వధువు మెడలో తాళి కడుతున్న వరుడు
దొడ్డబళ్లాపురం: వర్షాల కోసం గాడిదలకు, కప్పలకు వివాహం చేయడం చూశాం. అయితే ఇద్దరు మగ పిల్లలకు వివాహం చేసి వర్షాల కోసం ప్రార్థించిన సంఘటన బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లి తాలూకా కొమ్మసంద్ర గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. వర్షాలు లేక కొమ్మసంద్ర గ్రామంలో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. రబీ ప్రారంభమైనా చినుకు జాడ లేకపోవడంతో గ్రామస్తులు 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసారు. చివరి రోజు 12ఏళ్లలోపు వయసున్న ఇద్దరు మగ పిల్లలను వధూవరులుగా అలంకరించి శుక్రవారం రాత్రి వివాహం చేశారు. అనంతరం హుయ్యోహుయ్యో మళెరాయ అంటూ పాటలు పాడుతూ వధూవరులను గ్రామంలో ఊరేగించారు. ఇలా మగపిల్లలకు వివాహం జరిపిస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్తుల నమ్మకమట.