vrathalu
-
సత్యదేవుని సన్నిధిలో వ్రతాలు ప్రియం
నుంచి టిక్కెట్ల ధర పెంపు - 30 శాతం పెరగనున్న వ్రత ఆదాయం - ఈఓ నాగేశ్వరరావు వెల్లడి అన్నవరం : సత్యదేవుని సన్నిధిలో వ్రత నిర్వహణ భక్తులకు ప్రియం కానుంది. రూ.150, రూ.300, రూ.700 వ్రతాల టిక్కెట్ల ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 15 శాతం నుంచి 33 శాతం వరకూ పెరగనున్నాయి. నిర్వహణ వ్యయం పెరిగినందున వ్రతాల టిక్కెట్ల ధరలు పెంచాలని దేవస్థానం పాలకవర్గం గతంలోనే నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ వైవీ అనూరాధ మంగళవారం ఆమోదించారని దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. విజయవాడలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను మంగళవారం కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించారు. పెంపు ఇలా.. రూ.150 వ్రత టిక్కెట్ రూ.200కు, రూ.300 టిక్కెట్‌ను రూ.400కు, రూ.700 టిక్కెట్‌ను రూ.800కి పెంచుతున్నారు. అయితే రూ.1,500, ఏసీ మండపంలో నిర్వహించే రూ.2 వేల వ్రత టిక్కెట్ల ధరలను పెంచడం లేదని ఈఓ తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వ్రతాల ద్వారా సుమారు రూ.23.70 కోట్ల ఆదాయం వచ్చింది. వ్రతాల టిక్కెట్ల పెంపు ద్వారా 30 శాతం అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వ్రత విభాగం ద్వారా రూ.27 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే టిక్కెట్ల ధరలను పెంచడంవలన ఈ ఆదాయం రూ.30 కోట్లకు చేరే అవకాశం ఉంది. దీంతోపాటు వ్రత పురోహితులకు దేవస్థానం చెల్లించే పారితోషికం కూడా పెరగనుంది. ప్రసాదం బరువు, ధర పెంపు సత్యదేవుని ప్రసాదం ధరను కూడా పెంచనున్నారు. ప్రస్తుతం వంద గ్రాముల ప్రసాదం రూ.10కి విక్రయిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్యాకెట్ బరువును 125 గ్రాములకు పెంచి రూ.15కి విక్రయించనున్నట్టు ఈఓ తెలిపారు. ప్రసాదం తయారీలో వాడే ముడి సరుకులు గోధుమ, పంచదార, నెయ్యి, యాలకులతోపాటు వంటగ్యాస్ ధర కూడా పెరగడంతో తయారీ వ్యయం భారీగా పెరిగిందన్నారు. వాస్తవానికి బరువు 25 గ్రాములు పెంచినందున దాని ప్రకారం ధర రూ.2.50 పెరుగుతుందని, కానీ ప్రసాదం తయారీలో వస్తున్న నష్టాన్ని అధిగమించేందుకు, చిల్లర సమస్య తలెత్తకుండా ఉండేందుకు మరో రూ.2.50 కలిపి రూ.15కి విక్రయించాలని నిర్ణయించినట్టు ఈఓ తెలిపారు. 2016-17లో ప్రసాదం విక్రయాల ద్వారా దేవస్థానానికి రూ.19.61 కోట్ల ఆదాయం రాగా, 2017-18లో రూ.21.50 కోట్లు వస్తుందని అంచనా వేశారు. తాజా పెంపుదల కారణంగా ఈ ఆదాయం రూ.24 కోట్లు ఉండగలదని అంచనా వేస్తున్నారు. -
గిరికి భక్త జనఝరి
భక్త జనసంద్రంగా రత్నగిరి కిక్కిరిసిపోయిన సత్యదేవుని సన్నిధి l ఐదేళ్ల తరువాత అత్యధికంగా వ్రతాలు అన్నవరం : రత్నగిరి జనసంద్రాన్ని తలపించింది. కార్తిక సోమవారం, పౌర్ణమి పర్వదినాలు ఒకే రోజు రావడంతో స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఈ ఏడాదిలోనే అత్య«ధికంగా సుమారు 1.5 లక్షల మంది భక్తులు సత్యదేవుని ఆలయానికి తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకూ భక్తులు తండోపతండాలుగా స్వామివారి సన్నిధికి తరలివస్తూనే ఉన్నారు. స్వామివారి వ్రతాలు 15,450 జరిగాయి. 2011లో కార్తిక మాసంలో ఏకాదశి, సోమవారం కలిసి రావడంతో ఆ రోజు 20 వేలకు పైగా వ్రతాలు జరిగాయి. ఆ తరువాత అత్యధికంగా ఇప్పడు వ్రతాలు నిర్వహించారు. ఈ ఒక్క రోజే సత్యదేవునికి రూ.1.5 కోట్ల ఆదాయం సమకూరింది. అర్ధరాత్రి నుంచే వ్రతాలు ప్రారంభం సత్యదేవుని దర్శనానికి ఆదివారం సాయంత్రం నుంచే రత్నగిరికి భక్తుల రాక ప్రారంభమైంది. ఊహించని విధంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తుండడంతో అధికారులు ఆదివారం రాత్రి 10 గంటల నుంచే వ్రతాల టికెట్లు విక్రయించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి ఒంటి గంట నుంచి వ్రతాలు ప్రారంభించారు. సోమవారం తెల్లవారుజాము 2 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. అప్పటి నుంచి సాయంత్రం వరకూ రద్దీ కొనసాగుతూనే ఉంది. అంతరాలయ దర్శనం రద్దు రద్దీ తట్టుకోలేక స్వామివారి అంతరాలయ దర్శనం రద్దు చేశారు. ఈ టికెట్లు తీసుకున్న వారికి కూడా ఇతర భక్తులతో పాటు అంతరాలయం వెలుపల నుంచే దర్శనం కలుగజేశారు. వ్రత మండపాలు సరిపోకపోవడంతో స్వామివారి నిత్య కల్యాణ మండపంలో కూడా ఉదయం 10 గంటల వరకూ వ్రతాలు నిర్వహించారు. అయినప్పటికీ వ్రతాలాచరించే భక్తులు సుమారు రెండు గంటలు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. స్వామివారి దర్శనానికి గంటకు పైగా క్యూలో నిరీక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయలేకపోయారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావిచెట్టు వద్ద తొక్కిసలాట సత్యదేవుని దర్శించిన భక్తులు గోకులంలోని సప్త గోవులకు ప్రదక్షణ చేసి, రావిచెట్టుకు పూజలు చేశారు. మహిళలంతా ఒకేసారి జ్యోతులు వెలిగించేందుకు అక్కడకు చేరుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. సకాలంలో సిబ్బంది స్పందించి భక్తులను కంట్రోల్ చేశారు. దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకూ దేవస్థానంలోనే ఉండి అన్ని విభాగాలను పర్యవేక్షించారు. భక్తుల ఇక్కట్లు భక్తులకు వసతి గదులు లభ్యం కాకపోవడం, తగినన్ని బాత్రూమ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందు లు పడ్డారు. మహిళలు స్నానం చేశాక దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. -
వరలక్ష్మీ నమోస్తుతే
-
శ్రావణ సందడి
-
ఆధ్యాత్మిక మాసం.. శ్రావణం
నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్: శ్రావణమాసం ఆధ్యాత్మిక మాసంగా పేరుగాంచింది. ఏడాదిలో మహిళలకు సంబంధించిన అత్యధిక పండుగలు వచ్చేది శ్రావణ మాసంలోనే. ఈ మాసం ఆరంభం నుంచే ప్రతి ఇంటా భక్తిభావం ఉప్పొంగుతుంది. వ్రతాలు, పూజలు నిర్వహిస్తుంటారు. మందిరాలన్నీ కిటకిటలాడుతాయి. ఈ మాసంలో మహిళలు నియమాలను పాటిస్తారు. శాకహార వంటలకే పరిమితమవుతారు. భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తుంటారు. ఈ కాలంలో పూజలు, వ్రతాలను ఆచరిస్తే మాంగళ్యం, సౌభాగ్యం ప్రాప్తి కలుగుతాయని మహిళల నమ్మకం. ప్రతి శుక్రవారం, సోమవారాల్లో వరలక్ష్మి వ్రతాలు, పసుపుబొట్టు, ఇతర పూజలు నిర్వహిస్తుంటారు. శ్రావణ సోమవారం రోజున సుమంగళిగా, సౌభాగ్యంగా ఉండేం దుకు, మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతం చేస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అష్ట ఐశ్వర్యాల కోసం వరలక్ష్మి వ్రతం చేస్తారు. అదీగాక ఆరోగ్య రీత్యా మేలు చేసే శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి చెబుతారు. అన్ని కాలాల కన్నా వర్షాకాలంలో పలు రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రధానంగా మాంసాహారం తింటే వ్యాధులు వస్తాయి. దీంతో శ్రావణమాసంలో మాంసాహారం స్వీకరించవద్దనేందుకు నియమంగా మారిందని పెద్దలు చెబుతున్నారు. దాదాపుగా ఈనెలంతా ఇళ్లల్లో పూజలు చేయడం వల్ల పురుషులు సైతం మద్యం, మాంసాహారాన్ని మానేస్తారు. వారు కూడా పూజలో భాగస్వాములవుతారు. ఈ మాసంలోనే నాగుల పంచమి, రాఖీపౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య తదితర పండుగలు రావ డం విశేషం. మొత్తానికి శ్రావణమాసం మహిళలకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, భక్తిభావాన్ని పెంపొం దిస్తుందనడంలో సందేహం లేదు. జిల్లాలో మొదటి శుక్రవారాన్ని వైభవంగా జరుపుకొన్నారు.