకు శ్రావణమాసాన్ని ఎంచుకోవడంలో ఆరోగ్యపరమైన కారణాలున్నాయని, ప్రత్యేక పూజలకు సన్నాహాలు చేస్తున్నట్లు వేదపండితులు చెబుతున్నారు. (చదవండి: ఈ మొక్కలు పెంచితే ఎంత డేంజరో తెలుసా?) -
శ్రావణ మేఘాలు
శ్రావణమాసం కొద్దిరోజుల్లోనే రానుంది. ఇది ప్రకృతి మేఘమల్హరాలాపనతో పరవశించే మాసం. శ్రావణమాసానికి ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణమాసంలో నోములు, వ్రతాలు విరివిగా జరుపుకొంటారు. వాయనాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చిపుచ్చుకుంటారు. నోములు, వ్రతాలు జరుపుకొనే మహిళలు పట్టుచీరలతోను, నగలతోను కళకళలాడుతూ కనిపిస్తారు. ఇందుకే శ్రావణమాసాన్ని ‘నగల మాసం, శనగల మాసం’ అంటూ చమత్కరించారు ముళ్లపూడి వెంకటరమణ. ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే, శ్రావణమాసంలో కనిపించే కారుమబ్బులు, అవి కురిపించే కుండపోత వర్షాలు ప్రకృతి గమనంలోని సహజ పరిణామాలు. మేఘసౌందర్యాన్ని వర్ణించని కవులు అరుదు. ‘నల్లని మబ్బులు గుంపులు గుంపులు, తెల్లని కొంగలు బారులు బారులు’ అంటూ కారుమబ్బుల అందాలను కళ్లముందు నిలిపారు కృష్ణశాస్త్రి. మేఘాల గురించి ‘గాథా సప్తశతి’లో ఒక అరుదైన, అపురూపమైన వర్ణన ఉంది. ‘అవిరల పడంత నవజల ధారా రజ్జు ఘడిఅం పఅత్తేణ/ అపహుత్తో ఉఖేతుం రస ఇవ మేహో మహింవు అహ’. అంటే, వర్షధారల దారాలతో భూమిని బంధించి పైకి లాగేయడానికి మేఘం విఫలయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో మేఘం ఎంతో కష్టపడుతోంది. అందుకు నిదర్శనం– అది చేస్తున్న ఉరుముల హూంకారాలే! ఇంతటి కవి చమత్కారం మరే భాషా సాహిత్యంలోనూ కనిపించదు. మబ్బులు కమ్ముకున్నాక, అవి ఉరుములు ఉరమడం, మెరుపులు మెరవడం, చినుకులు కురవడం సహజమే! అలాగని ప్రతి మబ్బూ వాన కురుస్తుందనే భరోసా ఏమీ లేదు. మబ్బుల్లో నాలుగు రకాలు ఉంటాయని, అలాగే మనుషుల్లోనూ నాలుగు రకాలు ఉంటారని బుద్ధుడు తన శిష్యులకు ఎరుకపరచాడట! ఉరుములు ఉరిమినా చినుకు కురవకుండానే వెళ్లిపోయేవి ఒకరకం, ఉరుములు మెరుపులు లేకపోయినా చినుకులు కురిసిపోయేవి మరోరకం, ఉరుములు మెరుపుల సందడితో వాన హోరెత్తించేవి ఒకరకం, ఉరుముల శబ్దం చేయకుండా, చినుకైనా కురవకుండా తేలిపోయేవి ఇంకోరకం. మేఘాల స్వభావం లాగానే మనుషుల స్వభావాలూ ఉంటాయి. ఊరకే నీతులు చెబుతూ ఆచరించని వాళ్లు ఒక రకం, శాస్త్రాలు చదువుకున్నా వాటి సారాన్ని గ్రహించని వాళ్లు ఇంకో రకం. శాస్త్రాలు చదవకున్నా, ధర్మసారాన్ని గ్రహించి ఆచరించేవాళ్లు ఒకరకం, శాస్త్రాలు చదివి, వాటి సారాన్ని గ్రహించి ఆచరించేవాళ్లు మరోరకం. సాహిత్యంలోను, కళల్లోను మబ్బులు రకరకాల భావనలకు సంకేతాలుగా చలామణీలో ఉన్నాయి. దిగులుకు, దుఃఖభారానికి, అంతుచిక్కని రహస్యానికి, అనిశ్చితికి, ప్రతికూల పరిస్థితులకు సంకేతంగా మబ్బులను పోల్చుతారు. అంతేకాదు, మబ్బులు క్షాళనకు కూడా సంకేతాలు. మబ్బులు కురిపించే వానలో నేల మీద ఉన్న చెత్తాచెదారం కొట్టుకుపోయినట్లే, దుఃఖ వర్షం తర్వాత గుండెలో గూడు కట్టుకున్న దిగులు కొట్టుకుపోయి మనసు తేటపడుతుందని కొందరి భావన. ‘భారమైన హృదయాలు దట్టమైన మబ్బుల్లాంటివి. వాటి నుంచి కాస్త నీటిని బయటకు పోనిస్తేనే మంచిది. అప్పుడే ఊరట చెందుతాయి’ అంటాడు అమెరికన్ రచయిత క్రిస్టఫర్ మోర్లే. మేఘతతులు ఎరుకకు, పరివర్తనకు, కలలకు కూడా సంకేతాలు. అయితే, ఎక్కువగా మబ్బులను దిగులుకు, ప్రతికూలతలకు సంకేతంగానే భావిస్తారు. సాహిత్యంలోనూ ఇలాంటి వర్ణనలే కొంత ఎక్కువగా కనిపిస్తాయి. ‘భారమైన మేఘాలు నక్షత్రాలను ఆర్పేస్తున్నాయి’ అని తన ‘నైట్ ఫ్లైట్’ నవలలో వర్ణించాడు ఆంటోయిన్ డి సెయింట్ ఎక్సు్యపెరీ. పైలట్‌గా పనిచేసినప్పుడు నక్షత్రాలను మేఘాలు కమ్మేసిన దృశ్యాలను క్లోజప్‌లో చూసిన అనుభవం ఉన్నవాడాయన. దట్టంగా కమ్ముకున్న మబ్బులు పగలు సూర్యుణ్ణి, రాత్రి చంద్రుణ్ణి, నక్షత్రాలను కనపించనివ్వవు. అలాగని ఆకాశంలో సూర్యచంద్రులు, నక్షత్రాలు అదృశ్యమైపోవు. తాత్కాలికంగా అలా అనిపిస్తాయంతే! మబ్బులు మటుమాయం కాగానే, మళ్లీ తమ సహజకాంతులతో కనిపిస్తాయి. గుండెలోని గుబులు, మనసులోని దిగులు కూడా అంతే! దిగులు మబ్బులు కమ్ముకున్నంత మాత్రాన మనసులోని ఆశలు పూర్తిగా అడుగంటిపోవు. అందుకే, ‘మబ్బులకు ఆవల సూర్యుడు నిరంతరం వెలుగుతూనే ఉంటాడు’ అంటాడు అమెరికన్ రచయిత పాల్ ఎఫ్. డేవిస్. ఉరిమే ప్రతి మబ్బూ కురవదని లోకోక్తి. వ్యర్థ ప్రసంగాలతో హోరెత్తించే వారికి ఇది చక్కగా వర్తిస్తుంది. ‘వాగ్దానం మబ్బు మాత్రమే, అది నెరవేరినప్పుడే వాన కురిసినట్లు’ అని ఇంగ్లిష్ సామెత. వాగ్దానకర్ణులైన రాజకీయ నాయకులకు ఇది అక్షరాలా సరిపోతుంది. ‘ఎంతటి రాగి గొలుసులతోనైనా మబ్బులను బంధించలేము’ అనే సామెత కూడా ఉంది. నింగిలోని మబ్బులు స్వైరవిహారం జరిపే స్వేచ్ఛాసంచారులు. వాటి మానాన అవి ముందుకు సాగుతూనే పోతాయి. ప్రపంచంలో వాటిని బంధించే శక్తి ఏదీ లేదు. ఎక్కడైనా, ఎవరైనా స్వాభావికమైన స్వేచ్ఛను బంధించబూనితే, దాని పర్యవసానం మేఘవిస్ఫోటం కూడా కావచ్చు! ఇటీవల శ్రావణ భార్గవి అనే గాయని అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుని పదాన్ని పాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో అనవసర దుమారానికి దారితీసింది. కొందరి అభ్యంతరాల ధాటికి ఆమె వెనక్కు తగ్గి, ఆ వీడియోను తొలగించింది. ఈ దుమారం సద్దుమణిగినా ఇదంత మంచి సంకేతం కాదు. ప్రజాస్వామ్య ప్రభలను మూకస్వామ్య దౌర్జన్యపర్జన్యాలు కబళించడం వాంఛనీయం కాదు. -
శ్రావణ శుక్రవారం : భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి
-
Raksha bandhan 2021: రాఖీ అంటే అపురూప బంధం
కుటుంబాల్లో అన్నాచెలెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే బంధానికి ఉన్న ప్రత్యేకతే వేరు. వీరి ప్రేమానురాగాలకు సూచనగా జరుపుకునే పండుగ రక్షా బంధన్. రాఖీ అంటే రక్షణ. నీకు నేనున్నాననే భరోసా ఇచ్చే అపురూప బంధం. తన తోడబుట్టిన వాడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ ఆడబిడ్డలు కట్టేదే ఈ రాఖీ. అలాగే సదా నీకు రక్షగా ఉంటానంటూ అన్నదమ్ములు హామీ ఇవ్వడం ఆనవాయితీ. అయితే, అత్యంత సంబరంగా చేసుకునే ఈ వేడుకలో అన్నా తమ్ములకు రాఖీ కట్టడంతోపాటు మరిన్ని విధాలుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం.. -
శ్రావణ మాసం: ఒకే రోజు 300 పెళ్లిళ్లు
అన్నవరం: శ్రావణ మాసం వచ్చింది. శతమానం భవతి అంటూ పెళ్లి ముహూర్తాలను మోసుకొచ్చింది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు మూడు ముడుల బంధంతో.. ఏడడుగులు వేసి 300 జంటలు ఒక్కటయ్యాయి. దీంతో ఆలయ ప్రాంగణం వధూవరులు వారి బంధుమిత్రులతో కోలాహలంగా మారింది. గతేడాది కరోనా విజృంభణ తరువాత ఇంత భారీగా వివాహాలు జరగడం ఇదే తొలిసారి. దేవస్థానంలోని సత్యగిరిపై ఇటీవల ప్రారంభించిన శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపంలోని 12 వివాహ వేదికల్లో శుక్రవారం రాత్రి 10 గంటల ముహూర్తంలో తొలిసారి వివాహాలు జరగడంతో అక్కడ ప్రత్యేక సందడి నెలకొంది. వివాహాలు చేసుకున్న వారికి కల్యాణ మండపంతో పాటు అవసరమైన సామగ్రిని దాత మట్టే శ్రీనివాస్ ఉచితంగా సమకూర్చి నూతన వస్త్రాలను బహూకరించారు. -
రాఖీపౌర్ణమి సదారక్ష
-
కొండెక్కిన కోడి..శ్రావణంలోనూ తగ్గని చికెన్ ధర
మండపేట: శ్రావణంలోనూ చికెన్ ధర దిగిరావడం లేదు. రూ.300లకు చేరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. రెండు నెలల వ్యవధిలో రెండు నుంచి మూడు రెట్లు పెరిగిన మేత ధరలు కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. స్థానికంగా లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణ, చత్తీస్గడ్ నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు విశ్లేషిన్నారు. కోడిగుడ్డు ధర మాత్రం కొంతమేర వినియోగదారులకు ఊరటనిస్తోంది. పండగరోజుల్లో.. తూర్పు గోదావరి జిల్లాలో సాధారణంగా రోజుకు 2.5 లక్షల కిలోల మేర చికెన్ వినియోగిస్తున్నారు. ఆదివారం, పండుగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా. జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 ఫామ్‌లలో ఏడు లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్ల పెంపకం జరుగుతుంది. 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు వినియోగానికి సిద్దమవుతుంటాయి. ఈ మేరకు రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి వేడుకలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తీకమాసం పూజల నేపథ్యంలో శ్రావణ నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్ వినియోగం తగ్గుతుంది. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు ఆన్‌సీజన్‌గా భావించి కొత్త బ్యాచ్‌లు వేయడాన్ని తగ్గించడం పరిపాటి. కారణమేంటంటే.. - కోవిడ్ ఆంక్షలు సడలించినా మేత ధరలు అదుపులోకి రావడం లేదు. - ఆంక్షలు కారణంగా జూలైలో మేత రవాణా నిలిచిపోయింది. ధరలు పెరగడం మొదలైంది. - బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబిన్ కిలో రూ.35 నుంచి రెండు నెలల వ్యవధిలో ఏకంగా రూ.106కు పెరిగిపోయింది. - మొక్కజొన్న రూ.12నుంచి రూ. 23కు పెరిగినట్టు కోళ్ల రైతులు చెబుతున్నారు. - కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు పౌష్టికాహారంగా చికెన్ వినియోగం అధికం కావడంతో గత నెలలో కిలో చికెన్ రూ. 320వరకూ చేరింది. తర్వాత రూ.230ల నుంచి రూ.250లకు తగ్గింది. - వారం రోజులగా మళ్లీ ధరకు రెక్కలొస్తున్నాయి. ఆన్ సీజన్, మేత ధరలకు జడిసి కొత్త బ్యాచ్‌లు వేయకపోవడంతో యిలర్ పెంపకం సగానికి పైగా తగ్గిపోయింది. దిగుమతిపై ఆధారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, తెలంగాణలోని ఆశ్వారావుపేట, సత్తుపల్లి, చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా కారణాలతో చికెన్ ధరలకు మరలా రెక్కలొస్తున్నాయి. బుధవారం కిలో రూ.300కు చేరగా, లైవ్ కిలో రూ.135లు వరకు పెరిగింది. వినియోగం సాధారణంగానే ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారవర్గాల అంచనా. అయితేగుడ్డు ధర క్రమంగా తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. రైతు ధర తగ్గిపోవడంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ.5కి చేరుకుంది. మేత తగ్గితేనే కొత్త బ్యాచ్‌లు - బొబ్బా వెంకన్న బ్రాయిలర్ కోళ్ల రైతు శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపిస్తోంది. అయితే ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే మేత ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆన్‌సీజన్ మొదలు కావడం, మేత ధరలకు జడిసి ఎవరూ కొత్త బ్యాచ్‌లను వేయడం లేదు. దీంతో పక్క రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. కీ పాయింట్స్ - తూర్పు గోదావరి జిల్లాలో చికెన్ వినియోగం రోజుకి 2.50 లక్షల కిలోలు - బ్రాయిలర్ కోళ్ల ఫామ్స్ సంఖ్య 400 - రిటైల్ మార్కెట్లో కిలో చికెన్ రూ. 300 - కోళ్ల మేత సోయబిన్ ధరల్లో పెరుగుదల రూ. 35 నుంచి రూ.100 చదవండి: సాగుకు ‘టెక్’ సాయం..! -
గోదారోళ్లా.. మజాకా.. సారె కింద ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు
సాక్షి, తూర్పుగోదావరి: సాధారణంగా ఆడపిల్లకు పుట్టింటి నుంచి సారె పంపడం ఆనవాయితీ. ఇక ఉభయగోదావరి జిల్లాల్లో ఆషాడం, శ్రావణం సారె కావిళ్లు ఇచ్చిపుచ్చుకోవడం పరిపాటి. ఈ క్రమంలో గత నెలలో యానంలో అల్లుడికి మామగారు పంపిన ఆషాఢం సారె రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్‌కు.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో ఇటీవలే వివాహం జరిగింది. ఆషాఢమాసం సందర్భంగా మామ బత్తుల బలరామకృష్ణ.. అల్లుడు పవన్ కుమార్ ఇంటికి సారె కావిళ్ళను పంపించాడు. ఆ సారెను చూసి అల్లుడింటి వారితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవాక్కయ్యారు. అల్లుడికి.. బలరామకృష్ణ ఏకంగా వెయ్యి కిలోల చొప్పున చెరువు చేపలు, పండు గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడి పుంజులు, వెయ్యి కిలోల కాయగూరలు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల ఆవకాయ జాడీలు, 50 రకాల స్వీట్లు పంపించారు. అత్తింటివారి నుంచి వచ్చిన ఈ ఆషాఢం సారె కావిళ్ళు ఊరేగింపుగా పవన్ కుమార్ ఇంటికి తీసుకువచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో భారీగా వచ్చిన ఈ సారె కావిళ్లు అందర్ని ఆశ్చర్య పరచడమే కాక ఈ రెండు కుటుంబాల గురించి తెగ చర్చించారు. ఇక ఆడపిల్లవారు అంత భారీగా సారే పంపిస్తే.. తాము ఎందుకు తగ్గాలి అనుకున్న మగపిల్లాడి తరుఫువారు శ్రావణ సారెలో భాగంగా ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు కావిడి పంపించారు. వాటితో పాటు భారీ మొత్తంలో అరటి గెలలను కూడా పంపించారు. వీటన్నింటిని 5 వాహనాల్లో మామ బత్తుల బలరామకృష్ణ ఇంటికి పంపించాడు పవన్ కుమార్. వీరి సారె సందడి చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. -
పెళ్లి సందడి షురూ! ముహూర్తాలే ముహూర్తాలు!!
నిజామాబాద్ కల్చరల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి షురూ కానుంది. శ్రావణ మాసం ప్రారంభమవడంతో పాటు శుభకార్యాల నిర్వహణకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఐదు నెలలుగా వివాహాది శుభకార్యాలు వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, శ్రావణమాసం కావడంతో శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతేకాకుండా ఏడాదిన్నరగా కరోనా వల్ల అన్నిరంగాలు ఇబ్బందులకు గురయ్యాయి. అనేక వివాహాది శుభకార్యాలు నిలిచిపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో కల్యాణ మండపాలు కళ కళ లాడనున్నాయి. శుభకరం శ్రావణం.. శివకేశవులకు ప్రీతికరమైనది శ్రావణ మాసం. ప్రతియేటా ఈ మాసంలో వేల సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఈనెల 9 నుంచి శ్రావణం ఆరంభమైంది. పెళ్లీడుకొచ్చిన యువతీయువకులకు వారి తల్లిదండ్రులు వివాహాలు చేసేందుకు ముందుగానే నిశ్చయించుకున్నారు. ఇన్నాళ్లు ము హూర్తాలు లేక వేచిచూశారు. ప్రస్తుతం ముహూర్తాలు ఉండడంతో పెళ్లి భాజాలు మోగనున్నాయి. చేతినిండా పని.. ఈనెలలో అధికంగా పెళ్లిళ్లు ఉండడంతో అన్ని రంగాల వారికి చేతినిండా పని దొరుకుతుంది. ఫ్లవర్ డెకరేషన్, భజంత్రీలు, వంట మాస్టర్స్, ఫొటో, వీడియోగ్రాఫర్స్, పురోహితులకు మంచి డిమాండ్ ఏర్పడింది. వివాహాలు జరుపుకునేందుకు కల్యాణ మండపాలు, కన్వెన్షన్ హాల్స్, సత్రాలు, గదులు ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారు. మార్కెట్లో ఇప్పటికే వస్త్రాలు, బంగారం, సరుకుల కొనుగోళ్ల సందడి నెలకొంది. పట్టణాల్లోని బంగా రం షాపులు, వస్త్ర దుకాణాలు రద్దీగా మారాయి. శుభ ముహూర్త తేదీలు.. ఈనెలలో 12, 13, 14, 16, 18, 20, 21, 22, 25, 26, 27 సెప్టెంబర్ 1వ తేదీ ముహూర్తాలు ఉన్నాయి. వీటిల్లో 14వ తేదీ స్వాతీ, 16న అనురాధ, 18న ఏకాదశి, మూల 21న శ్రవణా, 25న ఉత్తరాభద్ర 26న రేవతి నక్షత్రాలు కలిసిన ముహుర్తాలు ఉండటంతో ఆయా తేదీల్లో ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు అభిప్రాయపడుతున్నారు. బాధ్రపద మాసంలో సెప్టెంబర్ 2నుంచి అక్టోబర్ 5వరకు శుభముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు చేయరు. తిరిగి అక్టోబర్ 7, 8,10 15, 16, 17, 20, 21, 23, 24, 31న ముహూర్తాలు ఉన్నాయి. నవంబర్ (కార్తీక మాసం)లో 6, 10, 12, 13, 17, 20, 21 తేదీలు, డిసెంబర్ (మార్గశిరమాసం)లో 5, 8, 9, 10, 12, 17, 18, 19, 24 తేదీల్లో ముహూర్తాలు వివాహానికి అనుకూలంగా ఉన్నాయి. వివాహాలకు మంచి రోజులు ఈనెల 27వ తేదీ వరకు పలు తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయి. కరోనాతో రెండేళ్లుగా శుభకార్యాలు తక్కువగా జరిగాయి. ప్రస్తుతం కరోనా తగ్గడంతో ఈ నెలలో చాలా జంటలు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. అలాగే అక్టోబర్, నవంబర్‌ల్లో ముహూర్తాలున్నాయి. – మురళీకృష్ణ మాచార్యులు, రామాలయ పూజారి, సుభాష్‌నగర్ -
నేటి నుంచి శ్రావణం.. శుభ ముహూర్తాలు ఈ రోజుల్లోనే
సాక్షి, అనంతపురం : మహిళలు అత్యంత ప్రీతికరంగా భావించే నోముల మాసం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. కోయిలమ్మ కుహు రాగాలతో స్వాగతం పలుకుతుండగా.. పాడి పంటలతో జిల్లా వాసులను సుసంపన్నం చేసేందుకు వర్ష రుతువూ రానే వచ్చేసింది. నోములకు, పేరంటాలకు ఈ మాసం సుప్రసిద్ధం. జిల్లా కేంద్రంతో పాటు ధర్మవరం, తాడిపత్రి, హిందూపురం వంటి చోట్ల ఆర్యవైశ్యులు వాసవీ మాతకు విశేష అలంకరణలు, పూజలు నిర్వహిస్తుంటారు. కరోనాకు ముందు టీటీడీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఏర్పాటు చేసేవారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది కూడా కొనసాగిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రధాన పండుగలన్నీ ఈ మాసంలోనే ఈ నెల 9 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకూ కొనసాగే శ్రావణ మాసంలో ప్రతి ఇల్లూ ఆలయాన్ని తలపిస్తుంది. ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఆధ్యాత్మిక కాంతులు వెలుగులీనుతాయి. ప్రధానంగా శుభకార్యాలకు అనువైన మాసం కావడంతో భాజాభజంత్రీలు శ్రవణానందకరంగా మోగనున్నాయి. ఈ నెల 12, 13 తేదీల్లో నాగుల చవితి, గరుడ పంచమి రాకతో ప్రధాన పండుగలు ఆరంభం కానున్నాయి. 14న లక్ష్మీవేంకటేశ్వర వ్రతం, 15న నారసింహ వ్రతం, 20న వరలక్ష్మీ వ్రతం, 22న శ్రావణ పౌర్ణిమ, రాఖీ పర్వదినం, 24న వెంకయ్య స్వామి ఆరాధన, 23 నుంచి మూడు రోజుల పాటు రాఘవేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు, 30న కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 6న పొలాల అమావాస్యతో శ్రావణం ముగిసి భాద్రపదం ప్రవేశిస్తుంది. ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి ఈ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే కట్టుబాట్లు, నియమాలు ప్రతివారికీ తగిన వ్యాయామాన్ని, ఆరోగ్యాన్ని అందించేవిగా ఉంటాయి. ముఖ్యంగా పసుపు కుంకుమల వినియోగం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. ఈ నెల 11, 13, 15, 18, 20, 22, 25, 27, 31, వచ్చే నెల 1, 4, 5 తేదీల్లో బలమైన ముహూర్తాలున్నాయి. – గరుడాద్రి సురేష్ శర్మ, వేద పండితులు వివాహాలకు, శుభాకార్యాలకు మంచి రోజులు.. ఈనెలలో 11, 12, 13, 14, 18, 19, 20, 25, 26, 27, సెప్టెంబర్ 1 తేదీలు పెళ్లిళ్లకు, ఇతర శుభాకార్యాలు జరుపుకోవడానికి మంచి రోజులు. గృహ నిర్మాణ పనులకు.. ఈనెలలో 11,15,18,20,23,25,27, సెప్టెంబర్ 1 తేదీలు గృహ నిర్మాణ పనులకు అనువైన రోజులు. గృహ ప్రవేశాలకు.. ఈనెలలో 15, 20, 27 తేదీలు గృహ ప్రవేశాలకు అనువైన రోజులు. -
ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం సందడి
-
ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం సందడి
-
కల్యాణం.. కరోనా ముళ్లు!
చెన్నేకొత్తపల్లి మండలం పెనుబోలు గ్రామానికి చెందిన పోతలయ్య మోతుబరి రైతు. తన కుమార్తె పావని వివాహం ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 1, 2 తేదీల్లో చేయాలని నిర్ణయించాడు. బంధువులందరినీ పిలిచి ఘనంగా చేయాలని భావించాడు. కానీ కరోనా పరిస్థితుల్లో విధిలేక 20 మంది బంధువుల సమక్షంలో కల్యాణం జరిపించాల్సి వస్తోంది. ఇక నగరానికి చెందిన శివశంకర్ రెడ్డి లాయర్. తన కుమారుని వివాహం భారీగా చేయాలని భావించినప్పటికీ కరోనా కేసుల కలకలంతో ప్రభుత్వ సూచనలకు లోబడి తక్కువ మందితోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది ఆర్భాటంగా పిల్లల పెళ్లిళ్లు జరిపించాలని భావించినా కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచన మేరకు అతితక్కువ మంది సమక్షంలో కానిచ్చేస్తున్నారు. అనంతపురం: ఇన్నిరోజులూ పెళ్లి చేయాలంటే కనీసం నాలుగు నెలల ముందు నుంచే ఏర్పాట్లలో మునిగిపోయేవారు. పెళ్లి పత్రికలు మొదలుకుని వేదిక, డెకరేషన్, వంటకాలు, ఆర్కెస్ట్రా, బంధుమిత్రుల కలయిక ఇలా ప్రతి విషయంలోనూ ఎంతో ఆర్భాటం చేసేవారు. ఖర్చు విషయంలో వెనుకాడేవారు కాదు. అయితే ప్రస్తుతం కరోనా పుణ్యమా అని పరిస్థితి పూర్తిగా మారింది. కేవలం 20 మంది సమక్షంలోనే పెళ్లి తంతును పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పెళ్లిళ్ల సీజన్ షురూ... ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా గుంపులు కలవలాంటే జనం జంకుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా మార్చి 22 నుంచి లాక్డౌన్ అమలులో ఉన్నా కొద్ది రోజుల తర్వాత నిబంధనల్లో కాస్తా సడలింపులిచ్చారు. ఈ పరిస్థితుల్లో కరోనా బారిన పడేవారి సంఖ్య క్రమేనా పెరుగుతుండటంతో కంటోన్మెంట్ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చారు. గుంపులుగా కలిస్తే కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంటుందనే ఆలోచనతో శుభ కార్యాలయాల నిర్వహణ విషయంలో నిబంధనలను తీసుకొచ్చారు. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 21 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతోంది. ఈ మాసం అంటేనే పెళ్లిళ్లకు పేరు. ఈ నెల 22 నుంచి వచ్చేనెల 16 వరకు బలమైన ముహూర్తాలున్నాయి. మంచిముహూర్తాలు ఉండడంతో చాలామంది పెళ్లిళ్లు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా టెస్టు తప్పనిసరి ♦ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వివాహ కార్యక్రమాలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇస్తారు. వరుడు, వధువు ఇద్దరి తరుఫున ఈ సంఖ్యకు మించకూడదనే నిబంధనను విధిస్తున్నారు. ♦ మండల మెజిస్ట్రేట్ అయిన తహసీల్దార్ల వద్దే దీని కోసం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ♦ పెళ్లి కార్యక్రమం పెట్టుకున్న వారు అనుమతి కోసం రూ. 10 నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌పై అఫడవిట్ తహసీల్దార్‌కు అందజేయాలి. ♦ దరఖాస్తుదారులు తమ ఆధార్‌కార్డులతో పాటు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వైద్య ధ్రువీకరణపత్రం తప్పకుండా జత చేయాలి. ♦ నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని 188 సెక్షన్ మేరకు చర్యలు తీసుకుంటారు. తగ్గనున్న ఖర్చులు ఫంక్షన్ హాలు, లైటింగ్, భోజనాలు, డెకరేషన్ తదితర వాటికి గతంలో ఖర్చు తడిసి మోపడయ్యేది. కరోనా పుణ్యమా అని ఈ ఖర్చులు భారీగా తగ్గిపోతున్నాయి. ఐదు నెలల కింద వరకు వీటి ఖర్చు కోసం రూ.లక్షలు ఖర్చు చేసేవారు. ఇప్పుడు వేల రూపాయలలోనే పెళ్లిళ్లు పూర్తి కానున్నాయి. పరిమితికి మించి అనుమతులు ఇవ్వకపోవడంతో ఆర్భాటాలకు వెళ్లే అవసరం ఉండదు. కరోనా భయంతో ఎంత సాదాసీదాగా చేసుకుంటే అంత మంచిదనే అభిప్రాయం సంపన్న వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఇక ఖర్చు విషయంలో మధ్య, పేద తరగతి వర్గాలకు చాలా వరకు ఉపశమనం కల్గినట్లే. నిబంధనలకు లోబడే పెళ్లిళ్లు శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. చాలా మంది పెళ్లిళ్లు చేసేందుకు ముహూర్తాలు కట్టుకున్నారు. కరోనా నేపథ్యంలో పరిమితికి లోబడే హాజరయ్యేలా చూడాలని వధువు, వరుడు బంధువులకు చెబుతున్నాం. నిబంధనలకు అనుగుణంగానే పెళ్లిళ్లు చేసేందుకు వారంతా సానుకూలంగా ఉన్నారు.– భూపతి శివ కుమార్ శర్మ, పురోహితులు, కొడవండ్లపల్లి ముదిగుబ్బ -
పెళ్లికి పిలవకుండా ఉంటే బాగుణ్ణు..
ప్రొద్దుటూరు : రండి..రండి.. దయచేయండి.. అంటారు..ఇదో రకమైన ఆహ్వానం.. ఇక మీరు దయచేయవచ్చు..అంటారు కొందరు..అంటే మీరు వెళ్లవచ్చు..అని పరోక్ష అర్ధం ధ్వనిస్తుంది. కరోనా సమయంలో పెళ్లిళ్ల ఆహ్వానాల పరిస్థితి అలానే తయారైంది. సమూహంగా ఏర్పడితే కరోనా వైరస్ సోకే ప్రమాదముంటుందనే హెచ్చరికల నేపథ్యంలో పెళ్లిళ్లు లాంటి శుభ లేదా అశుభ కార్యక్రమాలు నిర్వహించడం చాలావరకూ మానుకుంటున్నారు. కొందరు తప్పని సరి పరిస్థితుల్లో నిర్వహించినా అధికారుల అనుమతి పొందాల్సి ఉంటుంది. అది కూడా కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలని నిబంధన విధిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది అనివార్యం కూడా. 20మంది అనే సరికి ఎవరిని పిలవకుండా ఊరుకోవాలో తెలియక నిర్వాహకులు సతమతం అవుతున్నారు. పిలవకపోతే ఏమనుకుంటారో అనే ఫీలింగ్..ఇదిలా ఉంటే మరోకోణంలో పెళ్లికి పిలుస్తారేమోనని అటువైపు భయపడుతున్నారు. పిలవకుండా ఉంటే బాగుణ్ణు అని కూడా అనుకుంటున్నారు. కాగా ఇప్పటివరకూ కార్యక్రమాలకు అనుమతి జిల్లా కలెక్టరేట్ నుంచి పొందాల్సివచ్చేది. దీనివల్ల జాప్యం అవుతోంది. దీంతో మండల పరిధిలో తహసీల్దార్లకే బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 21వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో పెద్ద సంఖ్యలో వివాహాలు నిర్వహించుకోవడానికి బంధువులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్‌కింది స్థాయిలోనే పెళ్లిళ్లకు అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇస్తామని ప్రొద్దుటూరు తహసీల్దారు జె.మనోహర్‌రెడ్డి తెలిపారు. మిగతా శుభకార్యాలకు ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ♦ కలెక్టర్ ఆదేశాల ప్రకారం కేవలం 20 మందికి మాత్రమే తహసీల్దార్ అనుమతి ఇస్తారు. ♦ పెళ్లి కుమార్తె, పెళ్లికుమారుడికి సంబంధించి ఇరువైపులా కలిపి ఈ సంఖ్యను మాత్రమే అనుమతించనున్నారు. ♦ వివాహ ఆహ్వాన పత్రికతోపాటు అనుమతి కోరేవారు రూ.10 నాన్ జ్యుడీషియల్‌స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్దార్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ♦ ముందుగా దరఖాస్తు చేసుకునేవారు తమ ఆధార్ కార్డులతోపాటు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వైద్యులు ఇచ్చినపత్రాలను జత చేయాలి. ♦ నిబంధనలను ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్–188 ద్వారా కఠిన చర్యలు తీసుకుంటారు. -
ఆకాశ పుష్పం!
సాక్షి, సిటీబ్యూరో: శ్రావణమాసం.. సౌభాగ్యానికి, లక్ష్మీకటాక్షానికి నిదర్శనం. గృహాలన్నీ నిత్య పూజలతో శోభాయమానంతో దర్శనమిస్తుంటాయి. మహిళలు ఉపవాసాలు, ఆలయాల దర్శనం, భక్తిప్రపత్తులతో ఉంటారు. ఈ క్రమంలో శ్రావణ శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఆనవాయితీ. దీంతో ఒకరోజు ముందునుంచే వరలక్ష్మి వ్రతానికి అవసరమయ్యే పూజా సామగ్రిని సిద్ధం చేసుకుంటారు. వరలక్ష్మీ వ్రతం నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు గుడిమల్కాపూర్ పూల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. పూల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా వరలక్ష్మీ పూజకు ప్రత్యేకంగా వినియోగించే కమలం పూల ధరలను వ్యాపారులు భారీగా పెంచారు. కమలం పూల జత రూ.150 వరకు పలికింది. అరటి కొమ్మలు జత రూ. 80 నుంచి రూ.120 వరకు విక్రయించారు. ఇతర పూల ధరలు సాధారణ రోజుల్లో కంటే రెట్టింపయ్యాయి. శ్రావణ మాసం డిమాండ్‌కు తోడు.. ఇతర రాష్ట్రాల నుంచి పూల దిగుమతులు పెద్దగా రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని హోల్‌సెల్ వ్యాపారులు చెబుతున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం పూల ధరలు మరింత పెరిగే సూచనలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పూల తోటలకు నష్టం వాటిల్లడం ధరల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. పూల సరఫరా తగ్గింది.. వర్షాలతో రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ తదితర జిల్లాల నుంచి వచ్చే పూలు భారీగా తగ్గాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా చిక్బల్లాపూర్ నుంచే ఎక్కువగా వివిధ రకాల పూలు మార్కెట్‌కు వస్తున్నాయి. దూరప్రాంతాల నుంచి పూలు దిగుమతులు కావడంతో కూడా ధరలు పెరిగాయి. – కె.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్ -
శ్రావణ మాసం సకల శుభాలకు ఆవాసం...
శ్రావణమాసం... ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపించే మాసం. నెల రోజులపాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందని పండిత ఉవాచ. అంతేకాదు... ఈ నెలలో ఎన్నో పండుగలు, పర్వదినాలు. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు మహావిష్ణువుకు, ఆయన దేవేరి మహాలక్ష్మికి; లయకారుడైన పరమేశ్వరుడికి, ఆయన సతీమణి మంగళ గౌరీదేవికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం పేరుతో ఏర్పడిన మాసం కావడం వల్ల ఈ మాసం లక్ష్మీవిష్ణుల పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవకార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం అంటే శుభమాసం. దీనిని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం పాలసముద్ర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు. ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీ, తులసి పూజలు, శనివారం హనుమంతుడు, వేంకటేశ్వరుడు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితోపాటు గరుడ పంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, రుషి పంచమి, గోవత్స బహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. శ్రావణం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించి, మంచి కలిగించడానికి, మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్ధం వైపు మళ్లించి మానసిక ప్రశాంతత పొందడానికి, ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చే పండుగలలోని ఆచారాల ముఖ్యోద్దేశం. సకలదేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం. ప్రతిరోజూ పండుగలా ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. ఈ మాసంలో రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే దీర ్ఘసుమంగళీయోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని విశ్వాసం. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే. శివారాధనకు ఎంతో శ్రేష్ఠమైనది ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రివేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని శాస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యర్థం ఉపవాసం ఉండ గలిగినవారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ మాసం దీనిని ఒక వ్రతంగా పెట్టుకుని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయి. మంగళ కరమైన మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయని వ్రత కథ చెబుతోంది. ఐశ్వర్య ప్రదమైన వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ దేహిమే రమే అని పఠిస్తూ చేతికి తోరం కట్టుకోవాలి. అనంతరం ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె లాంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త, కలువ, తుమ్మి లాంటి ఇష్టమైన పుష్పాలతో ఈశ్వరారాధన చేస్తారు. శ్రావణమాసం మొదలైన నాలుగో రోజునే వచ్చే పండుగ నాగపంచమి. శివుడి ఆభరణమైన నాగేంద్రుడిని పూజించడం ఆచారం. పాలు, మిరియాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగపడగలకు భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి, ఉపవాసం ఉంటే మంచి సంతానం కలుగుతుంది. అందుకే దీన్ని పుత్రద ఏకాదశి అన్నారు. శుక్ల పక్ష పౌర్ణమి శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధన పర్వదినం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ, వేదవిద్యారంభమూ చేస్తారు. కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి పర్వదినాలు, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. -
భక్తులతో భలే వ్యాపారం
సాక్షి, విజయనగరం : కార్తీకమాసం అనంతరం ఏడాదిలో అత్యంత పవిత్రంగా పూజాధికాలు నిర్వహించేది శ్రావణ మాసంలోనే. ఈ మాసంలో నాలుగు వారాల పాటు ప్రతీ శుక్రవారం వరలక్ష్మీ దేవికి మహిళలు పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించారు. కుటుంబ సభ్యులంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని భక్తి ప్రవత్తులతో పూజలు నిర్వహిస్తారు. అయితే, మహిళల భక్తి భావాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పూజాసామగ్రికి ఇష్టారాజ్యంగా ధరలు పెంచి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. పెరిగిన ధరలు... హిందువుల భక్తి భావాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కువగా పూజలు నిర్వహించే సీజన్లో పండ్లకు కృత్రిమ కొరత సృష్టించి ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 1వ తేదీ వరకు ఆషాడ మాసమే. 2వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. ఆషాడం ముగిసిన వెంటనే వచ్చే మొదటి శుక్రవారం కావడంతో వినియోగదారుల తాకిడిని గమనించిన వ్యాపారులు ఒక్క సారిగా ధరలు పెంచేశారు. డజను అరటి పళ్లు రూ.50 నుంచి రూ.60కి విక్రయించారు. అదే టెంకాయలు అయితే రూ.30 నుంచి రూ.35 ధరల్లో సైజ్‌ను బట్టి అమ్మకాలు చేశారు. ఇక అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పండ్ల ధరలు సైతం ఆకాశన్నంటాయి. కిలో యాపిల్ ధర రూ.150 నుంచి రూ.170కు విక్రయించారు. వాస్తవానికి ఆషాడం రోజుల్లో పూజలు నిర్వహించడం తక్కువగా ఉండటంతో వీటికి అంత డిమాండ్ ఉండేది కాదు. అయితే, శ్రావణ మాసం ఆరంభంలో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్న ధరలను నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దారుణంగా పెంచేశారు.. నిన్నటి వరకు అందుబాటులో ఉన్న పండ్ల ధరలను ఒక్కసారిగా వ్యాపారులు పెంచేశారు. డజను అరటి పళ్లు రూ.50 చెబుతున్నారు. అరడజను అయితే రూ.30కి తగ్గదంటున్నారు. నచ్చితే కొనండి లేదంటే పొమ్మంటున్నారు. ధరల నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం అధికారులైనా దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి. – ఎన్.నాగభూషణం, ప్రైవేటు ఉద్యోగి, విజయనగరం -
శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు
-
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శ్రావణ సంబరాలు
ఆషాఢమాసం ఆఫర్లను శ్రవణమాసంలోనూ కొనసాగించాలని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం నిర్ణయించింది. ఆషాఢమాసంలో కస్టమర్ల నుంచి వచ్చిన విశేష స్పందన నేపథ్యంలో... దక్షిణాది వాసులకు అత్యంత శుభప్రదమైన శ్రావణమాసంలో సైతం ఆఫర్లను కొనసాగించాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. షోరూమ్‌లలో సరికొత్త స్టాక్స్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఆషాఢమాసంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తూకం పద్దతిలో ప్రవేశపెట్టిన నంబర్ వన్ కిలో సేల్కు మంచి ఆదరణ లభించిందని తెలిపింది. అన్ని రకాల సరికొత్త స్టాక్‌పై 66 శాతం వరకూ ఇచ్చిన తగ్గింపు చీరల అమ్మకాన్ని భారీగా పెంచిందని కూడా పేర్కొంది. -
శివుడి ప్రీతి కోసం కావడి వ్రతం
కావడి వ్రతం ఎన్ని వందల ఏళ్ల క్రితం మొదలైంది అనడానికి సరైన ఆధారాలు లేవు. తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని పుణ్యక్షేత్రాలకు తిరిగిన శ్రావణ కుమారుడు వారిని హరిద్వార్‌లో పుణ్యస్నానం చేయించి తిరిగి వస్తూ ఘటంలో గంగాజలం తెచ్చుకున్నాడట. అలా ఈ ఆచారం మొదలైందని అంటారు. ఉత్తరాదిన శ్రావణ మాసం జూలై ద్వితీయార్థం నుంచే మొదలైపోతుంది. శ్రావణ మాసం రాగానే ‘హరిద్వార్’, ‘గోముఖి’, ‘గంగోత్రి’ వంటి పుణ్యక్షేత్రాలు ‘కన్వరీయల’తో కిటకిటలాడతాయి. ‘కన్వరీయులు’ శివ భక్తులు. వీరు శ్రావణ మాసంలో గంగా నదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాలను చేరుకుని అక్కడి గంగాజలాలను కావడిలో నింపుకుని చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు చేరుకుని ఆ జలాలతో శివుని అభిషేకం నిర్వహించడం ద్వారా వ్రతాన్ని ముగిస్తారు. తమ సొంత ఊరి వరకూ చేరుకుని ఊళ్లోని శివుని గుడిలో అభిషేకం ముగిస్తారు. ‘కన్వర్ యాత్ర’, ‘కావడి యాత్ర’గా పేరుగడించిన ఈ యాత్ర ప్రస్తుతం ఆచరణలో ఉంది. కొందరు భక్తులు శ్రావణ మాసంతో మొదలుపెట్టి శివరాత్రి మధ్యకాలంలో ఎప్పుడైనా కావడి యాత్రను చేస్తారు. కాని ఎక్కువగా శ్రావణమాసంలోనే ఈ వ్రతం ఆచరించడం పరిపాటి. శివుడికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం శివునికి ఇష్టమైన మాసం అనీ ఈ మాసంలోనే శివుడు పార్వతిని పరిగ్రహించాడని భక్తుల నమ్మకం. అందువల్ల ఉత్తరాదిన ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యాణా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హరిద్వార్‌కు లేదా గంగానది పరివాహక పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ కాషాయ వస్త్ర ధారణ చేస్తారు. ఆ తర్వాత ఒక కావడి బద్దకు ఇరువైపులా స్టీలు, ఇత్తడి, లేదా ప్లాస్టిక్ ఘటాలను కట్టుకుని వాటిలో గంగాజలం నింపుకుంటారు. ఈ వ్రతం పూర్తయ్యేవరకు కావడి పవిత్రమైనది. దానిని భుజాన మోస్తూ బోసి పాదాలకు దగ్గరిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రానికి గానీ, లేదా తమ సొంత ప్రాంతంలోని శైవ క్షేత్రానికి గాని చేరుకుంటారు. తీసుకొచ్చిన గంగాజలంతో శివుడికి అభిషేకం జరిపిస్తారు. ఈ వ్రతాన్ని ఒక్కరుగా చేస్తారు. లేదా బృందాలుగా చేస్తారు. ఈ కావళ్లలో రకాలు ఉన్నాయి. ‘వ్యక్తి కావళ్లు’, ‘వాహన కావళ్లు’ అనే విభజనలు ఉన్నాయి. వ్యక్తి కావళ్లు పట్టిన వాళ్లు దారి మధ్యలో కావడిని దించవచ్చు. విశ్రాంతి, కాలకృత్యాలకు విరామం తీసుకోవచ్చు. కాని కొన్ని రకాల కావడి వ్రతంలో కావడిని కిందకు దించకూడదు. అందువల్ల ఆరుమంది సభ్యుల బృందం మార్చుకొని మార్చుకొని కావడి మోస్తూ గమ్యం చేరుకుంటుంది. ఎప్పుడు మొదలైంది కావడి వ్రతం ఎన్ని వందల ఏళ్ల క్రితం మొదలైంది అనడానికి సరైన ఆధారాలు లేవు. తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని పుణ్యక్షేత్రాలకు తిరిగిన శ్రావణ కుమారుడు వారిని హరిద్వార్‌లో పుణ్యస్నానం చేయించి తిరిగి వస్తూ ఘటంలో గంగాజలం తెచ్చుకున్నాడట. అలా ఈ ఆచారం మొదలైందని అంటారు. కాని పరశురాముడు ఈ ఆచారాన్ని మొదలెట్టాడని అనేవారు కూడా ఉన్నారు. పురాణ ఉదాహరణ తీసుకుంటే క్షీరసాగర మథనంలో వెలువడ్డ హాలాహలాన్ని శివుడు కంఠాన నిలిపాక ఆయన కంఠం నీలంగా మారింది. దాంతో పాటు ఒక సన్నటి శిఖ ఆ హాలాహలం నుంచి రేగి శివుడిని ఇబ్బంది పెట్టసాగింది. ఇది తెలిసిన దేవతలు గంగానదికి వెళ్లి గంగాజలాన్ని తెచ్చి ఆయనకు అభిషేకం జరిపించారు. అలా చేయడం వల్ల ఆ శిఖ చల్లబడి శివుడికి సౌకర్యం కలుగుతుందని భావించారు. అప్పుడు అలా మొదలైన ఆచారం ఇప్పటికీ కొనసాగుతుందని భక్తులు నమ్ముతారు. కాలకూట విషాన్ని గొంతులో మోస్తున్న శివుడిని చల్లబరిచే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ బోళా శంకరుడు ప్రసన్నమై భక్తుల కోర్కెలు నెరవేరస్తాడని భావిస్తారు. చాలా పెద్ద ఉత్సవం కావడి వ్రత సమయంలో ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు వ్రతబద్ధులు అయిన కన్వరీయుల సౌకర్యం కోసం మార్గమధ్యంలో ఎన్నో ఏర్పాట్లు చేస్తాయి. వారికి ఆహారం ఉచితంగా ఇవ్వబడుతుంది. తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు ఉంటాయి. కావడి నేల మీద పెట్టకుండా ఉండేందుకు ప్రత్యేకమైన స్టాండ్లు కూడా అందుబాటులోకి తెస్తారు. అలహాబాద్, వారణాసి, దియోఘర్ (జార్ఘండ్), సట్లజ్గంజ్ (బీహార్) వంటి క్షేత్రాలలో కూడా కన్వరీయులు దీక్ష బూనడం ఈ శ్రావణ మాసంలో కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనవైపు అయ్యప్ప దీక్షతో సమానంగా ఉత్తరాదిన కావడి దీక్ష ఆచరణలో ఉంది. -
మూడు ముళ్లు.. మూడు తేదీలు
సాక్షి, నరసన్నపేట : మూఢం ముంచుకొస్తోంది. వివాహాది శుభకార్యాలు జరుపుకునే వారికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ ముహూర్తాల్లోనే వివాహాలు, ఇతర శుభకార్యాలు జరుపుకొనేందుకు ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వివాహాలు అధికంగా జరుగుతున్నాయి. కల్యాణ మండపాలు ఖాళీ లేవు. శుభకార్యక్రమాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు. మార్చి నుంచి వివాహాలు, ఇతర శుభకార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ నెల 27 వతేదీ చివరి ముహూర్తం. ఆ తర్వాత శుక్ర మూఢం కారణంగా మరో మూడు నెలల పాటు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. ఈనెల 25, 26, 27 తేదీల్లో ఉన్న ముహూర్తాల్లో శుభకార్యాలు చేసుకోలేని వారు ఆశ్వయుజ మాసమైన అక్టోబర్ 2 వరకూ వేచి ఉండాల్సిందే. ఈ మూఢమి కాలం ముగిసే వరకూ పెళ్లి వారితో పాటు పురోహితులు, కేటరింగ్, పూలు, మండపాలు డెకరేషన్ చేసేవారూ, కల్యాణ మండపాల యజమానులు నిరీక్షించక తప్పదు. మరో మూడు నెలలు శుభ కార్యాక్రమాలకు ముహూర్తాలు లేక పోవడంతో శుభకార్యాలుఈ నెల 27 లోగా ముగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అంతటా హడావుడి నెలకొంది. వస్త్ర, బంగారు దుకాణాల్లో రద్దీ నెలకొంది. మండపాల డెకరేషన్, పురోహితులు బిజీబిజీగా కనిపిస్తున్నారు. శ్రావణ మాసంలోనూ శూన్యమే జూలై నెల ఆషాఢం కావడంతో అది శూన్యమా సం. ఆ తర్వాత వచ్చేది ఆగస్టు (శ్రావణమాసం) లో ఏటా వివాహాది శుభ కార్యక్రమాలకు మంచి ముహూర్తాలు గతంలో ఉండేవి. ఈ ఏడాది శ్రావణ మాసంలో కూడా మూఢం వచ్చి చేరింది. అలాగే సెప్టెంబర్ (భాద్రపద మాసం) కూడా శూన్యమాసమైంది. దీంతో వరుసగా ఈ మూడు నెలలు శుభకార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. తిరిగి అక్టోబర్ 2 నుంచి శుభ ముహూర్తాలు ఉన్నట్లు సత్యవరాగ్రహరానికి చెందిన ప్రముఖ పురో హితులు జోష్యుల సంజీవ శర్మ, ఆకేళ్ల సుబ్రహ్మణ్యంలు తెలిపారు. -
విందు
శ్రావణమాసం వచ్చింది. పెళ్ళిళ్ళు మొదలయ్యాయి. క్రిందటి ఏడాది శ్రావణంలోనే పెద్దకూతురు అభిసారికకి పెళ్ళి చేశాడు వసంతరాయుడు. రాయుడికి వ్యవసాయంతో పాటు, ఓ పెద్ద ఫాన్సీ దుకాణం, టెంటు హౌస్, వడ్డీ వ్యాపారం కూడా ఉన్నాయి. పైగా పుట్టి పెరిగిన ఊరు కావడంతో .. అతనంటే తెలియని వారు లేరనే చెప్పాలి. డబ్బూ పలుకుబడి ఉన్న వసంతరాయుడి మాటకి చెల్లుబాటు ఎక్కువే. ఎప్పుడూ చేతిలో ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఆడేవి. బంధువులకీ, స్నేహితులకీ కొదవే లేదు. చుట్టుపక్కల పది గ్రామాలకి పరిచయం అతని పేరు. పెద్దకూతురు అభిసారిక పెళ్ళికి ఆకాశం అంత ‘పందిరీ’ భూదేవంత ‘పీటా’ వేసి, చేసినట్టే చేశాడు. ఫ్యాన్సీ దుకాణానికి అలవాటుగా వచ్చే వారందరూ అతిథులైపోయారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు జనాలు. వచ్చినవాళ్ల కార్లు, బళ్లు పెట్టుకోడానికి చోటు చాలక రోడ్డు వారన.. ఊరి పొలిమేర దాటింది లైను. ఇంటి ముందు ఉన్న కాలువగట్టు అంతా లైటింగు ఎరేంజ్ చేసారు. రోడ్డు అంతా దేదీప్యమానంగా పట్టపగలుని తలపించింది. ఇంటి ప్రక్కనే కొబ్బరితోటలో.. షామియానాలు వేసి, ఫౌంటెన్లు, ఆధునిక డెకరేషన్లతో ఎక్కడికక్కడ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి, మ్యూజికల్ ప్రోగ్రాములతో, ఎన్ని హంగులు చెయ్యాలో అన్ని హంగులు చేసి అంగరంగ వైభవంగా జరిపించాడు మొట్టమొదటి పెళ్ళని. వంట వాళ్లను విజయవాడ నుంచి రప్పించాడు. తిన్న వాళ్ళకు తిన్నంత అన్నట్లు, వెళ్ళీ వెళ్ళగానే అతిథులకు కప్పుల్లో పోసి .. సూప్స్ అందించారు. ఆ పక్కనే, చాట్లు.. పానీపూరీ, భేల్‌పూరీ, మురీ, జిలేబీలు, కాకినాడ కాజాలు, బ్రెడ్ హల్వా, బూరెలు , పొయ్యిలు పెట్టి అప్పటికప్పుడు తయారుచేసి వడ్డిస్తున్నారు. మరో పక్క పలావు, ఫ్రైడ్ రైసులు, కూరలు, గడ్డ పెరుగు. చివరిగా ఐస్‌క్రీములు, రసగుల్లాలు. ఆ విందు ఘుమఘుమలు మరచిపోక ముందే . ఏడాది తిరిగేసరికి .. రెండో కూతురు మధులతకు కూడా పెళ్లి చేసెయ్యాలని అనుకున్నాడు రాయుడు. మధులత డిగ్రీ చదివింది ‘‘ఇంకా పైకి, ఏమ్మే చదువుతాను నాన్నా. నా ఫ్రెండ్స్ లాగా ఆంధ్రా యూనివర్సిటీ, వైజాగ్ వెళ్లి చదువుకుంటాను’’ అడిగింది గోముగా.. అలా అడిగితే తండ్రి కాదనడని. ‘‘ఎంత చదివించినా.. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టాల్సిందే కదమ్మా! మంచి సంబంధం ఎదురొస్తే కాదంటామా! అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు బెంగుళూరులో.. నీకు ఈడూ జోడూ బాగుంది. దానంతట అదే వచ్చిన సంబంధాన్ని వదులుకుంటామా’’ బుజ్జగించాడు. ఇది ఇలా ఉండగా రెండు వీధుల అవతల ఉన్న వసంతరాయుడి... చిన్నాన్న కొడుకు, సమీప బంధువు అయిన రామనారాయణరావు కూడా తన కూతురు ప్రజ్వలకి పెళ్ళి తలపెట్టాడు ఆ ఏడాదే. రామనారాయణరావు మొన్నీ మధ్యే .. అన్నగారైన రాయుడి మీద పోటీ చేసి సర్పంచిగా గెలిచాడు. కాస్త చదువుకున్న వాడు, మృదుస్వభావి కావడంతో... ఊరిలో మంచి పేరే ఉంది.. డబ్బూ పరపతి ఉన్న రాయుడి అహంభావం... అతని చదువు ముందు ఓడిపోయింది. నారాయణరావే గనుక అడ్డురాకపోతే.. ఏకగ్రీవంగా గెలిచేవాడు వసంతరాయుడు. ఆయన పరపతి అలాంటిది.ఊరిలో మరో వర్గం వాళ్లు.. చదువుకున్న వాడని రామనారాయణను పోటీకి నిలబెట్టిన.. రోజు నుంచే అన్నదమ్ముల మధ్య చీలిక ఏర్పడింది. బంధుత్వం బీటలు వారింది. వసంతరాయుడు ఆ ఓటమిని జీర్ణించుకోలేక ‘దొంగ ఓట్లు వేయించుకుని గెలిచాడు రామనారాయణ’ అంటూ అనవసరపు ప్రచారం కూడా చేశాడు. ఒకప్పుడు బాగానే కలిసి ఉన్న వాళ్లకి రాజకీయాల కారణంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. కనిపిస్తే తప్పుకు వెళ్ళిపోవడమే.. తప్ప ఇదివరకటి ఆప్యాయతలు లేవు. అలా అని వైరమూ లేదు. అంతా స్తబ్దత. సరిగ్గా తన కూతురికి పెళ్లి చెయ్యాలనుకున్నప్పుడే.. నారాయణరావూ తన కూతురికి పెళ్లి పెట్టుకోవడం బొత్తిగా నచ్చలేదు. అందుకే లోపాయకారీగా నారాయణరావు కూతురి పెళ్లి కన్నా.. రెండు రోజుల ముందు ముçహూర్తానికి, తన కూతురు పెళ్లికి ముహూర్తం పెట్టించుకున్నాడు. నారాయణరావు ఇంటి పెళ్లికి వెళ్లకపోతే, తన ఇంటి పెళ్లి పనుల వల్ల వెళ్లలేకపోయాడని ఊళ్లో వాళ్లు అనుకుంటారు.నారాయణరావు తనకి ఎందులోనూ పోటీ కాదని తెలిసినా.. ఏదో న్యూనత. ఇప్పుడు రాజకీయంగా పలుకుబడి పెంచుకుంటూ, ఎదుగుతున్నాడు. తన ఇంట చివరి పెళ్లి వేడుక కాబట్టి, అందరికీ గుర్తుండి పోయేలా ఖర్చు విషయంలో.. రాజీ పడ కూడదనుకున్నాడు.ఈసారి దగ్గరలో ఉన్న సిటీలో.. కళ్యాణమండపం మాట్లాడాడు. కనీసం నాలుగువేలమందికి అయినా సరిపడేలా.. రోజుకి అద్దే రెండు లక్షలు. ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ‘రాత్రి పూట.. చీకట్లో అంత దూరం ఏం వస్తాం రాయుడు’ అంటారని, దగ్గర వాళ్లకి కార్లు ఎరేంజ్ చేసాడు. ఓపెన్ ప్లేస్.. అంతా షామియానాలు, వాటి క్రిందే, వంటలూ. కళ్యాణవేదిక అంతా జలతారు పరదాలు, మెరుపు దారాలు, గాజు పూసలతో అలంకరణ, వాటిపై నిముషానికి ఓ రంగు మారే.. రంగుబల్బుల ఫోకస్. మెరుపు దారాలూ. గాజు పూసలూ క్షణక్షణానికి రంగులు మారి, మిలమిల మెరుస్తూ.. మాయాజగత్తులోకి అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తున్నాయి. ఆ వింత అందాన్ని వచ్చినవాళ్లు తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు. ద్వారం దగ్గర నిలబడి, వచ్చేవాళ్లకి వసంతరాయుడు స్వాగతం పలుకుతున్నాడు. వచ్చే జనాల్ని చూసి గర్వంతో ఉప్పొంగుతూ, మీసం మేలేస్తున్నాడు. ద్వారానికి దగ్గరలోనే పెద్ద డయాస్ మీద, ‘అత్తిలి’ వాళ్ళ డాన్సు ప్రోగ్రాం ఏర్పాటు చేసాడు. మైకుల్లో డ్రమ్స్ వాయిద్యాలు.. సినిమా పాటలతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తిపోతోంది. ఎదుటివాళ్ల మాటలు వినిపించనంతగా రణగొణధ్వనులు. అంతా ఇరవై.. ఇరవై అయిదేళ్ల వయసున్న అమ్మాయిలు, అబ్బాయిలు. వయసులో ఉన్నారేమో! ఉరకలెత్తే ఉత్సాహం. మిలమిలా మెరిసిపోయే డ్రెస్సులు. వాళ్ల ఊరిలో మాట ఏమోగాని.. బయటకి వచ్చేసరికి అమ్మాయిలకి అతి ఉత్సాహం వచ్చేసింది. సినిమా ప్రోగ్రాముని తలపించేలా.. అబ్బాయిలతో కలిసి పాటలు పడుతూ.. డాన్సు చేస్తూ, అదర గొడుతున్నారు. పల్లెటూరి జనాలు ఉత్సాహంగా కళ్లప్పగించి చూస్తున్నారు. ఎంతైనా రాయుడిగారి వైభోగమే.. వైభోగం అనుకుంటూ. కొంతమంది.. వెళ్లగానే పండ్లరసాల కౌంటరు దగ్గర క్యూ కట్టారు. పిల్లలు చాట్ల కౌంటరు దగ్గరకు చేరిపోతే, తల్లులూ వాళ్లని అనుసరించారు. శనివారం కావడంతో కొంతమంది టిఫెన్ల వైపు నడిచారు. పెసరట్ల దగ్గర ఎంతకీ ఖాళీ అవడం లేదు. వేడి వేడి పెసరట్లు అంటే ఎవరికి ఇష్టముండదు. ఒకేసారి ఎనిమిది అట్లు కాలుస్తున్నా, అక్కడే ఎక్కువమంది గుమిగూడారు. దానిలోకి ఉప్మా అందరికీ అందడం లేదు. నాకు, నాకంటూ ప్లేట్లు ముందుకు చాచే వారికోసం.. పూరీలు వేసిన వెంటనే తీసెయ్యాల్సి వస్తోంది. ప్లేటులో పడిన పదార్ధాలు.. ఉఫ్, ఉఫ్ అంటూ ఊదుకుంటూ ఆదరాబాదరాగా ముగించేస్తున్నారు. ఏ పదార్ధం అయినా పొయ్యి మీద నుంచి దించిన తరువాత కొద్దిసేపు ఆగి తినాలి. కాస్త చల్లారితేనే తినడానికి వీలుఅవుతుంది. అయితే అక్కడ అంత టైము లేదు. ఇడ్లీలు.. రుచి లేని పిండి ముద్దలు.. చెత్తడబ్బాల్లోకి చేరిపోతున్నాయి. అరటికాయ బజ్జీలతో పాటు వడ్డించిన .. పొట్టి సిమ్లా మిర్చి చురుకు.. నాలిక్కి తగల్లేదు. ఏ పదార్థం తిన్నా ‘నూనెలు’ అవసరాన్ని మించిపోయి ఉన్నాయి. గట్టిగా నొక్కితే ఓడిపోతున్నాయి, డైటింగు చేసే వారి గుండెలు గుబగుబలాడేలా. కాస్త దూరంలో అన్నం, కూరలూ, పచ్చళ్లూ, పొడులూ.. పులుసులూ, అప్పడాలూ, వడియాలూ ఒక్కటేమిటి? తినగలిగే పదార్థాలు ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు. దేశంలో ఆకలికేకలు ఎన్నో వినిపిస్తున్నా.. విందుల్లో మిగిలిన వంటకాలు ‘లేని వాళ్లకు’ పంచుతున్నాం అన్నా. ఇక్కడ అందుకు భిన్నంగా.. గ్రౌండులో తిండి ‘పందేరం’ జరుగుతోందా అన్నట్లు .. అన్నీ వేయించుకుని.. నచ్చితే తిని, లేకపోతే వదిలేస్తున్నారు. ఎక్కడ చూసినా సగం కంచాల్లో వదిలేసే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. ఆహారాన్ని వృథాగా పారేయ్యకూడదు అన్న విషయం తెలిసినా తప్పడం లేదు. కడుపు పట్టనన్ని తినలేరుగా. ఏది వెయ్యించుకుంటున్నారో! ఎందుకు వెయ్యించుకుంటున్నారో తెలీదు. అవతల వాళ్లే వడ్డించేస్తున్నారు.. వేయించేసుకుంటున్నారు. వీలుకాకపోతే వేస్టుడబ్బా ఉండనే ఉంది. వచ్చేవాళ్లు వస్తుంటే, వెళ్లేవాళ్లు వెళుతున్నారు. ఎంగిలి కంచాలూ, తాగి పడేసిన గ్లాసులూ, కప్పులతో.. కాస్సేపటికే అక్కడంతా చిత్తడి చిత్తడిగా తయారయ్యింది. రామనారాయణరావు భార్యతో కలిసివచ్చాడు. భోజనం ముగించి రాయుడిని ఉద్దేశించి ‘‘వస్తాను అన్నయ్యా! ఇంకా చెయ్యాల్సిన పెళ్లి పనులు చాలా ఉండిపోయాయి. మర్చిపోకుండా.. ఎల్లుండి మా ఇంటికీ రావాలి’’ వెళుతూ మరోసారి ఆహ్వానించాడు అన్నయ్యని. ఎవరి మాట ఎలా ఉన్నా సర్పంచి .. రామనారాయణరావు, అదే తమ్ముడు రామనారాయణరావు వచ్చి, భోజనం చేసి, తన వైభవాన్ని చూసినందుకు చాలా సంతోషపడ్డాడు రాయుడు. ‘అలాగే లేరా. రాక ఎక్కడికి పోతాను. అప్పటికి మా ఇంట్లో పనులు తెమలక పోతాయా!’ అన్నాడు దర్పంగా నవ్వుతూ. వచ్చిపోయే జనాల్ని ఓరకంట గమనిస్తూ .. వచ్చే వాళ్ళకి అభివాదాలు చేస్తూ. ముహూర్తం అర్ధరాత్రి వేళ కాబట్టి, భోజనాలు చేసి వెళ్ళిపోయేవారే, ఎక్కువ. పెళ్ళిమండపం మేడపై ఉంది. కింద హోరుతో ఏమాత్రం ఇబ్బంది లేని ఏసీ గది. రామనారాయణరావు ఇంట పెళ్లిబాజాలు మ్రోగాయి. గ్రామంలో జనాలు తరలి వచ్చారు సర్పంచి గారింట్లో పెళ్లికి. స్నేహితులన్నవాళ్లు కొంతమంది హాజరయ్యారు. పెంకుటింటి ముందు వాకిట్లో ఉన్న ‘పెళ్లి అరుగు’ మీదే పెళ్లి. ఆ ఇంట్లో ఎన్ని పెళ్లిళ్లు జరిగినా ఆ పెళ్లి అరుగు మీదే చేస్తారు. పల్లెటూళ్లలో ప్రతిఇంటి పెరట్లో తులసికోట ఎలా ఉంటుందో .. వీధి గుమ్మంలో పెళ్లి అరుగూ అలాగే ఉంటుంది. ఇంటి చుట్టూ కొబ్బరాకుల చలువ పందిళ్లు. పచ్చటి కొబ్బరాకుల సందుల గుండా వీచే గాలి.. ఓ కొత్త పరిమళాన్ని చుట్టుప్రక్కల అంతా వ్యాపించి, మనసును చల్లగా సేద తీరుస్తుంది. ఆ పందిరిలో ఓ ప్రక్కగా కుర్చీలు, బల్లలు వేసి, అరిటాకుల్లో భోజనాలు వడ్డించారు. పెళ్లి బాజాలు వింటూ భోజనాలు కానిస్తున్నారు వచ్చినవాళ్లు .. కొసరి కొసరి వడ్డి్డస్తున్నారు కుర్రాళ్లు. భోజనాలు చేసి పాన్ నములుతూ వస్తున్నారు శంకరం అతని స్నేహితుడు జానకిరామయ్య. వారి చేతుల్లో రిటర్న్ గిఫ్ట్‌లు కూడా ఉన్నాయి. మగవాళ్లకి జేబురుమాళ్లు, ఆడవాళ్లకి స్టీలు ప్లేట్లు. ఏం వంటకాలురా! బాబూ! చాలా భేషుగ్గా ఉన్నాయి. పల్లెటూళ్ళలో ఉన్నా మనం అరిటాకు భోజనాలు మర్చిపోయాం. మన నారాయణ మాత్రం భాగా గుర్తు పెట్టుకున్నాడు.. కొబ్బరిబూరెలూ, పులిహోర .. ఆ రుచే వేరు. ఆ పనసపొట్టు కూర అయితే .. మళ్ళీ అడిగి వేయించుకున్నా. కందా బచ్చలి... ఆనపకాయ మజ్జిగ చారు.. ఏదీ వదిలి పెట్టబుద్ధి కాలేదంటే నమ్ము. ఆఖరికి చారు కూడా ఎంతో రుచిగా ఉంది. అందుకే ‘అరగడం కోసం చివరికి పాన్ వేసుకున్నా’ తను పాన్ కూడా తింటున్నందుకు ముక్తాయింపు ఇస్తూ. అవును నాకూ అలానే ఉంది’ చెప్పాడు జానకిరామయ్య తనూ భుక్తాయాసంగా. రాయుడు.. తన పరివారాన్ని వెంట బెట్టుకుని వచ్చాడు.. రాకపోతే ‘ఏం. రాయుడూ.. మీ తమ్ముడి ఇంట్లో పెళ్ళికి వచ్చినట్లు లేదే’ అంటూ ఊరిలో వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని. వీధి మొదట నిలిచి అందరినీ ఆహ్వానిస్తున్న రామనారాయణ.. రాయుడికి ఎదురొచ్చి ‘రా అన్నయ్యా! వదిన కూడా వచ్చి ఉంటే బాగుండేది’ అన్నాడు వెంట ఉన్న వారిని చూస్తూ, వారిలో వదిన లేకపోవడంతో. ‘ఇంటి నిండా చుట్టాలు. తను రాలేనన్నది’ తను రావడమే ఎక్కువ అన్నట్టు.. నవ్వుతూ. కడుపు నిండా తిన్న సంతోషంలో .. పరిసరాలను గమనించని శంకరం ‘ఆ రోజు మా రాయుడి ఇంటిలో ఏం తిన్నామో! ఏమిటో? అంతా తొడతొక్కిడి భోజనాలు. నిలబడి ఆదరాబాదరాగా తినేశాం. కొన్ని ఉడికితే .. కొన్ని ఉడకలేదు. ఈ రోజు భోజనం మాత్రం అలా కాదు. వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయి’ మెచ్చుకున్నాడు. ‘అవును. నిజమే’ జానకిరామయ్య కూడా అంతే సంతోషంగా అన్నాడు. వెనుకగా వస్తున్న రాయుడు ఆ మాటలకి ‘ఖంగు’ తిన్నాడు. ఆ మాట అన్నది ఎవరో కాదు. స్వయానా తన మేనత్త కొడుకు శంకరం. తెల్లవారి లేస్తే, తనింటిలోనే ఉంటాడు. అలాంటి వాడికి కూడా తన విందు వెగటు అనిపించింది. ఆరోజు కొన్ని వందల మంది తిన్నారని సంబరçపడుతుంటే, శంకరం ‘తొడతొక్కిడి’ భోజనం అన్నాడు. ప్రక్కన ఉన్న వాడిదీ అదే అభిప్రాయం. అయినవాడే ‘అంతమాట’ అనేస్తే.. ఎవరితో చెప్పుకోవాలి. పెళ్ళి మర్నాడు ఊళ్లో.. రచ్చబండ దగ్గర తన విందు గురించే చర్చ జరిగిందట. కొంతమంది మెచ్చుకుంటే, మరికొంతమంది ‘అదే’ మాట అన్నారట. మెచ్చుకోలు కన్నా విమర్శ ‘కొద్దిదే’ అయినా, అదే ఎక్కువ బాధించింది రాయుడిని. రామనారాయణ అన్నగారు వచ్చినందుకు హడావుడి పడ్డాడు. స్వయంగా తనే వడ్డించాడు. అన్నయ్యకు బూరెలకి రంధ్రం పెట్టి అందులో.. వేడి నెయ్యి వేసి అందించాడు. ఆ ఆప్యాయతకు కరిగిపోయాడు రాయుడు. ఎంతైనా తమ్ముడు తమ్ముడే. ‘పదవి వచ్చిన తరువాత వీడికి గర్వం పెరిగిందనుకున్నాడు. కానీ ఏం మారలేదు’ అనుకుంటూ భోజనం ముగించాడు. అందరి ముఖాల్లోనూ మంచి భోజనం చేసిన సంతృప్తి కొట్టొచ్చినట్లు కనబడటం రాయుడు గమనించాక, మనోగతంలో తన విందు వైభవం.. మరోసారి కదలాడింది. చిన్న కుటుంబమే.. చింతలు లేని కుటుంబంలా.. చిన్న విందే జనాలకి పసందుగా ఉందన్న మాట. అరిటాకు భోజనం రుచే అయినా.. బఫే సిస్టమ్.. నిలబడి తినే భోజనాల్లో ఆకులు ఇవ్వలేరు. లైవ్ భోజనాలు.. మోడ్రన్ కల్చర్. తమ పల్లెటూరిలో కూడా ఆ సంప్రదాయం తీసుకొచ్చానని అనుకున్నా .. అది అందరికీ సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. తమ విందులో పారేసిన పదార్థాల విలువ ‘వెలకట్ట’లేనిది. ఫంక్షన్ హాలులో వేసిన షామియానాల బిల్లు కన్నా, వాటర్ బాటిల్స్ బిల్లు తడిసి మోపెడు అయ్యింది. విందుకు ముందు వంట పాత్రలు నిండుగా ఉంటే .. విందు తరువాత డస్ట్ బిన్లు నిండుగా ఉన్నాయి. లైటింగు, డ్రోన్ కెమెరాలు, వంటవాళ్ళ ఖర్చూ, లేబర్ చార్జీలు అన్నీ కలిపి.. లక్షల్లో ఖర్చు. నిజానికి చాలా రోజుల తర్వాత తనూ మంచి భోజనమే చేశాడు. వాము వేసుకునే ఖాళీ ఉంటే ‘మరో గారే తింటాను’ అన్నట్లు .. సుష్టుగా తిన్నాడు. అన్నదాతా సుఖీభవ అనుకునేలా తమ్ముడిని చెయ్యెత్తి దీవించాడు. సుఖప్రదంగా పెట్టిన భోజనం ఎవ్వరికైనా సంతోషాన్నే ఇస్తుంది. - పి.ఎల్.ఎన్. మంగారత్నం -
భర్త, కొడుకు బిరియాని తిన్నారని...
కర్నటక, యశవంతపుర : ఇంటిలో శ్రావణ మాస పూజలు చేస్తున్న సమయంలో తండ్రి, కొడుకు బిర్యాని తినడంతో భార్య అలిగి ఇల్లు వదిలివెళ్లి పోయిన సంఘటన నగరంలో జరిగింది. వివరాలు... ఇక్కడి కమ్మగొండనహళ్లిలో రాజు దంపతులు నివాసం ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం రాజు, అతని కుమారుడు ఆదర్స్‌లు హోటల్ నుంచి బిరియాని తెప్పించుకుని తిన్నారు. విషయం గ్రహించిన భార్య ఇద్దరితో గొడవ పడింది. గురువారం ఉదయం రాజు విధులకు వెళ్లగా ఆయన భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆమెకు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
అనుగ్రహ మాధుర్యం
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా ప్రాంతాల ఆచారాలకు అనుగుణంగా పూజా విధానం ఉంటుంది. కొందరు నారికేళానికి పసుపుకుంకుమలు అలంకరించి కలశం మీద ఉంచి పూజిస్తారు. మరికొందరు నారికేళానికి మైదా పిండితో కళ్లు, ముక్కు, చెవులు అలంకరించి కలÔ¶ ం మీద ఉంచి అర్చిస్తారు. ఇంకొందరు నారికేళాన్ని అమ్మవారిగా అలంకరించి, ఒక పెద్ద బిందెకు పట్టు చీర కట్టి అచ్చు బాల వరలక్ష్మిలా అలంకరించి వ్రతం చేసుకుంటారు. ఈ పూజను స్త్రీలందరూ పవిత్రంగా చేసుకుంటారు. ఈ పండుగనాడు కొన్ని ప్రాంతాలలో తొమ్మిది రకాల పిండి వంటలు తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, పరమాన్నం, ఆవిరి కుడుములు, బూరెలు, పచ్చి చలిమిడి, పానకం, వడ పప్పు, నారికేళం, గారెలు వంటివి నివేదన చేస్తారు. ప్రాంతాలకు అతీతంగా ఇంటింటా పులిహోర బూరెలు/బొబ్బట్లు చేయడం సంప్రదాయంగా వస్తోంది. కొందరు రవ్వకేసరి వంటి మధుర పదార్థాలు కూడా తయారు చేస్తారు. శక్త్యానుసారం పిండివంటలు తయారుచేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఏవి చేసినా చేయకపోయినా, పూర్ణం బూరెలను మాత్రం తప్పనిసరిగా తయారు చేస్తారు. అందుకోసం కావలసినవి: సెనగ పప్పు – ఒక కప్పు; బెల్లం తరుగు – ఒక కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా; మినప్పప్పు – అర కప్పు; బియ్యం – రెండు కప్పులు; ఉప్పు – చిటికెడు; నూనె – బూరెలు వేయించడానికి తగినంత తయారీ: ∙ముందురోజు రాత్రి మినప్పప్పు, బియ్యం కలిపి తగినన్ని నీళ్లు జత చేసి నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీరు ఒంపేసి, ఉప్పు జత చేసి గ్రైండర్లో వేసి మెత్తగా దోసెల పిండిలా రుబ్బుకోవాలి ∙సెనగ పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి ∙ఉడికిన పప్పును బయటకు తీసి, నీరు ఉంటే పూర్తిగా ఒంపేసి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙బెల్లం తరుగు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, గిన్నెలోకి తీసుకోవాలి ∙(పల్చగా వస్తే, ఒకసారి స్టౌ మీద ఉంచి, గట్టిపడేవరకు ఉడికించాలి) ఏలకుల పొడి జత చేయాలి ∙చిన్న చిన్న పూర్ణాలు (ఉండలు) గా చేసి పక్కన ఉంచాలి∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఒక్కో ఉండను, పిండిలో ముంచి బూరెల మాదిరిగా నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి ∙అమ్మవారికి నివేదన చేసి, తొమ్మిది బూరెలను వాయనంగా ఇవ్వాలి. -
మోగనున్న పెళ్లి భాజా..
కాజీపేట : దక్షిణాయణంలో ఉత్తమమైనవి శ్రావణం, కార్తీక మాసాలు. ఈ రెండు మాసాలను చాలా మంది పవిత్రంగా భావిస్తారు. పూజలు, వ్రతాలు, గృహప్రవేశాలతో పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఆషాఢ అమావాస్య(శనివారం) ఘడియలు ముగియగానే.. ఆదివారం నుంచి శ్రావణ మాసం సందడి మొదలయ్యింది. దీంతో చాలా ఇళ్లలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. 15 నుంచి అన్నీ ముహూర్తాలే...గత నెల ఆరో తేదీతో ముహూర్తాలు ముగిశాయి. అప్పటి నుంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, ఇతర శుభకార్యాలు లేకుండా పోయాయి. దీంతో చాలా మంది శ్రావణ మాసం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఈ నెల 15నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో శుభ కార్యాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నెలలో అత్యధికంగా వివాహ ముహూర్తాలతో పాటు గృహ ప్రవేశాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ నెల 15, 16, 17, 18, 19, 25, 26, 28, 30 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. అత్యధిక పెళ్లిళ్లు ఈ నెల 25, 26 తేదీల్లో ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని రోజుల్లో గృహ ప్రవేశాలకు కూడా మంచి ఘడియలు ఉన్నాయి. 15 నుంచి సెప్టెంబర్ 3 వరకు అనీ మంచి రోజులే అని పండితులు చెప్తున్నారు. 10వ తేదీ నుంచి అక్టోబర్ 10 వరకు మళ్లీ శూన్య మాసం కావడంతో నెల రోజులపాటు శుభకార్యాలు జరగవు. దీంతో ఆగస్టులోనే అధిక సంఖ్యలో ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. మండపాలు, పురోహితులకు మహా గిరాకీ...ఇప్పటికే చాలా మంది ముహూర్తాలు పెట్టుకోవడంతో జిల్లాలోని మండపాలన్నీ బుక్ అయిపోయాయి. వేదపండితులు, వంట సామాన్లు, టెంట్‌హౌస్‌లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మరోవైపు వరలక్ష్మీ వ్రతం కూడా ఈ నెలలోనే ఉండడంతో వస్త్ర, బంగారు, కిరాణ, పండ్ల దుకాణాలకు మంచి వ్యాపారం జరుగనుంది. -
నృసింహాలయంలో పోటెత్తిన భక్తజనం
కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో పోటెత్తింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా భక్తులు తమ ఇలవేల్పు దేవుడు నారసింహుని దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్నారు. ఈసారి భక్తుల సంఖ్య బాగా పెరిగిందని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి తెలియజేశారు. జిల్లా వాసులతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు విచ్చేశారు. ఆలయ ప్రాంగణం ‘ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవిందా..’ అనే నామస్మరణతో మార్మోగింది. -
మార్మోగిన గోవింద నామస్మరణ
– నేత్రపర్వంగా శ్రావణ శనివార పూజలు – పోటెత్తిన భక్తులు.. ఆలయాల కిటకిట అనంతపురం కల్చరల్: ‘ఏడుకొండల వాడా.. వెంకటరమణా.. గోవిందా గోవిందా’ అంటూ భక్తుల శరణుఘోషతో ఆలయాలు మార్మోగాయి. శ్రావణమాసం చివరి శనివారం కావడంతో నగరంలోని పలు ఆలయాల్లో పూజలు జరిగాయి. వివిధ ఆలయాల్లో పోటెత్తిన భక్తజనంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. లడ్డూప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక కొత్తూరు వాసవీకన్యకా పరమేశ్వరి ఆలయం, ఆర్ఎఫ్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయం, రామనగర్, హౌసింగ్ బోర్డు వేంకటేశ్వరాలయాల్లో అధిక సంఖ్యలో మహిళలు ఏడు శనివారాల వ్రతమాచరించారు. అలాగే జీసెస్నగర్లోని పెద్దమ్మ తల్లి ఆలయం, మారుతీనగర్ వరదాంజనేయస్వామి ఆలయంలోనూ శ్రావణ శనివార పూజలు జరిగాయి. -
భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
అనంతపురం కల్చరల్: శ్రావణ మాస చివరి శుక్రవారం అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నగరంలోని మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండరామాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు ఓబులేసు, ఈవో నాగేంద్రరావు నేతృత్వంలో మహిళలు వ్రతమాచరించారు. హెచ్చెల్సీకాలనీలోని నసనకోట ముత్యాలమ్మ, రామనగర్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవార పూజలు నిర్వమించారు. సాయంత్రం కొత్తూరు ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీ మాతకు బంగారు పుష్పాలతో అర్చన చేశారు. రాత్రి ఊంజల సేవ నిర్వహించారు. రామనగర్‌లోని వేంకటేశ్వరాలయంలోనూ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. -
పావగడలో పోటెత్తిన భక్తులు
పావగడ: శ్రావణ మాసం సందర్భంగా స్థానిక శనీశ్వరాలయంలో తృతీయ శ్రావణ శనివారోత్సవం శనివారం అపురూపంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దర్శనం కోసం ఏర్పాటు చేసిన 3 క్యూ లైన్లలో భక్తులు శుక్రవారం రాత్రి నుంచే బారులు తీరారు. ఉదయం 4 గంటలకే పూజలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా సమీపంలోని శీతలాంబదేవి, కోటె ఆంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయస్వామి వారికి భక్తులు పూజలు చేశారు. దీక్షా మండపంలో భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈసందర్భంగా అన్నదానం చేశారు. -
ఘనంగా శ్రావణమాస పూజలు
అనంతపురం కల్చరల్: శ్రావణ శనివారం సందర్భంగా నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. అశోక్‌నగర్‌లోని హరిహరఆలయం, ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం, రాంనగర్, హౌసింగ్ బోర్డు వేంకటేశ్వర ఆలయాల్లో పెద్ద ఎత్తున మహిళలు ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించారు. ఆలయాల్లో స్వామివారికి తోమాలసేవ, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. రామ్‌నగర్‌లోని కోదండరామాలయం, మారుతీనగర్ వరదాంజనేయస్వామి ఆలయంలో శ్రావణ శనివార పూజలు జరిగాయి. -
మార్మోగిన గోవింద నామస్మరణ
అనంతపురం కల్చరల్: శ్రావణంలో వచ్చిన రెండో శనివారం రోజుల నగరంలోని వైష్ణావాలయాలు కిటకిటలాడాయి. వివిధ ఆలయాల్లో గోవింద నామస్మరణ మార్మోగింది. ఆర్ఎఫ్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏడు శనివారాల పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. స్వామివారికి తోమాల సేవ, అభిషేకాలు, అర్చన జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు విశ్వనాథరెడ్డి, శంకరరెడ్డి, ఫ్లెక్స్ రమణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక రామనగర్, హౌసింగ్ బోర్డు వేంకటేశ్వరాలయాల్లో వందల సంఖ్యలో మహిళలు బారులు తీరి ఏడు శనివారాల వ్రతమాచరించారు. కోర్టురోడ్డు వరదాంజనేయస్వామి ఆలయంలో పెద్ద ఎత్తున శ్రావణ శనివారం పూజలు జరిగాయి. -
వెన్నంటి ఉంటాడు... వెన్నలా కరుగుతాడు
సందర్భం : పావగడ ఆలయంలో శ్రావణ శనివారోత్సవాలు శాంతి స్వరూపుడైన శనీశ్వరుడు తనకు ఇష్టమొచ్చిన రీతిలో సంచరిస్తూ.. భక్తులు పెడదారి పట్టకుండా వెన్నంటే ఉంటాడని, పాపులను పట్టి పీడిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి. సకల దేవతలను సైతం గడగడలాడించిన శనీశ్వరుడు నిజమైన భక్తుల పాలిట వెన్నలా కరిగిపోతాడనే ప్రతీతి కూడా ఉంది. కష్టాలను తొలగించే స్వామిగా ఖ్యాతి గడించిన శనీశ్వరుడి ఉత్సవాలు పావగడలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రావణ శనివారోత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పావగడ: స్థానిక శనీశ్వరాలయంలో కొలువుతీరిన శనైశ్చర స్వామి శ్రావణ శనివారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పావగడలో వెలసిన శనీశ్వరుడు శాంత స్వరూపుడని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణస్వామి అంటున్నారు. శ్రావణ మాసంలో స్వామి వారిని కొలిస్తే కష్టాలు తొలగి సుఖాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నారు. ఏలినాటి శని తొలిగిపోవడానికి పావగడ శనీశ్వరుడినే కొలవాలని అంటున్నారు. ఆలయ చరిత్ర... పావగడ నడిబొడ్డున వెలసిన శనీశ్వరాలయం సుమారు 70 సంవత్సరాల క్రితం ఓ చిన్న గుడిలా ఉండేది. ఓ భక్తుడు శనీశ్వర స్వామి చిత్ర పటాన్ని ఇక్కడి చెట్టు కింద పెట్టి పూజించేవాడు. కాల క్రమేణా శనీశ్వర స్వామిని పూజించే భక్తుల సంఖ్య ఎక్కువైంది. దీంతో కొంత మంది ధర్మకర్తలతో కమిటీ ఏర్పడింది. కమిటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం పూర్తి అయింది. అప్పట్లో పట్టణంలో కలరా వ్యాపించి పట్టణవాసులు మృత్యువాత పడుతుండేవారు. ఇలాంటి తరుణంలో శాంతి చేకూర్చే శీతల యంత్రాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అప్పట్నుంచి వర్షాలు బాగా కురిసి పంటలు పండి కరువు తీరింది. కలరా తొలగి పట్టణవాసులు క్షేమంగా ఉన్నారు. ఆలయంలో శీతలాంభ దేవిని ప్రతిష్టించారు. తదనంతరం శనీశ్వర స్వామిని ప్రతిష్టించినట్లు ఆలయ ధర్మ కర్తలు తెలిపారు. అంచెలంచెలుగా అభివృద్ధి ఓ వైపు లక్షలాది మంది భక్తుల కానుకలు, విరాళాలతో ఆలయం అభివృద్ధి చెందుతుంటే మరో వైపు ఎస్ఎస్కే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎస్కే సముదాయ భవనం, బయలు రంగ మందిరం, డార్మెటరీ భవనం, అన్నపూర్ణ దాసోహ భవన నిర్మాణాలతో భక్తులకు ఎనలేని సేవలందిస్తున్నారు. ప్రతి శుక్ర, శని, ఆది, సోమవారాల్లో భక్తులకు ఉచిత భోజన వసతి కల్పించారు. మరో అడుగు ముందుకేసి విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. తుమకూరు రోడ్డులో డాక్టర్ పి.నారాయణప్ప ఉచితంగా అందించిన తొమ్మిది ఎకరాల స్థలంలో ఎస్ఎస్కే శాంతి పీయూ కళాశాలను నెలకొల్పారు. -
భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
సాక్షినెట్‌వర్క్ : నాగుల చవితి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లోని నాగుల కట్టలు, పుట్టల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున పాలను పోశారు. -
శ్రావణం.. శుభప్రదం
సందర్భం : నేటి నుంచి నోముల మాసం ప్రారంభం సకల దేవతలకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర శ్రావణ మాసం రానేవచ్చింది. అన్ని మాసాలలోనూ ఎంతో శుభప్రదమైనదని పురాణాలు చెపుతున్న ఈ మాసంలో శుభకార్యాలు, నోములు, వ్రతాలు..అన్నీ అధికంగా పలకరిస్తాయి. ఈ మాసం వచ్చిదంటే మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. అంతటా ఒకటే సందడి..హడావుడి నెలకొని ఉంటుంది. పెళ్లి పనులతో కొందరు.. కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలకు శ్రావణ పట్టీలు పెట్టే వేడుకలతో మరికొందరు తలమునకలుగా ఉంటారు. కుటుంబ సుఖసౌఖ్యాల కోసం చేసే నోములతో, వ్రతాలతో ఈ నెలంగా ఇట్టే గడచిపోతుంది. అమావాస్యతో ఆషాడానికి వీడ్కోలు పలుకుతూ పండుగల మాసం సోమవారంæ నుంచి ప్రారంభం కానుంది. - అనంతపురం సందడిగా సాగే ప్రధాన పండుగలన్నీ శ్రావణంలోనే కనపడతాయి. ఆగస్టు 4న వరలక్ష్మీ వ్రతం, 7న రాఖీ పౌర్ణిమ... సనాతన ధర్మాన్ని చాటుతుంటాయి. అందరూ సమానమన్నట్టు బలరామకృష్ణు్ణల జయంతి, హయగ్రీవ జయంతి వంటివి భక్తిభావాలను మరింత పెంచుతాయి. 15న రానున్న శ్రీకృష్ణభగవానుని జన్మాష్టమి పర్వదినం శ్రావణ మాసానికే తలమానికంగా నిలుస్తుంది. శ్రావణ బహుళ విధియనాడు శ్రీ మంత్రాలయ రాఘవేంద్రుల ఆరా«ధనా ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతాయి. అలాగే మంగళగౌరి వ్రతం, నాగపంచమి, సామాన్య భక్తులే గాక రైతులు కూడా పంటలు సమృద్ధిగా పండాలని, ప«శు సంపద వర్దిల్లాలని ప్రత్యేకంగా పూజలు చేసే పొలాల అమావాస్య కూడా ఇదే మాసంలో రావడం విశేషం. మహా శివునికీ ప్రీతికరమే.. అన్నిటికి మించి పరమశివునికి కార్తీకం తర్వాత ఇష్టమైనది శ్రావణమాసమేనని శివపురాణం చెబుతోంది. ఈ మాసంలో చేసే శనిత్రయోదశి పూజలు, తైలాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు పరమపద మోక్ష ప్రాప్తి కల్గిస్తాయని పురాణపండితులు చెబుతున్నారు. అదే విధంగా ఉపవాస దీక్షలకు ఇందులో అధిక ప్రాధాన్యముంటుంది. ముఖ్యంగా మహిళలు సుమంగళిగా జీవించాలని ఐదవతనం కోసం చేసే వివిధ నోములు, వ్రతాలతో ఆలయాలే కాదు ఇంటి పరిసరాలు పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో కళకళలాడుతాయి. శ్రావణ పూజలు అత్యంత శుభప్రదం శ్రావణం సమస్త హైందవ జాతిని ఏకం చేసే మహత్తర సాధనంగా చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సర్వపాపల హరణకు, సకల శుభ యోగాలకు శ్రావణ మాస పూజలు శ్రేష్టమైనవి. పవిత్ర శ్రావణంలో వచ్చే ప్రతి దినమూ మంగళకరమే. – సాయినాథ దత్త, పురోహితులు, అనంతపురం -
బోనమెత్తిన భక్తజనం
శ్రావణమాసం చివరి ఆదివారం కావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భక్తులు ముత్యాలమ్మ, పోచమ్మ తదితర అమ్మవార్లకు బోనాలు సమర్పించి మెుక్కులు తీర్చుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా పల్లెలు, పట్టణాల్లో సందడి నెలకొంది. -
ఘనంగా శ్రావణమాస ఉత్సవాలు
భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు గండేడ్ : శ్రావణమాస చివరి శనివారాన్ని పురస్కరించుకుని మండలంలోని ఆయా గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండలంలోని గంగర్లపాడు ఆంజనేయస్వామి, రామాలయం, గాధిర్యాల్ వీరహనుమాన్, గండేడ్, పగిడ్యాల్ కృష్ణతాత ఆలయం, వెన్నాచేడ్ సాయిబాబా ఆలయం, రామాలయం, రంగారెడ్డిపల్లి గట్టు చెన్నరాయ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గట్టు చెన్నరాయుని ఆలయం దగ్గరికి వెళ్లి భక్తులు ఉదయం 5గంటల సమయంలో రథోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం తమ ఉపవాస దీక్షలను విరమించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
శ్రావణశోభ
-
మారుమోగిన ఈరన్న నామస్మరణ
– ఇసుక వేస్తే నేలరాలనంతగా భక్తజనం – పోటెత్తిన ఉరుకుంద క్షేత్ర పరిసరాలు కౌతాళం: శ్రావణ మాసం మూడో సోమవారం సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం కిక్కిరిసిపోయింది. మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో తరలిరావడంతో సుమారు 2 కిలోమీటర్ల వరకు ఆలయ పరిసరాలు ఎటు చూసినా భక్తులే కనిపించారు. సుమారు 3 లక్షల మంది స్వామిని దర్శించుకుని ఉంటారని అంచన. శ్రావణమాసంలో సోమ, గురువారాలను ముఖ్యమైనవిగా భావిస్తుండడంతో ఆరోజుల్లో భక్తులు రద్దీ అధికంగా ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం రాత్రి 7 గంటల వరకు దర్శన క్యూలైన్లు అన్నీ భక్తులతో దర్శనమిచ్చాయి. ఆలయ పరిసరాల్లో కొద్దిపాటి చోటు దొరికితే చాలు పొయ్యి పెట్టి నైవేద్యం వండడం కనిపించింది. దైవదర్శనానికి 4గంటల నిరీక్షణ.. దిగువ కాలువలో పుణ్య స్నానాల అనంతరం క్యూ కట్టిన భక్తులు స్వామివారి దర్శనం కోసం నాలుగు గంటలు నిరీక్షించాల్సి వచ్చింది. మూడు కల్యాణ కట్టలు ఏర్పాటు చేసినా భక్తులకు నీరీక్షణ తప్పలేదు. గుండు గీయించుకునేందుకు టికెట్‌తో పాటు రూ.50 అదనంగా వసూలు చేస్తుండడం కనిపించింది. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చెన్నబసప్ప, పాలక మండలి సభ్యులు కొట్రేష్‌గౌడ్, మల్లికార్జున, తిక్కయ్య, నరసన్న, ఆలయ ఈఓ మల్లికార్జున ప్రసాద్ భక్తుల సేవలో మునిగిపోయారు. ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాస్‌రావు ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు క్షేత్రంలోనే మకాం వేసి ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. సీఐ దైవప్రసాద్, కౌతాళం ఎస్ఐ నల్లప్ప, మరో ఆరుగురు ఎస్ఐలు, ఆరవై మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 70మంది ఎన్సీసీ విద్యార్థులు, వివిద సేవ సంఘాలకు చెందిన 50మంది భక్తులకు సేవలు అందించారు. -
శ్రావణంలో ‘రోహిణి’
-
శ్రావణంలో ‘రోహిణి’
నిప్పులు కక్కుతున్న ఎండలు సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాపై ఎండలు నిప్పులు కక్కుతున్నాయి. రోహిణి కార్తెను తలపించేలా సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఒంగోలులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కావలి, మచిలీపట్నం, నెల్లూరుల్లో 39, తుని, విజయవాడ, బాపట్ల, తిరుపతిల్లో 38, కాకినాడ, రెంటచింతలలో 37, నర్సాపురం, అనంతపురాల్లో 36 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నా అవి సెగలను తగ్గించలేకపోతున్నాయి. ప్రస్తుతం ఉత్తర, వాయవ్య బంగాళాఖాతాల్లోనే ఇవి ఏర్పడుతుండటంతో, అవేమీ మన రాష్ట్రంపై ప్రభావం చూపడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. వేసవిలో సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా నమోదయితే వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితే ఉండటం గమనార్హం. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ ఉష్ణతీవ్రత అధికంగా ఉంది. -
మారుమోగిన ఈరన్న నామస్మరణ
– భక్తులతో పోటెత్తిన ఉరుకుంద క్షేత్రం – తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు – దర్శనానికి నాలుగు గంటల నిరీక్షణ కౌతాళం: శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా రెండో సోమవారం ఉరుకుంద క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాల్లో ఎటు చూసిన భక్తులే కనిపించారు. క్షేత్రం ఈరన్న నామస్మరణతో మారుమోగింది. దారులన్నీ ఉరుకుంద క్షేత్రం వైపే అన్నట్లు వేల సంఖ్యలో వాహనాలు చేరుకున్నాయి. లక్షాలాదిగా తరలివచ్చిన భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకుని, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మూడు లక్షలకు పైగా భక్తులు తరలిరావడంతో ఆదివారం రాత్రి నుంచి నిరంతరం దర్శనం కల్పిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అరగంట మాత్రమే విరామం కల్పించి సుప్రభాతసేవ, మహా మంగళహారతి, పంచామతాభిషేకం, ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. రద్దీ అధికంగా ఉండటంతో స్వామి వారి దర్శనానికి నాలుగు గంటలకుపైగా వేచి చూడాల్సి వచ్చింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనాలను ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి వారి మొక్కుబడిగా తలనీలాలు సమర్పించారు. అనంతరం తుంగభద్ర కాలువలో పుణ్యస్నానాలు చేసి స్వామిని దర్శించుకున్నారు. ఎక్కడ స్థలం దొరికితే అక్కడే సేద తీర్చుకోని వంటలు వండడం కనిపించింది. ఉరుకుందకు వచ్చే నాల్గు రూట్లన్ని భక్తులతో కిలోమీటర్ వరకు నిండిపోయాయి. ఆదోని డిపో నుంచి 50 బస్సులు, ఎమ్మిగనూరు డిపో నుంచి 30 బస్సులు, కర్ణాటకలోని శిరుగుప్ప నుంచి 15 బస్సులు, బళ్లారి నుంచి 5 బస్సులను, రాయచూరు డిపో నుంచి 10 బస్సులను నడిపి భక్తులకు సహకరించారు. ఆదోని తాలుకా సీఐ దైవప్రసాద్ ఆధ్వర్యంలో కౌతాళంలో ఎస్ఐ నల్లప్పతో పాటు మరో నలుగురు ఎస్ఐలు ఏఎసై ్సలు, హెడ్‌కానిస్టేబుల్, 10 మంది మహిళా కానిస్టేబుళ్లతో పాటు వాలంటీర్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రుద్రాభిషేకం
హన్మకొండ పద్మాక్షి కాలనీ సిద్ధేశ్వరాలయంలో శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్బంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రుద్రాభిషేకం నిర్వహించారు. 51 కిలోల పులిహోరా అన్నంతో అన్నపూజ చేశారు. స్వామివారికి 11 కిలోల బంతి, 11కిలోల చామంతి మల్లెపూలు దవళ ఆకులతో అలంకరించారు. – న్యూశాయంపేట -
భక్తిశ్రద్ధలతో నాగపంచమి
అనంతపురం కల్చరల్ : జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో నాగ పంచమిని ఆదివారం జరుపుకున్నారు. శ్రావణమాసంలో వచ్చిన తొలిపండుగ కావడంతో ఉదయం నుంచే పలు ఆలయాల్లోనూ, నాగుల పుట్టల వద్ద మహిళలు బారులుదీరి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం నగర సమీపంలోని చెరువుకట్టపై వెలసిన నాగేంద్రుడికి, నగర శివారులోని శివకోటిలో నాగపంచమి వేడుకలు నిర్వహించారు. అలాగే హెచ్చెల్సీ కాలనీలోని వల్లి,దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి మఠం బసవరాజ స్వామి ఆధ్వర్యంలో గరుడ పంచమి వేడుకలు నియమనిష్టలతో జరిగాయి. -
వైభవంగా వరలక్ష్మి వ్రతాలు
హన్మకొండ కల్చరల్ : శ్రావణమాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు దేవాలయా ల్లో మహిళలు వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో మహిళలు అమ్మవారికి ఒడిబాలబియ్యం, చీరలు సమర్పిం చుకున్నారు. అలాగే కుంకుమ పూజలు నిర్వహించారు. తొలుత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నగర మేయర్ నన్నపునేని నరేందర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కట్టా అంజనీదేవి, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, తదితరులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరీ ఆలయంలో.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోని శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంలో అర్చకుడు రాజు, అమ్మవారి ఉపాసకులు యల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పూజలు చేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. -
శ్రావణ గోదావరి
ఆరో రోజు 36,474 మంది స్నానాలు పెరుగుతున్న వరద అప్రమత్తమైన అధికారులు ఆలయాలకు శ్రావణ కళ సాక్షి, రాజమహేంద్రవరం: శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో గోదావరి అంత్యపుష్కరాల్లో ఆరో రోజు భక్తకోటి పుణ్యస్నానాలతో పులకించింది. ఘాట్ల వద్ద ఉన్న ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. ఆరో రోజు జిల్లా వ్యాప్తంగా 36,474 మంది భక్తులు స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరంతోపాటు కోటిపల్లి, రాజోలు, అంతర్వేది, అయినవిల్లి తదితర ఘాట్లకు భక్తులు తరలివచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు పుణ్యస్నానాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని ఎనిమిది ఘాట్లకు 25,574 మంది భక్తులు వచ్చారు. మిగతా ఘాట్లకంటే పుష్కరఘాట్‌కు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇక్కడ 16,910 మంది భక్తులు స్నానాలు ఆచరించారు. మధాహ్నం 12 గంటల తర్వాత భక్తుల రాక మందగించింది. ఆసియాలోనే అతి పెద్ద కోటిలింగాల ఘాట్ భక్తులు లేక వెలవెలబోతోంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరికి వరద పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజమకుమారి ఘాట్ల వద్ద పరిస్థితిని పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు ఇచ్చారు. భద్రత నిమిత్తం రేవులో ఏర్పాటు చేసిన పడవల్లో మత్యకారులతోపాటు పోలీసు సిబ్బందిని ఉంచుతున్నారు. వరద ఉధృతికి పడవలు కొట్టుకుపోకుండా తాడుతో ఘాట్లలో ఉన్న ఇనుప పిల్లర్లకు కట్టారు. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి టి.ఉదయ్‌కుమార్ ఘాట్లను పరిశీలించారు. వాలంటీర్ల సేవలకు ప్రాధాన్యం ... గోదావరి అంత్యపుష్కరాల్లో 2800 మందితో పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. వీరిలో ఉభయ గోదావరి జిల్లాల సిబ్బంది ఉన్నారు. కృష్ణ పుష్కరాల నేపథ్యంలో బయట ప్రాంతాల సిబ్బందిని అక్కడకు పంపేందుకు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అర్బన్ జిల్లా పోలీసులతోనే ఆదివారం నుంచి ఘాట్ల వద్ద బందోబస్తు నిర్వహించనున్నారు. ఫలితంగా స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, వివిధ కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థుల సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చివరి మూడు రోజులు ఒడిస్సా, పశ్చిమబెంగాల్ భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో యంత్రాంగం అప్రమత్తమవుతోంది. హారతికి పోటెత్తిన భక్తులు.. శ్రావణ శుక్రవారం కావడంతో పుష్కరఘాట్ వద్ద నిర్వహిస్తున్న గోదావరి హారతిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంత్యపుష్కరాల సందర్భంగా ఆనం కళా కేంద్రంలో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. శుక్రవారం రాజమహేంద్రవరం షిరిడి సాయి నాట్య కళా సమితి ప్రదర్శించిన సత్య హరిశ్యంద్ర నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కోటిలింగాల ఘాట్ వద్ద ఉన్న తెరపై నగరపాలక సంస్థ ఇద్దరు మిత్రులు చిత్రాన్ని ప్రదర్శించింది. జిల్లాలో ఘాట్ల వారీగా స్నానాలు ఆచరించన భక్తుల సంఖ్య ఘాట్ భక్తుల సంఖ్య 1.కోటిలింగాలఘాట్ 5,265 2.పుష్కరఘాట్ 16,910 3.మార్కండేయఘాట్ 217 4.టీటీడీ ఘాట్ 278 5.శ్రద్ధానందఘాట్ 96 6.పద్మావతిఘాట్ 399 7.గౌతమిఘాట్ 1,069 8.సరస్వతిఘాట్ 1,340 9.రామపాదాల రేవు 1.315 10.మునికూడలి 637 11.కోటిపల్లి 1,132 12.అప్పనపల్లి 2.610 13.అంతర్వేది 1,500 14.వాడపల్లి 970 15.జొన్నాడ 2,850 -
శ్రావణ సందడి
-
ఇక కళ్యాణ‘మస్తు’..
-
ఇక కళ్యాణ‘మస్తు’..
► మూడు నెలల తర్వాత శుభ ముహూర్తాలు ► శ్రావణమాసం రాకతో వేల సంఖ్యలో వివాహాలు సాక్షి, హైదరాబాద్: ‘‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా కంఠే బద్నాని శుభగే త్వంజీవ శరదం శతం’ ఈ మంత్రం తెలుగు రాష్ట్రాల్లో మార్మోగే సమయం ఆసన్నమైంది. పచ్చని పందిళ్లు... మామిడి తోరణాలు... మేళతాళాలు... మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో వధూవరులను ఏకం చేసే వివాహ మహోత్సవాలు సమీపించాయి. మూడు నెలల విరామం తర్వాత శ్రావణ శుభ గడియలు ప్రవేశించడంతో వేలాది వివాహాలు జరుగనున్నాయి. చైత్రమాసం (ఏప్రిల్ 27వ) తేదీతో ముహూర్తాలు అయిపోయాయి. వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వరుసగా గురు, శుక్ర మూఢాలు రావడం ఆషాడం శూన్యమాసం కావడంతో మూడు నెలలుగా శుభ ముహూర్తాలు లేవు. ఆరో తేదీన పంచమి - మిథున లగ్నంతో శుభముహూర్తాలు ఆరంభమవుతున్నాయి. ఈ నెల 10, 13, 17, 18, 19, 20, 26 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. తదుపరి ఆశ్వయుజ మాసంలో పూర్తిగా ముహూర్తాలు లేవు. అందువల్ల శ్రావణమాసంలో కాకపోతే పెళ్లి ముహూర్తాల కోసం మళ్లీ మార్గశిర, కార్తీక మాసాల కోసం ఎదురుచూడాల్సిందే. ఇప్పటికే సంబంధాలు కుదిరిన వారికి ఈ నెలలో పెళ్లిళ్లు చేసేందుకు కళ్యాణ మంటపాల అడ్వాన్సు బుకింగ్‌లు జోరందుకున్నాయి. కల్యాణ వేదికల అలంకరణ, బ్యాండ్ మేళాలు, మంగళవాయిద్య బృందాలకు గిరాకీ పెరిగింది. కళ్యాణ మంటపాలు బిజీబిజీ.. పెళ్లిళ్లు ఉండటంతో కళ్యాణ మంటపాల అద్దెల రేట్లూ అదిరిపోతున్నాయి. ‘ఈనెల 18న శ్రావణ పౌర్ణమి, ధనిష్ట నక్షత్రం, కన్యాలగ్నం. గురువారం ఉదయం 8.51 గంటలకు కన్యాలగ్న ముహూర్తం చాలా బలమైనది. అందుకే ఎక్కువమంది ఆరోజుకు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. తిరుమలలో ఆరోజు పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి...’ అని ఒక వేదపండితుడు ‘సాక్షి’కి తెలిపారు. వామ్మో అనిపించే అలంకరణలు.. సంపన్నులే కాకుండా మధ్య తరగతి వారు కూడా పెళ్ళి మండపాల అలంకరణకు ప్రస్తుతం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఇందుకోసం బెంగళూరు నుంచి పూలను తెప్పించుకుంటున్నార ని తిరుపతికి చెందిన మంటపాల అలంకరణ కాంట్రాక్టరు నారాయణ తెలిపారు. మంటపం అలంకరణ ఖర్చు అనేది వారు కోరుకున్న తీరు, మంటపం సైజును బట్టి రూ.50 వేల నుంచి 5 లక్షల వరకూ, ఆపైన కూడా ఉంటుందని వివరించారు. -
‘శ్రావణ’ సందడి
నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు భక్తులతో కిటకిటలాడనున్న ఆలయాలు తెలుగు నెలల్లో శ్రావణమాసానికి విశిష్టస్థానం ఉంది. మహిళలు ఈనెలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో తమ ఆరాధ్య దైవాలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కోరిన కోర్కెలు తీర్చాలని మనసారా వేడుకుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభమవుతున్న ‘శ్రావణమాసం’ ప్రత్యేకతను ఓసారి తెలుసుకుందాం. హన్మకొండ కల్చరల్ : తెలుగు ప్రజలకు శ్రావణమాసం ఐదోవది. ఈ మాసంలో శ్రీకృష్ణభగవానుడు జన్మించాడని, హైగ్రీవోత్పత్తి జరిగిందని.. శ్రావణశుద్ధ పంచమి రోజే గరుత్మంతుడు అమృతభాండాన్ని సాధించాడని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీమహా విష్ణువు కూడా శ్రవణా నక్షత్రంలోనే జన్మించాడని పేర్కొంటున్నాయి. శ్రీవైష్ణవ సంప్రదాయ గురు పరంపరకు చెందిన అళవందారు, బదరీ నారాయణ పెరుమాళ్, చూడికుడుత్తనాంచార్ తిరునక్షోత్రోత్సవాలను కూడా శ్రావణమాసంలోనే జరుపుకుంటారు. ఈనెలలో సంప్రదాయ ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుందని భక్తుల నమ్మకం. రజకులు మడేలయ్యకు, గౌడ కులస్తులు కాటమయ్యకు బోనాలు, పండుగలు చేసుకుంటారు. ప్రతి రోజు ప్రత్యేకమే శ్రావణ మాసంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలను భక్తులు పవిత్రంగా భావిస్తారు. శ్రావణ æసోమవారం శివుడికి, మం గళవారం గౌరీదేవికి, శనివారం శ్రీవేంకటేశ్వరస్వామికి, శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజులుగా భావిస్తూ ఆలయాల్లో ప్రత్యేకSపూజలు నిర్వహిస్తారు. మంగళవారం మంగళగౌరీ వ్రతాలను పాటిస్తే జన్మజన్మలకు అమంగళము కలుగకుండా ఉంటుం దని మహిళల విశ్వాసం. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు మొదటì ఐదేళ్లు మంగళగౌరీ వ్రతాలు చేసుకుంటారు. గురువారం సాయిబాబా ఆలయాల్లో అఖండ సాయినామయజ్ఞాలు జరుగుతాయి. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకున్న వారికి పుణ్యంతో పాటు లక్ష్మీప్రసన్నం కూడా జరుగుతుందని, ధన, కనక, వస్తు, వాహనాలు సమకూరుతాయని, పూర్వకాలంలో చారుమతిదేవి అనే మహిళ ఈ వ్రతాన్ని పాటించి సకల సంపదలు పొందిందని మహిళలు నమ్ముతారు. బంగారు నగ నియమం శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే మహిళలు బంగారు నగ తప్పకుండా చేయించుకోవాలనేది నియమం. కొత్తగా వివాహామైన యువతులకు శ్రావణపట్టి పేరిట ఆభరణాలు చేయిస్తారు. శనివారం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసదీక్షలు పాటించి ఆలయాల్లో గోధుమ పిండితో చేసిన ప్రమిదలతో నేతి దీపాలు వెలిగిస్తారు. ఇళ్లలో శ్రీవేంకటేశ్వరస్వామి జ్యోతి వ్రతాలు జరుపుకుంటారు. శ్రీభద్రకాళి దేవాలయంలో.. వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవాలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రీభద్రేశ్వరశివలింగానికి ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు, ఓడిబియ్యం సమర్పణలు జరుగుతాయని ఈఓ కట్టా అంజనీదేవి తెలిపారు. అలాగే నాగ పంచమిరోజు ఆలయ ఆవరణలోని పుట్టవద్ద పూజలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వేయిస్తంభాల దేవాలయంలో.. హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణమాసంలో ప్రతి రోజు శ్రీరుద్రేశ్వర శివలింగానికి సామూహిక రుద్రా భిషేకాలు, రుద్రాహోమాలు, అన్నపూజలు జరుగుతాయని ఈఓ వద్దిరాజు రాజేందర్ తెలిపారు. అలాగే ప్రతి సోమవారం మహా అన్నదానం, మంగళవారం గౌరీ వ్రతాలు, శుక్రవారం వరలక్ష్మీవ్రతాలు, పంచమి తిథిరోజు నాగపూజలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, వరలక్ష్మీ వ్రతాన్ని వేయిస్తంభాల దేవాలయంలో మహిళలు సామూహికంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ∙ -
‘గుండు’ కొడుతున్నారు!
– ఈరన్న క్షేత్రంలో కేశఖండన కార్మికుల వసూళ్లు – ఒక్కో గుండుకు రూ.50 అదనం – విమర్శిస్తున్న భక్తులు – ఎరుగనట్లు అధికారులు మంత్రాలయం : మొక్కు తీర్చుకోవడానికి కేశఖండనకు వెళ్తే ముక్కుపిండి వసూళ్లు. ఇచ్చుకుంటే పూర్తి గుండు.. లేదంటే నెత్తిన కత్తి పెట్టరు. ఎందుకివ్వాలని ఎదరిస్తే ఎదురుదాడి. అరచీ గీపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఇదీ ఉరకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో సాగుతున్న తంతు. కేశఖండనలో నిలువు దోపిడీకి గురవుతున్న భక్తుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తిరుమల తిరుపతి వేంకన్న క్షేత్రం తర్వాత ఉరకుంద క్షేత్రంలో కేశఖండనకు ఎంతో ప్రత్యేకత ఉంది. లక్షలాది మంది భక్తులు దేవుడి మొక్కుగా కేశాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. క్షేత్రంలో టెంకాయలు, వ్యాపార దుకాణాలు కంటే ఎక్కువ మొత్తంలో టెండర్ కల్యాణకట్టకు ఉంది. రూ.1.73 కోట్లకు ఈ ఏడాది ఇక్కడ కళ్యాణ కట్టను పాడారు. భక్తులు కేశఖండనకు గుండుకు రూ.10 చొప్పున టిక్కెట్ తీసుకోవాలి. అందులో ఆలయానికి రూ.5, కేశఖండన కార్మికులకు రూ.5 చొప్పున విభజించి పంచుకోవాల్సి ఉంది. అడినంత ఇవ్వాల్సిందే: శ్రావణమాసం ఇక్కడి కల్యాణ కట్ట కార్మికులకు వరాలు కురిపిస్తోంది. క్షేత్రాన్ని దర్శించుకోవడానికి 15 లక్షల మంది భక్తులు ఇక్కడకు వస్తారు. కనీసం 5 లక్షల మంది దాక కేశఖండన చేయించుకుంటారు. అయితే ఇక్కడి కల్యాణకట్టలో గుండు గీస్తున్న వారు భక్తులను పీడించి పిప్పి చేస్తున్నారు. గుండు కొట్టాలంటే బ్లేడు పేరుతో ఏకంగా రూ.50 అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే గొడవకు సైతం వెనకాడని వైనం. మంగళవారం నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన 15 మంది యువకులు గుండు గీయించుకున్నారు. అందుకు గుండు చేయిన కార్మికులు రూ.50 ఇచ్చుకోవాలంటూ గొడవకు దిగారు. ఎందుకివ్వాలని అడిగితే ఎవరికైనా చెప్పుకోడంటూ కసురుకున్నాడు. పాపం చేసేదేమి లేక బాధితులు డిమాండ్ మేరకు ఇచ్చుకోవాల్సి వచ్చింది. శ్రావణమాసంలోనే కనీసం రూ.10 లక్షలకుపైగా అక్రమార్జన ఇక్కడ సాగిపోతోంది. దోపిడీకి అధికారుల అండ ఆలయ ప్రధానాలయం వెనకాలే కల్యాణ కట్ట ఉంది. అక్కడ దోపిడీ తతంగం తెలిసినా కళ్లు తెరవడం లేదు. భక్తులు కోకొల్లలుగా ఫిర్యాదులు చేసినా కుర్చీలు వీడటం లేదు. వేడుక చూస్తూ దోపిడీకి పరోక్షంగా మద్దతుగా పలుకుతున్నారు. భక్తులు గోడు వినిపించుకునే తీరిక లేదంటే మరి బాధ్యత నిర్వహణలో అధికారులు ఎంతమాత్రం బాధ్యతయుతంగా నడుచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. దోపిడీపై వివరణ ఇచ్చేందుకూ అధికారులు నోరు మెదపడం లేదు. మంగళవారం ఈవో మల్లికార్జున ప్రసాద్‌కు వివరణ నిమిత్తం సాక్షి ఫోన్ చేయగా స్పందన కరువైంది. సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావును అడుగగా ఈవో అడగాలని దాటవేశారు. భక్తులకు సమాధానం చెప్పుకోవాల్సిన అధికారులు నడతపై భక్తులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు మర్యాద లేదు : నాగమ్మ, ఆలూరు స్వామి మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడకు వచ్చాను. మంచి జరిగితే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాను. గుండు గీయించుకోవడానికి రూ.10 టిక్కెట్ తీసుకున్నాను. గుండు గీసే కార్మికుడు రూ.50 ఇవ్వాలని డిమాండ్ పెట్టాడు. రూ.30 ఇస్తానని చెబుతున్నా వినలేదు. నన్నే దబాయించి వసూలు చేసుకున్నాడు. దోపిడీ దారుణం : సురేంద్ర, హాలహర్వి స్వామి మొక్కులో భాగంగా తలనీలాలు ఇచ్చాను. మేమంతా 15 మంది టిక్కెట్లు కొని గుండు గీయించుకున్నాం. గుండు చేసిన తర్వాత గుండుకు రూ.50 ఇవ్వాలని కార్మికుడు డిమాండ్ చేశాడు. ఇదేంటని అడిగితే తీవ్ర గొడవకు దిగాడు. నిలువునా దోచుకుంటున్నా పట్టించుకునేనాథుడు లేడు. ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు. అధికారులు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు. -
వేయిస్తంభాల గుడిలో వరుణహోమం
హన్మకొండ(వరంగల్):వరంగల్‌లోని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శ్రావాణమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని వరుణహోమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, గుదిమళ్ల విజయకుమారాచార్యులు తదితరులు గణపతి నవగ్రహ మూలమంత్రయుక్త నామకచమకములతో వరుణసూక్త తైతరీయ విధానంలో వరుణహోమం, మహారుద్రహోమం చేపట్టారు. శ్రావణమాసోత్సవాల్లో భాగంగా శ్రీరుద్రేశ్వమహాశివలింగాన్ని 51 కిలోల పెరుగన్నంతో త్రయంభకేశ్వరునిగా అలంకరించి పూజలు జరిపారు. -
బెటర్ హాఫ్
పతి కోసం పడతి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. భర్త బాగోగుల కోసం నోములు నోస్తుంది.. వ్రతాలు చేస్తుంది. ఉపవాసాలు ఉంటుంది. శ్రావణ మాసం వచ్చిందంటే నెల రోజులూ దీక్షగా పూజలు చేస్తుంది. తన మాంగల్య బలమే.. పెనిమిటికి శ్రీరామ రక్షగా ఉండాలనే కోరికతో ఎంతటి కఠిన నియువూలనైనా పాటిస్తుంది. ‘ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే మాత్రం నాకు తెలియదు’ అని ఇల్లాలిని హెచ్చరించే ఇంటాయన ఇంటింటికీ ఉంటారు. అయితే వీరందరికీ భిన్నంగా కట్టుకున్నామె కోసం కడుపు మాడ్చుకుంటాం అంటున్నారు కొందరు. ఏడాదంతా తన బాగు కోసం తపించే భార్యామణి కోసం ఒక్క రోజు ఉపవాస దీక్షకు పూనుకుంటున్నారు. కర్వా చౌత్.. తూర్పు, ఉత్తర భారతదేశంలో తరతరాలుగా వస్తున్న విభిన్న వేడుక. కార్తీక బహుళ చవితిన జరుపుకునే ఈ పండుగ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు భార్యలు ఉపవాసం ఉంటారు. అయితే ఈ ఆచారాన్ని కాస్త మార్చి.. భార్యల మేలు కోరి భర్తలు ఉపవాసం ఉండటం మొదలైంది. దీనికి సామాజిక కోణాన్ని యాడ్ చేసి ఈసారి కాస్త వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు (శనివారం) కర్వా చౌత్ సందర్భంగా ఉపవాస దీక్షకు రెడీ అవుతున్నారు. పౌర్ణమి నుంచి పౌర్ణమికి నెలగా లెక్కించే ఉత్తరాదిలో ప్రస్తుతం కార్తీక మాసం ఉంటే.. అమావాస్య నుంచి అమావాస్యకు నెలగా లెక్కించే దక్షిణాదిలో ఆశ్వయుజ మాసం అవుతుంది. హీ ఫర్ షీ అనాదిగా వస్తున్న కర్వా చౌత్ ఆచారాన్ని జెండర్ ఈక్వాలిటీ కోసం ఓ ప్రయత్నంగా మలచుకున్నారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాల నివారణకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన ‘హీ ఫర్ షీ’ క్యాంపెరుున్ స్ఫూర్తితో షాదీ డాట్ కామ్ ‘ఫాస్ట్ ఫర్ హర్’ క్యాంపెరుున్కు శ్రీకారం చుట్టింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న మనసున్న మగాళ్లు.. నేడు ఉపవాసం ఉండటానికి సై అంటున్నారు. వీ ఆర్ రెడీ షాదీ డాట్ కామ్ సీఈవో అనుపమ్ మిట్టల్ సోషల్ మీడియాలో విసిరిన ‘ఫాస్ట్ ఫర్ హర్’ సవాల్‌కు సెలబ్రిటీలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రైటర్ చేతన్ భగత్, టీవీ యాక్టర్స్ వరుణ్ బ డోలా, ిహ తేన్ తేజ్వానీ, సింగర్ సలీమ్ ఇలా చాలా మంది కర్వా చౌత్ నాడు ఉపవాసం చేస్తామని ప్రకటించేశారు. దేశవ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షల మంది సతి కోసం ఉపవాసం చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఆల్ ఈజ్ వెల్ కర్వా చౌత్ రోజు ఓ కుండలో గోధుమలు ఉంచుతారు. ఉత్తరాదిలో ఇది గోధుమలు నాట్లు వేసే సీజన్ కావడంతో.. పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటారు. ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఉండే మహిళలు.. సూర్యాస్తమయం అయిన తర్వాత జల్లెడ అడ్డుగా ఉంచి చంద్రబింబాన్ని చూస్తారు. ఆ తర్వాతే ఉపవాస దీక్షను విరమిస్తారు. నేనే నానినే.. కర్వా చౌత్ సందర్భంగా నేడు ఉపవాసం ఉంటున్నానని టాలీవుడ్ హీరో నాని ప్రకటించాడు. ‘పెళ్లికి ముందు నవరసాలంటే ఏంటో తెలియని నాకు.. అన్నీ తెలియజేసిన నీ కోసం.. ఒక రోజు ఉపవాసం ఉంటాను’ అంటూ భార్యపై తనకున్న ప్రేమను చెబుతూ నాని ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశాడు. - నాగరాజు -
యాడ చూసినా 3+7=100 సందడే..
జిల్లాలో ఏ ఊళ్లో చూసినా ‘మూడు+ఏడు= నూరు’ సందడే. అవును.. మూడు ముళ్లతో ముడిపడి, ఏడడుగులతో బలపడి‘నూరేళ్ల పంట’కు సాగే ఏరువాకే పెళ్లంటే. అలాంటి నూరేళ్ల పంటను పండించుకోవడానికి.. గురువారం రాత్రి వేల జంటలు శ్రీకారం చుట్టాయి. మంచి ముహూర్తం కుదరడంతో జిల్లావ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు జరిగాయి. అన్నవరంలో సత్యదేవుని సన్నిధిలోనే 600 పైగా జంటలు కల్యాణబంధాన్ని పెనవేసుకున్నాయి. అన్నవరం :శ్రావణమాసంలోనే అత్యంత విశేషమైన వివాహ ముహూర్తాలు గల గురువారం రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో సుమారు 600 జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. రాత్రి 7.54 గంటలు, రాత్రి 12.23 గంటలు, తెల్లవారుజామున 3.21 గంటలకు ఈ వివాహాలు జరిగాయి. గురువారం సాయంత్రం నుంచే రత్నగిరికి వివాహబృందాల రాక ప్రారంభమైంది. రాత్రి 7.54 గంటల ముహూర్తంలో స్వామివారి సన్నిధిలో వివాహాలు చేసుకునేందుకు వచ్చినవారు, వాటికి హాజరైన బంధుమిత్రగణంతో రత్నగిరిపై ఎటు చూసినా పెళ్లిసందడే కనిపించింది. ఆలయ ప్రాంగణం, స్వామివారి ప్రధానాలయం చుట్టూ గల ఆవరణ, సీతారామ సత్రం, ప్రకాష్ సదన్, సత్యగిరిపై హరిహరసదన్, విష్ణుసదన్ తదితర ప్రదేశాలలో వివాహాలు జరిగాయి. పెళ్లిబృందాలను తీసుకువచ్చే వాహనాలను కొండదిగువన కాలేజీ మైదానంలోను, దాని పక్కన గల ఖాళీ స్థలంలోను నిలిపివేశారు. టాక్సీ, వ్యాన్, ఆటోలను మాత్రమే రత్నగిరి మీదకు అనుమతించారు. ఆటోలను కూడా ఘాట్‌రోడ్డు వై జంక్షన్ వరకే అనుమతించారు. దాంతో రత్నగిరి ఘాట్రోడ్లో కొంతవరకూ ట్రాఫిక్ క్లియర్ అయింది. గురువారం మిగిలిన రూవ్ులు 30 వీఐపీల సందేశాల మేరకు వారికోసం రిజర్వు చేసిన సత్రం గదులు సుమారు 30 వరకు గురువారం కూడా మిగిలి పోయాయి. బుధవారం రాత్రి సత్రాల్లో సుమారు 120 గదులు ఖాళీగా ఉండి పోయిన విషయం ‘సాక్షి’ దినపత్రికలో రావడంతో గురువారం ఆపొరపాటు జరగ కుండా అధికారులుసరిదిద్దుకున్నారు. రాత్రి పదిగంటల తర్వాత ఖాళీగా ఉన్న గదులను అప్పటికప్పుడుపెళ్లిబృందాలకుఅద్దెకిచ్చారు. వ్రతాలాచరించిన 800 నూతన జంటలు సత్యదేవుని సన్నిధిలో బుధవారం రాత్రి జరిగిన వివాహాలలో 500 జంటలు ఒక్కటయ్యాయి. వీరితో బాటు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి మరో 300 కొత్త జంటలు గురువారం ఆలయానికి విచ్చేసి స్వామివారి వ్రతాలాచరించి సత్యదేవుని దర్శించుకున్నాయి. శ్రీ గోకులంలోని ఆవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. గురువారం 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు 2,572, కల్యాణాలు తొమ్మిది నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.14 లక్షల ఆదాయం సమకూరింది. శుక్రవారం 500 వివాహాలు ఇదిలా ఉండగా రత్నగిరిపై శుక్రవారం ఉదయం 7.24, రాత్రి 9.40, 12.27, తెల్లవారుజామున 3.15 గంటల ముహూర్తాలలో సుమారు 500 వివాహాలు జరుగనున్నాయి. కల్యాణ వైభోగమే అమలాపురం టౌన్ : ‘పెళ్లి కళ వచ్చేసింది బాలా...’ అనే సినిమా పాటకు పేరడీగా ‘పెళ్లి కళ వచ్చేసిందే జిల్లా...’అని పాడుకునేలా జిల్లా అంతటా గురువారం పెళ్లిళ్ల సందడి నెలకొంది. జిల్లాలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని చాలా ఇళ్లు పెళ్లిళ్ల లోగిళ్లుగా మారిపోయాయి. ఈనెలలో 13,14,15 తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉండగా గురువారం మరీ బలమైన ముహూర్తాలు ఉండడంతో ఈ ఒక్క రోజే జిల్లాలో దాదాపు ఆరు వేల పెళ్లిళ్లు జరిగినట్టు ఓ అంచనా. 13వ తేదీన జిల్లాలో సుమారు రెండు వేలకు పైగా పెళ్లిళ్లు జరగ్గా 15వ తేదీన మరో రెండు వేలకు పైగా పెళ్లిళ్లు జరగనున్నాయి. దేవాలయాలు వేదికగా... జిల్లాలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ గురువారం వేలాది పెళ్లిళ్లు జరిగాయి. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో గురువారం ఒక్క రోజే దాదాపు 600 పెళ్లిళ్లు జరిగాయి. బుధవారం అక్కడ దాదాపు 500కు పైగా పెళ్లిళ్లు జరగగా శుక్రవారం మరో 500 పెళ్లిళ్లు జరగనున్నాయి. అలాగే అంతర్వేది, మురమళ్ల, వాడపల్లి, అమలాపురంలలోని ఆలయాల్లో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. గురువారం ఒక్కరోజే జిల్లాలోని పలు ప్రమఖ దేవాలయాలు, సాధారణ దేవాలయాల్లో దాదాపు రెండు వేలకు పైగా వివాహాలు జరిగాయి. ఇక ఇళ్ల వద్ద... కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లలో సుమారు నాలుగు వేల వరకూ వివాహాలు జరిగాయి. ఆయా దేవాలయాలు పెళ్లి జనంతో కిటకిటలాడాయి. బస్సులు, ఆటోలు, రోడ్లు జనంతో కిక్కిరిశాయి. సినిమా సెట్టింగ్‌లను తలపించే వివాహ వేదికలు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, పిఠాపురం, పెద్దాపురం, రామచంద్రపురం, తుని, సామర్లకోట, మండపేట, రావులపాలెం, అనపర్తి, రాజోలు, ముమ్మిడివరం తదితర ప్రాంతాల్లో కొన్ని చోట్ల వివాహ వేదికలు సినిమా సెట్టింగ్‌లను తలపించాయి. అమలాపురం పట్టణంలోనే గురువారం దాదాపు 200కి పైగా వివాహాలు జరిగాయి. ఇక అమలాపురంలోని కల్యాణ వెంకన్న పేరుగాంచిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో దాదాపు 60 వివాహాలు జరిగాయి. -
తిరుమలలో పెళ్లిళ్ల సందడి
తిరుమల: తిరుమలలో పెళ్లి సందడి నెలకొంది. శ్రావణమాసంలో ఈనెల 13, 14, 15 తేదీల్లో బలమైన ముహూర్తాలున్నాయి. ఇందులో 13వ తేదీ శ్రావణ బహుళ తదియ బుధవారం రాత్రి ఉత్తరాభాద్ర నక్షత్రం, 14వ తేదీ చవితి గురువారం ఉదయం ఉత్తరాభాద్ర, రాత్రి రేవతి నక్షత్రం, 15వ తేదీ పంచమి శుక్రవారం ఉదయం రేవతి నక్షత్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇక తిరుమలలో మాత్రం సుమారు వెయ్యికి పైగా పెళ్లిళ్లు చేసేందుకు ముందస్తు రిజర్వేషన్లు జరిగాయి. టీటీడీ పౌరోహిత సంఘంలోనూ ఏడు వందలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశముందని అంచనా వేశారు. పౌరోహిత సంఘంలోని కల్యాణవేదికలో ఒకే ముహూర్తానికి వందల సంఖ్యలో సామూహికంగా పెళ్లిళ్లు నిర్వహించాల్సి ఉండడంతో టీటీడీ కల్యాణకట్ట డెప్యూటీ ఈవో కృష్ణారెడ్డి ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇక తిరుమలలోని అన్ని కల్యాణ మండపాలు ముందస్తుగానే బుక్ అయిపోయాయి. దీనివల్ల కల్యాణ మండపంతో పాటు పౌరోహితుడు, భాజాభజంత్రీలకు డిమాండ్ ఏర్పడింది. పెళ్లి సామగ్రి ధరలు రెట్టింపయ్యాయి. -
పోటెత్తిన భక్తజనం
పింప్రి, న్యూస్‌లైన్ : వేకువ జామునుంచే భక్తుల కోలాహలం మొదలయ్యింది. శ్రీ క్షేత్ర భీమా శంకర ఆలయం జ్యోతిర్లింగాల్లో ఒకటి కావడంతో శ్రావణ మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఒక్క సోమవారం రోజునే సుమారు 2 లక్షల మందికిపైగా భక్తులు తరలి వచ్చారని, ఇంత మంది తరలిరావడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రత్యేక ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం దర్శనానికి వీలుగా ప్రత్యేక బారికేడ్లను, పందిర్లను ఏర్పాటు చేశారు. భక్తులు వర్షంలో ఇబ్బందులు పడకుండా ప్లాస్టిక్ పందిర్లు ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ ప్రశాంత్ ఆవట్, ఆంబేగావ్ తహసిల్దార్ బి.జే.గోరే పేర్కొన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఉదయాన్నే డాగ్ స్క్వాడ్ బృందాలు పూర్తిగా మందిరం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. గర్భ మందిరం, మందిర పరిసరాలను దేవస్థాన భద్రతా సిబ్బంది, పోలీసులు తమ అధీనంలో ఉంచుకొని భక్తులను దర్శనానికి తరలించారు. దేవస్థాన ఉపకార్యనిర్వాహణాధికారి(ఈఓ) అధికారి సురేష్ కోడరే, ప్రాంతీయ అధికారి దత్తాత్రేయ కవితకే, పోలీసు అధికారులు సంజయ్ కామర్పాటిల్, కీర్తీ జమదాడే, వైద్యాధికారి డాక్టర్ సారికా కాంబ్లే తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్తంభించిన ట్రాఫిక్ చాలా వరకు భక్తులు తమ సొంత వాహనాలల్లో తరలిరావడంతో కి.లో మీటరు పొడవున ట్రాఫిక్ స్తంభించి పోయింది. మాతార్వాడి నుంచి అటవీ విభాగం చెక్ పోస్ట్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికుల సహాయంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రత్యేక బస్సులు : శివాజీ నగర్, రాజ్‌గురునగర్, నారాయణ్ గావ్, స్వార్గేట్తోపాటు ఇతర బస్సు డిపోల నుంచి అధిక బస్సు సర్వీసులను ఆలయానికి నడుపుతున్నారు. ఆలయప్రాంగణంలో పలు సామాజిక, స్వచ్ఛంద సంస్థలు భక్తులకు సహాయ సహకారాలు అందజేశాయి. -
వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారి వనంగుడిలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వత్రాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ పి.భానురాజా ఆధ్వర్యంలో 200 మంది మహిళలు వ్రతాలు చేశారు. హిందు ధర్మ ప్రచార మండలి, పైడితల్లి అమ్మవారి దేవస్థానం సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఉదయం 8 గంటల నుంచి ఆలయ అర్చకులు రవిప్రసాద్, సీతారాం, వాసు, దూసి పంతులు, శంబరి శంకరంలు కుంకుమార్చనలు, సువర్ణ పుష్పార్చన కార్యక్రమాలను నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతాలకు సంబంధించిన సామాగ్రిని దాతలు వేణు, జ్ఞానప్రకాష్, శ్రీనివాస్, సత్యనారాయణ , తాయారు జ్యూయలర్స్, సంజీవరావు ఆలయ ఏసీకి అందజేశారు. పూజ అనంతరం కంకణధారణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆల య సిబ్బంది పి.వి.సత్యనారాయణ, అప్పలనాయుడు, రామారావు, రాజు, తదితరులు పాల్గొన్నారు. భక్తులతో ఆలయాలు కిటకిట పార్వతీపురం టౌన్ : పట్టణంలోని పలు దేవాలయాల్లో ఆఖరి శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా దుర్గాదేవి, పార్వతీదేవి, కన్యకాపరమేశ్వరి, సత్యనారాయణ స్వామి తదితర దేవాలయాల్లో వరలక్ష్మీ వ్రతాలు, పూజలు జరిగాయి. ఆయా దేవాలయాల్లో అర్చకులు బి.కృష్ణమూర్తి శర్మ , సుబ్రహ్మణ్య శర్మ తదితరుల అధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమార్చన, సహస్రనామార్చన తదితరవి చేశారు. దీనిలో భాగం గా స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘ నాయకుల ఆధ్వర్యంలో పార్వతీదేవి ఆల యంలో పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం పూజలు సందర్భం గా పట్టణ పరిసరాల నుంచి వేలాది మహిళలు పట్టణానికి వచ్చారు. దీంతో భక్తులతో ఆయా దేవాలయాలన్ని కిక్కిరిశాయి. సంతోషిమాత ఆలయంలో సహస్రదీపాలంకరణ విజయనగరం కల్చరల్: శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో స్థానిక మయూరి జంక్షన్లో ఉన్న సంతోషిమాత ఆలయంలో రాత్రి సహస్రదీపాలంకరణ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చారు. అమ్మవారి దర్శనార్థం మహిళలు బారులుతీరారు. ఆల య అర్చకులు రమేష్ తివారీ పూజాకార్యక్రమాలను జరిపారు. ఆలయాల్లో శ్రావణ మాస ప్రత్యేక పూజలు బెలగాం: పట్టణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక రైల్వేగేటు సమీపంలోని ఉన్న బంగారమ్మగుడి, ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో దుర్గగుడి, అగ్రహారం వీధి ఈశ్వరాలయం, తదితర ఆలయాలలో ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. కుంకుమ పూజలు, చీరలు చూపించి , మొక్కులను తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిర్వహకులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తోటపల్లిలో వ్రతాలు గరుగుబిలి: తోటపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వరలక్ష్మీ పూజలను అర్చకులు పి.గోపాలకృష్ణమాచార్యు లు, వి.వి.అప్పలాచార్యులు, శ్రీనివాసాచార్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు. ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో మహిళలు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ఈ మేరకు గరుగుబిల్లి, కొత్తూరు, గొట్టివలస, శివ్వాం తదితర గ్రామాల్లోని శివాలయాల్లో వ రలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. మహిళలు అమ్మవారికి అర్చనలు, కుంకుమ పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. -
‘ఫ్రెషర్స్ డే’.. తాజా పూలవనం
శ్రావణ మాసం.. ఆగి ఆగి వర్షాలు కురిసే ఆగస్టు నెల... ఆడవాళ్లంతా వ్రతాలు చేసుకునే సమయం... కళాశాలకు కొత్త కళను తీసుకొచ్చే సమయం... కాలేజీతో పెనవేసుకున్న కలలు అలలా ఎగసే సమయం... జీవితానికి 20 యేళ్ల జ్ఞాపకాలను మిగిల్చే సమయం... జూనియర్స్ కోసం కాలేజీలోని సీనియర్లు ఎదురు చూసే సమయం. ర్యాగింగ్ రాయుళ్లు ఫుల్ ఫామ్‌లో ఉండే సమయం.. ఇటువంటి నేపథ్యం, వాతావరణంలో వస్తాయి... ‘ఫ్రెషర్స్ డే’లు. ఫ్రెషర్‌గా ఉండినా, అప్పటికే రెండుమూడేళ్ల నుంచి కాలేజీలో వాడిపోయినా ఈ ‘డే’లు మాత్రం ప్రతి జీవితంలోనూ నవవసంతాలే! మరి ‘ఫ్రెషర్స్ డే సీజన్’ సందర్భంగా.. సరదాగా.. ఎక్కడెక్కడో చిట్టిగువ్వలూ, ఏడనించినో గోరువంక లూ..కాలేజీ క్యాంపస్‌లోనే నాట్యం చేసేనే ఆడ పిల్లలా కొంటెనవ్వులూ కుర్రమనుసుల కౌగిలింతలూ కాలేజీ కాంపౌండంటే కొడెకైనాలే.. ఎంతో ఉద్వేగంతో తొలిసారి కాలేజీ ఆవరణలోకి ఆడుగుపెట్టే వారి గురించిన ఒక భావన ఇది! ఆల్రెడీ కాలేజీలో సీనియర్లుగా చెలామణి అవుతున్న వారికి మరిన్ని అనుభవాలు పంచడానికన్నట్టుగా వస్తారు జూనియర్లు. ఇంకేముంది..! రంగురంగుల డ్రస్సుల్లో ప్రవహిస్తున్న కొత్తనీరును చూసి సంబరపడతాయి సీనియర్ మనసులు. సీనియర్‌నన్న ఆధిపత్యం... అంతకుముందు సీనియర్లు నేర్పిన ఆటపత్యం! పాట రానోడితో పాట పాడించడం, ఆట రాని వాడితో ఆడించడం... సాధారణంగా జరిగే సరదాపనులు. ఈ ర్యాగింగ్లోనే కాస్తంత రొమాన్స్ కలగలిపి ర్యాంప్ షో ల వరకూ వెళ్లే తింగరి వేషాలు! నచ్చిన సీనియర్‌కు ప్రపోజ్ చెయ్యి... మీ క్లాస్‌మేట్‌కు గులాబీపువ్వు ఇవ్వు... వంటి ఆజ్ఞలు. కొన్ని సార్లు పరిస్థితి వికటించి సీనియర్ల టార్గెట్‌గా మారి బతుకు బలయ్యే స్థితి కూడా తప్పకపోవచ్చు. సరదా శ్రుతిని మించకపోతే ఏదైనా బాగానే ఉంటుంది. స్వీట్ మెమొరీగానే మిగిలిపోతుంది. కొత్త బంధాలు, బాంధవ్యాలు... ఇక బయట జరిగే గోల ఒకటైతే... కొత్తగా కాలేజీలో అడుగుపెట్టే కుర్రాడి మనసులో మరో గోల ఉంటుంది. ఫ్రెండ్షిప్, లవ్, అక్క చెల్లెళ్ల లిస్టును తయారు చేసుకునేది కూడా ఫ్రెషర్స్ డే లోనే! ‘భయ్యా..’ అన్న పిలుపులోని ఇబ్బంది అర్థమయ్యేది ఇప్పుడే. బ్రదర్‌గా బాధ్యతలు తీసుకోవడానికి వెనుకాడే పరిస్థితి! ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్టుగా.. ఫ్రెషర్స్ డే ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది కాలే జ్ లైఫ్ అని చెప్పవచ్చు. స్నేహితులతో కూడిన సరికొత్త జర్నీకి మొదలు ఫ్రెషర్స్ డే తోనే. భయంతో కూడిన ఆలోచనలకు బ్రేక్ వేసేది, మాస్టార్ల, సీనియర్ల మార్గదర్శకత్వాన్ని అందించేది, బెరుకు చూపులను స్థిమిత పరిచేది ‘ఫ్రెషర్స డే’నే. జ్ఞాపకాలుగా మారే నవ్వులు, ఆటోగ్రాఫ్లుగా మారే అందమైన బంధాలు, అంతకన్నా హత్తుకునే అల్లుకునే స్నేహబంధాలు, సెలయేరులా సాగిపోయే రోజులు... అన్నీ ‘ఫ్రెషర్స్ డే’ తోనే మొదలవుతాయి. కాబట్టి లెట్స్ సెలబ్రట్ ది ‘ఫ్రెషర్స్ డే’ - జీవన్ -
కొండపై వైభవంగా లక్ష పుష్పార్చన
యాదగిరికొండ, న్యూస్‌లైన్: శ్రావణమాసం పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి లక్షపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలను ధరింపజేశారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి మల్లే, జాజి మల్లే, మందారం, గులాబీ, బంతి, చామంతి, ఎర్రచామంతి, తెల్లచామంతి, విరజాజి తదితర లక్ష పుష్పాలతో మూడు గంటల పాటు సహస్రనామ పఠనం చేస్తూ అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ కృష్ణవేణి, ఆలయ అధికారులు దోర్భాల భాస్కరశర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, యాదగిరి స్వామి, నరిసింహాచార్యులు, రంగాచార్యులు, జూశెట్టి కృష్ణ, రామారావు నాయక్, లక్ష్మణ్ పాల్గొన్నారు. అమ్మవారికి విశేష పూజలు గుట్ట దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలు ధరింపజేశారు. వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి గజవాహన సేవలో ఆలయ తిరువీధులలో ఊరేగించారు. అనంతరం ఉత్సవ మండపంలో ఊంజల్ సేవ కోసం అధిష్టింపజేశారు. సేవకు ముందు మహిళలు అందమైన ముగ్గులు వేసి మంగళహారతులతో స్వాగతం పలికారు. అంతకుముందు అమ్మవారికి 108బంగారు పుష్పాలతో సహస్రనామార్చన నిర్వహించారు. -
రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి
వేములవాడ, న్యూస్‌లైన్ : రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి నెలకొంది. రాజన్నను దర్శించుకునేందుకు సోమవారం భక్తులు బారులు తీరారు. 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఆర్జిత, ఇతర సేవల ద్వారా రూ.16 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాల కౌంటర్వద్ద తోపులాట చోటుచేసుకుంది. సినీ దర్శకుడు సురేందర్‌రెడ్డి, సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య కుటుంబ సమేతంగా వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే సీఐడీ డీఎస్పీ భాస్కర్, ఆర్టీసీ డీఎస్పీ రాజేంద్రప్రసాద్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అర్చకులు, ట్రస్టుబోర్డు సభ్యుడు అరుణ్‌తేజాచారీ ప్రసాదాలు అందజేశారు. ఏర్పాట్లను ఆలయ ఈవో కృష్ణాజిరావు, ఏఈవోలు హరికిషన్, ఉమారాణి, దేవేందర్, గౌరీనాథ్ పర్యవేక్షించారు. వైభవంగా మహాలింగార్చన రాజన్న ఆలయంలో సోమవారం మహాలింగార్చన వైభవంగా నిర్వహించారు. మొత్తం 14 మంది అర్చక స్వాములు ఈ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. లింగస్వరూపుడి ఆకారంలో పేర్చిన జ్యోతులు వెలిగించి పూజలు చేశారు.