నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్: శ్రావణమాసం ఆధ్యాత్మిక మాసంగా పేరుగాంచింది. ఏడాదిలో మహిళలకు సంబంధించిన అత్యధిక పండుగలు వచ్చేది శ్రావణ మాసంలోనే. ఈ మాసం ఆరంభం నుంచే ప్రతి ఇంటా భక్తిభావం ఉప్పొంగుతుంది. వ్రతాలు, పూజలు నిర్వహిస్తుంటారు. మందిరాలన్నీ కిటకిటలాడుతాయి. ఈ మాసంలో మహిళలు నియమాలను పాటిస్తారు. శాకహార వంటలకే పరిమితమవుతారు. భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తుంటారు. ఈ కాలంలో పూజలు, వ్రతాలను ఆచరిస్తే మాంగళ్యం, సౌభాగ్యం ప్రాప్తి కలుగుతాయని మహిళల నమ్మకం. ప్రతి శుక్రవారం, సోమవారాల్లో వరలక్ష్మి వ్రతాలు, పసుపుబొట్టు, ఇతర పూజలు నిర్వహిస్తుంటారు.
శ్రావణ సోమవారం రోజున సుమంగళిగా, సౌభాగ్యంగా ఉండేం దుకు, మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతం చేస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అష్ట ఐశ్వర్యాల కోసం వరలక్ష్మి వ్రతం చేస్తారు. అదీగాక ఆరోగ్య రీత్యా మేలు చేసే శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి చెబుతారు. అన్ని కాలాల కన్నా వర్షాకాలంలో పలు రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రధానంగా మాంసాహారం తింటే వ్యాధులు వస్తాయి. దీంతో శ్రావణమాసంలో మాంసాహారం స్వీకరించవద్దనేందుకు నియమంగా మారిందని పెద్దలు చెబుతున్నారు. దాదాపుగా ఈనెలంతా ఇళ్లల్లో పూజలు చేయడం వల్ల పురుషులు సైతం మద్యం, మాంసాహారాన్ని మానేస్తారు. వారు కూడా పూజలో భాగస్వాములవుతారు. ఈ మాసంలోనే నాగుల పంచమి, రాఖీపౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య తదితర పండుగలు రావ డం విశేషం. మొత్తానికి శ్రావణమాసం మహిళలకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, భక్తిభావాన్ని పెంపొం దిస్తుందనడంలో సందేహం లేదు. జిల్లాలో మొదటి శుక్రవారాన్ని వైభవంగా జరుపుకొన్నారు.
ఆధ్యాత్మిక మాసం.. శ్రావణం
Published Sun, Aug 11 2013 3:46 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement