ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు నగరాల్లో శ్రావణమాస మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. అమెరికాలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ తమ పండుగలను వేడుకలను వైభవంగా నిర్వహించుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కూడా తమ ప్రాంత వైభోగాన్ని, పండుగలను అందరితో కలిసి నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఏఏఏ డెలావేర్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం, కుంకుమపూజను ఘనంగా నిర్వహించారు.
డెలావేర్‌లోని మిడిల్ టౌన్‌లోని జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పూజ కార్యక్రమాలతో పాటు పాటలు, డ్యాన్స్‌లు అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్యాలు, డ్యాన్స్‌లు, సంగీత విభావరులు, ఆట పాటలతో కార్యక్రమం ఉత్సహంగా సాగింది. ప్రముఖ సంగీత దర్శకులు కోటి సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ప్రముఖ సింగర్స్ హిట్టయిన పాటలను పాడి అందరిలో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసులు ఈ స్టాల్స్ వద్ద సందడి చేశారు.
మహిళలకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ పిండివంటలతో తయారు చేసిన ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికీ పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పసందైన విందు భోజనం అందించారు. వరలక్ష్మీ వ్రతాన్ని అమెరికాలో ఉంటున్న భారతీయుల చేత ఘనంగా జరిపేందుకు వీలుగా శ్రావణ మహోత్సవాలు పేరిట కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల ఏఏఏ డెలావేర్ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు.
(చదవండి: అమెరికా పర్యటనలో కేటీఆర్...క్రిటికల్ రివర్ కంపెనీతో భేటీ)
Comments
Please login to add a commentAdd a comment