శ్రావణ మాసం.. ఆగి ఆగి వర్షాలు కురిసే ఆగస్టు నెల... ఆడవాళ్లంతా వ్రతాలు చేసుకునే సమయం... కళాశాలకు కొత్త కళను తీసుకొచ్చే సమయం... కాలేజీతో పెనవేసుకున్న కలలు అలలా ఎగసే సమయం... జీవితానికి 20 యేళ్ల జ్ఞాపకాలను మిగిల్చే సమయం... జూనియర్స్ కోసం కాలేజీలోని సీనియర్‌లు ఎదురు చూసే సమయం.
శ్రావణ మాసం.. ఆగి ఆగి వర్షాలు కురిసే ఆగస్టు నెల... ఆడవాళ్లంతా వ్రతాలు చేసుకునే సమయం... కళాశాలకు కొత్త కళను తీసుకొచ్చే సమయం... కాలేజీతో పెనవేసుకున్న కలలు అలలా ఎగసే సమయం... జీవితానికి 20 యేళ్ల జ్ఞాపకాలను మిగిల్చే సమయం... జూనియర్స్ కోసం కాలేజీలోని సీనియర్‌లు ఎదురు చూసే సమయం. ర్యాగింగ్ రాయుళ్లు ఫుల్ ఫామ్‌లో ఉండే సమయం.. ఇటువంటి నేపథ్యం, వాతావరణంలో వస్తాయి... ‘ఫ్రెషర్స్ డే’లు. ఫ్రెషర్‌గా ఉండినా, అప్పటికే రెండుమూడేళ్ల నుంచి కాలేజీలో వాడిపోయినా ఈ ‘డే’లు మాత్రం ప్రతి జీవితంలోనూ నవవసంతాలే! మరి ‘ఫ్రెషర్స్ డే సీజన్’ సందర్భంగా.. సరదాగా..
ఎక్కడెక్కడో చిట్టిగువ్వలూ, ఏడనించినో గోరువంక లూ..కాలేజీ క్యాంపస్‌లోనే నాట్యం చేసేనే
ఆడ పిల్లలా కొంటెనవ్వులూ కుర్రమనుసుల కౌగిలింతలూ కాలేజీ కాంపౌండంటే కొడెకైనాలే..
ఎంతో ఉద్వేగంతో తొలిసారి కాలేజీ ఆవరణలోకి ఆడుగుపెట్టే వారి గురించిన ఒక భావన ఇది! ఆల్రెడీ కాలేజీలో సీనియర్లుగా చెలామణి అవుతున్న వారికి మరిన్ని అనుభవాలు పంచడానికన్నట్టుగా వస్తారు జూనియర్లు. ఇంకేముంది..! రంగురంగుల డ్రస్సుల్లో ప్రవహిస్తున్న కొత్తనీరును చూసి సంబరపడతాయి సీనియర్ మనసులు.
సీనియర్‌నన్న ఆధిపత్యం... అంతకుముందు సీనియర్లు నేర్పిన ఆటపత్యం! పాట రానోడితో పాట పాడించడం, ఆట రాని వాడితో ఆడించడం... సాధారణంగా జరిగే సరదాపనులు. ఈ ర్యాగింగ్‌లోనే కాస్తంత రొమాన్స్ కలగలిపి ర్యాంప్ షో ల వరకూ వెళ్లే తింగరి వేషాలు! నచ్చిన సీనియర్‌కు ప్రపోజ్ చెయ్యి... మీ క్లాస్‌మేట్‌కు గులాబీపువ్వు ఇవ్వు... వంటి ఆజ్ఞలు. కొన్ని సార్లు పరిస్థితి వికటించి సీనియర్ల టార్గెట్‌గా మారి బతుకు బలయ్యే స్థితి కూడా తప్పకపోవచ్చు. సరదా శ్రుతిని మించకపోతే ఏదైనా బాగానే ఉంటుంది. స్వీట్ మెమొరీగానే మిగిలిపోతుంది.
కొత్త బంధాలు, బాంధవ్యాలు...
ఇక బయట జరిగే గోల ఒకటైతే... కొత్తగా కాలేజీలో అడుగుపెట్టే కుర్రాడి మనసులో మరో గోల ఉంటుంది. ఫ్రెండ్‌షిప్, లవ్, అక్క చెల్లెళ్ల లిస్టును తయారు చేసుకునేది కూడా ఫ్రెషర్స్ డే లోనే! ‘భయ్యా..’ అన్న పిలుపులోని ఇబ్బంది అర్థమయ్యేది ఇప్పుడే. బ్రదర్‌గా బాధ్యతలు తీసుకోవడానికి వెనుకాడే పరిస్థితి!
ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్టుగా.. ఫ్రెషర్స్ డే ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది కాలే జ్ లైఫ్ అని చెప్పవచ్చు. స్నేహితులతో కూడిన సరికొత్త జర్నీకి మొదలు ఫ్రెషర్స్ డే తోనే. భయంతో కూడిన ఆలోచనలకు బ్రేక్ వేసేది, మాస్టార్ల, సీనియర్ల మార్గదర్శకత్వాన్ని అందించేది, బెరుకు చూపులను స్థిమిత పరిచేది ‘ఫ్రెషర్‌స డే’నే. జ్ఞాపకాలుగా మారే నవ్వులు, ఆటోగ్రాఫ్‌లుగా మారే అందమైన బంధాలు, అంతకన్నా హత్తుకునే అల్లుకునే స్నేహబంధాలు, సెలయేరులా సాగిపోయే రోజులు... అన్నీ ‘ఫ్రెషర్స్ డే’ తోనే మొదలవుతాయి. కాబట్టి లెట్స్ సెలబ్రట్ ది ‘ఫ్రెషర్స్ డే’
- జీవన్