కామారెడ్డి, న్యూస్‌లైన్ : శ్రావణ మాసం రావడంతో పెళ్లి సందడి నెల కొంది. సుమారు మూడు నెలల తర్వాత మంచి ము హూర్తాలు రావడంతో జిల్లాలోనూ జోరుగా వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి. అయితే పెరిగిన ధర లు వధూవరుల కుటుంబ సభ్యులకు చుక్కలు చూపుతున్నాయి. మాంసం ధరలతో కూరగాయలు పోటీ పడుతున్నాయి. దుస్తుల ధరలు బంగారాన్ని అనుసరిస్తున్నా యి. పెళ్లి మండపాల కిరాయి సైతం భారీగా పెరిగింది. ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్నంటడంతో ఖర్చులు తలకు మించిన భారమవుతున్నాయి.
రెట్టింపైన భోజనం ఖర్చు..
నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగడంతో భోజనం ఖర్చు రెట్టింపైంది. ఏ కూరగాయ ధర విన్నా బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితి ఉంది. అన్నింట్లోనూ విని యోగించే ఉల్లి ధర వింటేనే కన్నీరొస్తోంది. కిలో ఉల్లి ధర * 50 దాటింది. కిలో పచ్చిమిర్చి రేటు * వందకు చేరింది. కొత్తిమీర కూడా ఇదే ధర పలుకుతోంది. కిలో అల్లం * 200 లకు విక్రయిస్తున్నారు. * 60 నుంచి * 80 వెచ్చిస్తే గాని కిలో కూరగాయలు రావడం లేదు. కిలో మటన్ * 400లకు, చికెన్ * 150 నుంచి * 180 వరకు అమ్ముతున్నారు. సన్నరకం పాత బియ్యం క్వింటాలుకు * 5 వేలు పలుకుతున్నాయి. గతంలో సాధారణ భోజనం తయారీకి (ఒక ప్లేట్‌కు) * 60 నుంచి *80 వరకు ఖర్చయ్యేది. అయితే పెరిగిన ధరలతో ఇప్పుడు ప్లేట్ భోజనానికి * 80 నుంచి * వంద వరకు ఖర్చవుతోందని క్యాటరింగ్ చేసేవారు చెబుతున్నారు. మూడు రకాల కూరలు, బిర్యానీ, వైట్‌రైస్, పాపడ్, పెరుగు, ఒక రకం స్వీటుతో ప్లేట్ భోజనానికి తక్కువలో తక్కువ * వంద తీసుకుంటున్నారు.
పెరిగిన బంగారం, బట్టల ధరలు
మార్కెట్‌లో బంగారం, బట్టల ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల కాస్త తగ్గినట్లనిపించిన బంగారం మళ్లీ జోరందుకుని పది గ్రాములకు * 31,500లకు చేరింది. ఆభరణాల తయారీ ఖర్చులూ పెరిగాయి. బట్టల ధరలైతే చెప్పే పరిస్థితి లేదు. పట్టువస్త్రాల ధరలు భారీగా పెరిగాయి. పెళ్లికూతురుకు కావాల్సిన పట్టుచీరలు, ఇతర ఫ్యాన్సీ చీరల ధరలు పెరగడంతో పెళ్లి బట్టలకు ఎంత లేదన్నా * 50 వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని మధ్యతరగతి ప్రజలు పేర్కొంటున్నారు. వరుడి దుస్తుల ధరలూ పెరిగాయి.
పండ్ల రేటూ ఆకాశంలోనే..
డజన్ అరటి పండ్ల ధర * 35 లకు చేరింది. ఆపిల్ కిలో * 150, దానిమ్మ కిలో * వంద పలుకుతున్నాయి. ఒక్కో బత్తాయిని * 20 లకు విక్రయిస్తున్నారు.
ఫంక్షన్‌హాళ్ల అద్దెలూ ఎక్కువే...
గతంలో ఇళ్ల వద్ద పందిళ్లు వేసి పెళ్లిల్లు చేసేవారు. ఇప్పుడు పందిళ్లు వేయడానికి కావాల్సిన కలప కూడా దొరకడం లేదు. దీంతో ఫంక్షన్ హాళ్లలో శుభకార్యాలు జరిపించే సంస్కృతి పెరిగిపోతోంది. ఒకే ముహూర్తంలో ఎక్కువగా పెళ్లిళ్లు ఉంటే ఫంక్షన్ హాళ్ల ధరలను భారీగా పెంచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కామారెడ్డి పట్టణంలోనే ఫంక్షన్‌హాళ్ల అద్దెలు * 30 వేల నుంచి * లక్ష వరకు ఉన్నాయి. డెకొరేషన్, బ్యాండుమేళం, పూలపందిరి, పూలు, ఇతర ఖర్చులు అదనం. దీంతో పెళ్లి అనగానే ఖర్చులను తలచుకొని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. * 80 వెచ్చిస్తే గాని కిలో కూరగాయలు రావడం లేదు. కిలో మటన్ * 400లకు, చికెన్ * 150 నుంచి * 180 వరకు అమ్ముతున్నారు. సన్నరకం పాత బియ్యం క్వింటాలుకు * 5 వేలు పలుకుతున్నాయి. గతంలో సాధారణ భోజనం తయారీకి (ఒక ప్లేట్‌కు) * 60 నుంచి *80 వరకు ఖర్చయ్యేది. అయితే పెరిగిన ధరలతో ఇప్పుడు ప్లేట్ భోజనానికి * 80 నుంచి * వంద వరకు ఖర్చవుతోందని క్యాటరింగ్ చేసేవారు చెబుతున్నారు. మూడు రకాల కూరలు, బిర్యానీ, వైట్‌రైస్, పాపడ్, పెరుగు, ఒక రకం స్వీటుతో ప్లేట్ భోజనానికి తక్కువలో తక్కువ * వంద తీసుకుంటున్నారు.
పెరిగిన బంగారం, బట్టల ధరలు
మార్కెట్‌లో బంగారం, బట్టల ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల కాస్త తగ్గినట్లనిపించిన బంగారం మళ్లీ జోరందుకుని పది గ్రాములకు * 31,500లకు చేరింది. ఆభరణాల తయారీ ఖర్చులూ పెరిగాయి. బట్టల ధరలైతే చెప్పే పరిస్థితి లేదు. పట్టువస్త్రాల ధరలు భారీగా పెరిగాయి. పెళ్లికూతురుకు కావాల్సిన పట్టుచీరలు, ఇతర ఫ్యాన్సీ చీరల ధరలు పెరగడంతో పెళ్లి బట్టలకు ఎంత లేదన్నా * 50 వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని మధ్యతరగతి ప్రజలు పేర్కొంటున్నారు. వరుడి దుస్తుల ధరలూ పెరిగాయి.
పండ్ల రేటూ ఆకాశంలోనే..
డజన్ అరటి పండ్ల ధర * 35 లకు చేరింది. ఆపిల్ కిలో * 150, దానిమ్మ కిలో * వంద పలుకుతున్నాయి. ఒక్కో బత్తాయిని * 20 లకు విక్రయిస్తున్నారు.
ఫంక్షన్‌హాళ్ల అద్దెలూ ఎక్కువే...
గతంలో ఇళ్ల వద్ద పందిళ్లు వేసి పెళ్లిల్లు చేసేవారు. ఇప్పుడు పందిళ్లు వేయడానికి కావాల్సిన కలప కూడా దొరకడం లేదు. దీంతో ఫంక్షన్ హాళ్లలో శుభకార్యాలు జరిపించే సంస్కృతి పెరిగిపోతోంది. ఒకే ముహూర్తంలో ఎక్కువగా పెళ్లిళ్లు ఉంటే ఫంక్షన్ హాళ్ల ధరలను భారీగా పెంచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కామారెడ్డి పట్టణంలోనే ఫంక్షన్‌హాళ్ల అద్దెలు * 30 వేల నుంచి * లక్ష వరకు ఉన్నాయి. డెకొరేషన్, బ్యాండుమేళం, పూలపందిరి, పూలు, ఇతర ఖర్చులు అదనం. దీంతో పెళ్లి అనగానే ఖర్చులను తలచుకొని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
లగ్గమెట్ల జేసుడు!
Published Mon, Aug 19 2013 5:10 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
Advertisement
Advertisement